
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్.. లేటు వయసులో లేని పోని చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. మొన్నటికి మొన్న ఓ ప్రోగ్రామ్ లో పాట పాడుతూ మహిళా అభిమానికి లిప్ కిస్ ఇచ్చి కాంట్రవర్సీకి కారణమయ్యాడు. ఇప్పుడు మొదటి భార్య వల్ల మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంతకీ ఏమైందంటే?
(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఛావా' డైరెక్టర్.. ఎందుకంటే?)
తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ఎన్నో హిట్ పాటలు పాడిన ఉదిత్ నారాయణ్.. 69 ఏళ్లొచ్చినా ఇంకా తనదైన శైలిలో అలరిస్తూనే ఉన్నారు. సినిమా సాంగ్స్ కూడా పాడుతున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఈయన మొదటి భార్య రాంజన ఇప్పుడు ఈయనపై కోర్టులో కేసు వేసింది.
ఉదిత్ నారయణ్.. తనకు సంబంధించిన భూమిని తనకు చెప్పకుండా అమ్మేశాడని, అందులో తనకు దక్కాల్సిన రూ.11 లక్షల్ని తీసేసుకున్నాడని, ఆ డబ్బు తిరిగి తనకు ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇందులో భాగంగానే ఉదిత్.. ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యాడని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)
ఉదిత్ వ్యక్తిగత విషయానికొస్తే.. 1985లో దీప అనే సింగర్ ని పెళ్లి చేసుకుని ముంబైలో సెటిలైపోయాడు. వీళ్లకు ఆదిత్య నారాయణ్ అనే కొడుకు ఉన్నాడు. దీపని పెళ్లి చేసుకోవడానికి ముందే ఉదిత్.. తనని పెళ్లి చేసుకున్నాడని రాంజన అనే మహిళ బయటకొచ్చింది. తొలుత బుకాయించాడు గానీఆమె, కోర్టుని ఆశ్రయించడంతో ఒప్పుకొన్నాడు. అదే ఏడాది న్యాయబద్ధంగా ఉదిత్-రాంజన విడాకులు కూడా తీసుకున్నారు.
విడాకులు తీసుకున్నప్పుడు భరణం కింద.. ఇల్లు, కొంత బంగారం, నెలకు రూ.15 వేల మొత్తాన్ని రాంజనకు ఇచ్చేలా బిహార్ మహిళా కమిషన్ ముందు ఉదిత్ ఒప్పుకొన్నాడు. అవి చెల్లిస్తున్నాడు కూడా. తాజాగా రాంజన మరోసారి కోర్టు మెట్లక్కెడంతో ఉదిత్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)
Comments
Please login to add a commentAdd a comment