ఉదిత్ నారాయణ.. బాలీవుడ్‌ను తన పాటలతో మ్యాజిక్ చేశారు. అలా ఆయన హిందీ చిత్రసీమకే పరిమితం కాలేదు. భారతీయ పలు భాషల్లో చిత్రాల్లో తన గాత్రాన్ని వినిపించి ఎనలేని అభిమానులను సంపాదించుకున్నారు. వాస్తవంగా నేపాల్‌లో పుట్టిన ఉదిత్ నారాయణ తన పాటలతో ఎల్లలను చెరిపేశారు. రేడియో గాయకుడిగా మొదలైన ఆయన ప్రస్థానం భారతదేశ చిత్రపరిశమలన్నింటిలోనూ ప్రముఖ గాయకుడిగా అభిమానం సంపాదించుకునే దిశగా సాగింది. తన గాన ప్రతిభతో ఉదిత్ నారాయణ్ ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యాడు. 34 భాషల్లో 25 వేల పాటలకు పైగా పాడారు. మూడు సార్లు ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారాలు సాధించారు.
ఉదిత్ నారాయణ పాటల ప్రయాణంలో సింగర్ అల్కా యాగ్నిక్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. వీరిద్దరూ కలిసి పాట పాడితే అది హిట్ కావాల్సింది. దీంతో నిర్మాతలు కూడా వీరిద్దరితో పాటలు పాడించేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు. వీరిద్దరూ కలిసి ఇండస్ట్రీకి ఎన్నో సూపర్‌హిట్ పాటలను అందించారు. బాలీవుడ్‌లో ఎక్కువగా నటులు-నటీమణుల మధ్య రూమర్స్ వస్తుంటాయి. కానీ అక్కడ ఈ సింగర్స్ జోడీ మధ్య ఉన్న రిలేషన్‌పై చాలా పుకార్లు వచ్చాయి.
బాలీవుడ్‌లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఈ టాపిక్ గురించి ఉదిత్ నారాయణ సతీమణి దీప చాలా బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఒక కార్యక్రమంలో ఉదిత్ నారాయణ తన సతీమణితో పాటుగా పాల్గొన్నారు. అక్కడకు సింగర్ అల్కా యాగ్నిక్ కూడా వచ్చింది. అక్కడ సందడిగా ఉన్న ఆమెకు ఉదిత్ నారాయణ, అల్కా మధ్య ఉన్న సంబంధం గురించి ప్రశ్న ఎదురౌతుంది. అందుకు సమాధానంగా.. 'వారి సంబంధాన్ని నేను అంగీకరిస్తున్నాను' అంటూ దీప మరింతగా నవ్వేస్తుంది. 'వారిద్దరి స్నేహం పట్ల నాకు నమ్మకం ఉంది. మాకు పెళ్లై 30 ఏళ్లు దాటింది. అయినా వారి స్నేహంలో ఎలాంటి మార్పు లేదు. ఉదిత్, అల్కా మధ్య సంబంధం నిజంగా చాలా ప్రత్యేకమైనది.
వారి దశాబ్దాల స్నేహం పట్ల నాకు గౌరవం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి మచ్చ లేకుండా వారి ప్రయాణం కొనసాగుతుంది. వారి గురించి ఇతరులు ఎన్ని మాటలు అన్నా కూడా అవన్నీ ఇంటి బయటి వరకే ఆగిపోతాయి. మేము అందరం ఒకే కుటుంబంలా ఉంటాం. అందుకే ఎన్ని రూమర్స్ వచ్చినా మా రెండు కుటుంబాలు కలిసే ఉంటున్నాయి. వారిద్దరూ ఎల్లప్పుడూ గౌరపరంగా ఉంటారు. భర్తలకు కూడా స్నేహితురాలు ఉంటుందనేది మనం గుర్తుపెట్టుకుంటే ఎలాంటి గొడవలకు తావు ఉండదు. అని దీప చెప్పారు. తన భర్త పట్ల ఇంతటి నమ్మకాన్ని చూపిన దీపను గౌరవిస్తూ సోషల్‌మీడియాలో పాజిటివ్‌గా కామెంట్లు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment