ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ చేసిన పని ఇటీవల తీవ్ర వివాదానికి దారితీసింది. ఓ మహిళా అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన ఏకంగా ముద్దులు ఇవ్వడంతో పలువురు మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్స్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఈ వయసులో ఇలాంటి పనులేంటని సింగర్‌ను నిలదీశారు. అభిమానంతో ఫోటోలు దిగితే అందరిముందే అలా ప్రవర్తించడం ఏంటని ఉదిత్ నారాయణ్‌ను ప్రశ్నించారు.
అయితే ఈ సంఘటన జరగకుముందే మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో మహిళకు ముద్దు పెడుతూ కనిపిచంారు. ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇది కొత్త వీడియోనా.. గతంలో జరిగిందా అనే విషయంపై క్లారిటీ లేదు. కాగా.. గతంలో ఉదిత్ నారాయణ్.. సింగర్స్ అల్కా యాగ్నిక్, శ్రేయో ఘోషల్ అనుమతి లేకుండా వారికి ముద్దు పెట్టాడు. ఏదేమైనా అనుమతి లేకుండా మహిళ అభిమానులతో అలా ప్రవర్తించడంపై ఆయనపై విమర్శలొస్తున్నాయి.
(ఇది చదవండి: 'మహిళా అభిమానులకు ముద్దులు'.. వివాదంపై స్పందించిన సింగర్)
కాగా.. ఉదిత్ నారాయణ్ బాలీవుడ్ సింగర్. ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో పాటలు ఆలపించాడు. నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది.
Another video of Udit Narayan pic.twitter.com/dYGWgPfUHl
— Savage SiyaRam (@SavageSiyaram) February 5, 2025
Comments
Please login to add a commentAdd a comment