నా ఇంటి ఖరీదు రూ.10.5 కోట్లు: సింగర్‌ | Sakshi
Sakshi News home page

మీడియా నన్ను తక్కువ అంచనా వేస్తోంది

Published Wed, Dec 9 2020 12:18 PM

Aditya Narayan Reveals Actual Cost of His New Marital Home - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ ఉదిత్‌ నారాయణ్‌ కుమారుడు ఆదిత్య నారాయణ్‌ వివాహం కొద్ది రోజుల క్రితమే అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. చిరకాల స్నేహితురాలు, నటి శ్వేత అగర్వాల్‌ను మనువాడి వివాహ బంధంలో అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత వీరద్దరు కొత్త ఇంటికి మారారు. ప్రస్తుతం దాని గురించి సోషల్‌ మీడియాలో డిబెట్‌ నడుస్తోంది. ఈ ఇంటి ఖరీదు సుమారు 4 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మీడియాలో కూడా కొన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆదిత్య నారాయణ్‌ వీటిపై స్పందించారు. మీడియా తనను తక్కువ అంచనా వేస్తోందన్నారు. తన కొత్త ఇల్లు పదిన్నర కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుందన్నారు. (తనతో నా పెళ్లి ఫేక్‌.. టీఆర్‌పీ కోసమే: సింగర్)

ఈ సందర్భంగా ఆదిత్య నారాయణ్‌ మాట్లాడుతూ.. ‘నా ఇంటి ఖరీదు నాలుగు కోట్ల రూపాయలా.. అంత తక్కువా.. కాదు. మీరు తక్కువ అంచాన వేశారు. దాని విలువ 10.5 కోట్ల రూపాయలు. నేను బాల్యం నుంచే సంపాదించడం మొదలు పెట్టాను. టీవీ నాకు ఎంతో చెల్లించింది’ అని తెలిపారు. ఆదిత్య సింగర్‌గా మాత్రమే కాక రియాలిటీ షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తను ‘ఇండియన్‌ ఐడల్’‌ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేస్తున్నారు. ఇక వివాహం తర్వాత ఆదిత్య కొత్త ఇంటికి మారారు. తండ్రి ఉంటున్న ఇంటికి మూడు ఇళ్ల అవతల ఈ నివాసాన్ని తీసుకున్నారు. ఇక దీనిలో మొత్తం ఐదు బెడ్రూమ్‌లున్నాయి. ఇక డిసెంబర్‌ మధ్యలో హనీమూన్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు ఆదిత్య నారాయణ్‌. ప్రస్తుతం ఇంటిని సర్దుకోవడంలో బిజీగా ఉండటంతో హనీమూన్‌ని డిసెంబర్‌కు వాయిదా వేశామన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement