Aditya Narayan (Bollywood singer)
-
అభిమానితో సింగర్ దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్
సాధారణంగా సినీ సెలెబ్రెటీలను అభిమానించేవారు ఎక్కువగా ఉంటారు. నటీనటులతో పాటు సింగర్స్‌ని కూడా అమితంగా ఇష్టపడేవారు ఉంటారు. కొంతమంది గాయకుల లైవ్ ఫర్ఫార్మెన్స్ని చూసేందుకు జనం ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాంటి వారిలో ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ కొడుకు ఆదిత్య నారాయణ కూడా ఒకరు. తండ్రికి ఉన్న గుర్తింపు చేత ఆదిత్యకు పేరొచ్చింది. అతను మ్యూజిక్కాన్సెర్ట్ ఏర్పాటు చేస్తే జనాలు ఎక్కువగానే వెళ్తుంటారు. అయితే తనకోసం వచ్చిన అభిమానులతో ఆదిత్య మాత్రం తరచు గొడవపడుతుంటాడు. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో ఆయన నిర్వహించిన గాన కచేరీ వచ్చిన ఓ అభిమానితో ఆదిత్య దురుసుగా ప్రవర్తించాడు. వీడియో తీస్తున్న ఫ్యాన్ ఫోన్‌ని లాక్కొనే దూరంగా పడేశాడు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లోని రుంగ్తా కాలేజీలో ఆదిత్య కచేరీ నిర్వహించారు. ఫ్యాన్స్‌తో పాటు సంగీత ప్రియులు పెద్ద ఎత్తున ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు. ఈవెంట్లో భాగంగా ఆదిత్య.. షారుఖ్ నటించిన ‘డాన్’ మూవీలోని ‘ఆజ్ కీ రాజ్’ సాంగ్‌ని ఆలపించడం ప్రారంభించారు. పాట పాడుతూ అభిమానుల మధ్యలోకి వచ్చారు. ఈ సందర్భంగా ఓ అభిమాని తన మొబైల్లో ఆదిత్య పాటను రికార్డు చేస్తూ కనిపించాడు.. వెంటనే ఆదిత్య వచ్చి చేతిలో ఉన్న మైక్‌తో అతన్ని కొట్టి..ఫోన్ లాక్కొని దూరంగా విసిరివేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆదిత్య ప్రవర్తించిన తీరును నెటిజన్స్ తప్పుపడుతున్నారు. ‘అతను చేసిన తప్పేంటి?..ఓ అభిమానితో ఇలానే ప్రవర్తిస్తారా?’, ఇప్పటికీ తండ్రి పేరుతో బతుకుతున్న ఆదిత్యకు అంత పొగరు ఎందుకు? ’ అని కామెంట్ చేస్తున్నారు. What is this #adityanarayan 🥲 pic.twitter.com/Gqy7fRo3F6 — Bollywood World (@bwoodworld) February 11, 2024 -
తన కుమార్తె పేరు చెప్పేసిన సింగర్.. దానికి అర్థం ఏంటంటే ?
Singer Aditya Narayan Reveals His Daughter Name And Meaning: ప్రముఖ గాయకుడు ఆదిత్య నారాయణ్, నటి శ్వేతా అగర్వాల్ ఝా తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. వీరిద్దరూ డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నారు. ఈ బ్యూటిఫుల్ జంటకు 2022, ఫిబ్రవరి 24న ఫస్ట్ బేబీ గర్ల్ జన్మించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆదిత్య నారాయణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తమ పాప పేరును రివీల్ చేశాడు ఆదిత్య. తన ఇన్‌స్టా గ్రామ్ హ్యాండిల్లో 'ఆస్క్ మి ఎనీథింగ్ (నన్ను ఏదైనా అడగండి)' అనే సెషన్‌ను నిర్వహించాడు సింగర్ ఆదిత్య నారాయణ్. ఈ సెషన్లో నెటిజన్స్, అభిమానులు వివిధ రకాల ప్రశ్నలు అడగ్గా వాటికి సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలోనే తమ బేబీ గర్ల్ పేరేంటీ అని అడిగిన ఒక అభిమానికి జవాబిచ్చాడు. చదవండి: మగబిడ్డే పుడతాడని అందరూ అనుకున్నారు.. కానీ ఆదిత్య నారాయణ్ నిర్వహించిన ఈ సెషన్లో తన కుమార్తె పేరు 'ట్విష నారాయణ్ ఝా' అని వెల్లడించాడు. అలాగే మరొక అభిమాని ఆ పేరుకు అర్థమేంటీ అని అడిగారు. దీనికి 'వైభవం, మెరుపు, కాంతి, సూర్య కిరణాలు. ఈ పేరు చాలా బాగుంది. ఎందుకంటే మా నాన్న పేరులో కూడా ఉదయించే సూర్యుడి అని అర్థం వస్తుంది. ఇక నా పేరుకి అర్థం సూర్యుడు అని. పాప పేరుకు సూర్య కిరణాలు అని అర్థం వచ్చేలా పెట్టాం. అలాగే అందులో శ్వేతా పేరు, ఆమె పూజింజే దేవుడు శివుడు కూడా ఉన్నాడు.' అని ఆదిత్య నారాయణ్ తమ కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థాన్ని వివరించాడు. -
మగబిడ్డే పుడతాడని అందరూ అనుకున్నారు.. కానీ
Singer Aditya Narayan Shweta Agarwal Blessed With Baby Girl: ప్రముఖ గాయకుడు ఆదిత్య నారాయణ్, నటి శ్వేతా అగర్వాల్ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ బ్యూటిఫుల్ జంటకు ఫిబ్రవరి 24న ఫస్ట్ బేబీ గర్ల్ జన్మించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆదిత్య నారాయణ్ ప్రకటించారు. ఆయన ఇన్‌స్టా ఖాతాలో తమ పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ '24.02.2022న ఆ సర్వశక్తి సంపన్నుడు మాకు అందమైన పాపను ప్రసాదించినందుకు నేను, శ్వేతా కృతజ్ఞతలు తెలుపుతున్నాము' అని రాశాడు. ఈ పోస్ట్ చూసిన ప్రముఖ సెలబ్రిటీలు ఈ జంటపై శుభాకాంక్షల వర్షం కురిపించారు. 'ఆదిత్య నారాయణ్ మీకు కుమార్తె జన్మించినందుకు శుభాకాంక్షలు. మీ తదుపరి జీవితపు దశను సంపూర్ణంగా ఆనందించండి.' అని బర్ఖా సేన్‌గుప్తా కామెంట్ చేసింది. 'ఆదిత్య, శ్వేత మీరు తల్లిదండ్రులు అయినందుకు శుభాకాంక్షలు. లవ్ టు ఆల్ ఆఫ్ యూ' అని సింగర్ నీతి మోహన్ రాయగా, 'ఇద్దరికీ శుభాకాంక్షలు' అని 'గంగుబాయి కతియావాడి' ఫేం శాంతను మహేశ్వరి తెలిపింది. ఇదిలా ఉంటే ఆదిత్య తనకు అందరూ మగబిడ్డే పుడుతుందని అందరూ అనుకున్నారని, కానీ తాను మాత్రం ఆడపిల్లే పుట్టాలని ఆశపడ్డానని తెలిపాడు. తండ్రులు తమ కూతుళ్లకు అత్యంత సన్నిహితులనే విషయాన్ని తాను నమ్ముతున్నాని పేర్కొన్నాడు. ఆదిత్య, శ్వేతా డిసెంబర్ 1, 2020న ముంబైలోని ఇస్కాన్ ఆలయంలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. View this post on Instagram A post shared by Aditya Narayan Jha (@adityanarayanofficial) -
బెదిరింపులు రావడంతో చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన యాంకర్
ఇండియన్ ఐడల్ 12వ సీజన్ మరో వివాదంలో చిక్కుకుంది. గత వారం జరిగిన ఎపిసోడ్లో హోస్ట్ ఆదిత్య నారయణ్ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎపిసోడ్లో మ్యూజిక్ డైరెక్టర్ శ్రవన్ రాథోడ్‌కు నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు, ప్రముఖ గాయకులు అమిత్ కుమార్ సను, అనురాధ పౌడ్వాల్, రూప్ కుమార్ రాథోడ్ ఈ షోకు అతిథులుగా హజరయ్యారు. ఈ నేపథ్యంలో హోస్ట్ ఆదిత్య, కుమార్ సనుతో నిజంగానే మీరు కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ నచ్చి వారిని ప్రశంసించారా, లేక షో మేకర్స్ చెప్తే చేశారా అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక ఇదే ఎపిసోడ్లో కంటెస్టెంట్ సవాయ్ భట్, అంజలి గైక్వాడ్‌తో కలిసి ఓ సూపర్ హిట్ పాటను పాడి వినిపించారు. వీళ్ల పర్ఫార్మెన్స్ పూర్తయ్యాక సవాయ్ భట్‌కు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని గెస్ట్ ఒకరు ప్రశ్నించగా లేదు లేదు అని సవాయ్ భట్ సమాధానం చెప్పాడు. అయితే మరో కంటెస్టెంట్ మాత్రం సవావ్ భట్‌కు జపనీస్ గర్ల్‌ఫ్రెండ్ ఉందని, ఆమెతో తరుచూ వీడియో కాల్స్‌లో మాట్లాడుతుంటాడని చెప్పడంతో షోలో నవ్వులు పూశాయి. ఇదే విషయంపై యాంకర్ ఆదిత్య నారాయణ్.. ఎవరా జపనీస్ గర్ల్‌ఫ్రెండ్ అని ప్రశ్నించగా సవాయ్ భట్ అదేం లేదు అని దాటవేసే ప్రయత్నం చేయడంతో..నువ్వు ఏం చెబితే అది గుడ్డిగా నమ్మడానికి మేము అలీభగ్ నుంచి ఏం రాలేదు అంటూ ఫన్నీగా ఆటపట్టించాడు. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ ఆదిత్య మెడకు చెట్టుకున్నాయి. మహారాష్ట్రలోని అలీభగ్ ప్రజలను అవమానించేలా ఆదిత్య వ్యాఖ్యలు ఉన్నాయని మహారాష్ట్ర నవనిర్మాన్ సేన (ఎంఎన్ఎస్) మండిపడింది. వెంటనే అలీభగ్ ప్రాంత ప్రజలకు క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. దీంతో ఆదిత్య నారాయణ తన తప్పును తెలుసుకొని క్షమాపణలు చెప్పాడు. 'రెండు చేతులు జోడించి వినయపూర్వకంగా మీకు క్షమాపణలు చెబుతున్నాను. ఎవరినీ బాధపెట్టాలన్నది నా ఉద్ధేశం కానే కాదు. అలీభగ్ ప్రజలపై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. నేను అన్న మాటలు మిమ్మల్ని బాధించి ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను' అని పేర్కొన్నారు. చదవండి : ఇండియన్ ఐడల్ 12: హోస్ట్ ఆదిత్య నారాయణ తీరుపై నెటిజన్లు ఫైర్ ‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్ -
ఇండియన్ ఐడల్ 12: హోస్ట్ ఆదిత్య నారాయణ తీరుపై నెటిజన్లు ఫైర్
ఇండియల్ ఐడల్ 12 షోలో గత వారం సింగర్, టీవీ హోస్ట్ ఆదిత్య నారాయణ తీరుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆదిత్య ఇండియన్ ఐడల్ 12కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎపిసోడ్లో అతడు సింగర్ కుమార్ సనుతో చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆదిత్యను ట్రోల్ చేస్తున్నారు. గత వారం జరిగిన ఎపిసోడ్లో ఇటీవల మృతి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రవన్ రాథోడ్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు, ప్రముఖ గాయకులు కుమార్ సను, అనురాధ పౌడ్వాల్, రూప్ కుమార్ రాథోడ్ ఈ షోకు అతిథులుగా హజరయ్యారు. ఈ నేపథ్యంలో హోస్ట్ ఆదిత్య, కుమార్ సనుతో నిజంగానే మీరు కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ నచ్చి వారిని ప్రశంసించారా, లేక షో మేకర్స్ చెప్తే చేశారా అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. వెంటనే ఆదిత్య సింగర్ సను ‘వాళ్లు నిజంగానే మంచి గాయకులు. కంటెస్టెంట్స్ అంత అద్భుతమైన పాటగాళ్లు. ఒక రీయాలిటి షోలో ఇంతమంది ప్రతిభవంతులైన సింగర్స్‌ను ఇంతవరకు నేనేప్పుడు చూడలేదు. ఇప్పటికిప్పుడు వీరంత ప్లేబ్యాక్ సింగర్స్ కావోచ్చు. ఒక్కొక్కరు ఒక్క రత్నం’ అంటూ ఆయన కంటెస్టెంట్స్‌ను కొనియాడారు. అనంతరం ఆదిత్య వ్యాఖ్యలను తప్పు బడుతూ ‘ఎంతో మంది గెస్టులను ఈ షోకు ఆహ్వానించిన ఆదిత్య తీరు బాధాకరం, ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు గాయకులు అర్జీత్ సింగ్, ఆర్మాన్ మాలిక్‌లు ఈ స్టేజ్ ద్వారానే ప్రపంచానికి పరిచయమయ్యారనే విషయం అతడు గుర్తుపెట్టుకోవాలి’ అంటూ సోని వారు ఈ వీడియోను షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఆదిత్యను ‘షో నుంచి తీసేయండి’, ‘అతడు లెజండరీ సింగర్స్‌ను అవమానించాడు’, ఆదిత్య అమిత్ కుమార్ వ్యాఖలతో ఇలా వ్యవహరించడం సరికాదు’ అంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత ఎపిసోడ్లో కిషోర్ కుమార్, ఆయన తనయుడు అమిత్ కుమార్ అతిథులగా వచ్చారు.ఈ షో చివరలో సింగర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. తనకు కంటెస్టంట్స్ పర్ఫామెన్స్ నచ్చిన నచ్చకపోయిన వారిని ప్రశంసించమని షో నిర్వహకులు కోరారని, వారి పాటలు నచ్చకపోతే ఎలా పాజిటివ్ కామెంట్స్ ఇస్తామని ఆయన మండిపడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
ఇండియన్ ఐడల్ : యాంకర్ మారడానికి కారణం అదేనా?
ముంబై : ఇండియన్ ఐడల్ రియాలిటీ షో దేశ వ్యాప్తుంగా ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ సీజన్ 12 నిర్విరామంగా కొనసాగుతుంది. నిన్నటి షోలో ముఖ్య అతిధిగా బాలీవుడ్ అందాల తార రేఖ వచ్చారు. తన ఎనర్జీతో షో ఆద్యంతం చిరునవ్వులు చిందిస్తూ.. సందడి చేశారు. అయితే ఈ షోకు మొదటి నుంచి ఆదిత్య నారాయణ్ యాంకర్‌గా ఉన్నారు. అలాంటిది సడెన్‌గా ఆదిత్య నారాయణ్ స్థానంలో జయ్ భానుశాలి కనిపించారు. దీంతో అసలు ఆదిత్య నారాయణ్‌ను ఏమైంది? సడెన్‌గా హోస్ట్‌ను ఎందుకు మార్చారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆదిత్యను ఎవరూ రీప్లేస్ చేయడం లేదని, కేవలం కొన్ని రోజులకు మాత్రమే ఆయన స్థానంలో జయ్ భానుశాలి ఉంటారని తెలుస్తుంది. ఈ మార్పులన్నింటికీ కారణం కరోనా వైరస్ అని తేలింది. ప్రస్తుతం మహారాష్ట్రలో కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా యాంకర్ ఆదిత్య నారాయన్‌కు సైతం కరోనా సోకింది. దీంతో తాత్కాలికంగా ఈ షో నుంచి తప్పుకున్నారు. ఆదిత్య నారాయణ్‌తో పాటు ఆయన భార్య శ్వేతా అగర్వాల్‌కు కరోనా పాజిటివ్ అని తేలిందని స్వయంగా ఆదిత్య నారయణ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో ప్రేమ పెళ్లి చేసుకున్న వీరు..ప్రస్తుతం కరోనా కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ కొత్త దంపతుతు త్వరగా కోలుకోవాలని కోరుతూ పలువురు నెటిజన్లు సహా ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ జడ్జిలో ఒకరైన నేహా కక్కర్ సైతం కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Aditya Narayan (@adityanarayanofficial) చదవండి: ‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్ భార్యను ఏడిపించిన సింగర్ -
నా ఇంటి ఖరీదు రూ.10.5 కోట్లు: సింగర్
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్ వివాహం కొద్ది రోజుల క్రితమే అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. చిరకాల స్నేహితురాలు, నటి శ్వేత అగర్వాల్‌ను మనువాడి వివాహ బంధంలో అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత వీరద్దరు కొత్త ఇంటికి మారారు. ప్రస్తుతం దాని గురించి సోషల్ మీడియాలో డిబెట్ నడుస్తోంది. ఈ ఇంటి ఖరీదు సుమారు 4 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మీడియాలో కూడా కొన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆదిత్య నారాయణ్ వీటిపై స్పందించారు. మీడియా తనను తక్కువ అంచనా వేస్తోందన్నారు. తన కొత్త ఇల్లు పదిన్నర కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుందన్నారు. (తనతో నా పెళ్లి ఫేక్.. టీఆర్పీ కోసమే: సింగర్) ఈ సందర్భంగా ఆదిత్య నారాయణ్ మాట్లాడుతూ.. ‘నా ఇంటి ఖరీదు నాలుగు కోట్ల రూపాయలా.. అంత తక్కువా.. కాదు. మీరు తక్కువ అంచాన వేశారు. దాని విలువ 10.5 కోట్ల రూపాయలు. నేను బాల్యం నుంచే సంపాదించడం మొదలు పెట్టాను. టీవీ నాకు ఎంతో చెల్లించింది’ అని తెలిపారు. ఆదిత్య సింగర్‌గా మాత్రమే కాక రియాలిటీ షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తను ‘ఇండియన్ ఐడల్’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేస్తున్నారు. ఇక వివాహం తర్వాత ఆదిత్య కొత్త ఇంటికి మారారు. తండ్రి ఉంటున్న ఇంటికి మూడు ఇళ్ల అవతల ఈ నివాసాన్ని తీసుకున్నారు. ఇక దీనిలో మొత్తం ఐదు బెడ్రూమ్లున్నాయి. ఇక డిసెంబర్ మధ్యలో హనీమూన్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు ఆదిత్య నారాయణ్. ప్రస్తుతం ఇంటిని సర్దుకోవడంలో బిజీగా ఉండటంతో హనీమూన్‌ని డిసెంబర్‌కు వాయిదా వేశామన్నారు. -
వాళ్లు పదేళ్లు సహజీవనం చేశారు: ప్రముఖ సింగర్
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు, సింగర్ ఆదిత్య నారాయణ్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. నటి శ్వేతా అగర్వాల్‌ను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. డిసెంబర్ 1న ముంబైలోని ఇస్కాన్ టెంపుల్ వీరి ఏడడుగుల బంధానికి వేదికగా మారింది. ఒక్కగానొక్క కొడుకు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని ఉదిత్ ఎన్నో కలలు గన్నా కోవిడ్ ఆయన ఆశల మీద నీళ్లు చల్లింది. ఫలితంగా పెద్ద పెద్ద ఆడంబరాలకు పోకుండా తక్కువ మంది మధ్యే సంబరాలు జరుపుకోవాల్సి వచ్చింది. తాజాగా ఆయన తన కొడుకు ప్రేమ, పెళ్లి గురించి స్పందించారు. (చదవండి: దిల్జిత్.. కరణ్ పెంపుడు జంతువు: కంగన) "నాకు ఏకైక సంతానం ఆదిత్య. వాడి పెళ్లిని ఎంతో ఘనంగా చేయాలనుకున్నా. కానీ కరోనా వల్ల గ్రాండ్‌గా చేసుకునే వేడుకలకు దూరమవాల్సి వచ్చింది. నిజానికైతే ఈ కరోనా ధాటి తగ్గిన తర్వాతే వాడి పెళ్లి చేద్దామనుకున్నా. కానీ నా కొడుకుతో పాటు శ్వేత, ఆమె కుటుంబం కూడా ఇప్పుడే చేసేద్దామన్నారు. ఆదిత్య, శ్వేత పదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించాల్సిన సమయం వచ్చింది అని అనుకుంటున్నా" అని చెప్పుకొచ్చారు. తన కోడలు శ్వేత గురించి చెప్తూ.. 'ఆమె నా కొడుకుకు స్నేహితురాలిగానే తెలుసు. ఓ రోజు ఆదిత్య నా దగ్గరకు వచ్చి శ్వేతను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఓ క్షణం షాకైన నేను వాడి మాటను కాదనలేకపోయాను. అయితే తర్వాత ఏం జరిగినా నన్ను నిందించొద్దు అని చెప్పాను' అని చెప్పుకొచ్చారు. (చదవండి: శ్వేత అగర్వాల్‌ను పెళ్లాడిన ఆదిత్య) -
నటిని వివాహమాడిన సింగర్!
ముంబై: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు, నటుడు ఆదిత్య నారాయణ్ ఓ ఇంటివాడయ్యాడు. చిరకాల స్నేహితురాలు, నటి శ్వేత అగర్వాల్‌ను మనువాడి వివాహ బంధంలో అడుగుపెట్టాడు. ముంబైలోని ఇస్కాన్ టెంపుల్లో మంగళవారం వీరి పెళ్లి జరిగింది. కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో ఇరు కుటుంబాల సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: ‘నేను స్త్రీలోలుడిని అని భయపడింది’) ఈ క్రమంలో వధూవరులు ఆదిత్య, శ్వేతతో పాటు బంధువులు సరదాగా గడిపిన వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లికొడుకు తల్లి దీపా నారాయణ్ బారాత్‌లో కొడుకుతో కలిసి సందడి చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కాగా సింగర్, టీవీ షోల హోస్ట్‌గా అందరికీ సుపరిచితమైన ఆదిత్య నారాయణ్, శ్వేత అగర్వాల్‌తో కలిసి ‘షాపిత్’ అనే సినిమాలో నటించాడు. షూటింగ్లో భాగంగా ఈ జంట మధ్య స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో పదేళ్ల పాటు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి మంగళవారం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. (చదవండి: అవును.. పెళ్లిచేసుకోబోతున్నాం) View this post on Instagram A post shared by Saroj_Mahara (@saroj_maharaa) -
‘నేను స్త్రీలోలుడిని అని భయపడింది’
ముంబై: ‘‘మా అమ్మ చొరవ తీసుకున్నందు వల్లే శ్వేత నాతో మాట్లాడింది. నాతో కలిసి భోజనం చేసింది. మొదట్లో నన్ను అపార్థం చేసుకున్నా.. ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకుంది. నాతో జీవితం పంచుకోవడానికి ఓకే చెప్పినందుకు తనకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటా’’ అంటూ కాబోయే భార్యపై ప్రేమను చాటుకున్నాడు ఆదిత్య నారాయణ్. ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడిగానే గాకుండా నటుడు, సింగర్, హోస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు ఆదిత్య. మొదటి సినిమా షాపిత్ షూటింగ్ సమయంలో సహనటి శ్వేత అగర్వాల్‌తో ప్రేమలో పడిన అతడు, త్వరలోనే ఆమెను పెళ్లాడబోతున్నాడు. ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరులో తమ వివాహం జరుగబోతున్నట్లు ఆదిత్య ఇటీవల స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇరు వర్గాల పెద్దల అంగీకారంతోనే తాము వైవాహిక బంధంలో అడుగుపెట్టబోతున్నట్లు పేర్కొన్నాడు.(చదవండి: ఈ ఏడాది చివర్లో శ్వేతతో నా పెళ్లి: నటుడు) ఈ నేపథ్యంలో ప్రేమ ప్రయాణంలో జరిగిన సంఘటనల గురించి ఆదిత్య మాట్లాడుతూ.. ‘‘ నిజానికి దాన్ని ఫస్ట్‌డేట్ అనాలో వద్దో కూడా తెలియదు. షాపిత్ సెట్లో శ్వేతతో మాట కలిపాను. ఆ తర్వాత నాతో పాటు లంచ్‌కు రమ్మని పిలిచాను. కానీ అప్పటికే నాకున్న బ్యాడ్ ఇమేజ్, స్త్రీలోలుడు అనే దుష్ప్రచారం కారణంగా శ్వేత నాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. దూరందూరంగానే ఉంది. అప్పుడు మా అమ్మ వచ్చి, తన దగ్గరకు వెళ్లి మాట్లాడింది. ‘‘ఇద్దరూ కలిసి సినిమాలో నటిస్తున్నారు.. కలిసి భోజనం చేయడం తప్పేమీ కాదు’’అని చెప్పింది. (త్వరలో పెళ్లి.. రూ.18 వేలే ఉన్నాయి) దాంతో శ్వేత మనసు కాస్త మెత్తబడింది. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఓ రెస్టారెంటుకు వెళ్లి భోజనం చేశాం. అలా మా మధ్య మొదలై, ప్రేమకు దారితీసింది. నేనే ముందు ప్రపోజ్ చేశాను. కానీ తను చాలా భయపడింది. ఆ తర్వాత మెల్లగా నా కుటుంబ సభ్యులతో పరిచయమైన తర్వాత నా గురించి పూర్తిగా తెలుసుకుంది. నేనొక ఫ్యామిలీ మ్యాన్ అనే విషయం అర్థమైన తర్వాత పెళ్లికి అంగీకరించింది. నేను అమ్మాయిల వెంట తిరిగే పోకిరి అని ఎవరో చెప్పారట. తన భయంలో కూడా అర్థం ఉందిగా. ఇప్పుడు మా మధ్య ఎలాంటి రహస్యాలు, భయాలు లేవు’’అని చెప్పుకొచ్చాడు. -
త్వరలో పెళ్లి.. రూ.18 వేలే ఉన్నాయి
కరోనా వైరస్ మానవాళి జీవితాలను పూర్తిగా తలకిందులు చేసింది. మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్డౌన్ ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. పనులు లేవు.. చేతిలో డబ్బులు లేవు. ఇక లాక్డౌన్ ఇలానే కొనసాగితే ప్రజలు తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు ప్రముఖ బాలీవుడ్ సింగర్, టెలివిజన్ హోస్ట్ ఆదిత్య నారాయణ్. మరి కొద్ది రోజుల్లో ఆయన తన చిరకాల ప్రేయసి శ్వేతా అగర్వాల్‌ని వివాహం చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఇలానే కొనసాగిస్తే, ప్రజలు ఆకలితో మరణించడం ప్రారంభిస్తారు. నా సేవింగ్స్ మొత్తం ఖర్చు అయ్యాయి. దాచుకున్న డబ్బులు మొత్తం అయిపోయాయి. మనుగడ కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో నేను పెట్టిన పెట్టుబడి డబ్బులను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి గురించి ఎవ్వరం ఊహించలేదు కదా’ అన్నారు. (చదవండి: సామాన్యుడి దీపావళి మీ చేతుల్లోనే.!) ‘ఓ ఏడాది పాటు పని చేయకుండా ఉంటామని అనుకోము కదా. ఎవరూ దీనిని ఊహించలేదు.. ప్లాన్ చేసుకోలేదు. ఇలాంటి పరిస్థితిలో అందరి ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించింది.. ఏదో కొందరి బిలియనీర్స్‌ది తప్ప. ప్రస్తుతం నా ఖాతాలో 18 వేల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. త్వరలో వివాహం చేసుకోబోతున్నాను. ఇక నేను అక్టోబర్ నుంచి పని చేయడం ప్రారంభించకపోతే, నా దగ్గర డబ్బు ఉండదు. అప్పుడు బతకడానికి నా బైక్ లేదా ఏదైనా అమ్మవలసి వస్తుంది. నిజంగా ఇది చాలా కఠినమైన పరిస్థితి. చివరకు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఓ వర్గం ప్రజలు ఈ నిర్ణయం తప్పు అని చెప్పి సానుభూతి చూపిస్తారు. సాయం మాత్రం చేయరు’ అన్నారు ఆదిత్య నారాయణ్. -
అవును.. పెళ్లిచేసుకోబోతున్నాం: ఆదిత్య
ముంబై: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు, నటుడు ఆదిత్య నారాయణ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు, నటి శ్వేతా అగర్వాల్‌ను మనువాడనున్నాడు. ఈ విషయాన్ని ఆదిత్య నారాయణ్ ధ్రువీకరించాడు. పదేళ్ల తమ ప్రేమ బంధాన్ని పెళ్లిపీటలు ఎక్కించేందుకు సర్వం సిద్ధమైందని పేర్కొన్నాడు. ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరులో తమ వివాహం జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. కాగా బాలీవుడ్ నటుడిగా, టీవీ షోల హోస్ట్‌గా అందరికీ సుపరిచితమైన ఆదిత్య నారాయణ్, శ్వేతతో కలిసి ‘షాపిత్’ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది.(చదవండి: రణ్‌బీర్, అలియా వివాహంపై వివరణ) ఈ విషయం గురించి ఆదిత్య ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘షాపిత్ సెట్లో తొలిసారి శ్వేతను కలిశాను. తనతో స్నేహం పెంచుకున్నాను. అయితే తనపట్ల నాకున్న ఆరాధనా భావం ప్రేమే అని తెలుసుకునేందుకు ఎంతో సమయం పట్టలేదు. కానీ శ్వేత మాత్రం.. మనం కేవలం స్నేహితులం మాత్రమే అని నన్ను దూరం పెట్టేది. అప్పటికి మేం వయసులో చిన్నవాళ్లమే. అంతేకాదు కెరీర్ కూడా అప్పుడే మొదలైంది. అలాంటి సమయంలో రిస్కు చేయడం ఇష్టంలేకనే తను అలా చేసింది. అన్ని ప్రేమ జంటల్లాగే మేం కూడా పదేళ్ల బంధంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చవిచూశాం. నిజానికి పెళ్లి అనేది కేవలం ఒక తంతు మాత్రమే. నా తల్లిదండ్రులకు కూడా శ్వేత అంటే ఎంతో ఇష్టం. వాళ్ల అంగీకారంతోనే ఈ ఏడాది చివర్లో పెళ్లిచేసుకోబోతున్నాం. నా సోల్‌మేట్ జీవిత భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉంది’’అంటూ చిరునవ్వులు చిందించాడు.(చదవండి: నువ్వు నా వాడివి.. నా జీవితం నువ్వే నేహా! ) వాళ్లిద్దరూ నా స్నేహితులు.. ఇక ఇండియన్ ఐడల్ షో స్క్రిప్టులో భాగంగానే సింగర్ నేహా కక్కర్తో తన పెళ్లి అంటూ ఓ ఎపిసోడ్‌ను చిత్రీకరించారని, తమ మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని ఆదిత్య చెప్పుకొచ్చాడు. అంతేగాకుండా సోషల్ మీడియా వేదికగా తాము ప్రేమలో ఉన్నట్లు బహిర్గతం చేసిన నేహా, ఆమె ప్రియుడు, నటుడు రోహన్‌ప్రీత్ సింగ్‌కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాడు. వాళ్లిద్దరూ తనకు మంచి స్నేహితులని, త్వరలోనే వారి పెళ్లి కూడా జరగబోతుందని హర్షం వ్యక్తం చేశాడు. -
ఆమె గొంతు తీయన, మనసేమో చల్లన
-
రెండు వేల నోట్లను పంచిన సింగర్
బాలీవుడ్ ప్రముఖ సింగర్ నేహా కక్కర్ పేద పిల్లలకు సాయం చేస్తూ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. చేయి చాచి అడిగిన పిల్లలకు లేదనకుండా సాయం చేసి అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన నేహా దగ్గరికి ఇద్దరు వీధిబాలలు చేరుకుని టిష్యూ పేపర్లు కొనమని కోరారు. దీంతో ఈ గాయని ఏ మాత్రం సంకోచించకుండా వెంటనే రూ.2 వేల నోట్లను తీసి వారి చేతిలో పెట్టింది. ఇలా వీధిబాలలకు సాయం చేస్తుండగా క్లిక్‌మనిపించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె దాతృత్వానికి పొంగిపోయిన అభిమానులు నేహాను పొగడ్తలతో ముంచెత్తారు. ‘కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి’, ‘ఆమెది బంగారం లాంటి మనసు. చిన్నపిల్లలు అడగగానే ఏ మాత్రం సంకోచించకుండా, చిరాకు పడకుండా సహాయం చేసింది’ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. (ఉదిత్ నారాయణ్ కొడుకుతో సింగర్ పెళ్లి!!) ఇక కార్యక్రమం అనంతరం బయటకు వచ్చిన నేహాను మీ పెళ్లెప్పుడంటూ ఓ విలేఖరి ప్రశ్నించాడు. దీనికి ఆమె ఏమీ బదులివ్వకుండా చిరునవ్వుతో అక్కడ నుంచి నిష్క్రమించింది. సోషల్ మీడియాలో మాత్రం తన పెళ్లివార్తలపై స్పందించింది. సింగర్ ఆదిత్య నారాయన్‌ను పెళ్లాడనుందన్న వార్తలను ఖండించింది. తాను సింగిల్‌గానే ఎంతో హ్యాపీగా ఉన్నానంటూ. పెళ్లి.. గిల్లీ ఏమీ లేదని స్పష్టం చేసింది. కాగా గతంలోనూ ఐడల్ సింగర్ ప్రోగ్రామ్‌లో ఆదిత్య నారాయణ తల్లిదండ్రులు స్టేజీపైకి వచ్చి నేహాను కోడలిగా చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే అది కేవలం టీఆర్పీల కోసమే చేశామని చెప్పడంతో ప్రేక్షకులు ఒకింత నిరుత్సాహానికి గురికాగా మమ్మల్ని ఫూల్ చేశారంటూ వారిపై మండిపడ్డారు. ఇక వీరిద్దరూ కలిసి ఆడిపాడిన ‘గోవా బీచ్ సాంగ్’ ఈమధ్యే రిలీజ్ కాగా అది యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. (నేహాను ఇప్పటికీ గౌరవిస్తున్నా: మాజీ ప్రియుడు) -
ఆ షో జడ్జ్‌తో హోస్ట్ పెళ్లి!
ఇండియన్ ఐడల్ సీజన్ 11 హోస్ట్ ఆదిత్య నారాయణ్, జడ్జ్ నేహా కక్కర్లు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో ఈ షో ప్రారంభం అయినప్పటి నుంచి ఆదిత్య, నేహాల మధ్య మంచి కెమిస్ట్రీ నడుస్తోంది. దీనికి ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇటీవల ఆదిత్య నేహాకు ప్రపోజ్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. వృత్తిరీత్యా ఇద్దరు సింగర్లు కావడంతో వారి మధ్య మంచి అవగాహన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఆదిత్య, నేహా తల్లిదండ్రులు ఇండియన్ ఐడల్ షోకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆదిత్య తండ్రి ఉదిత్ నారాయణ్.. నేహాను ఆటపట్టించాడు. నేహాను తన కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. ఆదిత్య తల్లి దీప కూడా అదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ షోను ప్రసారం చేస్తున్న చానల్ కూడా నేహా, ఆదిత్యలు ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోనున్నట్టు ఓ ప్రొమోలో తెలిపింది. అయితే ఇది షో ప్రమోషన్ కోసం చేసిందా లేక నిజంగానే ఫిబ్రవరి 14న నేహా, ఆదిత్యలు పెళ్లి చేసుకోనున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే చాలా మంది మాత్రం నేహా, ఆదిత్యలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా తాము పెళ్లి చేసుకోనున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు వీరిద్దరు కలిసి గోవా బీచ్‌లో నేహా సోదరుడు టోని కక్కర్ రూపొందించిన ఓ సాంగ్ షూట్లో పాల్గొన్నారు. ఈ వీడియోను ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నేహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. View this post on Instagram #GoaBeach 🏖 Out on 10th feb ❤️😇 . . #TonyKakkar #NehaKakkar #AnshulGarg #AdityaNarayan #KatKritian #DesiMusicFactory A post shared by Neha Kakkar (@nehakakkar) on Feb 1, 2020 at 11:19pm PST -
ఉదిత్ నారాయణ్ కుమారుడి అరెస్ట్
సాక్షి, ముంబై : బాలీవుడ్ ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడిని ముంబై పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... ఆదిత్య నారాయణ్ తన కారుతో ఓ ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, అందులోని మహిళా ప్రయాణీకురాలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారు ఆదిత్య నారాయణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 338, 279 కింద అతడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. ఆదిత్య నారాయణ్ గాయకుడిగానే కాకుండా వ్యాఖ్యాతగా, నటునిగా కూడా రాణిస్తున్నాడు. అతడు పలు టీవీ కార్యాక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు. -
ఇండిగో సిబ్బందిపై బాలీవుడ్ సింగర్ చిందులు
రాయ్‌పూర్ : విమానశ్రయ సిబ్బందిపై ప్రముఖుల ఆగడాలు ఆగడం లేదు. జేసీ దివాకర్ రెడ్డి, రవీంద్ర గైక్వాడ్ వంటి రాజకీయ నేతలు ఎయిర్‌పోర్డు సిబ్బందిపై విరుచుకుపడి వివాదాస్పదానికి గురికాగ, తాజాగా బాలీవుడ్ గాయకుడు, ప్రముఖ టెలివిజన్ యాంకర్ ఆదిత్య నారాయణ్ కూడా ఈ వివాదంలో చిక్కుకున్నారు. రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టు ఇండిగో సిబ్బందిపై ఆదిత్య నారాయణ్ చిందులు వేశారు. నీ దుస్తులు ఊడదీస్తానంటూ సిబ్బందిని బెదిరించారు. ఈ దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డయ్యాయి. రిపబ్లిక్ టీవీ వీటిని ఎక్స్‌క్లూజివ్‌గా వీటిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఆదిత్య నారాయణ్ తీరుపై ఇండిగో సిబ్బంది అభ్యంతరం వ్యక్తంచేశారు. నో ఫ్లై లిస్టు ప్రకారం ప్రతిఒక్క ప్రయాణికుడిని సమానంగా చూస్తామంటూ ఎయిర్‌లైన్ ప్యాసెంజర్ అసోసియేషన్ సుధాకర్ రెడ్డి చెప్పారు. ఇండిగో ఈ విషయంపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆదిత్య నారాయణ్ తీరుపై స్పందించిన మరో బాలీవుడ్ సింగర్ ఇలా అరుణ్, ఎవరూ కూడా పక్కన వాళ్లతో తప్పుగా ప్రవర్తించకూడదని, ఆదిత్య వ్యక్తిగత స్థాయి తనకు తెలుసని, ఆయన చాలా గౌరవప్రదమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఇలాంటి ప్రవర్తనను తాను ఆమోదించనని, కానీ ఆయన ఎందుకు ఇలా చేశారు? అనేదే పెద్ద ప్రశ్నార్థకమని చెప్పారు. సింగర్ ఉదిత్ నారాయణ్‌కు ఆదిత్య నారాయణ్ కొడుకు. -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: అవినాష్ దీక్షిత్ (ఆర్థికవేత్త), ఆదిత్య నారాయణ్ (బాలీవుడ్ సింగర్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. ఇది రాహువుకు సంబంధించినది కావడం వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయి. సొంత ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. ఎన్నో ఏళ్లుగా కోర్టులో ఆస్తికి సంబంధించి నలుగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. మీరు పుట్టిన తేదీ 6. ఇది శుక్రునికి సంబంధించినది కావడం వల్ల పుట్టుకతోనే సౌకర్యాలు, డబ్బు, సంతోషం, విలాసవంతమైన జీవనం అలవడతాయి. ఎల్లప్పుడూ అందంగా, యవ్వనంగా కనిపిస్తారు. ఏ ఆటంకాలూ లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. అందరికీ ఇష్టులుగా మారతారు. ఈ సంవత్సర సంఖ్య 4 కావడం వల్ల అదనపు బరువు బాధ్యతలు మీదపడి, మీరే నెరవ్చేవలసి వస్తుంది. దీనివల్ల ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవడం అవసరం. అలాగే కొత్తగా కోర్టు వివాదాలలో తలదూర్చకుండా, వివాదాల జోలికి పోకుండా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఈ సంవత్సరం విజయాలను తీసుకు వచ్చినా, శ్రమ తప్పదు. లక్కీ నంబర్స్: 2,4,6; లక్కీ డేస్: బ్లూ, వైట్, వయొలెట్, గోల్డెన్, శాండల్; లక్కీడేస్: సోమ, గురు, శుక్రవారాలు; జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, అక్టోబర్, నవంబర్. సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుదర్శన హోమం చేయించడం, అనాథలకు అన్నదానం చేయించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్