
Singer Aditya Narayan Shweta Agarwal Blessed With Baby Girl: ప్రముఖ గాయకుడు ఆదిత్య నారాయణ్, నటి శ్వేతా అగర్వాల్ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ బ్యూటిఫుల్ జంటకు ఫిబ్రవరి 24న ఫస్ట్ బేబీ గర్ల్ జన్మించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆదిత్య నారాయణ్ ప్రకటించారు. ఆయన ఇన్‌స్టా ఖాతాలో తమ పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ '24.02.2022న ఆ సర్వశక్తి సంపన్నుడు మాకు అందమైన పాపను ప్రసాదించినందుకు నేను, శ్వేతా కృతజ్ఞతలు తెలుపుతున్నాము' అని రాశాడు. ఈ పోస్ట్ చూసిన ప్రముఖ సెలబ్రిటీలు ఈ జంటపై శుభాకాంక్షల వర్షం కురిపించారు.
'ఆదిత్య నారాయణ్ మీకు కుమార్తె జన్మించినందుకు శుభాకాంక్షలు. మీ తదుపరి జీవితపు దశను సంపూర్ణంగా ఆనందించండి.' అని బర్ఖా సేన్‌గుప్తా కామెంట్ చేసింది. 'ఆదిత్య, శ్వేత మీరు తల్లిదండ్రులు అయినందుకు శుభాకాంక్షలు. లవ్ టు ఆల్ ఆఫ్ యూ' అని సింగర్ నీతి మోహన్ రాయగా, 'ఇద్దరికీ శుభాకాంక్షలు' అని 'గంగుబాయి కతియావాడి' ఫేం శాంతను మహేశ్వరి తెలిపింది. ఇదిలా ఉంటే ఆదిత్య తనకు అందరూ మగబిడ్డే పుడుతుందని అందరూ అనుకున్నారని, కానీ తాను మాత్రం ఆడపిల్లే పుట్టాలని ఆశపడ్డానని తెలిపాడు. తండ్రులు తమ కూతుళ్లకు అత్యంత సన్నిహితులనే విషయాన్ని తాను నమ్ముతున్నాని పేర్కొన్నాడు. ఆదిత్య, శ్వేతా డిసెంబర్ 1, 2020న ముంబైలోని ఇస్కాన్ ఆలయంలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment