బిడ్డకు జన్మనిచ్చిన హీరామండి నటి! | Heeramandi Actress Richa Chadha Blessed With Baby Girl | Sakshi
Sakshi News home page

Richa Chadha: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరామండి నటి!

Published Thu, Jul 18 2024 4:37 PM | Last Updated on Thu, Jul 18 2024 4:49 PM

Heeramandi Actress Richa Chadha Blessed With Baby Girl

బాలీవుడ్ నటి రిచా చద్దా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2024లో గుడ్‌ న్యూస్‌ చెప్పిన నటి జూలై 16న కుమార్తె జన్మించినట్లు వెల్లడించింది. ఈ విషయంపై సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. మా పట్ల మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు తెలిపారు . ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అభినందనలు చెబుతున్నారు.

కాగా.. ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి ది డైమండ్ బజార్‌ వెబ్‌ సిరీస్‌తో అభిమానులను అలరించింది. అయితే రిచా చద్దా,  అలీ ఫజల్ మొదట 2021లో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 2023లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి గ్రాండ్‌గా మరోసారి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు.  దాదాపు 9 ఏళ్లపాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. వీరిద్దరు 2012లో జంటగా నటించిన  ఫక్రే మూవీ సెట్స్‌లో తొలిసారి కలుసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement