బాలీవుడ్‌లో మరో ప్రేమ జంట పెళ్లికి రెడీ అయ్యింది. మసాన్ చిత్రంతో గుర్తింపు పొందిన నటి రిచా చద్దా గత కొంతకాలంగా ప్రియుడు, బాలీవుడ్ నటుడు ఆలీ ఫజల్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్‌లోనే వీరి పెళ్లి జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ ఏడాది మార్చిలో పెళ్లికి ప్లాన్ చేసుకోగా ఇద్దరు షూటింగ్‌లతో బిజీ ఉండగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఇక ఈ సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఎలాగైన పెళ్లి పీటలు ఎక్కాలని ఈ జంట గట్టిగా నిర్ణయించుకుందట.
చదవండి: రణ్‌బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత
ముంబైతో పాటు ఢిల్లీలో వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహనికి హాజరవుతారని సమాచారం. సౌత్ ముంబై హోటల్లో గ్రాండ్ రాయల్ జరుగనుందని బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 2012 ఫక్రీ మూవీ సెట్‌లో కలుసుకున్న ఈ జంట అప్పటి నుంచి ప్రేమలో మునిగితేలుతున్నారు. ఏడేళ్ల డేటింగ్ అనంతరం అలీ ఫజల్, రిచాలు 2019లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల సమ్మతితో 2020లో పెళ్లి పీటలు ఎక్కాలనుకున్నారు.
చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్? వరుడు ఎవరంటే..
అయితే కరోనా కారణంగా వారి పెళ్లి వాయిదా పడింది. ఇక 2022లో మార్చి పెళ్లి వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కాలనుకోగా సినిమా షూటింగ్‌లతో ఇద్దరు బిజీగా ఉండటంతో మరోసాని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల లేదా అక్టోబర్‌లో వివాహనికి ఈ జంట ముహుర్తం ఫిక్స్ చేసుకుని పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం అలీ కొన్ని హాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తుండగా.. రిచా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ‘ హీరామండీ ’వెబ్‌సిరీస్‌లో కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment