పెళ్లి కుదిరింది | Richa Chadha, Ali Fazal All Set to Get Married on April 15 | Sakshi
Sakshi News home page

పెళ్లి కుదిరింది

Published Thu, Feb 27 2020 3:19 AM | Last Updated on Thu, Feb 27 2020 3:19 AM

Richa Chadha, Ali Fazal All Set to Get Married on April 15 - Sakshi

ఐదేళ్ల డేటింగ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టారు బాలీవుడ్‌ తారలు అలీ ఫజల్, రీచా చద్దా. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతోంది. 2012లో ‘ఫక్రీ’ సినిమాలో కలసి నటించిన ఈ ఇద్దరూ  2015 నుంచి డేటింగ్‌ చేస్తున్నారు. 2017లో వీళ్ల రిలేషన్‌షిప్‌ని అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే మాల్దీవుల్లో హాలిడేకి వెళ్లారు రీచా, అలీ. అక్కడ రీచాను అలీ పెళ్లి చేసుకుందామని ప్రపోజ్‌ చేయడం, ఆమె అంగీకరించడం జరిగిపోయాయట. ఏప్రిల్‌ 15న ఢిల్లీలో కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకోవాలనుకుంటున్నారట. ఆ తర్వాత ముంబైలో రిసెప్షన్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
∙అలీ ఫజల్, రీచా చద్దా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement