బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా మాతృత్వపు మధురిమల కోసం ఎదురుచూస్తోంది. తాను గర్భం దాల్చిన విషయాన్ని ఫిబ్రవరిలో వెల్లడించిన ఈమె తాజాగా మెటర్నటీ షూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో రిచా, ఆమె భర్త బేబీ బంప్ వైపు ఆత్మీయంగా చూస్తున్నారు.
'మా స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీకగా ఓ వెలుగు మా జీవితంలోకి రాబోతోంది. నాకు తోడుగా నిలబడి నా జీవితాన్ని కాంతిమయం చేసిన భాగస్వామి అలీ ఫజల్‌కు కృతజ్ఞతలు' అని రాసుకొచ్చింది. 'ఈ సారి కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది' అని పేర్కొంది.
కాగా రిచా చద్దా, అలీ ఫజల్.. ఫర్కీ సినిమా సెట్‌లో ఒకరినొకరు కలుసుకున్నారు. కొంతకాలానికే మంచి స్నేహితులుగా తర్వాత ప్రేమికులుగా మారారు. 2022 అక్టోబర్‌లో ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1+1=3 అంటూ తమ కుటుంబంలోకి ఓ బుజ్జి పాపాయి రానుందని ప్రకటించారు. ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌లో మెప్పించిన రిచా చద్దా.. 'అభి తో పార్టీ షురూ హు హై' సినిమాలో కనిపించనుంది. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
చదవండి: సైమా అవార్డ్స్ కోసం పోటీలో ఉన్న సినిమాలు, హీరోలు.. లిస్ట్ ఇదే
Comments
Please login to add a commentAdd a comment