సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఒకటి. ఈ అవార్డుల విషయంలో ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైంది. 12 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. 2024 ఏడాది సైమా ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది.
ఈ ఏడాది సెప్టెంబరు 14, 15 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది. ఈ అవార్డ్స్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ‘సైమా’ టీమ్ తాజాగా విడుదల చేసింది. 2023లో రిలీజైన సినిమాలకు ఈ అవార్డ్స్ దక్కనున్నాయి. టాలీవుడ్ నుంచి నాని నటించిన దసరా సినిమా అత్యధికంగా 11 విభాగాల్లో పోటీపడుతుంది. తమిళ్ నుంచి జైలర్ 9 విభాగాల్లో సత్తా చాటుతుంది. మలయాలళం నుంచి టొవినో థామస్ 2018, దర్శన్ నటించిన కాటేర (కన్నడ) 8 విభాగాల్లో రేసులో ఉన్నాయి.
ఉత్తమ చిత్రం కోసం బరిలో ఉన్న సినిమాలు
సలార్: సీజ్ ఫైర్
దసరా
హాయ్ నాన్న
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
బేబీ
బలగం
సామజవరగమన
ఉత్తమ నటుడి అవార్డ్ లిస్ట్‌లో
చిరంజీవి (వాల్తేర్ వీరయ్య)
బాలకృష్ణ (భగవంత్ కేసరి)
ఆనంద్ దేవరకొండ (బేబీ)
నాని (దసరా)
నాని (హాయ్ నాన్న)
ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)
ధనుష్ (సర్)
నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)
ఉత్తమ నటి కోసం పోటీ పడుతున్న హీరోయిన్‌లు
కీర్తిసురేశ్ (దసరా)
సమంత (శాకుంతలం)
అనుష్క (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)
వైష్ణవీ చైతన్య (బేబీ)
మృణాళ్ ఠాకూర్ (హాయ్ నాన్న)
ఉత్తమ దర్శకుడు కోసం బరిలో ఉన్న డైరెక్టర్స్
ప్రశాంత్‌నీల్ (సలార్:పార్ట్-1 సీజ్ ఫైర్)
వేణు యెల్దండ (బలగం)
శ్రీకాంత్ ఓదెల (దసరా)
అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)
శౌర్యువ్ (హాయ్ నాన్న)
కార్తిక్ దండు (విరూపాక్ష)
- సాయి రాజేశ్ (బేబీ)
Comments
Please login to add a commentAdd a comment