weeding
-
నట్టింటి నుంచి.. నెట్టింటికి..
పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. అని సినీ గేయ రచయిత ఆత్రేయ పాట అందరికీ తెలిసిందే.. అయితే ఆ పాటలో చెప్పిన విధంగా పెళ్లివారి నట్టింట్లో అచ్చం అలాంటి సందడే కొనసాగేది. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది.. పెళ్లి సందడి నట్టింట్లో నుంచి నెట్టింట్లోకి చేరింది. దీంతో రకరకాల ఆధునిక పోకడలు ఈ తతంగంలో కనిపిస్తున్నాయి. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదేరా బ్రదర్ అని మరో కవి అన్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అయ్యే విధంగా తతంగం నడుస్తోంది. పెళ్లిచూపులు, ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ మొదలు, పెళ్లి అనంతరం జరిగే తతంగాల వరకూ అన్నీ సోషల్ వేదికగా షేర్ చేసుకుంటున్నారు. పెళ్లిలో నేటి ఆధునిక పోకడలపైనే ఈ కథనం.. నేటి తరానికి ప్రతిదీ సెలబ్రేషనే.. సామాజిక మాధ్యమాల్లో పెళ్లి సంబరాలు అంబరాన్నంటేలా చేసుకుంటున్నారు. పెళ్లి పనులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రీవెడ్డింగ్, పెళ్లి వేడుకలు, పోస్ట్ వెడ్డింగ్, సీమంతం ఇలా ఒక్కటేమిటి ప్రతి సందర్భాన్నీ వీడియోలు, ఫొటోలు తీసుకుని భద్రపరుచుకుంటున్నారు. తరతరాలు గుర్తుండిపోయేలా విభిన్నంగా, వినూత్నంగా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటికి సంబంధించిన పొట్టి వీడియోలను యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అయితే ఇటీవల సరికొత్త ట్రెండ్ వచి్చంది. అదేంటంటే.. పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ వీడియోలు తాజాగా ఫుల్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. సంతోషాన్ని పంచుకునేందుకు.. ఇటీవల తమ జీవితంలో జరిగే ముఖ్యమైన అంశాలను ప్రపంచంతో పంచుకోవడం అలవాటైంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోల రూపంలో పెడుతున్న వారు ఎక్కువ అవుతున్నారు. ఒకప్పుడు పెళ్లిచూపులకు సంబంధించిన అంశాలను చాలా గోప్యంగా ఉంచేవారు. అంతా సెట్ అయిన తర్వాత కానీ బయట ప్రపంచానికి తెలియనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జీవితంలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘట్టాన్నీ గుర్తుంచుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. పెళ్లి చూపుల కోసం పెళ్లి కొడుకు కారు దిగిన దగ్గరి నుంచి పెళ్లి చూపులు జరుగుతున్న తతంగం మొత్తాన్నీ వీడియోలు తీసుకుంటున్నారు. అటు పెళ్లి కొడుకు, ఇటు పెళ్లి కూతురు నవ్వుతూ సిగ్గు పడుతుంటే అదో మరపురాని అనుభూతిగా మిగిలిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. పెళ్లి కూతురు తరపు వాళ్లు, పెళ్లి కొడుకు తరపు బంధువులు ఈ సందర్భంగా సరదాగా జరిపే మాటామంతీ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ సంభాషణలను ఆధారంగా చేసుకుని ఎన్నో ఫన్నీ వీడియోలు తీస్తూ నవ్వులు పూయిస్తున్నారు. కామెంట్ల వెల్లువ.. పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోలను చక్కగా ఎడిటింగ్ చేసి, సూటయ్యే పాటలను బ్యాక్‌గ్రౌండ్‌లో సెట్‌చేసి అప్లోడ్ చేస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు సరదాగా మాట్లాడుకుంటున్న సందర్భాన్ని కూడా వీడియోలు తీస్తున్నారు. రెండు, మూడేళ్లుగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ తరహా వీడియోలు తెగ పాపులర్‌గా ఉండేవి. ఇటీవల కాలంలోనే మన దగ్గర కూడా ఇలా పెళ్లి చూపుల వీడియోలు తీసి ఇన్‌స్ట్రాగామ్ వంటి వేదికల్లో పోస్టు చేస్తున్నారు. దీంతో మన దగ్గర కూడా ఈ రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రీల్స్ చూసిన వీక్షకులు కూడా నూతన వధూవరులకు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు చెబుతూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. పెళ్లి కాని యువతీ, యువకులు మాత్రం ఈ వీడియోలను చూస్తుంటే ‘పెళ్లి చేసుకుంటే బాగుండూ అనిపిస్తోంది’ అంటూ కామెంట్లు పెడుతూ నవ్వులు పూయిస్తున్నారు. మొత్తానికీ ఈ ఏడాది పెళ్లి చూపుల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు. జాగ్రత్త అంటున్న నిపుణులు.. ఇటీవల చాలావరకూ ప్రీవెడ్డింగ్, హల్దీ, మెహందీ, పోస్టు వెడ్డింగ్, బేబీ బంప్ వీడియోలు షూట్ చేసుకోవడం కామన్‌గా మారిపోయింది. అయితే ఏదైనా కానీ మితి మీరనంత వరకే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా మోజులో పడి అతిగా ప్రవర్తిస్తే వ్యక్తిగత జీవితంతో పాటు సమాజంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. గతంలో సెన్సేషన్ కోసమో.. వినూత్నంగా, విభిన్నంగా చేయాలనే ఉద్దేశంతోనో వెరైటీగా షూటింగ్స్ చేసి విమర్శలు కొని తెచ్చుకున్న వారూ లేకపోలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లోని ఫొటోలు, వీడియోలు నేటి టెక్నాలజీ కారణంగా మిస్ యూజ్ అయిన సందర్భాలనూ చూస్తూనే ఉన్నాం.. -
కలుపును నిర్మూలించే రోబోలొస్తున్నాయ్!
మన దేశంలో పంట పొలాల్లో కలుపు వల్ల రైతులకు ఏటా జరుగుతున్న ఆర్థిక నష్టం రూ. 1980 కోట్లని నాలుగేళ్ల క్రితం నాటి అంచనా. పురుగులు, తెగుళ్ల నష్టాలకన్నా కలుపు నష్టమే ఎక్కువని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి లెక్కతేల్చింది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా స్వతంత్రంగా పనిచేస్తూ కలుపు మొక్కల్ని మాత్రమే నిర్మూలించే రోబోలు (అటానమస్ రొబోటిక్ వీడ్ కంట్రోల్ సిస్టమ్స్) వస్తున్నాయి. కృత్రిమ మేధ, జీపీఎస్, జిఐఎస్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో రూపొందిన ‘రోబో కూలీలు’ ఇవి. వీటిల్లో అనేక రకాలున్నాయి. కలుపు తీసే రోబో తనను తానే నడుపుకుంటూ పంట సాళ్లలో వెళ్తూ సాళ్ల మధ్యన, వరుసల్లో మొక్కలు/చెట్ల మధ్యన ఉండే నిర్దేశించిన కలుపు మొక్కల్ని మాత్రమే గుర్తించి నాశనం చేస్తాయి. నాశనం చేసే పద్ధతులు అనేకం ఉన్నాయి. గాలి, మంట (ఫ్లేమ్), చలి గాలి, మైక్రోవేవ్స్, లేజర్ కిరణాలు, వాటర్ జెట్‌ను ప్రయోగించటం ద్వారా (పంట మొక్కలు, చెట్లకు హాని జరగకుండా) కేవలం కలుపు మొక్కల్ని నిర్మూలించటం ఈ రోబోల ప్రత్యేకత. వీటి ఖరీదెక్కువ. నిర్వహణకు నైపుణ్యం కలిగిన పనివారి అవసరం ఉంటుంది. కూలీల సమస్యను అధిగమించే క్రమంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా డ్రోన్ల మాదిరిగా వీటిని మన దేశంలోనూ వినియోగించే అవకాశాలు ఉన్నాయి. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఆ వెడ్డింగ్ వీడియో ఏమైనట్లు ?
-
అభిమానానికి హద్దులు లేవంటే ఇదేనేమో!.. ఓ వ్యక్తి ధోనిపై ఉన్న ప్రేమను..
అభిమానులు తమకు నచ్చిన క్రికెటర్ లేదా నటులపై ఉన్న ప్రేమను రకరకాలుగా చూపిస్తుంటారు. అందుకు సంబంధించిన ఘటనలను ఎన్నో చూశాం. ఒక్కోక్కరిది ఒక్కోరకమైన పంథాలో తమ అభిమానాన్ని చాటుకుంటారు. అచ్చం అలానే ఇక్కడో అభిమాని తనకు ఇష్టమైన క్రికెటర్‌పై తన ప్రేమను అదేవిధంగా ప్రేమను చూపించాడు. వివరాల్లోకెళ్తే..ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారధ్యం వహిస్తున్న ధోని.. ఐదు సార్లు తన జట్టును ఛాంపియన్స్‌గా నిలిపాడు. తాజాగా ఐపీఎల్-2023 సీజన్లో కూడా ధోని నాయకత్వంలోని సీఎస్కేనే విజేతగా నిలిచింది కూడా. అలాంటి మిస్టర్ కూల్‌పై చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ అభిమాని అందర్నీ ఆశ్చర్యపరిచేలా తన ప్రేమను చాటుకున్నాడు. తన వెడ్డింగ్ కార్డ్‌కి ఇరువైపులా 'తలా'అనే పదం, ధోని ముఖ చిత్రం, జెర్సీ నెంబర్ తోపాటు అతని పేరుని కూడా ముంద్రించాడు. ఆ అభిమాని తన పెళ్లికి ఎంఎస్ ధోనిని ఆహ్వానించడానికి ఈ కార్డుని పంపినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. CSK #yellove 💛 fever isn't over yet⁉️ A fan boy of @msdhoni from #chhattisgarh printed Dhoni face, #Jersey no 7 on his wedding card and invite to the #ChennaiSuperKings captain❤🔥 #MSDhoni𓃵 #thala #Dhoni pic.twitter.com/dZmAqFvI14 — Shivsights (@itsshivvv12) June 3, 2023 (చదవండి: జెలెన్స్కీ ఇంటి ముంగిటే..నాటు నాటు స్టెప్పులతో దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు -
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ పెళ్లి ఏర్పాట్లు షురూ? సౌత్ ముంబైలో రాయల్ వెడ్డింగ్!
బాలీవుడ్లో మరో ప్రేమ జంట పెళ్లికి రెడీ అయ్యింది. మసాన్ చిత్రంతో గుర్తింపు పొందిన నటి రిచా చద్దా గత కొంతకాలంగా ప్రియుడు, బాలీవుడ్ నటుడు ఆలీ ఫజల్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్‌లోనే వీరి పెళ్లి జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ ఏడాది మార్చిలో పెళ్లికి ప్లాన్ చేసుకోగా ఇద్దరు షూటింగ్‌లతో బిజీ ఉండగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఇక ఈ సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఎలాగైన పెళ్లి పీటలు ఎక్కాలని ఈ జంట గట్టిగా నిర్ణయించుకుందట. చదవండి: రణ్‌బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత ముంబైతో పాటు ఢిల్లీలో వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహనికి హాజరవుతారని సమాచారం. సౌత్ ముంబై హోటల్లో గ్రాండ్ రాయల్ జరుగనుందని బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 2012 ఫక్రీ మూవీ సెట్లో కలుసుకున్న ఈ జంట అప్పటి నుంచి ప్రేమలో మునిగితేలుతున్నారు. ఏడేళ్ల డేటింగ్ అనంతరం అలీ ఫజల్, రిచాలు 2019లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల సమ్మతితో 2020లో పెళ్లి పీటలు ఎక్కాలనుకున్నారు. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్? వరుడు ఎవరంటే.. అయితే కరోనా కారణంగా వారి పెళ్లి వాయిదా పడింది. ఇక 2022లో మార్చి పెళ్లి వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కాలనుకోగా సినిమా షూటింగ్‌లతో ఇద్దరు బిజీగా ఉండటంతో మరోసాని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల లేదా అక్టోబర్‌లో వివాహనికి ఈ జంట ముహుర్తం ఫిక్స్ చేసుకుని పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం అలీ కొన్ని హాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తుండగా.. రిచా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ‘ హీరామండీ ’వెబ్‌సిరీస్‌లో కనిపించనుంది. -
ఈ జంట మరీ వైల్డ్! స్టంట్ కాదు...పాములతో నిజమైన పెళ్లి!
అబ్బాయి మెడలో చిన్న పాము, అమ్మాయి మెడలో పైథాన్... పై ఫొటో సాహస స్టంట్‌ను తలపిస్తోంది కదా! కానీ అక్కడ పెళ్లి జరుగుతోంది. పెళ్లికి ఎవరైనా పూల దండలు వేసుకుంటారు. మరీ పైసలెక్కువైతే నోట్ల దండలేసుకుంటా రు. కానీ వీళ్లేంటి మరీ ఇంత వైల్డ్‌గా ఉన్నారనుకుంటున్నారా? వాళ్లిద్దరూ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన వైల్డ్ లైఫ్ ఆఫీసర్స్ సిద్ధార్థ్ సోనావానే, సృష్టి ఔసర్మాల్. 2010 నవంబర్ 12న వాళ్ల పెళ్లి జరిగింది. అసలే వన్యప్రాణి సంరక్షణ అధికారులు. పూలదండలు మార్చుకుంటే ఏం బాగుంటుంది? అనుకున్నారేమో. పాములనే దండలుగా మార్చుకున్నారు. వధువు సృష్టి ఔసర్మాల్ వరుడికి ఓ చిన్నపామును మెడలో వేస్తే... ‘నేనేం తక్కువ’ అంటూ వరుడు ఏకంగా పైథాన్నే వధువు మెడలో వేశాడు. ఆ తరువాత వాటిని అడవిలో వదిలేశారనుకోండి. అయితే ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది... కానీ ఆ పాములు కాస్త వైల్డ్‌గా రియాక్ట్ అయి ఉంటే? ఏమయ్యేది అని నెటిజన్స్ వాపోతున్నారు. (చదవండి: నన్నే పెళ్లాడతా.. యువతికి షాక్!.. అడ్డుకుని తీరతామంటూ..) -
పెళ్లి ఊరేగింపులో విషాదం...వధువు తల్లిని కత్తితో పొడిచి...
Two neighbours of the bride’s family Assaassinated Her Mother: ఇటీవల చిన్నచిన్న వాటికే హత్యలు వరకు వెళ్లిపోతున్నారు. క్షణికావేశంలో ఘోరమైన నిర్ణయాలు తీసుకుని జీవితాలను బలిచేసుకుంటున్నారు. దీంతో సరదాగా చేసుకునే పండుగలు, వేడుకలు విషాదాంతమవుతున్నాయి. చిన్నచిన్న వాటికే అలిగి అర్థంకానీ ఆవేశంతో చేసే పనులు వారిని, వారి బంధువులను అపకీర్తీ పాలు చేస్తోంది. అచ్చం అలాంటి ఘటనే ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....ఒడిశాలోని బార్గఢ్ జిల్లాలో జరిగిన వివాహ వేడుకు విషాదంగా మారింది. పెళ్లకొడుకు తరుపు వారు రష్మీ రాజాన్స్ పెళ్లి కోసం బార్‌ఘర్ జిల్లాలోని సలేపాలి గ్రామానికి పెద్ద ఊరేగింపుగా వచ్చారు. ఆ ఊరేగింపులో వధువు తరుపు పొరుగింటివాళ్లు ఇద్దరు జాయిన్ అయ్యి డ్యాన్స్‌లు చేస్తున్నారు. అయితే ఆ ఊరేగింపులో డ్యాన్స్‌లు చేస్తూ పెళ్లి కొడుకు తరుపు వారిని ఇబ్బందికి గురిచేస్తున్నారు. దీంతో వధువు తల్లి అభ్యంతరం చెప్పడమే కాకుండా డ్యాన్స్‌లు చేయొద్దని సూచించింది. దీంతో ఆగ్రహం చెందిన ఆ ఇద్దరు వధువు తల్లిని కత్తితో పొడిచి హత్య చేశారు. తదనంతరం పోలీసుఉల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రారంభించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. (చదవండి: యాత్రికులతో వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం... నలుగురు మృతి) -
పెండ్లి దావత్‌కు రాహుల్ వెళ్తే తప్పా?
సాక్షి, హైదరాబాద్: ‘రాహుల్‌గాంధీ ఏదో చేసినట్టు వీడియోను వైరల్ చేస్తున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది? రాహుల్ పెండ్లి దావత్‌కు వెళ్తే కూడా తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు’అని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు రాత్రిపూట ఎక్కడకు వెళ్తారో కెమెరాలు పెడితే తెలుస్తుందన్నారు. టీఆర్ఎస్ నేతల్లా తమకు పార్క్ హయత్‌లో సూట్లు లేవని, వాటిల్లో ఆడే తందనాలు అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రైతులకు ఏం చేశారో ప్రభుత్వాన్ని నిలదీసేందుకే రాష్ట్రానికి రాహుల్ వస్తున్నారని చెప్పారు. రైతులను ముంచడంలో కేసీఆర్, మోదీలు అన్నదమ్ములని, వారి పాలనను ఎండగట్టేందుకే పర్యటిస్తున్నారని తెలిపారు. రైతులకు 5 రూపాయలు.. ప్రచారానికి 95 రూపాయలు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే అన్నీ చేసినట్టు.. విద్యుత్ బల్బులు, కేబుల్, స్తంభాలు కూడా వాళ్లే వేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ది గ్రాఫిక్స్ పాలన అని, ఆయన పాలన శివాజీ సినిమాలో రజనీకాంత్ స్టైల్లా ఉందని అన్నారు. ‘కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ఇచ్చి రూపాయి ప్రచారం చేసుకుంది. కేసీఆర్ మాత్రం ఆ విద్యుత్‌కు అయ్యేంత ఖర్చును ప్రచారానికి వాడుతున్నారు. మేం రూ. లక్ష రుణమాఫీ చేశాం. కేసీఆర్ చేయకపోయినా చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. చేసేది పది రూపాయల పని, రైతులకు ఇచ్చేది 5 రూపాయలు. ప్రచారానికి మాత్రం 95 రూపాయలు’అని విమర్శించారు. -
రైతు ‘ఐడియా’ అదిరింది.. సమస్య తీరింది
పెంబి (ఖానాపూర్): ఓ యువరైతు కలుపుతీసే పరికరాన్ని తయారుచేసి కూలీల ఖర్చును తగ్గించుకుంటున్నాడు. పెంబి మండలానికి చెందిన పుప్పాల శ్రీనివాస్ పొలంలో కలుపు తీసేందుకు కూలీల కొరత, అధిక ఖర్చును తగ్గించుకోవడానికి యువరైతు యూట్యూబ్‌లో చూసి కలుపు తీసే యంత్రాన్ని తయారు చేశాడు. మందపల్లి శివారు వద్ద ఉన్న వరిపొలంలో ఆ యంత్రంతో కలుపు తీస్తుండడంతో సాక్షి పలకరించింది. ఈ యంత్రం తయారు చేసే విధానాన్ని వివరించారు. మూడు ఫీట్ల పొడవున్న రెండు ఇంచుల పీవీసీ పైపు, ఆఫ్ ఇంచ్ ఇనుప పైపు, 25 గొలుసులు తీసుకోవాలి. వాటికి కేవలం వెయ్యి నుంచి 12వందల వరకు ఖర్చు వస్తుందని తెలిపారు. ముందుగా ఆఫ్ ఇంచ్ ఇనుప పైపుకు గొలుసులు వెల్డింగ్ చేయించి దానిని పీవీసీ పైపునకు తీగతో కట్టాలి. అంతే కలుపు నివారణ పరికరం తయారు అయినట్లే.. ఒక తాడు సాయంతో ఒక్కరితో ముందుకు నడుస్తూ పోతే చిన్న చిన్న కలుపు మొక్కలు గొలుసులకు తట్టుకోని బయటకు వచ్చి చనిపోతాయి. అంతే కాకుండా వరి మొక్కలను నాశనం చేసే కీటకాలు సైతం నీటిలో పడిపోతాయి. ఈ పరికరం గత సంవత్సరం నుంచి వాడుతున్నట్లు తెలిపాడు. దీంతో కూలీల ఖర్చు తగ్గిందని వివరించాడు. -
తెలుసుకుని తీసిపారేస్తుంది
మీరెప్పుడైనా పొలాల్లో కలుపు తీశారా? తీసుంటే.. కనీసం చూసుంటే.. ఆ పని ఒళ్లు హూనమయ్యేంత కష్టమని మీకు తెలిసే ఉంటుందికదా! ఆ కష్టాన్ని తీసేసే రోబో ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. కలుపు మొక్కల్ని నాశనం చేసేసే రోబో. భలే ఉంది కదూ. దీన్ని తయారు చేసింది ఎవరనుకుంటున్నారు? ఆమధ్యకాలంలో వచ్చిన రోబో వాక్యూమ్ క్లీనర్ రూంబాను తయారు చేసిన జో జోన్స్దే ఈ ఐడియా కూడా. కాకపోతే ప్రస్తుతానికి దీన్ని పెరటి తోటలకు మాత్రమే వాడుకునే వీలుంది. మొక్క సైజును బట్టి ఏది కలుపు, ఏది కాదన్నది గుర్తుపడుతుందట టెర్టిల్ అనే పేరున్న ఈ రోబో. అంగుళం కంటే ఎక్కువ సైజున్నవి పనికొచ్చే మొక్కలుగా గుర్తిస్తుంది. అంతకంటే చిన్న వాటిని తన చక్రాల మధ్యలో ఉండే చిన్న యంత్రం సాయంతో నేలమట్టం చేసేస్తుంది. అవసరమైన మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు వాటిచుట్టూ ఇనుప కంచెలాంటిది వేస్తే చాలు. దాని జోలికి వెళ్లదు. పైగా వాలుగా ఉన్న దీని చక్రాలను చూశారా.. అవికూడా అటుఇటూ తిరిగేటప్పుడు కలుపు మొక్కలను పెరక్కుండా నిరోధిస్తాయి. అంతేకాదు, ఏ రకమైన రసాయనాలూ వాడకుండానే కావాల్సినప్పుడల్లా కలుపు తీసేసుకోవచ్చు. అడ్డంకులను గుర్తించేందుకు, తన దారి తానే వెతుక్కునేందుకు వీలుగా దీంట్లో కొన్ని సెన్సర్లను ఏర్పాటు చేశారు. పైన ఉన్న సోలార్ ప్యానెల్స్‌తో పనిచేస్తుంది కాబట్టి... కరెంటు కనెక్షన్ కూడా అవసరం లేదన్నమాట. కలుపు మొక్కలను పూర్తిగా పీకేయకున్నా, ఎప్పటికప్పుడు ఎదగకుండా చూస్తుంది కాబట్టి టెర్టిల్తో ఉపయోగమే కానీ నష్టమేమీ లేదంటున్నారు జోన్స్. ఇప్పటì వరకైతే టెర్టిల్ రోబోల నమూనాలు సిద్ధమయ్యాయి గానీ.. వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు జోన్స్ ప్రస్తుతం కిక్‌స్టార్టర్ ద్వారా నిధులు సేకరించే పనుల్లో ఉన్నాడు. వచ్చే ఏడాది మార్చికల్లా దీన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఫ్రాంక్లిన్ రోబోటిక్స్ అనే అమెరికన్ సంస్థ! బాగానే ఉందిగానీ.. దీన్ని వ్యవసాయ పొలాల్లో వాడుకోవచ్చా? సమీప భవిష్యత్తులో అదీ సాధ్యమేనేమో! -
ఆటో ఇంజన్‌తో కలుపుతీత యంత్రం!
ఇంజనీరింగ్ సునీల్‌రెడ్డి విద్యార్థి నైపుణ్యం –గతంలోనూ పలు రకాల వ్యవసాయ యంత్రాలు తయారీ నాగయ్యగూడెం(మోతె) : మారుతున్న కాలానికి అనుగుణంగా సులువుగా, వేగంగా సాగు చేయడానికి ఎద్దులకు ప్రత్యామ్నాయంగా నూతన యంత్రాలను తయారు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు నేటి యువత. తమకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, కొద్దిపాటి ఖర్చుతో కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే క్రమంలో ఇంజనీరంగ్ విద్యార్థి సునీల్‌రెడ్డి ఆటో ఇంజన్‌తో కలుపుతీసే యంత్రాన్ని తయారు చేశాడు. తాతయ్య స్ఫూర్తితో... మోతె మండలం విభళాపురం గ్రామ పరిధిలో నాగయ్యగూడెంకు చెందిన గోదా సునీల్రెడ్డిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. తన తాత గోదా వెంకట్‌రెడ్డి, తండ్రి లక్ష్మారెడ్డి వ్యవసాయం చేయడానికి గతంలో పశువులను ఉపయోగించేవారు. వాటి సాయంతో అరక కట్టేవారు. చేళ్లలో కలుపు తీసేవారు. కానీ, రోజురోజుకూ పశు సంపద తగ్గిపోవడం, మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని హోళీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన సునీల్‌రెడ్డికి ఓ ఆలోచన తట్టింది. ఎంటెక్కు ప్రిపేర్ అవుతూనే తన తండ్రి నడిపిస్తున్న విజయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్ షాప్‌లో ఆటో ఇంజన్ సాయంతో కలుపు తీసే టిల్లర్ తయారు చేశారు. అంతేకాకుండా వర్క్ షాప్‌లో తీరిక సమయంలో విత్తనాలు వేయడానికి, ఎలగడి దుక్కులు దున్నడానికి యంత్ర పరికరాలను తయారు చేశాడు. అంతకుముందు ఫైనలియర్నూ అనేక ప్రయోగాలు చేసి తోటి స్నేహితులను, కళాశాల సిబ్బందిని అబ్బురపరిచాడు. పరికరాల తయారీ ఇలా... ఆటో ఇంజన్‌కు డీసిల్ ట్యాంక్, కార్బొరేటర్, గేర్ రాడ్, కేబుల్స్, ఆటో టైర్లు, ఇనుప ముక్కలు ఉపయోగించి తన ఆలోచన శక్తిని ఉపయోగించి పంటల్లో కలుపు నివారణకు గుంటక తయారు చేశాడు. పనిచేసే విధానం సునీల్‌రెడ్డి తయారు చేసిన యంత్రంతో పత్తి, ఆముదాలు, కంది, మొక్కజొన్న, సజ్జ ఇతర పంటల్లో కలుపు తీయెుచ్చు. ఎకరం చేనులో కలుపు తీయడానికి గుంటకు లీటర్ డీసిల్ మాత్రమే అవసరం అవుతుంది. దీని ద్వారా భూమి లోపల 4నుంచి 6 ఇంచుల లోతు మట్టి పెకిలించవచ్చు. స్టేట్స్కు వెళ్లి ఉన్నత చదువుతో మరిన్ని ప్రయోగాలు చేస్తా.. స్టేట్స్కు Ðð ళ్లి ఎంటెక్ పూర్తి చేసిన తదుపరి మరిన్ని వ్యవసాయ యంత్ర పరికరాలు తయారు చేసి రైతులకు అందిస్తాను. – గోదా సునీల్‌రెడ్డి నాగయ్యగూడెం -
30 శాతం మంది నకిలీ లాయర్లే!
దేశంలో నకిలీ లాయర్లను ఏరిపారేసే ప్రక్రియ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లతో ఎంతోమంది న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని, వారిని వెతికి పట్టుకునేందుకు వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నవారు కనీసం 30 శాతం మందికి నకిలీ డిగ్రీలున్న విషయం బయటపడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నకిలీ లాయర్లను వెతికి పట్టుకునేందుకు బీసీఐ కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ఒకప్పుడు న్యాయవాద వృతిని చేపట్టాలనుకున్నవారు బీసీఐ సర్టిఫికెట్తో రిజిస్టర్ అయితే సరిపోయేది. కానీ తాజాగా అమల్లోకి తెచ్చిన పద్ధతి ప్రకారం వెరిఫికేషన్ సమయానికి న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నవారంతా బీసీఐ సర్టిఫికెట్తో పాటు పదోతరగతి, బోర్డు సర్టిఫికెట్లను, ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. ఈ నేపథ్యంలో కొత్త ఫార్మాట్లో తిరిగి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు బీసీఐ ఛైర్మన్ చెప్పారు. లాయర్లు సమర్పించిన సర్టిఫికెట్ల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియ సదరు విశ్వవిద్యాలయాలు, బోర్డుల సహాయంతో 2016 సంవత్సరం చివరినాటికి పూర్తవుతుందని మనన్ కుమార్ మిశ్రా వెల్లడించారు. బీసీఐ రిజిస్ట్రేషన్ ఉండి ఐదేళ్లుగా ప్రాక్టీస్‌లో లేని న్యాయవాదులను పరిశీలనలో భాగంగా లాయర్లుగా గుర్తించినా.. తిరిగి ప్రాక్టీస్ కు మాత్రం అనుమతించే అవకాశం లేదన్నారు. ఈ నూతన ప్రక్రియను ప్రారంభించేందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో బార్ కౌన్సిల్... వివిధ రాష్ట్రాల్లో న్యాయవాదుల అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి న్యాయవాదికీ అకాడమీ సర్టిఫికెట్ తప్పనిసరి అని, దాంతో ఏ కోర్టులోనైనా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుందని మిశ్రా చెప్పారు. దేశంలో 20 శాతం లాయర్లు సరైన 'లా' డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారని బీసీఐ ఛైర్మన్ గతేడాది చెప్పారు. అకాడమీలను ప్రారంభించి, నకిలీ న్యాయవాదులను నిర్మూలించేందుకు సహకరించాలని అప్పట్లో కేంద్రాన్ని నిధుల కోసం ఆశ్రయించారు. అయితే అప్పటికే న్యాయమూర్తులకు శిక్షణ ఇచ్చే జ్యుడీషియల్ అకాడమీలను పొడిగిస్తూ, న్యాయవాదులకు, న్యాయవ్యవస్థలో పనిచేసే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ ఆఫీసర్ల వంటి వారికి కూడా తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, న్యాయ శాఖ బీసీఐకి హామీ ఇచ్చింది.