అభిమానానికి హద్దులు లేవంటే ఇదేనేమో!.. ఓ వ్యక్తి ధోనిపై ఉన్న ప్రేమను.. | Chhattisgarh Man Prints MS Dhonis Photo On His Wedding Card | Sakshi
Sakshi News home page

అభిమానానికి హద్దులు లేవంటే ఇదేనేమో!.. ఓ వ్యక్తి ధోనిపై ఉన్న ప్రేమను..

Published Sun, Jun 4 2023 9:39 AM | Last Updated on Sun, Jun 4 2023 10:01 AM

Chhattisgarh Man Prints MS Dhonis Photo On His Wedding Card - Sakshi

అభిమానులు తమకు నచ్చిన క్రికెటర్‌ లేదా నటులపై ఉ‍న్న ప్రేమను రకరకాలుగా చూపిస్తుంటారు. అందుకు సంబంధించిన ఘటనలను ఎన్నో చూశాం. ఒక్కోక్కరిది ఒక్కోరకమైన పంథాలో తమ అభిమానాన్ని చాటుకుంటారు. అచ్చం అలానే ఇక్కడో అభిమాని తనకు ఇష్టమైన క్రికెటర్‌పై తన ప్రేమను అదేవిధంగా ప్రేమను చూపించాడు.

వివరాల్లోకెళ్తే..ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారధ్యం వహిస్తున్న ధోని.. ఐదు సార్లు తన జట్టును ఛాంపియన్స్‌గా నిలిపాడు. తాజాగా ఐపీఎల్‌-2023 సీజన్‌లో కూడా ధోని నాయకత్వంలోని సీఎస్‌కేనే విజేతగా నిలిచింది కూడా. అలాంటి మిస్టర్‌ కూల్‌పై చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ అభిమాని అందర్నీ ఆశ్చర్యపరిచేలా తన ప్రేమను చాటుకున్నాడు.

తన వెడ్డింగ్‌ కార్డ్‌కి ఇరువైపులా 'తలా'అనే పదం, ధోని ముఖ చిత్రం, జెర్సీ నెంబర్‌ తోపాటు అతని పేరుని కూడా ముంద్రించాడు. ఆ అభిమాని తన పెళ్లికి ఎంఎస్‌ ధోనిని ఆహ్వానించడానికి ఈ కార్డుని పంపినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: జెలెన్‌స్కీ ఇంటి ముంగిటే..నాటు నాటు స్టెప్పులతో దుమ్ములేపిన ఉక్రెయిన్‌ సైనికులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement