Mahendra Singh Dhoni
-
‘ధోనికి రుణపడి ఉంటా’అశ్విన్ భావోద్వేగం
చెన్నై: దాదాపు 13 ఏళ్ల క్రితం తనకంటూ ఎలాంటి గుర్తింపు లేని రోజుల్లో అండగా నిలిచి అవకాశాలు కల్పించిన మహేంద్ర సింగ్ ధోనికి తాను జీవితకాలం రుణపడి ఉంటానని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. 100 టెస్టులు పూర్తి చేసుకోవడంతో పాటు 500 వికెట్ల మైలురాయిని దాటిన అశ్విన్‌ను శనివారం తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా తన కెరీర్‌ను మలుపు తిప్పిన 2011 ఐపీఎల్ ఫైనల్‌ను అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. ‘కొత్త బంతితో నన్ను క్రిస్ గేల్‌కు బౌలింగ్ చేసే అవకాశాన్ని ధోని కల్పించాడు. నాలుగో బంతికే నేను వికెట్ తీయగలిగా. ఇప్పటికీ చాలా మంది దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే అందుకు ధోనినే కారణం. అతనికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. సాధారణంగా నేను మాట్లాడేప్పుడు పదాల కోసం ఎప్పుడూ తడబడను. కానీ ఈ రోజు నా పరిస్థితి భిన్నంగా ఉంది. టీఎన్‌సీఏ నాకు ఎంతో గౌరవం కల్పించింది కాబట్టే ఎప్పుడైనా క్లబ్ క్రికెట్ కూడా సిద్ధంగా ఉంటా. నేను రేపు చచ్చిపోయినా నా ఆత్మ ఈ స్టేడియంలోనే తిరుగుతూ ఉంటుంది’ అని అశ్విన్ అన్నాడు. ఈ సన్మాన కార్యక్రమంలో అశ్విన్‌కు ప్రత్యేక జ్ఞాపికగా ‘సెంగోల్’ అందించడం, అతని పేరిట స్టాంప్ విడుదలతో పాటు రూ. 1 కోటి నగదు పురస్కారాన్ని కూడా అందించారు. -
ధోని జెర్సీ నంబర్ ‘7’కు రిటైర్మెంట్: బీసీసీఐ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, రెండు ప్రపంచకప్‌లను గెలిపించిన సారథి మహేంద్ర సింగ్ ధోనిపై బీసీసీఐ సముచిత గౌరవం ప్రదర్శించింది. అతను మైదానంలో ధరించిన ‘7’ నంబర్ జెర్సీకి కూడా రిటైర్మెంట్ ఇస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దిగ్గజ క్రికెటర్‌గా భారత క్రికెట్‌కు ధోని చేసిన సేవలకు గుర్తిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీని ప్రకారం ఇకపై భారత క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించే ఏ ఆటగాడు కూడా తమ జెర్సీపై ‘7’ నంబర్ వాడేందుకు బోర్డు అనుమతించదు. గతంలో ఆల్‌టైమ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ గౌరవార్ధం కూడా అతను ధరించిన ‘10’ నంబర్‌కు కూడా బీసీసీఐ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించింది. సచిన్ తప్పుకున్న తర్వాత ఒకే ఒకసారి ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ ‘10’ నంబర్ జెర్సీని వేసుకోగా అభిమానుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. దాంతో అతను తన నంబర్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. జెర్సీ నంబర్లకు రిటైర్మెంట్ ప్రకటించడం ఇతర క్రీడల్లో చాలా కాలంగా ఉంది. బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ వేసుకున్న ‘23’ నంబర్‌ను కూడా అతని కెరీర్ తర్వాత చికాగో బుల్స్ టీమ్ రిటైర్మెంట్ ఇచ్చింది. -
‘ధోని నుంచి నేర్చుకున్నాను’
విశాఖపట్నం: ఆ్రస్టేలియాతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత జట్టు విజయంలో రింకూ సింగ్ కీలక పాత్ర పోషించాడు. చివర్లో దూకుడుగా ఆడాల్సిన స్థితిలో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా నిలబడి అతను ఫినిషర్‌గా మ్యాచ్ పూర్తి చేశాడు. ఈ లక్షణాన్ని తాను మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి నేర్చుకున్నట్లు రింకూ సింగ్ చెప్పాడు. ‘నేను ఇంత ప్రశాంతంగా ఉండగలిగానంటే అందుకు ప్రత్యేక కారణం ఉంది. ఇలాంటి స్థితిలో ఎలా ఆడాలని నేను మహి భాయ్ (ధోని)తో మాట్లాడాను. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఒత్తిడికి లోను కాకపోవడానికి ఆయన ఇచ్చిన సూచనలే కారణం. సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండటంతో పాటు నేరుగా బౌలర్‌పైనే పూర్తి దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు’ అని రింకూ సింగ్ వెల్లడించాడు. చివరి బంతికి ఒక పరుగు కావాల్సి ఉండగా రింకూ ఆత్మవిశ్వాసంతో దానిని చక్కటి సిక్సర్‌గా మలిచాడు. అయితే అబాట్ వేసిన ఆ బంతి నోబాల్ కావడంతో సిక్స్ లెక్కలోకి రాలేదు. ‘డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాక అక్షర్ చెప్పే వరకు ఈ విషయం నాకు తెలీదు. అయితే సిక్స్ కాలేకపోవడం పెద్ద అంశం కాదు. మ్యాచ్ గెలవడమే మనకు ముఖ్యం. అది జరిగింది చాలు’ అని రింకూ సింగ్ వ్యాఖ్యానించాడు. -
MS Dhoni Rare Photos: మహేంద్ర సింగ్ ధోనీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
ధోని నిర్మాతగా ‘LGM’, త్వరలో రిలీజ్..
ఇండియన్ క్రికెట్ చరిత్రలో సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా పేరు గడించిన మహేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై LGM సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాక్షి ధోని నిర్మిస్తున్నారు. సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే ట్రైలర్, ఆడియో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ కార్యక్రమంలో మహేంద్ర సింగ్ ధోని, సాక్షి ధోని పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రమేష్ తమిళ్ మణి మాట్లాడుతూ ‘‘కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా LGM సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా నవ్విస్తూనే ప్రేక్షకుల గుండెలను తాకుతుంది. LGM చిత్రానికి ప్రేక్షకులు తమ ప్రేమ, ఆదరణను అందిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు. ఇటీవల విడుదలైన LGM టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో 7 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ను సాధించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న LGM చిత్రానికి రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహించటంతో పాటు మ్యూజిక్‌ను కూడా అందించారు. యోగి బాబు, మిర్చి విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. చదవండి: సమంత రేంజే వేరు.. సిటాడెల్ కోసం ఎంత పారితోషికం తీసుకుందంటే? -
అభిమానానికి హద్దులు లేవంటే ఇదేనేమో!.. ఓ వ్యక్తి ధోనిపై ఉన్న ప్రేమను..
అభిమానులు తమకు నచ్చిన క్రికెటర్ లేదా నటులపై ఉన్న ప్రేమను రకరకాలుగా చూపిస్తుంటారు. అందుకు సంబంధించిన ఘటనలను ఎన్నో చూశాం. ఒక్కోక్కరిది ఒక్కోరకమైన పంథాలో తమ అభిమానాన్ని చాటుకుంటారు. అచ్చం అలానే ఇక్కడో అభిమాని తనకు ఇష్టమైన క్రికెటర్‌పై తన ప్రేమను అదేవిధంగా ప్రేమను చూపించాడు. వివరాల్లోకెళ్తే..ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారధ్యం వహిస్తున్న ధోని.. ఐదు సార్లు తన జట్టును ఛాంపియన్స్‌గా నిలిపాడు. తాజాగా ఐపీఎల్-2023 సీజన్లో కూడా ధోని నాయకత్వంలోని సీఎస్కేనే విజేతగా నిలిచింది కూడా. అలాంటి మిస్టర్ కూల్‌పై చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ అభిమాని అందర్నీ ఆశ్చర్యపరిచేలా తన ప్రేమను చాటుకున్నాడు. తన వెడ్డింగ్ కార్డ్‌కి ఇరువైపులా 'తలా'అనే పదం, ధోని ముఖ చిత్రం, జెర్సీ నెంబర్ తోపాటు అతని పేరుని కూడా ముంద్రించాడు. ఆ అభిమాని తన పెళ్లికి ఎంఎస్ ధోనిని ఆహ్వానించడానికి ఈ కార్డుని పంపినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. CSK #yellove 💛 fever isn't over yet⁉️ A fan boy of @msdhoni from #chhattisgarh printed Dhoni face, #Jersey no 7 on his wedding card and invite to the #ChennaiSuperKings captain❤🔥 #MSDhoni𓃵 #thala #Dhoni pic.twitter.com/dZmAqFvI14 — Shivsights (@itsshivvv12) June 3, 2023 (చదవండి: జెలెన్స్కీ ఇంటి ముంగిటే..నాటు నాటు స్టెప్పులతో దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు -
‘మీ కోసం మళ్లీ ఆడతా’
అహ్మదాబాద్: మూడేళ్ల క్రితం ఐపీఎల్లో ఇదే ప్రశ్న...రెండేళ్ల క్రితం టైటిల్ గెలిచాక ఇదే ప్రశ్న...గత ఏడాది టీమ్ ఘోరంగా విఫలమైనప్పుడు మళ్లీ అదే ప్రశ్న...ఇప్పుడు ఐదో సారి చాంపియన్‌గా నిలిచాక పాత సందేహమే కొత్తగా..! మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నాడా, ఈ సారి అద్భుత ప్రదర్శనతో జట్టును విజేతగా నిలిపిన తర్వాత తప్పుకుంటున్నాడా అని అభిమానుల్లో ఉత్సుకత. చెన్నై సూపర్ కింగ్స్ 2023 చాంపియన్‌గా నిలిచిన తీరును చూస్తే ధోనికి ఇంతకంటే ఘనమైన వీడ్కోలు ఉండదనిపిస్తోంది. కానీ అతని మాట చూస్తే మళ్లీ వచ్చి ఆడతాడనిపిస్తోంది. ఫైనల్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్పై ఎప్పటిలాగే తనదైన శైలిలో ఆసక్తికర సమాధానమిచ్చాడు. ‘ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే రిటైర్మెంట్ను ప్రకటించడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. ఒక్క మాటలో థ్యాంక్యూ అని చెప్పి నేను తప్పుకోవచ్చు. కానీ వచ్చే 9 నెలల పాటు కష్టపడి మరో ఐపీఎల్ ఆడటం మాత్రం అంత సులువు కాదు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు నాపై కురిపిస్తున్న ప్రేమను చూస్తే మరో సీజన్ ఆడటం వారికి కానుక అందించినట్లవుతుంది. వాళ్ల అభిమానం, భావోద్వేగాలు చూస్తే వారి కోసం ఇదంతా చేయాలనిపిస్తోంది’ అని ధోని వ్యాఖ్యానించాడు. తాను కెరీర్ చివరి రోజుల్లో ఉన్నాననే విషయం వారికీ తెలుసని, అందుకే ఎక్కడకు వెళ్లినా తనకు ప్రేక్షకులనుంచి భారీ మద్దతు లభించిందని ధోని గుర్తు చేసుకున్నాడు. ‘ఇదే మైదానంలో సీజన్లో తొలి మ్యాచ్ ఆడాను. అంతా నా పేరును మైదానంలో మారుమోగించారు. చెన్నైలో మాత్రమే కాకుండా ఇలా అన్ని చోట్లా స్పందన చూస్తే నేను ఆడగలిగినంత ఆడాలనిపించింది’ అని మహి పేర్కొన్నాడు. కెపె్టన్‌గా తన ఐదు ఐపీఎల్ ట్రోఫీ విజయాల్లో ప్రతీది భిన్నమైందని, ఒకదాంతో మరోదానికి పోలిక లేదని, పరిస్థితులను బట్టి అన్ని మారతాయని ధోని అభిప్రాయ పడ్డాడు. ‘ప్రతీ ట్రోఫీ గెలుపు, ప్రతీ ద్వైపాక్షిక సిరీస్ విజయానికి వేర్వేరు సవాళ్లు ఉంటాయి. ఏదీ ఒకే తరహాలో మూసగా ఉండదు. అందుకే ఆందోళన చెందకుండా పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటా. ఇలాంటి టోరీ్నల్లో కీలక క్షణాలు కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు ఎలా ఒత్తిడిని ఎదుర్కొంటామనేదే కీలకం. ఈ విషయంలో అందరూ భిన్నంగా ఉంటారు. రహానేలాంటి అనుభవజు్ఞలకు సమస్య రాదు కానీ కుర్రాళ్లను సరైన విధంగా నడిపించాల్సి ఉంటుంది’ అంటూ తన శైలిని వెల్లడించాడు. -
IPL 2023: చెన్నై ఫైవ్ స్టార్... ఐదోసారి చాంపియన్‌గా సూపర్‌కింగ్స్
IPL 2023 Winner CSK- అహ్మదాబాద్: ఐపీఎల్–2023లో చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ కోల్పోగా... వృద్ధిమాన్ సాహా (39 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) శుబ్‌మన్ గిల్ (20 బంతుల్లో 39; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. కాన్వే (25 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (21 బంతుల్లో 32 నాటౌట్; 2 సిక్స్‌లు) రాణించారు. సమష్టి బ్యాటింగ్ ప్రదర్శన... 42 బంతుల్లో 67, 42 బంతుల్లో 64, 33 బంతుల్లో 81... తొలి మూడు వికెట్లకు వరుసగా గుజరాత్ భాగస్వామ్యాలివి. జట్టులోని టాప్–4 తమ వంతుగా కీలకపాత్ర పోషించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. సాహా, గిల్ ఇద్దరూ దూకుడుగా ఆడుతూ ఈ సీజన్లో మరోసారి జట్టుకు శుభారంభం అందించారు. తుషార్ వేసిన రెండో ఓవర్లోనే 3 పరుగుల వద్ద గిల్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను దీపక్ చహర్ వదిలేసి గుజరాత్‌కు మేలు చేశాడు. చహర్ ఓవర్లో సాహా సిక్స్, 2 ఫోర్లు కొట్టగా... తుషార్, తీక్షణ ఓవర్లలో గిల్ వరుసగా మూడేసి ఫోర్లు బాది జోరు ప్రదర్శించాడు. 21 పరుగుల వద్ద సాహా ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను కూడా చహర్ వదిలేయడం టైటాన్స్‌కు మరింత కలిసొచ్చింది. ఎట్టకేలకు ధోని మెరుపు స్టంపింగ్‌తో గిల్ వెనుదిరగ్గా, 36 బంతుల్లో సాహా అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ వెంటనే సాహా అవుట్ కాగా, సుదర్శన్ దూకుడు కొనసాగింది. తీక్షణ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన అతను పతిరణ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టి 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరుకున్నాడు. తుషార్ వేసిన తర్వాతి ఓవర్లో అతను మరింత చెలరేగిపోయాడు. తొలి నాలుగు బంతుల్లో అతను 6, 4, 4, 4 కొట్టడం విశేషం. తుషార్ తర్వాతి ఓవర్లోనూ టైటాన్స్ 18 పరుగులు రాబట్టింది. పతిరణ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 6, 6 కొట్టి 96కు చేరిన సుదర్శన్ తర్వాతి బంతికి దురదృష్టవశాత్తూ ఎల్బీగా దొరికిపోయి సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 21 నాటౌట్; 2 సిక్స్‌లు) ధాటి గుజరాత్‌ను మరింత పటిష్ట స్థితికి చేర్చింది. శుభారంభం... వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం చెన్నై విజయలక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు. ఛేదనను చెన్నై ఘనంగా ప్రారంభించింది. దూకుడుగా ఆడిన ఓపెనర్లు రుతురాజ్, కాన్వే 4 ఓవర్ల పవర్‌ప్లే ముగిసేసరికి 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో స్కోరును 52 పరుగులకు చేర్చారు. అయితే పవర్‌ప్లే తర్వాత చెన్నైని నియంత్రించడంలో బౌలర్లు సఫలమయ్యారు. నాలుగు పరుగుల తేడాతో వీరిద్దరు వెనుదిరిగారు. అయితే రుతురాజ్ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), రహానే (13 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (8 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా ఓ చేయి వేసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. జడేజా ఆఖరి బంతికి ఫోర్ బాది చెన్నైని విజేతగా నిలిపాడు. 15 ఓవర్లకు కుదింపు... రిజర్వ్ డే అయిన సోమవారం కూడా వాన మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. సరైన సమయానికే ఆరంభమై గుజరాత్ పూర్తి 20 ఓవర్లు ఆడింది. అయితే చెన్నై ఇన్నింగ్స్‌లో 3 బంతులకు 4 పరుగులు చేసిన తర్వాత మొదలైన వర్షం సుదీర్ఘ సమయం పాటు తెరిపినివ్వలేదు. వర్షం తగ్గినా, ప్రధాన పిచ్ పక్కన ఉన్న మరో పిచ్ ఆరకపోవడంతో సమస్యగా మారింది. దానిని ఆరబెట్టేందుకు గ్రౌండ్స్‌మన్ అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు అర్ధరాత్రి 12.05 గంటలకు మ్యాచ్ మళ్లీ మొదలైంది. చెన్నై ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 171 పరుగులుగా నిర్దేశించారు. పవర్‌ప్లేను 4 ఓవర్లకు పరిమితం చేయగా, ఒక్కో బౌలర్ గరిష్టంగా 3 ఓవర్లు మాత్రం వేసేందుకు అనుమతించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) ధోని (బి) చహర్ 54; గిల్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 39; సుదర్శన్ (ఎల్బీ) (బి) పతిరణ 96; పాండ్యా (నాటౌట్) 21; రషీద్ (సి) రుతురాజ్ (బి) పతిరణ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–67, 2–131, 3–212, 4–214, బౌలింగ్: దీపక్ చహర్ 4–0–38–1, తుషార్ 4–0–56–0, తీక్షణ 4–0–36–0, జడేజా 4–0–38–1, పతిరణ 4–0–44–2. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) రషీద్ (బి) నూర్ 26; కాన్వే (సి) మోహిత్ (బి) కాన్వే 47; దూబే (నాటౌట్) 32; రహానే (సి) విజయ్‌శంకర్ (బి) మోహిత్ 27; రాయుడు (సి) అండ్ (బి) మోహిత్ 19; ధోని (సి) మిల్లర్ (బి) మోహిత్ 0; జడేజా (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15 ఓవర్లలో 5 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–74, 2–78, 3–117, 4–149, 5–149. బౌలింగ్: షమీ 3–0–29–0, పాండ్యా 1–0–14–0, రషీద్ 3–0–44–0, నూర్ 3–0–17–2, లిటిల్ 2–0–30–0, మోహిత్ శర్మ 3–0–36–3. Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
టీ20 ప్రపంచకప్.. త్వరలో ధోనిని చూసే ఛాన్స్..!
టీ20 క్రికెట్ మొదటి ప్రపంచకప్ విజేత ఎవరంటే క్రికెట్ ప్రేమికులు ఠక్కున సమాధానం చెప్పేస్తారు. ధోని సారథ్యంలోని యంగ్ ఇండియా అని. ఆ టోర్నీలో ఆద్యంతం అధిపత్యం చలాయిస్తూ దాయాదిని మట్టికరిపించి ట్రోఫిని ఎగరేసుకొచ్చింది టీంఇండియా. ఆ మరపురాని దృశ్యాలు మరోసారి తెరపై చూడాలనుకుంటున్నారా? అయితే మీకోసమే సరికొత్తగా ముందుకు తీసుకొస్తున్నారు. ఆనాటి మధుర క్షణాలను మీకు రుచి చూపించేందుకు వెబ్ సిరీస్ రూపంలో వచ్చేస్తోంది. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. చదవండి: ‘అలిపిరికి అల్లంత దూరంలో’ మూవీ రివ్యూ) జార్ఖండ్ డైనమెట్ మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని టీంఇండియా 2007లో జరిగిన ప్రపంచకప్ ఎగరేసుకుపోయింది. సీనియర్లు లేకున్నా యంగ్ ఇండియా కలను సాకారం చేసింది. తుదిమెట్టుపై దాయాది పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. క్రికెట్ ప్రేమికులు ఇప్పటికీ ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటారు. 2007 టీ20 ప్రపంచకప్ మాత్ర అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది ఆ మ్యాచ్‌లు మిస్సయినవారికి త్వరలోనే స్క్రీన్‌పై చూపించనున్నారు. యూకేకు చెందిన వన్ వన్ సిక్స్ నెట్ వర్క్ ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. దీనికి ఆనంద్ కుమార్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. పలు భాషల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లను డాక్యుమెంటరీగా సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. అప్పటి భారత జట్టులోని 15 మంది ఆటగాళ్లు, తమ అనుభవాలను ఇందులో పంచుకోనున్నారు. ఇప్పటికే దాదాపుగా ఈ సిరీస్ షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్‌ను వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. #ItStartedWithThem One One Six Network announces Team HAQ SE INDIA’s squad@harbhajan_singh @GautamGambhir @virendersehwag @DineshKarthik @robbieuthappa @IrfanPathan @iamyusufpathan @rpsingh @MJoginderSharma @sreesanth36 @RaviShastriOfc @BumbleCricket @oneonesixltd @haqseindia pic.twitter.com/OFOUn6B3jI — Gaurav Bahirvani (@gauravbahirvani) October 9, 2021 -
వ్యాపారంలోనూ సిక్సర్లు.. ఎంఎస్ ధోని ఎంత టాక్స్ కడుతున్నాడో తెలుసా!
ఇండియన్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) దశాబ్దకాలంగా భారత క్రికెట్లో విపరీతంగా మారుమోగిన పేరు. ధోని ఎంత పెద్ద క్రికెటర్ అనేది అందరికీ తెలిసిన విషయమే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఈ జార్ఘండ్ డైనమెట్ క్రికెట్లో రాణించినట్లుగానే రిటైర్మెంట్ తర్వాత వ్యాపారంలో అదే స్థాయిలో రాణిస్తున్నాడు. అందుకు నిదర్శనంగా మరోసారి జార్ఖండ్‌లో అతిపెద్ద పన్ను చెల్లింపుదారుడు (Tax Payer) నిలవడం. ధోని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ డిపాజిట్ చేశారు. గత సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ రూ.13 కోట్లు డిపాజిట్ చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అడ్వాన్స్ ట్యాక్స్ రూ. 4 కోట్లు పెరిగింది. దీని బట్టి చూస్తే గతేడాదితో పోలిస్తే ఈ సారి ధోనీ ఆదాయం 30 శాతం పెరిగినట్లు అంచనా. రిటైర్మెంట్ తర్వాత కూడా తగ్గడం లేదు.. ధోని క్రికెటర్‌గా ఉన్నప్పటి నుంచి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పూర్తిగా బిజినెస్ వైపు దృష్టి సారించాడు. మహీ ఇప్పటికీ చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. ఖాతా బుక్ యాప్‌కు స్పాన్సర్‌గా ఉండటంతో పాటు అందులో పెట్టుబడి కూడా పెట్టాడు. ఇటీవల బెంగళూరులో ఎంఎస్ ధోని గ్లోబల్ స్కూల్‌ను ప్రారంభించాడు. ఇది కాకుండా సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. వీటితో పాటు సేంద్రియ వ్యవసాయం కూడా చేస్తుంటాడు. మీడియా నివేదికల ప్రకారం, అతను రాంచీలోని తన వ్యవసాయ ఉత్పత్తులను దుబాయ్‌కి ఎగుమతి చేస్తాడు. ఇంతకు ముందు కూడా 2017-18లో జార్ఖండ్‌లో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ధోని నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
కొత్త అవతారమెత్తిన ధోని.. షాక్‌లో నెటిజన్స్!
ముంబై: ‘జెడ్ బ్లాక్’ అగర్బత్తి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ క్రికెటర్ మహీంద్ర సింగ్ ధోనీ.. సంస్థ నూతన ప్రచార కార్యక్రమంలో ‘గురూజీ’ అవతారంలో కనిపించనున్నాడు. ధోనీ ప్రచారంతో బ్రాండ్ ప్రజలకు మరింత చేరువ అవుతుందని జెడ్బ్లాక్ అగర్బత్తి బ్రాండ్ యజమాని మైసూర్ డీప్ పెర్ఫ్యూమ్ హౌస్ డైరెక్టర్ అంకిత్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘దేశంలో టాప్–3 బ్రాండ్లలో జెడ్ బ్లాక్ ఒకటి. కంపెనీ వినూత్న ఆవిష్కరణలు సంస్థకు అంబాసిడర్ పనిచేసేందుకు ప్రోత్సాహాన్నిచ్చాయి’ అని ధోనీ చెప్పారు. ప్రస్తుత జెబ్ బ్లాక్ అగర్బత్తి మార్కెట్ రూ. 7,000 కోట్లుగా ఉండగా,దాదాపు ఈ కంపెనీ 20% వాటాను కలిగి ఉంది. వాటి బ్రాండ్ల విషయానికొస్తే జెడ్ బ్లాక్ 3 ఇన్ 1, మంథన్ ధూప్, మంథన్ సాంబ్రాణి కప్స్, ఆరోగ్యం కాంఫర్, జెబ్ బ్లాక్ పైనాపిల్, శ్రీఫాల్, గౌవ్డ్ సాంబ్రాణి కప్స్, అరోమిక్స్, నేచర్ ఫ్లవర్ గోల్డ్, సియాన్ పేర్లతో మార్కెట్లో లభిస్తున్నాయి. కాగా ఐపీఎల్ 2022 తర్వాతా తెరపై మహేంద్ర సింగ్ ధోని కనపడడం ఇదే తొలిసారి. అయితే గురూజీ అవతారంలో ఉన్న ధోనిని చూసి మొదట నెటిజన్లు షాకయ్యారు. ఆ తర్వాత అగర్బత్తి యాడ్ కోసం అలా మారడని తెలుసుకుని ఈ గెటప్‌లో కూడా బాగున్నాడంటూ కామెంట్లు పెట్టారు. చదవండి: ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! -
చియాన్ విక్రమ్‌ను కలిసిన ధోని.. "మహాన్" కోసమే అంటున్న నెటిజన్లు
Dhoni Meets Chiyaan Vikram: ఐపీఎల్ మెగా వేలం సన్నాహకాల్లో బిజీగా ఉన్న చెన్నైసూపర్ కింగ్స్ సారధి మహేంద్రసింగ్ ధోని పనికట్టుకుని మరీ ప్రముఖ తమిళ నటుడు చియాన్ విక్రమ్‌ను కలిశాడు. వీరిద్దరి కలయిక సాధారణంగానే జరిగిందని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నప్పటికీ.. కారణం మాత్రం వేరే ఉందని తెలుస్తుంది. విక్రమ్ తాజాగా నటించిన చిత్రం "మహాన్" ట్రైలర్ విడుదల రోజే ధోని.. విక్రమ్‌ను కలవడంతో చిత్ర ప్రమోషన్స్ కోసం ప్లాన్ ప్రకారమే వీరిద్దరు కలిసి ఉంటారని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. విక్రమ్‌ను కలిసిన సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, మహాన్‌లో విక్రమ్ తన కొడుకు ధృవ్‌తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే, ధోని ప్రస్తుతం చెన్నైలోనే ఉంటూ ఐపీఎల్ మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై జట్టు యాజమాన్యంతో చర్చలతో బిజీగా ఉన్నాడు. వేలానికి ముందు సీఎస్కే ధోని సహా నలుగురు ఆటగాళ్లను డ్రాఫ్ట్ చేసుకుంది. సీఎస్కే యాజమాన్యం ధోనిని 12 కోట్లకు డ్రాఫ్ట్ చేసుకోగా, రవీంద్ర జడేజాను అత్యధికంగా 16 కోట్లకు, మొయిన్ అలీని 8 కోట్లకు, రుతురాజ్ గైక్వాడ్‌ను 6 కోట్లకు రీటైన్ చేసుకుంది. కాగా, బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. చదవండి: మెగా వేలానికి ముందు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన తెలుగు క్రికెటర్ -
ఈ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసిన ఎంఎస్ ధోనీ
న్యూఢిల్లీ: హోమ్ ఇంటీరియర్స్ కంపెనీ హోమ్‌లేన్ తాజాగా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో మూడేళ్ల కాలానికి వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. కంపెనీలో ఆయన పెట్టుబడిదారుగా, ప్రచార కర్తగానూ ఉంటారు. అయితే ఎంత పెట్టుబడి చేసిందీ కంపెనీ వెల్లడించలేదు. హైదరాబాద్‌సహా 16 నగరాల్లో సేవలందిస్తున్న హోమ్‌లేన్ వచ్చే రెండేళ్లలో కొత్తగా 25 ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించనుంది. మార్కెటింగ్ వ్యయాల కోసం రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. -
ధోని హెయిర్ స్టైల్ అదరహో.. కుర్రకారు ఫిదా! లక్షల్లో లైకులు
భారత క్రికెట్ జట్టు కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనిది ప్రత్యేక స్థానం. విజయవంతమైన సారథిగా.. బ్యాట్స్‌మెన్‌గా.. వికెట్ కీపర్‌గా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు సంపాదించి పెట్టిన ఒకే ఒక్క కెప్టెన్‌గా ఘనత సాధించిన ధోని ఆటలోనే కాదు.. తన ఆహార్యంలోనూ స్టైలిష్‌గా కనిపిస్తుంటాడు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండేలా ధోనీ చూసుకుంటాడు. ఆయన క్రికెట్ కెరీర్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో స్టైల్స్‌లో కనిపించాడు. ఒక్కో స్టైల్ అదిరిపోయేలా ఉండడంతో యువత ధోనీ స్టైల్ అంటూ హెయిర్ సెలూన్లకు పరిగెత్తుతుంటారు. మళ్లీ ఇప్పుడు ధోనీ మరో హెయిర్ స్టైల్‌తో కొత్త లుక్‌లో కనిపించాడు. ధోనీతో హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ సెలబ్రిటీల స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఆలిమ్ హక్కీమ్ ధోనీని సరికొత్త లుక్‌లో కనిపించేలా చేశారు. ప్రత్యేక హెయిర్ స్టైల్ చేసి న్యూలుక్లో మెరిసేలా ఆలిమ్ ధోనీని తయారుచేశారు. ఈ లుక్‌ను ఫంకీ హెయిర్ స్టైల్‌గా పేర్కొంటారని తెలుస్తోంది. ఈ లుక్ కుర్రకారును తెగ ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలను ఆలిమ్ హకీమ్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ ఫొటోలను నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. కుర్రకారు ఈ హెయిర్ స్టైల్‌ను చేయించుకోవాలని భావిస్తున్నారు. ధోనీ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్లో చెన్నె జట్టుతో ఆడుతున్నాడు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) -
ధోని కొత్త ఫ్రెండ్ ఎవరో తెలుసా.. వైరల్ వీడియో
రాంచీ: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు తెలియని వారుండరు. ఆయన మన భారత్ టీంకు గతంలో కెప్టెన్‌గా ఉన్నారు. అతని వికెట్ కీపింగ్ స్టెయిల్స్, హెయిర్ స్టెయిల్ను ఎంతో మంది కుర్రకారు కాపీ కొడుతూ ఉంటారు. అయితే, ఆయనకు పెంపుడు జంతువులంటే మహా ఇష్టం. ఏ మాత్రం తీరిక దొరికినా వాటితోనే సమయం గడపటానికి ఇష్టపడతారు. అయితే, తాజాగా, ఆయన భార్య సాక్షి సింగ్ ఇన్‌స్టాలో పెట్టిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆయన ఒక కొత్త గుర్రాన్ని ఇంట్లో తెచ్చుకున్నారు. దాన్ని కుటుంబం అంతా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. దానికి ‘చేతక్’ అని పేరుకూడా పెట్టారు. అయితే, గుర్రం ధోని ఇంట్లో పార్క్‌లో పడుకుని ఉంది. దాన్ని మచ్చిక చేసుకునే క్రమంలో చెతక్ను ప్రేమగా నిమురుతూ, పాంపరింగ్ చేయటం మొదలు పేట్టాడు. చెతక్ కూడా ధోని చేస్తున్న మసాజ్‌కు ఏమాత్రం కదలకుండా హాయిగా పడుకుంది. అయితే , ఈ గుర్రంతో పాటు , ఇప్పటికే మరికొన్ని కుక్కలు కూడా ధోని ఇంట్లో ఉన్నాయి. కాగా, సాక్షిసింగ్ తనింట్లో ఏ కొత్త జంతువును తీసుకొచ్చినా దాన్ని వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ గా మారింది. అయితే, ఈ వీడియోను బాలీవుడ్ నటి బిపాషా బసు, మాజీ మిన్ ఇండియా అలంక్రిత సహయ్ కూడా వీక్షించారు. అయితే, దీన్నిచూసిన నెటిజన్లు ‘వీకెండ్లో కొత్త అతిథితో సరదాగా గడుపుతున్నారు’ , ‘ ‘మూగజీవాల పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు హ్యట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
నూతన భారతావనికి నీవొక స్ఫూర్తి
న్యూఢిల్లీ: ధోని అంటేనే ధనాధన్. దీనికి న్యాయం చేస్తూ... తొలి పొట్టి ప్రపంచకప్ (2007)ను భారత్‌కు అందించాడు. ధోని అంటేనే నడిపించే నాయకుడు... దీన్ని వన్డే ప్రపంచకప్ (2011) ఫైనల్లో చూపించాడు. మరెన్నో క్లిష్టమైన మ్యాచ్‌ల్ని తనకిష్టమైన షాట్లతో ముగించాడు. ఆటలో, ఆర్మీలో తన మనోనిబ్బరాన్ని గట్టిగా చాటిన ధోని వీడ్కోలుపై సాక్షాత్తూ దేశ ప్రధానే స్పందించారు. అతని 15 ఏళ్ల కెరీర్లో భారతావని మురిసిన క్షణాల్ని ఉదహరిస్తూ యువతకు స్ఫూర్తి ప్రధాతగా నిలిచావంటూ కితాబిస్తూ లేఖ రాశారు. క్రికెట్ కెరీర్ కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన ధోనికి ఇకపై కుటుంబ జీవితం సాఫీగా సాగాలని మనసారా దీవించారు. లేఖ పూర్తి పాఠం ప్రధాని మాటల్లోనే.... ‘ఎక్కడి నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదు... ఏం సాధించాం, ఎలా సఫలీకృతం అయ్యామన్నదే ముఖ్యం. ఈ నీ ప్రేరణే యువతకు మార్గనిర్దేశం. ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన నీవు యావత్ దేశమే గర్వించేస్థాయికి ఎదిగావు. జాతిని గర్వపడేలా చేశావు. భారత్‌లో, క్రికెట్లో నీకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చావ్. నీ ఆటతీరుతో కోట్లాది అభిమానుల్ని అలరించావు. నీ పట్టుదలతో యువతరానికి స్ఫూర్తిగా నిలిచావు. నూతన భారతావనికి నీవొక రోల్ మోడల్. ఇంటిపేరు లేకుండా వచ్చిన నీవు గొప్ప పేరు, ప్రఖ్యాతలతో నిష్క్రమిస్తున్నావు. నా దృష్టిలో టీమిండియాకు అత్యుత్తమ సారథివి నీవే! నీ సమర్థ నాయకత్వంతో జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లావు. బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా బహుముఖ ప్రజ్ఞాపాటవాలున్న అరుదైన క్రికెటర్‌గా నీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో.... నీవున్నావనే భరోసా టీమిండియాను ఒడ్డున పడేస్తావన్న ధీమా ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. ముఖ్యంగా 2011 వన్డే ప్రపంచకప్ తెచ్చిపెట్టిన ఘనత తరాల పాటు ప్రజల మదిలో చెక్కు చెదరదు. ఇక నీ పేరు క్రికెట్ లెక్కా పద్దులకు, రికార్డులకే పరిమితం చేయడం ఏమాత్రం సరైంది కాదు. చరిత్రలో నిలిచిన ‘మహేంద్రసింగ్ ధోని’ని అంచనా వేసేందుదుకు ఏ కితాబులు సరితూగవు. తోటివారిని ప్రోత్సహిస్తూ ధైర్యంగా ముందడుగు వేస్తూ యంగ్ టీమిండియా సాధించిన 2007 టి20 ప్రపంచకప్ నీ సారథ్యానికి సాటిలేని ఉదాహరణ నీ హెయిర్ స్టయిల్ ఎప్పుడెలా ఉన్నా... గెలుపోటములను మాత్రం సమానంగా స్వీకరించే లక్షణం చాలా మంది నేర్చుకోవాల్సిన పాఠం. క్రికెట్ బాధ్యతలతో పాటు ఆర్మీకి చేసిన సేవలు అమూల్యం. ఇంతటి ఘనమైన... సాఫల్యమైన కెరీర్‌కు కుటుంబసభ్యుల (సతీమణి సాక్షి, కుమార్తె జీవా) మద్దతు ఎంతో అవసరం. ఇకపై నీవు జట్టు సభ్యులతో కాకుండా మీ వాళ్లతో కావాల్సినంత సమయం గడపొచ్చు. నీకంతా మంచే జరగాలి’’ అని మోదీ లేఖలో శుభాశీస్సులు తెలిపారు. ఈ లేఖను ట్వీట్ చేసిన ధోని ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. ‘కళాకారులు, సైనికులు, క్రీడాకారులు అభినందనల్నే ఆశిస్తారు. వాళ్ల కృషి, త్యాగాలను ప్రతీ ఒక్కరు గుర్తించాలనే భావిస్తారు’ అని ధోని తెలిపారు. -
‘ధోనిని నేనే కాపాడాను’
చెన్నై: 2011 సంవత్సరం... ఎమ్మెస్ ధోని నాయకత్వంలో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ గెలుచుకొని నీరాజనాలందుకుంది. కెప్టెన్‌గా ధోని శిఖరాన నిలిచాడు. అయితే ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇంగ్లండ్ చేతిలో 0–4తో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా... ఆ తర్వాత కొద్ది రోజులకే ఆస్ట్రేలియా చేతిలో కూడా ఇదే తరహాలో 0–4తో పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ సమయంలో ధోని నాయకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో టెస్టు సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ధోనిని కెప్టెన్సీనుంచి తప్పించాలని సెలక్టర్లు భావించారు. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నాటి అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ దీనిని అడ్డుకున్నారు. తన విశేషాధికారాలు ఉపయోగించి ధోనిని కెప్టెన్‌గా కొనసాగేలా చేశారు. ఈ విషయంలో శ్రీనివాసన్ పాత్రపై అనేక సార్లు వార్తలు వచ్చినా... ఇంత కాలం ఆయన నోరు విప్పలేదు. ఇప్పుడు ధోని రిటైర్మెంట్ అనంతరం దీనిని శ్రీనివాసన్ ధ్రువీకరించారు. తానే ఎమ్మెస్ కెప్టెన్సీ కోల్పోకుండా ఆపినట్లు వెల్లడించారు. ఐపీఎల్ ప్రారంభమైన తొలి ఏడాది 2008నుంచే శ్రీనివాసన్‌కు చెందిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్‌గా ధోని వ్యవహరిస్తున్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డునుంచి జరిగే ప్రతీ ఎంపికకు అధ్యక్షుడు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ‘ధోనిని వన్డే జట్టు కెప్టెన్సీనుంచి తొలగించాలని ఒక సెలక్టర్ (మొహీందర్ అమర్నాథ్) భావించారు. అసలు అతడిని ఎలా తప్పించగలరనేదే నా ప్రశ్న. కొన్నాళ్ల క్రితమే ధోని ప్రపంచ కప్ గెలిపించాడు.అసలు అతని స్థానంలో ఎవరిని కెప్టెన్ చేయాలో కూడా వారికి తెలీదు. అసలు సమావేశానికి ముందు నేను ధోని కెప్టెన్ కాకపోవడం అనే మాటే ఉదయించదని స్పష్టంగా చెప్పేశాను. సెలవు రోజున నేను గోల్ఫ్ ఆడుతున్న సమయంలో అప్పటి బోర్డు కార్యదర్శి సంజయ్ జగ్దాలే నాకు ఈ విషయం తెలియజేశారు. సెలక్టర్లు ఇంకా కెప్టెన్‌గా ఎంపిక చేయలేదు. ధోనిని ఆటగాడిగా మాత్రమే తీసుకుంటామంటున్నారని నాతో ఆయన చెప్పారు. నేను వెంటనే నాకున్న అన్ని అధికారాలను ఉపయోగించాను’ అని శ్రీనివాసన్ గుర్తు చేసుకున్నారు. ధోని తనకు నచ్చినంత కాలం చెన్నై జట్టు తరఫున ఆడవచ్చని ఆయన హామీ ఇచ్చారు. 7, 3 కలిస్తే 73..! స్వాతంత్య్ర దినోత్సవంనాడు ధోని రిటైర్మెంట్ను ప్రకటిస్తాడనే విషయం తనకు ముందే తెలుసని అతని సహచరుడు, అదే రోజు రిటైర్ అయిన సురేశ్ రైనా అన్నాడు. దానికి అనుగుణంగానే తాను కూడా సిద్ధమైనట్లు అతను చెప్పాడు. ‘చెన్నై చేరగానే ధోని వీడ్కోలు విషయాన్ని చెబుతాడని తెలుసు. రిటైర్మెంట్ ప్రకటన అనంతరం మేమిద్దరం భావోద్వేగాలు ఆపుకోలేక గట్టిగా హత్తుకున్నాం. చెన్నై జట్టులోని ఇతర ఆటగాళ్లందరితో కలిసి రాత్రంతా ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నాం. పార్టీ చేసుకున్నాం’ అని రైనా వెల్లడించాడు. సుమారు ఏడు నెలల విరామంతో ధోని, రైనాలిద్దరు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. భారత జట్టుతో పాటు ఐపీఎల్లో చెన్నై జట్టు సభ్యులుగా వీరిద్దరి మధ్య ఎంతో ఆత్మీయత ఉంది. ‘ఆగస్టు 15న రిటైర్ కావాలని మేమిద్దరం ముందే నిర్ణయించుకున్నాం. ధోని జెర్సీ నంబర్ 7, నా జెర్సీ నంబర్ 3 ఒక చోట చేరిస్తే 73 అవుతుంది. శనివారంనాటికి మనకు స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంతకంటే తగిన సమయం లేదని భావించాం’ అని రైనా వివరించాడు. ‘నేను.. ధోనిని మాట్లాడుతున్నా’ కెరీర్ ఆరంభంలో చాలా మందిలాగే బ్యాట్ స్పాన్సర్షిప్ కోసం ధోని కూడా బాగా ఇబ్బందులు పడ్డాడు. రాంచీలోని ఒక డీలర్ పరమ్‌జిత్ సింగ్ అతనిలోని ప్రతిభను గుర్తించి ఆరు నెలల పాటు ఆఅSS (బీట్ ఆల్ స్పోర్ట్స్) కంపెనీ వెంట పడటంతో చివరకు జలంధర్‌కు చెంది ఆ సంస్థ యజమాని సోమి కోహ్లి అందుకు అంగీకరించాడు. 1998లో ధోనితో ఈ సంస్థ ప్రయాణం మొదలు కాగా ఆరేళ్ల తర్వాత గానీ కోహ్లితో ధోని భేటీ జరగలేదు. 2004లో ఒక సారి బ్యాట్లను ఎంచుకునేందుకు జలంధర్ వెళ్లిన ధోని ఆ రాత్రి కోహ్లి ఇంట్లోనే ఆగాడు. ధోనిని కోహ్లి పరిచయం చేయగా... ఆయన భార్య ‘ఎవరితను’ అని ఎదురు ప్రశ్నించింది. తర్వాతి రోజు ఉదయం ధోని ‘సర్, ఆమె మాటలతో నేను రాత్రంతా నిద్రపోలేకపోయాను’ అని కోహ్లితో చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత వైజాగ్‌లో పాకిస్తాన్‌పై అద్భుత సెంచరీ చేసిన తర్వాత అదే రోజు రాత్రి 11 గంటలకు కోహ్లికి ఫోన్ చేసిన ధోని...‘ఆంటీ, నేను ధోనిని మాట్లాడుతున్నా’ అన్నాడు. బిడ్డా, ఇప్పుడు నేనే కాదు ప్రపంచమంతా నిన్ను గుర్తిస్తుంది అని ఆమె ఆశీర్వదించింది. ఆ తర్వాత ప్రముఖ కంపెనీలతో ధోని ఒప్పందాలు కుదుర్చుకున్నా ఆఅS కంపెనీ మాత్రం బ్యాట్లు పంపడం ఆపలేదు. గత ఏడాది ప్రపంచకప్‌లో తనకు అండగా నిలిచిన అన్ని కంపెనీల లోగోలు కనిపించే విధంగా వేర్వేరు బ్యాట్లతో ఆడి ధోని తన కృతజ్ఞతను ప్రదర్శించాడు. -
ధోని, నేను వెక్కి వెక్కి ఏడ్చాం : రైనా
క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేస్తూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆగస్టు 15న ఇద్దరూ తమ రిటైర్మెంట్లను ప్రకటించారు. ధోనీ ప్రకటన చేసిన వెంటనే రైనా కూడా వీడ్కోలు ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలిసే దానికనుగుణంగానే ఆటకు వీడ్కోలు పలికేందుకు తాను సిద్దమయ్యాయని రైనా వెల్లడించాడు. రిటైర్మెంట్ ప్రకటన అనంతరం ఇద్దరం అప్యాయంగా కౌగిలించుకున్నామని, కన్నీళ్లు కూడా పెట్టుకున్నామని ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా చెప్పాడు. (చదవండి : ధోని రికార్డును ఏ కెప్టెన్ బ్రేక్ చేయలేరు) 'చెన్నై చేరుకోగానే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నాకు తెలుసు. దీంతో నేను కూడా సిద్దమయ్యా. నేను, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, కరణ్ శర్మ చార్టెడ్ ప్లేన్‌లో రాంచీ చేరుకున్నాం. అక్కడ ధోని, మోనూ సింగ్‌ను పిక్ చేసుకున్నాం. మా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇద్దరం ఆప్యాయంగా కౌగిలించుకున్నాం. వెక్కివెక్కి ఏడ్చాం. అనంతరం నేను, పియూష్, రాయుడు, కేదార్ జాదవ్, కరన్ అంతా కూర్చొని మా కెరీర్, వ్యక్తిగత విషయాల గురించి రాత్రంతా మాట్లాడుకున్నామ'ని రైనా చెప్పుకొచ్చాడు. (చదవండి : ఇక ధోని ఎక్కువ సమయం దానికే కేటాయిస్తాడు) అలాగే ఆగస్ట్ 15వ తేదినే ఎందుకు ఆటకు వీడ్కోలు పలికారో కూడా రైనా వివరించారు. ధోనీ జెర్సీ నంబర్ 7 అని, తన జెర్సీ నంబర్ 3 అని రెండూ కలిపితే 73 వస్తుందన్నాడు. అలాగే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదితో 73 ఏళ్లు పూర్తయ్యాయని.. అందుకే తాము అదే రోజు వీడ్కోలు ప్రకటన చేశానని రైనా వివరించాడు. -
ధోని...ధోని.. క్రికెట్ జ్ఞాని
ప్రస్తుత భారత కీలక ఆటగాళ్లంతా ధోని సారథ్యంలోనే రాటుదేలారు. వారి ప్రతిభను గుర్తించిన మహి విరివిగా అవకాశాలిచ్చాడు. భవిష్యత్ టీమిండియా కూడా పటిష్ట జట్టుగా రూపు దిద్దుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అందుకే మహి అంటే కోహ్లి, రోహిత్, రైనా తదితరులకు గుండె నిండా అభిమానమే. వీడ్కోలు పలికిన తమ గ్రేటెస్ట్ స్టార్‌కు వీరంతా ఇప్పుడు శుభాకాంక్షలు తెలిపారు. ఆల్ ద బెస్ట్ ధోని : ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అభినందనలు తెలిపింది. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్నీ మాట్లాడుడూ అతని విజయవంతమైన కెరీర్‌ను కీర్తించారు. సెకండ్ ఇన్నింగ్స్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ‘ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఎమ్మెస్ ధోని ఒకడు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో వాంఖడేలో సిక్సర్‌తో మెగా ఈవెంట్‌ను ముగించిన చిత్రం ప్రపంచ క్రికెట్ అభిమానుల మనస్సుల్లో చిరకాలం ముద్రించుకొనే ఉంటుంది. ఈ తరానికి అతనొక స్ఫూర్తి ప్రదాత. ధోని అద్భుతమైన కెరీర్‌కు ఐసీసీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అని అన్నారు. నాకు తెలుసు... నీ కళ్లు చెమ్మరిళ్లే ఉంటాయని! ‘ఆటకు అత్యుత్తమ సేవలందించిన నీకు అభినందనలు. నీ కెరీర్లో నీవు సాధించిన దానిపట్ల గర్వంగా ఉండాలి. నీ విజయాలు... వ్యక్తిత్వం... చూస్తుంటే నాకెంతో గర్వంగా వుంది. నాకు తెలుసు... నీకెంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు చెబుతుంటే నీ కళ్లు చెమ్మరిల్లే ఉంటాయని నాకు తెలుసు. ఇక నీవు ఆరోగ్యంగా, సంతోషంగా జీవితంలో ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని పోస్ట్ చేసిన సాక్షి... అమెరికా రచయిత ఎంజెలో వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా పేర్కొంది. నీవేం చెప్పావో... నీవేం చేశావో ప్రజలు మర్చిపోవచ్చు. కానీ నీవు వాళ్లని అలరించిన తీరును మాత్రం ఎప్పటికీ మరచిపోరు’ అని ఎంజెలో మాటల్ని ఉటంకించింది. ఆ రికార్డు ఎప్పటికీ చెక్కుచెదరదు భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. సారథిగా ధోని సాధించిన మూడు ఐసీసీ ట్రోఫీల రికార్డును మరో కెప్టెన్ సాధించడం కష్టమని గంభీర్ వ్యాఖ్యానించాడు. ధోని రిటైర్మెంట్పై ఒక స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో మాట్లాడిన గంభీర్... ‘ ఐసీసీకి సంబంధించిన మూడు ట్రోఫీలను ధోని సాధించాడు. ఆ రికార్డు ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటుంది. మరో కెప్టెన్ ఇలాంటి ఘనతను సాధిస్తాడని కూడా నేను అనుకోవడం లేదు. దీనిపై పందెం కాయడానికి కూడా నేను సిద్ధమే’ అని పేర్కొన్నాడు. 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచ కప్‌ను భారత్‌కు అందించిన ధోని... తర్వాత 2011లో భారతీయుల 26 ఏళ్ల ప్రపంచ కప్ కలను సాకారం చేస్తూ వన్డే ప్రపంచ కప్‌ను సాధించి పెట్టాడు. 2013లో చాంపియన్స్ ట్రోఫీని కూడా గెలిచి ఐసీసీకి సంబందించిన మూడు ట్రోఫీలను నెగ్గిన తొలి సారథిగా ధోని నిలిచాడు. ధోని సార«థ్యంలో భారత్ గెలిచిన టి20, వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో గంభీర్ తనవంతు పాత్ర పోషించాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ధోనితో కలిసి 109 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతే కాకుండా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ను అగ్రస్థానంలో కూడా నిలపడం ధోనికే సాధ్యం అయింది. వీడ్కోలు మ్యాచ్ ఉండదు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మేటి క్రికెటర్ ఎమ్మెస్ ధోని కోసం ప్రత్యేక వీడ్కోలు మ్యాచ్ నిర్వహించే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. తన 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు 39 ఏళ్ల ధోని శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ధోని ఘనతలకు గుర్తింపుగా అతనికి ప్రత్యేక వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేయాలని... దానికి అతని స్వరాష్ట్రం జార్ఖండ్‌లోని రాంచీ స్టేడియం ఆతిథ్యమిస్తుందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి విన్నవించారు. అయితే తనకు ప్రత్యేక వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేయాలని బీసీసీఐని ధోని కోరలేదని... అందుకే అతని కోసం ప్రత్యేక ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించే అవకాశం లేదని రాజీవ్ శుక్లా వివరించారు. ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్ తన 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం వీడ్కోలు పలికిన క్రికెటర్ ఎమ్మెస్ ధోనిపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తన గౌరవాన్ని చాటుకున్నాడు. రిటైర్మెంట్ కారణంగా జాతీయ జట్టు తరఫున ఇక ధోని బరిలోకి దిగే అవకాశం లేకపోయినా... ఎప్పటికీ తన మనసులో కెప్టెన్‌గా ధోనియే ఉంటాడని కోహ్లి ఆదివారం బీసీసీఐ ద్వారా విడుదల చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ‘గతంలోనూ చెప్పేవాణ్ని... ఇప్పుడూ చెబుతున్నా... ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్‌వి. జీవితంలోని కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడాలో తెలియదు. ఇప్పుడూ అలాంటి సందర్భమే వచ్చింది. టీమ్ బస్‌లో ఎల్లప్పుడూ చివరి సీటులో కూర్చున్న ఏకైక వ్యక్తివి నువ్వే. మనద్దరి మధ్య స్నేహం, సమన్వయం ఎంతో ఉంది. ఎందుకంటే జట్టు విజయం కోసం ఇద్దరం ఒకే లక్ష్యంతో పోరాడేవాళ్లం’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా... 39 ఏళ్ల ధోని వచ్చేనెల 19న యూఏఈలో మొదలయ్యే ఐపీఎల్ టి20 టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ముందుకు నడిపించనున్నాడు. ‘భారత క్రికెట్లోనే అత్యంత ప్రభావంతమైన ఆటగాడు ధోని. ఆటలో బాటలో అతని మార్గదర్శనం మమ్మల్ని నడిపించింది. దూరదృష్టి గల ఈ నాయకుడికి భవిష్యత్ అవసరాల కోసం జట్టును ఎలా నిర్మించాలా బాగా తెలుసు. ఇంతటి మేటి క్రికెటర్‌తో బ్లూ జెర్సీలో కలిసి ఆడకపోయినా... యెల్లో జెర్సీలో ప్రత్యర్థిగా పోటీ పడేఅవకాశముంది. కెప్టెన్... 19న ముంబై, చెన్నైల మధ్య జరిగే మ్యాచ్‌లో టాస్ దగ్గర కలుద్దాం’ – రోహిత్ శర్మ ‘మిస్టర్ కూల్’ గరం గరం ధోని అంటే ‘బెస్ట్ ఫినిషర్’, ‘మిస్టర్ కూల్’, ‘మేధావి కెప్టెన్’... అతని సుదీర్ఘ కెరీర్ ఇవే ఎక్కువగా గుర్తుకొస్తాయి. కానీ ఈ డీఆర్ఎస్ దిట్టకు ఒకసారి ఆపుకోలేనంత కోపమొచ్చింది ఐపీఎల్లో. అందుకే గీత దాటాడు. మిన్నువిరిగి మీద పడ్డా... అచంచల విశ్వాసంతో, నింపాదిగా ఉండే ధోని గత లీగ్‌లో ఏకంగా మైదానంలోకి చొచ్చుకొచ్చాడు. ఫీల్డు అంపైర్లతో వాదించాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టోక్స్ చివరి ఓవర్లో ఫుల్‌టాస్ బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించి అప్పుడే సవరించుకున్నాడు. వెంటనే ధోని ఇదేంటని కల్పించుకున్నాడు. అంపైర్లతో ఎన్నడూ లేని విధంగా వాదనకు దిగాడు. తదనంతరం ధోని మ్యాచ్ ఫీజులో కోతకు గురయ్యాడు. అప్పటి సంఘటనను అంపైర్ గాంధీ గుర్తుచేసుకున్నాడు. అప్పుడు అంపైరింగ్ తప్పు... ధోనిదీ తప్పు అని అన్నాడు. -
థాంక్యూ మహి...
-
రిటైర్మెంట్ ప్రకటించిన సురేశ్ రైనా
-
అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్రసింగ్ ధోని గుడ్‌బై
-
రాముడి బాటలో లక్ష్మణుడు...
చెన్నై: భారత క్రికెట్లో ధోని, సురేశ్ రైనాలది ప్రత్యేక అనుబంధం...కెరీర్ ఆరంభంనుంచి రైనాకు ధోని అండగా నిలవగా, వారిద్దరి మధ్య ఆత్మీయతకు క్రికెట్ వర్గాలు రామలక్ష్మణులుగా పేరు పెట్టాయి. ఇప్పుడు రైనా కూడా ఆటకు వీడ్కోలు పలికే విషయంలో అన్ననే అనుసరించాడు. నేనూ నీకు తోడుగా వస్తానంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోని గుడ్‌బై చెప్పిన కొద్ది సేపటికే అతని సహచరుడు రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘నీతో కలిసి ఆడినంత కాలం ఆప్యాయంగా అనిపించింది ధోని... అభిమానం నిండిన హృదయంతో చెబుతున్నా... నేనూ నీ ప్రయాణంలో భాగం కావాలని నిర్ణయించుకున్నా. థ్యాంక్యూ ఇండియా. జైహింద్’ అని సురేశ్ రైనా తన రిటైర్మెంట్ సందేశాన్ని ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వచ్చే నెలలో యూఏఈలో జరిగే ఐపీఎల్ టి20 టోర్నీలో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున రైనా ఆడనున్నాడు. ♦ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల రైనా 2005 జూలై 30న దంబుల్లాలో శ్రీలంకపై తొలి వన్డే ఆడాడు. 2018 జూలై 17న లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై రైనా చివరిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ♦ తన 13 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టి20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో కలిపి 768 పరుగులు... వన్డేల్లో 5 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలతో కలిపి 5,615 పరుగులు... టి20ల్లో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలతో కలిపి 1,605 పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రైనా ఘనత వహించాడు. చురుకైన ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన రైనా తన కెరీర్ మొత్తంలో 167 క్యాచ్‌లు (టెస్టుల్లో 23+వన్డేల్లో 102+టి20ల్లో 42) తీసుకున్నాడు. ♦ ధోని మాదిరిగానే రైనా కూడా తన అరంగేట్రం వన్డేలో ‘డకౌట్’ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని చక్కని ఇన్నింగ్స్ ఆడి జట్టులో నిలదొక్కుకున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో రైనా సభ్యుడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో (28 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్); పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్లో (39 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు) రైనా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ♦ తన అంతర్జాతీయ కెరీర్లో రైనా వన్డేల్లో రెండుసార్లు (2013లో ఇంగ్లండ్‌పై; 2014లో ఇంగ్లండ్‌పై)... టి20ల్లో ఒకసారి (2010లో జింబా బ్వేపై) ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు గెల్చు కున్నాడు. వన్డేల్లో 12 సార్లు... టి20ల్లో మూడు సార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు అందుకున్నాడు. -
మహేంద్రుడి మాయాజాలం
‘19:29 గంటల సమయం నుంచి నన్ను రిటైర్ అయినట్లుగా పరిగణించగలరు’... వీడ్కోలు చెబుతున్నప్పుడు కూడా అందరికంటే అదే భిన్నమైన శైలి. లేదంటే ఈ తరహాలో ఎవరైనా ఇలా ప్రకటించినట్లు మీకు గుర్తుందా! ధోనిపై ఇప్పటికే ఒక బయోపిక్ వచ్చేసింది. అయినా సరే అంతకు మించి మరో సినిమాకు సరిపడే డ్రామా అతని కెరీర్లో ఉంది. ఎక్కడో వెనుకబడిన రాంచీనుంచి వచ్చిన నేపథ్యం... రైల్వేలో టికెట్ ఇన్స్పెక్టర్గా పని చేయడం... ఆ తర్వాత అనూహ్యంగా అంది వచ్చిన అవకాశం... జులపాల జుట్టుతో టార్జాన్ లుక్...బెదురు లేని బ్యాటింగ్, భీకర హిట్టింగ్...కొద్ది రోజులకే కెప్టెన్‌గా మారి టి20 ప్రపంచ కప్ గెలిపించడం... ఇలా ధోని కథలో ఆసక్తికర మలుపులెన్నో. గణాంకాలను అందని ఘనతలెన్నో... బ్యాట్స్‌మన్‌గా అద్భుత టెక్నిక్ లేకపోయినా...వికెట్ కీపింగ్ సాంప్రదాయ శైలికి భిన్నంగా ఉన్నా తను మారలేదు, మారే ప్రయత్నం చేయలేదు. అదే ధోనిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. వన్డే బ్యాట్స్‌మన్‌గా పది వేలకు పైగా పరుగులు సాధించినా... ధోని అందరి మదిలో ‘కెప్టెన్ కూల్’గానే ఎక్కువగా నిలిచిపోయాడు. అతని నాయకత్వ లక్షణాలు భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించాయి. 2007లో టి20 ప్రపంచ కప్, ఆ తర్వాత భారత అభిమానులంతా కలలు గన్న వన్డే వరల్డ్ కప్ (2011)లతో తన ఘనతను లిఖించుకున్న ఎమ్మెస్ 2013లో చాంపియన్ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిపోయాడు. మైదానంలో ధోని కెప్టెన్సీ ప్రతిభకు ఉదాహరణగా నిలిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యర్థి జట్లపై వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో, ఎక్కడా సంయమనం కోల్పోకుండా మైదానంలో ప్రశాంతంగా జట్టును నడిపించడంలో అతనికి అతనే సాటి. 5 ఏప్రిల్ 2005...మన విశాఖపట్నంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ధోని సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది. 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో పాక్‌పై అతను చేసిన 148 పరుగులకు ప్రపంచం ఫిదా అయిపోయింది. అప్పటినుంచి ఆ బ్యాట్నుంచి ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు జాలువారాయి. అదే ఏడాది జైపూర్‌లో ఏకంగా 10 సిక్సర్లతో విరుచుకు పడి అజేయంగా చేసిన 183 పరుగులు కెరీర్లో అత్యుత్తమంగా నిలిచిపోగా...మరెన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు మహిని మన మనసుల్లో నిలిచిపోయేలా చేశాయి. ఒక వీడ్కోలు మ్యాచ్ కావాలని... ఆఖరి రోజు మైదానంలో సహచరుల జయజయధ్వానాల మధ్య తప్పుకోవాలనే కోరికలు ధోనికి ఎప్పుడూ లేవు. అతను ఏదో రోజు నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాడని అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే జరిగింది. టెస్టులనుంచి రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఏకవాక్యంతో అతను తన అంతర్జాతీయ ఆటను ముగించాడు. అందుకు ఈ ‘లెఫ్టినెంట్ కల్నల్’ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంచుకున్నాడు. ఇక అతని మెరుపులు ఐపీఎల్‌లోనే చూసేందుకు సిద్ధం కండి! 2008, 2009లలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు సాధించాడు. వరుసగా రెండేళ్లు ఈ అవార్డు గెల్చుకున్న తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఘనతలు, అవార్డులు ► 2007లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ అందుకున్నాడు. ► 2009లో దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’... 2018లో దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ భూషణ్’ అందుకున్నాడు. ధోని ఫినిషర్ 66 విజయవంతమైన లక్ష్య ఛేదనలో 66 సార్లు నాటౌట్‌గా నిలిచాడు (47 వన్డేల్లో; 15 టి20ల్లో; 4 టెస్టుల్లో) 43 మ్యాచ్‌లో 43 సార్లు విన్నింగ్ రన్స్ కొట్టాడు (30 వన్డేల్లో; 10 టి20ల్లో; 3 టెస్టుల్లో) 13 మ్యాచ్‌ను 13 సార్లు సిక్సర్‌తో ముగించాడు (9 వన్డేల్లో; 3 టి20ల్లో; ఒకసారి టెస్టులో) ధోని కెప్టెన్సీ రికార్డు ఆడిన వన్డేలు: 200, గెలిచినవి: 110, ఓడినవి: 74; టై: 5, ఫలితం రానివి: 11 ఆడిన టెస్టులు: 60, గెలిచినవి: 27, ఓడినవి: 18; డ్రా: 15 ఆడిన టి20లు: 72, గెలిచినవి: 42, ఓడినవి: 28 ధోని పేరిట ప్రపంచ రికార్డులు... ► వన్డేల్లో అత్యధికసార్లు నాటౌట్‌గా నిలిచిన ప్లేయర్ (84) ► వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ (183 నాటౌట్) ► వన్డేల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన కీపర్ (123) ► అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన కీపర్ (195) ► అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్ (332 మ్యాచ్‌లు) ► టి20 ప్రపంచకప్ చరిత్రలో ఒక జట్టుకు అత్యధికంగా ఆరుసార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక ప్లేయర్ (6 సార్లు; 2007, 2009, 2010, 2012, 2014, 2016). ► ‘అద్భుత కెరీర్ ముగించిన ఎమ్మెస్ ధోనికి అభినందనలు. మీరు వదిలి వెళుతున్న క్రికెట్ వారసత్వం క్రికెట్ ప్రేమికులు, ఔత్సాహికులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. భవిష్యత్తులో అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా’ – వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ► ‘భారత క్రికెట్‌కు నువ్వు అందించిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివి. నీతో కలిసి 2011 వరల్డ్ కప్ సాధించిన నా జీవితంలో మధుర ఘట్టం. నీ రెండో ఇన్నింగ్స్ బాగా సాగాలని కోరుకుంటున్నా’ – సచిన్ టెండూల్కర్ ► ‘ప్రతీ క్రికెటర్ ఏదో ఒక రోజు తన ప్రయాణం ముగించాల్సిందే. అయితే నీకు అత్యంత ఆత్మీయులు అలా చేసినప్పుడు భావోద్వేగాలు సహజం. నీవు దేశానికి చేసింది ప్రతీ ఒక్కరి మదిలో గుర్తుండిపోతుంది. కానీ మన మధ్య పరస్పర గౌరవం నా హృదయంలో నిలిచిపోయింది. ఈ ప్రపంచం ఎన్నో ఘనతలను చూసింది. అయితే దాని రూపాన్ని నేను చూశాను’ –విరాట్ కోహ్లి ► ‘భారత క్రికెట్లో ఒక శకం ముగిసింది. ప్రపంచ క్రికెట్లో అతనో అద్భుతమైన ఆటగాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతని నాయకత్వ లక్షణాలకు మరెవరూ సాటి రారు. వన్డేల్లో అతని బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే’ – సౌరవ్ గంగూలీ ► ‘ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ధోని కెరీర్ ముగిస్తున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ సహచరుడిగా నీలాంటి ప్రొఫెషనల్‌తో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవం. భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలిచిన ధోనికి సెల్యూట్’ –రవిశాస్త్రి ► ‘ధోని లాంటి ఆటగాడు రావడం అంటే మిషన్ ఇంపాజిబుల్. ఎమ్మెస్ లాంటి వాడు గతంలోనూ, ఇప్పుడూ లేరు. ఇంకెప్పుడూ రారు. ఆటగాళ్లంతా వచ్చి పోతుంటారు కానీ అతనంత ప్రశాంతంగా ఎవరూ కనిపించరు. ఎందరో క్రికెట్ అభిమానుల కుటుంబ సభ్యుడిగా ధోని మారిపోయాడు. ఓం ఫినిషాయనమ’ –వీరేంద్ర సెహ్వాగ్ ► ‘గొప్ప కెరీర్‌ను ముగించినందుకు ధోనికి నా అభినందనలు. నీతో కలిసి ఆడటం నాకూ గౌరవకారణం. నాయకుడిగా నీ ప్రశాంత శైలితో అందించిన విజయాలు ఎప్పటికీ మధురానుభూతులే’ – అనిల్ కుంబ్లే ► ‘చిన్న పట్టణంనుంచి వచ్చి మ్యాచ్ విన్నర్‌గా, గొప్ప నాయకుడిగా ఎదిగిన ధోని ప్రయాణం అద్భుతం. నువ్వు అందించిన జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. నీతో కలిసి ఆడిన క్షణాలు ఎప్పటికీ మరచిపోలేను’ –వీవీఎస్ లక్ష్మణ్ -
రిటైర్మెంట్ ప్రకటించిన మిస్టర్ కూల్..
‘మిస్టర్ కూల్’ మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించడు... భారత క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి చేర్చిన నాయకుడిని ఇక అంతర్జాతీయ ఆటలో చూసే అవకాశం మళ్లీ రాదు... అద్భుత విజయాలు సాధించినా, పరాజయపు అవమానాలు ఎదుర్కొన్నా ఒకే తరహాలో స్థితప్రజ్ఞత చూపించిన మహేంద్ర సింగ్ ధోని తన ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించాడు. 16 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో ధోని తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఏడాది కాలంగా అతను జట్టుకు దూరంగా ఉంటూ ఏ స్థాయి క్రికెట్లో కూడా ఆడలేదు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్ ఆడవచ్చని ఇటీవలి వరకు వినిపించినా...కరోనా కారణంగా ఈ టోర్నీ ఏడాది పాటు వాయిదా పడటంతో ఇక తప్పుకునేందుకు సరైన సమయంగా ఎమ్మెస్ భావించాడు. ఇప్పుడు ఐపీఎల్ మాత్రం మహి మెరుపులు చూసేందుకు అవకాశం ఉంది. 350 వన్డేల్లో ధోని 50.57 సగటుతో 10,773 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 98 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లలో 37.60 సగటుతో అతను 1,617 పరుగులు చేశాడు. 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో వన్డే చాంపియన్స్ ట్రోఫీని గెలిపించిన ధోని మూడు ఐసీసీ టోర్నీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలవడం విశేషం. ధోని 2014 డిసెంబర్లోనే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఏడాది విరామమిచ్చి... గత సంవత్సర కాలంలో ధోని రిటైర్మెంట్పై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. వన్డే ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత అతను మళ్లీ క్లబ్ స్థాయి క్రికెట్ కూడా ఆడలేదు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌నుంచి తప్పుకోవడంపై తన వైపు నుంచి ఎలాంటి స్పష్టత లేకపోగా సెలక్టర్లు కూడా నేరుగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటవేత ధోరణిని అవలంబించారు. ఆ సమయంలో పరిస్థితి చూస్తే అతను కచ్చితంగా ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచ కప్ ఆడతాడని అనిపించింది. కెప్టెన్ కోహ్లి మాటలు వింటున్నప్పుడు కూడా వరల్డ్ కప్‌లో ధోని అనుభవం అక్కరకు వస్తుందనే భావం కనిపించింది. అయితే కరోనా వచ్చి అంతా మార్చేసింది. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో యూఏఈలో ఐపీఎల్ జరుగుతున్నా... దాని వల్ల ధోనికి వ్యక్తిగతంగా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. టి20 వరల్డ్ కప్ 2021 నవంబర్‌కు వాయిదా పడింది. అప్పటి వరకు అంటే సంవత్సర కాలం పాటు ఆటను, ఫిట్నెస్ను కాపాడుకోవడంతో పాటు టీమిండియా సభ్యుడిగా ఉండే ఒత్తిడిని ఎలాగూ భరించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆటగాడిగా ధోని కొత్తగా సాధించాల్సిన విజయాలు, అందుకోవాల్సిన లక్ష్యాలులాంటివి ఏమీ లేవు. సరిగ్గా చూస్తే గత సంవత్సర కాలంలో ఎప్పుడైనా ధోని రిటైర్ కావచ్చని వినిపించింది. కానీ అతను మాత్రం తనదైన శైలిలో చివరి బంతి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లినట్లుగా ఇప్పుడు అధికారికంగా రిటైర్మెంట్ను ప్రకటించాడు. రనౌట్‌తో మొదలై రనౌట్‌తో ముగించి... చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడిన తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన ధోని ఒకే ఒక బంతిని ఎదుర్కొని ‘సున్నా’కే రనౌట్‌గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్‌తో ఆడిన ఆఖరి వన్డేలో కూడా 50 పరుగులు చేసిన అనంతరం గప్టిల్ అద్భుత త్రోకు అతను రనౌట్ అయ్యాడు. -
ధోని ఆంతర్యం ఏమిటో ?
సాక్షి క్రీడా విభాగం: మ్యాచ్‌లో ఉత్కంఠను తారా స్థాయికి తీసుకెళ్లి ఆఖరి బంతి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టి చివరకు భారీ షాట్‌తో గెలిపించడం మహేంద్ర సింగ్ ధోనికి ‘ఐస్’తో పెట్టిన విద్య. ఎవరి అంచనాలకు అందకుండా నిర్ణయాలు తీసుకోవడం అతనికి అలవాటైన ఆట. అనూహ్య ఆలోచనలు, వ్యూహాలు అతనికి కొత్త కాదు. అభిమానులను అలరిస్తూ అరుదైన విజయాలు అందించినా... అవమానకర పరాజయాల్లో కూడా అదే నిగ్రహాన్ని ప్రదర్శించినా అది ధోనికే చెల్లింది. కొందరి దృష్టిలో అతనో అద్భుతమైతే మరికొందరి దృష్టిలో అతనో ‘సుడిగాడు’ మాత్రమే. అయితే ఎవరేమనుకున్నా భారత క్రికెట్లో ధోని ఒక అద్భుతం. ‘నేను సిరీస్ గెలిచినా ఓడినా నా ఇంట్లో పెంపుడు కుక్కలు నన్ను ఒకే తరహాలో చూస్తాయి’ అంటూ విమర్శకులకు ఘాటుగా జవాబిచ్చినప్పుడు ‘మిస్టర్ కూల్’లోని మరో రూపం బయటకు వస్తుంది. ఓటమికి కారణాలు విశ్లేషించమని కోరినప్పుడు ‘మీరు చనిపోవడం ఖాయమైనప్పుడు ఎలా చస్తే ఏం. అది కత్తితోనా, తుపాకీతోనా అని అడిగితే ఎలా’ అన్నప్పుడు అతనిలో వ్యంగ్యం వినిపిస్తుంది. కెరీర్ ఆరంభం నుంచి ధోని ధోనిలాగే ఉన్నాడు. ఎవరి కోసమో అతను మారలేదు. ధోని పేరు ప్రఖ్యాతులను పట్టించుకోలేదు. కానీ అవే అంగవస్త్రాల్లా అతని వెంట నడిచాయి. తాను బ్యాట్స్‌మన్‌గా ఆటలో ఎంతో నేర్చుకున్నాడు. అవసరానికి అనుగుణంగా తనను తాను మార్చుకున్నాడు. అంతే కానీ తన బ్యాటింగ్ శైలి బాగుండకపోవడం గురించి ఎప్పుడూ చింతించలేదు. కీపింగ్ శైలి కూడా ఇంటి ఆవరణలో తనకు తాను నేర్చుకున్నదే తప్ప కోచింగ్ సెంటర్లో కుస్తీలు పట్టడం వల్ల రాలేదు. కానీ అదే అతనికి కీర్తి కనకాదులు తెచ్చి పెట్టింది. నాయకత్వ ప్రతిభ కవచ కుండలాల్లా ధోనితో కలిసిపోయింది. ఫలితంగా ఎన్నో అరుదైన ఘనతలు, గొప్ప విజయాలు, మరెన్నో రికార్డులు. మహేంద్రుడి సారథ్యం మన క్రికెట్‌పై చెరగని ముద్ర వేసింది. 2019 జూలై 9న ప్రపంచకప్ సెమీఫైనల్లో ధోని తన ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఇప్పుటికి సరిగ్గా ఏడాదవుతోంది. ఆ తర్వాత అతను కనీసం స్థానిక మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. రేపు నిజంగా ఏదైనా సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేయాల్సి వస్తే ఈ సంవత్సరపు విరామాన్ని సెలక్టర్లు ఎలా చూస్తారు. ఎంత గొప్ప ధోని అయినా అసలు ఇంత కాలం ఆడకుండా అతడిని నేరుగా జాతీయ జట్టులోకి తీసుకురాగలరా అనేదానిపై కూడా తీవ్ర చర్చ జరుగుతూనే ఉంది. ఎమ్మెస్ తనంతట తానుగా ఏదైనా చెబితే తప్ప ఏదీ తెలీదు. అయినా ధోని నిజంగా తప్పుకోవాలనుకుంటే ముహూర్తాలు, పుట్టిన రోజు సందర్భాలు చూసుకునే రకం కాదు. భవిష్యత్తు ఎలా ఉన్నా క్రికెట్ అభిమానులకు ఎమ్మెస్ పంచిన మధుర జ్ఞాపకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పరుగులు, గణాంకాల గురించి కాసేపు పక్కన పెడితే ‘ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్‌స్టయిల్’ అనే కేక మీ చెవుల్లో ఎప్పటికీ మారు మోగిపోతూనే ఉంటుంది. ఎంత గొప్ప ప్రయాణమైనా ఎక్కడో ఒక చోట ముగిసిపోవాల్సిందే. కానీ ఇప్పుడు ధోని క్రికెట్ పరుగు పిచ్ మధ్యలో ఆగిపోయింది. ఏదో ఒక ఎండ్‌కు చేరుకోకుండా ఒక రకమైన గందరగోళ స్థితిలో ఉంది. నిస్సందేహంగా మాహికి ఆటపై పిచ్చి ప్రేమ ఉంది. కానీ కనుచూపు మేరలో క్రికెట్ కనిపించని వేళ అతని ఆలోచనలేమిటో కనీసమాత్రంగా కూడా ఎవరూ ఊహించలేరు. తన ఆంతర్యం ఏమిటో బయట పెట్టడు. తన మౌన ముద్రను వీడి మాట్లాడడు. బాహ్య ప్రపంచానికి దూరంగా తన మానాన తాను ఫామ్ హౌస్‌లో కుటుంబంతో, పెంపుడు కుక్కలతో ఆడుకోవడం మినహా క్రికెట్ గురించి పట్టించుకోడు. ఐపీఎల్ కోసం మొదలు పెట్టిన సాధన కరోనా దెబ్బతో ఆగిపోయింది. అక్కడ ఆడితే అనుభవం కోసమైనా ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్‌కు వెళ్లవచ్చని అంతా అనుకున్నారు. కానీ అటు ఐపీఎల్ లేదు ఇటు ప్రపంచకప్ సంగతి దేవుడెరుగు. అనుభవాన్ని, అందించిన విజయాలను గౌరవిస్తూ గత సెలక్షన్ కమిటీ విశ్రాంతి అంటూనో, మరో కారణం చెప్పో అధికారికంగా వేటు మాట చెప్పలేకపోయింది. బోర్డులో మరెవరూ ధోని ఆట ముగిసిందని చెప్పే సాహసం చేయలేదు. గంగూలీ కూడా నాకు అతని భవిష్యత్తు గురించి అంతా తెలుసు అంటాడే తప్ప ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని కచ్చితంగా చెప్పడు. కోచ్ రవిశాస్త్రితోనో, కోహ్లి నోటి వెంటనో ధోనికి ఆసక్తి తగ్గిందన్నట్లుగా పరోక్ష సంకేతాలే వస్తాయి తప్ప ఆట ముగిసిపోయిందని స్పష్టంగా ఎవరూ ఏమీ చెప్పరు. కొత్త సెలక్షన్ కమిటీకి ఇంకా ఇప్పటి వరకు పని చేయాల్సిన అవసరమే రాలేదు. -
ధోని సహాయం చేసే స్టయిలే వేరు: పంత్
న్యూఢిల్లీ: వర్ధమాన క్రీడాకారులకు సహాయం చేయడంలోనూ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రత్యేక పద్ధతి ఉందని యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. సమస్య పరిష్కారానికి పలు విధానాలను సూచించే ధోని... చివరకు ఆ సమస్యను మనమే పరిష్కరించుకునేలా చేస్తాడని ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొ న్న పంత్ చెప్పుకొచ్చాడు. మైదానంలోనూ, బయట ధోనినే తన మెంటార్ అని తెలిపాడు. ‘ధోని నా గురువు. ఆటలో లేదా వ్యక్తిగతంగా ఏ సమస్య వచ్చినా నేను మహీ భాయ్‌ని సంప్రదిస్తా. అప్పుడు ధోని నా సమస్యకు పూర్తి పరిష్కారం చెప్పకుండా దాన్నుంచి బయటపడే అన్ని మార్గాలను సూచిస్తాడు. ఎందుకంటే నేను పూర్తిగా ఎవరిపై ఆధారపడకూడదనేది అతని అభిమతం. క్రీజులో కూడా మహీ భాయ్ ఉంటే అంతా సవ్యంగా జరిగిపోతుంది. అతని భాగస్వామ్యం చాలా ఇష్టం. కానీ మేమిద్దరం కలిసి బ్యాటింగ్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది’ అని రిషభ్ చెప్పాడు. -
ఏం చూసి ఎంపిక చేస్తారు?
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో కనిపించకపోయినా ఏడాది కాలంగా వార్తల్లో మాత్రం కచ్చితంగా ఉంటున్నాడు. అతను తనంతట తానుగా ఏమీ చెప్పకపోయినా, సెలక్టర్ల ఉద్దేశం బయటకు తెలియకపోయినా అతని రిటైర్మెంట్పై చర్చ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి అతని మాజీ సహచరుడు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బాగా ఆడితే ధోని భారత జట్టులోకి పునరాగమనం చేసే అవకాశం ఉందంటూ కోచ్ రవిశాస్త్రి సహా పలువురు చెప్పిన నేపథ్యంలో గంభీర్ ఈ మాటలు అన్నాడు. ధోని 2019 జూలైలో వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ తర్వాత ఇప్పటి వరకు మరో మ్యాచ్ ఆడలేదు. ‘ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే మళ్లీ జట్టులోకి చోటు దక్కించుకోవడం ధోనికి చాలా చాలా కష్టమవుతుంది. భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలంటే ఒక ఆటగాడు తన సత్తాతో జట్టును గెలిపించగలిగే స్థితిలో ఉండాలి. రిటైర్మెంట్ అన్నది అతని వ్యక్తిగత నిర్ణయం కావచ్చు. కానీ ధోని మ్యాచ్ ఆడి దాదాపు సంవత్సరం అవుతోంది. మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగుతాడో తెలీదు. ఇలాంటప్పుడు అసలు ఏ ప్రదర్శన ఆధారంగా అతడిని జట్టులోకి ఎంపిక చేస్తారు’ అని గంభీర్ సూటిగా ప్రశ్నించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ను తీసుకుంటే తన దృష్టిలో లోకేశ్ రాహుల్ మాజీ కెప్టెన్ ధోనికి సరైన ప్రత్యామ్నాయం కాగలడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. రాహుల్ చక్కటి బ్యాట్స్‌మన్ కావడంతో పాటు సమర్థంగా కీపింగ్ చేస్తూ 3 లేదా 4 స్థానాల్లో బ్యాటింగ్ చేయగలగడం జట్టుకు మేలు చేస్తుందని అతను సూచించాడు. ధోనితో పోలిస్తే అద్భుతమైన కీపర్ కాకపోయినా, టి20 ఫార్మాట్లో రాహుల్ సరిగ్గా సరిపోతాడని భారత మాజీ ఓపెనర్ ప్రశంసించాడు. ఐపీఎల్లో మరో రెండేళ్లు.. ధోని మళ్లీ భారత్‌కు ఆడతాడో లేదో చెప్పలేకపోయినా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీలో అతను చెన్నై సూపర్ కింగ్స్‌కు వచ్చే రెండేళ్లు కూడా ఆడే అవకాశం ఉందని మరో మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా చెన్నై జట్టును నడిపించడాన్ని ధోని ఆస్వాదిస్తాడని లక్ష్మణ్ అన్నాడు. ‘చెన్నైకి ఆడటం ధోనికి ఎప్పుడైనా ఉత్సాహానిస్తుంది. అతని ఫిట్నెస్ అద్భుతంగా ఉండటమే కాదు, మానసికంగా కూడా దృఢంగా ఉంటాడు. వయసనేది అసలు సమస్యే కాదు. సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించడాన్ని అతను బాగా ఇష్టపడతాడు. మనందరం కూడా ఐపీఎల్లో ధోనిని చూడాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరమే కాదు, కనీసం మరో రెండేళ్లు ఐపీఎల్ ఆడిన తర్వాతే అతను తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాడు. ఇక భారత జట్టుకు ఆడటం గురించి అతను ఈపాటికే తన మనసులో మాటను కెప్టెన్, కోచ్‌కు చెప్పేసి ఉంటాడనేది నా భావన’ అని హైదరాబాదీ స్టయిలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ అభిప్రాయపడ్డాడు. మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇదే విషయంపై స్పందిస్తూ... ‘నాకు తెలిసి ధోని ఇప్పటికే భారత్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడేశాడు. అతను అనధికారికంగా రిటైర్ అయినట్లే. ఏదైనా హడావుడి లేకుండా చేయడమే ధోని శైలి. కాబట్టి వీడ్కోలు మ్యాచ్ కావాలని, ఘనంగా రిటైర్మెంట్ ప్రకటించాలని అతను కోరుకోడు. తాను ఇకపై టీమిండియాకు ఆడబోనని నిర్ణయించేసుకొని ఉంటాడు. ఈ ఒక్కసారి టి20 ప్రపంచకప్ కోసం నీ సేవలు కావాలని ఏ గంగూలీయో, కోహ్లినో, రవిశాస్త్రి స్థాయివారో మాట్లాడి ఒప్పిస్తే తప్ప అతను మళ్లీ బరిలోకి దిగకపోవచ్చు’ అని వ్యాఖ్యానించాడు. -
కెప్టెన్లుగా కోహ్లి, ధోని
మెల్బోర్న్: గత పదేళ్ల అంతర్జాతీయ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటూ ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు (సీఏ) అధికారిక వెబ్సైట్ ఈ దశాబ్దపు టెస్టు, వన్డే జట్లను ప్రకటించింది. ఇందులో పలువురు ఆ్రస్టేలియన్లను వెనక్కి నెట్టి వన్డే జట్టు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని, టెస్టు జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లి ఎంపిక కావడం విశేషం. గత పదేళ్ల కాలంలో 70 అంతర్జాతీయ సెంచరీలు చేసిన కోహ్లి 50కు పైగా సగటుతో అన్ని ఫార్మాట్లలో కలిపి 21,444 పరుగులు సాధించాడు. ఆసీస్ గడ్డపైనే కోహ్లి 6 టెస్టు సెంచరీలు, 3 వన్డే సెంచరీలు చేయడం విశేషం. 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపిన ధోనికి వన్డే కెప్టెన్ గా గుర్తింపు దక్కింది. cricket.com.au ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ జట్ల జాబితా: టెస్టులు: కోహ్లి (కెప్టెన్), అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, బెన్ స్టోక్స్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, నాథన్ లయన్, జేమ్స్ అండర్సన్ వన్డేలు: ధోని (కెప్టెన్), రోహిత్, ఆమ్లా, కోహ్లి, డివిలియర్స్, షకీబ్, బట్లర్, రషీద్ ఖాన్, మిషెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ టెస్టుల్లోనూ నంబర్‌వన్‌గా... ఏడాదిని ముగించిన కోహ్లి దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లోనూ అగ్రస్థానంతో 2019ని ముగించాడు. ఐసీసీ ప్రకటించిన తాజా బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌ల్లో కోహ్లి (928 పాయింట్లు) తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆ్రస్టేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ (911)కంటే కోహ్లి 17 పాయింట్లు ముందంజలో నిలిచాడు. కేన్ విలియమ్సన్ (864)కు మూడో స్థానం దక్కింది. ఇతర భారత బ్యాట్స్‌మెన్‌లో చతేశ్వర్ పుజారా (4వ స్థానం), అజింక్య రహానే (7వ స్థానం)లకు టాప్–10లో చోటు లభించగా, మయాంక్ 12వ, రోహిత్ 15వ స్థానంలో నిలిచారు. ప్యాట్ కమిన్స్ (ఆ్రస్టేలియా) నంబర్‌వన్‌గా ఉన్న బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రాకు ఆరో స్థానం దక్కింది. ఆల్రౌండర్లలో జేసన్ హోల్డర్ (వెస్టిండీస్) అగ్రస్థానం సాధించగా, రవీంద్ర జడేజా (భారత్) రెండో ర్యాంక్‌తో 2019ని ముగించాడు. -
ధోనీ ఆడాలనుకుంటే ఎవరూ ఆపలేరు..
న్యూఢిల్లీ: ఎంఎస్ ధోని భవిష్యత్తుపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవిశాస్త్రి మాట్లాడుతూ.. ధోనీ 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదని అన్నారు. రెండు వారాల పాటు మిలిటరీలో శిక్షణ తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. విరామం తర్వాత ధోని శరీరం సహరిస్తుందో లేదో అతనికే తెలియాలన్నారు. వెటరన్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలో జరిగే టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా రిషబ్ పంత్ లాంటి యువ క్రికెటర్లకు అవకాశమివ్వనున్నట్లు టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని రవిశాస్త్రి గుర్తు చేశారు. ఇప్పటి వరకు 94టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు ఎంత మంది రిటైరయ్యారని విలేకర్లను ప్రశ్నించారు. ధోనీ 2020 ఐపీఎలో ఆడుతాడని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధోనీ ప్రశాంత మనస్సుతో సాధన చేస్తే రాబోయే టీ20వరల్డ్ కప్‌లో అతన్ని ఎవరూ ఆపలేరని రవిశాస్త్రి స్పష్టం చేశారు. ఐపీఎల్లో గమనించినట్లయితే మిడిల్ ఆర్డర్లో అద్భుత నైపుణ్యమున్న క్రికెటర్లు దేశంలో ఎందరో ఉన్నారని రవిశాస్త్రి అన్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ప్రచారంలో పోల్గొన్న ధోనిని విలేకర్లు పలు ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానం చెప్పటానికి ఆయన సుముఖత తెలుపలేదు. ఆ ప్రశ్నలను సున్నితంగా తిరస్కరిస్తూ.. తనను జనవరి 2020వరకు ఏమీ అడగవద్దని అన్నారు. -
జనవరి వరకు అడగొద్దు
ముంబై: వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్ తర్వాత భారత జట్టుకు దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెరీర్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అతని రిటైర్మెంట్ లేదా ఆటలో కొనసాగడంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై ధోని మొదటిసారి స్వయంగా స్పందించాడు. అదీ ఏకవాక్యంలో! పునరాగమనం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ...‘జనవరి వరకు నన్నేమీ అడగొద్దు’ అని తేల్చేశాడు. బుధవారం ‘పనెరై’ అనే వాచీ కంపెనీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ధోని తన కెరీర్‌కు సంబంధించిన రెండు అత్యుత్తమ క్షణాలను పంచుకున్నాడు. ‘సుదీర్ఘ కెరీర్లో రెండు సంఘటనలు నా మనసుకు అత్యంత చేరువగా నిలిచాయి. అలాంటివి మళ్లీ రావు. 2007 టి20 ప్రపంచ కప్ గెలిచి స్వదేశం తిరిగొచ్చిన తర్వాత ముంబైలో ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు జరిగింది. ఆ సమయంలో ప్రఖ్యాత మెరైన్ డ్రైవ్ ఈ మూల నుంచి ఆ మూల వరకు పూర్తిగా నిండిపోయింది. తమ పనులన్నీ వదిలేసుకొని వారంతా మా కోసం వచ్చారు. వారి కళ్లలో ఎంతో ఆనందం కనిపించింది. ఇక 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విజయానికి 1520 పరుగుల దూరంలో ఉన్నప్పుడు స్టేడియంలో ప్రేక్షకులు వందేమాతరం నినాదంతో హోరెత్తించారు’ అని ధోని గుర్తు చేసుకున్నాడు. భార్య సంతోషమే నా సంతోషం! కెప్టెన్‌గా తాను ఎన్ని విజయాలు సాధించినా ఇంట్లో మాత్రం భార్య సాక్షి మాటే చెల్లుబాటు అవుతుందని ధోని సరదాగా వ్యాఖ్యానించాడు. వయసుతో పాటు భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత దృఢమవుతుందని అతను అభిప్రాయపడ్డాడు. ‘పెళ్లయ్యేంత వరకు అందరు మగాళ్లు సింహాల్లాగే ఉంటారు. నేను ఆదర్శవంతమైన భర్తను. ఎందుకంటే నా భార్య ఏం చేయాలనుకున్నా నేను అడ్డు చెప్పను. నా భార్య సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. అది జరగాలంటే ఆమె ఏం చెప్పినా నేను తలూపాల్సిందే. నా దృష్టిలో 50 ఏళ్ల వయసు దాటిన తర్వాతే వివాహ బంధం అసలు ఆనందం ఏమిటో తెలుస్తుంది. బాధ్యతలకు దూరంగా ఒకరినొకరు ప్రేమించుకునేందుకు అది సరైన వయసని భావిస్తున్నా’ అని కెప్టెన్ కూల్ అన్నాడు. -
ఐపీఎల్ తర్వాతే...
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ తర్వాతే తన భవిష్యత్‌పై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిర్ణయం తీసుకోనున్నాడు. ఈ విషయాన్ని అతని సన్నిహిత మిత్రుడొకరు నిర్ధారించాడు. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్కు సంబంధించిన పుకార్లను ఆపివేయాలని అతను కోరాడు. ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత ధోని భారత క్రికెట్ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతని ఎంపికపై సెలక్టర్లు కూడా స్పష్టత ఇవ్వలేకపోయారు. ‘ఐపీఎల్ తర్వాతే ధోని తన భవిష్యత్తు గురించి ఒక నిర్ణయానికి వస్తాడు. అతనిలాంటి పెద్ద ఆటగాడి గురించి చర్చ జరగడం సహజం. ఫిట్నెస్పరంగా ప్రస్తుతం ధోని అత్యుత్తమ స్థితిలో ఉన్నాడు. గత నెల రోజులుగా కఠోర సాధన కూడా చేస్తున్నాడు. అయితే ఐపీఎల్‌లోగా అతను ఎన్ని అధికారిక మ్యాచ్‌లు ఆడతాడనేది మున్ముందు తెలుస్తుంది’ అని ధోని స్నేహితుడు వెల్లడించాడు. మరోవైపు ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగానే ధోని 2020 టి20 ప్రపంచ కప్ జట్టులో ఉంటాడా లేదా అనేది తేలుతుందని హెడ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. ధోని ఫామ్‌తో పాటు ఇతర వికెట్ కీపర్లతో పోలిస్తే అతని ఆట ఎలా ఉందనేది కూడా అప్పుడు కీలకంగా మారుతుందని ఆయన అన్నారు. ఐపీఎల్ ప్రదర్శన అనంతరం 15 మంది సభ్యుల భారత జట్టు ఎంపిక దాదాపుగా ఖాయమవుతుందని కూడా శాస్త్రి స్పష్టం చేశారు. -
ధోని ఆట ముగిసినట్లేనా!
ముంబై: వరల్డ్ కప్ తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో స్పష్టతనివ్వడంలో సెలక్టర్లు ఇప్పటి వరకు తడబడుతూ వచ్చారు. విశ్రాంతి అడిగాడని ఒక సారి, అతను కోరుకుంటే ఆడగలడని, ధోనిలాంటి గొప్ప క్రికెటర్‌ను ఏ జట్టయినా కోరుకుంటుందని... ఇలా ప్రతీ సారి ఏదో కప్పదాటు సమాధానాలే వారినుంచి వచ్చాయి. గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా మారిన మహత్యమో లేక నిజంగా ధోనినే తన గురించి చెప్పుకున్నాడో కానీ గురువారం అతని కెరీర్ గురించి మొదటి సారి సెలక్షన్ కమిటీ చెప్పుకోదగ్గ వివరణఇచ్చింది. మాజీ కెప్టెన్ ఇక ఆటకు గుడ్‌బై చెప్పినట్లేనని ఈ మాటల సారాంశంగా కనిపిస్తోంది. ధోనిని దాటి తాము ఆలోచిస్తున్నామని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచ కప్ ముగిసిన తర్వాత మేం ఇక భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నామని స్పష్టంగా చెబుతున్నా. రిషభ్ పంత్‌పై ప్రస్తుతం మేం ఎక్కువ దృష్టి పెట్టాం. కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వడంలో భాగంగానే పంత్‌తో పాటు ఇప్పుడు శామ్సన్ను కూడా ఎంపిక చేశాం. మా ప్రక్రియ మీకు అర్థమవుతోందని భావిస్తున్నా’ అని ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తమ ఆలోచనలకు ధోని కూడా మద్దతిచ్చాడన్న చీఫ్ సెలక్టర్... రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయమని చెప్పడం విశేషం.‘కుర్రాళ్లను ప్రోత్సహించాలనే మా ఆలోచనను ధోని కూడా సమర్దించాడు.అతని భవిష్యత్తు గురించి కూడా మేం మాట్లాడాం. మహి మళ్లీ జట్టులోకి రావాలంటే అతనిష్టం. దేశవాళీ క్రికెట్ ఆడి టచ్‌లోకి వస్తాడా, రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాడా అనేది పూర్తిగా వ్యక్తిగతం. అయితే మేం జట్టు భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక రూపొందించాం. దాని ప్రకారమే ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నాం’ అని ఎమ్మెస్కే వివరించారు. మరో వైపు ధోని జార్ఖండ్ అండర్–23 టీమ్‌తో కలిసి ప్రాక్టీస్ చేయనున్నట్లు సమాచారం. -
ధోని మనసులో మాట తెలియాలి: గంగూలీ
కోల్‌కతా: భారత క్రికెట్లో ఇప్పుడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పరిస్థితి జట్టుతో ఉండీ లేనట్లే ఉంది. ఒకవైపు అతను మ్యాచ్‌లు ఆడటం లేదు. అలా అని అధికారికంగా రిటైర్మెంట్ కూడా ప్రకటించలేదు. తాను ఆడాలనుకునే సిరీస్‌లు తనే ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రపంచ కప్ సెమీఫైనల్ తర్వాత అతను మళ్లీ బరిలోకి దిగలేదు. అతను సెలక్టర్లకు ఏం చెప్పాడో వారికి మాత్రమే తెలుసు. ఈ నేపథ్యంలో కొత్తగా బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న సౌరవ్ గంగూలీ దీనిపై స్పందించాడు. ధోని విషయంలో తనకు మరింత స్పష్టత కావాల్సి ఉందంటూ వ్యాఖ్యానించాడు. ‘నేను బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు ఈ నెల 24న సెలక్టర్లతో సమావేశమవుతున్నా. ధోనికి సంబంధించి వారి ఆలోచనలు ఏమిటో నేను తెలుసుకుంటా. ఆ తర్వాత నా అభిప్రాయం వెల్లడిస్తా. అసలు ధోని ఏమనుకుంటున్నాడో కూడా తెలియాలి. ఇప్పటి వరకు నాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక అధికారిక హోదాలో దీని గురించి సమాచారం తెలుసుకొని ఏం చేయాలో నిర్ణయిస్తా’ అని గంగూలీ స్పష్టం చేశాడు. -
డాడీల పుత్రికోత్సాహం
హఠాత్తుగా ఈ రెండు మూడు రోజుల్లో క్రికెటర్లు ధోనీ, గౌతమ్ గంభీర్, అజింక్యా రహానే సోషల్ మీడియాలో ‘ఫామ్’లోకి వచ్చారు! వాళ్లతో పాటు సచిన్ టెండూల్కర్ కూడా!! అజింక్యా రహానేకు శనివారం కూతురు పుట్టింది. ఆ టైమ్‌కి అజింక్యా వైజాగ్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఆట అయ్యాక భార్యతో, బేబీ గర్ల్‌తో ఒక ఫొటో దిగి, ట్విట్టర్లో పెట్టాడు. అది చూసి సచిన్ టెండూల్కర్ ట్విట్టర్లోనే అజింక్యాను, అతడి భార్య రాధికను కంగ్రాచ్యులేట్ చేశాడు. అక్కడితో ఆగలేదు. ‘తొలి బిడ్డ పుట్టుక ఇచ్చే సంతోషం దేనికీ సరితూగనిది’ అన్నాడు. అక్కడితోనూ ఆగలేదు. ‘డైపర్స్ మారుస్తూ నైట్ వాచ్‌మన్‌గా కొత్త పాత్రను పోషించడంలోని ఆనందాన్ని అనుభవించు’ అని అజింక్యాను ఆహ్లాదపరిచాడు. ధోనీ తండ్రి మనసు కూడా అతడిని ట్విట్టర్లోకి నడిపించింది. ధోనీ కూతురు జివా వయసు నాలుగున్నరేళ్లు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌కి, జివాకు ఒకేలాంటి ఫ్యాషనబుల్ కళ్లద్దాలు ఉన్నాయి. ఏదో ఫొటోలో రణ్వీర్ను ఆ కళ్లద్దాలతో చూసింది జివా. వెంటనే, ‘‘నా కళ్లద్దాలను ఈయన ఎందుకు పెట్టుకున్నాడు?’’ అని తండ్రిని అడిగింది. ఆ వెంటనే పై గదిలో పెట్టిన తన కళ్లద్దాలు అక్కడ ఉన్నాయో లేవో చూసుకోవడానికి వెళ్లింది. అవి అక్కడే ఉండడం చూసి, ‘‘నావి నా దగ్గరే ఉన్నాయి’’ అని చెప్పింది. ఇకనేం తండ్రి హృదయం ఉప్పొంగింది! ఆ వయసులో నాకు అంత తెలివి ఉండేది కాదు అని రణ్వీర్ ఫొటోను, కూతురు ఫొటోను కలిపి ట్విట్టర్లో షేర్ చేశాడు. ఆ ఫొటోను చూసి రణ్వీర్.. ‘‘హాహాహా ఫ్యాషనిస్టా జివా’’ అని కామెంట్ పెట్టాడు. అష్టమి రోజు గౌతమ్ గంభీర్ తన కూతుళ్ల కాళ్లు కడిగి తలపై చల్లుకున్నాడు. కాళ్లు కడుగుతున్నప్పటి ఫొటోను ట్విట్టర్లో అప్లోడ్ చేశాడు. ‘‘ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా నేను పెడిక్యూర్ (పాదాలకు బ్యూటీ ట్రీట్మెంట్)లో ప్రావీణ్యం సాధించాను అని మురిపెంగా కామెంట్ పెట్టుకున్నాడు. -
రిటైర్మెంట్పై ధోనికి చెప్పాల్సిన పని లేదు
న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనికి ఎప్పుడు రిటైర్ అవ్వాలో తెలుసని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ‘భారత జట్టును ప్రపంచంలో అత్యుత్తమంగా నిలిపిన ధోని సమయం వచ్చినపుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. దాని గురించి చర్చ అనవసరం. ఆటగాడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడం ధోనికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అది నాయకుడి ముఖ్య లక్షణం. జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో కోహ్లికి ధోని మార్గనిర్దేశం చేశాడు. కోహ్లి సారథి అయ్యాక అనేక సూచనలు చేశాడు’ అని అన్నాడు. -
వీటినే వదంతులంటారు!
రాంచీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్కు సంబంధించి గురువారం వచ్చిన కొన్ని వార్తలు కలకలం రేపాయి. అతను రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు, సాయంత్రం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు ప్రచారం సాగింది. ఆసీస్‌తో జరిగిన 2016 టి20 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో తాను, ధోని ఉన్న ఫోటో పెట్టి ‘ఎప్పటికీ మరచిపోలేని మ్యాచ్ అది. నాకు ఫిట్నెస్ పరీక్ష పెట్టినట్లు ధోని నాతో పరుగెత్తించాడు’ అని కోహ్లి ట్వీట్ చేయడమే పుకార్లకు కారణమైంది. ప్రత్యేక సందర్భం ఏదీ లేకుండా ఇలా ట్వీట్ చేయడంతో అందరూ రిటైర్మెంట్ గురించి ఆలోచించారు. ధోనికి అలాంటి ఆలోచన ఏదీ లేదంటూ బీసీసీఐ వర్గాలతో పాటు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ దీనిని ఖండించినా వార్తలు ఆగలేదు. చివరకు అతని భార్య ధోని ‘వీటినే వదంతులు అంటారు’ అంటూ ట్వీట్ చేయడంతో ధోని రిటైర్మెంట్పై సాగిన చర్చ ముగిసింది! -
సైనికులతో ధోనీ సందడి
శ్రీనగర్ : టీం ఇండియా మాజీ కెప్టెన్, భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన మహేంద్ర సింగ్ ధోని లఢక్‌లో సైనికుల సమక్షంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. లఢక్ కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన విషయం తెలిసిందే. బుధవారం లఢక్‌కు చేరుకున్న ధోనికి సైనిక సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. సైనికులతో ఈ సందర్భంగా ధోని ముచ్చటించారు. అనంతరం ఆర్మీ జనరల్ ఆస్పత్రిని సందర్శించిన ధోనీ రోగులతో మాట్లాడారు. అంతకుముందు ధోని ఆర్మీ బెటాలియన్‌తో వాలీబాల్ ఆడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లఢక్ పర్యటనలో భాగంగా ధోని పెట్రోలింగ్, గార్డింగ్ సహా పలు విధులు నిర్వర్తించారు. టీం ఇండియా నుంచి రెండు నెలల విరామం తీసుకున్న ధోని తాజాగా వెస్టిండీస్ టూర్లో ఉన్న భారత జట్టుకు దూరంగా ఉన్నారు. -
కార్స్24లో ధోనీ పెట్టుబడి
న్యూఢిల్లీ: గురుగ్రామ్ కేంద్రంగా పనిచేసే టెక్నాలజీ ఆధారిత సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ సంస్థ ‘కార్స్24’లో.. టీం ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ పెట్టుబడి పెట్టినట్లు ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మాజీ కెప్టెన్ వ్యవహరించనున్నారని వెల్లడించింది. ఆర్థిక పరమైన విషయాలను వెల్లడించని ఈ సంస్థ.. పెట్టుబడి డీ–రౌండ్ ఆఫ్ ఫండింగ్‌లో భాగమని పేర్కొంది. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ విక్రమ్ చోప్రా మాట్లాడుతూ.. ‘భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటుచేసుకున్న ధోని తనకు ఎదురైన ప్రతి సమస్యను చక్కగా పరిష్కరించారు. ఇటువంటి గొప్ప వ్యక్తి మా సంస్థకు భాగస్వామికావడం విశేషం’ అని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా 230 నగరాల్లో 10,000 ఛానల్ భాగస్వాములను కలిగిన ఈ సంస్థకు 35 నగరాల్లో 155 శాఖలు ఉన్నాయి. ఇటీవలే ఫ్రాంచైజ్ మోడల్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. 2021 నాటికి 300 ద్వితీయ శ్రేణి నగరాల్లోకి చొచ్చుకునిపోవడమే లక్ష్యంగా తెలిపింది. -
మా సమర్థతకు అనేక ఉదాహరణలు
న్యూఢిల్లీ: తన ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ సమర్థతపై వస్తున్న విమర్శలకు భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ గట్టిగా బదులిచ్చారు. తమ బృందానికే గనుక దూరదృష్టి లేకుంటే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చేవారా? అని ప్రశ్నించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ రెండో భాగంలో ఆయన... ఒక సెలక్షన్ కమిటీకి ఉండాల్సిన అర్హతలేంటో వివరించారు. ఇంకా ఏం చెప్పారంటే... పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా భావించిన బుమ్రా ఇప్పుడు ప్రపంచ నంబర్ వన్ టెస్టు బౌలర్. టి20లకే పనికొస్తాడని అనుకున్న హార్దిక్ నేడు అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న ఆల్‌రౌండర్. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అశ్విన్, జడేజా వంటి పేరున్న స్పిన్నర్ల స్థానంలో చహల్, కుల్దీప్లను ప్రత్యామ్నాయంగా తెచ్చాం. దూకుడైన రిషభ్ పంత్‌ను ఎవరూ ఊహించని విధంగా తక్కువ వ్యవధిలోనే తీర్చిదిద్ది టెస్టుల్లో ప్రవేశపెట్టాం. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో అతడెలా రాణించాడో అందరం చూశాం. మయాంక్ అగర్వాల్, హనుమ విహారి పురోగతి, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ వంటి వారితో పేస్ బౌలింగ్ బలం ఎలా పెరిగిందో చూస్తున్నాం. మా దూరదృష్టికి ఇవన్నీ ఉదాహరణలే. సీనియర్ జట్టు వెన్నంటే ‘ఎ’ జట్టు విదేశీ పర్యటనలు సాగేలా హెడ్ కోచ్ రవిశాస్త్రి, ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో సమన్వయం చేసుకుని ఫలితాలు సాధించాం. మాకే గనుక బ్లూ ప్రింట్ లేకుంటే ఇవన్నీ సాధ్యమయ్యేవా? సెలక్టర్ కనీస సంఖ్యలో మ్యాచ్‌లు ఆడి ఉండాలన్నది ఒక అంశమే. దాంతోపాటు నిజాయతీ, నిబద్ధత, గోప్యత, సమగ్రత... ఈ నాలుగు అంశాలు ఒక మంచి సెలక్షన్ కమిటీకి ఉండాల్సిన ప్రధాన లక్షణాలు. మా కమిటీకి ఇవన్నీ ఉన్నాయని నేను 100 శాతం కచ్చితంగా చెప్పగలను. ధోని ఇప్పటికీ భారత్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్లో ఉత్తమ ఫినిషర్, కీపర్ (ప్రపంచ కప్‌లో ధోని కోసం మిడిలార్డర్ కూర్పుపై రాజీపడ్డారా? అన్న ప్రశ్నకు). మిగతావారు క్రమంగా మెరుగవుతున్నారు. జట్టు, కెప్టెన్ మైదానంలో నిర్ణయాలు తీసుకోవడంలో తన విశేష అనుభవాన్ని పంచుకుంటూ కీపర్, బ్యాట్స్‌మన్‌గా ధోని ప్రపంచ కప్‌లో జట్టుకు కొండంత అండగా ఉన్నా డు. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి ఉంటే ధోని–జడేజా భాగస్వామ్యం మరుపురానిదిగా మిగిలిపోయేది. అవకాశం దొరికితే సొంతగడ్డపై జరిగే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకు ధోనిని ఎంపిక చేస్తారా అంటే... గతంలో చెప్పినట్లే మాకు ప్రపంచ కప్ తర్వాత వేరే ప్రణాళికలున్నాయి. చాలినన్ని అవకాశాలతో పంత్‌లో ఆత్మవిశ్వాసం కల్పించి జట్టు అవసరాలకు తగ్గట్లు అతడు రాణించాలన్నది మా ఆలోచన. జట్టు పునర్నిర్మాణం నిరంతర ప్రక్రియ. ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచాం. భవిష్యత్‌పై ఆశావహంగా, టెస్టు చాంపియన్‌షిప్‌పై ఉత్సుకతతో ఉన్నాం. ‘ఎ’ జట్టు తరఫున నిలకడైన ప్రదర్శన చేస్తున్న కొందరు కుర్రాళ్లకు పరిమిత ఓవర్ల ఆటలో చోటు కల్పించాం. వారు దానిని నిలబెట్టుకుంటే మరిన్నిఅవకాశాలుంటాయి. -
వరల్డ్ కప్పే చివరిది.. ధోనీ కూడా రిటైర్!
బర్మింగ్‌హామ్: వరల్డ్ కప్‌లో తనను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, రాయుడి దారిలోనే భారత క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నాడు. వరల్డ్ కప్ తర్వాత ధోనీ రిటైర్ అవుతాడని అందరూ ఊహించని విషయమే. ఇందులో రహస్యమేమీ లేదు. కానీ, వరల్డ్ కప్ మ్యాచ్‌లు ముగిసిన వెంటనే ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకబోతున్నట్టు తెలుస్తోంది. అంటే, వరల్డ్ కప్ తర్వాత ధోనీ ఇక టీమిండియా నీలిరంగు జెర్సీలో కనిపించకపోవచ్చు. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. ఈ నెల 14న లార్డ్స్ మైదానంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్ ధోనీకి చివరి మ్యాచ్ కానుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. ధోనీకి ఇంతకంటే ఘనమైన వీడ్కోలు మరొకటి ఉండబోదు. ఒకవేళ అన్ని కలిసొస్తే.. వరల్డ్ కప్ విజయంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ వైదొలగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన రిటైర్మెంట్ గురించి బీసీసీఐ అధికారులకు ధోనీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘ధోనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరూ చెప్పలేం. కానీ, వరల్డ్ కప్ తర్వాత ఆయన భారత జట్టులో కొనసాగే అవకాశం లేదు. అనూహ్యంగా మూడు ఫార్మెట్లలోనూ కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఊహించలేం’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత సెలక్షన్ కమిటీ పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్‌తో ముగుస్తుంది. ఆ స్థానంలో వచ్చే కొత్త సెలక్షన్ కమిటీ దృష్టి అంతా వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ మీద ఉంటుంది. కొత్త సెలక్షన్ కమిటీ జట్టులో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చు. ఈ మార్పుల్లో యువ క్రీడాకారులకు పెద్ద పీట ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక, టీమిండియా వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు అర్హత సాధించిన ప్రస్తుత తరుణంలో ధోనీ రిటైర్మెంట్ వంటి సున్నితమైన విషయాలపై స్పందించడానికి బీసీసీఐ ముందుకురావడం లేదు. ఈ వరల్డ్ కప్‌లో ధోనీ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి.. 93కుపైగా స్ట్రైక్ రేట్‌తో 223 పరుగులు చేశాడు. అయితే, కీలక సమయాల్లో భారీ షాట్లు ఆడకపోవడం, స్లో బ్యాటింగ్ చేస్తుండటంతో ధోనీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ ఫినిషర్‌గా గొప్ప పేరున్న ధోనీ.. ఇలా నెమ్మదించడంతో ఎన్నో విమర్శలు ఎదురవుతున్నాయి. ధాటిగా ఆడాలన్న కసి ధోనీలో లేదని, వయస్సు మీద పడిందని అంటున్నారు. ధోనీని విమర్శించి.. తప్పుబట్టిన వారిలో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ వంటి భారత మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ విమర్శలు ఎలా ఉన్నా.. ధోనీని తక్కువ చేసి చూసేందుకు బీసీసీఐ ఇష్టపడటం లేదు. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ.. ‘బీ లవ్డ్ కెప్టెన్’గా క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోయాడు. ఐసీసీ టోర్నమెంట్లన్నింటినీ గెలుపొందిన ఏకైక భారత కెప్టెన్‌గా ధోనీ ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్ క్రికెట్‌కు ధోనీ అందించిన విజయాలు, జరిపిన కృషి ఎనలేనిది. భారత క్రికెటర్లందరూ ధోనీని పొగిడినవారే. ఇక, ప్రస్తుత వరల్డ్ కప్‌లో ధోనీ విఫలమైనా.. జట్టు సెమీస్‌కు చేరడం.. అతనికి రక్షణగా నిలిచిందని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి.. ధోనీ ఒక నిర్ణయం అనివార్యంగా తీసుకోవాల్సిందేనని ఓ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డారు. -
ధోని లోగో తొలగించాల్సిందే
లండన్: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దేశభక్తిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నీళ్లు చల్లింది. ‘బలిదాన్ బ్యాడ్జ్’ లోగోను వికెట్ కీపింగ్ గ్లౌజ్‌ల నుంచి తొలగిం చాల్సిందేనని స్పష్టం చేసింది. లోగోను అనుమతించాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. ‘ధోని గ్లౌజ్‌లపై లోగోను అనుమతించలేం. ఈ విషయాన్ని బీసీసీఐకి తెలిపాం. ఆటగాళ్ల దుస్తులు, సామాగ్రిపై వ్యక్తిగత సందేశాలు, లోగోలు ప్రదర్శించడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐసీసీ రూల్స్ బుక్‌లో వికెట్ కీపింగ్ గ్లౌజ్‌లపై ఒకే ఒక్క స్పాన్సర్ లోగోకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే ధోని గ్లౌజ్‌లపై ‘ఎస్జీ’ లోగో ఉంది. మొదట్నుంచి బలిదాన్ బ్యాడ్జ్ లోగో అంశంలో బీసీసీఐ ధోనికి మద్దతుగా నిలిచింది. లోగో ఉన్న గ్లౌజ్‌లు కొనసాగించేందుకు ఐసీసీ అనుమతి కోరింది. పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ మాట్లాడుతూ ‘ఆ లోగోతోనే ధోని బరిలోకి దిగేలా అనుమతించాలని భారత బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం వాణిజ్య, మత, ఆర్మీకి సంబంధించిన లోగోలను ఆటగాళ్లు ప్రదర్శించరాదు. నిజానికి అతడు ధరించింది పారామిలిటరీ ‘బలిదాన్’ గుర్తు కాదు. అలాంటపుడు ఇది నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎలా అవుతుంది’ అని అన్నారు. ధోని వెన్నంటే క్రీడాలోకం... మరోవైపు భారత క్రీడాలోకం ధోని వెన్నంటే నిలిచింది. ఆర్మీ లోగో తీయాల్సిన అవసరం లేదని సామాజిక మాధ్యమాల్లో ట్వీట్లు, పోస్ట్‌లు పోటెత్తుతున్నాయి. ‘ధోని కీప్ ద గ్లౌజ్’ (ధోని లోగో కొనసాగించాలి) అనే హ్యాష్‌ట్యాగ్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ సహచరుడు సురేశ్ రైనా ‘దేశాన్ని ప్రేమిస్తాం. ధోనిని సమర్థిస్తాం. అమరులైన మా హీరోల్ని గౌరవిస్తాం’ అని ట్వీట్ చేశాడు. ‘లోగో తొలగించాలనడం భారత ఆర్మీని అవమానపరచడమే అవుతుంది. ధోని లోగోతో ఆడతాడు. మేం అతని వెన్నంటే ఉంటాం’ అని రెజ్లర్ యోగేశ్వర్ దత్ అన్నారు. ఆర్పీ సింగ్ తదితర క్రికెటర్లు కూడా లోగో కొనసాగించాల్సిందేనని ధోనికి మద్దతు పలికారు. -
పంత్‌కు హిందీ నేర్పిస్తున్న జీవా ధోనీ
-
పంత్‌కు పాఠాలు నేర్పిస్తున్న జీవా
భారత క్రికెట్ మాజీ సారథి, మహేంద్ర సింగ్ ధోనీ గారాల కూతురు జీవాకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. క్యూట్ ఎక్స్ప్రెషన్తో ముద్దు ముద్దు మాటలతో కోట్ల మందిని తన అభిమానులుగా మార్చేసుకుంది జీవా ధోనీ. తాజాగా జీవా ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు జీవా హిందీ నేర్పిస్తూ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. -
ధోనీతో లావాదేవీల వివరాలు కోరిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : క్రికెటర్ మహీంద్ర సింగ్ ధోనీతో జరిపిన అన్ని లావాదేవీల వివరాలను బుధవారంలోగా తమకు నివేదించాలని సుప్రీం కోర్టు మంగళవారం ఆమ్రపాలి గ్రూప్‌ను ఆదేశించింది. ఆమ్రపాలి గ్రూప్ తనను మోసం చేసిందని ధోని సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. రాంచీలోని ఆమ్రపాలి సఫారిలో పెంట్‌హౌస్‌ను తాను బుక్ చేసుకున్నానని, ఇంతవరకూ పెంట్‌హౌస్‌ను తనకు అప్పగించలేదని పిటిషన్లో ధోని ఆరోపించారు. మరోవైపు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు తనకు చెల్లించాల్సిన బకాయిలను సైతం ఆమ్రపాలి గ్రూప్ చెల్లించలేదని ధోనీ కోర్టుకు నివేదించారు. 2006 నుంచి 2009 మధ్య కంపెనీని ప్రమోట్ చేసినందుకు తనకు రూ 40 కోట్లు రావాలని ధోని కోరుతున్నారు. కాగా ధోనీతో జరిగిన లావాదేవీల వివరాలను పూర్తిగా తమకు సమర్పించాలని సుప్రీం కోర్టు ఆమ్రపాలి గ్రూప్‌ను ఆదేశించింది. మరోవైపు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నఆమ్రపాలి గ్రూప్‌పై పెద్దసంఖ్యలో గృహాల కొనుగోలుదారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాము అడ్వాన్స్‌లు చెల్లించినా తమకు ఇస్తామన్న ఇళ్లను ఇంకా ఇవ్వలేదని పిటిషన్లలో పేర్కొన్నారు. కాగా గృహ కొనుగోలుదారులు చెల్లించిన డబ్బుతో నిర్మించిన ఫైవ్‌స్టార్ హోటల్, మాల్, కార్పొరేట్ కార్యాలయాలతో పాటు లగ్జరీ కార్లు, ఎఫ్ఎంసీజీ కంపెనీని అటాచ్ చేసి వాటిని విక్రయించి బకాయిపడిన వారికి చెల్లింపులు చేపట్టాలని సుప్రీం కోర్టు ఇప్పటికే ఆదేశించింది. -
విధేయతకే ప్రాధాన్యతనిస్తా
న్యూఢిల్లీ: కెరీర్ ఆరంభంలో తనను ప్రోత్సహించిన అప్పటి సారథి మహేంద్ర సింగ్ ధోనిపై ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. భారత జట్టుకు ధోని అమూల్యమైన సంపద అని పేర్కొన్నాడు. గత కొంత కాలంగా వన్డే ఫార్మాట్లో ధోని విఫలమైన సందర్భాల్లో అతని ఫామ్‌పై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి తన మాజీ కెప్టెన్‌కు అండగా నిలిచాడు. తన మద్దతు ఎప్పుడూ ధోనికే ఉంటుందని పునరుద్ఘాటించాడు. ‘చాలామంది ధోని భాయ్ ఫామ్‌పై అనవసర సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. నావరకైతే నేను విధేయతకే ప్రాధాన్యతనిస్తా. నా కెరీర్ తొలినాళ్లలో కెప్టెన్‌గా మహి భాయ్ అందించిన ప్రోత్సాహాన్ని మరవలేను. నేను విఫలమైన సందర్భాల్లో ధోనికి వేరే ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ నాపై నమ్మకంతో నన్ను ప్రోత్సహించాడు. సాధారణంగా యువ క్రికెటర్లకు నంబర్–3లో ఆడే అవకాశం రాదు. కానీ ధోని భాయ్ నాకు ఆ అవకాశాన్ని కల్పించాడు. అదే నాకు మేలు చేసింది’ అని కోహ్లి తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకున్నాడు. ఇప్పటికి కూడా ధోనిలా మ్యాచ్ పరిస్థితులను అంచనా వేయడంలో తనకు సాటి ఎవరూ లేరని కితాబిచ్చాడు. కీలక సమయాల్లో ధోని సలహాలే జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పాడు. ‘తొలి బంతి నుంచి చివరి బంతి వరకు మ్యాచ్ గమనాన్ని తెలుసుకోగల ఏకైక వ్యక్తి ధోని. వికెట్ల వెనకాల అతనిలాంటి మేధావి ఉండటం నా అదృష్టంగా భావిస్తా. డెత్ ఓవర్లలో నేను ఔట్‌ఫీల్డ్‌లో పరిస్థితి చక్కదిద్దుతుంటే... ధోని భాయ్ బౌలింగ్, ఫీల్డింగ్ సంగతి చూస్తాడు’ అని కోహ్లి వివరించాడు. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టుపై కోహ్లి హర్షం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ అందరి దృష్టి ప్రపంచకప్‌పైనే ఉందన్నాడు. -
ధోనీకి వాంఖడే సలాం
ముంబై: ప్రత్యర్థి అయితేనేమి ఎన్నో ఏళ్లుగా దేశానికి అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచకప్‌ను అందించాడనేమో.. వాంఖడే మైదానంలోని ప్రేక్షకులు మహేంద్ర సింగ్ ధోనీకి అద్భుత స్వాగతం పలికారు. చెన్నై, ముంబై జట్ల మధ్య బుధవారం వాంఖడే మైదానంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరున్న ధోని.. ఐపీఎల్లో చెన్నై కెప్టెన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన బుధవారం బ్యాటింగ్ చేసేందుకు గ్రౌండ్లోకి అడుగుపెడుతున్నప్పుడు.. ప్రత్యర్థి ఆటగాడని కూడా మర్చిపోయి ముంబై అభిమానులు చప్పట్లు, కేకలు, విజిళ్లతో ధోనీకి స్వాగతం పలికారు. చెన్నై ఓపెనర్లు అంబటి రాయుడు, షేన్ వాట్సన్‌లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడం, రైనా కొద్దిసేపటికే వెనుదిరగడంతో ధోని త్వరగానే బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. డ్రెస్సింగ్ రూం నుంచి ధోని బ్యాట్ అందుకుని మైదానంలోకి వస్తుంటే వాంఖడేలోని ప్రేక్షకులు ధోని.. ధోని.. అంటూ, చిరకాలంగా ఎదురుచూస్తున్న వరల్డ్‌కప్ విజయాన్ని (ఏప్రిల్ 2, 2011) తమకు అందించిన మాజీ భారత సారథికి జేజేలు పలికారు. ఈ మ్యాచ్‌లో ముంబై చేతిలో 37 పరుగుల తేడాతో ఓడిపోయిన చెన్నై.. తన తర్వాతి మ్యాచ్‌లో అశ్విన్ సారథ్యంలోని పంజాబ్‌తో తలపడుతుంది. -
అందరికళ్లూ అతని పైనే.....
మహేంద్ర సింగ్ ధోని తన స్వస్థలం రాంచీ మైదానంలో మూడు వన్డేలు ఆడాడు. ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా... మరో రెండు సార్లు 10 (నాటౌట్), 11 పరుగులు చేశాడు. రెండు టి20ల్లో ఒకదాంట్లో 9(నాటౌట్) పరుగులు చేయగా, మరో మ్యాచ్‌లో బ్యాటింగ్ రాలేదు. రాంచీకి టెస్టు హోదా వచ్చే సమయానికి అతను టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు. ఐదు మ్యాచ్‌లలో కూడా అతని అసలు సిసలు ఆట, మెరుపులను ప్రత్యక్షంగా చూసే అవకాశం సొంత అభిమానులకు కలగలేదు. వరల్డ్ కప్ తర్వాత రిటైరయ్యే అవకాశం ఉన్న ధోని రాంచీ మైదానంలో తన పేరుతో ఉన్న పెవిలియన్‌ను సగర్వంగా చూస్తూ చివరి మ్యాచ్ ఆడనున్నాడు. ఈనేపథ్యంలో నేడు ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డేలో అందరి దృష్టి మహేంద్రుడిపైనే ఉంది. అతను చెలరేగి ఫ్యాన్స్‌ను అలరించగలడా... భారత్ మరో విజయంతో సిరీస్‌ను గెలుచుకోగలదా ఆసక్తికరం. రాంచీ: ఆస్ట్రేలియా చేతిలో టి20 సిరీస్‌ను కోల్పోయిన తర్వాత భారత్ వెంటనే కోలుకుంది. కొంత పోటాపోటీగా సాగినా తొలి రెండు వన్డేల్లో విజయం మన ఖాతాలోకే చేరింది. రెండు స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో ఆసీస్‌పై మన ఆధిక్యం బలంగా కనిపించింది. ఇప్పుడు మరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకొని చివరి రెండు మ్యాచ్‌ల కోసం ప్రయోగాలు చేసేందుకు భారత్‌కు అవకాశం కలుగుతుంది. ఇలాంటి స్థితిలో నేడు (శుక్రవారం) భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇక్కడి జేఎస్సీఏ స్టేడియంలో మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. సిరీస్ సొంతం చేసుకునే లక్ష్యంతో కోహ్లి సేన బరిలోకి దిగుతుండగా, గత రెండు వన్డేల్లో చేజారిన విజయాన్ని ఈ సారైనా అందుకోవాలని కంగారూలు భావిస్తున్నారు. భువనేశ్వర్ వచ్చాడు... రెండు విజయాల తర్వాత భారత తుది జట్టులో మార్పుల గురించి ఆలోచించాల్సిన అవసరం కనిపించడం లేదు. కోహ్లి అద్భుత ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేకపోయినా...అతని డిప్యూటీ రోహిత్ శర్మ ఇంకా తన స్థాయికి తగినట్లుగా చెలరేగలేదు. గత మ్యాచ్‌లో డకౌటైన రోహిత్ నుంచి మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. అయితే బ్యాటింగ్‌కు సంబంధించి అతి పెద్ద సమస్య శిఖర్ ధావన్‌దే. గత 15 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 376 పరుగులే చేసిన ధావన్ రెండు అర్ధసెంచరీలే నమోదు చేశాడు. కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్లో అందరికంటే ధావన్‌కే ఈ మ్యాచ్ కీలకం కానుంది. నాలుగో స్థానంలో నిలదొక్కుకున్నట్లు కనిపించిన రాయుడు మళ్లీ తన ఆటతో సందేహాలు రేకెత్తిస్తున్నాడు. అతను కూడా తన సత్తా చాటాల్సి ఉంది. లేదంటే మిడిలార్డర్లో లోకేశ్ రాహుల్నుంచి పోటీ తప్పదు. విజయ్ శంకర్ తాజా ఆట నేపథ్యంలో అతడిని ఆర్డర్లో మరింత ముందుగా పంపే అవకాశం కూడా కనిపిస్తోంది. తర్వాతి స్థానాల్లో జాదవ్, ధోనిలతో లైనప్ పటిష్టంగా ఉంది. సొంత ప్రేక్షకుల సమక్షంలో తన స్థాయికి తగినట్లుగా ఆడితే ఈ మ్యాచ్ ధోనికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జడేజా తన పొదుపైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో వరల్డ్ కప్ రేసులో తానూ ఉన్నానంటూ దూసుకొచ్చాడు. బౌలింగ్ విభాగంలో విశ్రాంతి తర్వాత భువనేశ్వర్ తిరిగి రావడం కీలక మార్పు. నిజానికి ఇద్దరు పేసర్లు బుమ్రా, షమీ కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే షమీ స్థానంలో భువీ ఆడే అవకాశం కనిపిస్తోంది. కుల్దీప్ మరో సారి ఆసీస్‌ను కట్టిపడేసేందుకు సిద్ధంగా ఉండగా, చహల్ మళ్లీ పెవిలియన్‌కే పరిమితం కానున్నాడు. గెలిపించేదెవరు... తొలి మ్యాచ్‌లో 99 పరుగులకే 4 కీలక వికెట్లు తీసినా...రెండో వన్డేలో విజయానికి అతి సమీపంగా వచ్చినా ఆసీస్‌కు గెలుపు ఆనందం మాత్రం దక్కలేదు. జట్టులో అందరూ అంతంత మాత్రంగానే ఆడుతుండటంతో మ్యాచ్ గెలిపించేదెవరు అన్నట్లుగా దిక్కులు చూడాల్సిన పరిస్థితి జట్టులో కనిపిస్తోంది. వరుస వైఫల్యాల తర్వాత ఫించ్ గత మ్యాచ్‌లో కాస్త మెరుగనిపించినా 70 స్ట్రైక్‌రేట్ అతని స్థాయికి తగిన ఆట కాదు. ఇప్పుడు జట్టులో అందరికంటే ఎక్కువగా అతనిపైనే ఒత్తిడి ఉంది. మరో ఓపెనర్ ఖాజా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. గత ఏడాది కాలంగా ఆసీస్ వన్డే జట్టులో నిలకడగా ఆడుతున్న షాన్ మార్, హ్యాండ్స్కోంబ్ రాణిస్తేనే ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలుగుతుంది. టి20 మెరుపుల తర్వాత మ్యాక్స్‌వెల్ రెండు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. అతను ఫామ్‌లోకి రావడం కూడా కీలకం. గత మ్యాచ్‌లో జట్టును విజయానికి చేరువగా తెచ్చిన స్టొయినిస్ గెలుపు గీత మాత్రం దాటించలేకపోతున్నాడు. స్టొయినిస్ 7 అర్ధ సెంచరీలు చేయగా, ఆసీస్ ఒక్క సారి కూడా మ్యాచ్ గెలవలేదు! స్పిన్‌ను ఆడలేకపోతుండటం ఆ జట్టును దెబ్బ తీస్తోంది. మరో సారి ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉండగా పేసర్ కూల్టర్ నీల్ స్థానంలో రిచర్డ్సన్ లేదా బెహ్రన్‌డార్ఫ్‌ను ఎంపిక చేయవచ్చు. అందుబాటులో ఉన్న అన్ని అస్త్ర శస్త్రాలతో ఏదోలా ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆసీస్ సిరీస్‌లో నిలుస్తుంది. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాయుడు, విజయ్ శంకర్, జాదవ్, ధోని, జడేజా, కుల్దీప్, బుమ్రా, భువనేశ్వర్ ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), ఖాజా, మార్ష, హ్యాండ్స్కోంబ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, కారీ, కమిన్స్, లయన్, జంపా, కూల్టర్ నీల్/ బెహ్రన్‌డార్ఫ్ పిచ్, వాతావరణం తొలి రెండు వన్డేల్లాగే ఇది కూడా కొంత నెమ్మదైన పిచ్. సాధారణ స్కోర్లకు అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉంటోంది కాబట్టి టాస్ గెలిస్తే ఫీల్డింగ్‌కు మొగ్గుచూపవచ్చు. మ్యాచ్‌కు వాతావరణ సమస్య లేదు. -
ఇక ధనాధన్‌లో అమీతుమీ
అందరూ ఊహించిన దానికంటే భిన్నంగా న్యూజిలాండ్ గడ్డపై వన్డే సిరీస్‌ను సునాయాసంగా గెల్చుకున్న టీమిండియా... అదే ఆత్మ విశ్వాసంతో టి20ల్లోనూ దుమ్ము రేపేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ ఒక్క టి20 కూడా నెగ్గలేదన్న చరిత్రను చెరిపేసి... ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌నకు ముందు చివరి విదేశీ పర్యటనను ఘనంగా ముగించాలని యోచిస్తోంది. కొత్త కొత్త ప్రయోగాలతో అన్ని విభాగాల్లో తమను తాము పరీక్షించుకుంటోంది. ప్రత్యర్థి జట్టు ఇటీవల ఫామ్‌లో లేనందున మన జట్టును సిరీస్‌లో ఫేవరెట్‌గా భావించొచ్చు. వెల్లింగ్టన్: ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌తో ప్రారంభమైన టీమిండియా మూడు నెలల సుదీర్ఘ విదేశీ పర్యటన న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ ద్వారా ఆఖరి అంకానికి వచ్చింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా కివీస్‌తో బుధవారం ఇక్కడ తొలి టి20 జరుగనుంది. భారత్‌లాగే అటు ఆతిథ్య జట్టు కూడా కూర్పుపరంగా భిన్నంగా కనిపిస్తుండటం ఈ సిరీస్‌లో ఓ విశేషం. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతితో సారథ్యంతో పాటు బ్యాటింగ్‌లోనూ రోహిత్ శర్మ మెరవాల్సి ఉంటుంది. వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై టి20 సిరీస్‌లకు తప్పించిన వెటరన్ మహేంద్ర సింగ్ ధోని పొట్టి ఫార్మాట్లో పునరాగమనం చేయనున్నాడు. గాయం, సస్పెన్షన్‌తో కొన్నాళ్లుగా అంతర్జాతీయ టి20లు ఆడని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈసారి ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరం కానుంది. భారత్ కూర్పు ఎలా? బ్యాటింగ్‌లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బౌలింగ్‌లో పేసర్ షమీ ఈ సిరీస్‌కు జట్టులో లేరు. దీంతో టీమిండియా కూర్పు కొంత కొత్తగా కనిపించనుంది. ఓపెనర్లు రోహిత్, ధావన్ తర్వాత యువ శుబ్‌మన్ గిల్ మూడో స్థానంలో వస్తాడు. అంచనాల ప్రకారం చూస్తే జట్టులో రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, ధోని రూపంలో ముగ్గురు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లూ ఉండే అవకాశం ఉంది. అన్నదమ్ములు కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ల కోటాను భర్తీ చేయనున్నారు. ఇద్దరు స్పిన్నర్లు కావాలనుకుంటేనే కృనాల్‌ను దింపుతారు. చహల్ రూపంలో ఒక్క స్పిన్నర్ సరిపోతాడనుకుంటే కృనాల్ స్థానంలో కేదార్ జాదవ్‌ను తీసుకోవచ్చు. సిద్ధార్థ్ కౌల్, మొహమ్మద్ సిరాజ్ ఉన్నా భువనేశ్వర్‌కు తోడు రెండో పేసర్‌గా ఖలీల్‌నే ఎంచుకోవచ్చు. ప్రయత్నించి చూద్దామని భావిస్తే కౌల్ తుది జట్టులో ఉంటాడు. ఈ అంచనా ప్రకారం చూస్తే బౌలింగ్ తేలిపోతోంది. కాబట్టి గిల్, పంత్‌లలో ఒకరిని పక్కనపెట్టి కృనాల్, జాదవ్ ఇద్దరినీ బరిలో దింపొచ్చు. రోహిత్, ధావన్ రాణింపుపైనే మన జట్టు ప్రదర్శన ఆధారపడి ఉంటుంది. గప్టిల్, బౌల్ట్ లేకుండానే... ఆతిథ్య జట్టు డాషింగ్ ఓపెనర్ గప్టిల్, ప్రధాన పేసర్ ట్రెంట్ బౌల్ట్ లేకుండానే ఆడనుంది. మున్రోతో పాటు కెప్టెన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. వన్డేల్లో విఫలమైన విలియమ్సన్ రాణించాలని పట్టుదలతో ఉన్నాడు. మిడిలార్డర్ భారం మళ్లీ రాస్ టేలర్‌దే. నీషమ్, వికెట్ కీపర్ సీఫ్రెట్లతో అతడు బండి నడిపించాల్సి ఉంటుంది. సౌథీ, బ్రాస్‌వెల్‌తో పాటు స్కాట్ కుగ్లీన్ పేస్ బాధ్యతలు పంచుకుంటారు. ఇద్దరు స్పిన్నర్లు సాన్‌ట్నర్, సోథిలను ఆడించేందుకు కివీస్ మొగ్గు చూపుతోంది. అమ్మాయిలు అదరగొడతారా? నేడు న్యూజిలాండ్‌తో తొలి టి20 వెల్లింగ్టన్: వెటరన్ మిథాలీ రాజ్‌ను ఆడించక పోవడంతో పాటు ఓటమి కారణంగా చేదు జ్ఞాపకంగా మిగిలిన టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్ తర్వాత... భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా పొట్టి ఫార్మాట్ బరిలో దిగుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డాషింగ్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో న్యూజిలాండ్‌తో బుధవారం ఇక్కడ తొలి టి20 ఆడనుంది. ఇదే వేదికపై మహిళల మ్యాచ్ అనంతరం భారత్, న్యూజిలాండ్ పురుషుల టి20 మ్యాచ్‌ను నిర్వహిస్తారు. కివీస్‌తో మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌ను ఈసారి ఏ స్థానంలో దింపుతారనేది ఆసక్తికరం కానుంది. ఈ హైదరాబాదీ వెటరన్ బ్యాటర్ మిథాలీ రాజ్ త్వరలో అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు చెప్పనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టి20 సిరీస్ ఇందుకు వేదిక కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ప్రసుత్త న్యూజిలాండ్ సిరీస్‌లో మిథాలీని పూర్తిగా ఆడిస్తే... ఆ వెంటనే ఆమె టి20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తుందని భావిస్తున్నారు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, గిల్, పంత్, దినేశ్ కార్తీక్, ధోని, హార్దిక్, కృనాల్/జాదవ్, భువనేశ్వర్, ఖలీల్, చహల్/కుల్దీప్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), మున్రో, సీఫ్రెట్, రాస్ టేలర్, నీషమ్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, స్కాట్ కుగ్లీన్, బ్రాస్‌వెల్, ఫెర్గూసన్/సౌథీ, సోధి. పిచ్, వాతావరణం స్వింగ్‌కు అనుకూలించినా పైకి కనిపించిన దానికంటే భిన్నంగా ఉండటం వెస్ట్‌పాక్ మైదానంలోని పిచ్ స్వభావం. మంచు ప్రభావం ఉంటుంది. ఇంగ్లండ్‌తో చివరిసారిగా ఇక్కడ జరిగిన టి20లో కివీస్ 196 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు శ్రమించింది. ఇంగ్లండ్ పోరాటంతో 184 పరుగులు చేసింది. ►0 న్యూజిలాండ్‌లో టీమిండియా ఇంతవరకు ఒక్క టి20 కూడా గెలవలేదు. 2009 పర్యటనలో 0–2తో పరాజయం పాలైంది. ►2 గత ఏడు టి20 సిరీస్‌లలో కివీస్ రెండే గెలిచింది. ►1 రోహిత్ శర్మ 12 టి20ల్లో భారత్‌కు సారథ్యం వహించగా... ఒక్కదాంట్లో జట్టు ఓడింది. ►10 ఆడిన గత పది టి20 సిరీస్‌లలో టీమిండియా అన్నింటిని గెలిచింది. -
ప్రపంచ కప్ జట్టు దాదాపు ఖరారైనట్లే!
సిడ్నీ: ఒకటీ, రెండు మార్పుచేర్పులు తప్ప... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో తలపడనున్న ప్రస్తుత జట్టే వన్డే ప్రపంచకప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ అన్నాడు. అంత మాత్రాన ఎవరికీ చోటు ఖాయం కాదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు గురువారం ఇక్కడ అతడు మీడియాతో మాట్లాడాడు. ‘తుది జట్టు గురించి ఇప్పుడే చెప్పడం తొందరపాటే. ఇంకా 4, 5 నెలల సమయం ఉంది. అయితే, రానున్న సిరీస్‌లలో భాగంగా జరిగే 13 వన్డేల్లో ఆడే జట్టే ప్రపంచ కప్‌నకు వెళ్తుంది. ఫామ్ లేమి, గాయాల కారణంగా మార్పులుండొచ్చు. ఇది కచ్చితమేం కాదు. కానీ భారీ మార్పులైతే ఉండవని భావిస్తున్నా. ఏడాదిగా తీరిక లేని క్రికెట్ ఆడాం. కాబట్టి గాయాలు, ఫామ్, ఫిట్నెస్ సమస్యలకు ఆస్కారం ఉంది’ అని రోహిత్ అన్నాడు. ఆటతీరులో చిన్నచిన్న లోపాలను అధిగమిస్తామని అతడు చెప్పాడు. ‘ఇది వ్యక్తిగత క్రీడ కాదు. ఏడెనిమిది మంది బ్యాట్స్‌మెన్ సహా 11 మంది ఆడే ఆట. వ్యక్తిగత ప్రదర్శనతో ఒకటీ, అరా మ్యాచ్‌లు గెలవచ్చేమో. కానీ, కప్‌ను సాధించలేం. బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించాలి. జట్టును ఒడ్డున పడేసేందుకు అవసరమైతే సవాళ్లను స్వీకరించేందుకు నేనున్నానంటూ ముందుకురావాలి. టాపార్డర్ విఫలమైతే మిడిలార్డర్ బాధ్యత తీసుకోవాలి. ఆసియా కప్, వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌లో మా వాళ్లు ఇదే చేశారు. భారత్‌లో జరిగిన గత సిరీస్‌లలో అంబటి రాయుడు రాణించాడు. దినేశ్ కార్తీక్ సమయోచితంగా ఆడాడు. ధోని ఎప్పుడూ కీలకమే. బ్యాటింగ్, బౌలింగ్‌తో కేదార్ జాదవ్ జట్టుకు సమతూకం తెచ్చాడు. పాండ్యా, జడేజా ఆల్‌రౌండ్ నైపుణ్యాలను విస్మరించకూడదు. ఫినిషింగ్ టచ్ అనేది ఈ ఫార్మాట్లో అత్యంత కీలకం’ అని రోహిత్ విశ్లేషించాడు. వన్డేల్లో ఆసీస్‌ను తక్కువ అంచనా వేయరాదని భారత వైస్ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ‘ప్రధాన పేసర్లు లేకుండానే ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఆడనున్నా... మమ్మల్ని ఇబ్బందిపెట్టగల బౌలర్లు ఇంకా వారికున్నారు. 2016లో స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్ లేకున్నా మేం 1–4తో ఓడిపోయాం. ఈసారి కూడా అంతే. పరిస్థితులను అర్థం చేసుకుని ఆడితే మేం వారిని ఒత్తిడిలోకి నెట్టగలం’ అని రోహిత్ పేర్కొన్నాడు. సిడ్నీలో టీమిండియా సాధన ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచిన ఊపులో వన్డే సిరీస్‌నూ చేజిక్కించుకోవాలని భావిస్తున్న టీమిండియా... సిడ్నీలో గురువారం ముమ్మరంగా సాధన చేసింది. శనివారం తొలి వన్డే జరుగనున్న నేపథ్యంలో జట్టు మొత్తం మైదానంలో దిగింది. బుధవారం ఐచ్ఛిక సాధన కావడంతో టెస్టు జట్టు సభ్యులు ప్రాక్టీస్‌కు రాలేదు. గురువారం మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లి సహా ధోని, జడేజా, భువనేశ్వర్ తదితరులంతా గ్రౌండ్లో వార్మప్ చేశారు. ఫుట్‌బాల్ ఆడారు. ఓపెనర్లు రోహిత్‌శర్మ, శిఖర్ ధావన్ నెట్స్‌లో బంతులను ఎదుర్కొన్నారు. కోహ్లి, పేసర్ ఖలీల్ క్యాచ్‌లు అందుకున్నారు. కుల్దీప్తో పాటు అంబటి రాయుడు బౌలింగ్ చేశారు. స్వదేశంలో ఓ టీవీ షోలో చేసిన వ్యాఖ్యలతో వివాదాస్పదుడైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పెద్దగా ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. ధోని పాత్ర కీలకం... మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రపంచ కప్‌లో కీలక పాత్ర పోషిస్తాడని రోహిత్ అన్నాడు. ప్రశాంత చిత్తంతో పనిచేసుకుపోయే అతడిని తమ ‘గైడింగ్ లైట్’గా అభివర్ణించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో, మైదానంలో ధోని ఉనికి ఎంతటి ప్రభావవంతమో కొన్నేళ్లుగా చూస్తున్నామని వివరించాడు. కీపర్‌గా అతడు కెప్టెన్‌కు చాలా ఉపయోగపడతాడని తెలిపాడు. రెండేళ్లుగా మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్ నిలకడగా రాణిస్తున్నారంటే దాని వెనుక ధోని సలహాలు, సూచనలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ‘పాత’ జెర్సీల్లో ఆస్ట్రేలియా భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు ముదురు పసుపు రంగు జెర్సీలతో బరిలోకి దిగబోతోంది. వన్డేల్లో రంగుల దుస్తులు వచ్చిన కొత్తలో 1986లో సొంతగడ్డపై భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆడిన డ్రెస్ తరహాలోనే, సరిగ్గా అదే రంగుతో ఆసీస్ కిట్లు సిద్ధమయ్యాయి. మరో వైపు అనారోగ్యం కారణంగా మిషెల్ మార్ష్ తొలి వన్డేకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆస్టన్ టర్నర్‌ను ఎంపిక చేశారు. -
కోహ్లి (Vs) ఆస్ట్రేలియా
లాలా అమర్నాథ్, చందూ బోర్డే, మన్సూర్ అలీఖాన్ పటౌడీ, బిషన్ సింగ్ బేడీ, సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, మొహమ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, మహేంద్ర సింగ్ ధోని... వీరంతా ఆస్ట్రేలియా గడ్డపై భారత టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన కెప్టెన్లు. అయితే ఇందులో ఒక్కరు కూడా సిరీస్‌ను గెలుచుకున్న ఘనతను దక్కించుకోలేకపోయారు. కొన్నిసార్లు అరుదైన, అద్భుతమైన మ్యాచ్ విజయాలు దక్కినా సిరీస్ తుది ఫలితానికి వచ్చేసరికి మాత్రం నిరాశే ఎదురైంది. అయితే ఇప్పుడు కొత్త చరిత్రను లిఖించే అవకాశం కోహ్లి ముంగిట నిలిచింది. ఇప్పుడు అతను కెప్టెన్‌గా మాత్రమే కాకుండా ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ హోదాలో కంగారూల గడ్డపై యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. కోహ్లి తాజా ఫామ్‌ను, అతని ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే ఇది ఆస్ట్రేలియాతో భారత్ సమరంకంటే కోహ్లి, ఆసీస్ మధ్య పోరుగానే కనిపిస్తోంది. సాక్షి క్రీడా విభాగం:విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాలో జరిగిన గత సిరీస్‌లోనూ రెండు టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో భారత్ ఒకటి గెలిచి, మరొకటి ఓడింది. అయితే నాడు ధోని గైర్హాజరు, ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటన వల్ల అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో అప్పటికప్పుడు జరిగిన కెప్టెన్సీ ఎంపిక అది. కాబట్టి నాటి ఫలితాన్ని పూర్తిగా కోహ్లి నాయకత్వానికి ఆపాదించలేము. మరోవైపు బ్యాట్స్‌మన్‌గా మాత్రం అప్పుడే అతను ఆసీస్ పని పట్టాడు. ఏకంగా 692 పరుగులతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. కోహ్లి దూకుడుతో భారత్ గెలిచే అవకాశాలు సృష్టించుకోగలిగింది. దురదృష్టవశాత్తూ ఫలితం ప్రతికూలంగా వచ్చినా కంగారూల గుండెల్లో విరాట్ వణుకు పుట్టిం చాడు. మిషెల్ జాన్సన్‌ను సాధారణ బౌలర్ స్థాయికి దిగజార్చిన నాటి విరాట్ కోహ్లి బ్యాటింగ్ ప్రదర్శన ఆసీస్‌ను ఇప్పటికీ వెంటాడుతోంది. ఈ నాలుగేళ్లలో కోహ్లి శిఖర స్థాయికి చేరుకున్నాడు. ఆటగాడిగా లెక్కలేనన్ని రికార్డులు సృష్టించిన అతను, కెప్టెన్‌గా కూడా తనదైన ప్రత్యేకతను ప్రదర్శించాడు. ‘డ్రా’ల కోసం కాకుండా ఎలాగైనా గెలవాలనే కసి, ఎంతటి లక్ష్యాన్నైనా లెక్క చేయని తత్వంతో కోహ్లి సిద్ధంగా ఉన్నాడు. కోహ్లి ఆలోచనాశైలి కూడా ఆసీస్ గడ్డపై భారత్ సిరీస్ విజయంపై ఆశలు పెంచుతోంది. కోహ్లి మినహా... భారత్‌తో తలపడబోతున్న ఆస్ట్రేలియా జ ట్టులో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేరు. అయితే ప్రత్యర్థి బలహీనతలకంటే సహజంగా తమ బలంపైనే ఏ జట్టయినా దృష్టి పెడుతుంది. 2014–15 సిరీస్‌ను గుర్తు చేసుకుంటే కోహ్లి విలువేమిటో, ఇతర ఆటగాళ్ల పాత్ర ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో జరిగిన సిరీస్‌లు, అక్కడ వచ్చిన ఫలితాలు చూస్తే ఇతర బ్యాట్స్‌మెన్ రాణించినా కూడా చివరకు కోహ్లి వల్లే గెలుపు సాధ్యమని తెలిసిపోతుంది. కాబట్టి ఆస్ట్రేలియా మాజీలు చెప్పినట్లు కోహ్లిపైనే అంతా ఆధారపడి ఉంది. అతడిని పడగొడితే చాలు సిరీస్ చిక్కినట్లే అనే భావనలో ఆసీస్ బౌలర్లు కూడా ఉన్నారు. గత సిరీస్‌లో కోహ్లి కాకుండా మురళీ విజయ్ 482 పరుగులు, రహానే 399 పరుగులతో నిలకడగా రాణించారు. బహుశా నాటి ప్రదర్శనే విజయ్‌కు ఆసీస్ గడ్డపై మరో అవకాశం కల్పించింది. అయితే ఇటీవల ఇంగ్లండ్‌లో విజయ్ ఆటతీరు, చాలా కాలంగా రహానే వైఫల్యాలు ఆందోళనపరిచేవే. పుజారా ఆ సిరీస్‌లో ఒకే ఒక అర్ధ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాలోనే తొలి సెంచరీ చేసిన రాహుల్ ఇప్పుడు తడబడుతుండగా... కుర్రాళ్లు పృథ్వీ షా, హనుమ విహారిలకు ఇది పెద్ద సవాల్. గత సిరీస్‌లోనూ మూడు టెస్టుల్లో కలిపి 173 పరుగులే చేసిన రోహిత్ శర్మ టెస్టు ఆటగాడిగా ఎదిగిందీ లేదు. అంతకు ముందూ అతనే... భారత్ జట్టు 0–4తో చిత్తుగా ఓడిన 2011–12 సిరీస్‌లో కూడా కోహ్లినే భారత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 8 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 300 పరుగులు చేశాడు. కోహ్లి కెరీర్లో తొలి సెంచరీ ఇదే సిరీస్‌లోని చివరి టెస్టులో వచ్చింది. గణాంకాలన్నీ చూస్తే భూమి గుండ్రంగా ఉందన్నట్లుగా కోహ్లి చుట్టే మన జట్టు పరిభ్రమిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అతడిని నమ్ముకొనే సిరీస్‌ను సాధించగలమని భావిస్తోంది. ఒకే ఒక్కడుతో తలపడేందుకు ఆసీస్ 11 మందితో సిద్ధమవుతోందనేది స్పష్టం. మరి కోహ్లి మన ఆశలు నిలబెడతాడా, అతని కోసం ప్రత్యర్థి ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమైందా అనేది ఆసక్తికరం. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి టెస్టు రికార్డు టెస్టులు 8 ఇన్నింగ్స్ 16 పరుగులు 992 సగటు 52.0 సెంచరీలు 5 అర్ధ సెంచరీలు 2 అత్యధిక స్కోరు 169 -
ఊతప్పకు ధోని భార్య థ్యాంక్స్!
ముంబై: క్రికెటర్ రాబిన్ ఊతప్పకు మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షి ధోని ధన్యవాదాలు తెలిపారు. మహి, తనను కలిపింది అతడేనని వెల్లడించి, ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. సాక్షి తన 30వ పుట్టిన రోజు వేడుకలను ముంబైలోని ఓ హోటల్లో ఇలీవల జరుపుకున్నారు. ఈ పార్టీకి రాబిన్ ఊతప్పతో పాటు హార్థిక్ పాండ్యా, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. ధోని కూతురు జీవా ఈ పార్టీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ గాయకుడు రాహుల్ వైద్య పలు బాలీవుడ్ హిట్ సాంగ్స్ పాడి అలరించారు. సాక్షి, పాండ్యా కూడా రాహుల్‌తో కలసి ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాలోని ‘చన్నా మేరాయా’ పాట ఆలపించారు. పార్టీ పూర్తయ్యాక తన పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. రాబిన్ ఊతప్ప, అతడి భార్య శీతల్ గౌతమ్‌తో కలిసివున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 2010లో ధోని, సాక్షి పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కూతురు జీవా ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో ధోని అంతర్జాతీయ కెరీర్‌కు బ్రేక్ పడింది. 2018 సంవత్సరం ధోని కెరీర్లో అత్యంత చెత్తగా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడి కేవలం 275 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 42 నాటౌట్. 2019 వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌కు కొద్ది నెలల సమయం మాత్రమే ఉండటంతో ధోని ఫామ్ టీమిండియాను కలవరపెడుతోంది. -
ఈడెన్ గార్డెన్స్‌లో నేడు వెస్టిండీస్‌తో తొలి టి20
-
ధోని లేకుండానే... ధనాధన్‌కు
మహేంద్ర సింగ్ ధోని... దాదాపు 12 ఏళ్ల క్రితం టీమిండియా ఆడిన తొలి టి20 నుంచి జట్టు సభ్యుడు. దేశానికి ప్రపంచ కప్ అందించిన ఘనుడు. మధ్యలో అప్రధానమైన ఒకటీ, అరా సిరీస్‌ల నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్నా, ఇన్నేళ్లలో అతడు లేకుండా తొలిసారిగా భారత్ పొట్టి ఫార్మాట్ బరిలో దిగుతోంది. ఇదే విశేషాంశంగా ఆదివారం వెస్టిండీస్‌తో మొదటి టి20లో తలపడనుంది. అటు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి నేపథ్యంలో స్వదేశంలో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే ఓపెనర్ రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నాడు. గడ్డ ఏదైనా,ఏ క్షణంలోనైనా విరుచుకుపడి అంచనాలను తలకిందులు చేయగల సమర్థులైన కరీబియన్లతో... క్షణాల్లో ఫలితంతారుమారయ్యే ఈ ఆధునిక క్రికెట్లో మరి ఆధిపత్యం ఎవరిదో...? కోల్‌కతా: టెస్టు సిరీస్‌ను ఏకపక్షంగా గెల్చుకుని, వన్డే సిరీస్‌ను ఒడిసిపట్టిన టీమిండియా... టి20 సిరీస్‌లోనూ వెస్టిండీస్ సంగతి తేల్చేందుకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. మిగతా విషయాలు ఎలా ఉన్నా తమ ఆటతీరుకు సరితూగే పొట్టి ఫార్మాట్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పర్యాటక జట్టు అత్యంత కఠినమైనది. పైగా ఈసారి దాదాపు చాలామంది కొత్తవారితో ఆడనుంది. వారి సామర్థ్యంపై అంచనాకు వచ్చి, చెలరేగే లోపు అడ్డుకునేందుకు భారత్ వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంటుంది. కృనాల్ అరంగేట్రం? ఆరుగురు బ్యాట్స్‌మెన్ సహా ముగ్గురేసి పేసర్లు, స్పిన్నర్లతో టీమిండియా మరోసారి ముందు రోజే 12 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. ఇందులో ముంబై ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా పేరుంది. కుల్దీప్ రూపంలో ఇప్పటికే ఒక ఎడంచేతి వాటం స్పిన్నర్ ఉన్నందున తుది కూర్పులో అతడికి చోటు దక్కుతుందో? లేదో? చూడాలి. ఆల్‌రౌండర్ కోటాలో పరిగణిస్తే మాత్రం కృనాల్ అరంగేట్రం ఖాయం. బ్యాటింగ్‌లో ఓపెనర్లు రోహిత్, శిఖర్ ధావన్ తర్వాత కేఎల్ రాహుల్ వన్‌డౌన్‌లో వస్తాడు. మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ 4, 5 స్థానాల్లో దిగుతారు. ధోని బాధ్యతలు రిషభ్ పంత్ తీసుకుంటాడు. పేస్ భారాన్ని భువనేశ్వర్, బుమ్రా, ఖలీల్ అహ్మద్ పంచుకుంటారు. మరో కోణంలో చూస్తే... సొంతగడ్డపై బ్యాటింగ్ గురించి బెంగపడాల్సిన పని లేదు కాబట్టి, విండీస్ దూకుడైన ఆటకు అడ్డుకట్ట వేయాలని భావిస్తూ కృనాల్‌కు తోడుగా ఐదుగురు ప్రధాన బౌలర్లతో ఆడినా ఆడొ చ్చు. అప్పుడు పాండే, కార్తీక్‌లలో ఒకరిని పక్కనపెడతారు. అలాగైతే ఇది కొత్త ప్రయత్నమే అవుతుంది. విండీస్ ఏం చేస్తుందో? టి20ల్లో మెరుపు ఆటకు పెట్టింది పేరు కరీబియన్లు. కానీ, ఈ సిరీస్‌కు కీలక ఆటగాళ్లు దూరమైనందున ఆ జట్టు కూర్పుపై స్పష్టత కరవైంది. కనీసం ఓపెనర్లు ఎవరనేదీ తెలియడం లేదు. తాజాగా ఆల్‌రౌండర్ రసెల్ గాయం కారణంగా టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాథమికంగా చూస్తే, డారెన్ బ్రావో, రవ్మన్ పావెల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించవచ్చు. యువ హెట్‌మైర్ వన్‌డౌన్‌లో దిగుతాడు. దినేశ్ రామ్‌దిన్, కీరన్ పొలార్డ్ తర్వాత వస్తారు. కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ సహా కారీ పియరీ, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ ఆల్ రౌండర్ నైపుణ్యం కలవారు. వన్డేల్లో తేలిపోయిన పేసర్లు ఒషేన్ థామస్, కీమో పాల్, స్పిన్నర్ అలెన్... ఈసారి టీమిండియాకు ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి. పంత్‌కు ఇది చక్కటి అవకాశం ధోని వంటి గొప్ప ఆటగాడు లేకపోవడం మాకు లోటే. పరిమిత వనరులతో ప్రపంచ కప్‌నకు వెళ్లలేం. ప్రత్యామ్నాయాలను సరి చూసుకునే ప్రయత్నంలో ఇది రిషభ్ పంత్‌తో పాటు దినేశ్ కార్తీక్‌కు తమను తాము నిరూపించుకునే గొప్ప అవకాశం. కెప్టెన్సీ చేపట్టడం అన్ని విధాలా సహాయ పడుతోంది. టి20ల్లో విండీస్ బలమైన ప్రత్యర్థి. చాలా ప్రమాదకరం కూడా. –రోహిత్‌శర్మ, భారత కెప్టెన్ భారతే ఫేవరెట్... కానీ... గెలుపు గణాంకాల్లో మేం మెరుగ్గా ఉన్నా, సొంతగడ్డపై భారతే ఫేవరెట్. ముఖ్యంగా ఐపీఎల్ వారికి ఎంతో ఉపయోగపడింది. అయినా, మేం అండర్ డాగ్స్ కాదు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటిన ఉత్సాహవంతులైన కుర్రాళ్లతో బరిలో దిగుతున్నాం. సంచలనం సృష్టించి ట్రోఫీ నెగ్గాలనుకుంటున్నాం. ధోని, కోహ్లి లేకపోవడం మాకు లాభమే. కానీ, భారత జట్టులో ప్రతిభకు లోటు లేదు. –వెస్టిండీస్ కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, కృనాల్ పాండ్యా/కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్, బుమ్రా, ఖలీల్ అహ్మద్, యజువేంద్ర చహల్. వెస్టిండీస్: కార్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, హెట్‌మైర్, పొలార్డ్, రామ్‌దిన్, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్, కారీ పియరీ, ఒషేన్ థామస్, మెకాయ్, రావ్మన్ పావెల్. పిచ్, వాతావరణం ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైనది. మ్యాచ్‌కు వర్షం నుంచి ముప్పు లేదు. గత వారం అకాల వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. అయితే గత మూడు రోజుల్లో ఎండ కాయడంతో మ్యాచ్‌కు మైదానం సిద్ధమైంది. రాత్రి వేళ మంచు ప్రభావం ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. -
టి20ల నుంచి ధోని ఔట్
పుణే: భారత జట్టుకు తొలి టి20 ప్రపంచకప్‌ను అందించిన మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ టి20 కెరీర్ ముగిసినట్లేనా! వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టి20 సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్లలో ధోనికి చోటు ఇవ్వకుండా సెలక్టర్లు పరోక్షంగా తమ ఉద్దేశాన్ని చెప్పేశారా. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారం రాత్రి ఆలస్యంగా నాలుగు వేర్వేరు జట్లను ప్రకటించింది. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే టి20 సిరీస్‌తో పాటు ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక నాలుగు టెస్టుల సిరీస్, టి20 సిరీస్‌లకు జట్లను ఎంపిక చేసింది. దీనికి తోడు టెస్టు జట్టులోని ప్రధాన ఆటగాళ్లతో కూడిన ‘ఎ’ టీమ్‌ను న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే తొలి అనధికారిక టెస్టు కోసం వెల్లడించారు. ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో చోటు కోల్పోయిన మురళీ విజయ్, అంతకుముందే స్థానం లేని రోహిత్ శర్మ, వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఎంపిక ఆసీస్‌తో సిరీస్‌కు అనూహ్య నిర్ణయాలు. వరుసగా రెండు టి20 సిరీస్‌లకు ధోనిని పక్కన పెట్టడం అంటే విశ్రాంతిగా భావించలేం కాబట్టి అతను ఇక వన్డేలకే పరిమితమైనట్లని చెప్పవచ్చు. ఆయా జట్లలో ఉన్న రెగ్యులర్ ఆటగాళ్లను మినహాయించి శుక్రవారం ఎంపికలో చోటు చేసుకున్న కీలక మార్పులను చూస్తే... కోహ్లికి మళ్లీ విశ్రాంతి... వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే మూడు టి20ల సిరీస్‌కు విరాట్ కోహ్లి దూరమయ్యాడు. అతని స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఉన్న ఆటగాళ్లు మినహా కొత్తగా అవకాశం దక్కినవారిని చూస్తే... విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా ఆడిన జార్ఖండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ తొలిసారి జట్టులోకి ఎంపికయ్యాడు. గతంలో టీమ్‌లోకి ఎంపికైనా మ్యాచ్ దక్కని కృనాల్ పాండ్యాకు మరో చాన్స్ లభించింది. భారత్ తరఫున చెరో 6 టి20లు ఆడిన శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్‌లను కూడా తీసుకున్నారు. వన్డేల్లో స్థానం కోల్పోయిన దినేశ్ కార్తీక్‌ను కూడా ఎంపిక చేయడం మరో ఆశ్చర్యకర నిర్ణయం. మరోవైపు ఫిట్నెస్ సమస్యలతో గురువారం ఎంపిక చేయలేదని ప్రకటించిన కేదార్ జాదవ్‌ను నాలుగు, ఐదు వన్డేల కోసం టీమ్‌లోకి తీసుకోవడం విశేషం. ఆసీస్‌తో టి20లకు రెడీ... విండీస్ సిరీస్ అనంతరం కోహ్లి మళ్లీ భారత జట్టుతో చేరతాడు. ఆస్ట్రేలియాతో నవంబర్ 21నుంచి ప్రారంభమయ్యే టి20 సిరీస్‌కు అతను నాయకత్వం వహిస్తాడు. విండీస్‌తో సిరీస్‌కు ఎంపికైన షాబాజ్ నదీమ్‌కు ఇందులో చోటు దక్కలేదు. ఇది మినహా మరే మార్పు లేదు. విహారికి చోటు... ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో సెలక్షన్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంగ్లండ్‌లో రెండు టెస్టుల్లో ఘోర వైఫల్యం తర్వాత స్థానం కోల్పోయిన ఓపెనర్ మురళీ విజయ్ను మళ్లీ ఎంపిక చేసింది. చోటు కోల్పోయిన తర్వాత విజయ్ కౌంటీల్లో ఎసెక్స్ తరఫున ఆడిన 5 ఇన్నింగ్స్‌లలో 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు చేశాడు. ఆ తర్వాత విజయ్ హజారే టోర్నీలో 3, 44, 24 పరుగులు సాధించాడు. అయితే సొంతగడ్డపై విండీస్‌తో టెస్టులకు ఎంపిక కాని శిఖర్ ధావన్‌పై మాత్రం సెలక్టర్లు నమ్మకం ఉంచలేదు. దాంతో అతనికి అవకాశం దక్కలేదు. టెస్టుల్లో రోహిత్ శర్మ పునరాగమనం మాత్రం పూర్తిగా అతని వన్డే, టి20 ఫామ్‌ను చూసే జరిగిందని చెప్పవచ్చు. దక్షిణాఫ్రికా గడ్డపై రెండు టెస్టుల్లో 10, 47, 11, 10 పరుగులు చేసిన తర్వాత మూడో టెస్టుకు దూరమై ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక కాని రోహిత్ ఆ తర్వాత ఎలాంటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడలేదు. ఆసియా కప్‌లో జట్టును గెలిపించిన అనంతరం విజయ్ హజారేలో రెండు వన్డేలు, విండీస్‌తో మరో రెండు వన్డేలు ఆడాడు. పంత్ ప్రధాన కీపర్‌గా ఎదగగా... సాహా గాయం నుంచి కోలుకోకపోవడంతో సెలక్టర్లు మళ్లీ వెటరన్ పార్థివ్ పటేల్‌కే తమ ఓటు వేశారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రెండు టెస్టులు ఆడిన అనంతరం అతను ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఇప్పుడు మరోసారి ఆ అవకాశం వచ్చింది. 2003–04 సిరీస్‌లోనే ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన పార్థివ్ ఇప్పుడు జట్టులో అక్కడి అనుభవంరీత్యా అందరికంటే సీనియర్ కానున్నాడు! విండీస్‌తో సిరీస్‌లో జట్టులో ఉన్నా మ్యాచ్ దక్కని ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారికి కూడా ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లభించింది. ఐదుగురు ప్రధాన పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేశ్ యాదవ్లకే కట్టుబడిన సెలక్టర్లు అశ్విన్, జడేజాలతో పాటు మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ను కూడా ఎంపిక చేయడం విశేషం. ప్రాక్టీస్ కోసం ముందుగా... ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే తొలి నాలుగు రోజుల మ్యాచ్ కోసం భారత్ ‘ఎ’ జట్టును కూడా సెలక్టర్లు ప్రకటించారు. అయితే మ్యాచ్ ప్రాక్టీస్ కోసం టెస్టు జట్టులో భాగంగా ఉన్న పలువురు ఆటగాళ్లను ఇందులోకి ఎంపిక చేశారు. రహానే కెప్టెన్సీలో విజయ్, పృథ్వీ షా, విహారి, రోహిత్, పార్థివ్ ఈ మ్యాచ్ ఆడనున్నారు. టెస్టుల్లో స్థానం ఆశించిన మయాంక్ అగర్వాల్‌కు ఇక్కడ మాత్రం చోటు లభించింది. హైదరాబాద్ పేసర్ సిరాజ్, ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ కూడా ఈ జట్టులో ఉన్నారు. భారత్ జట్టు 2006 నుంచి ఇప్పటి వరకు 104 టి20 మ్యాచ్‌లు ఆడితే 93 మ్యాచ్‌లలో ధోని భాగంగా ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ధోనికి ఒకే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. విండీస్‌తో, ఆస్ట్రేలియాతో జరిగే టి20ల్లో ధోని ఆడబోవడం లేదు. మేం రెండో వికెట్ కీపర్‌ను పరీక్షించే ప్రయత్నంలో ఉన్నాం. ఈ విషయంలో పంత్, కార్తీక్ పోటీ పడతారు. అయితే టి20ల్లో ధోని కెరీర్ ముగిసిందని మాత్రం చెప్పలేను. –ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్ సెలక్టర్ ఆసీస్‌తో టెస్టులకు జట్టు: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, పృథ్వీ షా, పుజారా, రహానే, విహారి, రోహిత్, పంత్, పార్థివ్, అశ్విన్, జడేజా, కుల్దీప్, షమీ, ఇషాంత్, ఉమేశ్, బుమ్రా, భువనేశ్వర్. న్యూజిలాండ్ ‘ఎ’తో మ్యాచ్‌కు భారత్ ‘ఎ’ జట్టు: రహానే (కెప్టెన్), విజయ్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, విహారి, రోహిత్, పార్థివ్, కృష్ణప్ప గౌతమ్, షాబాజ్ నదీమ్, సిరాజ్, నవదీప్ సైనీ, దీపక్ చహర్, రజనీశ్ గుర్బానీ, విజయ్ శంకర్, కేఎస్ భరత్. వెస్టిండీస్‌తో టి20లకు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రాహుల్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, శ్రేయస్, పంత్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, చహల్, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్, షాబాజ్ నదీమ్. (నదీమ్ మినహా మిగతా జట్టును ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌కు ఎంపిక చేశారు. విశ్రాంతి అనంతరం విరాట్ కోహ్లి మళ్లీ కెప్టెన్సీ చేపడతాడు) రోహిత్ శర్మ, విజయ్ -
ధోని మళ్లీ కెప్టెన్‌గా...
దుబాయ్: దాదాపు రెండేళ్ల క్రితం విశాఖపట్నంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో మహేంద్ర సింగ్ ధోని ఆఖరిసారిగా భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్ కెప్టెన్‌గా అతనికి 199వది. ఆ తర్వాత అతను కెప్టెన్సీ నుంచి తప్పుకొని కోహ్లి నేతృత్వంలో, అనంతరం రోహిత్ శర్మ నాయకత్వంలో కూడా కలిపి మరో 42 మ్యాచ్‌లు ఆడాడు. కానీ మంగళవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అనూహ్యంగా కెప్టెన్‌గా బరిలోకి దిగాల్సి వచ్చింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకోవడంతో మళ్లీ ‘మిస్టర్ కూల్’ బాధ్యతలు చేపట్టాడు. తన ప్రమేయం లేకుండానే అతను 200 వన్డేలకు నాయకత్వం వహించిన కెప్టెన్‌గా అరుదైన మైలురాయిని చేరుకోవడం విశేషం. పాంటింగ్ (ఆస్ట్రేలియా–230), ఫ్లెమింగ్ (న్యూజిలాండ్–218) మాత్రమే ఈ ఘనత సాధించారు. ‘కెప్టెన్‌గా నాడు 199 మ్యాచ్‌ల వద్ద ఆగిపోయాను. ఇప్పుడు దానిని 200 చేసేందుకు ఈ మ్యాచ్ అవకాశం ఇచ్చింది. ఏదైనా మనకు రాసి పెట్టి ఉండాలని నేను నమ్ముతాను. ఒకసారి కెప్టెన్సీ వదిలేశాక నా చేతుల్లో ఏమీ లేకపోయింది. మళ్లీ కెప్టెన్ అవుతానని అనుకోలేదు. 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకోవడం సంతోషమే కానీ నా దృష్టిలో ఇలాంటి వాటికి పెద్దగా విలువ లేదు’ అని టాస్ అనంతరం ధోని వ్యాఖ్యానించాడు. దీపక్ చహర్@ 223 ఆసియా కప్‌లో మరో భారత పేసర్ అరంగేట్రం చేశాడు. రాజస్తాన్‌కు చెందిన దీపక్ చహర్‌కు తొలిసారి వన్డే ఆడే అవకాశం లభించింది. ఇటీవలే ఇంగ్లండ్‌పై టి20ల్లో అరంగేట్రం చేసిన అతను వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 223వ ఆటగాడు. గత ఏడాది ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు (19) పడగొట్టడంతో పాటు 2018 ఐపీఎల్లో చెన్నై తరఫున రాణించి చహర్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2010లో ఆడిన తొలి రంజీ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన (8/10)తో హైదరాబాద్‌ను 21కే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఐదు మార్పులతో: ప్రాధాన్యత లేని మ్యాచ్ కావడంతో భారత్ ఏకంగా ఐదు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్, ధావన్, భువనేశ్వర్, బుమ్రా, చహల్ స్థానాల్లో రాహుల్, మనీశ్ పాండే, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ , దీపక్ జట్టులోకి వచ్చారు. -
ధోనితో అమిత్‌షా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనితో బీజేపీ జాతీయాధ్యక్షుడు ఆదివారం భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ తరుఫున ప్రచారంలో పాల్గొనాలని, బీజేపీకి మద్దతు తెలపాలని అమిత్ షా కోరారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలపై ఓ పుస్తకాన్ని ధోనికి బహుకరించారు. అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ భేటిలో పాల్గొన్నారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అమిత్‌షా దేశ వ్యాప్తంగా ప్రముఖుల మద్దతు కోరుతున్న విషయం తెలిసిందే. ఇటీవల భారతీయ గానకోకిల లతా మంగేష్కర్తో కూడా అమిత్ షా భేటీ అయ్యారు. ఇటీవల మహారాష్ట్రా పర్యటనలో భాగంగా బాలీవుడ్ నటి మాధూరీ దీక్షిత్, వ్యాపారవేత్త రతన్ టాటా వంటి ప్రముఖులతో కూడా అమిత్ షా భేటీ అయిన విషయం తెలిసిందే. -
నా కెప్టెన్‌కి సలహాలు అక్కర్లేదు : సచిన్
ముంబై : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచారు. ఇటీవల వన్డే సిరీస్‌లో ధోని విఫలమైన కారణంగానే ఇంగ్లండ్ చేతిలో భారత్ సిరీస్ కోల్పోయిందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ధోనికి రిటైర్మెంట్ సమయం వచ్చిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. తన కెప్టెన్(2011 వన్డే వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్) ధోనికి మద్దతుగా నిలిచిన సచిన్ ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ.. ఆట నుంచి ఎప్పుడు తప్పుకోవాలో అతడికి తెలుసు అన్నారు. తాజా సిరీస్‌లో ధోని రాణించపోయినా, అతడిలో ఆడే సత్తా ఉంది. ఆటగాడికి తనపై పూర్తి విశ్వాసం ఉన్నంతకాలం ఆటలో కొనసాగవచ్చు. జట్టులో తీసుకునే సమయంలో మాత్రమే ఆటగాడి చేతిలో నిర్ణయం ఉండదు. కానీ రిటైర్మెంట్ విషయంలో ఆటగాళ్లకు స్వేచ్ఛ ఉంటుంది. ధోని చాలాకాలం క్రికెట్‌ను ఆస్వాదించాడు. ఇతరుల కంటే ఆటను చాలా బాగా అంచనా వేయగల సామర్థ్యం ధోని సొంతం. అతడితో కలిసి క్రికెట్ ఆడాను కనుక కెరీర్‌కు ఎప్పుడు గుడ్‌బై చెప్పాలన్న నిర్ణయం నా కెప్టెన్ ఎంఎస్ ధోనికి వదిలేయం ఉత్తమమని’ వివరించారు. ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో జరిగిన చివరి వన్డే అనంతరం అంపైర్ల నుంచి ధోని బంతిని తీసుకోవడంతో ఈ మాజీ కెప్టెన్ రిటైర్ అవుతున్నట్లు వదంతులు ప్రచారమయ్యాయి. మరోవైపు సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీలు సైతం ఆడితేనే జట్టులో ఉంటావని ధోనికి చురకలు అంటిస్తున్న విషయం తెలిసిందే. చిరకాల వాంఛ అయిన వన్డే వరల్డ్‌కప్‌ను ఎంఎస్ ధోని సారథ్యంలో 2011లో సచిన్ సాకారం చేసుకున్నారు. -
ఏడేళ్ల క్రితం ధోనిసేన సగర్వంగా!
సాక్షి, ముంబై: సరిగ్గా ఏడేళ్ల కిందట ఇదే రోజున (ఏప్రిల్ 2) టీమిండియా కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని కొట్టిన సిక్స్‌ను క్రికెట్ అభిమానులు మరిచిపోలేరు. ఎందుకంటే అది భారత జట్టుకు వన్డే ప్రపంచ కప్‌ను అందించిన మధురక్షణం. 2011 ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు మహేల జయవర్ధనే (103 నాటౌట్: 88 బంతుల్లో 13 ఫోర్లు) అజేయ శతకంతో 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 275 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను మలింగ డకౌట్ చేశాడు. ఆపై సచిన్ టెండూల్కర్ (18)ను ఔట్ చేసి మరోసారి దెబ్బకొట్టాడు మలింగ. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన గౌతం గంభీర్ (97: 122 బంతుల్లో 9 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకున్నాడు. గౌతీ ఔటయ్యాక యువరాజ్ సింగ్ (21 నాటౌట్) సహకారంతో అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని (91 నాటౌట్: 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) వీర విహారం చేశాడు. వన్డే ప్రపంచ కప్‌తో భారత క్రికెటర్లు (ఫైల్ ఫొటో) భారత్ విజయానికి నాలుగు పరుగులు కావాల్సిన సమయంలో కులశేఖర వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్ రెండో బంతిని 'బెస్ట్ ఫినిషర్' ధోని భారీ సిక్సర్‌గా మలిచి ప్రపంచ కప్‌ను అందించాడు. ఆ సిక్సర్ మాత్రం భారతీయుల గుండెల్లో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. మహీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. 28 ఏళ్ల తద్వారా భారత్ మరోసారి ప్రపంచ కప్ కలను నెరవేర్చుకుంది. ధోని సిక్సర్ నేడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలిసారి కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు 1983లో వన్డే వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. -
ధోని ఉండి ఉంటే...
నాయకత్వ లక్షణాలకు నిఖార్సైన నిదర్శనం... జట్టుకు ఏం కావాలో పసిగట్టే ఆలోచనాపరుడు... ప్రతిభావంతులను గుర్తించే నేర్పరి... ప్రయోగాలకు వెరవని నైజం... పంతాన్ని సాధించే పట్టుదల... ఈ విశేషణాల కలబోతే సౌరభ్ గంగూలీ. మ్యాచ్ ఫిక్సింగ్ సంక్షోభంతో కుంగిపోయిన భారత క్రికెట్‌ను ముందుగా తన సమర్థ సారథ్యంతో బయటపడేసి, అనంతరం కుర్రాళ్లకు మార్గ నిర్దేశనంతో మనం ఏదైనా సాధించగలం అనే ఆత్మవిశ్వాసం నింపి టీమిండియాకు పునర్వైభవం తెచ్చాడీ కోల్‌కతా రాకుమారుడు. దేనికీ తొందరగా తలొగ్గని స్వభావి అయిన సౌరభ్... ఒక దశలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. వాటికి ఎదురీది మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆటకు హుందాగా వీడ్కోలు పలికాడు. చాపెల్‌తో అనుభవాలు, తండ్రి సూచనను ఆత్మకథ ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’లో ఇప్పటికే ప్రస్తావించిన గంగూలీ... అప్పట్లో మహేంద్ర సింగ్ ధోనిపై తన అంచనాలు, కోల్‌కతా ఫ్రాంచైజీ యజమాని షారుక్ ఖాన్ సహచర్యం, పాక్ పేసర్ అక్తర్ తీరు, చరిత్రాత్మక కోల్‌కతా టెస్టు విశేషాలు, కెరీర్ ముగింపు, కెప్టెన్సీ గురించి విపులంగా వివరించాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే... ఒత్తిడిని చిత్తుచేయగల, మ్యాచ్ మలుపుతిప్పగల ఆటగాడి కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూశా. అలాంటి తరుణంలో ధోని కనిపించాడు. మొదటి రోజు నుంచే అతడు నన్ను ఆకట్టుకున్నాడు. నిజానికి నా సారథ్యంలో 2003 ప్రపంచకప్ ఆడిన భారత జట్టులో ధోని ఉండుంటే ఆ కథే వేరుగా ఉండేది. ఆ సమయంలో అతను రైల్వే టీసీగా ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. ఏదేమైనా ఆ తర్వాత నా అంచనాలను అతడు అందుకున్నాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్‌కు నేను వ్యాఖ్యాతగా ఉన్నా. భారత్ విజయం సాధించబోయే క్షణంలో నన్ను కామెంటరీ బాక్స్‌లో ఉండమని ప్రసారకర్తలు కోరారు. అయితే నేను మాత్రం ‘చూడండి... ఇప్పటివరకు మీరు చెప్పిందంతా చేశా. ఇప్పుడు మాత్రం చేయలేను. నో చాన్స్’ అనేశా. మన జట్టు కప్ గెలిచిన అనుభూతి, కుర్రాళ్లు ట్రోఫీని అందుకున్న క్షణాలను ఆస్వాదించేందుకే బౌండరీ లైన్ వద్దకు వచ్చేశా. నా కుర్రాళ్లు భాగంగా ఉన్న ధోని సారథ్యంలోని జట్టు ప్రపంచకప్ గెలవడంతో నేను కూడా విజయంలో భాగమైనట్లు భావించా. నేను 2003లో కోల్పోయిన గెలుపును అక్కడ మళ్లీ పొందినట్లనిపించింది. షారుక్ ఓ అద్భుతం... అక్తర్ అర్ధం కాలేదు... సినిమా హీరోగా షారుక్ ముందే తెలిసినా బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా 2000లో నేరుగా కలిశా. అతడి చురుకుదనం, ఆకర్షణ శక్తికి ప్రభావితమయ్యా. తర్వాత మా ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. 2008లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా ‘కోల్‌కతా’ ఫ్రాంచైజీని షారుక్ కొన్నట్లు, నాకే కెప్టెన్సీ ఇచ్చినట్లు లలిత్ మోదీ ఫోన్ చేసి చెప్పాడు. నా అనుభవంతో అతడికి సాయపడమని కోరాడు. స్వశక్తితో పైకెదిగిన షారుక్ చాలా స్ఫూర్తిదాయకంగా కనిపించాడు. నన్నెపుడూ గౌరవంగా చూశాడు. ముఖ్యంగా అతడు బంగ్లా (మన్నత్)ను కొన్న తీరు... మా జట్టు యజమాని కలలను నిజం చేసుకునేవాడని చాటింది. షారుక్ సాహచర్యంలో ఆటగాళ్లు చాలా స్ఫూర్తిపొందారు. జట్టు యాజమాన్యం వద్దంటున్నా షోయబ్ అక్తర్‌ను తీసుకోమని ఒత్తిడి చేసింది నేనే. దానికతడు కొంత న్యాయం చేశాడు. కానీ... ఉన్నట్టుండి చిన్న గాయం సాకుగా చూపుతూ ఆడనని చెప్పేశాడు. చిన్నవాటిని లెక్కచేయొద్దని ఎంతో చెప్పా. అయినా మైదానంలోకి తీసుకురాలేకపోయా. కోల్‌కతా టెస్టు గురించి... ఆస్ట్రేలియా 2001 సిరీస్‌లో మనల్ని ముంబై టెస్టులో ఓడించింది. ఆ రాత్రే నేను కోల్‌కతా వెళ్లిపోయా. పిచ్‌ను ముందే అధ్యయనం చేశా. కానీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 చేస్తే, మేం 171 పరుగులకే అవుటయ్యాం. దీంతో మ్యాచ్, సిరీస్, నా కెప్టెన్సీ అన్నీ పోయినట్లే అనుకున్నాం. ఫాలోఆన్ ఆడే ముందు మా అత్తయ్య కలిసింది. క్రికెట్ తప్ప చాలా మాట్లాడుకున్నాం. చివరకు ‘సౌరభ్ నువ్వు ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలి’ అని కోరింది. ‘మీ అమ్మకు ఇదంతా ఎందుకు?’ అని నా భార్యపై మండిపడ్డా. రెండ్రోజుల తర్వాత చూస్తే మేం టెస్టు క్రికెట్లో చరిత్రాత్మక విజయం సాధించాం. ఆ తర్వాతెప్పుడూ ‘నా మాటలు మర్చిపో’ అని మా అత్తయ్య నాకు చెప్పలేదనుకోండి. మ్యాచ్ అనంతరం మా ఇంటికి వెళ్లాం. అప్పుడామె ‘ఇలా జరుగుతుందని రెండ్రోజుల క్రితమే చెప్పా’ అంటూ ఆటగాళ్లందరికీ వివరించింది. లక్ష్మణ్, రాహుల్ అభినందనలకు అర్హులు. రెండో ఇన్నింగ్స్‌లో వీవీఎస్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపడం కఠిన నిర్ణయమే. దీనిపై ద్రవిడ్ నొచ్చుకున్నాడు. అయితే... వీరిద్దరూ 281, 180 పరుగులతో చరిత్ర సృష్టించారు. ఈ సిరీస్ కెప్టెన్‌గా, ఆటగాడిగా నాలో మార్పు తెచ్చింది. భారత క్రికెట్‌ను మార్చిన ఈ విజయం నా సారథ్యంలో గొప్పదైతే, 2003 ప్రపంచకప్ గెలవకపోవడం ఇప్పటికీ బాధించే పెద్ద వైఫల్యం. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం సరైన నిర్ణయంగానే భావిస్తా. వన్డే కెరీర్ అలా ముగుస్తుందనుకోలేదు... 2007లో వన్డేల్లో 1240 పరుగులు సాధించా. టెస్టుల్లో 1106 పరుగులు చేశా. నా ఆఖరి వన్డే సిరీస్ పాకిస్తాన్‌తో గ్వాలియర్‌లో ముగిసింది. తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ, సెంచరీ చేశా. ఇదే ఫామ్ ఆస్ట్రేలియా పర్యటనలో చూపా. కానీ అనూహ్యంగా ముక్కోణపు వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. దీంతో భవిష్యత్తు వన్డే ప్రణాళికల్లో లేనని తెలిసిపోయింది. ‘చివరి’ కెప్టెన్సీ గురించి... నా చివరి టెస్టు (2008లో ఆస్ట్రేలియాపై నాగ్‌పూర్)లో మర్యాదపూర్వకంగా కెప్టెన్సీ చేయమని ధోని అడిగాడు. ఆశ్చర్యపోయి... మొదట వద్దన్నా. మళ్లీ కోరడంతో అంగీకరించా. కానీ సరిగ్గా దృష్టిసారించలేకపోయా. మూడు ఓవర్ల తర్వాత ‘ఇది నీ బాధ్యత’ అంటూ అతడికే అప్పగించేశా. దీనికి ఇద్దరం నవ్వుకున్నాం. -
ధోని చెప్పిందొకటి.. రైనా చేసిందొకటి!
కేప్‌టౌన్: ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, జట్టు ఆటగాడు సురేశ్ రైనాకు ఇచ్చిన సూచనలు పాటించక పోవడంతో మిస్ ఫైర్ అయిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ధోని చెప్పిన దానికి వ్యతిరేకంగా రైనా బౌలింగ్ చేసి మూల్యం చెల్లించుకున్నట్లు ట్వీట్లు వస్తున్నాయి. చివరి టీ20లో దక్షిణాఫ్రికా ఛేజింగ్ చేయగా.. ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ 16 పరుగులు ఇచ్చాడు. ఆ మరుసటి ఓవర్ రైనా బౌలింగ్ చేశాడు. తొలి 3 బంతులకు కేవలం మూడు పరుగులే ఇచ్చిన రైనాకు మిస్టర్ కూల్ ధోని కొన్ని సూచనలు ఇచ్చినట్లు స్టంప్ మైక్‌లో రికార్డయింది. ‘ఫాస్ట్‌గా బౌల్ చేయొద్దు.. కానీ వికెట్లకు నేరుగా బౌలింగ్ చేయ్ అంటూ’ ధోని మూడుసార్లు చెప్పినా రైనా అలా కాకుండా వేగంగా బంతులు సంధించాడు. దీంతో దక్షిణాఫ్రికా అరంగ్రేట ఆటగాడు జాంకర్ వరుస బౌండరీలు బాదాడు. ధోని మాట వినకపోవడం వల్లే రైనా బౌలింగ్‌ను సఫారీ క్రికెటర్ ఆటాడుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా, ఇటీవల మరో మ్యాచ్‌లో మనీశ్ పాండే ఎక్కడో చూస్తూ.. కాస్త ఉదాసీనత ప్రదర్శించగా.. అక్కడ ఏం చూస్తావ్.. ఇటువైపు చూడంటూ ధోని ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. A post shared by Abhishek Mahajan (@abhishekmonti) on Feb 27, 2018 at 8:26pm PST -
ధోని బలవంతం మీద తప్పక చేశాను!
సాక్షి, కోల్‌కతా: భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్లలో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఒకరు. తనకు ముందు ఉన్న కెప్టెన్ల రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళ్లిన గంగూలీ కెరీర్ చివరి రోజుల్లో ఎంతో మానసిక క్షోభ అనుభవించాడు. గంగూలీ భాదను చూడలేక ఆయన తండ్రి రిటైర్ కావాలంటూ సూచించారట. ఈ విషయాలను తన ఆత్మకథ ‘ ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’లో గంగూలీ రాసుకున్నారు. త్వరలో సౌరవ్ ఆత్మకథ విడుదల కానున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. 2008 నవంబర్‌లో నాగపూర్ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఆడిన నాలుగో టెస్ట్ గంగూలీకి చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్. ‘ఆ టెస్టుకు ముందు రిటైర్మెంట్పై ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నాగ్‌పూర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్పల్ప స్కోరుకే 9 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నా వద్దకు వచ్చాడు. కొద్దిసేపు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవాలని సూచించగా ఒప్పుకున్నాను. అయితే అదే రోజు అంతకుముందే కెప్టెన్‌గా చేయాలని నన్ను కోరగా నేను సున్నితంగా తిరస్కరించాను. మళ్లీ ఆసీస్ చివరి వికెట్ సమయంలో వచ్చి కొద్దిసేపు కెప్టెన్‌గా చేయాలంటూ ధోని బలవంతం చేయగా తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది. సరిగ్గా నేను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి అప్పటికీ సరిగ్గా 8 ఏళ్లు పూర్తయ్యాయి. దాంతో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి మూడు ఓవర్లు ఫీల్డింగ్ సెట్ చేసిన తర్వాత మహీ ఇక నువ్వే చూసుకో అన్నాను. ఎందుకంటే నేను పూర్తిస్థాయిలో ఏకాగ్రత చూపించలేని కారణంగా చివరి వికెట్ తీసే వరకూ కెప్టెన్‌గా ఉండలేకపోయానంటూ’ గంగూలీ వివరించారు. ‘ఆ సిరీస్‌కు ముందు అనిల్ కుంబ్లేను కలిసి నన్ను జట్టులోకి తీసుకుంటారా.. నీకు ఏమైనా తెలుసా అని అడిగాను. మళ్లీ నేను కెప్టెన్ అవుతానా.. నా సేవలు టీమిండియాకు అవసరమవుతాయా అని కుంబ్లేతో చర్చించాను. పరిస్థితులు డిమాండ్ చేస్తే నువ్వు జట్టులోకి రావడంతో పాటు మళ్లీ కెప్టెన్ అవుతావని కుంబ్లే ధైర్యం చెప్పాడు. భారత కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోల్‌కతా వీధుల్లో తిరగడానికి ఇబ్బంది పడే వాడిని. మారువేషంలో వీధుల్లో తిరుగుతూ దుర్గాదేవిని గంగలో నిమజ్జనం చేసే వరకూ ఆసక్తిగా ఉత్సవాల్లో పాల్గొనేవాడినని’ పలు విషయాలు దాదా నెమరువేసుకున్నారు. -
‘పద్మ భూషణ్’ ధోని, పంకజ్
న్యూఢిల్లీ: తన నాయకత్వ పటిమతో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించిన మేటి క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని... క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో ప్రపంచ టైటిల్స్‌ను అలవోకగా సాధించే అలవాటున్న భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కేంద్ర ప్రభుత్వం అం దించే దేశ అత్యున్నత మూడో పౌర పురస్కారం ‘పద్మ భూషణ్’కు ఎంపికయ్యారు. మరో నలుగురు క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్ (బ్యాడ్మింటన్–ఆంధ్రప్రదేశ్), సోమ్‌దేవ్ (టెన్నిస్–త్రిపుర), మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్–మణిపూర్), మురళీకాంత్ పేట్కర్ (స్విమ్మింగ్–మహారాష్ట్ర)లకు ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించాయి. జార్ఖండ్‌కు చెందిన 36 ఏళ్ల ధోని కెప్టెన్సీలో భారత్ టి20 వరల్డ్ కప్ (2007లో), వన్డే వరల్డ్ కప్ (2011లో), చాంపియన్స్ ట్రోఫీ (2013లో) టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ధోని 2014లో టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. 2009లో ‘పద్మశ్రీ’ పురస్కారం గెల్చుకున్న ధోని ప్రస్తుతం వన్డే, టి20 ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల పంకజ్ అద్వానీ ఇప్పటివరకు 18 ప్రపంచ టైటిల్స్ సాధించాడు. గతేడాది వరల్డ్, ఆసియా స్నూకర్, బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు. 2009లో ‘పద్మశ్రీ’ అవార్డు పొందిన పంకజ్ 2006లో ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’... 2004లో ‘అర్జున అవార్డు’ కూడా పొందాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ గతేడాది అద్వితీయ ప్రదర్శన చేశాడు. నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ (ఇండో నేసియా, ఆస్ట్రేలియన్, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్) సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. మణిపూర్‌కు చెందిన 23 ఏళ్ల మీరాబాయి చాను గతేడాది ప్రపంచ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. 1995లో కరణం మల్లీశ్వరి తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం నెగ్గిన రెండో లిఫ్టర్‌గా ఆమె గుర్తింపు పొందింది. త్రిపురకు చెందిన 32 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 2010 కామన్వెల్త్ గేమ్స్, 2010 ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించాడు. గతేడాది ఆటకు వీడ్కోలు పలికిన సోమ్‌దేవ్ డేవిస్‌కప్‌లో గొప్ప విజయాలు సాధించాడు. మహారాష్ట్రకు చెందిన 70 ఏళ్ల స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ 1972 పారాలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో 37.33 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణం సాధించడమే కాకుండా ప్రపంచ రికార్డు సృష్టించారు. పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించిన క్రీడాకారుడిగా చరిత్ర లిఖించారు. -
ధోనినా.. మజాకా..!
సాక్షి, ఇండోర్: శ్రీలంకతో ఇండోర్‌లో జరిగిన రెండో టి 20లో భారత్ విజయం సాధించి సరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని అందరి చూపు తనవైపు తిప్పుకుంటున్నాడు. మొదటి టి 20లో ధోని రెండు క్యాచ్‌లు, రెండు స్టంప్ అవుట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టి 20లో కూడా అటూ బ్యాటింగ్‌లో, ఇటూ కీపింగ్‌లో అందర్ని అబ్బురపరిచాడు. భారత్ 20 ఓవర్లలో 260 పరుగులు చేసింది. ఇండియాకు టి20లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక లక్ష్యఛేదనలో తడబడి 88 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కుల్దీప్ యాదవ్ వేసిన 15 ఓవర్లో గుణరాత్నే షాట్ ఆడబోయి వికెట్ల వెనుక ధోనికి చిక్కాడు. అందరూ నాటౌట్అనుకున్నారు.. కానీ ధోని మాత్రం ఆ సమయంలో చాలా కానిఫిడెంట్గా కనిపించారు. లెగ్ ఆంపైర్ నిర్ణయాన్ని థర్డ్ ఆంపైర్కు ఇచ్చాడు. చివరకు అది స్టంప్ అవుట్ అని తేలింది. అలాగే, చాహల్ వేసిన 16 ఓవర్లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ సమరవిక్రమను కూడా ధోని స్టంప్ అవుట్ చేశాడు. అద్భుత ప్రదర్శనతో ధోని ఇటీవల తనపై వచ్చిన రూమర్స్‌కు తనదైన శైలిలో సమాధానం చెబుతున్నాడు. వన్‌డౌన్‌లో ధోని... రోహిత్ అవుట్ అయిన తర్వాత అనూహ్యంగా వన్‌డౌన్‌లో వచ్చిన ధోని (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాహుల్‌కు జత కలిశాడు. 14వ ఓవర్ తొలి రెండు బంతులను బౌండరీలు బాదాడు. మధ్యలో కొంత తగ్గినా... స్పిన్నర్ ధనంజయ వేసిన 17వ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టాడు. రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 78 పరుగులు జత చేశాడు. ధోని మరో రికార్డు చేరువలో.. ధోని మరో మూడు క్యాచ్‌లు పడితే అంతర్జాతీయ టీ 20 క్రికెట్లో 50 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం 47 అంతర్జాతీయ టీ 20 క్యాచ్‌లతో ధోని ఉన్నాడు. ముంబైలో ఆదివారం జరగనున్న మూడో టి 20 మ్యాచ్‌లో ధోని ఈ ఘనత సాధిస్తాడో లేదో వేచి చూడాలి. -
ధోనినా.. మజాకా..!
-
ధోనిని చూస్తే మా ఫాదర్ గుర్తొస్తారు..!
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌తో మహేంద్ర సింగ్ ధోనికి ప్రత్యేక బంధం ఉంది. ధోని సచిన్‌ను ఎప్పుడు కలిసిన చాలా గౌరవం ఇస్తాడు. సచిన్ కూడా అదే రీతిలో స్పందిస్తారు. ఈ దిగ్గజానికి ప్రపంచకప్ అందుకోవాలన్న కల ఉండేది. ఆ కోరిక మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో తీరింది. దాదాపు 28 సంవత్సరాల తర్వాత 2011లో భారత్ వరల్డ్ కప్‌ను ధోని నాయకత్వలో సాధించిన విషయం తెలిసిందే. సచిన్ ఆరుమంది కెప్టెన్ల సారథ్యంలో ఆడాడు. అందరి కంటే కూడా ధోని బెస్ట్ అని సచిన్ ప్రశంసలు కురిపించాడు. ఇటీవల సచిన్ ధోని గురించి తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు. ‘ ధోని ఎప్పుడూ చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. అతని చూసినప్పడు మా నాన్న రమేశ్ టెండూల్కర్ గుర్తుకు వస్తారు’ అని సచిన్ అన్నారు. ‘మ్యాచ్ గెలిచినా, ఓడిపోయినా ధోని చాలా కామ్‌గా కనిపించేవాడు. మా నాన్న కూడా ఏం జరిగినా మహిలా సైలెంట్‌గా ఉంటారు. అందుచేతనే మహిని చూస్తే మా నాన్న గుర్తుకు వస్తారని’ సచిన్ తెలిపారు. సచిన్ 1999 వరల్డ్ కప్ ఆడుతున్న సమయంలో తండ్రి రమేశ్ టెండూల్కర్ మరణించారు. తండ్రి మీద ఉన్న ప్రేమ, గౌరవంతో సచిన్ సెంచరీ, ఆఫ్ సెంచరీ చేసిన ఆకాశం వైపు చూసి నాన్నకు అంకితమివ్వటం మనం చాలాసార్లు చూశాం. మన మిస్టర్ కూల్ సచిన్‌కు పెద్ద అభిమాని. కేవలం అతని ఆట కోసం మాత్రమే మ్యాచ్‌ను చూసేవాడంట. -
'సామ్'తో ధోనీ డాన్స్ చూస్తే ఫిదా కావాల్సిందే!
-
బీసీసీఐ ట్వీట్.. ధోని వైరల్ వీడియో!
సాక్షి, ఇండోర్ : తమ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఆరంభ ఓవర్లలో పేసర్ భువనేశ్వర్ బంతితో నిప్పులు చెరిగితే.. ఆపై యువ స్పిన్నర్లు యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ లు మిగిలిన పని కానిస్తున్నారు. ఇక్కడి హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని శనివారం సరదాగా బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. భారత స్పిన్ బౌలింగ్ అటాకింగ్‌లో ఎవరు చేరారో చూడంటం బీసీసీఐ తన అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో వన్డే నేటి మధ్యాహ్నం ప్రారంభం కానుంది. 2011లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా లార్డ్స్ టెస్టులో ఈ ఝార్ఖండ్ డైనమెట్ బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ టెస్టులో స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌ను దాదాపు ఔట్ చేసినంత పనిచేశారు మహీ. తాజాగా శనివారం చహల్, కుల్దీప్, అక్షర్ పటేల్‌లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే.. నేను సైతం అంటూ ధోని కూడా బౌలింగ్‌లో శ్రమించారు. ఆప్ బ్రేక్స్, లెగ్ బ్రేక్స్ అలవోకగా వేస్తున్న ఆ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ధోని.. బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీ, ఫినిషింగ్, స్పిన్, పేస్ బౌలింగ్, మహీ ఏదైనా చేయగలడంటూ ట్విట్లర్లో కామెంట్ చేస్తున్నారు. మూడో వన్డేలో ధోని బౌలింగ్ చేస్తే చూడాలని ఉందంటూ మరికొందరు నెటిజన్లు ఆశిస్తున్నారు. Look who has joined India’s Spin Attack - @msdhoni pic.twitter.com/JFMatmP0WP — BCCI (@BCCI) 23 September 2017 -
బీసీసీఐ ట్వీట్.. ధోని వైరల్ వీడియో!
-
‘ధనాధన్’ దశ మార్చేసింది!
జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ మైదానంలో కొత్త చరిత్ర... తొలిసారి నిర్వహించిన టి20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచిన రోజు... ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడాలని, వారిని ఓడించి విశ్వవిజేతగా నిలవాలని సగటు క్రికెట్ అభిమాని కన్న కలలు నిజం చేసిన రోజు. శ్రీశాంత్ పట్టిన మిస్బావుల్ హక్ క్యాచ్ టీమిండియాకు కప్ మాత్రమే అందించలేదు... టి20 క్రికెట్‌కు కొత్త కళను తెచ్చింది. పొట్టి ఫార్మాట్ విలువను ప్రపంచానికి చూపించింది. మరుసటి ఏడాదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో టి20 క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసిందంటే అందుకు భారత్ సాధించిన విజయమే కారణం. ఐపీఎల్ ఒక్కటే కాదు... ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌లు రావడానికి టీమిండియా గెలుపే కారణమంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి తమకే కొత్తగా కనిపించిన ఆటలో సరిగ్గా పదేళ్ల క్రితం ధోని సేన సృష్టించిన సంచలనాన్ని ఎవరు మరిచిపోగలరు? సాక్షి క్రీడా విభాగం : ద్రవిడ్ వద్దనుకున్నాడు... గంగూలీ తన వల్ల కాదన్నాడు... సచిన్ తన అవసరం లేదన్నాడు... 2007 టి20 ప్రపంచ కప్‌కు ముందు భారత జట్టు కెప్టెన్‌ను, జట్టును ఎంపిక చేసే సమయంలో పరిస్థితి ఇది. అదే ఏడాది ఆరంభంలో వెస్టిండీస్‌లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఘోర పరాభవం తాలూకు జ్ఞాపకాలను ఈ దిగ్గజాలు మరచిపోలేదు. అందుకే ఈ ఫార్మాట్ కుర్రాళ్ల కోసమంటూ తమం తట తాముగా జట్టు నుంచి తప్పుకున్నారు. పనిలో పనిగా ధోనిని వరల్డ్ కప్ కోసం కెప్టెన్‌గా చేస్తే బాగుంటుందని కూడా సచిన్ సలహా ఇచ్చాడు. నాయకుడిగా ధోనికి గతానుభవం కూడా ఏమీ లేదు. కానీ సచిన్ సూచనను బీసీసీఐ అమలు చేసింది. అప్పటి వరకు భారత్ ఒకే ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడింది. ఇలాంటి సమయంలో ‘టైటి ల్ సాధించడమే మా లక్ష్యం’ అంటూ భారత జట్టు భారీ ప్రకటనలు ఏమీ చేయలేదు. ఆసీస్, దక్షిణాఫ్రికాలాంటి జట్లతో పోలిస్తే పొట్టి ఫార్మాట్‌కు ఒక రకంగా కొత్త అయిన టీమిండియా ఎలాంటి ఆశలు, అంచనాలు లేకుండా వరల్డ్ కప్ బరిలోకి దిగింది. ఆ సమయంలో ఆటగాళ్ల దృష్టిలో అది ఒక సరదా ‘సఫారీ’ టూర్ మాత్రమే. కానీ ధోని నాయకత్వంలో యువ భారత్ అద్భుత ప్రదర్శనతో ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకు పోయింది. ‘బౌల్డ్ అవుట్’ క్షణం... కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో ధోని తొందరగానే మరచిపోయే ఫలితం వచ్చింది. స్కాట్లాండ్తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ వేశాక వర్షంతో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. తర్వాతి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో పోరు మాత్రం మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇరు జట్లు 149 పరుగులే చేయడంతో విజేతను తేల్చేందుకు ఫుట్‌బాల్ పెనాల్టీ షూటౌట్ తరహాలో ‘బౌల్డ్ అవుట్’ను ఉపయోగించారు. భారత్ తరఫున సెహ్వాగ్, హర్భజన్, ఉతప్ప బంతులు వికెట్లను పడగొట్టగా... పాక్ తరఫున అరాఫత్, గుల్, ఆఫ్రిది విఫలం కావడంతో భారత్ గెలుపు బోణీ చేసింది. అయితే తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 10 పరుగులతో గెలిచి భారత్‌కు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత టీమిండియా జోరు మొదలైంది. సెమీస్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ధోని బృందం వరుసగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలను చిత్తు చేసింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం ఈ వరల్డ్ కప్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లోనూ టీమిండియా తమ పట్టు నిలబెట్టుకుంటూ 15 పరుగులతో గెలిచి దాయాదితో తుది పోరుకు సిద్ధమైంది. హీరో జోగీందర్... పాకిస్తాన్‌తో ఫైనల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు గంభీర్ (75) ప్రదర్శనతో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. పాకిస్తాన్ మాత్రం 19.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ కావడంతో 5 పరుగులతో విజయం సాధించిన ధోని సేన కప్‌ను ముద్దాడింది. మిస్బావుల్ హక్ చివరి వరకు ప్రమాదకరంగా కనిపించినా... అతని ఒక్క షాట్‌తో పాక్ తలరాత మారిపోయింది. ఆఖరి ఓవర్లో పాక్ విజయానికి 13 పరుగులు అవసరం. సీనియర్ హర్భజన్ సింగ్‌ను కాదని పేసర్ జోగీందర్ శర్మపై కెప్టెన్ ధోని నమ్మకముంచాడు. ‘ఎవరూ నీ మ్యాచ్‌లు చూడని సమయంలో దేశవాళీ క్రికెట్లో అంకితభావంతో ఎన్నో ఓవర్లు వేసి ఉంటావు. భయపడకు, క్రికెట్ ఈసారి నిన్ను నిరాశపర్చదు’... ఇవీ జోగీందర్‌కు ఆ సమయంలో ధోని చెప్పిన మాటలు. అయితే మిస్బా సిక్సర్ బాదడంతో తొలి 2 బంతుల్లో 7 పరుగులు వచ్చాయి. మరో 4 బంతుల్లో 6 పరుగులు చేస్తే చాలు. అయితే మూడో బంతిని స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో మిస్బా గాల్లోకి లేపడం... షార్ట్ ఫైన్ లెగ్‌లో శ్రీశాంత్ క్యాచ్ పట్టుకోవడం అంతా కలలా జరిగిపోయింది. అంతే... భారత్ సంబరాలకు అంతు లేకుండా పోయింది. ధోని మాటల్లో ఆ క్షణం... ‘మిస్బా షాట్ కొట్టగానే ఇక పోయిందని అనుకున్నాను. ఒక బౌన్స్‌తో బంతి బౌండరీ దాటుతుందని భావించా. అయితే షాట్ ఆడాక బంతి చాలా నెమ్మదిగా వెళుతున్నట్లు అనిపించింది. అప్పుడు శ్రీశాంత్ వైపు చూశాను. అతను బంతి వద్దకు వచ్చే లోపే మూడు సార్లు తడబడ్డాడు. అతను క్యాచ్ వదిలేస్తే ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నా. ఎందుకంటే సులువైన క్యాచ్‌లే కొన్ని సార్లు కష్టంగా మారిపోతాయి. వదిలేస్తే నా పరిస్థితి ఏమిటనే భయం అతనికీ ఉంటుంది. కాబట్టి నా దృష్టిలో అది అన్నింటికంటే కఠినమైన క్యాచ్.’ -
మహేంద్రుడికి మరో గౌరవం!
-
మహేంద్రుడికి మరో గౌరవం!
పద్మభూషణ్ పురస్కారానికి ధోని పేరు సిఫారసు చేసిన బీసీసీఐ న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి బీసీసీఐ సిఫారసు చేసింది. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలకు గుర్తింపుగా దేశంలో మూడో అత్యున్నత పురస్కారానికి ‘మిస్టర్ కూల్’ పేరును ప్రతిపాదించింది. పద్మ అవార్డులకు ఈ ఏడాది ధోని పేరు మాత్రమే సిఫారసు చేసినట్టు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ధోని పేరును ఏకగ్రీవంగా బోర్డు సభ్యులు నామినేట్ చేశారని తెలిపారు. ‘మహేంద్ర సింగ్ ధోని పేరును పద్మభూషణ్ అవార్డుకు బీసీసీఐ సిఫారసు చేసింది. బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సమకాలిన క్రికెట్లో గొప్ప ఆటగాళ్లలో ధోని ఒకడు. అతడి పేరును దేశ ప్రతిష్టాత్మక పురస్కారానికి ప్రతిపాదించడం సముచితమని భారత క్రికెట్ బోర్డు భావించింద’ని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా బుధవారం తెలిపారు. ‘మన దేశానికి చెందిన గొప్ప క్రికెటర్లలో ధోని ఒకడని.. వన్డేల్లో దాదాపు 10 వేల పరుగులు చేశాడు. 90 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అవార్డుకు నామినేట్ చేయడానికి ఇంతకంటే ఏం కావాల’ని ఖన్నా వ్యాఖ్యానించారు. కెప్టెన్‌గా టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోని 302 వన్డేలు ఆడి 9737 పరుగులు సాధించాడు. 90 టెస్టుల్లో 4876 పరుగులు.. 78 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో1212 పరుగులు చేశాడు. 36 ఏళ్ల ధోని ఇప్పటికే అర్జున, రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ అవార్డులు అందుకున్నాడు. -
'ధోని 2023 ప్రపంచ కప్ కూడా ఆడతాడు'
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ మరోసారి ప్రశంసల జల్లులు కురిపించారు. శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేతో కెరీర్లో 300వ మ్యాచ్ ఆడిన ధోనిని 'అగ్నిశిఖలా దూసుకుపోతున్నాడు' అని పేర్కొన్న క్లార్క్.. దిగ్గజ ఆటగాడైన ధోని కచ్చితంగా 2019 వన్డే ప్రపంచ కప్ జట్టులోనే కాదు 2023లో జరిగే వరల్డ్ కప్ జట్టులోనూ సభ్యుడిగా ఉంటాడంటూ జోస్యం చెప్పారు. ఇందుకు మిస్టర్ కూల్ ధోని ఫిల్‌నెస్ లెవల్స్ కారణమని క్లార్క్ చెప్పారు. ధోని ప్రతిభ, ఆటతీరుపై తనకేమాత్రం సందేహం లేదన్నారు. భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే కోల్‌కతాలో జరగనున్న రెండో వన్డేతోనూ సిరీస్ ఫలితం తేలిపోతుందని క్లార్క్ భావిస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ ధోని అద్భుత ఆటతీరుతో రాణించి లంకపై 5-0తో టీమిండియాను గెలిపించాడన్నారు. లంకతో వన్డే సిరీస్ ఫలితమే ధోని నైపుణ్యానికి నిదర్శనమని చెప్పవచ్చు. వచ్చే వరల్డ్ కప్ జట్టులో ధోని ఉంటాడో లేదోనని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ధోని రాణించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. టాపార్డర్ వికెట్లు త్వరగా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (66 బంతుల్లో 83) సాయంతో ధోని (88 బంతుల్లో 79) ముందుకు నడిపించి తొలి వన్డే నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడని ఆసీస్ మాజీ దిగ్గజం మైఖెల్ క్లార్క్ కొనియాడాడు. -
వరల్డ్‌కప్ వరకు ధోని : రవిశాస్త్రి
కొలంబో: ఇంగ్లండ్‌లో జరిగే 2019 ప్రపంచకప్ వరకు భారత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని జట్టులో కొనసాగుతాడా లేదా అన్న సందేహాలకు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టతనిచ్చారు. ధోని కెరీర్ సగం కూడా అయిపోలేదని 2019 ప్రపంచకప్ వరకు జట్టులో ఉంటాడని తేల్చేశారు. శ్రీలంక సిరీస్‌లో ధోని మూడు మ్యాచ్‌ల్లో 45, 67,49 నాటౌట్లతో అదరగొట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ఓ జాతీయ ఛానెల్‌తో రవిశాస్త్రీ మాట్లాడారు. ‘ధోని ఒక దిగ్గజం. జట్టును ప్రభావితం చేయగల వ్యక్తి. డ్రెస్సింగ్ రూంలో ధోని ఉంటే ఓ ఆభరణము ఉన్నట్టు. అతని సేవలు జట్టుకు ఎంతో అవసరం. ధోనిని మినహాయించి 2019 వరల్డ్‌కప్ వరకు యువ ఆటగాళ్లను రోటేషన్ పద్దతిలో ప్రయోగిస్తాం’ అని రవిశాస్త్రి పేర్కొన్నారు. ధోని ప్రపంచంలోనే దిగ్గజ వికెట్ కీపర్ అని, సచిన్, గవాస్కర్‌లు 36 ఏళ్ల వరకు ఆడారని అలాంటిది ధోని విషయంపైనే ఎందుకు అడుగుతున్నారని ఎదురు ప్రశ్నించారు. ప్రపంచకప్‌కు ముందు భారత్ 40 వన్డే మ్యాచ్‌లు ఆడబోతుందని, ఈ మ్యాచ్లన్నిటి ప్రపంచకప్‌కు ప్రయోగ మ్యాచ్‌లుగా వాడుకుంటామని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇప్పటికే జట్టులోని సభ్యులందరికీ అవకాశం వచ్చిందని, రానివారకి కూడా అవకాశం ఇస్తామని తెలిపారు. జట్టు ఎంపిక ప్రక్రియలో పాలుపంచుకోవడం నాపని కాదని, అది సెలక్టర్ల పని అన్నారు. ఆటగాళ్లు నాపై నమ్మకంతో ఉండటమే నాకు కావాలని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్‌పైనే జట్టు ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రపంచకప్ ప్రణాళికలనుంచి రైనా, యువరాజ్‌లను తొలిగించారన్న ప్రశ్నకు అవునని రవిశాస్త్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుత జట్టులో ఉన్న ఆటగాళ్లు వారికంటే ఫిట్‌గా ఉన్నారని చెప్పుకొచ్చారు. -
ధోనికి మైఖేల్ క్లార్క్ ప్రత్యేక సందేశం..
సాక్షి, హైదరాబాద్: శ్రీలంకతో జరిగే నాలుగో వన్డేతో కెరీర్లో 300వ మ్యాచ్ ఆడబోతున్న భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రత్యేక సందేశాన్ని పంపించాడు. ‘ శ్రీలంకపై రెండు ఫార్మట్లలో అసాధారణ ఆటతో అదర గోట్టారు. ఎంఎస్ ధోని అగ్నిశిఖలా దూసుకుపోతున్నాడు’ అని ట్వీట్ చేశాడు. లంకతో రెండో వన్డేలో ధోని భువీతో కలిసి 8 వికెట్‌కు అత్యధికంగా 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి ఓటమి అంచున ఉన్న భారత్‌ను గట్టెక్కించిన విషయం తెలిసిందే. అలాగే మూడో వన్డేలో కూడా ధోని రోహిత్ తో కలిసి భారత్‌కు 6 వికెట్ల తేడాతో విజయాన్నిందించి కష్టపరిస్థితుల్లో తన అవసరం ఏమిటో చూపించాడు. ఇక శ్రీలంకతో ప్రేమదాసు స్టేడియంలో జరిగే నాలుగో వన్డేతో ధోని 300 క్లబ్లో చేరనున్నాడు. అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ (463), రాహుల్ ద్రవిడ్(344), మహ్మద్ అజారుద్దీన్(334), సౌరవ్ గంగూలీ(311), యువరాజ్ సింగ్(304) ల సరసన నిలవనున్నాడు. 🇮🇳 playing some outstanding cricket in both forms against 🇱🇰 @msdhoni has been on 🔥 — Michael Clarke (@MClarke23) 29 August 2017 -
ఒంటి కాలితో అయినా ఆడతానన్నాడు
♦ పాక్‌తో మ్యాచ్‌కు ముందు ధోని పట్టుదల ♦ గుర్తు చేసుకున్న ఎమ్మెస్కే ప్రసాద్ చెన్నై: ఆట పట్ల మహేంద్ర సింగ్ ధోని అంకితభావం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతను జట్టు ప్రయోజనాల గురించే ఆలోచిస్తాడనేది వాస్తవం. దీనికి మరో ఉదాహరణ గత ఆసియా కప్ సమయంలో జరిగిన ఘటన. ఇక్కడ జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఈ విషయాన్ని పంచుకున్నారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు జిమ్‌లో ఎక్సర్సైజ్లు చేసే సమయంలో ధోని వెన్నుకు తీవ్ర గాయమైంది. అసలు ఏ మాత్రం నడవలేని స్థితిలో ఉన్న అతడిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లాల్సి వచ్చింది. దాంతో ఆందోళన చెందిన ఎమ్మెస్కే నేరుగా ధోని గదికి వెళ్లారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ‘ఏం ఫర్వాలేదు ఎమ్మెస్కే భాయ్ అని ధోని నాతో ఒకే ఒక్క మాట అన్నాడు. మీడియాతో ఏం చెప్పాలని అడిగినా అతను మళ్లీ అదే మాట అన్నాడు. ఎందుకైనా మంచిదని నేను పార్థివ్ పటేల్‌ను అందుబాటులో ఉండమని కూడా చెప్పాను. సరిగ్గా మ్యాచ్‌కు కొద్దిసేపు ముందు ధోని టీమ్ డ్రెస్సుతో సిద్ధమైపోయాడు. నా వద్దకు వచ్చి ఎందుకు అంతగా ఆందోళన పడిపోతున్నావు. ఒక కాలు కోల్పోయినా సరే... పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉంటా అని ధోని నాతో చెప్పాడు. ఎలాంటి సౌకర్యాలు లేని ప్రాంతం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగిన ధోని ఎందరికో స్ఫూర్తినిచ్చాడు’ అని ప్రసాద్ మాజీ కెప్టెన్‌పై ప్రశంసలు కురిపించారు. -
ఒంటికాలితోనైనా పాకిస్థాన్‌పై ఆడుతా: ధోనీ
2019 వరల్డ్ కప్‌లో ఆడబోయే భారత జట్టులో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి స్థానముంటుందా? ఉండదా? అన్న చర్చ ఇప్పుడు కొనసాగుతోంది. ధోనీకి చోటుపై సెలెక్టర్లు ఇప్పడే ఏమీ చెప్పకపోయినా.. అతను ఉండీ తీరాల్సిందేనని వీరేంద్ర సెహ్వాగ్ వంటి సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్చ నేపథ్యంలోనే ధోనీ ఇటీవల శ్రీలంకతో ఆడిన రెండు, మూడో వన్డేలలో రాణించి విమర్శకుల నోటికి తాళం వేశాడు. క్లిష్ట సమయాల్లో జట్టును విజయతీరాలకు (మ్యాచ్ ఫినిషింగ్) చేర్చే బాధ్యతను తీసుకోవడంలో తనకు తానే సాటని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో మాట్లాడిన భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ధోనీ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. గత ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా ధోనీ గాయపడ్డప్పటి సందర్భాన్ని ఆయన వివరించారు. 'అర్ధరాత్రి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో ధోనీ వెయిట్ ఎత్తబోతుండగా.. వెన్నులో పట్టుకున్నట్టు అయింది. దీంతో అతను బరువు వదిలేశాడు. అదృష్టంకొద్దీ ఆ బరువు అతనిపై పడలేదు. కానీ, అతను నడవలేకపోయాడు. దాదాపు పాకుతూ అల్లారం బెల్ మోగించాడు. వైద్య సిబ్బంది వెంటనే వచ్చి అతనికి ప్రథమ చికిత్స అందించి.. స్ట్రేచర్‌పై తీసుకెళ్లారు. అప్పట్లో సెలెక్టర్‌గా ఉన్న నేను ఢాకాకు చేరుకోగానే ధోనీకి ఏమైంది అన్న ప్రశ్న విలేకరుల నుంచి ఎదురైంది. నా వద్ద సమాధానం లేదు. పాకిస్థాన్‌కు మ్యాచ్ ఎంతో కీలకమైనది. ఏమైందో తెలుసుకోవడానికి నేను ధోనీ గదికి వెళ్లాను. 'ఆందోళన చెందకండి ఎమ్మెస్కే భాయ్' అంటూ ధోనీ చెప్పాడు. నేను ఎన్నిసార్లు అడిగినా అదే చెప్పాడు. కానీ చాలా కీలకమైన మ్యాచ్ కావడంతో మాపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఆ తెల్లారి నేను ధోనీ గదికి వెళ్లాను. అప్పుడు కూడా ఆందోళనేమీ వద్దని ధోనీ చెప్పాడు. (ఒక సెలెక్టర్‌గా) ధోనీ మాటలను నేను తేలిగ్గా తీసుకోలేకపోయాను. వెంటనే అప్పటి చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్‌కు ఫోన్ చేసి మాట్లాడాను. ధోనీ స్థానంలో ఆడేందుకు వెంటనే పార్థీవ్ పటేల్‌ను సాయంత్రంకల్లా ఢాకా పంపారు. అతను జట్టుతో చేరాడు. ఆ రాత్రి 11 గంటల సమయంలో నేను ధోనీ గదికి వెళ్లాను. అతను అక్కడ లేడు. స్మిమ్మింగ్‌పూల్ సమీపంలో నడిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. దాదాపు పాకుతున్నట్టు అతని పరిస్థితి ఉంది. తను నడిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు. నడవడానికే ఇంత కష్టపడుతున్న అతను మ్యాచ్ ఆడగలనని ఎలా నేను అనుకుంటుండగా.. ధోనీ నావంక చూస్తూ 'మీరేమీ ఆందోళన చెందకండి. నాకు చెప్పకుండానే పార్థీవ్ను పిలిపించుకున్నారు. మీరు సేఫ్‌గా ఉన్నారు' అన్నాడు'అని ఎమ్మెస్కే వివరించారు. మ్యాచ్ జరిగే రోజు ఆశ్చర్యకరంగా ధోనీ ప్యాడ్లు కట్టుకొని సిద్ధమయ్యాడని తెలిపారు. 'మధ్యాహ్నం జట్టు ప్రకటించేముందు ధోనీ డ్రెస్ చేసుకొని సిద్ధమయ్యాడు. అతను నన్ను తన రూమ్‌కు పిలిచి.. ఎందుకింత ఆందోళన చెందుతున్నావని అడిగాడు. 'నాకు ఒక కాలు లేకపోయినా ఒంటికాలితోనైనా నేను పాకిస్థాన్‌పై ఆడుతాను' అని ధోనీ చెప్పాడు' అని ఎమ్మెస్కే గుర్తుచేసుకున్నారు. ధోనీ అంటే ఏమిటో, మ్యాచ్ పట్ల అతని నిబద్ధత ఏమిటో చాటడానికి ఇది నిదర్శనమన్నారు. ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడటమే కాకుండా తన సారథ్యంలో దాయాదిపై విజయాన్ని అందించాడు. -
ధోనిపై ఇంకా సందేహాలా?
సునీల్ గావస్కర్ వన్డేలకు ధోని ఎంత అవసరమో... క్లిష్ట పరిస్థితుల్లో అతడెంత కీలకమో విమర్శకులకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. రెండో వన్డేలో భువనేశ్వర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు అద్భుతం. దీంతో అతని సత్తాపై ఇంకెవరికైనా సందేహాలుంటే... అవి పటాపంచలైనట్లే! అతనిపై ఆలోచిస్తామనే మాటలకు సమాధానం దొరికినట్లే! టాప్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు వరుస కట్టినా... మిగిలింది టెయిలెండర్లే అని తెలిసినా... ఎలాంటి కంగారు లేకుండా కూల్‌గా, కామ్‌గా తన పని కానిచ్చాడు ధోని. అతని వల్లే భువనేశ్వర్ మ్యాచ్‌ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. మాజీ సారథి చతురతతోనే అది సాధ్యమైందనే సంగతీ మరవొద్దు. అతను ప్రతి బంతికి సలహా ఇచ్చాడు. భువీ సాధికారికంగా ఆడేలా ముందుండి ప్రోత్సహించాడు. స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగినపుడు బంతి గమనంపై స్పష్టమైన సందేశాలిచ్చాడు. -
శ్రీలంకపై భారత్ గెలుపు
-
శ్రీలంకపై భారత్ గెలుపు
♦ అర్ధ సెంచరీతో కదం తొక్కిన భువనేశ్వర్ కుమార్ పల్లెకెలె: భారత్-శ్రీలంక మధ్య ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో ధోని-భువనేశ్వర్‌ల క్లాసిక్ ఇన్నింగ్స్‌తో భారత్ గట్టెక్కింది. ఒకానొక దశలో ఓటమి అంచుకు చేరిన భారత్ చివరికి 3 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. అంతకు ముందు 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(54), శిఖర్‌ధావన్(49)లు మంచి శుభారంబాన్ని అందించారు. లంక స్పిన్నర్ అఖిల ధనంజయ ఓపెనర్ రోహిత్‌ను అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటి వరకు పటిష్టంగా కనిపించిన భారత్ ధనంజయ స్పిన్ మాయాజాలానికి ఒక్కసారిగా కుప్పకూలింది.ఆ వెంటనే శిఖర్ ధావన్ సిరివర్ధన బౌలింగ్‌లో క్యాచ్ అవుటై అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. ధనుంజయ వరుస ఓవర్లో జాదవ్(1), కెప్టెన్ విరాట్ కోహ్లి(4), కేఎల్ రాహుల్(4), హార్ధిక్ పాండ్యా(0), అక్షర్ పటేల్(6) లను అవుట్ చేసి మొత్తం 6 వికెట్లతో భారత బ్యాటింగ్ ఆర్డర్ ను దెబ్బతీశాడు. భారత్ కేవలం 22 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో క్రీజులో ఉన్న మహేంద్రసింగ్ ధోని, భువనేశ్వర్‌తో కలిసి ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ సింగిల్స్ తీస్తూ వీలు చిక్కినప్పుడుల్లా బంతిని బౌండరీకి తరలించారు. ధోని(45) క్లాస్‌గా ఆడినా భువీ వేగంగా ఆడుతూ (51; 4 ఫోర్లు, ఒక సిక్స్) కెరీర్లో తొలి అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో భారత్ విజయం సునాయసమైంది. 6 వికెట్లతో భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన శ్రీలంక యువ స్పిన్నర్ ధనంజయకు మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ వరించింది. ధోని అవుట్.. జస్ట్‌మిస్.. ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు ‘అదృష్టం తలుపు తడితే దురదృష్టం వెనుక తలుపు తట్టినట్లు’ అయింది. దాదాపు విజయం కాయం అనుకున్న సందర్భంలో ధోని-భువీ 8వ వికెట్ అత్యుత్తమ భాగస్వామ్యంతో శ్రీలంక నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. లంక బౌలర్ ఫెర్నాండో వేసిన 34 ఓవర్ మూడో బంతి నేరుగా వికెట్లకు తగిలింది. అయితే స్టంప్స్ కింద పడకపోవడంతో ధోనిని అదృష్టం వరించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ధోని భువీతో కలిసి మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు.