ధోనీ గిఫ్ట్ జీవితాంతం గుర్తుంటుంది: కోహ్లీ
న్యూఢిల్లీ: టెస్టుల్లోనే కాదు, పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ మహేంద్ర సింగ్ ధోనీ శకం ముగిసింది. పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలను చేపట్టిని కోహ్లీకి తొలి వన్డే సిరీస్‌నే కానుకగా అందించాడు ధోనీ. ఎలా అంటే.. మాజీ కెప్టెన్ ధోనీ విలువైన సలహాలు, ఆటగాళ్లతో సమన్వయం లాంటివి మైదానంలో తనకెంతో కలిసొచ్చాయని కోహ్లీ తెలిపాడు. కెప్టెన్సీలో తొలి వన్డే సిరీస్‌ను భారత్‌కు అందించిన తనకు ధోనీ మరో అరుదైన గిఫ్ట్ ఇచ్చాడని కోహ్లీ అంటున్నాడు.
సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత స్టంప్స్ తీసుకెళ్లడం ధోనీకి అలవాటు. ప్రస్తుతం విలువైన ఎల్ఈడీలతో కూడిన స్టంప్స్ ఉండటంతో స్టంప్స్ తీసుకెళ్లడం సాధ్యంకాదని కోహ్లీ నవ్వుతూ చెప్పాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డేలోనూ టీమిండియా నెగ్గిన అనంతరం ధోనీ తనకు మ్యాచ్ బాల్ ను గిఫ్ట్‌గా ఇచ్చాడని ఇది తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు కోహ్లీ. తొలి వన్డే సిరీస్ విజయంలో ఉన్న తనకు ధోనీ ఆటోగ్రాఫ్ చేసిన బంతిని ఇవ్వడం చాలా గౌరవంగా భావిస్తున్నానని, ఇది తనకు జీవితాంతం గుర్తుకు ఉండేలా చేశాడని ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో కోహ్లీ సేన కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కోల్ కతాలో జరిగిన ఉత్కంఠపోరులో ఇంగ్లండ్ ఐదు పరుగులతో టీమిండియాపై నెగ్గి ఎట్టకేలకు భారత పర్యటనలో ఓ విజయాన్ని నమోదు చేసింది.