ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌తో మహేంద్ర సింగ్ ధోనికి ప్రత్యేక బంధం ఉంది. ధోని సచిన్‌ను ఎప్పుడు కలిసిన చాలా గౌరవం ఇస్తాడు. సచిన్ కూడా అదే రీతిలో స్పందిస్తారు. ఈ దిగ్గజానికి ప్రపంచకప్ అందుకోవాలన్న కల ఉండేది. ఆ కోరిక మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో తీరింది. దాదాపు 28 సంవత్సరాల తర్వాత 2011లో భారత్ వరల్డ్ కప్‌ను ధోని నాయకత్వలో సాధించిన విషయం తెలిసిందే. సచిన్ ఆరుమంది కెప్టెన్ల సారథ్యంలో ఆడాడు. అందరి కంటే కూడా ధోని బెస్ట్ అని సచిన్ ప్రశంసలు కురిపించాడు.
ఇటీవల సచిన్ ధోని గురించి తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు. ‘ ధోని ఎప్పుడూ చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. అతని చూసినప్పడు మా నాన్న రమేశ్ టెండూల్కర్ గుర్తుకు వస్తారు’ అని సచిన్ అన్నారు. ‘మ్యాచ్ గెలిచినా, ఓడిపోయినా ధోని చాలా కామ్‌గా కనిపించేవాడు. మా నాన్న కూడా ఏం జరిగినా మహిలా సైలెంట్‌గా ఉంటారు. అందుచేతనే మహిని చూస్తే మా నాన్న గుర్తుకు వస్తారని’ సచిన్ తెలిపారు.
సచిన్ 1999 వరల్డ్ కప్ ఆడుతున్న సమయంలో తండ్రి రమేశ్ టెండూల్కర్ మరణించారు. తండ్రి మీద ఉన్న ప్రేమ, గౌరవంతో సచిన్ సెంచరీ, ఆఫ్ సెంచరీ చేసిన ఆకాశం వైపు చూసి నాన్నకు అంకితమివ్వటం మనం చాలాసార్లు చూశాం. మన మిస్టర్ కూల్ సచిన్‌కు పెద్ద అభిమాని. కేవలం అతని ఆట కోసం మాత్రమే మ్యాచ్‌ను చూసేవాడంట.
Comments
Please login to add a commentAdd a comment