సచిన్ టెండూల్కర్ దే అగ్రస్థానం: గూగుల్
2013 సంవత్సరంలో ఇంటర్నెట్ లో అత్యధికంగా సర్చ్ చేసిన క్రీడాకారుల్లో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో నిలిచినట్టు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. క్రికెట్ ఆటకు సంబంధించిన అన్ని ఫార్మాట్ల నుంచి సచిన్ టెండూల్కర్ రిటైరైన సంగతి తెలిసిందే.
సచిన్ తర్వాత అథ్లెట్ మిల్కా సింగ్, భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, లియోనల్ మెస్సీ, రోజర్ ఫెదరర్, సానియా మిర్జా, రాహుల్ ద్రావిడ్, క్రిస్ గేల్, రవీంద్ర జడేజా, సైనా నెహ్వాల్ లున్నారు.
అలాగే గూగుల్ ఇండియా నిర్వహించిన సర్వేలో 2013 లో స్పాట్ ఫిక్సింగ్ ఘటనతో దేశ క్రీడా రంగాన్ని కుదిపేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ట్రెండింగ్ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.