ఈ ఫోటోలోని క్రికెటర్ ఎవరో తెలుసా? | sachin tendulakar wishes fathers day to every one | Sakshi
Sakshi News home page

ఈ ఫోటోలోని క్రికెటర్ ఎవరో తెలుసా?

Published Sun, Jun 19 2016 5:52 PM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

ఈ ఫోటోలోని క్రికెటర్ ఎవరో తెలుసా?

ఈ ఫోటోలోని క్రికెటర్ ఎవరో తెలుసా?

ముంబై: ఫోటోలో ఉన్న భారత లెజెండరీ క్రికెటర్‌ను గుర్తు పట్టారా?. చాలా అరుదైన ఈ ఫోటోను ఫాదర్స్ డే సంద్భంగా తన ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ కప్‌ మ్యాచ్‌లు ఆడుతుండగానే తానెంతగానో ఇష్టపడే తండ్రి మరణ వార్త విన్నారు ఆయన. అంతే వెంటనే తండ్రి అంతిమ సంస్కారాలకు హాజరై, క్రికెట్ ఇష్టపడే కోట్లాది భారత అభిమానుల కోసం తిరుగు ప్రయాణం అయ్యారు. మరుసటి మ్యాచ్‌లోనో సెంచరీ చేసి తన తండ్రికి అంకితమిచ్చారు. ఆయనే భారత రత్న, సచిన్ టెండుల్కర్.

తానెంతగానో ఇష్టపడే తండ్రి రమేష్ టెండుల్కర్‌ను ఫాదర్స్ డే సందర్భంగా సచిన్ టెండుల్కర్ స్మరించుకున్నారు. తననెప్పుడూ ఉన్నత స్థానంలో చూడాలని తండ్రి అనుకునేవారని.. రమేష్ టెండుల్కర్, సచిన్‌ను చేతులతో ఎత్తుకొని ఉన్న ఈ ఫోటోను పోస్ట్ చేశారు.   

1999 ప్రపంచ కప్ సమయంలో సచిన్‌ తండ్రి రమేష్ టెండుల్కర్ మృతిచెందారు. తండ్రి అంతిమ సంస్కారాలకు భారత్ రావడంతో జింబాబ్వేతో ఆడే మ్యాచ్ కోల్పోయారు. వెంటనే మళ్ళీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై కెన్యా పై బ్రిస్టన్ లో జరిగిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేసి, ఆ శతకాన్ని తన తండ్రికి అంకితం ఇచ్చారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement