Ramesh Tendulkar
-
ధోనిని చూస్తే మా ఫాదర్ గుర్తొస్తారు..!
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌తో మహేంద్ర సింగ్ ధోనికి ప్రత్యేక బంధం ఉంది. ధోని సచిన్‌ను ఎప్పుడు కలిసిన చాలా గౌరవం ఇస్తాడు. సచిన్ కూడా అదే రీతిలో స్పందిస్తారు. ఈ దిగ్గజానికి ప్రపంచకప్ అందుకోవాలన్న కల ఉండేది. ఆ కోరిక మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో తీరింది. దాదాపు 28 సంవత్సరాల తర్వాత 2011లో భారత్ వరల్డ్ కప్‌ను ధోని నాయకత్వలో సాధించిన విషయం తెలిసిందే. సచిన్ ఆరుమంది కెప్టెన్ల సారథ్యంలో ఆడాడు. అందరి కంటే కూడా ధోని బెస్ట్ అని సచిన్ ప్రశంసలు కురిపించాడు. ఇటీవల సచిన్ ధోని గురించి తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు. ‘ ధోని ఎప్పుడూ చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. అతని చూసినప్పడు మా నాన్న రమేశ్ టెండూల్కర్ గుర్తుకు వస్తారు’ అని సచిన్ అన్నారు. ‘మ్యాచ్ గెలిచినా, ఓడిపోయినా ధోని చాలా కామ్‌గా కనిపించేవాడు. మా నాన్న కూడా ఏం జరిగినా మహిలా సైలెంట్‌గా ఉంటారు. అందుచేతనే మహిని చూస్తే మా నాన్న గుర్తుకు వస్తారని’ సచిన్ తెలిపారు. సచిన్ 1999 వరల్డ్ కప్ ఆడుతున్న సమయంలో తండ్రి రమేశ్ టెండూల్కర్ మరణించారు. తండ్రి మీద ఉన్న ప్రేమ, గౌరవంతో సచిన్ సెంచరీ, ఆఫ్ సెంచరీ చేసిన ఆకాశం వైపు చూసి నాన్నకు అంకితమివ్వటం మనం చాలాసార్లు చూశాం. మన మిస్టర్ కూల్ సచిన్‌కు పెద్ద అభిమాని. కేవలం అతని ఆట కోసం మాత్రమే మ్యాచ్‌ను చూసేవాడంట. -
ఈ ఫోటోలోని క్రికెటర్ ఎవరో తెలుసా?
ముంబై: ఫోటోలో ఉన్న భారత లెజెండరీ క్రికెటర్‌ను గుర్తు పట్టారా?. చాలా అరుదైన ఈ ఫోటోను ఫాదర్స్ డే సంద్భంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడుతుండగానే తానెంతగానో ఇష్టపడే తండ్రి మరణ వార్త విన్నారు ఆయన. అంతే వెంటనే తండ్రి అంతిమ సంస్కారాలకు హాజరై, క్రికెట్ ఇష్టపడే కోట్లాది భారత అభిమానుల కోసం తిరుగు ప్రయాణం అయ్యారు. మరుసటి మ్యాచ్‌లోనో సెంచరీ చేసి తన తండ్రికి అంకితమిచ్చారు. ఆయనే భారత రత్న, సచిన్ టెండుల్కర్. తానెంతగానో ఇష్టపడే తండ్రి రమేష్ టెండుల్కర్‌ను ఫాదర్స్ డే సందర్భంగా సచిన్ టెండుల్కర్ స్మరించుకున్నారు. తననెప్పుడూ ఉన్నత స్థానంలో చూడాలని తండ్రి అనుకునేవారని.. రమేష్ టెండుల్కర్, సచిన్‌ను చేతులతో ఎత్తుకొని ఉన్న ఈ ఫోటోను పోస్ట్ చేశారు. 1999 ప్రపంచ కప్ సమయంలో సచిన్ తండ్రి రమేష్ టెండుల్కర్ మృతిచెందారు. తండ్రి అంతిమ సంస్కారాలకు భారత్ రావడంతో జింబాబ్వేతో ఆడే మ్యాచ్ కోల్పోయారు. వెంటనే మళ్ళీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై కెన్యా పై బ్రిస్టన్ లో జరిగిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేసి, ఆ శతకాన్ని తన తండ్రికి అంకితం ఇచ్చారు. -
‘మాస్టర్’ మనసున్న మారాజు
న్యూఢిల్లీ: సచిన్ కేవలం జగం మెచ్చిన క్రికెటరే కాదు... జనం కోసం పాటుపడే వ్యక్తి కూడా అని అతని అత్త అనాబెల్ మెహతా తెలిపారు. సామాజిక సేవల్లోనూ అతనిది ముందుండే వ్యక్తిత్వమని చెప్పారు. ముఖ్యంగా ముంబై మురికివాడల్లోని చిన్నారుల విద్య కోసం తన అల్లుడు పరితపించాడన్నారు. తాను నెలకొల్పిన స్వచ్ఛంద సేవ సంస్థ ‘అప్నాలయా’కు అన్నీ తానై సచిన్ వ్యవహరించాడని ఆమె చెప్పారు. ఆమె 40 ఏళ్లుగా ఈ సంస్థను నడిపిస్తున్నారు. తన తండ్రి రమేశ్ టెండూల్కర్ స్మారకార్థం విద్యార్థులకు చక్కని సదుపాయాలు కల్పించాడని మెహతా చెప్పారు. ‘ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో సచిన్ ఒకడు. ఇందులో సందేహమే లేదు. సమున్నత వ్యక్తిత్వంలోనూ అతనికి అతనే సాటి. తన తండ్రి మార్గదర్శనమో, లేక ప్రభావమో గానీ... టెండూల్కర్ కుటుంబానికి ఎంతో విలువిస్తాడు, అవసరమైతే సమాజానికి అండగా నిలవాలనుకుంటాడు’ అని అంజలి తల్లి మెహతా చెప్పారు. సచిన్ రిటైర్మెంట్ను తమ అప్నాలయా చిన్నారులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు.