ఆధార్‌ సురక్షితమే: కేంద్రం | Aadhaar is safe: Central government | Sakshi
Sakshi News home page

ఆధార్‌ సురక్షితమే: కేంద్రం

Published Thu, Apr 6 2017 2:02 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

ఆధార్‌ సురక్షితమే: కేంద్రం - Sakshi

ఆధార్‌ సురక్షితమే: కేంద్రం

న్యూఢిల్లీ: ఆధార్‌ డేటా లీక్‌ అయ్యే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో వెల్లడించింది. భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ వ్యక్తిగత వివరాల లీకేజీపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. స్పందించిన కేంద్రం యూఐడీఏఐ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) వ్యవస్థ కట్టుదిట్టమైనదని స్పష్టం చేసింది. ‘ఆధార్‌ డేటా, ఆధార్‌ వ్యవస్థలో లీకేజీ అనే ప్రశ్నే లేదు.

ఓ ఫోటో సోషల్‌ మీడియాలో కనబడితే అది యూఐడీఏఐ నుంచే లీకేజీ అయినట్లు కాదు. సభ్యులందరికీ ఈ విషయంలో పూర్తి భరోసా ఇస్తున్నాం. ఇప్పటి వరకు డేటా, బయోమెట్రిక్, ఇతర వివరాలపై లీకేజీ జరగలేదు. ఇకపై జరగదు కూడా’ అని కేంద్ర ఐటీ మంత్రి పీపీ చౌధురీ లోక్‌సభలో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement