MS Dhoni New Hairstyle Look Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Dhoni New Haircut: ధోని హెయిర్‌ స్టైల్‌ అదరహో.. కుర్రకారు ఫిదా!

Published Fri, Jul 30 2021 4:02 PM | Last Updated on Fri, Jul 30 2021 8:22 PM

Mahendra Singh Dhoni New Look In Hair Style - Sakshi

ఫొటోలు: AlimHakimInstagram

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్లలో మహేంద్ర సింగ్‌ ధోనిది ప్రత్యేక స్థానం. విజయవంతమైన సారథిగా.. బ్యాట్స్‌మెన్‌గా.. వికెట్‌ కీపర్‌గా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. భారత్‌కు మూడు  ఐసీసీ ట్రోఫీలు సంపాదించి పెట్టిన ఒకే ఒక్క కెప్టెన్‌గా ఘనత సాధించిన ధోని ఆటలోనే కాదు.. తన ఆహార్యంలోనూ స్టైలిష్‌గా కనిపిస్తుంటాడు. ముఖ్యంగా హెయిర్‌ స్టైల్‌ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండేలా ధోనీ చూసుకుంటాడు. ఆయన క్రికెట్‌ కెరీర్‌లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో స్టైల్స్‌లో కనిపించాడు. ఒక్కో స్టైల్‌ అదిరిపోయేలా ఉండడంతో యువత ధోనీ స్టైల్‌ అంటూ హెయిర్‌ సెలూన్లకు పరిగెత్తుతుంటారు. మళ్లీ ఇప్పుడు ధోనీ మరో హెయిర్‌ స్టైల్‌తో కొత్త లుక్‌లో కనిపించాడు. 


ధోనీతో హెయిర్‌ స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌

సెలబ్రిటీల స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఆలిమ్‌ హక్కీమ్‌ ధోనీని సరికొత్త లుక్‌లో కనిపించేలా చేశారు. ప్రత్యేక హెయిర్‌ స్టైల్‌ చేసి న్యూలుక్‌లో మెరిసేలా ఆలిమ్‌ ధోనీని తయారుచేశారు. ఈ లుక్‌ను ఫంకీ హెయిర్‌ స్టైల్‌గా పేర్కొంటారని తెలుస్తోంది. ఈ లుక్‌ కుర్రకారును తెగ ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలను ఆలిమ్‌ హకీమ్‌ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఆ ఫొటోలను నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. కుర్రకారు ఈ హెయిర్‌ స్టైల్‌ను చేయించుకోవాలని భావిస్తున్నారు. ధోనీ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్‌లో చెన్నె జట్టుతో ఆడుతున్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement