సునీల్ గావస్కర్
వన్డేలకు ధోని ఎంత అవసరమో... క్లిష్ట పరిస్థితుల్లో అతడెంత కీలకమో విమర్శకులకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. రెండో వన్డేలో భువనేశ్వర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు అద్భుతం. దీంతో అతని సత్తాపై ఇంకెవరికైనా సందేహాలుంటే... అవి పటాపంచలైనట్లే! అతనిపై ఆలోచిస్తామనే మాటలకు సమాధానం దొరికినట్లే! టాప్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు వరుస కట్టినా... మిగిలింది టెయిలెండర్లే అని తెలిసినా... ఎలాంటి కంగారు లేకుండా కూల్‌గా, కామ్‌గా తన పని కానిచ్చాడు ధోని. అతని వల్లే భువనేశ్వర్ మ్యాచ్‌ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. మాజీ సారథి చతురతతోనే అది సాధ్యమైందనే సంగతీ మరవొద్దు. అతను ప్రతి బంతికి సలహా ఇచ్చాడు. భువీ సాధికారికంగా ఆడేలా ముందుండి ప్రోత్సహించాడు. స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగినపుడు బంతి గమనంపై స్పష్టమైన సందేశాలిచ్చాడు.
ధోనిపై ఇంకా సందేహాలా?
Published Sun, Aug 27 2017 1:43 AM | Last Updated on Tue, Sep 12 2017 1:02 AM
Advertisement