'ధోనీపై వేటు వేయాలనుకున్నాం'
న్యూఢిల్లీ: భారత్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయిన మహేంద్ర సింగ్ ధోనిని ఆ పదవి నుంచి తొలగించే విషయంపై పలుసార్లు చర్చ కూడా జరిగిందట. ఈ షాకింగ్ విషయాన్ని టీమిండియా క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ సందీప్ పాటిల్ వెల్లడించాడు. కొత్తవారికి కెప్టెన్సీ ఇచ్చి ప్రయోగం చేయాలని భావించి కొన్నిసార్లు ఆ విషయంపై చర్చ జరిగిందని పాటిల్ పేర్కొన్నాడు.
అయితే కీలకమైన 2015 వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని ఆ పని చేయలేకపోయామన్నాడు. మరోవైపు ధోనీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం తమను షాక్‌కు గురిచేసిందని సందీప్ పాటిల్ చెప్పుకొచ్చాడు. అలాగే సీనియర్ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ లను జట్టులోకి ఎంపిక చేయకపోవడంతో కెప్టెన్ ధోనీ పాత్ర ఏమాత్రం లేదని స్పష్టం చేశాడు.