Sandeep Patil
-
’మిగతా సెలక్టర్లు అతడిని వద్దన్నారు... అయినా నేను వినలేదు’
ఫామ్‌లో ఉన్న యువ క్రికెటర్లకు అవకాశం ఇస్తేనే వారి సత్తా బయటపడుతుందని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ అన్నాడు. ప్రతిభను గుర్తించడం ఎంత ముఖ్యమో.. సరైన సమయంలో జట్టుకు ఎంపిక చేయడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నాడు. అప్పుడే సెలక్టర్లు తమ పాత్రకు న్యాయం చేసిన వాళ్లవుతారని అభిప్రాయపడ్డాడు.సెహ్వాగ్‌ను కాదని ధావన్‌ను ఆడించాశిఖర్ ధావన్ అరంగేట్రం విషయంలో తన అంచనా తప్పలేదని.. తన నిర్ణయం సరైందేనని గబ్బర్ నిరూపించాడని సందీప్ పాటిల్ ఈ సందర్భంగా వెల్లడించాడు. సహచర నలుగురు సెలక్టర్లు వ్యతిరేకించినా.. నాడు వీరేంద్ర సెహ్వాగ్‌ను కాదని ధావన్‌ను తుదిజట్టుకు ఎంపిక చేసిన విషయాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు. కాగా 2013లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ వరుసగా తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు.అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డుఈ క్రమంలో మూడో టెస్టులో వీరూ భాయ్‌పై వేటు వేసిన సెలక్టర్లు ధావన్‌కు టెస్టు అరంగేట్రం అవకాశం కల్పించారు. అయితే, వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కేవలం 85 బంతుల్లోనే శతకం బాదాడు. తద్వారా టెస్టు అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆసీస్‌తో మూడో టెస్టులో మొత్తంగా 174 బంతులు ఎదుర్కొన్న గబ్బర్.. 187 పరుగులతో అదరగొట్టాడు. ఆ తర్వాత టీమిండియాలో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ మొహాలీ హ్యారికేన్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘యువ క్రికెటర్లు ఫామ్‌లో ఉన్నపుడే వారికి అవకాశాలు ఇవ్వాలి.నన్ను కాపాడాడుసరైన సమయంలో పిలుపునిస్తేనే వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆ సమయంలో శిఖర్ సౌతాఫ్రికా టూర్లో ఇండియా-ఏ తరఫున డబుల్ సెంచరీ, సెంచరీ బాదాడు. అప్పుడు అతడిని జాతీయ జట్టుకు ఆడించాలని నేను భావించాను. సెహ్వాగ్‌ను కాదని.. ధావన్‌ను ఆడించాలనే నా నిర్ణయాన్ని నా సహచర సెలక్టర్లు వ్యతిరేకించారు.అయితే, ఆ తర్వాత వారిని ఒప్పించగలిగాను. అలా శిఖర్ జట్టులోకి వచ్చి తొలి టెస్టులోనే రికార్డు సెంచరీ బాదాడు. నా నిర్ణయం సరైందని నిరూపించాడు. అయినా.. నేనేమీ క్రెడిట్ తీసుకోవాలనుకోలేదు. నిజానికి శిఖర్ శతకం చేసి ఒకరకంగా నన్ను రక్షించాడనుకోండి(నవ్వుతూ)’’ అంటూ గత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాడు. కాగా సందీప్ పాటిల్ టీమిండియా తరఫున 29 టెస్టులు, 45 వన్డేలు ఆడాడు. 2012- 2016 మధ్య బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా పనిచేశాడు. చదవండి: Duleep Trophy: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లపైనే! -
ఆసియా కప్‌లో టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్ కిషన్..?
మెగా టోర్నీలైన ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లకు ముందు టీమిండియాను చాలా సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. వీటిలో తుది జట్టు కూర్పు ప్రధానమైన సమస్యగా ఉంది. మరి ముఖ్యంగా ఓపెనర్ల సమస్య టీమిండియా మేనేజ్మెంట్ను ఎక్కువగా వేధిస్తుంది. రోహిత్‌కు జతగా ఎవరిని బరిలోకి దించాలని యాజమాన్యం పెద్దలు తలలుపట్టుక్కూర్చున్నారు. ఈ విషయమై స్టార్‌స్పోర్ట్స్ ఛానల్ ఎక్స్పర్ట్స్ ప్యానెల్లో డిస్కషన్ జరగ్గా ఇద్దరు భారత మాజీల మధ్య వాడివేడి చర్చ సాగింది. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. రోహిత్‌కు జతగా ఇషాన్ కిషన్‌కు పంపాలని ప్రతిపాదించగా.. భారత మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ శుభ్‌మన్ గిల్‌కు వత్తాసు పలికాడు. తాజాగా విండీస్‌తో ముగిసిన సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేసి అద్భుత ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను ఆసియా కప్ తుది జట్టులో ఓపెనర్‌గా ఆడించాలని రవిశాస్త్రి వాధిస్తే.. మూడు ఫార్మాట్లలో ఫామ్‌ను, అలాగే కంసిస్టెన్సీని పరిగణలోకి తీసుకుని శుభ్‌మన్ గిల్‌కు ఆ స్థానంలో అవకాశం ఇవ్వాలని సందీప్ పాటిల్ సూచించాడు. శాస్త్రి లెక్క ప్రకారం లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ బాగా వర్కవుట్ అవుతుందని అంటే.. రోహిత్ లెఫ్ట్ హ్యాండర్తో అంత కంఫర్టబుల్‌గా ఉండడని సందీప్ అన్నాడు. ఇందుకు ప్రతిగా స్పందించిన శాస్త్రి.. గిల్‌ను పూర్తిగా జట్టును తప్పించమని చెప్పట్లేదని, అతన్ని 3 లేదా 4 స్థానాల్లో ఆడిస్తే మంచిదని తెలిపాడు. శాస్త్రి ఈ ప్రతిపాదనను తెరపైకి తెస్తూనే ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాలో ఎవరి స్థానాలు పర్మనెంట్ కాదని పరోక్షంగా కోహ్లి, రోహిత్‌ల బ్యాటింగ్ స్థానాలపై కామెంట్ చేశాడు. జట్టులోని ప్రతి ఆటగాడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని డిస్కషన్‌ను ముగించాడు. రాహుల్, శ్రేయస్లతోనే తలనొప్పి.. కాగా, గాయాల నుంచి కోలుకుని ప్రస్తుతం ఫిట్నెస్ సాధించేందుకు బెంగళూరులోని ఎన్సీఏలో శ్రమిస్తున్న భారత స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. వీరిద్దరు ఆసియా కప్ టీమ్ సెలెక్షన్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తారా లేదా అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. వీరి లేని లోటు ప్రస్తుతం భారత బ్యాటింగ్ ఆర్డర్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ వీరిరువురు ఆసియాకప్ టీమ్ సెలెక్షన్ సమయానికి కూడా పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోతే జట్టు కూర్పులో కీలక మార్పులు చేయాల్సి వస్తుంది. వీరికి ప్రత్యామ్నాయంగా సెలెక్టర్లు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్‌లను పరిశీలించవచ్చు. ఒకవేళ ఇషాన్‌ను ఫైనల్ చేస్తే, అతన్ని ఓపెనర్‌గా పంపాలా లేక మిడిలార్డర్లో ఆడించాలా అన్నది మరో సమస్యగా మారుతుంది. ఈ ప్రస్తావన నేపథ్యంలోనే రవిశాస్త్రి, సందీప్ పాటిల్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. -
రహానే..సెక్యూరిటీ గార్డ్ పాత్ర అవసరమా?
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానేపై మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ విమర్శనాస్త్రాలు సంధించారు. విదేశీ గడ్డపై మంచి రికార్డు కల్గి ఉన్న రహానే.. న్యూజిలాండ్ పర్యటనలో రక్షణాత్మక ధోరణిలో ఆడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అసలు క్రీజ్‌లోకి రహానే ఎందుకు వెళుతున్నాడో తెలియకుండా అతని బ్యాటింగ్ సాగిందంటూ మండిపడ్డారు. క్రీజ్‌లోకి వెళ్లేది పరుగులు చేయడానికా.. లేక స్థానాన్ని కాపాడుకోవడానికా అంటూ సందీప్ పాటిల్ ప్రశ్నించారు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో రహానే పరుగులు చేయడాన్ని పక్కన పెట్టి, క్రీజ్‌లో పాతుకుపోవడానికే ప్రాధాన్యత ఇచ్చాడని విమర్శించారు. ఒకవేళ నువ్వు క్రీజ్‌లో పాతుకుపోతే పరుగులు ఎవరు చేస్తారన్నారు. తన స్థానాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టిన రహానే..తన ఆటను పూర్తిగా మరిచిపోయినట్లే ఆడాడని సందీప్ పాటిల్ ఎద్దేవా చేశారు. సెక్యూరిటీ గార్డ్ పాత్ర పోషించడానికి క్రీజ్‌లోకి వెళతారా అంటూ రహానే బ్యాటింగ్ శైలిపై విమర్శలు చేశారు. (హార్దిక్ చితక్కొట్టుడు మామూలుగా లేదు!) ‘ ఈ సీజన్లో ముంబై తరఫున రహానే ఆడేటప్పుడు చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడనే వ్యాఖ్యలను విన్నాను. ఇది ఎందుకు జరుగుతుంది.. విఫలం అవుతాననే భయంతోనే కదా. నీకు విదేశీ గడ్డపై మంచి రికార్డు ఉందనే విషయం క్రికెట్ చరిత్రే చెబుతుంది. దాంతోనే నీకు మంచి టెస్టు ప్లేయర్‌గా ముద్ర వేశారు కూడా. నువ్వు కేవలం టెస్టు ప్లేయర్ అనే ముద్రతోనే పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో కూడా చోటు కోల్పోయావు. నువ్వు టెక్నికల్ ప్లేయర్‌వే. మరి అటువంటప్పుడు క్రీజ్‌లో పాతుకుపోవడానికే యత్నిస్తే ఎలా. క్రీజ్‌లో ఉండటానికే యత్నిస్తే పరుగులు ఎవరు చేస్తారు.. ఇలా చేస్తే ‘సెక్యూరిటీ గార్డ్’ అనే అంటారు’ అని సందీప్ పాటిల్ హితబోధ చేశాడు. ఇక హెడ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌లపై కూడా సందీప్ పదునైన విమర్శలు చేశారు. రహానే పరిస్థితిని అర్థం చేసుకోవడంలో విఫలమైతే, రవిశాస్త్రి, విక్రమ్ రాథోడ్‌లు ఏం చేస్తున్నారన్నారని నిలదీశారు. ఒక బ్యాట్స్‌మన్ విఫలమైతే, మిగతా వారు అదే దారిలో పయనించడంతోనే ఘోరంగా టెస్టు సిరీస్‌ను కోల్పోయామన్నారు. ఇక్కడ కోచింగ్ స్టాఫ్ ఏం చేశారో తనకైతే అర్థం కాలేదని చురకలంటించారు. సమష్టి బ్యాటింగ్ వైఫల్యం చెందిన తర్వాత బౌలింగ్ ఎంతో మెరుగ్గా ఉండాలని కోరుకోవడం కూడా అత్యాశే అవుతుందన్నారు. -
దూకుడు లేని కోహ్లి.. కోరల్లేని పులి ఒకటే !
ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన దూకుడును తగ్గించుకోవాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ అన్నాడు. దూకుడు లేని కోహ్లి కోరల్లేని పులితో సమానమని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ సందర్భంగా ఆ జట్టు సారథి టీమ్ పైన్-కోహ్లి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కోహ్లిని తప్పుబడుతూ.. ఆసీస్ మీడియా దుమ్మెత్తిపోసింది. ఈ నేపథ్యంలో కోహ్లికి మద్దతుగా ఈ మాజీ క్రికెటర్ నిలిచాడు. ఆసీస్‌గడ్డపై కోహ్లి పోరాటం సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డాడు. 'పులి అడవిలోనే ఉండాలి. కానీ బోన్లో కాదు. అదే విధంగా కోహ్లి కూడా మైదానంలో దూకుడుగానే వ్యవహరించాలి. అది అతని స్వభావం. అదే మాత్రం తగ్గినా కోహ్లిలో ఉండే పవర్ తగ్గిపోతుంది. పులి బోన్లో ఉంటే దాని పవర్‌ను చూపించలేదు. కోహ్లి విషయంలో కూడా ఇంతే. దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. రెండో టెస్టులో కోహ్లి ఎలా ఉన్నాడో మూడో టెస్టులోనూ అలానే ఉండాలి. ఒకవేళ కోహ్లి తన దూకుడుతో హద్దులు దాటితే అతని మ్యాచ్ ఫీజులో కోత విధించండి. అంతేకానీ ఆ దూకుడునే తగ్గించుకోమనడం సరికాదు. దీని ప్రభావం భారత్ విజయాల మీద పడుతుంది. పెర్త్ వేదికగా ఏం జరిగిందో నిజనిజాలు తెలుసుకోవాలి కానీ ఒకర్నే నిందించడం సబబు కాదు. ఒకప్పుడు ఆసీస్ ఆటగాళ్లు సైతం ఇలా ప్రవర్తించిన వాళ్లే. దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి' అని అన్నారు. ఇక ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ సైతం ఆ మాటల యుద్దం ఆటలో భాగమేనని, రెండు బలమైన జట్లు విజయం కోసం ఆరాటపడుతున్నప్పుడు ఇలాంటి చిన్నచిన్న ఘటనలు చోటుచేసుకోవడం సహజమని చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లి దూకుడుగానే వ్యవహరించాలని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్, పాకిస్తాన్ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్‌లు సైతం అభిప్రాయపడ్డారు. కానీ ఆసీస్ మీడియా మాత్రం పనిగట్టుకోని కోహ్లిపై నిందలు వేస్తూ కథనాలు ప్రచురిస్తోంది. అతన్ని మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. -
ఆసియాకప్ కన్నా వెస్టిండీస్ టూర్ ముఖ్యమా?
ముంబై: ఆసియాకప్ టోర్నీకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇవ్వడంపై భారత సెలక్టర్లను మాజీ క్రికెటర్, సెలక్టర్ సందీప్ పాటిల్ తప్పుబట్టాడు. వెస్టిండీస్ పర్యటన కన్నా ఈ టోర్నీ ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. ఓ ఆంగ్ల పత్రికకు రాసిన కాలమ్‌లో భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుందని, ఈ మ్యాచ్ భారత అభిమానుల సెంటిమెంట్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. ‘ఓ మాజీ క్రికెటర్‌గా.. సెలక్టర్‌గా బిజీ షెడ్యూల్‌తో ఆటగాళ్లపై ఉన్న ఒత్తిడి గురించి నాకు తెలుసు. కానీ కోహ్లిని ఆసియాకప్‌కు ఎంపిక చేసి విండీస్ పర్యటనకు విశ్రాంతి ఇవ్వాల్సింది. ఆసియాకప్‌లో భారత్ పాక్‌ను ఢీకొట్టనుంది. ఇది యావత్ భారత ప్రజానీకానికి ప్రత్యేక మ్యాచ్. భావోద్వేగంతో కూడుకున్న మ్యాచ్. రెండు జట్లు తమ బెస్ట్ ప్లేయర్స్‌తో బరిలోకి దిగాలి. కానీ కోహ్లికి విశ్రాంతివ్వడం బాలేదు. ఇక సెలక్టర్లకు ఏ టోర్నీకి ప్రాధాన్యమో ఇవ్వాలో అన్న విషయం తెలియాలి. ముఖ్యంగా ఏ టోర్నీలో ఏ ఆటగాళ్లను బరిలోకి దింపాలి. ఎవరికి విశ్రాంతి ఇవ్వాలో తెలిసుండాలి. వెస్టిండీస్‌పై గెలవడం కన్నా ఆసియాకప్ గెలవడమే ముఖ్యం. 30 మంది ఆటగాళ్లు బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్నప్పుడు కోహ్లి ఒక్కడిపైనే ఎందుకు ఒత్తిడి పడుతోంది. అందరికి సమానంగా అవకాశాలు ఇవ్వాలి. రోహిత్ శర్మకు అంతగా సమయం లేదు. జట్టు కూర్పుపై, వ్యూహాలపై అతనే త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి.’ అని పాటిల్ అభిప్రాయపడ్డాడు. -
కోహ్లీసేనపై మాజీ సెలెక్టర్ మండిపాటు!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ విమర్శలు గుప్పించారు. వరుస టెస్టు మ్యాచుల్లో విఫలమైన టీమిండియా ఆటగాళ్లపై ఆయన మండిపడ్డారు. ఆటగాళ్లెవరూ సమయాన్ని సరిగా వినియోగించుకోవడంలేదని, వార్మప్ మ్యాచ్‌కు ముందు లభించిన అయిదు రోజుల సమయాన్ని కోహ్లి బృందం వృథా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటన ప్రారంభానికి ముందు సిరీస్‌కు చాలా సమయం ఉన్నందున ఇంగ్లండ్‌లో కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తామని టీమిండియా సారథి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం వెనువెంటనే ఇంగ్లండ్ పర్యటన ఖరారు చేశారని కోచ్ రవిశాస్త్రి విచారం వ్యక్తం చేయడంతో షెడ్యూల్లో మార్పులు చేశారని పాటిల్ తెలిపారు. వన్డే, టీ20 సిరీస్‌ల అనంతరం టెస్టు సిరీస్‌ను ఖరారు చేశారని గుర్తు చేశారు. నామమాత్రపు వార్మప్ మ్యాచ్ కూడా వేడి కారణంగా మూడు రోజుల్లోనే ముగిసిందని అలా మరో రోజు కలిసి వచ్చిందని అన్నారు. కానీ, దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని టెస్ట్ సిరీస్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమవడంలో కోహ్లీసేన నిర్లక్ష్యం వహించిందని పాటిల్ అభిప్రాయపడ్డారు. కాగా, ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మొదటి టెస్టులో కోహ్లీ మినహా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో మ్యాచ్ చేజారింది. గెలుపు ముంగిట బోల్తాపడి 31 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ దెబ్బకు మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా సహా అందరూ చేతులెత్తేయడంతో టీమిండియా ఇన్నింగ్స్ 159 పరుగులతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయిదు టెస్టుల సిరీస్‌లో రెండు టెస్టులు ఓడిన టీమిండియా.. 0-2తో వెనకబడింది. -
36 ఏళ్ల తర్వాత పవన్ షా
హంబన్‌టోటా: శ్రీలంకతో జరుగుతున్న అండర్-19 రెండో యూత్ టెస్టులో భారత ఆటగాడు పవన్ షా కదం తొక్కిన సంగతి తెలిసిందే. పవన్ షా 332 బంతుల్లో 33 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 282 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. తద్వారా అంతర్జాతీయ యూత్ టెస్టు మ్యాచ్‌ల్లో రెండో అత్యధిక స్కోరును సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇదిలా ఉంచితే, ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి సత్తాచాటాడు. తొలి బంతిని బౌండరీగా మలచడం ద్వారా డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న పవన్ అదే జోరులో మిగతా ఐదు బంతులను బౌండరీకి తరలించాడు. ఈకేవీ పెరీరా వేసిన 108 ఓవర్లో వరుస ఆరు బంతుల్ని ఫోర్లగా మలచాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్లో ఏ ఫార్మాట్లోనైనా ఒక ఓవర్లో ఆరు బంతుల్ని ఆరు ఫోర్లుగా కొట్టిన రెండో భారత ఆటగాడిగా షా అరుదైన రికార్డును లిఖించాడు. చివరిసారి 1982లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సందీప్ పాటిల్ ఒక ఓవర్లో ఆరు ఫోర్లుగా కొట్టగా, 36 ఏళ్ల తర్వాత ఆ ఘనతను పవన్ షా అందుకున్నాడు. కాగా, ఆనాటి టెస్టు మ్యాచ్‌లో నో బాల్ సాయంతో ఏడు బంతుల్ని ఎదుర్కొని సందీప్ పాటిల్ ఆ ఘనత సాధించగా, పవన్ షా వరుస బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టడం విశేషం. చదవండి: పవన్ షా డబుల్ సెంచరీ -
‘క్రికెటర్లను ఇలా తప్పించడం సరికాదు’
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ల ఫిట్‌నెస్‌లో భాగంగా నిర్వహిస్తున్న యో యో టెస్టుపై మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ మండిపడ్డాడు. స్వల్ప వ్యవధిలో యో యో టెస్టు నిర్వహించి ఒక క్రికెటర్‌గా ఫిట్‌గా లేడని జట్టు నుంచి తప్పించడం ఎంతమాత్రం సరికాదన్నాడు. యో యో విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అవలంభిస్తున్న ప్రస్తుత విధానం ఎంతమాత్రం బాలేదన్నాడు. యో యో టెస్టులో ఒకసారి విఫలమైన ఆటగాడికి మరొకసారి అవకాశం ఇచ్చే యోచనను బీసీసీఐ పరిశీలించాలన్నాడు. ‘టెస్టు మ్యాచ్‌లో ఎలాగైతే ఆటగాళ్లకు రెండు ఇన్నింగ్స్‌ల ద్వారా తామేంటో నిరూపించుకోవడానికి అవకాశం దక్కుతుందో... అలాగే బీసీసీఐ అధికారులు కూడా యో యో టెస్టు ఫెయిలైన వారికి మరో అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఆటగాడు యో యో టెస్టు విఫలమైతే మరుసటి రోజు అతడికి మరొకసారి టెస్టు నిర్వహించాలి. ఏడాది పాటు దేశవాళీ క్రికెట్లో అంబటి రాయుడు అద్భుతంగా రాణించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. అలాంటి ఆటగాడు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడం, లేకపోవడంపై కేవలం అరగంటలోనే ఎలా నిర్ణయం తీసేసుకుంటారు. ఆటగాళ్లను జట్టు నుంచి ఇలా తప్పించడం సరికాదు. ఇది వారి కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది’ అని పాటిల్ పేర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం అంబటి రాయుడు, మహమ్మద్ షమి, సంజు శాంసన్‌లు యో యో టెస్టులో విఫలమై జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. -
‘అందుకే గంభీర్‌ను జట్టు నుంచి తప్పించాం’
న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్ ఆటగాడు గౌతమ్ గంభీర్ తీరు సరిగా లేకపోవడంతోనే అతను భారత జట్టులో చోటు కోల్పోయాడని సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ సందీప్ పాటిల్ తెలిపాడు . ఓ ఆంగ్లపత్రికకు రాసిన ఆర్టీకల్లో పేర్కొన్నాడు. ‘‘అతని ప్రవర్తన కారణంగానే భారత జట్టులో చోటు కోల్పోయాడు. ఎప్పుడు కోపంగా ఉండే గంభీర్‌ని నేను భారత క్రికెట్ అమితాబ్ బచ్చన్ అని పిలిచేవాడిని’ అని తెలిపాడు. 2011లో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బౌన్సర్ తగిలాక స్వదేశానికి తిరిగి రావడం గంభీర్‌కు పెద్ద నష్టం చేసిందన్నాడు. స్కానింగ్‌లో అంత పెద్ద గాయం కాలేదని తేలిందని, అతను సిరీస్ కొనసాగిల్సిందని సందీప్ అభిప్రాయపడ్డాడు. గంభీర్, తాను 7-8 ఏళ్ల పాటు స్నేహితులమని, జట్టు నుంచి తప్పించిన తర్వాత అతడు స్నేహాన్ని వదులుకున్నాడని సందీప్ పేర్కొన్నాడు. ఏదేమైనా తన అభిమాన క్రికెటర్ మాత్రం గంభీరేనని పాటిల్ స్పష్టం చేశాడు. గంభీర్‌ను జట్టు నుంచి తప్పించినప్పుడు పాటిల్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నాడు. ఇక పాటిల్ గంభీర్ స్థానంలో అతని ఢిల్లీ సహచరుడు శిఖర్ ధావన్‌ను ఎంపిక చేశాడు. మరోవైపు ఓవపెనర్గా మురళి విజయ్ కూడా రాణించడంతో గంభీర్ పునరాగమనం కష్టమైంది. ఇక వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ.. గంభీర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సందీప్ పాటీల్ తన వ్యాసంలో ఇలా పేర్కొనడం చర్చనీయాంశమైంది. -
‘కోహ్లి కంటే రోహిత్ బెటర్..!’
న్యూఢిల్లీ : లంకేయులతో మొహాలిలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసి(208) అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రోహిత్ శర్మ పై ప్రశంసల జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ కూడా ఆ కోవలోకి చేరారు. కోహ్లి కన్నా రోహిత్ శర్మనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని టీమిండియా మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ‘కోహ్లి ఫ్యాన్స్‌కు ఈ మాటలు ఒప్పుకోకున్నా ఇది నిజం. విరాట్ కోహ్లి చాలా గొప్ప బ్యాట్స్‌మెన్ అనడంలో ఏ విధమైనా సందేహం లేదు. అతను టెస్టులో నంబర్.1 బ్యాట్స్‌మెన్. రోహిత్ పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లి కన్నా ముందు ఉన్నాడు. రోహిత్ శర్మ ఈ సంవత్సరం లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్‌లో బాగా ఆడాడు. అయితే శ్రీలంకపైనే ఎక్కువ మ్యాచ్‌లో ఆడాడని వాదించే వారు కూడా ఉన్నారు. అలా వాదించే వారు కోహ్లి కూడా ఆ టీంతోనే ఆడాడన్న విషయాన్ని గుర్తించుకోవాలి. రోహిత్ కెప్టెన్‌గా తన బాధ్యతలను నిర్వహిస్తూ తన ఆటతో కూడా అందర్ని అలరించాడు’ అని సందీప్ పాటిల్ అన్నారు. తాత్కలిక కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీ, టి20లో అజేయ శతకం చేసి ప్రపంచ రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. తన మెరుపు దాడితో టీమిండియా శ్రీలంకపై 2-1తో వన్డే సిరీస్‌ను, 3-0లో టి20 సిరిస్‌లను కైవసం చేసుకుంది. -
సందీప్ పాటిల్‌పై బీసీసీఐ ఆగ్రహం
న్యూఢిల్లీ: రహస్యంగా ఉంచాల్సిన కొన్ని విషయాలను పదవి నుంచి దిగిపోయాక బయటపెట్టడం అనైతికమని మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్‌పై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించకపోతే వన్డే జట్టు నుంచి అతడికి ఉద్వాసన పలికేవారమని పాటిల్ వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే వన్డే ప్రపంచకప్‌కు ముందు ధోనిని కూడా కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆలోచించినట్టు పేర్కొన్నారు. ‘మాజీ చైర్మన్‌గా వ్యవహరించిన ఆయన ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఇవే ప్రశ్నలకు మరోలా సమాధానం ఇచ్చారు. అయితే దిగిపోయాక మాత్రం సమాధానాలు మారాయి. ఆయనపై చర్యలు ఉంటాయా? లేదా? అనే విషయంపై బోర్డులోని సరైన వ్యక్తులు త్వరలోనే చెబుతారు’ అని ఠాకూర్ స్పష్టం చేశారు. -
సచిన్, ధోనీ వెరీ వెరీ లక్కీ!
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ సందీప్ పాటిల్ పై బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జట్టుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు, విషయాలను ఇటీవల పాటిల్ వెల్లడించడాన్ని ఠాకూర్ జీర్ణించుకోలేక పోతున్నారు. అందులోనూ భారత క్రికెట్లో దిగ్గజంగా పేరున్న సచిన్ టెండూల్కర్, సక్సెస్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలకు గతంలో సంబంధించిన పలు రహస్యాలను పాటిల్ వెల్లడించాడు. భారత్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయిన ధోనిని ఆ పదవి నుంచి తొలగించే విషయంపై పలుసార్లు చర్చ కూడా జరిగిందని గత వారం పాటిల్ బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. కొత్తవారికి కెప్టెన్సీ ఇచ్చి ప్రయోగం చేయాలని భావించామని అయితే.. కీలకమైన 2015 వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని ఆ సాహసం చేయలేకపోయామని వివరణ కూడా ఇచ్చాడు. సచిన్ ఎవరి సలహాలు పాటించకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడని, అయితే వాస్తవానికి అతడు రిటైర్మెంట్ ప్రకటించికపోతే ఆ సమయంలో జట్టు నుంచి తప్పించాలని సెలక్షన్ ప్యానెల్ భావించిందని టాప్ సీక్రెట్ ను బయటపెట్టాడు. లేనిపక్షంలో సచిన్ అవమానకర రీతిలో ఆట నుంచి తప్పుకునేవాడు. బీసీసీఐతో నేరుగా సంబంధం ఉన్న సమయంలో పాటిల్ ఈ వ్యాఖ్యలు చేసింటే మరోలా ఉండేదని కూడా ఠాకూర్ హెచ్చరించారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత పాటిల్ బీసీసీఐ టాప్ సీక్రెట్స్ ను వెల్లడించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించాడు. భవిష్యత్తులో పాటిల్ కు ఏదైనా బాధ్యత అప్పగించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ సూచించారు. -
'ధోనీపై వేటు వేయాలనుకున్నాం'
న్యూఢిల్లీ: భారత్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయిన మహేంద్ర సింగ్ ధోనిని ఆ పదవి నుంచి తొలగించే విషయంపై పలుసార్లు చర్చ కూడా జరిగిందట. ఈ షాకింగ్ విషయాన్ని టీమిండియా క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ సందీప్ పాటిల్ వెల్లడించాడు. కొత్తవారికి కెప్టెన్సీ ఇచ్చి ప్రయోగం చేయాలని భావించి కొన్నిసార్లు ఆ విషయంపై చర్చ జరిగిందని పాటిల్ పేర్కొన్నాడు. అయితే కీలకమైన 2015 వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని ఆ పని చేయలేకపోయామన్నాడు. మరోవైపు ధోనీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం తమను షాక్‌కు గురిచేసిందని సందీప్ పాటిల్ చెప్పుకొచ్చాడు. అలాగే సీనియర్ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ లను జట్టులోకి ఎంపిక చేయకపోవడంతో కెప్టెన్ ధోనీ పాత్ర ఏమాత్రం లేదని స్పష్టం చేశాడు. -
13 టెస్టులు... 31 వన్డేలు
భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటివరకూ సారథ్యం వహించిన మ్యాచ్‌ల సంఖ్య 14. మన కొత్త సెలక్షన్ కమిటీలో మొత్తం అందరు సెలక్టర్లు కలిసి ఆడిన టెస్టులు 13. రేపు టెస్టు జట్టును ఎంపిక చేయడానికి కూర్చుంటే... ఓ ఆటగాడిని కోహ్లి బాగా విశ్లేషిస్తాడా..? సెలక్టర్లు బాగా విశ్లేషిస్తారా..? తాజా కమిటీ ఏర్పాటు ద్వారా ప్రస్తుత బీసీసీఐ పాలకులు కొత్త పోకడకు తెర లేపారు. తమకు కావలసిన వారిని ఇంతకాలం కమిటీల్లో నియమించడం వరకు మాత్రం చూశాం. ఇప్పుడు... సెలక్షన్ కమిటీకి కూడా ఈ జాఢ్యం పాకినట్లు కనిపిస్తోంది. సాక్షి క్రీడావిభాగం ప్రపంచంలో అత్యంత బలమైన క్రికెట్ జట్టును ఎంపిక చేయాలంటే అంతే బలమైన వ్యక్తులు సెలక్షన్ కమిటీలో ఉండాలి. ముఖ్యంగా చీఫ్ సెలక్టర్ పేరు వింటే ఎంత సీనియర్ ఆటగాళ్లైకైనా అపార గౌరవంతో పాటు ఎంతో కొంత భయం ఉండాలి. గతంలో బీసీసీఐలో ఎవరు అధికారంలో ఉన్నా సెలక్షన్ కమిటీ ఎంపిక విషయంలో మాత్రం జాగ్రత్తగానే వ్యవహరించారు. దిలీప్ వెంగ్‌సర్కార్, కృష్ణమాచారి శ్రీకాంత్, సందీప్ పాటిల్... ఇలా ఇటీవలి చీఫ్లంతా గతంలో ఘనమైన క్రికెట్ చరిత్ర ఉన్నవారే. అందుకే ప్రస్తుత తరం ఆటగాళ్లకు వాళ్లంటే గౌరవంతో పాటు ఎంతో కొంత భయం ఉండేది. కానీ బీసీసీఐ తాజాగా ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ చూస్తే క్రికెట్ తెలిసిన వాళ్లెవరైనా ఆశ్చర్యపోతారు. ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ చరిత్ర ఉన్న క్రికెటర్ కాదు. ఎవరికీ అనుభవం లేదు. మరి బోర్డు వీళ్లని ఎలా ఎంపిక చేసింది? ఇంటర్వూలో ఏం అడిగి వీళ్లని ఎంపిక చేశారో తెలియదు? అనుభవం లేదు ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఎంపికై న ఎమ్మెస్కే ప్రసాద్ 6 టెస్టుల్లో 106 పరుగులు, 17 వన్డేల్లో 131 పరుగులు చేశాడు. దేవాంగ్ గాంధీ కేవలం నాలుగు టెస్టులు, మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. పరాంజపేకు నాలుగు వన్డేల అనుభవం మాత్రమే ఉంది. శరణ్ దీప్ కేవలం మూడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడాడు. ఖోడా కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. వీళ్లంతా కలిపి ఆడింది 13 టెస్టులు, 31 వన్డేలు. ఈ అనుభవం ఓ సెలక్షన్ కమిటీకి సరిపోతుందా అనేది ప్రశ్నార్థకం. ఎవరు చెప్పగలరు? చీఫ్ సెలక్టర్‌గా ఉండే వ్యక్తి ఎవరైనా ఎంత పెద్ద నిర్ణయాన్నైనా చెప్పగలిగి ఉండాలి. ప్రస్తుతం ధోని రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నాడు. ఒకవేళ ప్రపంచకప్‌కు ముందు ధోని సరిగా ఆడకపోతే తప్పించే ధైర్యం కానీ, తప్పిస్తున్నామని చెప్పే శక్తిగానీ ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరికీ లేదు. నిజానికి సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఒక తెలుగు వ్యక్తి ఎంపిక కావడం గర్వకారణమే అరుునా... భారత క్రికెట్ స్థాయి, పరిస్థితుల దృష్ట్యా ఇది అంత గొప్ప నిర్ణయం కాదు. కోహ్లి ఇప్పటివరకూ 45 టెస్టులు ఆడాడు. అందులో 14 మ్యాచ్‌లకు కెప్టెన్. ఇక తను ఆడిన మొత్తం అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్య 261. సెలక్షన్ కమిటీ సమావేశాలకు కెప్టెన్ కూడా హాజరవుతాడు. ఓ ఆటగాడి స్థాయిని ఫామ్‌ని కోహ్లి కంటే ప్రస్తుత సెలక్టర్లు ఎక్కువగా అంచనా వేయలేరనేది కాదనలేని అంశం. కావలసిన వాళ్లకు ఇచ్చేశారా? గతంలో బీసీసీఐలో ఎవరు అధికారంలో ఉన్నా తమకు కావలసిన వారిని కమిటీల్లో పదవులు ఇవ్వడం ద్వారా సంతృప్తి పరిచేవారు. తర్వాతి ఎన్నికల్లో తమవైపు నిలబడేందుకు పదవులు ఇచ్చేవారు. కానీ సెలక్షన్ కమిటీ విషయంలో మాత్రం ఇలా ఎప్పుడూ వ్యవహరించలేదు. తాజాగా అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఏ మాత్రం హర్షించలేం. సెలక్టర్లను డమ్మీలను చేసి జట్టు ఎంపికను కూడా పూర్తిగా చేతుల్లోకి తీసుకోవాలనే ఆలోచన చేసినట్లు కనిపిస్తోంది. దీనికంటే అసలు సెలక్షన్ కమిటీ లేకుండా బోర్డు జట్టును ఎంపిక చేసే ప్రక్రియ తీసుకున్నా బాగుండేదేమో..! ఏమైనా భారత క్రికెట్‌కు ఇది ఎంత మాత్రం మేలు చేసే పరిణామం కాదు. -
డిసెంబర్ వరకు కొనసాగనున్న సెలక్టర్లు
ముంబై: సందీప్ పాటిల్ నేతృత్వంలోని సీనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ పదవీ కాలం మరో సారి పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఐదుగురు సభ్యులు కొనసాగవచ్చని సమాచారం. బీసీసీఐలో సంస్కరణల అమలు కోసం లోధా కమిటీ డిసెంబర్ వరకు గడువు విధించిన నేపథ్యంలో ఆలోగా కొత్త కమిటీని ఎంపిక చేయకుండా దీనిని కొనసాగించాలని బోర్డు భావిస్తోంది. లోధా సిఫారసుల ప్రకారం డిసెంబర్ 15లోగా అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అదే విధంగా డిసెంబర్ 30లోగా బోర్డులోని వేర్వేరు కమిటీలను కూడా ఏర్పాటు చేయాలి. వీటిలో సెలక్షన్ కమిటీ కూడా ఒకటి. అయితే లోధా ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఐదుగురు సభ్యుల కమిటీని మూడుకు కుదించడంతో పాటు తప్పనిసరిగా టెస్టు ఆడినవారినే నియమించాలి. పాటిల్ సహా ఐదుగురు సభ్యుల కమిటీ పదవీకాలం ఈ ఏడాది ఆరంభంలోనే ముగిసినా... టి20 ప్రపంచకప్ నేపథ్యంలో వారికి ఒకసారి పొడిగింపు లభించింది. -
పదవీకాలం పొడగింపు కోరుతున్న పాటిల్
భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ తన పదవీకాలాన్ని మరో ఏడాది పొడగించాలని కోరుతున్నాడు. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కు పాటిల్ ఈ మేరకు లేఖ రాసినట్టు సమాచారం. సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా సందీప్ నాలుగేళ్ల పదవీకాలం వచ్చే సెప్టెంబర్‌లో పూర్తికానుంది. పాటిల్ విన్నపాన్ని బీసీసీఐ మన్నించకపోవచ్చు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏ సెలెక్టర్ కూడా నాలుగేళ్లకు మించి పదవిలో ఉండరాదని, పాటిల్‌కు బోర్డు ఎలా మినహాయింపు ఇస్తుందని క్రికెట్ వర్గాలు చెప్పాయి. ఈ పదవిని చాలా మంది ఆశిస్తున్నారని తెలిపారు. దీన్నిబట్టి పాటిల్ పదవీకాలాన్ని పొడగించే అవకాశం దాదాపుగా లేనట్టే. కాగా టీమిండియా చీఫ్ కోచ్ పదవి కోసం కూడా పాటిల్ దరఖాస్తు చేసుకున్నా ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేను చీఫ్ కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. -
టీమిండియా కోచ్ ఎవరు?
రేపే కీలక ఇంటర్వ్యూ కోల్‌కతా: భారత్ క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక కోసం కీలకమైన ఇంటర్వ్యూలు మంగళవారం కోల్‌కతాలో జరుగనున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ పదవి కోసం భారత క్రికెట్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి, సందిప్ పాటిల్‌తోపాటు పలువురు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం జరగనున్న ఇంటర్వ్యూకు కుంబ్లే, రవిశాస్త్రి, పాటిల్ హాజరు కానున్నారు. సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌తో కూడిన బీసీసీఐ సలహా కమిటీ ఈ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నది. షార్ట్‌లిస్ట్ చేసిన 21 మంది అభ్యర్థులు కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూకు హాజరుకానున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న సచిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఇంటర్వ్యూలో పాల్గొంటారు. -
టీమిండియా కోచ్ పదవి రేసులో ఉన్నా
ముంబై: టీమిండియా కోచ్ పదవికి చాలా పేర్లు వినిపించాయి. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ ప్రస్తుత చైర్మన్ సందీప్ పాటిల్ ఈ పదవికి పోటీపడుతున్నాడు. కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్టు పాటిల్ స్వయంగా చెప్పాడు. 2012 సెప్టెంబర్‌లో సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా పాటిల్ బాధ్యతలు చేపట్టాడు. నాలుగేళ్ల ఈ పదవీకాలం త్వరలో ముగియనుంది. టీమిండియా సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు సమర్థవంతంగా పనిచేశాడని పేరుతెచ్చుకున్న పాటిల్.. కోచ్ పదవిని ఆశిస్తున్నాడు. కాగా కోచ్ పదవి కోసం చాలామంది పోటీపడుతున్నారు. విక్రమ్ రాథోడ్, ప్రవీణ్ ఆమ్రే, లాల్ చంద్ రాజ్పుట్, రుషికేష్ కనిత్కర్ రేసులో ఉన్నట్టు సమాచారం. పదవీకాలం పూర్తికావడంతో టీమిండియా డైరెక్టర్‌గా ఇటీవల వైదొలిగిన రవిశాస్త్రి కూడా పోటీపడవచ్చని క్రికెట్ వర్గాలు తెలిపాయి. టీమిండియా కోచ్ పదవికి మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ సహా పలువురి పేర్లు ఇంతకుముందు వినిపించాయి. ఇంతకీ టీమిండియా కోచ్ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. -
మన సైన్యం సిద్ధం
⇒ టి20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన ⇒ ఆసియాకప్కూ అదే జట్టు ⇒ షమీ పునరాగమనం, నేగికి అవకాశం ⇒ రహానేకే సెలక్టర్ల ఓటు ⇒ భువనేశ్వర్, మనీశ్ పాండే అవుట్ న్యూఢిల్లీ: సొంతగడ్డపై టి20 ప్రపంచకప్ పోరులో తలపడే భారత జట్టును సెలక్టర్లు శుక్రవారం ప్రకటించారు. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ పునరాగమనం, లెఫ్టార్మ్ స్పిన్నర్ పవన్ నేగి ఎంపిక మినహా ఇతర సంచలన నిర్ణయాలేమీ లేవు. ఊహించినట్లుగా ఆసీస్‌ను చిత్తు చేసిన జట్టుకే సెలక్టర్లు ఓటు వేశారు. శ్రీలంకతో సిరీస్ కోసం ఎంపికైన మనీశ్ పాండే, పేసర్ భువనేశ్వర్ కుమార్లపై మ్యాచ్ ఆడకుండానే వేటు పడింది. వీరిద్దరిని వరల్డ్ కప్‌కు ఎంపిక చేయలేదు. పాండేకంటే గత రెండేళ్లుగా అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న అజింక్య రహానే అనుభవంపైనే సెలక్షన్ కమిటీ నమ్మకముంచింది. ఇక షమీ రాకతో భువనేశ్వర్ కుమార్‌ను పక్కన పెట్టి అతని పుట్టినరోజున సెలక్టర్లు నిరాశలో ముంచెత్తారు. ముందుగా ప్రకటించినట్లుగా వరుసగా ఆరో టి20 ప్రపంచకప్‌లోనూ టీమిండియా ధోని నాయకత్వంలోనే బరిలోకి దిగనుంది. వరల్డ్‌కప్‌కు ముందు సన్నాహకంగా జరగనున్న ఆసియా కప్‌లో కూడా ఇదే జట్టు పాల్గొంటుంది. ఫిబ్రవరి 24నుంచి మార్చి 6 వరకు బంగ్లాదేశ్‌లో ఆసియా కప్, మార్చి 8నుంచి ఏప్రిల్ 3 వరకు భారత్‌లో వరల్డ్ కప్ జరుగుతుంది. షమీ కోలుకుంటాడా! వన్డే వరల్డ్‌కప్ తర్వాత మోకాలి గాయంతో జట్టుకు దూరమైన పేసర్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. అయితే గాయం తిరగబెట్టడంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే తిరిగొచ్చాడు. అతని ఫిట్‌నెస్‌పై పూర్తి స్పష్టత లేకపోయినా సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ‘షమీ మన అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు చాలా సమయముంది. ఆలోగా అతను కోలుకుంటాడని నమ్ముతున్నాం. ప్రస్తుతం అతను మెరుగవుతున్నాడు. బౌలింగ్ చేయడం కూడా ప్రారంభించాడు’ అని పాటిల్ వెల్లడించారు. అప్పటికి షమీ కోలుకోకపోతే అతని స్థానంలో మరొకరిని ఎంపిక చేసేందుకు అవకాశం ఉంది. జడేజా, యువరాజ్లు జట్టులో ఉన్న తర్వాత కూడా నేగి ఎంపిక ఆశ్చర్యం కలిగించింది. లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం కూడా నేగికి ఉంది. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే అతనికి నేరుగా వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కడం విశేషం. ఆస్ట్రేలియా పర్యటనలో సాధ్యమైనన్ని ప్రయోగాలు చేశామని... ఆ తర్వాతే ఎవరు తుది జట్టులో ఉండాలి, వారి ప్రత్యామ్నాయాలు ఏమిటనేదానిపై అంచనాకు వచ్చినట్లు పాటిల్ స్పష్టం చేశారు. టి20 వరల్డ్ కప్, ఆసియా కప్‌కు భారత జట్టు ధోని (కెప్టెన్), రోహిత్, శిఖర్ ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, జడేజా, పాండ్యా, అశ్విన్, బుమ్రా, నెహ్రా, రహానే, హర్భజన్, షమీ, నేగి. కెప్టెన్ కోరుకున్నట్లే... టి20 స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ నేగి ఈ ఫార్మాట్లో 56 మ్యాచ్‌లు ఆడి 26.28 సగటుతో 46 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 135 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. ఐదేళ్ల దేశవాళీ కెరీర్లో ఢిల్లీ తరఫున నేగి 19 వన్డేలు, 3 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ విజయం అంకెలపరంగానే కాదు కెప్టెన్‌గా ధోని ఆత్మవిశ్వాసం అంబరాన్ని తాకేంతగా అద్భుతాలు చేసింది. ఆ ప్రభావం వల్లే కావచ్చు తాజాగా ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేయడంలో ధోని ముద్ర గట్టిగా కనిపించింది. వన్డే సిరీస్ ఓడిన తర్వాత తీవ్రమైన ఒత్తిడిలో కనిపించిన అతను ఈ ఎంపికలో మాత్రం తన మాటను నెగ్గించుకున్నట్లు అర్థమవుతోంది. రెండు ఆశ్చర్యకర నిర్ణయాల్లో ధోని ప్రాధాన్యతలకు సెలక్టర్లు పట్టం కట్టారు. మొహమ్మద్ షమీపై ధోనికి ఉన్న అపార నమ్మకం కారణంగానే పూర్తి ఫిట్ కాకపోయినా అతను మళ్లీ ఎంపికయ్యాడు. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయినా ప్రధాన పేసర్‌గా షమీ బెస్ట్ అని కెప్టెన్ భావించాడు. ఇక నేగి ఎంపిక కూడా పూర్తిగా కెప్టెన్ చాయిస్! నాకు ఆల్‌రౌండర్లు కావాలి అంటూ పదే పదే చెబుతున్న ధోనికి తన చెన్నై జట్టు సహచరుడు నేగి ఆటపై మంచి అవగాహన ఉంది. లెఫ్టార్మ్ స్పిన్‌తో పాటు చివర్లో ధాటిగా ఆడగల నేగికి ఒకటి రెండు మ్యాచ్‌లలో జడేజాకంటే ముందు బ్యాటింగ్ అవకాశం కూడా ఇచ్చాడు. దేశవాళీ ప్రదర్శనకంటే ఐపీఎల్లో రాణించడమే నేగి ఎంపికకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. తుది జట్టు ఎలా ఉండొచ్చు? ఆసీస్‌తో సిరీస్ ఆడిన 11 మందే దాదాపుగా మొదటి చాయిస్‌గా తుది జట్టులో ఉండవచ్చు. వరల్డ్ కప్ జట్టును చూస్తే రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, ధోని రూపంలో ఐదుగురు రెగ్యులర్ బ్యాట్స్‌మెన్ ఉండగా, రహానేకు కూడా తుది జట్టులో చోటు కష్టమే. ధావన్ విఫలం లేదా ఎవరికైనా గాయమైతే ప్రత్యామ్నాయంగా రహానే ఉంటారు. యువరాజ్, జడేజా, పాండ్యా రూపంలో ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఇప్పుడు వీరికి జత కలిసిన నేగికి అవకాశం లభించాలంటే జడేజాను పక్కన పెట్టడం తప్ప మరో మార్గం లేదు. అశ్విన్ ఉండగా, ప్రత్యర్థి జట్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉంటేనే భజ్జీ ఆడతాడు. షమీ వస్తే నెహ్రాను తప్పించవచ్చు. మొత్తంగా ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప డగౌట్‌కు పరిమితమయ్యే నలుగురు రహానే, హర్భజన్, నేగి, నెహ్రా అవుతారు. ధోని ఆలోచనల ప్రకారం జడేజా, నేగి ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడకపోయినా వేర్వేరుగానైనా ఇద్దరినీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. జట్టులో వైవిధ్యం కోసం లెగ్‌స్పిన్నర్‌ను తీసుకుంటే బాగుండేది. కానీ కుదురుగా ఆడుతున్న జట్టును మార్చడం అనవసరమని భావించి ఉంటారు. -సాక్షి క్రీడావిభాగం మార్పుల్లేని మిథాలీ సేన మహిళల టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును కూడా సెలక్టర్లు ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించిన జట్టులో ఒక్క మార్పు కూడా చేయకపోవడం విశేషం. హైదరాబాదీ మిథాలీ రాజ్ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతుంది. జట్టు వివరాలు: మిథాలీరాజ్ (కెప్టెన్), జులన్ గోస్వామి, స్మృతి మందన, వేద కృష్ణమూర్తి, హర్మన్‌ప్రీత్ కౌర్, శిఖా పాండే, రాజేశ్వర్ గైక్వాడ్, సుష్మ వర్మ, పూనమ్ యాదవ్, వీఆర్ వినీత, అనూజ పాటిల్, ఏక్తా బిస్త్, తిరుష్కామిని, దీప్తి శర్మ, నిరంజన నాగరాజన్. -
ముద్దు.. వద్దు
‘కిస్’కు అనుమతివ్వబోమని స్పష్టం చేసిన నగర పోలీసు కమిషనర్ బెంగళూరు : కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమానికి ఎలాంటి పరిస్థితిలో అనుమతి ఇచ్చేది లేదని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తేల్చిచెప్పారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ సంసృతి ప్రకారమే కాకుండా ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం బహిరంగ స్థలాలలో అశ్లీలంగా ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించు కోవడం నేరమని అన్నారు. ఈనెల 30వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇక్కడి టౌన్‌హాల్ దగ్గర కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని రచిత తనేజా ఇప్పటికే అర్జీ సమర్పించారని అన్నారు. ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో ఎంత మంది పాల్గొంటారు.. వారు ఎక్కడి నుంచి వస్తున్నారో.. తదితర వివరాలు ఆ అర్జీలో లేవని ఎంఎన్ రెడ్డి అన్నారు. అయితే లవ్ ఆఫ్ కిస్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వ రాదని ఇప్పటికే పలు సంఘ, సంస్థలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. కేరళ, ఢిల్లీలో జరిగిన కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతలకు భంగం కలగరాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కాగా, కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తామ ఎలాగైనా అడ్డుకుంటామని చట్టానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడిన శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్‌కు నోటీసులు జారీ చేశామని అన్నారు. కిస్ ఆఫ్ లవ్ కార్యక్రామన్ని నిర్వహించినా, ఆ సమయంలో అడ్డుకోడానికి ఎవరైనా ప్రయత్నించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా తమ పని తాము చేసుకుని వెళ్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బెంగళూరు నగర జాయింట్ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్, బెంగళూరు కేంద్ర విభాగం డీసీపీ సందీప్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
రౌడీషీటర్‌పై పోలీసు కాల్పులు
నిఘా పెట్టి వేటాడి... నిందితుడిపై 45 కేసులు బెంగళూరు : పోలీసు కాల్పుల్లో రౌడీషీటర్ గాయపడిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. వెంకటేశ్ అలియాస్ వెంకి అలియాస్ కంచె (29)ను అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించినట్లు మంగళవారం డీసీపీ సందీప్ పాటిల్ చెప్పారు. వెంకటేష్ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ కృష్ణమూర్తిని ఆస్పత్రికి తరలించారు. ఆయన వివరాల మేరకు వారం రోజుల క్రితం ఓ యువతి కిడ్నాప్‌నకు యత్నించాడని రౌడీషీటర్ వెంకటేష్ కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి క్లబ్లో పార్టీ ముగించుకుని అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో వెంకటేష్ బైక్‌లో బయటకు వచ్చాడు. అదే సమయంలో అశోక్‌నగర సీఐ రంగప్ప, కానిస్టేబుల్ కృష్ణమూర్తి ఇతర సిబ్బం ది జీపులో వెంబడించారు. బైక్ నిలపాలని సూచించారు. అయితే వెంకటేష్ వేగంగా బండి నడపడంతో పోలీసులు కూడా అదే వేగంతో బైక్‌ను ఢీకొట్టి వెంకటేష్‌ను కిందపడేటట్లు చేశారు. ఇదే సమయంలో వెంకటేష్ తన వద్ద పదునైనా ఆయుధంతో కానిస్టేబుల్ కృష్ణమూర్తిని గాయపరిచాడు. దీంతో అప్రమత్తమైన సీఐ రివాల్వర్‌తో వెంకిపై కాల్పులు జరిపాడు. దీంతో అతను కుప్పకూలిపోయాడు. అప్పటి నుంచి నిఘా వారం రోజుల క్రితం బీబీఎంపీ కార్పొరేటర్ గోవిందగౌడ మనవుడి పుట్టిన రోజు వేడుకలు ఇక్కడి శివానంద సర్కిల్లోని హోటల్లో నిర్వహించారు. అదే రోజు రాత్రి 9.45 గంటల సమయంలో వేడుక ముగించుకుని గోవిందగౌడ కోడలు మానస భర్తతో కలిసి బయటకు వచ్చారు. భర్త కారు తీసుకుని రావడానికి వెళ్లిన సమయంలో ఆమె రోడ్డుపై ఉండగా ఇండికా కారులో వచ్చిన వెంకటేష్, మరో ముగ్గురు మానసతో గొడవ పెట్టుకున్నారు. ఆమెను కిడ్నాప్ చెయ్యడానికి విఫలయత్నం చేశారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద పెట్టున కేకలు పెట్టడంతో సిగ్నల్ వద్ద ఉన్న పోలీసులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు. ఆ సమయంలో వెంకటేశ్, మరో నిందితుడు పరారీ కాగా మంజునాథ్ అనే వ్యక్తిని మానస కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. పోలీసులు నిందితులు వచ్చిన కారును గుర్తించి విచారణ చేసి అప్పటి నుంచి వెంకటేష్‌పై నిఘా పెట్టారు. నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 45 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. -
పీయూసీ విద్యార్థి కిడ్నాప్ కథ సుఖాంతం
బెంగళూరు : నగరంలో కళాశాల విద్యార్థి కిడ్నాప్ ఉదంతం సంచలనం సృష్టించింది. సంఘటన జరిగిన 12 గంటల్లోనే ఛేదించి యువకుడిని క్షేమంగా విడిపించినట్లు డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు. అయితే పరారీలో ఉన్న నిందితులు కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దేవయ్య పార్కు సమీపంలో నివాసముంటున్న రమేష్ కుమారుడు ప్రతీక్ (18) ప్రతీక్ సెయింట్ జోసెఫ్ కళాశాలలో పీయుసీ చదువుతున్నాడు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రతీక్ స్కూటర్లో ఇంటికి ఇంటికి బయలుదేరాడు. మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో వెళ్తుండగా ముందు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం వేగం తగ్గించడంతో దాని వెనుకనే వస్తున్న ప్రతీక్ కూడా స్కూటర్ వేగాన్ని తగ్గించాడు. వారి వెనుకనే మారుతి వ్యాన్‌లో వస్తున్న దుండగులు ప్రతీక్‌ను పట్టుకుని వ్యాన్ లోపలికి లాగేసుకుని వేగంగా వెళ్లిపోయారు. అనంతరం రమేష్‌కు ఫోన్ చేసి కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు చెప్పారు. రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు. ఆందోళన చెందిన రమేష్ హుటాహుటిన సుబ్రమణ్యనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వయంగా డీసీపీ సందీప్ పాటిల్ రంగంలోకి దిగి ఏడుగురు సీఐల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సిటీ మొత్తం జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో కిడ్నాపర్లతో మాటలు కలపాలని రమేష్‌కు పోలీసులు సూచించారు. రూ. 50 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు రూ. 20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. రాత్రంతా దుండగులు ప్రతీక్‌ను కారులో నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పారు. కిడ్నాపర్లు మొదట లాల్బాగ్ ఈస్ట్‌గేట్ దగ్గరకు నగదు తీసుకురావాలని ఒత్తిడి తెచ్చారు. రమేష్ నగదు తీసుకుని అక్కడి చేరుకున్నాడు. పోలీసులు కూడా వచ్చారని గుర్తించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. నిమ్హాన్స్, కిద్వాయ్ ఆస్పత్రికి వద్దకు రావాలని చెప్పి అక్కడి నుంచి కూడా వెళ్లిపోయారు. మంగళవారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో బెంగళూరు- హొసూరు రోడ్డులోని డెయిరీ సర్కిల్ దగ్గరకు రావాలని చెప్పారు. రమేష్ నగదు బ్యాగ్ తీసుకుని అక్కడికి వెళ్లాడు. అక్కడికి బైక్‌లో వచ్చిన నిందితుడు నగదు బ్యాగ్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మొదట కుమారుడిని చూపించాలని రమేష్ అన టంతో కిడ్నాపర్ బ్యాగ్ లాక్కొటానికి యత్నించాడు. ఇదే సమయంలో పోలీసులు వచ్చారని తెలుసుకున్న నిందితులు అక్కడి నుంచి వేగంగా వాహనంలో వెళ్లిపోయారు. వెనుకాలే పోలీసులు వస్తున్నట్లు గ్రహించిన కిడ్నాపర్లు లక్కసంద్ర వద్ద ప్రతీక్‌ను వదిలి పరారయ్యారు. కిడ్నాపర్లు కన్నడలోనే మాట్లాడారని ప్రతీక్ తెలిపారు. తెలిసిన వారి పనే అయి ఉంటుందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు. -
'సచిన్ భవిష్యత్ ను నిర్ణయించడానికి నేనవ్వరిని'
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్ ముగింపు పలికేందుకు నేనవ్వరినంటూ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ ప్రశ్నించాడు. సచిన్ తో రిటైర్మెంట్ ప్రకటించడానికే వెస్టిండీస్ తో రెండు టెస్ట్ ల సిరీస్ ను ఏర్పాటు చేస్తున్నారనే ఊహాగానాల మీడియాలో వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సచిన్ టెండూల్కర్ తో సందీప్ పాటిల్ సమావేశమయ్యారు. సచిన్ తో కలిసిన నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ సచిన్ రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకోవాల్సింది తాను కాదని ఆయన అన్నారు. సచిన్ తో కలిసేందుకు తాను ఉత్సాహం చూపుతాను. గత పది నెలలుగా సచిన్ ను కలువలేదు. కనీసం ఆయనతో మాట్లాడలేదు. ఇప్పటి వరకు తాను ఏమి మాట్లాడలేదు అని పాటిల్ అన్నారు. సచిన్ రిటైర్మెంట్ కోసమే వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ను బీసీసీఐ ఏర్పాటు చేయడం జరిగిందని మీడియాలో వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సచిన్ తో సందీప్ పాటిల్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. సచిన్ 200వ టెస్ట్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ పై ఓ నిర్ణయం తీసుకునే విధంగా బీసీసీఐ అడుగులేస్తోంది.