న్యూఢిల్లీ: రహస్యంగా ఉంచాల్సిన కొన్ని విషయాలను పదవి నుంచి దిగిపోయాక బయటపెట్టడం అనైతికమని మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్‌పై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించకపోతే వన్డే జట్టు నుంచి అతడికి ఉద్వాసన పలికేవారమని పాటిల్ వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే వన్డే ప్రపంచకప్‌కు ముందు ధోనిని కూడా కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆలోచించినట్టు పేర్కొన్నారు. ‘మాజీ చైర్మన్‌గా వ్యవహరించిన ఆయన ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఇవే ప్రశ్నలకు మరోలా సమాధానం ఇచ్చారు. అయితే దిగిపోయాక మాత్రం సమాధానాలు మారాయి. ఆయనపై చర్యలు ఉంటాయా? లేదా? అనే విషయంపై బోర్డులోని సరైన వ్యక్తులు త్వరలోనే చెబుతారు’ అని ఠాకూర్ స్పష్టం చేశారు.