టీమిండియా కోచ్ ఎవరు?
రేపే కీలక ఇంటర్వ్యూ
కోల్‌కతా: భారత్ క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక కోసం కీలకమైన ఇంటర్వ్యూలు మంగళవారం కోల్‌కతాలో జరుగనున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ పదవి కోసం భారత క్రికెట్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి, సందిప్ పాటిల్‌తోపాటు పలువురు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం జరగనున్న ఇంటర్వ్యూకు కుంబ్లే, రవిశాస్త్రి, పాటిల్ హాజరు కానున్నారు.
సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌తో కూడిన బీసీసీఐ సలహా కమిటీ ఈ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నది. షార్ట్‌లిస్ట్ చేసిన 21 మంది అభ్యర్థులు కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూకు హాజరుకానున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న సచిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఇంటర్వ్యూలో పాల్గొంటారు.