‘కోహ్లి కంటే రోహిత్‌ బెటర్‌..!’ | sandeep patil says rohit is a better bats man than kohli in limited overs format | Sakshi
Sakshi News home page

‘కోహ్లి కంటే రోహిత్‌ బెటర్‌..!’

Published Wed, Dec 27 2017 9:53 AM | Last Updated on Wed, Dec 27 2017 10:13 AM

sandeep patil says rohit is a better bats man than kohli in limited overs format - Sakshi

న్యూఢిల్లీ : లంకేయులతో మొహాలిలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ  డబుల్‌ సెంచరీ చేసి(208) అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రోహిత్ శర్మ పై ప్రశంసల జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం భారత మాజీ క్రికెటర్‌ సందీప్‌ పాటిల్‌ కూడా ఆ కోవలోకి చేరారు. కోహ్లి కన్నా రోహిత్ శర్మనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని టీమిండియా మాజీ క్రికెటర్‌ సందీప్ పాటిల్ అభిప్రాయపడ్డారు.  

ఆయన మాట్లాడుతూ.. ‘కోహ్లి ఫ్యాన్స్‌కు ఈ మాటలు ఒప్పుకోకున్నా ఇది నిజం. విరాట్‌ కోహ్లి చాలా గొప్ప బ్యాట్స్‌మెన్‌ అనడంలో ఏ విధమైనా సందేహం లేదు. అతను టెస్టులో నంబర్.‌1 బ్యాట్స్‌మెన్.  రోహిత్‌ పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లి కన్నా ముందు ఉన్నాడు. రోహిత్‌ శర్మ ఈ సంవత్సరం లిమిటెడ్‌ ఓవర్స్‌ మ్యాచ్‌లో బాగా ఆడాడు. అయితే శ్రీలంకపైనే ఎక్కువ మ్యాచ్‌లో ఆడాడని వాదించే వారు కూడా ఉన్నారు. అలా వాదించే వారు కోహ్లి కూడా ఆ టీంతోనే ఆడాడన్న విషయాన్ని గుర్తించుకోవాలి. రోహిత్‌ కెప్టెన్‌గా తన బాధ్యతలను నిర్వహిస్తూ తన ఆటతో కూడా అందర్ని అలరించాడు’ అని సందీప్‌ పాటిల్‌ అన్నారు.

తాత్కలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో డబుల్‌ సెంచరీ, టి20లో అజేయ శతకం చేసి ప్రపంచ రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. తన మెరుపు దాడితో టీమిండియా శ్రీలంకపై 2-1తో వన్డే సిరీస్‌ను, 3-0లో టి20 సిరిస్‌లను కైవసం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement