గౌతమ్ గంభీర్
న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్ ఆటగాడు గౌతమ్ గంభీర్ తీరు సరిగా లేకపోవడంతోనే అతను భారత జట్టులో చోటు కోల్పోయాడని సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ సందీప్ పాటిల్ తెలిపాడు . ఓ ఆంగ్లపత్రికకు రాసిన ఆర్టీకల్‌లో పేర్కొన్నాడు. ‘‘అతని ప్రవర్తన కారణంగానే భారత జట్టులో చోటు కోల్పోయాడు. ఎప్పుడు కోపంగా ఉండే గంభీర్‌ని నేను భారత క్రికెట్ అమితాబ్ బచ్చన్ అని పిలిచేవాడిని’ అని తెలిపాడు. 2011లో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బౌన్సర్ తగిలాక స్వదేశానికి తిరిగి రావడం గంభీర్‌కు పెద్ద నష్టం చేసిందన్నాడు. స్కానింగ్‌లో అంత పెద్ద గాయం కాలేదని తేలిందని, అతను సిరీస్ కొనసాగిల్సిందని సందీప్ అభిప్రాయపడ్డాడు.
గంభీర్, తాను 7-8 ఏళ్ల పాటు స్నేహితులమని, జట్టు నుంచి తప్పించిన తర్వాత అతడు స్నేహాన్ని వదులుకున్నాడని సందీప్ పేర్కొన్నాడు. ఏదేమైనా తన అభిమాన క్రికెటర్ మాత్రం గంభీరేనని పాటిల్ స్పష్టం చేశాడు. గంభీర్‌ను జట్టు నుంచి తప్పించినప్పుడు పాటిల్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నాడు. ఇక పాటిల్ గంభీర్ స్థానంలో అతని ఢిల్లీ సహచరుడు శిఖర్ ధావన్‌ను ఎంపిక చేశాడు. మరోవైపు ఓవపెనర్‌గా మురళి విజయ్ కూడా రాణించడంతో గంభీర్ పునరాగమనం కష్టమైంది. ఇక వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ.. గంభీర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సందీప్ పాటీల్ తన వ్యాసంలో ఇలా పేర్కొనడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment