టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తాను ఎదుర్కొన్న ఆల్‌టైమ్ వరల్డ్ బెస్ట్ టీమ్ వివరాలను స్పోర్ట్స్‌కీడాతో పంచుకున్నాడు. ఈ టీమ్‌లో గంభీర్ ఆసక్తికరంగా ముగ్గురు పాకిస్తానీ మాజీలకు చోటిచ్చాడు. అలాగే ముగ్గురు ఆసీస్ మాజీలకు, ఇద్దరు సౌతాఫ్రికా మాజీలకు, విండీస్, ఇంగ్లండ్, శ్రీలంక నుంచి చెరో మాజీకి చోటిచ్చాడు. ఈ జట్టులో గంభీర్ తన జమానాలో కఠినమైన ప్రత్యర్థులైన రికీ పాంటింగ్, గ్లెన్ మెక్‌గ్రాత్‌కు చోటివ్వకపోవడం విశేషం. గంభీర్ తన ఫేవరెట్ ప్రత్యర్థి టీమ్‌లో ప్రస్తుత టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా చోటివ్వడం మరో విశేషం.
గంభీర్ తన ఫేవరెట్ ప్రత్యర్ధి జట్టు ఓపెనర్లుగా ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాథ్యూ హేడెన్‌లను ఎంపిక చేశాడు. వన్‌డౌన్‌లో ఏబీ డివిలియర్స్, నాలుగో స్థానంలో బ్రియాన్ లారా, ఐదో ప్లేస్‌లో ఇంజమామ్ ఉల్ హాక్‌ను ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్ల కోటాలో గంభీర్ ఆసక్తికరంగా పాక్ మాజీ అబ్దుల్ రజాక్‌కు చోటిచ్చాడు. మిగతా ఇద్దరు ఆల్‌రౌండర్లుగా ఆండ్రూ ఫ్లింటాఫ్, ఆండ్రూ సైమండ్స్‌లను ఎంపిక చేశాడు.
తన జట్టులో ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ముత్తయ్య మురళీథరన్‌కు అవకాశం ఇచ్చిన గంభీర్.. ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్‌గా షోయబ్ అక్తర్, మోర్నీ మోర్కెల్‌ను ఎంపిక చేశాడు. గంభీర్ తన జట్టులో ముగ్గురు కెప్టెన్లుగా పని చేసిన వారిని ఎంపిక చేసినప్పటికీ ఎవ్వరికీ ఆ హోదా ఇవ్వలేదు. గంభీర్ తన ప్రత్యర్ధి జట్టులో న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లకు చెందిన ఒక్క ఆటగాడికి కూడా చోటివ్వలేదు.
గంభీర్ వరల్డ్ ఎలెవన్: ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాథ్యూ హెడెన్, ఏబీ డివిలియర్స్, బ్రియాన్ లారా, ఇంజమామ్-ఉల్-హక్, ఆండ్రూ సైమండ్స్, అబ్దుల్ రజాక్, ఆండ్రూ ఫ్లింటాఫ్, ముత్తయ్య మురళీధరన్, షోయబ్ అక్తర్, మోర్నీ మోర్కెల్.
Comments
Please login to add a commentAdd a comment