టీమిండియా బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా క్రిక్‌బజ్‌కు తెలిపాడు. మోర్కెల్ కాంట్రాక్ట్ సెప్టెంబర్ 1 నుంచి మొదలవుతుందని షా పేర్కొన్నాడు. కాగా, టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్‌కు తొలి అసైన్‌మెంట్ బంగ్లాదేశ్ సిరీస్ అవుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో బంగ్లాదేశ్ రెండు టెస్ట్‌లు, మూడు టీ20ల కోసం భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌ల నుంచి మోర్నీ భారత బౌలింగ్ కోచ్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు.
ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఇటీవలే నియమితుడైన విషయం తెలిసిందే. తాజాగా శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఛార్జ్ తీసుకున్నాడు. ఆ సిరీస్‌లలో భారత తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే వ్యవహరించాడు.
గంభీర్ తన సహాయ బృందం ఎంపిక విషయంలో బీసీసీఐని ఒప్పించి మరీ తనకు అనుకూలమైన వారిని ఎంపిక చేయించుకున్నాడు. గంభీర్ టీమ్‌లో ప్రస్తుతం అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ ఉన్నారు. తాజాగా గంభీర్ తాను రెకమెండ్ చేసిన మోర్నీ మోర్కెల్‌కు భారత బౌలింగ్ కోచ్ పగ్గాలు అప్పజెప్పి తన పంతం నెగ్గించుకున్నాడు. గంభీర్, మోర్కెల్ గతంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు కలిసి పని చేశారు. ఈ పరిచయంతోనే గంభీర్ మోర్కెల్ పేరును ప్రతిపాదించాడు.
Comments
Please login to add a commentAdd a comment