Bowling coach
-
ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా వరల్డ్‌కప్ విన్నర్
ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్ పరాస్ మాంబ్రే నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఎంఐ యాజమాన్యం ఇవాళ (అక్టోబర్ 16) అధికారికంగా ప్రకటించింది. మాంబ్రే గతంలో ముంబై ఇండియన్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. మాంబ్రే ప్రస్తుత ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగతో కలిసి పని చేస్తాడు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొద్ది రోజుల కిందటే తమ హెడ్ కోచ్ మార్క్ బౌచర్‌పై వేటు వేసి పాత కోచ్ మహేళ జయవర్దనేను తిరిగి నియమించుకుంది. బౌచర్ ఆథ్వర్యంలో ముంబై ఇండియన్స్ గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చింది. ఈ కారణంగా ఎంఐ యాజమాన్యం అతన్ని తప్పించింది. మాంబ్రే విషయానికొస్తే.. ఇతను 2024 టీ20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. మాంబ్రే ఆథ్వర్యంలో (వరల్డ్‌కప్‌లో) భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. మాంబ్రే అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ 2013 సీజన్ టైటిల్‌ను నెగ్గింది. అలాగే 2011, 2013 ఛాంపియన్స్ లీగ్‌ను కూడా కైవసం చేసుకుంది. మాంబ్రే టీమిండియా తరఫున 1996-1998 మధ్యలో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడాడు. మాంబ్రే దేశవాలీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ 284 ఫస్ట్ క్లాస్ వికెట్లు, 111 లిస్ట్-ఏ వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ గత ఐపీఎల్ సీజన్లో చిట్టచివరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. గత సీజన్లో ఈ జట్టు హార్దిక్ పాండ్యా నేతృత్వంలో 14 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. చదవండి: రెండో స్థానానికి ఎగబాకిన బ్రూక్.. టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకున్న రూట్ -
న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్‌గా మాజీ ఆల్‌రౌండర్
న్యూజిలాండ్ పురుషుల క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ జేకబ్ ఓరమ్ ఎంపికయ్యాడు. ఓరమ్ అక్టోబర్ 7 నుంచి బాధ్యతలు చేపడతాడు. న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ పదవి 2023 నవంబర్ నుంచి ఖాళీగా ఉంది. అప్పట్లో షేన్ జర్గెన్సన్ న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఓరమ్ 2018-2022 మధ్య న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. గత కొంతకాలంగా అతను న్యూజిలాండ్ మెన్స్ టీమ్ సపోర్టింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు.46 ఏళ్ల ఓరమ్ 2014లో కోచింగ్ కెరీర్‌ను మొదలుపెట్టాడు. అప్పట్లో అతను న్యూజిలాండ్-ఏ టీమ్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. ఓరమ్ ఫ్రాంచైజీ క్రికెట్లోనూ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అతను సూపర్ స్మాష్‌లో సెంట్రల్ హిండ్స్కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. అలాగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఓరమ్ న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక కావడాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ స్వాగతించాడు.ఆటగాడిగా, కోచ్‌గా ఓరమ్ అనుభవం న్యూజిలాండ్ జట్టుకు చాలా ఉపయోగపడుతుందని అన్నాడు. ఓరమ్ నూతన బాధ్యతలను భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి చేపడతాడు. అక్టోబర్ 16 నుంచి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఓరమ్ 2001-2012 మధ్యలో న్యూజిలాండ్ తరఫున 33 టెస్ట్‌లు, 160 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. ఓరమ్ ఐపీఎల్‌లోనూ వివిధ ఫ్రాంచైజీల తరఫున 18 మ్యాచ్‌లు ఆడాడు.ఓరమ్ టెస్ట్‌ల్లో 5 సెంచరీలు, 6 అర్ద సెంచరీలు.. వన్డేల్లో సెంచరీ, 13 అర్ద సెంచరీలు, టీ20ల్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. బౌలింగ్‌లో టెస్ట్‌ల్లో 60 వికెట్లు, వన్డేల్లో 173 వికెట్లు, టీ20ల్లో 19 వికెట్లు తీశాడు. -
టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్.. జై షా ప్రకటన
టీమిండియా బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా క్రిక్‌బజ్‌కు తెలిపాడు. మోర్కెల్ కాంట్రాక్ట్ సెప్టెంబర్ 1 నుంచి మొదలవుతుందని షా పేర్కొన్నాడు. కాగా, టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్‌కు తొలి అసైన్మెంట్ బంగ్లాదేశ్ సిరీస్ అవుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో బంగ్లాదేశ్ రెండు టెస్ట్‌లు, మూడు టీ20ల కోసం భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌ల నుంచి మోర్నీ భారత బౌలింగ్ కోచ్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు.ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఇటీవలే నియమితుడైన విషయం తెలిసిందే. తాజాగా శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఛార్జ్ తీసుకున్నాడు. ఆ సిరీస్‌లలో భారత తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే వ్యవహరించాడు.గంభీర్ తన సహాయ బృందం ఎంపిక విషయంలో బీసీసీఐని ఒప్పించి మరీ తనకు అనుకూలమైన వారిని ఎంపిక చేయించుకున్నాడు. గంభీర్ టీమ్‌లో ప్రస్తుతం అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ ఉన్నారు. తాజాగా గంభీర్ తాను రెకమెండ్ చేసిన మోర్నీ మోర్కెల్‌కు భారత బౌలింగ్ కోచ్ పగ్గాలు అప్పజెప్పి తన పంతం నెగ్గించుకున్నాడు. గంభీర్, మోర్కెల్ గతంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు కలిసి పని చేశారు. ఈ పరిచయంతోనే గంభీర్ మోర్కెల్ పేరును ప్రతిపాదించాడు. -
టీమిండియా తాత్కాలిక కోచ్‌గా సాయిరాజ్ బహుతులే
త్వరలో శ్రీలంకలో పర్యటించనున్న టీమిండియాకు తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే ఎంపికయ్యాడు. 51 ఏళ్ల బహుతులే ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్‌గా పని చేస్తున్నాడు. లంక పర్యటనకు రెగ్యులర్ బౌలింగ్ కోచ్ లేకపోవడంతో బీసీసీఐ బహుతులేను తాత్కాలిక ప్రతిపదికన ఎంపిక చేసింది. బహుతులే.. అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డెస్కటే, టి దిలీప్‌లతో కలిసి గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత కోచింగ్ శిబిరంలో జాయిన్ అవుతాడు. బహుతులే.. 1997-2003 మధ్యలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. లెగ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన బహుతులే టీమిండియా తరఫున రెండు టెస్ట్‌లు, ఎనిమిది వన్డేలు ఆడాడు. కాగా, టీమిండియా.. శ్రీలంక పర్యటన ఈనెల 27 నుంచి మొదలవ్వనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనతోనే గంభీర్ భారత హెడ్ కోచ్‌గా తన ప్రస్తానాన్ని మొదలుపెడతాడు. గంభీర్ కోచింగ్ టీమ్‌లో దిలీప్ తప్పించి మిగతా వారంతా కొత్తవారే. భారత రెగ్యులర్ బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా పేసర్ మోర్నీ మోర్కెల్ ఎంపిక దాదాపుగా ఖరారైంది. దీనిపై అధికారిక ప్రకటనే తరువాయి. అయితే మోర్కెల్ వ్యక్తిగత కారణాల చేత లంక టూర్‌కు అందుబాటులో ఉండనని చెప్పడంతో బీసీసీఐ తాత్కాలిక ఏర్పాటు చేసింది. మోర్కెల్.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ సమయానికి అందుబాటులోకి రావచ్చు.ఇదిలా ఉంటే, లంక పర్యటనలో భారత్ తొలుత టీ20 సిరీస్ ఆడనుంది. జులై 27, 28, 30 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. టీ20లకు పల్లెకెలె.. వన్డేలకు కొలంబో వేదిక కానుంది. ఈ సిరీస్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను ఇదివరకే ఎంపిక చేశారు. టీ20లకు సూర్యకుమార్ యాదవ్.. వన్డే టీమ్‌కు రోహిత్ శర్మ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. -
భారత బౌలింగ్ కోచ్ రేసులో జహీర్ ఖాన్? (ఫొటోలు)
-
టీమిండియాతో టీ20 సిరీస్.. జింబాబ్వే క్రికెట్ కీలక నిర్ణయం
స్వదేశంలో టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌కు జింబాబ్వే అన్ని విధాల సిద్దమైంది. జూలై 5(శనివారం) హరారే వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు జింబాబ్వే క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా మాజీ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ చార్ల్ లాంగెవెల్ట్ను జింబాబ్వే క్రికెట్ నియమించింది. లాంగేవెల్ట్కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. గతంలో అతడు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు.ఇప్పుడు లాంగేవెల్ట్ జింబాబ్వే ప్రధాన కోచ్ జస్టిన్ సామన్స్, అసిస్టెంట్ కోచ్ డియోన్ ఇబ్రహీమ్లతో కలిసి పనిచేయనున్నాడు. కాగా జస్టిన్ సామన్స్, డియోన్ ఇబ్రహీమ్‌లను కూడా ఇటీవలే జింబాబ్వే క్రికెట్ ఎంపిక చేసింది. ఈ సిరీస్‌తోనే జింబాబ్వే పురుషల జట్టు కోచ్‌లగా వీరి ముగ్గరి ప్రయాణం ప్రారంభం కానుంది. జింబాబ్వే మాజీ బ్యాటర్ స్టువర్ట్ మట్సికెన్యేరి ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేయనున్నాడు.జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు భారత జట్టుశుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్) , హర్షిత్ రాణాభారత్తో సిరీస్‌కు జింబాబ్వే జట్టుసికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జోనాథన్ క్యాంప్‌బెల్, టెండై చటారా, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్ మవుటా, బ్లెస్సింగ్ ముజరబానీ, అన్టుమ్డ్ మైక్ర్స్రాబానీ, డి. మిల్టన్ శుంబా -
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ మెంటార్‌గా జేమ్స్ ఆండర్సన్
ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం, ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్ జేమ్స్ ఆండర్సన్.. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగబోయే టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడు. ఆండర్సన్ రిటైరయ్యాక కూడా ఇంగ్లండ్ జట్టుతోనే కొనసాగనున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆండర్సన్‌ను ఫాస్ట్ బౌలింగ్ మెంటార్‌గా నియమించింది. తన చివరి టెస్ట్ ముగిసిన వెంటనే ఆండర్సన్ కొత్త బాధ్యతలు చేపడతాడు.ఇంగ్లండ్.. జులై 10 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. జులై 10, 18, 26 తేదీల్లో మూడు మ్యాచ్‌లు మొదలవుతాయి. లార్డ్స్, ట్రెంట్‌బ్రిడ్జ్, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. లార్డ్స్‌లో జరుగబోయే టెస్ట్‌తో ఆండర్సన్ రిటైర్ కానున్నాడు. ఆండర్సన్ బౌలింగ్ మెంటార్‌గా తన ప్రస్తానాన్ని విండీస్‌తో రెండో టెస్ట్ నుంచి మొదలుపెడతాడు.జట్ల వివరాలు..ఇంగ్లండ్ (తొలి రెండు టెస్ట్‌లకు): హ్యారీ బ్రూక్, జో రూట్, డేనియల్ లారెన్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), క్రిస్ వోక్స్, ఓలీ పోప్, జేమీ స్మిత్, జేమ్స్ ఆండర్సన్ (తొలి టెస్ట్‌కు మాత్రమే), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, డిల్లన్ పెన్నింగ్టన్, మ్యాట్ పాట్స్వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), కవెమ్ హాడ్జ్, అలిక్ అథనాజ్, జకరీ మెక్క్యాస్కీ, జేసన్ హోల్డర్, కిర్క్ మెక్కెంజీ, జాషువ డసిల్వ, టెవిన్ ఇమ్లాక్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, మిఖైల్ లూయిస్, గుడకేశ్ మోటీ, జేడన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, జెర్మియా లూయిస్ -
T20 WC: అఫ్గానిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా డ్వేన్ బ్రావో..
టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ (ACB) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పొట్టి ప్రపంచకప్ కోసం తమ జట్టు బౌలింగ్ కన్సల్టెంట్‌గా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం డ్వేన్ బ్రావోను ఏసీబీ నియమించింది. కరేబియన్ దీవులలో ఈ మెగా ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో బ్రావో సేవలను ఉపయెగించుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ నిర్ణయించుకుంది. కాగా అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు ఇప్పటికే విండీస్‌కు చేరుకుంది. సెయింట్ కిట్స్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో ప్రాక్టీస్ చేయనున్నారు. బ్రావో కూడా అతి త్వరలోనే అఫ్గాన్ జట్టుతో కలవనున్నాడు. ఇక బ్రావో ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ పనిచేస్తున్నాడు. 40 ఏళ్ల బ్రావోకు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రాంచైజీ క్రికెట్లో కూడా అపారమైన అనుభవం ఉంది. వెస్టిండీస్ తరపున ఓవరాల్‌గా 295 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన బ్రావో.. 6423 పరుగులతో పాటు 363 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్(అంతర్జాతీయ మ్యాచ్‌లు+ లీగ్‌లు)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావోనే కొనసాగుతున్నాడు. బ్రావో ఇప్పటివరకు టీ20ల్లో 625 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడంలోనూ బ్రావోది కీలక పాత్ర. అంతేకాకుండా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, సీపీఎల్‌లో సెయింట్ లూసియా వంటి జట్లు టైటిల్స్‌ను సాధించడంలోనూ బ్రావో తన వంతు పాత్ర పోషించాడు. ఇటువంటి వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌తో అఫ్గానిస్తాన్ క్రికెట్ ఒప్పందం కుదుర్చుకోవడం ఆ జట్టుకు ఎంతో లాభం చేకూరుతోంది. -
సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్‌గా ఫ్రాంక్లిన్
హైదరాబాద్: ఐపీఎల్–2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ పేస్ బౌలర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ వ్యవహరిస్తాడు. గత రెండు సీజన్లుగా బౌలింగ్ కోచ్‌గా పని చేసిన దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ స్థానంలో ఫ్రాంక్లిన్‌ను కోచ్‌గా టీమ్ యాజమాన్యం ఎంపిక చేసింది. వ్యక్తిగత కారణాలతో స్టెయిన్ ఈ సీజన్‌నుంచి తప్పుకోవడంతో ఫ్రాంక్లిన్‌కు అవకాశం దక్కింది. 2010, 2011 సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో ఆడిన ఫ్రాంక్లిన్‌కు ఈ లీగ్‌లో కోచ్‌గా ఇదే మొదటి అవకాశం. సన్‌రైజర్స్ హెడ్ కోచ్ డానియెల్ వెటోరిలో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ మాజీ కివీ పేసర్ బౌలింగ్ కోచ్‌గా వస్తున్నాడు. వీరిద్దరు గతంలో కౌంటీ జట్టు మిడిల్‌ఎసెక్స్, హండ్రెడ్ టీమ్ బర్మింగ్‌హామ్ ఫోనిక్స్లకు కలిసి పని చేశారు. డర్హమ్ కౌంటీ టీమ్‌కు హెడ్ కోచ్‌గా కూడా పని చేసిన ఫ్లాంక్లిన్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 43 ఏళ్ల ఫ్లాంక్లిన్ న్యూజిలాండ్ తరఫున 31 టెస్టుల్లో 82, 110 వన్డేల్లో 81, 38 టి20ల్లో 20 వికెట్లు తీశాడు. -
వరల్డ్‌కప్‌లో ఘోర పరాభవం.. పాక్ బోర్డు మరో కీలక నిర్ణయం
CWC 2023- Pakistan Team- PCB: వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోగా.. పేసర్ షాహిన్ ఆఫ్రిదిని టీ20 సారథిగా ప్రకటించింది. అదే విధంగా టెస్టు పగ్గాలను షాన్ మసూద్‌కు అప్పగించింది. ఇక కెప్టెన్సీ మార్పులతో పాటు పాలనా విభాగం, శిక్షనా సిబ్బందిలోనూ కీలక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా.. మాజీ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్‌ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించిన పీసీబీ.. వహాబ్ రియాజ్‌ను చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేసింది. బౌలింగ్ కోచ్‌లుగా ఉమర్ గుల్, సయీద్ అజ్మల్ తాజాగా.. పీసీబీ తమ కోచింగ్ స్టాఫ్‌లో మరో ఇద్దరు మాజీ క్రికెటర్లను చేర్చుకుంది. ఉమర్ గుల్, సయీద్ అజ్మల్లకు బౌలింగ్ కోచ్‌లుగా అవకాశం ఇచ్చింది. గుల్ ఫాస్ట్‌బౌలింగ్ విభాగానికి కోచ్‌గా సేవలు అందించనుండగా.. అజ్మల్ స్పిన్ దళానికి మార్గదర్శనం చేయనున్నాడు. వీరిద్దరు డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు పీసీబీ చైర్మన్ జకా ఆష్రఫ్ మంగళవారం ప్రకటన విడుదల చేశాడు. కాగా ఉమర్ గుల్ ఇప్పటికే పాకిస్తాన్ జట్టుతో ప్రయాణం ఆరంభించాడు. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా కోచ్‌గా వ్యవహరించాడు. మోర్నీ మోర్కెల్ గుడ్‌బై కాగా భారత్ వేదికగా ప్రపంచకప్ ఈవెంట్లో పాకిస్తాన్ దారుణ వైఫల్యంతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బాబర్ బృందం వరుస ఓటముల కారణంగా.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ముఖ్యంగా వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఫ్గనిస్తాన్ చేతిలో చిత్తై పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ తన విధుల నుంచి వైదొలిగాడు. ఉమర్ గుల్.. సయీద్ అజ్మల్ కెరీర్ వివరాలు పాకిస్తాన్ తరఫున 2003లో ఎంట్రీ ఇచ్చిన 2016లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక తన కెరీర్లో ఈ రైటార్మ్ పేసర్ 47 టెస్టులాడి 163, 130 వన్డేల్లో 179, 60 టీ20లలో 85 వికెట్లు పడగొట్టాడు. అజ్మల్ విషయానికొస్తే.. 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్ మొదలుపెట్టిన ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్.. 2015లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. తన కెరీర్లో 35 టెస్టులు, 113 వన్డేలు, 64 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 178, 184, 85 వికెట్లు పడగొట్టాడు. చదవండి: T20 WC: ‘వరల్డ్‌కప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మనే! కోహ్లి కూడా..’ -
IND VS SL: వైరలవుతున్న షమీ సెలబ్రేషన్స్.. హర్భజన్‌ను ఉద్దేశించి కాదు..!
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో నిన్న (నవంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్ షమీ (5-1-18-5) అదిరిపోయే ఐదు వికెట్ల ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ ఐదు వికెట్ల ప్రదర్శనతో పలు రికార్డులు కొల్లగొట్టిన షమీ.. ఈ ఘనత సాధించిన అనంతరం వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో షమీ తన ఐదో వికెట్ సాధించగానే బంతి తలపై రుద్దుకుంటూ డ్రెస్సింగ్ రూమ్‌వైపు సైగలు చేశాడు. తన ప్రదర్శన ఎవరికో అంకితం ఇస్తున్నట్లుగా షమీ సైగలు ఉన్నాయి. "Look at this Harbhajan Singh" Lord Shami the record breaker 🔥#ICCMensCricketWorldCup2023 #INDvSL #Shami #MohammedShami #IndianCricketTeam #HarbhajanSingh #ICCWorldCup2023 #viratkholi #ShubmanGill #ShreyasIyer #Siraj #MohammedSiraj pic.twitter.com/M3VtXgU4Nt — Meet Makwana (@MeetMakzz) November 2, 2023 ఈ ప్రదర్శనతో షమీ హర్భజన్ సింగ్ రికార్డును (వన్డేల్లో భారత్ తరఫున అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనత) బ్రేక్ చేయడంతో భజ్జీని ఉద్దేశించే ఈ సైగలు చేశాడని అంతా అనుకున్నారు. హిందీ వ్యాఖ్యాతలు సైతం ఇదే అన్నారు. అయితే మ్యాచ్ అనంతరం షమీ తాను చేసుకున్న సెలబ్రేషన్స్‌పై వివరణ ఇచ్చాడు. తాను సైగలు చేసింది భజ్జీని ఉద్దేశించి కాదని తేల్చి చెప్పాడు. తన కెరీర్ ఎత్తుపల్లాల్లో అండగా నిలిచి, తాను స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలో సాయపడిన టీమిండియా బౌలింగ్ కోచ్ పరస్ మాంబ్రేను ఉద్దేశించి సదరు సంబురాలు చేసుకున్నానని వివరణ ఇచ్చాడు. తన ఐదు వికెట్ల ప్రదర్శనను మాంబ్రేకు అంకితం ఇస్తున్నాని చెప్పడానికి అలా సైగలు చేశానని తెలిపాడు. మాంబ్రేకు తలపై జట్టు ఉండదు కాబట్టి, అలా సైగలు చేశానని చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్ కూడా చెప్పాడు. కాగా, లంకపై ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన షమీ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇందులో వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు (14 మ్యాచ్‌ల్లో 45) ప్రధానమైంది కాగా.. వన్డేల్లో భారత్ తరఫున అత్యధికసార్లు (4) ఐదు వికెట్ల ఘనత, వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు (3) ఐదు వికెట్ల ఘనత, వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు (7) నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనత వంటి పలు ఇతర రికార్డులు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే, వాంఖడే వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్ రజిత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్ కీలక నిర్ణయం!
ఆసియాకప్-2022కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ కోసం తమ జట్టు అసిస్టెంట్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ఉమర్ రషీద్‌ను యూఏఈకు పీసీబీ పంపించింది. రషీద్ ప్రస్తుతం.. లాహోర్‌లోని నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. మొహమ్మద్ హస్నైన్ వంటి అత్య్తుత్తమ బౌలర్లను తయారు చేయడంలో రషీద్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ షాన్ టైట్‌తో కలిసి పనిచేయనున్నాడు. ఇక ఉమర్ రషీద్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో మిడిల్సెక్స్, సస్సెక్స్ జట్టుల తరపున ఆడాడు. కాగా ఆసియకప్కు ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా దూరమయ్యాడు . అతడి స్థానంలో పేసర్ మొహమ్మద్ హస్నైన్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఇక ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న భారత్‌తో తలపడనుంది. ఇక ఇప్పటికే యూఏఈకు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి. ఆసియాకప్‌కు పాకిస్తాన్ జట్టు బాబర్ ఆజం(కెప్టెన్), షాబాద్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ హస్నైన్. చదవండి: Asia Cup 2022 Ind Vs Pak: బాబర్ ఆజంను పలకరించిన కోహ్లి.. వీడియో వైరల్! రషీద్‌తోనూ ముచ్చట! -
అర్షదీప్‌లో 'ఆ' ప్రత్యేక సామర్థ్యం ఉంది.. యువ పేసర్‌ను ఆకాశానికెత్తిన టీమిండియా కోచ్
Paras Mhambrey Lauds Arshdeep Singh: విండీస్‌తో జరిగిన రెండో టీ20లో కీలక సమయంలో (ఆఖరి 4 ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన దశలో) పొదుపుగా (17, 19 ఓవర్లలో 4, 6 పరుగులు) బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించేందుకు విఫలయత్నం చేసిన యువ పేసర్ అర్షదీప్ సింగ్‌పై బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ప్రశంసల వర్షం కురిపించాడు. అర్షదీప్‌కు ఒత్తిడిలో ప్రశాంతంగా బౌలింగ్ చేయగల ప్రత్యేక సామర్థ్యం ఉందని కొనియాడాడు. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలో ఒత్తిడిని అధిగమించి సత్ఫలితాలు రాబట్టగల సత్తా అర్షదీప్‌కు ఉందంటూ ఆకాశానికకెత్తాడు. అర్షదీప్‌లో ఈ సామర్థ్యాన్ని చాలాకాలంగా గమనిస్తున్నానని, రెండో టీ20లో అతను స్థాయి మేరకు రాణించడం సంతోషాన్ని కలిగించిందని అన్నాడు. భవిష్యత్తులో అర్షదీప్ టీమిండియాలో కీలక బౌలర్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియా తరఫున మూడు టీ20లు ఆడిన అర్షదీప్ 5.91 సగటున ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ పంజాబ్ బౌలర్ స్వల్ప వ్యవధిలోనే తన అత్యుత్తమ ప్రదర్శనతో జట్టులో కీలక బౌలర్‌గా మారాడు. వెస్టిండీస్‌తో ప్రస్తుత టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో 6.25 సగటున మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. రెండో మ్యాచ్‌లో పొదుపుగా (4 ఓవర్లలో 1/26) బౌలింగ్ చేయడంతో పాటు ఓ వికెట్ (రోవ్‌మన్ పావెల్) పడగొట్టిన అర్షదీప్.. అంతకుముందు జరిగిన తొలి టీ20లోనూ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ (4 ఓవర్లలో 2/24) చేసి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే, రెండో టీ20లో అర్షదీప్ టీమిండియాను గెలిపించేందుకు తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఒబెడ్ మెక్కాయ్ ఆరు వికెట్లతో చెలరేగడంతో 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో విండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చదవండి: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్..! -
ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ మాజీ ఆటగాడు
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ మాజీ బౌలర్ ఉమర్ గుల్ నియమితుడయ్యాడు. అతడు ఏప్రిల్4న ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో చేరునున్నాడు. కాగా గుల్కు దేశీయ స్థాయిలో, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. అదే విధంగా లంక ప్రీమియర్ లీగ్‌లో గాలే గ్లాడియేటర్స్ బౌలింగ్ కోచ్‌గా కూడా ఉమర్ గుల్ పనిచేశాడు. కాగా ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఉమర్ గుల్ వెల్లడించాడు. "పిఎస్ఎల్, కెపిఎల్, ఎల్‌పిఎల్ ,దేశీయ స్థాయిలో కోచింగ్ తర్వాత అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. నా అనుభవంతో ఆఫ్ఘన్ బౌలర్లకు సహాయం చేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను" అని ఉమర్ గుల్ పేర్కొన్నాడు. Honoured to be taking up this role with the @ACBofficials . Looking forward to imparting the best of the knowledge that i have and making it worth it for the boys. https://t.co/ouIYa0St2t — Umar Gul (@mdk_gul) April 1, 2022 -
ICC World Cup 2023: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా అజిత్ అగార్కర్!
ICC World Cup 2023- Team India: టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్ రానున్నాడా? అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ ఈ బాధ్యతను తలకెత్తుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియాలో కీలక సభ్యుడైన ఓ ఆటగాడు ఈ మేరకు అగార్కర్ పేరును బోర్డుకు సూచించినట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్-2023 సన్నాహకాల్లో భాగంగా ఈ చర్చ తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెలువరించింది. ఈ మేరకు... ‘‘ప్రస్తుతం భారత క్రికెట్ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే ఓ సీనియర్ ఆటగాడు... వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో అగార్కర్ వంటి అనుభవజ్ఞుడు.. టీమిండియా బౌలర్లకు మార్గనిర్దేశకుడిగా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. నిజానికి మాంబ్రే మంచి బౌలింగ్ కోచ్. అతడు ఇండియా ఏ, అండర్ 19 ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో తలమునకలై ఉంటే... అగార్కర్ సీనియర్లను చూసుకోవాలని భావిస్తున్నాడు’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు పేర్కొంది. కాగా భారత మాజీ సీమర్ పారస్ మాంబ్రే ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక అగార్కర్ విషయానికొస్తే.. 44 ఏళ్ల ఈ టీమిండియా మాజీ బౌలర్.. ప్రస్తుతం టీవీ కామెంటేటర్‌గా ఉన్నాడు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి పోటీ పడగా.. చేతన్ శర్మను ఆ పదవి వరించింది. కాగా 1998 నుంచి 2007 వరకు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అగార్కర్ 28 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 349 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 42 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: IPL 2022: రూ. 6.5 కోట్లే దండగ.. మళ్లీ వైస్ కెప్టెన్సీనా!? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గరం -
IPL 2022: కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్..
Bharat Arun Appointed As KKR Bowling Coach: టీమిండియా మాజీ ఆటగాడు, జట్టు మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. కైల్ మిల్స్ స్థానంలో కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా అరుణ్‌ను ఎంపిక చేసినట్లు ఫ్రాంఛైజీ సీఈఓ వెంకీ మైసూర్ వెల్లడించాడు. అరుణ్ ఎంపిక తక్షణమే అమల్లోకి వస్తుందని వెంకీ పేర్కొన్నాడు. అరుణ్ నియామకాన్ని కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ స్వాగతించాడు. కాగా, రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతని హయాంలో టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది. మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లాంటి యువ పేసర్లు అరుణ్ కోచింగ్‌లో రాటు దేలారు. 59 ఏళ్ల అరుణ్ టీమిండియా తరఫున రెండు టెస్ట్‌లు, నాలుగు వన్డేలు ఆడాడు. ఇదిలా ఉంటే, దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021లో ఇయాన్ సారధ్యంలోని కేకేఆర్ జట్టు అనూహ్య విజయాలతో ఫైనల్‌కి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తుదిపోరులో సీఎస్కే చేతుల్లో చతికిలబడడంతో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. మరోవైపు ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో విండీస్ యోధుడు ఆండ్రీ రస్సెల్, టీమిండియా యువ సంచలనం వెంకటేశ్ అయ్యర్, విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను అట్టిపెట్టుకున్న కేకేఆర్.. జట్టు కెప్టెన్ మోర్గాన్, కీలక ఆటగాళ్లు దినేశ్ కార్తీక్, పాట్ కమిన్స్‌లను వేలానికి వదిలేసింది. చదవండి: ind vs Sa: భారత జట్టు ముందు సఫారీలు నిలవడం కష్టమే! -
ద్రవిడ్ జట్టును ఖరారు చేసిన బీసీసీఐ..!
Vikram Rathour, Paras Mhambrey, T Dilip Set To Be Team India Support Staff: టీమిండియా కోచింగ్ సిబ్బంది నియామకాలు దాదాపుగా ఖరారైనట్టేనని తెలుస్తోంది. ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పేరును అధికారికంగా వెల్లడించిన బీసీసీఐ.. మరి కొద్ది గంటల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్నే కొనసాగించాలని నిర్ణయించిన భారత క్రికెట్ బోర్డు.. బౌలింగ్ కోచ్‌గా ద్రవిడ్ సన్నిహితుడు, టీమిండియా మాజీ బౌలర్ పరాస్ మాంబ్రేను, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ముగ్గురు పేర్లు ఖరారైతే.. వీరంతా ద్రవిడ్ కోచింగ్ టీంలో సహాయక సిబ్బందిగా పని చేస్తారు. ఈ నియామకాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ స్థానాలతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ హెడ్ పదవులకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. చదవండి: T20 WC 2021 PAK VS AUS: పాక్‌ను ఓడించడం అసాధ్యం.. రమీజ్ రజా -
Shaun Tait: ఆఫ్గనిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్
కాబుల్: ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్ ఆఫ్గనిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేయనున్నాడు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని.. ఐదు నెలల కాలానికిగానూ టైట్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు ఆఫ్గన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని టైట్‌ను నియమించినట్లు పేర్కొంది. కాగా షాన్ టైట్ ముందు పెద్ద సవాల్లే ఉన్నాయి. పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్ మొదలుకొని.. ఆ తర్వాత శ్రీలంక పర్యటన.. అటుపై టీ20 ప్రపంచకప్ కీలకంగా ఉన్నాయి. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్గనిస్తాన్ జట్టు ఉన్న గ్రూఫ్లోనే ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్లు ఉన్నాయి. టీ 20 ప్రపంచకప్ తర్వాత నవంబర్ 27నుంచి హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇక 2005లోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన షాన్టైట్ తరచూ గాయాల బారీన పడుతూ జట్టులో నిలకడగా కొనసాగలేకపోయాడు. ఆసీస్ తరపున 3 టెస్టుల్లో 5 వికెట్లు, 35 వన్డేల్లో 62 వికెట్లు, 21 టీ20ల్లో 28 వికెట్లు తీశాడు. ఇక 2007 వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో షాన్ టైట్ సభ్యుడిగా ఉన్నాడు. అంతేగాక ఆ వరల్డ్ కప్‌లో 23 వికెట్లు తీసి ఆసీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా రైట్
ముంబై: ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ డేమియన్ రైట్ను తమ కొత్త బౌలింగ్ కోచ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ నియమించుకుంది. 45 ఏళ్ల రైట్ ఇప్పటికే బంగ్లాదేశ్ అండర్ –19 క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ కోచ్ అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు రైట్ పేర్కొన్నాడు. రైట్ గతంలో బిగ్‌బాష్ లీగ్ జట్టు హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ స్టార్స్‌తో పాటు న్యూజిలాండ్ జాతీయ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్–2021 సీజన్ ఏప్రిల్ 9న మొదలవుతుంది. -
దేశవాళీ క్రికెట్ బౌలింగ్ దిగ్గజం కన్నుమూత
కోల్‌కతా: భారత దేశవాళీ క్రికెట్ స్పిన్ దిగ్గజం రాజిందర్ గోయెల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 77 ఏళ్లు. అనారోగ్యంతో ఆదివారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1958 నుంచి 1985 వరకు దేశవాళీ క్రికెట్లో గోయెల్ చెరగని ముద్ర వేశారు. ఎడంచేతి వాటం స్పిన్నర్ అయిన గోయెల్ తన 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 157 మ్యాచ్‌లు ఆడి 750 వికెట్లు తీశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు ఇప్పటికీ రాజిందర్ గోయెల్ పేరిటే ఉంది. ఆయన రంజీల్లో మొత్తం 637 వికెట్లు పడగొట్టారు. ఇంతటి విశేష ప్రతిభ కనబరిచిన రాజిందర్ భారత జట్టుకు మాత్రం ఆడలేకపోయారు. అయితే 1964–65 సీజన్లో అహ్మదాబాద్‌లో శ్రీలంకతో జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడారు. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశారు. బిషన్ సింగ్ బేడీ అద్భుతమైన స్పిన్నర్‌గా జట్టుకు అందుబాటులో ఉండటంతో సెలక్టర్లు గోయెల్‌వైపు చూడలేకపోయారు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన రాజిందర్ సేవలకు గుర్తింపుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2017లో ‘సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం’ అందజేసింది. ఏళ్ల తరబడి హరియాణాకు ఆడిన ఆయన పంజాబ్, ఢిల్లీ జట్లకూ ప్రాతినిధ్యం వహించారు. హరియాణా క్రికెట్ అభివృద్ధికి ఎంతో సేవ చేసిన గోయెల్ మరణం తమకు తీరని లోటని హరియాణా క్రికెట్ సంఘం అధ్యక్షుడు కుల్తార్ సింగ్ మలిక్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశవాళీ క్రికెట్‌కు పూడ్చలేని నష్టమని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రణ్‌బీర్ సింగ్ మహేంద్ర అన్నారు. -
ఏదో ఒకటి వాడనివ్వొచ్చుగా!
న్యూఢిల్లీ: స్వింగ్‌ను రాబట్టేందుకు బంతి మెరుపు పెంచే ప్రయత్నంలో బౌలర్లకు సరైన ప్రత్యామ్నాయం చూపించాలని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అభిప్రాయ పడ్డారు. షైనింగ్ కోసం ఉమ్ముకు బదులు మరేదైనా పదార్థాన్ని సూచించాలని ఆయన కోరారు. అన్ని జట్లు దాన్నే అనుసరించినపుడు ఎవరికీ ఏ ఇబ్బందులు ఉండవన్నారు. క్రికెట్లో సాధారణంగా బౌలర్లు ఉమ్ముతోనే బంతిని షైనింగ్ చేస్తారు. కరోనా మహమ్మారి వల్ల దీనిని ఐసీసీ నిషేధించింది. ఈ నేపథ్యంలో బయటి పదార్థం వాడే వెసులుబాటు ఇవ్వాలని పలువురు బౌలర్లు, కోచ్‌లు సూచిస్తున్నారు. దీనిపై భరత్ అరుణ్ మాట్లాడుతూ ‘మైనం లేదా వ్యాజిలీన్ లేదా మరేదైనా గానీ... ఏదో ఒకటి వాడే వెసులుబాటు ఇస్తే, అన్ని జట్ల బౌలర్లు దాన్నే వాడతారు. అటువంటి పదార్థాన్ని ప్రయత్నిస్తే తప్పేంటి’ అని అన్నారు. ఉమ్మును వాడే పద్ధతి నుంచి అంత తేలిగ్గా బయటపడమని, శిక్షణ శిబిరాల్లో తరచూ దానిపై అవగాహన కల్పిస్తే ఆ అలవాటు తగ్గుతుందని అరుణ్ చెప్పారు. -
'సచిన్ అంటే ఏంటో నాకు అప్పుడు తెలిసింది'
కరాచి : తనకు అవకాశమొస్తే టీమిండియా బౌలింగ్ కోచ్‌గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. హలో యాప్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో.. మీకు టీమిండియాకు బౌలింగ్ కోచ్‌గా అవకాశమొస్తే చేస్తారా అంటూ ప్రశ్నించగా.. దానికి అక్తర్ పాజిటివ్‌గా స్పందించాడు.' ప్రస్తుతం భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా అరుణ్ భరత్ కొనసాగుతున్నాడు. ఒకవేళ టీమిండియా బౌలింగ్ కోచ్‌గా అవకాశమొస్తే పని చేయడానికి ఇష్టపడతా. బౌలింగ్‌లో నాకున్న జ్ఞానంతో పాటు ఆలోచనలను యువ ఆటగాళ్లతో పంచుకునేందుకు నిరంతరం సిద్ధంగా ఉంటా. జట్టులోని ప్రతీ బౌలర్‌తో కలివిడిగా ఉంటూనే సఖ్యతగా మెలుగుతా. అంతేగాక బ్యాట్స్‌మన్ వికెట్లు తీయడానికి పాటించాల్సిన చిట్కాలను వారికి అందిస్తా. అలాగే ఆఫర్ వస్తే ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కూడా కోచ్‌గా పనిచేయడానికి ఎదురుచూస్తున్నా' అంటూ పేర్కొన్నాడు. (షోయబ్ అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు) దీంతో పాటు సచిన్ టెండూల్కర్‌తో తనకున్న అనుబంధాన్ని అక్తర్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. 1998లో మొదటిసారి సచిన్ టెండూల్కర్‌కు బౌలింగ్ చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. తనకు సచిన్ పేరు తెలుసని.. కానీ చెన్నైలో జరిగిన మ్యాచ్ ద్వారా సచిన్‌ను వారి దేశంలో క్రికెట్ దేవుడిగా అభివర్ణిస్తారని అప్పుడే తెలుసుకున్నట్లు తెలిపాడు. ఇండియాలో కూడా తనకు చాలా మంది అభిమానులున్నారని అక్తర్ చెప్పుకొచ్చాడు. (నజీర్‌కు సెహ్వాగ్ లాంటి బుర్ర లేదు : అక్తర్) (డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది : ఫించ్) -
బ్యాటింగ్ కోచ్ ఎవరో?
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి పేరు ఖరారైన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఇతర సహాయక సిబ్బందిపై పడింది. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది. సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని బృం దం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. సోమవారం ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, గురువారం వరకు కొనసాగే అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం ఎంపికైనవారి జాబితాను ప్రకటిస్తారు. ఈ ఎంపిక విషయంలో రవిశాస్త్రి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారా లేక ఎంపిక కమిటీ తమదైన శైలిలో తగిన వ్యక్తులను ఎంపిక చేస్తుందా అనేది ఆసక్తికరం. ముందంజలో విక్రమ్ రాథోడ్ ... 2014 నుంచి భారత బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్ పనితీరు నిజానికి బాగుంది. చాలా మంది బ్యాట్స్‌మెన్ అతని హయాంలో తమ ఆటతీరు మెరుగైందని, సాంకేతిక విషయాల్లో కూడా లోపాలు తీర్చిదిద్దారని బహిరంగంగానే చెప్పారు. అయినా సరే బంగర్ పదవి భద్రంగా లేదు. అనేక మంది దీని కోసం పోటీ పడుతున్నారు. కారణాలేమైనా రవిశాస్త్రి కూడా భరత్ అరుణ్, ఆర్. శ్రీధర్ల గురించి మాట్లాడినంత సానుకూలంగా బంగర్ గురించి చెప్పలేదు. దాంతో కొత్త వ్యక్తికి అవకాశం దక్కవచ్చని వినిపిస్తోంది. హెడ్ కోచ్ పదవికి ప్రయత్నించి విఫలమైన లాల్‌చంద్ రాజ్‌పుత్ ఈసారి బ్యాటింగ్ కోచ్ కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే అంతర్గత సమాచారం ప్రకారం మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోడ్ వైపు ఎక్కువగా మొగ్గు కనిపిస్తోంది. వీరిద్దరితో పాటు ప్రవీణ్ ఆమ్రే, అమోల్ మజుందార్ కూడా గట్టి పోటీనిస్తున్నారు. సౌరాష్ట్ర కోచ్ సితాన్షు కొటక్, హృషికేశ్ కనిత్కర్, మిథున్ మన్హాస్ కూడా ఇంటర్వ్యూకు హాజరు కానున్నారు. రోడ్స్‌కు కష్టమే! బౌలింగ్ కోచ్ పదవి కోసం ప్రస్తుత కోచ్ భరత్ అరుణ్‌తో పాటు వెంకటేశ్ ప్రసాద్, పారస్ మాంబ్రే, అమిత్ భండారి బరిలో ఉన్నారు. వీరంతా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మరోవైపు జాంటీ రోడ్స్‌లాంటి దిగ్గజం పోటీలో నిలిచినా ప్రస్తుత ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలుస్తోంది. ఇన్నేళ్లుగా భారత్ ఫీల్డింగ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన శ్రీధర్‌కు రవిశాస్త్రి అండదండలు ఉండటమే దీనికి కారణం. టీమిండియా ప్రస్తుత ప్రమాణాలు శ్రీధర్ ఘనతే కాబట్టి రోడ్స్ స్థాయి వ్యక్తి అయినా సరే అనవసరమనే భావన కనిపిస్తోంది. -
భారత బౌలింగ్ కోచ్ పదవికి సునీల్ జోషి దరఖాస్తు
న్యూఢిల్లీ: టీమిండియా బౌలింగ్ కోచ్ పదవికి భారత మాజీ ఆటగాడు సునీల్ జోషి దరఖాస్తు చేశాడు. కర్ణాటకకు చెందిన జోషి ఇటీవలి ప్రపంచ కప్ వరకు బంగ్లాదేశ్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ అనుభవమే ప్రాతిపదికగా తన అభ్యర్థ్ధిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టుకు ఒక స్పిన్నర్ బౌలింగ్ కోచ్‌గా ఉండటం అవసరమని అంటున్నాడు. 2011లో హైదరాబాద్ రంజీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన 49 ఏళ్ల జోషి 1996–2001 మధ్య భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 15 టెస్టుల్లో 41 వికెట్లు పడగొట్టాడు. 69 వన్డేల్లో 69 వికెట్లు తీశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 160 మ్యాచ్‌ల్లో 615 వికెట్లు తీశాడు. -
బౌలింగ్ కోచ్‌గా జహీర్ సరిపోడు: రవిశాస్త్రి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కోచ్‌ల విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బౌలింగ్ కోచ్ ఎంపిక పట్ల హెడ్ కోచ్ రవిశాస్త్రి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తనకు మద్దతుగా ఉండే వ్యక్తిని బౌలింగ్ కోచ్‌గా తీసుకోవాలని రవిశాస్త్రి భావిస్తున్నాడు. గతంలో భారత బృందానికి బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన భరత్ అరుణ్‌ను తీసుకోవాలనే పట్టుపడుతున్నట్లు సమాచారం. దీనిపై మాట్లాడటానికి హెడ్ కోచ్‌గా ఎన్నికైన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా రవిశాస్త్రి బౌలింగ్ కోచ్ పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గురువారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో రవిశాస్త్రి మాట్లాడారు. 'జహీర్ ఉత్తమైన బౌలర్. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ బౌలింగ్ కోచ్‌గా పనిచేయడానికి కావాల్సినంత అనుభవం మాత్రం లేదని' అన్నారు. అనుభవం లేకపోతే ఏంజరుగుతుందో కోచ్‌గా పనిచేసిని కుంబ్లే విషయంలో చూశాం' అని పేర్కొన్నాడు. కానీ భరత్ అరుణ్ విషయంలో అలా కాదని విదేశాల్లో అపార అనుభవం ఉందన్నాడు. జహీర్ ఏడాదిలో 250 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. అది సాధ్యపడుతుందా? అని ప్రశ్నించాడు. ఒక వేళ కోచ్‌గా పనిచేసే ఉద్దేశం ఉంటే అరుణ్‌తో కలిసి సలహాదారుడిగా పనిచేయాలని సూచించాడు. అదే విధంగా జహీర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున తన బాధ్యతలనుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను బీసీసీఐ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా బోర్డుకు వృధా ఖర్చు అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. భారత జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్‌గా జహీర్‌ఖాన్ ఎంపికైన విషయం తెలిసిందే.