ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్ పరాస్ మాంబ్రే నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఎంఐ యాజమాన్యం ఇవాళ (అక్టోబర్ 16) అధికారికంగా ప్రకటించింది. మాంబ్రే గతంలో ముంబై ఇండియన్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. మాంబ్రే ప్రస్తుత ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగతో కలిసి పని చేస్తాడు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొద్ది రోజుల కిందటే తమ హెడ్ కోచ్ మార్క్ బౌచర్‌పై వేటు వేసి పాత కోచ్ మహేళ జయవర్దనేను తిరిగి నియమించుకుంది. బౌచర్ ఆథ్వర్యంలో ముంబై ఇండియన్స్ గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చింది.
ఈ కారణంగా ఎంఐ యాజమాన్యం అతన్ని తప్పించింది. మాంబ్రే విషయానికొస్తే.. ఇతను 2024 టీ20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. మాంబ్రే ఆథ్వర్యంలో (వరల్డ్‌కప్‌లో) భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. మాంబ్రే అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ 2013 సీజన్ టైటిల్‌ను నెగ్గింది. అలాగే 2011, 2013 ఛాంపియన్స్ లీగ్‌ను కూడా కైవసం చేసుకుంది.
మాంబ్రే టీమిండియా తరఫున 1996-1998 మధ్యలో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడాడు. మాంబ్రే దేశవాలీ క్రికెట్‌లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ 284 ఫస్ట్ క్లాస్ వికెట్లు, 111 లిస్ట్-ఏ వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ గత ఐపీఎల్ సీజన్‌లో చిట్టచివరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. గత సీజన్‌లో ఈ జట్టు హార్దిక్ పాండ్యా నేతృత్వంలో 14 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.
చదవండి: రెండో స్థానానికి ఎగబాకిన బ్రూక్.. టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకున్న రూట్
Comments
Please login to add a commentAdd a comment