ముంబై: గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు ఆడిన భారత మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ ఇప్పుడు అదే జట్టుకు బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యాడు. ఈ ఏడాది జరిగే పదో సీజన్‌కు అతను వసీమ్ అక్రమ్ స్థానంలో బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అతను ఈ ఫ్రాంచైజీకి 2011 నుంచి 2013 వరకు ప్రాతినిధ్యం వహించాడు.
ఆ సమయంలోనే (2012) కోల్‌కతా ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. తమిళనాడుకు చెందిన బాలాజీ గత సెప్టెంబర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం తమిళనాడు జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు.
నైట్‌రైడర్స్ బౌలింగ్ కోచ్‌గా బాలాజీ
Published Wed, Jan 4 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
Advertisement
Advertisement