Lakshmipathy Balaji
-
టీమిండియా బౌలింగ్ కోచ్ రేసులో ఊహించని పేరు! జహీర్ కాదంటే..
టీమిండియా కొత్త కోచ్ గౌతం గంభీర్ సహాయక సిబ్బందిలో ఎవరెవరికి చోటు దక్కనుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. గంభీర్ స్వయంగా బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడనే వార్తల నడుమ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి ఇతడేనంటూ కొత్త పేరు తెరమీదకు వచ్చింది.టీ20 ప్రపంచకప్-2021 నుంచి టీ20 ప్రపంచకప్-2024 దాకా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. పొట్టి ప్రపంచకప్ గెలిచి తన బాధ్యతలకు ఘనంగా వీడ్కోలు పలికాడు ద్రవిడ్.ఈ క్రమంలో 2007, 2011 వరల్డ్‌కప్ విన్నర్ గౌతం గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌ల పదవీకాలం కూడా ముగిసిన విషయం తెలిసిందే.వీరి స్థానంలో గంభీర్ తనకు నచ్చిన వాళ్లను ఎంపిక చేసుకుంటాడని, ఈ విషయంలో బీసీసీఐ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చిందనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్(సౌతాఫ్రికా), అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్(కేకేఆర్‌లో గౌతీ సహచరుడు), బౌలింగ్ కోచ్‌గా వినయ్ కుమార్‌ను గౌతీ ఎంచుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.అయితే, తాజాగా ఇందుకు సంబంధించి మరో కొత్త వార్త వినిపిస్తోంది. వార్తా సంస్థ ANI అందించిన వివరాల ప్రకారం.. బౌలింగ్ కోచ్ విషయంలో బీసీసీఐ తమ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.ఫాస్ట్ బౌలర్ వినయ్ కుమార్‌కు బదులు మరో దిగ్గజ పేసర్, గంభీర్‌తో కలిసి ఆడిన జహీర్ ఖాన్ వైపు బోర్డు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ప్రపంచకప్ జట్టులో సభ్యుడైన ఈ ముంబై బౌలర్ కోచ్ అయితే జట్టుకు ప్రయోజనకంగా ఉంటుందని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ జహీర్ ఖాన్ ఇందుకు సుముఖంగా లేకపోతే.. లక్ష్మీపతి బాలాజీ పేరును కూడా బోర్డు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వినయ్ కుమార్ విషయంలో మాత్రం కరాఖండిగా నో చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు ANIతో పేర్కొన్నాయి.కాగా టీమిండియా తరఫున 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడిన జహీర్ ఖాన్.. ఆయా ఫార్మాట్లలో 311, 282, 17 వికెట్లు తీశాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ రికార్డు సాధించాడు.ఇక చెన్నైకి చెదిన లక్ష్మీపతి బాలాజీ అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 43 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 8 టెస్టులు, 30 వన్డేలు, 5 టెస్టులాడి ఆయా ఫార్మాట్లలో 27, 34, 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా బాలాజీ బౌలింగ్ కోచ్ రేసులోకి రావడం విశేషం. ఇక బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ ఊహాగానాలకు తెరపడదు. -
ఆరోజు బస్సులో అతని పక్కనే కూర్చున్నా.. అందుకే
సిడ్నీ: కరోనా మహమ్మరి సెగతో ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లతో పాటు ఎస్ఆర్హెచ్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అమిత్ మిశ్రాలు కరోనా బారీన పడ్డారు. ఇటు సీఎస్కే బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కూడా కరోనా సోకడంతో లీగ్‌ను రద్దు చేయక తప్పలేదు. అలా ఐపీఎల్ 14వ సీజన్లో కరోనా బారిన పడ్డ వారిలో సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కూడా ఉన్నాడు. హస్సీకి రెండు సార్లు కరోనా పాజిటివ్ రావడంతో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉండి కోలుకున్న అతను ఇటీవలే మాల్దీవ్స్ నుంచి తన సొంత దేశం ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. తాజాగా హస్సీ తన ఆరోగ్య పరిస్థితిపై ఫాక్స్ స్పోర్ట్స్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ' కరోనా నుంచి కోలుకున్న ఇంకా శరీరం కాస్త వీక్‌గానే ఉంది. మళ్లీ నార్మల్ కండీషన్‌కు రావడానికి నాకు కొంచెం టైమ్ పట్టొచ్చు. కరోనా సోకిన 10 రోజుల తర్వాత మళ్లీ టెస్టు చేయించుకుంటే పాజిటివ్ రావడంతో కాస్తంత భయపడ్డా.. కానీ బీసీసీఐ నాకు ధైర్యం చెప్పింది. బహుశా నాకు బాలాజీ ద్వారానే కరోనా వచ్చి ఉండొచ్చు. ఆరోజు బస్సులో తాను బాలాజీ పక్కనే కూర్చున్నా.. అప్పటికే బాలాజీకి కరోనా లక్షణాలు ఉన్నాయి. కానీ ఆ విషయం మా ఇద్దరికి తెలియదు. బాలాజీతో కబుర్లు చెబుతూ కాస్త సరదాగా గడిపాను... బహుశా అప్పుడు ట్రాన్స్మిషన్ ద్వారా కరోనా సోకి ఉండొచ్చు. ఏదైతేనేం కరోనాను జయించి నా దేశానికి చేరుకున్నా. నేను సిడ్నీ ఎయిర్‌పోర్టులో దిగగానే నా కుటుంబసభ్యులు, పోలీసులు, మెడికల్ సిబ్బంది నన్ను రిసీవ్ చేసుకున్న విధానం బాగా నచ్చింది. అంటూ చెప్పుకొచ్చాడు. 2004 నుంచి 2013 వరకు ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన మైక్ హస్సీ 79 టెస్టుల్లో 6,235 పరుగులు; 185 వన్డేల్లో 5,442 పరుగులు; 38 టీ20ల్లో 721 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్లో సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన హస్సీ 59 మ్యాచ్‌లాడి 1977 పరుగులు చేశాడు. చదవండి: మైకెల్ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్ AUS VS ENG: యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల -
ఇమ్రాన్‌ను మించి పాపులర్ అయ్యాడు: నెహ్రా
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా తనకు ఎంతగానో నచ్చిన 16 ఏళ్ల నాటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. కార్గిల్ యుద్ధం తర్వాత భారత్ తొలిసారిగా పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు వెళ్లిన క్షణమది. 2003-04 సీజన్లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన భారత్ వన్డే సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, ఇర్పాన్ పఠాన్లు మెరుగైన ప్రదర్శనలతో కీలక పాత్ర పోషించారు. అయితే ఆ సిరీస్‌లో అద్భుతంగా, అమోఘంగా రాణించిన బౌలర్ ఒకరున్నారని నెహ్రా పేర్కొన్నాడు. ఆ సిరీస్ మోస్ట్ పాపులర్ అయిపోయిన అతని పేరు లక్ష్మీపతి బాలాజీ అని నెహ్రా తెలిపాడు. (‘ధోని వ్యూహాలకు తగ్గ కెప్టెన్లను తీసుకున్నాడు’) వన్డే, టెస్టు సిరీస్‌ల్లో భాగంగా మ్యాచ్‌లన్నింటిలో బాలాజీ అత్యుత్తమ ప్రదర్శన చేశాడని, నిర్ణాయత్మక మూడో టెస్టులో 7 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడని నెహ్రా స్పష్టం చేశాడు. ఆ టూర్ మొత్తంలో బాలాజీ ఆడిన తీరు ఒకప్పటి పాకిస్తాన్ క్రికెటర్, ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్కంటే మెరుగ్గా ఉందన్నాడు. దాంతో పాకిస్తాన్ ప్రజల్లో ఇమ్రాన్ కంటే ఎక్కువగా బాలాజీ పాపులర్ అయిపోయాడన్నాడు. ఇది తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకమన్నాడు. ఒకవైపు వీరేంద్ర సెహ్వాగ్ సిక్సర్ల మోత, ఇర్ఫాన్ పఠాన్ స్వింగ్‌కు బాలాజీ మెరుపులు కూడా తోడవడంతో రెండు సిరీస్‌లను కైవసం చేసుకున్నామన్నాడు. టెస్టు సిరీస్‌లో బాలాజీ బౌలింగ్ గణాంకాలు ఒకటైతే, వన్డే సిరీస్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా ఆకట్టుకోవడం ఇక్కడ విశేషమన్నాడు. ఆ వన్డే సిరీస్‌లో 10వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బాలాజీ 160.71 స్టైక్‌రేట్‌తో 45 పరుగులు సాధించాడు. ఆ సిరీస్‌లో స్టైక్‌రేట్ పరంగా అఫ్రిది కంటే బాలాజీదే అధికం. (మియాందాద్‌ను కడిగేయాలనుకున్నారు..!) -
‘అప్పుడు మాత్రమే ధోని సలహా ఇస్తాడు’
చెన్నై: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బౌలర్లకి కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ వెల్లడించాడు. ప్రస్తుతం జట్టుని సిద్ధం చేసే పనిలో ఉన్న బాలాజీ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ధోనీ కెప్టెన్సీ గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు. 'సాధారణంగా మైదానంలో మహేంద్రసింగ్ ధోనీ బౌలర్ల సహజ శైలిని దెబ్బ తీసేలా ప్రవర్తించడు. వారికి కావాల్సినంత స్వేచ్చ ఇచ్చి బౌలింగ్ చేయమంటాడు. కానీ.. బౌలర్ లయ తప్పుతుంటే మాత్రం.. చిన్నపాటి సూచనలతో సరిపెడతాడు. అంతకుమించి బౌలర్ నుంచి సామర్థ్యానికి మించిన ప్రదర్శనని రాబట్టడం కోసం ఎక్కువ గా ఆరాటపడడు. ధోనీ లాంటి గొప్ప కెప్టెన్ సారథ్యంలో బౌలర్లు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ధోని కెప్టెన్సీలో ఆడిన ఆటగాడిగా ఈ విషయం చెబుతున్నా' అని బాలాజీ వివరించాడు. -
నైట్‌రైడర్స్ బౌలింగ్ కోచ్‌గా బాలాజీ
ముంబై: గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు ఆడిన భారత మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ ఇప్పుడు అదే జట్టుకు బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యాడు. ఈ ఏడాది జరిగే పదో సీజన్‌కు అతను వసీమ్ అక్రమ్ స్థానంలో బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అతను ఈ ఫ్రాంచైజీకి 2011 నుంచి 2013 వరకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలోనే (2012) కోల్‌కతా ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. తమిళనాడుకు చెందిన బాలాజీ గత సెప్టెంబర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం తమిళనాడు జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు.