
ఎంఎస్ ధోని(ఫైల్‌ఫొటో)
చెన్నై: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బౌలర్లకి కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ వెల్లడించాడు. ప్రస్తుతం జట్టుని సిద్ధం చేసే పనిలో ఉన్న బాలాజీ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ధోనీ కెప్టెన్సీ గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు.
'సాధారణంగా మైదానంలో మహేంద్రసింగ్ ధోనీ బౌలర్ల సహజ శైలిని దెబ్బ తీసేలా ప్రవర్తించడు. వారికి కావాల్సినంత స్వేచ్చ ఇచ్చి బౌలింగ్ చేయమంటాడు. కానీ.. బౌలర్ లయ తప్పుతుంటే మాత్రం.. చిన్నపాటి సూచనలతో సరిపెడతాడు. అంతకుమించి బౌలర్ నుంచి సామర్థ్యానికి మించిన ప్రదర్శనని రాబట్టడం కోసం ఎక్కువ గా ఆరాటపడడు. ధోనీ లాంటి గొప్ప కెప్టెన్ సారథ్యంలో బౌలర్లు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ధోని కెప్టెన్సీలో ఆడిన ఆటగాడిగా ఈ విషయం చెబుతున్నా' అని బాలాజీ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment