ధోని (PC: BCCI)
ఐపీఎల్-2025 మెగా వేలానికి ఫ్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల (అక్టోబరు) 31 నాటికి.. అట్టిపెట్టకునే ఆటగాళ్ల తుదిజాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) రిటెన్షన్స్‌కు సంబంధించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.
కాగా ఐపీఎల్ పాలక మండలి రిటెన్షన్ విధానంలో భాగంగా కొత్త నిబంధనలు తెచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ఫ్రాంఛైజీలు గరిష్టంగా ఆరుగురు(ఆర్‌టీఎమ్) ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో రిటెన్షన్ స్లాబ్‌లో మొదటి ఆటగాడికిరూ. 18 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 14 కోట్లు, మూడో క్రికెటర్‌కు రూ. 18 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ. 14 కోట్లు, ఐదో ఆటగాడికి రూ. 11 కోట్లు, ఆరో ఆటగాడికి రూ. 4 కోట్లు(అన్‌క్యాప్డ్) చెల్లించాల్సి ఉంటుంది.
సీఎస్‌కే రిటైన్ చేసుకునేది వీరినే? ఎవరికి ఎన్ని కోట్లు
ఇక తాజా సమాచారం ప్రకారం సీఎస్‌కే తమ టాప్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌లతో పాటు రవీంద్ర జడేజా, శివం దూబే, మతీశ పతిరణలను రిటైన్ చేసుకోవాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇందులో ధోనిని అన్‌క్యాప్డ్ కోటాలో ఎంపిక చేసుకుని రూ. 4 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన ఫ్రాంఛైజీ.. రుతుతో పాటు జడ్డూకు రూ. 18 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు.. రుతురాజ్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 2008లో ఐపీఎల్ ఆరంభమైన నాటి నుంచి ధోని చెన్నై ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నాడు. జట్టును అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి ఈ ఘనత సాధించిన రెండో కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. అయితే, గతేడాది సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన ధోని ఆటగాడిగా కొనసాగాడు.
సీఎస్‌కే అంటే ధోని
నిజానికి ధోని అంటే సీఎస్‌కే.. సీఎస్‌కే అంటే ధోని. ధోని బ్రాండ్ వల్లే చెన్నై ఫ్రాంఛైజీకి ఆదరణ పెరుగిందనేద కాదనలేని వాస్తవం. అంతేకాదు.. వేలం మొదలు కెప్టెన్సీ వరకు ధోని ఆజ్ఞ లేనిదే అక్కడ ఏ పని జరగదని సన్నిహిత వర్గాలు అంటాయి. మరి అలాంటి ధోని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఎలా? అంటే.. బీసీసీఐ నిబంధన ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత ఆటగాళ్లను ఫ్రాంఛైజీలో ఈ కోటాలో వేసుకోవచ్చు.
PC: BCCI
ఇద్దరు శిష్యులు
చెన్నైకి రుతుతో పాటు జడేజా కూడా ముఖ్యం కాబట్టి వాళ్లిద్దరికి రూ. 18 కోట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. కాగా రుతురాజ 2019లో సీఎస్‌కేలో చేరాడు. 2020లో అరంగేట్రం చేసిన అతడు ఆ మరుసటి ఏడాదే ఆరెంజ్‌క్యాప్ హోల్డర్ అయ్యాడు. ఆసియా క్రీడలు-2023లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు సారథ్యం వహించి గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత.. ఈఏడాది సీఎస్‌కే పగ్గాలు చేపట్టాడు.
ఇక రవీంద్ర జడేజాకు సీఎస్‌కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2022లో కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడు. కానీ వరుస ఓటముల నేపథ్యంలో మధ్యలోనే కెప్టెన్సీ వదిలేశాడు. ఈ ఇద్దరికి వరుస అవకాశాలు ఇచ్చి జట్టులో కీలక సభ్యులుగా నిలబెట్టింది మాత్రం ధోనినే!
చదవండి: Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment