మహేంద్ర సింగ్ ధోని.. భారత అభిమానులందరూ ఆరాధించే క్రికెటర్లలో ఒకడు. అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికి నాలుగేళ్లు అవుతున్నప్పటికి.. ఈ టీమిండియా లెజెండ్‌పై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు. ఏడాదికి ఓ సారి ఐపీఎల్‌లో ఆడే తలైవా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తుంటారు.
ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ అలరించేందుకు మిస్టర్ కూల్ సిద్దమయ్యాడు. ఐపీఎల్-2025లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో ధోనిపై లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని అద్బుతమైన కెప్టెన్ అని, అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాని గోయోంకా తెలిపాడు.
"భారత క్రికెట్ చరిత్రలో ధోని పేరు నిలిచిపోతుంది. ధోని లాంటి నాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదు. అతడి ఆలోచిన విధానం, పరిపక్వత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతి చిన్న వయస్సులోనే ఎంఎస్ తనను తను తీర్చుదిద్దుకున్న విధానం నిజంగా అద్బుతం.
ధోని తన అనుభవంతో ఎంతో మంది యువ క్రికెటర్లను సైతం తీర్చిదిద్దాడు. మతీషా పతిరానానే ఉదాహరణగా తీసుకుండి. పతిరానాను ధోని ఏకంగా మ్యాచ్ విన్నర్‌గా తాయారు చేశాడు. తన ఆటగాళ్లను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో ధోనికి బాగా తెలుసు.
ధోనిని కలిసిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను. ఓసారి లక్నో, చెన్నై మ్యాచ్ సందర్భంగా నేను ధోనిని కలిశాను. నాతో 11 ఏళ్ల నా మనవడు కూడా ఉన్నాడు. అతడికి క్రికెట్ అంటే పిచ్చి. ఐదారేళ్ల కిందట ధోనినే నా మనవడికి క్రికెట్ ఆడటం నేర్పించాడు.
ఈ సందర్భంగా అతడు ధోనికి కంటిన్యూగా ఏవో ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అందుకు ధోని విసుగు చెందకుండా సమాధానాలు చెబుతూ వచ్చాడు. చివరికి నేనే ధోని దగ్గరకు వెళ్లి అతడిని విడిచిపెట్టేయండి అని చెప్పా. కానీ ధోని మాత్రం నా మనవుడితో సంభాషణను ఆస్వాదిస్తున్నాను చెప్పాడు.
దాదాపు అరగంట పాటు అతడితో ముచ్చటించాడు. ఒక పిల్లవాడి కోసం అంత సమయం వెచ్చించిన ధోని నిజంగా గొప్పవాడు. అతడి క్యారక్టెర్ ఇతరులతో మనం ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. అందుకే అతడు ధోని అయ్యాడు. అతడు ఎప్పుడు లక్నోతో మ్యాచ్ ఆడినా, స్టేడియం మొత్తం ఎంఎస్‌కి సపోర్ట్‌గా పసుపు రంగు జెర్సీలతో నిండిపోతుంది" అని టీఆర్ఎస్ పోడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోయెంకా పేర్కొన్నాడు.
చదవండి: యశస్వి జైస్వాల్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్ లేకుండానే..
Comments
Please login to add a commentAdd a comment