Sanjeev Goenka
-
'ధోని లాంటి కెప్టెన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.. అతడొక లెజెండ్'
మహేంద్ర సింగ్ ధోని.. భారత అభిమానులందరూ ఆరాధించే క్రికెటర్లలో ఒకడు. అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికి నాలుగేళ్లు అవుతున్నప్పటికి.. ఈ టీమిండియా లెజెండ్‌పై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు. ఏడాదికి ఓ సారి ఐపీఎల్లో ఆడే తలైవా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తుంటారు.ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ అలరించేందుకు మిస్టర్ కూల్ సిద్దమయ్యాడు. ఐపీఎల్-2025లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో ధోనిపై లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని అద్బుతమైన కెప్టెన్ అని, అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాని గోయోంకా తెలిపాడు."భారత క్రికెట్ చరిత్రలో ధోని పేరు నిలిచిపోతుంది. ధోని లాంటి నాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదు. అతడి ఆలోచిన విధానం, పరిపక్వత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతి చిన్న వయస్సులోనే ఎంఎస్ తనను తను తీర్చుదిద్దుకున్న విధానం నిజంగా అద్బుతం.ధోని తన అనుభవంతో ఎంతో మంది యువ క్రికెటర్లను సైతం తీర్చిదిద్దాడు. మతీషా పతిరానానే ఉదాహరణగా తీసుకుండి. పతిరానాను ధోని ఏకంగా మ్యాచ్ విన్నర్‌గా తాయారు చేశాడు. తన ఆటగాళ్లను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో ధోనికి బాగా తెలుసు.ధోనిని కలిసిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను. ఓసారి లక్నో, చెన్నై మ్యాచ్ సందర్భంగా నేను ధోనిని కలిశాను. నాతో 11 ఏళ్ల నా మనవడు కూడా ఉన్నాడు. అతడికి క్రికెట్ అంటే పిచ్చి. ఐదారేళ్ల కిందట ధోనినే నా మనవడికి క్రికెట్ ఆడటం నేర్పించాడు.ఈ సందర్భంగా అతడు ధోనికి కంటిన్యూగా ఏవో ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అందుకు ధోని విసుగు చెందకుండా సమాధానాలు చెబుతూ వచ్చాడు. చివరికి నేనే ధోని దగ్గరకు వెళ్లి అతడిని విడిచిపెట్టేయండి అని చెప్పా. కానీ ధోని మాత్రం నా మనవుడితో సంభాషణను ఆస్వాదిస్తున్నాను చెప్పాడు.దాదాపు అరగంట పాటు అతడితో ముచ్చటించాడు. ఒక పిల్లవాడి కోసం అంత సమయం వెచ్చించిన ధోని నిజంగా గొప్పవాడు. అతడి క్యారక్టెర్ ఇతరులతో మనం ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. అందుకే అతడు ధోని అయ్యాడు. అతడు ఎప్పుడు లక్నోతో మ్యాచ్ ఆడినా, స్టేడియం మొత్తం ఎంఎస్‌కి సపోర్ట్‌గా పసుపు రంగు జెర్సీలతో నిండిపోతుంది" అని టీఆర్ఎస్ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోయెంకా పేర్కొన్నాడు.చదవండి: యశస్వి జైస్వాల్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్ లేకుండానే.. -
IPL 2025: పంత్ ఒక్కడే కాదు.. ఆ ముగ్గురూ కెప్టెన్ ఆప్షన్లు: సంజీవ్ గోయెంకా
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎవరు?!.. ఇంకెవరు రిషభ్ పంత్ అంటారా?!.. ఆగండాగండి.. ఇప్పుడే అలా డిసైడ్ చేసేయకండి.. ఈ మాట అంటున్నది స్వయానా లక్నో ఫ్రాంఛైజీ యజమాని, వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా. తమ జట్టు కెప్టెన్ ఎవరన్న అంశంపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.రూ. 27 కోట్లకు కొనుగోలుకాగా మెగా వేలానికి ముందు లక్నో.. వెస్టిండీస్ స్టార్ నికోలసన్ పూరన్ కోసం ఏకంగా రూ. 21 కోట్లు ఖర్చుచేసిన విషయం తెలిసిందే. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తమ జట్టులోనే కొనసాగిస్తూ ఈ మేర భారీ మొత్తం చెల్లించింది. అయితే, వేలంలో అనూహ్య రీతిలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ నేపథ్యంలో పంత్ ధర రూ. 20 కోట్లకు చేరగా.. లక్నో ఒక్కసారిగా ఏడు కోట్లు పెంచింది. దీంతో ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ పంత్‌ను లక్నో దక్కించుకుంది. ఈ నేపథ్యంలో లక్నో జట్టు కొత్త కెప్టెన్‌గా పంత్ నియామకం లాంఛనమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్నో జట్టు కొత్త కెప్టెన్ రిషభేనా లేదంటే మాకోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? అని చోప్రా ప్రశ్నించాడు.నలుగురు ఉన్నారుఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. కచ్చితంగా అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. నా వరకైతే సర్ప్రైజ్లు ఇవ్వడం ఇష్టం ఉండదు. అయితే, మా కెప్టెన్ ఎవరన్నది త్వరలోనే తెలియజేస్తాం. మా జట్టులో రిషభ్, పూరన్, మార్క్రమ్, మిచెల్ మార్ష్ రూపంలో నలుగురు నాయకులు అందుబాటులో ఉన్నారు’’ అని సంజీవ్ గోయెంకా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి.. నికోలస్ పూరన్‌కు లక్నో పగ్గాలు అప్పగించే యోచనలో యాజమాన్యం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.వారే డిసైడ్ చేస్తారుఇక పంత్ ఓపెనర్‌గా వస్తాడా అన్న ప్రశ్నకు గోయెంకా సమాధానమిస్తూ.. ‘‘మా మిడిలార్డర్‌ను పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నాం. వేలంలో బట్లర్(గుజరాత్ రూ, 15.75 కోట్లు) కోసం ప్రయత్నించాం. కానీ డబ్బు సరిపోలేదు. ఓపెనింగ్ జోడీపై జహీర్ ఖాన్, జస్టిన్ లాంగర్, మా కెప్టెన్ నిర్ణయం తీసుకుంటారు’’ అని పేర్కొన్నారు.కాగా 2022లో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంఛైజీకి మూడు సీజన్లపాటు కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు. తొలి రెండు ఎడిషన్లలో జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. అయితే, ఈ ఏడాది మాత్రం టాప్-4లో నిలపలేకపోయాడు. ఈ క్రమంలో రిటెన్షన్‌కు ముందు లక్నో రాహుల్‌ను వదిలేయగా.. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు కొనుక్కుంది.చదవండి: IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్ రికార్డు బ్రేక్ చేసేవాడు! -
అతడు టాక్సిక్ బాస్.. ‘పంత్‌తో రాహుల్ ముచ్చట’? హర్ష్ గోయెంకా స్పందన వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు అనుకున్నంత ధర దక్కలేదు. భారీ అంచనాల నడుమ ఆక్షన్‌లోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ కోసం ఏ ఫ్రాంఛైజీ కూడా మరీ అంతగా ఎగబడిపోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో రాహుల్ తన పేరును నమోదు చేసుకున్నాడు.అయితే, లోకల్ బాయ్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలుత బిడ్ వేయగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా పోటీకి వచ్చింది. కానీ ధర కాస్త పెరగగానే ఈ రెండూ తప్పుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రాహుల్ కోసం పోటీపడ్డాయి. అలా ఆఖరికి రాహుల్‌ను ఢిల్లీ రూ. 14 కోట్లకు దక్కించుకుంది.కాగా కేఎల్ రాహుల్ ఐపీఎల్-2022- 2024 వరకు లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథ్యం వహించాడు. లక్నో ఫ్రాంఛైజీని అరంగేట్రంలో(2022)నే ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. మరుసటి ఏడాది కూడా టాప్-4లో నిలిపాడు. కానీ.. ఐపీఎల్-2024లో మాత్రం లక్నోకు వరుస పరాభవాలు ఎదురయ్యాయి.రాహుల్‌పై గోయెంకా ఆగ్రహంసీజన్ మొత్తంలో ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఏడు మాత్రమే గెలిచిన లక్నో.. 14 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో చిత్తుగా ఓడిన నేపథ్యంలో.. ఆ ఫ్రాంఛైజీ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా.. తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు.స్వేచ్ఛ ఉన్న చోటే ఆడాలనిఅందరి ముందే రాహుల్‌ను గోయెంకా తిట్టినట్లుగా ఉన్న దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రిటెన్షన్‌కు ముందు రాహుల్- లక్నోల బంధం తెగిపోయింది. ఈ విషయంపై రాహుల్ స్పందిస్తూ.. స్వేచ్ఛ ఉన్న చోట ఆడాలని అనుకుంటున్నట్లు పరోక్షంగా గోయెంకా వైపు మాటల బాణాలు విసిరాడు.ఈ నేపథ్యంలో మెగా వేలం సందర్భంగా సంజీవ్ గోయోంకా సైతం కేఎల్ రాహుల్‌కు కౌంటర్ గట్టిగానే ఇచ్చాడు. కాగా సౌదీ అరేబియాలో జరిగిన ఆక్షన్‌లో లక్నో.. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం రూ. 27 కోట్లు వెచ్చించింది. ఈ విషయం గురించి గోయెంకా మాట్లాడుతూ.. ‘‘మాకు కావాల్సిన ఆటగాడికి ఉండాల్సిన లక్షణాలన్నీ పంత్‌లో ఉన్నాయి. అందుకే అతడి కోసం మేము ముందే రూ. 25- 27 కోట్లు పక్కన పెట్టుకున్నాం’’ అని పేర్కొన్నాడు.ఏదేమైనా వేలం ముగిసే సరికి పంత్, రాహుల్‌ల జట్లు తారమారయ్యాయి. రాహుల్ స్థానంలో లక్నో కెప్టెన్‌గా పంత్, పంత్ ప్లేస్‌లో ఢిల్లీ సారథిగా రాహుల్ వ్యవహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ వీళ్లిద్దరి ఫొటోతో ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. అన్నీ బాగానే ఉంటాయి.. కానీరాహుల్ పంత్ చెవిలో ముచ్చటిస్తున్నట్లుగా ఉన్న ఫొటోకు.. ‘‘చూడు భాయ్.. కంపెనీ మంచిది.. డబ్బు కూడా బాగానే ఇస్తారు.. కానీ బాస్ మాత్రం విషపూరితమైన మనసున్న వ్యక్తి’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు ప్రముఖ వ్యాపారవేత్త, సంజీవ్ గోయెంకా అన్న హర్ష్ గోయెంకా స్పందించారు. ఇదేమిటబ్బా అన్నట్లుగా ఉన్న ఎమోజీని ఆయన జతచేశారు.చదవండి: IPL 2025 Mega Auction: మెగా వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..! -
IPL 2025: అందుకే లక్నోకు గుడ్‌బై.. కారణం వెల్లడించిన కేఎల్ రాహుల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌తో తాను కొత్త ప్రయాణం మొదలుపెట్టాలనుకుంటున్నానని టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. స్వేచ్ఛాయుత వాతావరణంలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తానన్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే.లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడిన కేఎల్ రాహుల్సౌదీ అరేబియాలోని జిద్దా నగరం వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి.ఈ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో కేఎల్ రాహుల్ బంధం తెంచుకున్నట్లు వెల్లడైంది. అయితే, ఇందుకు గల కారణాన్ని ఈ టీమిండియా స్టార్ తాజాగా బయటపెట్టాడు. ‘‘నా ప్రయాణాన్ని సరికొత్తగా మొదలుపెట్టాలనుకుంటున్నాను. నాకు ఉన్న ఆప్షన్లను పరిశీలించాలని భావిస్తున్నా. ముఖ్యంగా ఎక్కడైతే నాకు స్వేచ్ఛగా ఆడే వీలు ఉంటుందో అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను.కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదుఅక్కడి వాతావరణం కాస్త తేలికగా, ప్రశాంతంగా ఉండగలగాలి. అందుకే మన మంచి కోసం మనమే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు’’ అని కేఎల్ రాహుల్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. కాగా 2022లో లక్నో ఫ్రాంఛైజీ ఐపీఎల్లో అడుగుపెట్టింది. తమ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించుకుంది.కెప్టెన్‌గా రాణించినాఅయితే, యాజమాన్యం అంచనాలకు తగ్గట్లుగానే రాహుల్.. లక్నోను అరంగేట్ర సీజన్లోనే ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. ఆ తర్వాతి ఎడిషన్‌లోనూ టాప్-4లో నిలిపాడు. అయితే, ఐపీఎల్-2024లో మాత్రం లక్నో ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించలేకపోయింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ.. ఏడే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే.. లక్నో జట్టు యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా ఐపీఎల్ 2024లో ఓ మ్యాచ్ సందర్భంగా.. రాహుల్‌ను అందరి ముందే తిట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమిని జీర్ణించుకోలేక కెప్టెన్‌పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు.రాహుల్‌కు ఘోర అవమానంఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. సంజీవ్ గోయెంకాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత అతడు నష్టనివారణ చర్యలే చేపట్టి.. రాహుల్‌ను తన ఇంటికి ఆహ్వానించి ఫొటోలు విడుదల చేశాడు. కానీ.. అందరి ముందు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోయిన రాహుల్ ఆ జట్టును వీడినట్లు అతడి తాజా వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. ఇక టీమిండియా టీ20 జట్టులో పునరాగమనమే లక్ష్యంగా తాను ఇకపై అడుగులు వేస్తానని కేఎల్ రాహుల్ ఈ సందర్భంగా తన మనసులోని మాటను వెల్లడించాడు. కాగా లక్నో తరఫున కేఎల్ రాహుల్ 2022లో 616 పరుగులు చేశాడు. గత రెండు సీజన్లలో కలిపి 23 మ్యాచ్‌లు ఆడి 800 రన్స్ స్కోరు చేశాడు. ఇక మొత్తంగా అంతర్జాతీయ టీ20లలో రాహుల్ ఇప్పటి వరకు 72 మ్యాచ్‌లు ఆడి 2265 పరుగులు సాధించాడు.చదవండి: CT 2025: పాకిస్తాన్ కాదు... సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ!? -
లక్నో జట్టు ‘గేమ్ ఛేంజర్’ అతడే: ఎమ్ఎస్కే ప్రసాద్
జహీర్ ఖాన్ రాకతో లక్నో సూపర్ జెయింట్స్ రాత మారబోతుందని ఆ జట్టు టాలెంట్ సెర్చ్ డైరెక్టర్, టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ అన్నాడు. ఈ రివర్స్ స్వింగ్ కింగ్‌ను గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం ఉన్న జహీర్ మార్గదర్శనంలో లక్నో అద్భుత విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.లక్నో మెంటార్‌గా జహీర్ నియామకంకాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ కొత్త మెంటార్‌గా భారత మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్‌ను నియమించిన విషయం తెలిసిందే. జహీర్ ఈ జట్టుతో చేరుతున్నట్లుగా గత కొంత కాలంగా వార్తలు వినిపించగా... టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా బుధవారం అధికారికంగా ప్రకటించారు. మెంటార్‌గా ప్రధాన జట్టుకే పరిమితం కాకుండా ప్రతిభాన్వేషణ, కొత్త ఆటగాళ్లను తీర్చిదిద్దే అదనపు బాధ్యతలను కూడా జహీర్‌కు లక్నో యాజమాన్యం అప్పగించింది.క్యాష్ రిచ్ లీగ్‌లోకి 2022లో లీగ్‌లోకి ప్రవేశించిన లక్నో సూపర్ జెయింట్స్‌కు రెండేళ్లు గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వ్యవహరించగా.. కేఎల్ రాహుల్ సారథ్యంలోని ఈ జట్టు రెండుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఆ తర్వాత మెంటార్ బాధ్యతల నుంచి గంభీర్ తప్పుకోగా.. 2024 సీజన్లో లక్నో పేలవ ప్రదర్శన కనబర్చింది. ఈ క్రమంలో గంభీర్ స్థానాన్ని జహీర్‌తో భర్తీ చేసింది యాజమాన్యం.అత్యుత్తమ బౌలర్ రాక మాకు శుభ పరిణామంఈ నేపథ్యంలో ఎమ్ఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘లక్నో జట్టుకు ఇదొక శుభవార్త. జహీర్ ఖాన్ వంటి మేటి క్రికెటర్ మెంటార్‌గా రావడం మంచి పరిణామం. జహీర్ నెమ్మదస్తుడు. కూల్‌గానే తనకు కావాల్సిన ఫలితాలను రాబట్టుకోగల సమర్థత ఉన్నవాడు. ఆట పట్ల అతడికి విశేష జ్ఞానం ఉంది. ఐపీఎల్లో జహీర్ కెరీర్ ఇలాటీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో అత్యుత్తమంగా రాణించిన ఘనత అతడి సొంతం. ఐపీఎల్‌లోనూ తనకు గొప్ప అనుభవం ఉంది. లక్నో జట్టుకు అతడు గేమ్ ఛేంజర్ కాబోతున్నాడు’’ అని స్పోర్ట్స్కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా భారత అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న జహీర్ 2017 వరకు ఐపీఎల్ ఆడాడు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ జట్ల తరఫున మొత్తం 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు పడగొట్టిన అతను ఆ తర్వాత కూడా ఐపీఎల్‌తో కొనసాగాడు. 2018–2022 మధ్య ఐదేళ్ల పాటు జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్ టీమ్‌కు డైరెక్టర్, ఆ తర్వాత హెడ్ ఆఫ్ గ్లోబల్ డెవలప్‌మెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక ఐపీఎల్-2025లో లక్నో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.చదవండి: ఒక్కడి కోసం అంత ఖర్చు పెడతారా? లక్నో జట్టు ఓనర్ -
ఒక్కడి కోసం అంత ఖర్చు పెడతారా? లక్నో జట్టు ఓనర్
‘‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ రూ. 50 కోట్లు అయినా సరే ఖర్చుపెట్టబోతోంది.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ నేపథ్యంలో అతడికి ఇప్పటికే ఈ మేర భారీ ఆఫర్ కూడా ఇచ్చింది’’ అంటూ సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలపై లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తాజాగా స్పందించాడు. ముంబై జట్టుతో సుదీర్ఘ అనుబంధంఇలాంటి నిరాధార వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తనకు అర్థం కావడం లేదని.. అయినా ఒక్క ఆటగాడి కోసం ఇంత పెద్ద మొత్తం ఎవరైనా ఖర్చు చేస్తారా? అంటూ విస్మయం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కళ్లన్నీ దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మపైనే ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్స్‌గా నిలిపిన హిట్‌మ్యాన్.. పదేళ్లపాటు ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అనూహ్య రీతిలో వేటుఅయితే, గతేడాది ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆగమనంతో రోహిత్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి ముంబై యాజమాన్యం. దీంతో అసంతృప్తికి లోనైన రోహిత్ శర్మ ఆ జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫలితంగా రోహిత్ శర్మ వేలంలోకి రానున్నాడని.. అతడి కోసం లక్నో, ఢిల్లీ తదితర జట్లు పోటీపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గురించి సంజీవ్ గోయెంకాకు ప్రశ్న ఎదురైంది.‘‘రోహిత్ కోసం లక్నో రూ. 50 కోట్లు విడిగా పెట్టిందనే వదంతులు వస్తున్నాయి. ఇవి నిజమేనా?’’ అని యాంకర్ ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘అసలు రోహిత్ శర్మ వేలంలోకి వస్తాడో? లేదో మీరే చెప్పండి. ఈ విషయం గురించి ఎవరికైనా స్పష్టత ఉందా?ఒక్కడి కోసం రూ. 50 కోట్లా?ఇవన్నీ వట్టి వదంతులే. ముంబై ఇండియన్స్ రోహిత్‌ను రిలీజ్ చేస్తుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ అదే జరిగి అతడు వేలంలోకి వచ్చినా.. సాలరీ పర్సులోని 50 శాతం డబ్బు ఒక్క ప్లేయర్ కోసమే ఎవరైనా ఖర్చు చేస్తారా? అలాంటపుడు మిగతా 22 ప్లేయర్ల సంగతేంటి?’’ అని సంజీవ్ గోయెంకా తిరిగి ప్రశ్నించాడు.కోరుకుంటే సరిపోదుఈ క్రమంలో.. ‘‘రోహిత్ మీ విష్ లిస్ట్‌లో ఉన్నాడా?’’ అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్కరికి ఒక విష్ లిస్ట్ ఉంటుంది. అత్యుత్తమ ఆటగాడు, అత్యుత్తమ కెప్టెన్‌నే ఎవరైనా కోరుకుంటారు. అయితే, మనం ఏం ఆశిస్తున్నామనేది కాదు.. మనకు ఏది అందుబాటులో ఉంది.. మనం పొందగలిగేదన్న విషయం మీదే అంతా ఆధారపడి ఉంటుంది. నేను కావాలనుకున్న వాళ్లను వేరే ఫ్రాంఛైజీ దక్కించుకోవచ్చు కదా!’’ అని సంజీవ్ గోయెంకా సమాధానం దాటవేశాడు.చదవండి: ‘రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌తోనే ఉంటాడు’గంభీర్ స్థానంలో జహీర్ ఖాన్.. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉంటాడా? -
లక్నోకు కొత్త మెంటార్.. కేఎల్ రాహుల్‌పై గోయెంకా కామెంట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ కొత్త మెంటార్ పేరును ప్రకటించింది. టీమిండియా రివర్స్ స్వింగ్ కింగ్ జహీర్ ఖాన్ తమ జట్టుకు మార్గ నిర్దేశనం చేయనున్నట్లు తెలిపింది. ఈ దిగ్గజ పేసర్‌తో జతకట్టడం సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఐపీఎల్-2023లో లక్నో మెంటార్‌గా ఉన్న భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్.. ఈ ఏడాది ఆ జట్టును వీడిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో గౌతీ తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్ గూటికి చేరుకోగా.. లక్నో అతడి స్థానాన్ని అలాగే ఖాళీగా ఉంచింది. ఈ నేపథ్యంలో తాజాగా జహీర్ ఖాన్‌ను తమ మెంటార్‌గా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా లక్నో ఫ్రాంఛైజీ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా జహీర్‌కు లక్నో జెర్సీ(నంబర్ 34)ని ప్రదానం చేశాడు.రివర్స్ స్వింగ్ కింగ్‌కు 102 వికెట్లుకాగా మహారాష్ట్రకు చెందిన 45 ఏళ్ల జహీర్ ఖాన్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లో రీఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన ఈ లెఫ్టార్మ్ పేసర్... పది సీజన్లలో 100 మ్యాచ్‌లు ఆడి 7.58 ఎకానమీతో 102 వికెట్లు పడగొట్టాడు.అనంతరం కోచ్ అవతారమెత్తిన జహీర్ ఖాన్.. తొలుత ముంబై ఇండియన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పనిచేశాడు. 2018- 2022 మధ్య కాలంలో ఆ ఫ్రాంఛైజీతో ప్రయాణం చేసిన ఈ దిగ్గజ బౌలర్.. రెండేళ్ల విరామం అనంతరం మళ్లీ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. కాగా లక్నో బౌలింగ్ కోచ్‌గా ఉన్న సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ మోర్నీ మోర్కెల్ ఇటీవలే టీమిండియా బౌలింగ్ శిక్షకుడిగా నియమితుడైన విషయం తెలిసిందే.కేఎల్ రాహుల్‌పై గోయెంకా కామెంట్ఈ నేపథ్యంలో లక్నో మెంటార్‌గా వ్యవహరించడంతో పాటు ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని కూడా జహీర్ పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇక జస్టిన్ లాంగర్ ఈ జట్టుకు హెడ్‌కోచ్‌గా ఉండగా.. లాన్స్ క్లూస్నర్, ఆడం వోగ్స్ అతడికి డిప్యూటీలుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. లక్నో కెప్టెన్సీకి కేఎల్ రాహుల్ గుడ్‌బై చెప్తున్నాడనే వార్తల నడుమ.. సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ.. అతడు తమ కుటుంబంలోని వ్యక్తి లాంటివాడని తెలిపాడు. అయితే, తమ కెప్టెన్ మార్పు గురించి వస్తున్న వార్తలపై స్పందించేందుకు నిరాకరించాడు. మరోవైపు.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఈ ఏడాది చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.చదవండి: భారత స్టార్ క్రికెటర్ గుండెలో రంధ్రం.. సర్జరీ తర్వాత ఇలా..Zaheer, Lucknow ke dil mein aap bohot pehle se ho 🇮🇳💙 pic.twitter.com/S5S3YHUSX0— Lucknow Super Giants (@LucknowIPL) August 28, 2024 -
కేఎల్ రాహుల్ అవుటైనా సరే.. సంజీవ్ గోయెంక రియాక్షన్ వైరల్!
రెండేళ్ల క్రితం ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండుసార్లు ప్లే ఆఫ్స్ చేరింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టాప్-4కు అర్హత సాధించి సత్తా చాటింది. కానీ ఐపీఎల్-2024లో మాత్రం ఈ ఫీట్ పునరావృతం చేసే అవకాశాలు కనిపించడం లేదు.ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో లక్నో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసు అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న లక్నో.. మిగిలిన మ్యాచ్‌లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి.ఈ నేపథ్యంలో ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా లక్నో యజమాని సంజీవ్ గోయెంక ఇచ్చిన రియాక్షన్స్ వైరల్‌గా మారాయి. కాగా గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంక మైదానంలోనే అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాహుల్ వివరణ ఇస్తున్నా పట్టించుకోకుండా కోపంతో ఊగిపోయాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విరివిగా చక్కర్లు కొట్టగా సంజీవ్ గోయెంక తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా స్టార్ పట్ల ఇలా వ్యవహరించడం సరికాదంటూ మాజీ క్రికెటర్లు హితవు పలికారు.ఈ క్రమంలో పొరపాటు గ్రహించిన సంజీవ్ గోయెంక ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు రాహుల్‌ను తన ఇంటికి డిన్నర్‌కు పిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిని ప్రేమగా హత్తుకున్న ఫొటోను బయటకు వదిలారు. తమ మధ్య అంతా బాగానే ఉందనే సంకేతాలు ఇచ్చారు. Goenka smiling after KL Rahul's wicket pic.twitter.com/R0K4BVteSN— Div🦁 (@div_yumm) May 14, 2024 ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా కెమెరాలన్నీ సంజీవ్ గోయెంక వైపే దృష్టి సారించాయి. కేఎల్ రాహుల్ ఐదు పరుగులకే అవుటైనా గోయెంక చిన్నగా నవ్వులు చిందించాడే తప్ప కోపం తెచ్చుకోలేదు. Sanjeev Goenka appreciating KL Rahul's catch. pic.twitter.com/pAeTqjcnTB— Mufaddal Vohra (@mufaddal_vohra) May 14, 2024 అదే విధంగా.. షాయీ హోప్ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ పట్టగానే లేచి నిలబడి మరీ చప్పట్లు కొడుతూ అతడిని అభినందించాడు. ఇక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మైదానంలో కేఎల్ రాహుల్‌తో నవ్వుతూ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకురాగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇంతలో ఎంత మార్పు సార్.. మీరు సూపర్’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్ Ishant Sharma x Mukesh Kumar ⚡️⚡️The duo combine to dismiss the #LSG openers 👏👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvLSG pic.twitter.com/nuFD7AlK28— IndianPremierLeague (@IPL) May 14, 2024A clinical win at home to finish off their home season 🙌 @DelhiCapitals with a lap of honour for their roaring home fans to extend their gratitude for their love and support 🥳#TATAIPL | #DCvLSG pic.twitter.com/DroMjvb9bU— IndianPremierLeague (@IPL) May 15, 2024KL Rahul with Sanjiv Goenka at the special Dinner in Sanjiv Goenka's home last night in Delhi. [LSG] - All is well at LSG Camp. 🌟 pic.twitter.com/W5BtE0Qmff— Johns. (@CricCrazyJohns) May 14, 2024 -
కేఎల్ రాహుల్‌ను ఇంటికి పిలిచిన గోయెంక: అతియా శెట్టి పోస్ట్ వైరల్
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని, బడా వ్యాపారవేత్త సంజీవ్ గోయెంక నష్ట నివారణ చర్యలు చేపట్టారు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను తన ఇంటికి ఆహ్వానించి.. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాహుల్‌ను ఆయన ఆత్మీయంగా హత్తుకున్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.ఐపీఎల్-2022లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టిన లక్నో ఫ్రాంఛైజీ తమ సారథిగా టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్‌ను నియమించింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కెప్టెన్సీలో లక్నో అరంగేట్రంలోనే ప్లే ఆఫ్స్ చేరింది. గతేడాది సైతం టాప్-4తో ముగించింది.ఈ క్రమంలో పదిహేడో ఎడిషన్‌లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. అయితే, ప్లే ఆఫ్స్ రేసులో ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో ఓడిపోయింది.అందరూ చూస్తుండగానే చీవాట్లుఈ మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ టీమ్ కేఎల్ రాహుల్ సేనను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి.. బ్యాటింగ్ విధ్వంసంతో పలు రికార్డులు ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంక కెప్టెన్ రాహుల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.మైదానంలో అందరూ చూస్తుండగానే చీవాట్లు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో సంజీవ్ గోయెంక తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్ వంటి వాళ్లు గోయెంక వ్యవహారశైలిని తప్పుబట్టారు.డిన్నర్ కోసం తన ఇంటికి ఆహ్వానించిఇక ఫ్యాన్స్ అయితే, రాహుల్ ఆత్మగౌరవం నిలబడాలంటే వెంటనే లక్నోకు గుడ్‌బై చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజా ఫొటో తెర మీదకు వచ్చింది. కేఎల్ రాహుల్‌ను డిన్నర్ కోసం తన ఇంటికి ఆహ్వానించిన సంజీవ్ గోయెంక అతడిని ఆలింగనం చేసుకున్నాడు. Sanjiv Goenka invited KL Rahul for dinner at his home last night and both hugged each other.- Everything is okay now in LSG. ❤️ pic.twitter.com/RY9KsiNre3— Tanuj Singh (@ImTanujSingh) May 14, 2024తుపాన్ వెలిసిన తర్వాతఈ నేపథ్యంలో గోయెంక- రాహుల్ మధ్య సఖ్యత కుదిరిందని.. జట్టులో ప్రస్తుతం అంతా బాగానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ భార్య, నటి అతియా శెట్టి చేసిన పోస్ట్ ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. తుపాన్ వెలిసిన తర్వాత ప్రశాంతంగా ఇలా అంటూ ఆమె మబ్బులు వీడిన సూర్యుడి ఫొటో పంచుకుంది.కాగా ఐపీఎల్-2024లో భాగంగా లక్నో మంగళవారం ఢిల్లీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే లక్నో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, మిగిలి ఉన్న మరో మ్యాచ్ గెలవడంతో పాటు ఇందుకోసం ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. Athiya Shetty Instagram story.Cryptic post 🤔🤔 pic.twitter.com/HTKdJ95G9d— DREAM11s STATS (@fantasy1Cricket) May 14, 2024 -
రూ. 400 కోట్ల లాభం వస్తోంది.. చాలదా?: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానులను ఉద్దేశించి టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు, కోచ్‌లే జట్టును ముందుకు నడిపిస్తారని.. ఈ విషయంలో ఓనర్ల జోక్యం అనవసమా అంటూ ఘాటుగా విమర్శించాడు.వ్యాపారవేత్తలు కేవలం లాభనష్టాల గురించే ఆలోచిస్తారని.. అయితే, మైదానంలోనే ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికాడు. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో సెహ్వాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కేఎల రాహుల్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమయ్యాడు. ఫలితంగా రైజర్స్ చేతిలో లక్నో చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో సంజీవ్ గోయెంకా మైదానంలోనే రాహుల్‌తో వాదనకు దిగాడు.అతడు సర్దిచెప్తున్నా వినిపించుకోకుండా ఆగ్రహం ప్రదర్శించాడు. అదే విధంగా కోచ్ జస్టిన్ లాంగర్ పట్ల కూడా ఇదే తరహాలో వ్యవహరించాడు గోయెంకా. ఈ విషయంపై స్పందించిన సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘డ్రెస్సింగ్ రూం లేదంటే ప్రెస్ మీట్ సమయంలోనే ఓనర్లు ఆటగాళ్లతో మాట్లాడాలి. అది కూడా వాళ్లలో స్ఫూర్తి నింపేలా వ్యవహరించాలి గానీ.. ‘‘సమస్య ఏంటి? ఏం జరుగుతోంది?’’ అంటూ మైదానంలోనే ఇలా వ్యవహరించకూడదు.కోచ్‌లు, కెప్టెన్ జట్టును నడిపిస్తారు. కాబట్టి ఓనర్లు ఆటగాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే బెటర్. వాళ్లంతా వ్యాపారవేత్తలు. వాళ్లకు కేవలం లాభం, నష్టం గురించి మాత్రమే తెలుసు.అయినా ఇక్కడ వారికి ఎలాంటి లాస్ లేదు. 400 కోట్ల రూపాయల వరకు లాభం ఆర్జిస్తున్నారు. అంటే.. ఇక్కడ వాళ్లకు నష్టమేమీ ఉండదు కదా అని అంటున్నా! లాభాలు తీసుకోవడం తప్ప జట్టులో ఏం జరిగినా పట్టించుకునే అవసరం పెద్దగా లేదనే అనుకుంటున్నా. మీరేమైనా చెప్పాలనుకుంటే ఆటగాళ్లను మోటివేట్ చేసేలా ఉండాలి.ఐపీఎల్లో చాలా ఫ్రాంఛైజీలు ఉన్నాయి. ఆటగాడు ఓ జట్టును వీడితే మరో జట్టు అతడిని తీసుకుంటుంది. కీలకమైన ఆటగాడిని కోల్పోతే మీ విజయాల శాతం సున్నా అవుతుంది. నేను పంజాబ్ జట్టును వీడినపుడు వాళ్లు ఐదో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడూ కనీసం ఐదో స్థానంతో ముగించలేకపోయారు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. -
కేఎల్ రాహుల్‌కు సారీ.. లక్నోతోనే టీమిండియా స్టార్?!
భారత స్టార్ క్రికెటర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడనున్నాడనే వార్తల నేపథ్యంలో ఆ జట్టు సన్నిహిత వర్గాలు కీలక అప్డేట్ అందించాయి. కెప్టెన్- యాజమాన్యం మధ్య అంతాబాగానే ఉందని స్పష్టం చేశాయి. కాగా ఐపీఎల్-2024లో హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌తో ఘోర ఓటమి నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు ఘోర అవమానం జరిగిన విషయం తెలిసిందే. లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోకి వచ్చి రాహుల్‌పై తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. రాహుల్‌పై గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫలితంగా.. ఫ్రాంచైజీ అసంతృప్తి నేపథ్యంలో రాహుల్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో పగ్గాలు వదిలేసి పూర్తిగా బ్యాటింగ్‌పై శ్రద్ధ పెడతాడా లేదా ఫ్రాంఛైజీకి గుడ్‌బై చెబుతాడా? అనేవి చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో.. ‘లక్నో ఈ నెల 14న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఇందుకు ఇంకా గడువు ఉండటంతో ఏ నిర్ణయం తీసుకోలేదు. మేనేజ్మెంట్ తప్పిస్తుందా లేదంటే కెప్టెన్ రాహులే వైదొలగుతాడా అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుంది’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.తాజాగా ఈ విషయం గురించి లక్నో వర్గాలు స్పందిస్తూ.. ‘‘కేఎల్ రాహుల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడమే గాక... వచ్చే వేలంలో కూడా అతడిని లక్నో తీసుకోదు అని వస్తున్నవి కేవలం వదంతులు మాత్రమే.గత మ్యాచ్ ఫలితం మాకు అనుకూలంగా లేదనే బాధ ఉంది. అయితే, జట్టు, ఓనర్ల మధ్య అంతా బాగానే ఉంది. రాహుల్ కూడా బాగున్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడంతే!’’ అని వార్తా సంస్థ IANSకు తెలిపాయి. కాగా సంజీవ్ గోయెంకా తీరుతో రాహుల్ తీవ్ర మనస్తాపం చెందడం, సోషల్ మీడియాలో తనపై పెద్ద ఎత్తున నెగటివిటీ రావడంతో ఆయన అతడిని క్షమాపణ కోరినట్లు వదంతులు వినిపిస్తున్నాయి.చదవండి: ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే.. సన్‌రైజర్స్ చేయాల్సిందిదే! ఆ రెండు జట్లు కన్ఫామ్!? -
అత్యుత్తమ ఓనర్ అతడే.. ఓ ఎమోషన్: గంభీర్ వ్యాఖ్యలు వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విజయవంతమైన కెప్టెన్లలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఒకడు. రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్), మహేంద్ర సింగ్ ధోని(చెన్నై సూపర్ కింగ్స్) చెరో ఐదుసార్లు టైటిల్ గెలవగా.. గంభీర్ రెండుసార్లు ట్రోఫీ అందుకున్నాడు.కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 2012, 2014 సీజన్లలో చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారినా స్థాయికి తగ్గట్లు రాణించలేక క్యాష్ రిచ్ లీగ్‌కు గంభీర్ గుడ్‌బై చెప్పాడు. మళ్లీ ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా రీఎంట్రీ ఇచ్చాడు గౌతీ.అయితే, తాజా ఎడిషన్ నేపథ్యంలో మెంటార్‌గా సొంతగూటికి చేరుకున్నాడు గంభీర్. అతడి మార్గదర్శనంలో కేకేఆర్ మరోసారి టైటిల్ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న కోల్‌కతా ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఇదిలా ఉంటే.. కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్‌తో తనకున్న అనుబంధం గురించి గౌతం గంభీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘అతడితో నా బంధం ఎంతో అద్భుతమైనది. నాతో కలిసి పనిచేసిన ఫ్రాంఛైజీ ఓనర్లలో అత్యుత్తమ వ్యక్తి అతడు.కేవలం నిరాడంబరంగా ఉంటాడని మాత్రమే నేను ఈ మాట చెప్పడం లేదు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే తత్వం అతడిది. క్రికెటింగ్ విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోడు.స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వాతావరణం కల్పిస్తాడు. అలాంటి ఓనర్ ఉండటం నిజంగా అదృష్టం. నా ప్రతీ నిర్ణయంపై నమ్మకం ఉంచి.. నాకు మద్దతుగా నిలిచాడు.అందుకే ఫలితాలతో సంబంధం లేకుండా మా అనుబంధం ఇన్నేళ్లుగా కొనసాగుతోంది. 2011 నుంచి అతడితో నా బంధం ఇలాగే ఉంది. ఎస్ఆర్కే ఓ ఎమోషన్ అని అందరూ చెప్తారు. అయితే, అతడితో పాటు నాకు కేకేఆర్ కూడా ఓ ఎమోషనే! పరస్పరం నమ్మకం ఉంటేనే ముందుకు వెళ్లగలుగుతాం’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.కాగా లక్నో సూపర్ జెయింట్స్ సంజీవ్ గోయెంకా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను బహిరంగంగానే తిట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్నో యాజమాన్యంతో కలిసి పనిచేసిన గంభీర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
KL Rahul: జట్టు గెలవాలన్న తపనే అది: ఆసీస్ దిగ్గజం.
రెండేళ్ల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టింది లక్నో సూపర్ జెయింట్స్. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వరుసగా రెండుసార్లు ప్లే ఆఫ్స్ చేరింది. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి ఉన్న కొన్ని జట్లకు సాధ్యం కాని ఘనతను లక్నో సాధించింది.ఐపీఎల్-2024లోనూ ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉంది. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణిస్తూ జట్టును టాప్-4లో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు.అయితే, టాప్-4లో అడుగుపెట్టాలంటే కీలకమైన మ్యాచ్‌లో లక్నో చిత్తుగా ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదాబాద్తో బుధవారం నాటి మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటర్‌గా, సారథిగా విఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అందరి ముందే కేఎల్ రాహుల్, కోచ్ జస్టిన్ లాంగర్‌కు గట్టిగా చీవాట్లు పెట్టాడు. దీంతో సంజీవ్ గోయెంకా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్ వరకు తీసుకువచ్చిన కెప్టెన్‌కు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ మహ్మద్ షమీ వంటి ప్రముఖులు ఫైర్ అవుతున్నారు.ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ భిన్నంగా స్పందించాడు. ‘‘అందరి ముందు అలా మాట్లాడేకంటే.. లోపలికి వెళ్లిన తర్వాత చర్చించాల్సింది. ఒకవేళ అదే జరిగితే ఈ విషయం గురించి స్పందించమనే ప్రశ్న నాకు ఎదురయ్యేదే కాదు.అయితే, నాణేనికి మరోవైపు కూడా ఆలోచించాలి. ఆట పట్ల జట్ల యజమానులు, కోచ్‌లకు ఉన్న ప్యాషన్‌ను మనం అర్థం చేసుకోవాలి. వాళ్ల జట్టు అత్యుత్తమంగా రాణించాలని కోరుకోవడంలో తప్పు లేదు. బహుశా అందుకే ఈ ఘటన జరిగి ఉంటుంది’’ అని బ్రెట్ లీ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్ -
సిగ్గు పడండి.. కెమెరాల ముందు ఇలా చేస్తారా?: మహ్మద్ షమీ ఫైర్
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాపై టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించడం సరికాదని విమర్శించాడు. కెప్టెన్ పట్ల బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం సిగ్గు చేటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది.టాపార్డర్ పూర్తిగా విఫలం కాగా ఐదు, ఆరు స్థానాల్లో వచ్చిన నికోలస్ పూరన్(48), ఆరో నంబర్ బ్యాటర్ ఆయుశ్ బదోని(55) అద్భుత ఇన్నింగ్స్ చేయడంతో ఈ మాత్రం పరుగులు రాబట్టింది.ఇక ఈ మ్యాచ్‌లో రాహుల్ 33 బంతులు ఎదుర్కొని కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 75), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89) విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా 9.4 ఓవర్లలోనే పని పూర్తి చేసింది.ఫలితంగా లక్నో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో లక్నో యజమాని కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై అందరి ముందే సీరియస్ అయ్యాడు. రాహుల్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా అస్సలు వినిపించుకోలేదు.ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా.. సంజీవ్ గోయెంకా తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ స్పందిస్తూ.. గోయెంకా తీరును తప్పుబట్టాడు.‘‘ఆటగాళ్లకు ఆత్మ గౌరవం ఉంటుంది. యజమానిగా మీరు కూడా ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న వ్యక్తి. చాలా మంది మిమ్మల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు.కెమెరాల ముందు మీరిలా చేయడం నిజంగా సిగ్గు చేటు. ఇది కచ్చితంగా సిగ్గుపడాల్సిన విషయమే. ఒకవేళ మీరు కెప్టెన్‌తో మాట్లాడాలనుకుంటే అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.డ్రెసింగ్‌రూం లేదంటే హోటల్ రూంలో కెప్టెన్‌తో మాట్లాడవచ్చు. కానీ ఇలా అందరి ముందే మైదానంలో ఇలా అరిచేయడం సరికాదు. ఇలా చేయడం ద్వారా ఎర్రకోట మీద జెండా ఎగురవేసినంత గొప్ప ఏమైనా వచ్చిందేంటి?అతడు కేవలం ఆటగాడే కాదు కెప్టెన్ కూడా! ప్రతిసారి ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోవచ్చు. ఆటలో గెలుపోటములు సహజం. అంత మాత్రాన కెప్టెన్ కించపరిచేలా వ్యవహరిస్తారా? ఇలా చేసి తప్పుడు సందేశం ప్రజల్లోకి వెళ్లేలా చేశారు’’ అంటూ మహ్మద్ షమీ సంజీవ్ గోయెంకా వ్యవహార శైలిపై విరుచుకుపడ్డాడు. కాగా చీలమండ సర్జరీ కారణంగా షమీ(గుజరాత్ టైటాన్స్) ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. -
IPL 2024: కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కేఎల్ రాహుల్..?
కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని తెలుస్తుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని సమాచారం. ఈ సీజన్లో లక్నో ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో రాహుల్ సాధారణ ఆటగాడిగా కొనసాగుతాడని ప్రముఖ వార్తా సంస్ధ వెల్లడించిన నివేదిక ద్వారా తెలుస్తుంది.సన్‌రైజర్స్‌తో నిన్నటి మ్యాచ్ తదనంతర పరిణామాల్లో రాహుల్ ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సన్‌రైజర్స్ చేతిలో దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న అనంతరం లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా రాహుల్ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. అందరూ చూస్తుండగానే రాహుల్‌పై మాటల దాడికి దిగాడు.గొయెంకా నుంచి ఈ తరహా ప్రవర్తనను ఊహించని రాహుల్ తీవ్ర మనస్థాపానికి గురై కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తుంది.గొయెంకా తదుపరి సీజన్లో రాహుల్‌ను వదించుకోవాలని సన్నిహితుల వద్ద ప్రస్తావించాడని సమాచారం. గొయెంకాకు ఆ అవకాశం ఇవ్వడమెందుకని రాహులే స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరగుతుంది. 2022 సీజన్లో లక్నో టీమ్ లాంచ్ అయినప్పుడు రాహుల్‌ను గొయెంకా 17 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకున్నాడు.ఈ సీజన్లో లక్నో ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు ఐదు రోజుల సమయం ఉండటంతో రాహుల్ నిర్ణయం ఏ క్షణానైనా వెలువడవచ్చని సమాచారం. గొయెంకా గతంలో పూణే వారియర్స్ అధినేతగా ఉన్నప్పుడు ధోని విషయంలోనూ ఇలాగే వ్యవహరించాడు. ఓ సీజన్ తర్వాత ధోనిని తప్పించి స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించాడు.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓడినప్పటికీ లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. లక్నో తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. అయితే ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ మిగిలిన జట్ల జయాపజయాలపై అధారపడి ఉంటుంది. -
LSG VS KKR: లక్నో సూపర్ జెయింట్స్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్
లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం తమ ఫ్రాంచైజీ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనుంది. మే 20న కేకేఆర్‌తో జరగబోయే తమ లీగ్ ఆఖరి మ్యాచ్‌లో కృనాల్ అండ్ కో ప్రత్యేకమైన జెర్సీతో బరిలోకి దిగనుంది. ఎల్ఎస్జీకి యజమాని అయిన సంజీవ్ గొయెంకా కోల్‌కతా ఫుట్‌బాల్ దిగ్గజం, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఛాంపియన్ మోహన్ బగాన్ ఫ్రాంచైజ్‌కు కూడా ప్రధాన వాటాదారు కావడంతో ఐఎస్ఎల్ ఛాంపియన్లకు ప్రత్యేక నివాళులర్పించేందుకు ప్రత్యేక జెర్సీని ధరించనున్నట్లు ఎల్ఎస్జీ యాజమాన్యం ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఇందుకు లక్నో గజబ్ అందాజ్.. ఇప్పుడు కోల్‌కతా రంగుల్లో అన్న క్యాప్షన్‌ను జోడించింది. ఐఎస్ఎల్ ఛాంపియన్ మోహన్ బగాన్ మరియు సిటీ ఆఫ్ జాయ్ (కోల్‌కతా)కు ప్రత్యేక నివాళి అని పేర్కొంది. కేకేఆర్ అభిమానుల మద్దతు కోసం.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో జట్టు ముదురు మరియు లేత నీలం రంగుతో కూడిన జెర్సీని ధరిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2023 నుంచి కేకేఆర్ దాదాపుగా నిష్క్రమించిన నేపథ్యంలో ఆ జట్టు అభిమానులను తమవైపు మళ్లించేందుకు ఎల్ఎస్జీ జెర్సీ మార్పునకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ధోని ఈడెన్ గార్డెన్స్‌లో (ఈ సీజన్లో) ఆడినప్పుడు, అతని గౌరవార్ధం (ఆఖరి సీజన్ అన్న ఉద్దేశంతో) కేకేఆర్ అభిమానులు పసుపు రంగు జెర్సీలు ధరించి స్టేడియంలో హంగామా చేసిన వైనాన్ని మైండ్‌లో పెట్టుకుని ఎల్ఎస్జీ యాజమాన్యం ఈ చర్యకు ఉపక్రమించి ఉండవచ్చు. ఏటీకే మోహన్ బగాన్ ఇకపై మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్.. గత ఐఎస్ఎల్ సీజన్ ఫైనల్లో సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని మోహన్ బగాన్ (మునుపటి ఏటీకే మోహన్ బగాన్) జట్టు బెంగళూరు ఎఫ్‌సీని ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మోహన్ బగాన్ ఈ సీజన్ ఛాంపియన్‌గా అవతరించిన అనంతరం గొయెంకా.. తన జట్టు పేరును మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్‌గా మార్చాడు. వచ్చే సీజన్‌ను తాము ఇదే పేరుతో బరిలోకి దిగుతామని ప్రకటించాడు. చదవండి: భారత్-పాక్‌ల మధ్య టెస్ట్ సిరీస్..? -
IPL 2022: యూపీ సీఎంతో కేఎల్ రాహుల్ జట్టు ఓనర్ భేటీ
LSG Owner Meets UP CM: ఐపీఎల్ 2022లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ).. సీజన్ ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీ హెడ్ క్వార్టర్స్‌కు సంబంధించి కీలక వ్యక్తితో భేటీ అయ్యింది. శనివారం ఎల్ఎస్జీ అధినేత సంజీవ్ గొయెంకా, జట్టు మెంటార్, ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్‌తో కలిసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. The first bat of the #LucknowSuperGiants presented to the Honorable Chief Minister, @myogiadityanath. Grateful to receive his support! 🏏 pic.twitter.com/SDmRLMa7Sw— Lucknow Super Giants (@LucknowIPL) February 18, 2022 సీఎంతో భేటీ సందర్భంగా సంజీవ్ గొయెంకా, గంభీర్ లు యోగితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి ఫ్రాంచైజీ తొలి బ్యాట్‌ను అందజేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజీబిజీగా గడుపుతున్న యోగి.. సంజీవ్ గొయెంకా, గంభీర్లతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. యోగికి బ్యాట్ అందజేస్తున్న ఫోటోను ఎల్ఎస్జీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇదిలా ఉంటే, రిటెన్షన్‌లో భాగంగా కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్ లను రిటైన్ చేసుకున్న ఎల్ఎస్జీ.. వేలంలో 69 కోట్లు వెచ్చించి మరో 18 మంది ఆటగాళ్లను సొంతం చేసుకుంది. వేలంలో ఎల్ఎస్జీ అత్యధికంగా అవేశ్ ఖాన్‌కు రూ. 10 కోట్లు చెల్లించి దక్కించుకుంది. ఆ తర్వాత జేసన్ హోల్డర్‌కు 8.75 కోట్లు, కృనాల్ పాండ్యాలపై 8.25 కోట్లు వెచ్చించింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్): రూ. 17 కోట్లు స్టోయినిస్ : రూ. 9 కోట్ల 20 లక్షలు అవేశ్ ఖాన్ : రూ. 10 కోట్లు హోల్డర్ : రూ. 8 కోట్ల 75 లక్షలు కృనాల్ పాండ్యా : రూ. 8 కోట్ల 25 లక్షలు మార్క్ వుడ్ : రూ. 7 కోట్ల 50 లక్షలు డికాక్ : రూ. 6 కోట్ల 75 లక్షలు దీపక్ హుడా : రూ. 5 కోట్ల 75 లక్షలు మనీశ్ పాండే: రూ. 4 కోట్ల 60 లక్షలు రవి బిష్ణోయ్ : రూ. 4 కోట్లు ఎవిన్ లూయిస్: రూ. 2 కోట్లు దుశ్మంత చమీర: : రూ. 2 కోట్లు కృష్ణప్ప గౌతమ్: రూ. 90 లక్షలు అంకిత్ రాజ్‌పుత్: రూ. 50 లక్షలు షాబాజ్ నదీమ్: రూ. 50 లక్షలు కైల్ మేయర్స్: రూ. 50 లక్షలు మోసిన్‌ఖాన్ : రూ. 20 లక్షలు ఆయుశ్ బదోని: రూ. 20 లక్షలు కరణ్ సన్నీ శర్మ: రూ. 20 లక్షలు మయాంక్ యాదవ్ రూ. 20 లక్షలు మనన్ వోహ్రా: రూ. 20 లక్షలు చదవండి: IPL 2022 Auction: కేఎల్ రాహుల్ కెప్టెన్సీ.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇదే -
IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ లోగోలో పెద్ద పొరపాటు.. అదేంటంటే..?
కేఎల్ రాహుల్ సారధ్యం వహించనున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు.. తమ ఫ్రాంచైజీ లోగోను సోమవారం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. లగోను రూపొందించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రణాళికా బద్దంగా డిజైన్ చేశామని ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా వెల్లడించారు. అయితే, లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) లోగోలో ఓ పెద్ద పొరపాటు దొర్లిందని, బడా బిజినెస్ మ్యాన్ అయిన సంజీవ్ గొయెంకా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళితే.. గరుడ పక్షిని పోలి ఉన్న ఎల్ఎస్జీ లోగోను త్రివర్ణ పతాకంలోని మూడు రంగులతో(కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) కూడిన రెక్కలు, మధ్యలో బంతి, బ్యాట్ ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించారు ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా. ఇదంతా బాగానే ఉన్నా లోగోలో ఓ పొరపాటు కొట్టొచ్చినట్లు కనిపించింది. క్రికెట్లో ఫార్మాట్‌ను బట్టి బంతి రంగు మారుతుందన్న లాజిక్‌ను మిసయ్యాడు గొయెంకా. ఐసీసీ రూల్స్ ప్రకారం టెస్ట్ క్రికెట్లో ఎరుపు రంగు బంతి, డే అండ్ నైట్ టెస్ట్‌లకు పింక్ కలర్ బంతి, వన్డే, టీ20లకు తెలుపు రంగు బంతిని ఉపయోగిస్తారు. అయితే, ఎల్ఎస్జీ లోగోలో తెలుపు రంగు బంతి స్థానంలో ఎరుపు బంతి కనిపించడం ట్రోలింగ్‌కు కారణమైంది. ఐపీఎల్.. టీ20 టోర్నీ అనుకుంటున్నారా లేక టెస్ట్ క్రికెట్ అనుకుంటున్నారా అంటూ పంచ్‌లు వేస్తున్నారు నెటిజన్లు. కాగా, లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా అరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. లక్నో జట్టు రూ. 17 కోట్లు పెట్టి కేఎల్ రాహుల్‌ను సారథిగా నియమించుకోగా.. అహ్మదాబాద్ రూ. 15 కోట్లు వెచ్చించి హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంచుకుంది. లక్నో జట్టు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌కి రూ.9.2 కోట్లు, పంజాబ్ కింగ్స్ మాజీ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కి 4 కోట్లు చెల్లించి సొంతం చేసుకోగా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రషీద్ ఖాన్‌కు 15 కోట్లు, శుభ్‌మన్ గిల్‌ను 8 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో జట్టుకు కోచ్‌గా ఆండీ ఫ్లవర్ వ్యవహరించనుండగా.. మెంటార్‌గా గౌతం గంభీర్ నియమితుడయ్యాడు. మరోవైపు అహ్మదాబాద్.. తమ కోచ్‌గా ఆశిష్ నెహ్రాను, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టన్‌ను నియమించుకుంది. చదవండి: IPL 2022: అందుకే గరుడ పక్షి, త్రివర్ణాలు, నీలం రంగు బ్యాట్: లక్నో -
లక్నో హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్.. ఇక కెప్టెన్ మరి !
ఐపీఎల్-2022లో కొత్త జట్టుగా అవతరించిన లక్నో ఫ్రాంచైజీ.. హెడ్‌కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్‌ను నియమించింది. ఆ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా ఈ విషయాన్ని దృవీకరించారు. సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ.. ‘ఆండీ ఆటగాడిగా, కోచ్‌గా క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. మేము అతని వృత్తి పట్ల పట్టుదలని గౌరవిస్తాము. మా జట్టును విజయ పథంలో నడిపిస్తాడాని నేను భావిస్తున్నాను అని అతను పేర్కొన్నాడు. ఇక ఫ్లవర్ మాట్లాడుతూ.. "లక్నో ఫ్రాంచైజీలో చేరినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, ఈ అవకాశం నాకు ఇచ్చినందకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 1993లో నేను తొలిసారిగా భారత పర్యటనకు వచ్చాను. అప్పటినుంచి నేను ఎల్లప్పుడూ భారత్‌లో పర్యటించడం, ఆడడం, ఇక్కడ కోచింగ్‌ని ఇష్టపడతాను. భారత్‌లో క్రికెట్ పట్ల ఉన్న మక్కువ అసమానమైనది. నేను గోయెంకా, జట్టుతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను" అని అతడు పేర్కొన్నాడు. ఐపీఎల్లో ఆండీ ఫ్లవర్ గత రెండు సీజన్లో పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. మరో వైపు రిపోర్ట్స్ ప్రకారం పంజాబ్ కింగ్స్ వదిలేసిన కేఎల్ రాహుల్ లక్నో ఫ్రాంచైజీకి కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక లక్నో ఫ్రాంచైజీని సంజీవ్ గోయెంకా గ్రూప్ 7090 కోట్లకు దక్కించుకుంది. చదవండి: Rohit Sharma: బెంగళూరులో హిట్‌మ్యాన్.. వన్డే సిరీస్ నాటికి ఫిట్నెస్ సాధించేనా? -
IPL 2022 Auction: లక్నో జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
IPL 2022 Auction: KL Rahul Likely to Lead Lucknow Franchise in Upcoming IPL Details: రెండు కొత్త జట్ల రాకతో ఐపీఎల్-2022 సరికొత్త శోభను సంతరించుకోనుంది. లక్నో, అహ్మదాబాద్ జట్లు వచ్చే ఏడాది ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్‌కు మరింత రసవత్తరంగా మారనుంది. ఇక మెగా వేలానికి సర్వం సిద్ధమవుతున్న తరుణంలో ఏ ఫ్రాంఛైజీ ఏ ఆటగాడిని రీటైన్ చేసుకుంటుంది? కొత్త జట్ల కెప్టెన్లుగా ఎవరు ఉండబోతున్నారనే అంశం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్... ఆ జట్టును వీడనున్నాడని... లక్నోకు అతడు సారథ్యం వహించబోతున్నాడనేది వాటి సారాంశం. టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ అయిన రాహుల్‌తో లక్నో ఫ్రాంఛైజీ ఒప్పందం చేసుకోనుందని, మూడు సీజన్ల పాటు అతడు సారథిగా వ్యవహరించనున్నట్లు సమాచారం. అయితే, ఇటీవల రాహుల్ ముంబై ఇండియన్స్‌ను సోషల్ మీడియాలో ఫాలో అవడంతో అతడు ఎంఐకి ఆడనున్నాడంటూ ఊహాగానాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేలంలో అందుబాటులోకి వస్తే అతడిని దక్కించుకునేందుకు లక్నో ఫ్రాంఛైజీ ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాంఛైజీ వర్గాలు కేఎల్ రాహుల్‌ను సంప్రదించాయని, ఇందుకు అతడు అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. కాగా రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా (ఆర్పీఎస్జీ) వెంచర్స్ లిమిటెడ్ రికార్డు స్థాయిలో రూ.7,090 కోట్లు (సుమారు బిలియన్ డాలర్లు) వెచ్చించి లక్నో టీమ్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేఎల్ రాహులే ఎందుకు? ►టీ20 ఫార్మాట్లో రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. ►టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఇటీవలే ఎంపికయ్యాడు. ►మిగతా ఆటగాళ్లతో పోలిస్తే ఐపీఎల్‌లోనూ రాహుల్ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. ►నాలుగు సీజన్లలో 550కి పైగా పరుగులు సాధించిన రాహుల్.. 4 సార్లు ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ►వికెట్ కీపర్ బ్యాటర్‌గా జట్టుకు అదనపు బలం. ►ఐపీఎల్-2021 సీజన్లో 13 ఇన్నింగ్స్‌లో రాహుల్ 626 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 98 నాటౌట్. ఇక అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రాహుల్ మూడో స్థానంలో నిలిచాడు. చదవండి: IPL 2022 Auction: ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునేది వీళ్లనే..! Ravichandran Ashwin: నాతో పాటు అతడిని కూడా ఢిల్లీ ఫ్రాంఛైజీ రీటైన్ చేసుకోదు.. ఎందుకంటే! -
ధోనీపై మళ్లీ తూటాలు: పుణెలో కలకలం
న్యూఢిల్లీ: మరికొద్ది గంటల్లో ఐపీఎల్ ఫైనల్ ఆడబోతోన్న రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ (ఆర్పీఎస్)లో ఆ జట్టు యజమాని వ్యాఖ్యలు కలకలం రేపాయి. సంజీవ్ గొయాంకా ఎంఎస్ ధోనీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు క్రీడావర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే సంజీవ్ సోదరుడైన హర్ష్ గొయాంకా ధోనీపై పేల్చిన మాటాల తూటాలు వివాదాస్పదం కావడం, వాటికి బదులుగా ధోనీ భార్య సాక్షి ఇచ్చిన ఘాటు కౌంటర్లు హైలైట్ కావడం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజీవ్ గొయాంకా.. ధోనీ, స్మిత్, జట్టులోని ఇతర ఆటగాళ్లగురించిన విషయాలు చెప్పుకొచ్చారు. ‘ఎంఎస్ ధోనీ గొప్ప ఆటగాడు అనడంలో సందేహం లేదు. అతని మైండ్ సెట్, గెలవాలనే తపన అమోఘం. ప్రపంచంలోనే బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అతను. అయితే ధోనీ కన్నా అద్భుతమైన మైండ్ సెట్ ఉన్న ఆటగాడు ఇంకొకరున్నారు.. అతనే స్టీవ్ స్మిత్! గెలుపు తప్ప మరేదీ వద్దనుకునే యాటిట్యూడ్ స్మిత్‌ది. అందుకే టీమ్‌మేట్స్‌కు ‘12 బంతుల్లో 30 పరుగులు కొట్టు.. లేదా, అవుటై వచ్చెసెయ్..’ లాంటి సూచనలు చేస్తాడు. కష్టసమయాల్లో ఎన్నోసార్లు జట్టును ఆదుకున్నాడు. ఫుడ్ పాయిజన్ వల్ల స్మిత్ సరిగా ఆడని కారణంగానే ఈ సీజన్ తొలి మ్యాచ్‌లలో పుణె జట్టు సరిగా ఆడలేకపోయింది..’ అంటూ ఎడాపెడా స్మిత్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ, జట్టు విజయయాత్రలో ధోనీ పాత్ర ఏమాత్రం లేదన్నట్లు మాట్లాడారు సంజీవ్ గొయాంకా. హైదరాబాద్‌లో ఆదివారం(మే 21న) జరగనున్న ఫైనల్స్‌లో పుణె జట్టు ముంబైతో తలపడనున్న సంగతి తెలిసిందే. 2016లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పుణె జట్టు ప్రస్థానం ఆదివారంతోనే ముగియనుంది. దీనిపైనా గొయాంకా తనదైన శైలిలో స్పందించారు. సరైన నాయకత్వం లేకపోవడం, ఆటగాళ్ల ఎంపికలో లోపాల వల్లే గత ఏడాది పుణె మెరుగ్గా రాణించలేదని గొయాంకా అన్నారు. ఈ సారి స్మిత్ చెప్పినట్లే.. ఇమ్రాన్ తాహిర్, బెన్ స్టోక్స్‌లు రాణించారని, వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి లాంటి లోకల్ ప్లేయర్లు మెరవడం మరింతగా కలిసి వచ్చిన అంశమని గొయాంకా అన్నారు. (ప్రతీకారంతోనే ధోనీ భార్య ఇలా చేసిందా?)