భారత స్టార్ క్రికెటర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడనున్నాడనే వార్తల నేపథ్యంలో ఆ జట్టు సన్నిహిత వర్గాలు కీలక అప్‌డేట్ అందించాయి. కెప్టెన్- యాజమాన్యం మధ్య అంతాబాగానే ఉందని స్పష్టం చేశాయి.
కాగా ఐపీఎల్-2024లో హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌తో ఘోర ఓటమి నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు ఘోర అవమానం జరిగిన విషయం తెలిసిందే. లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోకి వచ్చి రాహుల్‌పై తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు.
రాహుల్‌పై గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫలితంగా.. ఫ్రాంచైజీ అసంతృప్తి నేపథ్యంలో రాహుల్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో పగ్గాలు వదిలేసి పూర్తిగా బ్యాటింగ్‌పై శ్రద్ధ పెడతాడా లేదా ఫ్రాంఛైజీకి గుడ్‌బై చెబుతాడా? అనేవి చర్చనీయాంశంగా మారాయి.
ఈ క్రమంలో.. ‘లక్నో ఈ నెల 14న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఇందుకు ఇంకా గడువు ఉండటంతో ఏ నిర్ణయం తీసుకోలేదు. మేనేజ్‌మెంట్ తప్పిస్తుందా లేదంటే కెప్టెన్ రాహులే వైదొలగుతాడా అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుంది’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
తాజాగా ఈ విషయం గురించి లక్నో వర్గాలు స్పందిస్తూ.. ‘‘కేఎల్ రాహుల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడమే గాక... వచ్చే వేలంలో కూడా అతడిని లక్నో తీసుకోదు అని వస్తున్నవి కేవలం వదంతులు మాత్రమే.
గత మ్యాచ్ ఫలితం మాకు అనుకూలంగా లేదనే బాధ ఉంది. అయితే, జట్టు, ఓనర్ల మధ్య అంతా బాగానే ఉంది. రాహుల్ కూడా బాగున్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడంతే!’’ అని వార్తా సంస్థ IANSకు తెలిపాయి.
కాగా సంజీవ్ గోయెంకా తీరుతో రాహుల్ తీవ్ర మనస్తాపం చెందడం, సోషల్ మీడియాలో తనపై పెద్ద ఎత్తున నెగటివిటీ రావడంతో ఆయన అతడిని క్షమాపణ కోరినట్లు వదంతులు వినిపిస్తున్నాయి.
చదవండి: ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే.. సన్‌రైజర్స్ చేయాల్సిందిదే! ఆ రెండు జట్లు కన్ఫామ్!?
Comments
Please login to add a commentAdd a comment