రెండేళ్ల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టింది లక్నో సూపర్ జెయింట్స్. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వరుసగా రెండుసార్లు ప్లే ఆఫ్స్ చేరింది. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి ఉన్న కొన్ని జట్లకు సాధ్యం కాని ఘనతను లక్నో సాధించింది.
ఐపీఎల్-2024లోనూ ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉంది. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణిస్తూ జట్టును టాప్-4లో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు.
అయితే, టాప్-4లో అడుగుపెట్టాలంటే కీలకమైన మ్యాచ్‌లో లక్నో చిత్తుగా ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదాబాద్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటర్‌గా, సారథిగా విఫలమయ్యాడు.
ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అందరి ముందే కేఎల్ రాహుల్, కోచ్ జస్టిన్ లాంగర్‌కు గట్టిగా చీవాట్లు పెట్టాడు. దీంతో సంజీవ్ గోయెంకా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్ వరకు తీసుకువచ్చిన కెప్టెన్‌కు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ మహ్మద్ షమీ వంటి ప్రముఖులు ఫైర్ అవుతున్నారు.
ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ భిన్నంగా స్పందించాడు. ‘‘అందరి ముందు అలా మాట్లాడేకంటే.. లోపలికి వెళ్లిన తర్వాత చర్చించాల్సింది. ఒకవేళ అదే జరిగితే ఈ విషయం గురించి స్పందించమనే ప్రశ్న నాకు ఎదురయ్యేదే కాదు.
అయితే, నాణేనికి మరోవైపు కూడా ఆలోచించాలి. ఆట పట్ల జట్ల యజమానులు, కోచ్‌లకు ఉన్న ప్యాషన్‌ను మనం అర్థం చేసుకోవాలి. వాళ్ల జట్టు అత్యుత్తమంగా రాణించాలని కోరుకోవడంలో తప్పు లేదు. బహుశా అందుకే ఈ ఘటన జరిగి ఉంటుంది’’ అని బ్రెట్ లీ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు.
చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment