Brett Lee
-
ఆస్ట్రేలియా బౌలర్ హ్యాట్రిక్ తీశాడు.. టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుంది..!
టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో టీమిండియాకు హ్యాట్రిక్ సెంటిమెంట్ కలిసొస్తుందని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8 మ్యాచ్‌ల్లో భాగంగా బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఆసీస్ తరఫున హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు. పొట్టి ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్‌లో (2007) బ్రెట్ లీ ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించాడు. ఆ ఎడిషన్‌లో భారత్ టైటిల్ సాధించింది. ఇప్పుడు రెండో సారి ఆసీస్ బౌలర్ హ్యాట్రిక్ సాధించడంతో సెంటిమెంట్ రిపీట్ అవుతుందని టీమిండియా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. టీమిండియా ఫ్యాన్స్ ఆశలకు మరింత బలం చేకూర్చే విషయం ఏంటంటే.. నాడు బ్రెట్ లీ, ఇప్పుడు పాట్ కమిన్స్ బంగ్లాదేశ్పైనే హ్యాట్రిక్ వికెట్లు సాధించారు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాతో మ్యాచ్‌లో కమిన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదు (మహ్మదుల్లా), ఆరు బంతులకు (మెహిది హసన్).. ఆతర్వాత 20వ ఓవర్ తొలి బంతికి (తౌహిద్ హ్రిదోయ్) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు వేసిన కమిన్స్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్, ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. -
KL Rahul: జట్టు గెలవాలన్న తపనే అది: ఆసీస్ దిగ్గజం.
రెండేళ్ల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టింది లక్నో సూపర్ జెయింట్స్. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వరుసగా రెండుసార్లు ప్లే ఆఫ్స్ చేరింది. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి ఉన్న కొన్ని జట్లకు సాధ్యం కాని ఘనతను లక్నో సాధించింది.ఐపీఎల్-2024లోనూ ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉంది. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణిస్తూ జట్టును టాప్-4లో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు.అయితే, టాప్-4లో అడుగుపెట్టాలంటే కీలకమైన మ్యాచ్‌లో లక్నో చిత్తుగా ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదాబాద్తో బుధవారం నాటి మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటర్‌గా, సారథిగా విఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అందరి ముందే కేఎల్ రాహుల్, కోచ్ జస్టిన్ లాంగర్‌కు గట్టిగా చీవాట్లు పెట్టాడు. దీంతో సంజీవ్ గోయెంకా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్ వరకు తీసుకువచ్చిన కెప్టెన్‌కు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ మహ్మద్ షమీ వంటి ప్రముఖులు ఫైర్ అవుతున్నారు.ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ భిన్నంగా స్పందించాడు. ‘‘అందరి ముందు అలా మాట్లాడేకంటే.. లోపలికి వెళ్లిన తర్వాత చర్చించాల్సింది. ఒకవేళ అదే జరిగితే ఈ విషయం గురించి స్పందించమనే ప్రశ్న నాకు ఎదురయ్యేదే కాదు.అయితే, నాణేనికి మరోవైపు కూడా ఆలోచించాలి. ఆట పట్ల జట్ల యజమానులు, కోచ్‌లకు ఉన్న ప్యాషన్‌ను మనం అర్థం చేసుకోవాలి. వాళ్ల జట్టు అత్యుత్తమంగా రాణించాలని కోరుకోవడంలో తప్పు లేదు. బహుశా అందుకే ఈ ఘటన జరిగి ఉంటుంది’’ అని బ్రెట్ లీ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్ -
కమిన్స్‌పై బ్రెట్ లీ విమర్శలు.. మరీ లేట్‌గా వచ్చి
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆలస్యంగా బౌలింగ్‌కు రావటాన్ని విమర్శించాడు.ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అయిన కమిన్స్.. సహచరులకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ఇలాంటి పనులు చేయడం బాగానే ఉన్నప్పటికీ.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా సరికాదని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ సారథిగా అడుగుపెట్టిన కమిన్స్ మంచి ఫలితాలు రాబడుతున్నాడు. అయితే, గత రెండు మ్యాచ్‌లలో వరుస ఓటముల కారణంగా అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైతో చెపాక్ మ్యాచ్‌లో కమిన్స్ కొత్త బంతితో బౌలింగ్ చేయకపోవడాన్ని బ్రెట్ లీ తప్పుబట్టాడు.కాగా సన్‌రైజర్స్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో బౌలింగ్ అటాక్ ఆరంభించిన కమిన్స్.. తదుపరి ఓవర్లో బంతిని ఆల్‌రౌండర్ నితీశ్‌రెడ్డికి చేతికిచ్చాడు. అనంతరం షాబాజ్ అహ్మద్, నటారాజన్, జయదేవ్ ఉనాద్కట్‌తో బౌలింగ్ చేయించాడు. తాను మాత్రం తొమ్మిదో ఓవర్లో బౌలింగ్‌కు దిగాడు.మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 49 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో 212 పరుగులు చేసిన చెన్నై.. లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన సన్‌రైజర్స్‌ను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది.ఈ నేపథ్యంలో బ్రెట్ లీ మాట్లాడుతూ.. ‘‘ప్యాట్ కమిన్స్ చాలా ఆలస్యంగా బరిలోకి వచ్చాడు. నాలుగు ఓవర్లు బౌల్ చేసి 49 పరుగులు ఇచ్చాడు. తను ధారాళంగా పరుగులు ఇచ్చిన మాట వాస్తవమే.నిజానికి తను కొత్త బంతితో అద్భుతంగా రాణించగలడు. కానీ వేరే వాళ్లకు అవకాశం ఇచ్చాడు. కొన్నిసార్లు మరీ మంచి కెప్టెన్‌గా మారిపోతాడు. బౌలింగ్ కెప్టెన్‌గా.. ఇతర బౌలర్లకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిదే.కానీ వరల్డ్ బెస్ట్ బౌలర్ బౌలింగ్ అటాక్ ఆరంభించకపోవడం సరికాదు. స్వార్థంగా ఉండమని నేను చెప్పటం లేదు. ప్యాట్ కమిన్స్.. ప్యాట్ కమిన్సే. కనీసం రెండో ఓవర్లోనైనా అతడు బౌలింగ్‌లోకి దిగాల్సింది’’ అని జియో సినిమా షోలో వ్యాఖ్యానించాడు. -
లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి!
రెండు మనుసుల కలయికతో.. ఇద్దరు మనుషులు పరస్పర నమ్మకంతో దాంపత్య జీవితంలో ముందుకు సాగితేనే ఆ బంధం నాలుగుకాలాల పాటు వర్ధిల్లుతుంది. భాగస్వాములలో ఏ ఒక్కరు పెళ్లినాటి ప్రమాణాలు తప్పినా ఆ బంధం విచ్ఛిన్నమవుతుంది. ముఖ్యంగా ‘మూడో వ్యక్తి’ని తమ జీవితంలోకి ఆహ్వానించి ప్రాణంగా ప్రేమించిన పార్ట్నర్ను మోసం చేస్తే అంతకంటే ద్రోహం మరొకటి ఉండదు. టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తిక్‌తో పాటు శ్రీలంక మాజీ బ్యాటర్ తిలకరత్నె దిల్షాన్, ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం బ్రెట్ లీ తమ వైవాహిక జీవితంలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా డీకే, దిల్షాన్ తమ భార్యలు.. తమతో బంధంలో కొనసాగుతూనే.. తమ స్నేహితులతోనే అనుబంధం పెనవేసుకోవడం భరించలేకపోయారు. వారితో బంధానికి వీడ్కోలు పలికి కొత్త జీవితం మొదలుపెట్టి ప్రస్తుతం వైవాహిక బంధంలో సంతోషంగా గడుపుతున్నారు. వారి జీవితాల్లో ఏం జరిగిందంటే.. స్నేహం ముసుగులో వెన్నుపోటు చిన్ననాటి స్నేహితురాలైన నికిత వంజారాను ప్రేమించి పెళ్లాడాడు దినేశ్ కార్తిక్. డీకే సహచర క్రికెటర్, ఫ్రెండ్ అయిన మురళీ విజయ్‌తో బంధం కొనసాగించింది. వారిద్దరి రహస్య రిలేషన్షిప్ తెలుసుకున్న దినేశ్ గుండె ముక్కలైంది. దీంతో 2012లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఈ క్రమంలో నికిత ఎంచక్కా మురళీ విజయ్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. మరోవైపు.. స్వ్యాష్ ప్లేయర్ దీపికా పళ్లికల్ రూపంలో రెండోసారి ప్రేమను పొందిన డీకే ఆమెను వివాహమాడాడు. ఈ జంటకు ప్రస్తుతం కవలలు(ఇద్దరు కుమారులు) సంతానం. దిల్షాన్ది ఇంచుమించు ఇదే పరిస్థితి లంక లెజండరీ ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ నిలంక వితంగే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె దిల్షాన్ ఓపెనింగ్ పార్ట్నర్ ఉపుల్ తరంగతో అనుబంధం పెంచుకుందట. ఈ క్రమంలో దిల్షాన్‌తో విడాకులు తీసుకున్న నిలంక.. ఆ తర్వాత ఉపుల్ను పెళ్లాడింది. నిజానికి నిలంక, ఉపుల్ మధ్య అతి చనువే దిల్షాన్‌తో ఆమె విడిపోవడానికి కారణమని గతంలో వార్తలు వచ్చాయి. భార్య మంజులతో దిల్షాన్ ఇక నిలంక- దిల్షాన్లకు ఒక కుమారుడు సంతానం కాగా.. భరణం, కుమారుడి సంరక్షణ కోసం నిలంక.. దిల్షాన్‌ను కోర్టుకు లాగింది. ఈ క్రమంలో ఆమెకు అనుకూలంగా తీర్పురాగా అతడు కొడుకుకు దూరమయ్యాడు. ఆ తర్వాత నటి మంజుల థిలినిని పెళ్లాడిన దిల్షాన్‌కు మరో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు జన్మించారు. బ్రెట్ లీ మాజీ భార్య సైతం ఆసీస్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కూడా భార్యా బాధితుడే అంటారు. ఆటతో బిజీగా ఉండే లీతో తన జీవితం సంతోషంగా లేదని భావించిన అతడి భార్య.. రగ్బీ ప్లేయర్‌ను పెళ్లాడినట్లు సిడ్నీ హెరాల్డ్ గతంలో వెల్లడించింది. చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ ఆడపడుచు అడ్డుపడినా! జడ్డూ భార్య రివాబా బ్యాగ్రౌండ్ తెలుసా? వందల కోట్లు! -
వరల్డ్ క్రికెట్లో రోహిత్ టైగర్.. అతడిని మించినవారు లేరు: ఆసీస్ లెజెండ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌తో పాటు ఇటీవలే ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో కూడా పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా అతడు జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత టీమిండియా మేజర్ టోర్నీల్లో ఘోర ఓటములను చవిచూసింది. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ (2022), డబ్ల్యూటీసీ ఫైనల్లో అతడి సారధ్యంలోని భారత జట్టు దారుణ పరాజయాలు మూటుగట్టుకుంది. ఈ క్రమంలో అతడి వ్యక్తిగత ప్రదర్శనపైనే కాకుండా కెప్టెన్సీ పరంగా కూడా రోహిత్‌పై చాలా మంది మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ మాత్రం రోహిత్ శర్మకు మద్దతుగా నిలిచాడు. రోహిత్‌పై బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్‌పై ఎవరెన్ని విమర్శలు చేసినా అతడు వరల్డ్ క్రికెట్ లో టైగర్ అని బ్రెట్‌లీ కొనియాడాడు. "ప్రపంచ క్రికెట్లో రోహిత్ శర్మ టైగర్. షార్ట్ బాల్స్‌ను ఆడటంలో అతడిని మించినవారు లేరు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా బౌలర్లపై ఎటాక్ చేసే సత్తా ఉన్న ఏకైక క్రికెటర్ రోహిత్. ప్రపంచంలో పుల్ షాట్లు ఆడే అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ ఒకడు. మైదానంలో గాని ఆఫ్‌ధి ఫీల్డ్‌లో గాని రోహిత్ ఒక జెంటిల్‌మేన్. అతడు చాలా కూల్‌గా ఉంటాడు అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు. చదవండి: MS Dhoni: రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే.. -
ఆస్ట్రేలియా క్రికెట్లో కలవరం.. తర్వాత ఎవరు?
ఆస్ట్రేలియా క్రికెట్లో ఒక విషయంలో కలవరం మొదలైంది. ప్రస్తుతం జట్టులో నాథన్ లియోన్ మాత్రమే ప్రధాన స్పిన్నర్‌గా కనిపిస్తున్నాడు. లియోన్ వయస్సు 35 సంవత్సరాలు. రిటైర్మెంట్కు దగ్గరికి వచ్చిన అతను మహా అయితే మరో రెండు సంవత్సరాలు ఆడే అవకాశం ఉంది. దిగ్గజం షేన్ వార్న్ తర్వాత టాప్‌క్లాస్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న లియోన్ తన కెరీర్లో 117 టెస్టులాడి 468 వికెట్ల పడగొట్టాడు. దశాబ్దం కాలంగా లియోన్ ఆసీస్ టెస్టు జట్టులో ఏకైక ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతూ వస్తున్నాడు. మరి అతను రిటైర్ అయ్యాకా ఆసీస్ క్రికెట్లో స్పిన్ భాద్యతలు తీసుకునేది ఎవరనేదానిపై చర్చ మొదలైంది. ఆసీస్ లాంటి ఫాస్ట్ పిచ్ మైదానాలపై పేస్ బౌలర్లకు కొదువ లేదు. ఆ దేశం నుంచి వచ్చే బౌలర్లలోనే ఎక్కువగా మీడియం, ఫాస్ట్ బౌలర్లే కనిపిస్తారు తప్ప స్పిన్నర్లు చాలా తక్కువ. స్వదేశంలో ఆడినంత వరకు పేస్ దళంతోనే మ్యాచ్‌లు గెలిచే ఆస్ట్రేలియా భారత్ లాంటి ఉపఖండపు పిచ్‌లకు వచ్చేసరికి స్పిన్నర్లను వెతుక్కోవాల్సి వస్తోంది. అయితే టాడ్ మర్ఫీ రూపంలో ఆస్ట్రేలియా జట్టుకు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడు టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మంచి ప్రదర్శనే కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు రెండు టెస్టులు కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. ఇదే విషయమై ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పందించాడు. ''ప్రస్తుతం ఆస్ట్రేలియాకు పెద్ద దిక్కులా మారాడు. వార్న్ లాంటి దిగ్గజ ఆటగాడిని భర్తి చేయలేకపోయిన ఉన్నంతలో అతను టాప్ క్లాస్ స్పిన్నర్. మరి లియోన్ రిటైర్మెంట్ తర్వాత ఆసీస్ క్రికెట్లో స్పిన్ బాధ్యతలు తీసుకునేది ఎవరు అని ప్రశ్నించుకోవాలి. అందుకు నా సమాధానం 22 ఏళ్ల టాడ్ మర్ఫీ. టీమిండియాతో తొలి టెస్టులోనే ఆస్ట్రేలియా తరపున టాడ్ మర్ఫీ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఏడు వికెట్లతో ఆకట్టుకొని తానేంటో నిరూపించుకున్నాడు. ఈ ఏడు వికెట్లలోనూ ఐదు టాప్‌క్లాస్ బ్యాటర్లవే ఉన్నాయి. ఉపఖండం పిచ్‌లపై ప్రభావం చూపుతున్న ఒక డెబ్యూ బౌలర్ తర్వాతి కాలంలో జట్టుకు ప్రధాన స్పిన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. నాథన్ లియోన్ అలా వచ్చినవాడే. అతని వారసత్వాన్ని టాడ్ మర్ఫీ కంటిన్యూ చేస్తాడని అనుకుంటున్నా. అయితే ఆస్ట్రేలియాకు టాడ్ మర్ఫీ రూపంలో ఒక మంచి స్పిన్నర్ దొరికినట్లే. వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న మర్ఫీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అద్బుతాలు చేయగలడన్న నమ్మకం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇరుజట్ల మధ్య ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. రెండు టెస్టుల్లోనూ విజయాలు అందుకున్న టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ రెండు టెస్టులు కూడా రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. ఇక మూడో టెస్టు మార్చి ఒకటి నుంచి ఇండోర్ వేదికగా జరగనుంది. చదవండి: 'నా కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్' 'కనబడుట లేదు'.. ఐపీఎల్లో ఆడించేందుకే ఈ డ్రామాలు -
WC 2023: వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా ఓపెనర్ అతడే! కానీ..
ICC ODI World Cup 2023- Team India Opening Slot: టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ ప్రశంసలు కురిపించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ద్విశతకం బాదిన ఈ వికెట్ కీపర్ వన్డే వరల్డ్‌కప్-2023లో భారత జట్టులో కీలకం కానున్నాడని అభిప్రాయపడ్డాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో సత్తా చాటి టీమిండియా ఓపెనింగ్ స్థానానికి గురిపెట్టాడని పేర్కొన్నాడు. అయితే, డబుల్ సెంచరీ సాధించిన సంతోషంలోనే ఉండిపోకూడదని.. ఎప్పుటికప్పుడు ఆట తీరును మరింత మెరుగుపరచుకోవాలని బ్రెట్ లీ.. ఇషాన్‌కు సూచించాడు. కాగా బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా మూడో వన్డేలో ద్విశతకం బాదిన ఇషాన్ కిషన్.. పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. తద్వారా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఈ యువ బ్యాటర్. ఇక భారత్ వేదికగా వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఇషాన్ ఈ మేరకు రాణించడం టీమిండియా ఓపెనింగ్ ఆప్షన్లను పెంచింది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్ లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్ కిషన్ విధ్వంసకర ఓపెనర్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘విధ్వంసకరమైన డబుల్ సెంచరీతో.. సొంతగడ్డపై 2023లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా ఓపెనింగ్ స్థానానికి తాను గట్టిపోటీదారునని ఇషాన్ చెప్పకనే చెప్పాడు. ఒకవేళ తనే ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా? ఏమో నాకైతే తెలియదు కాదు. మరి ఇలా జరగాలా అంటే మాత్రం కచ్చితంగా జరగ్సాలిందే! వన్డే చరిత్రలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఈ యువ ఆటగాడి గురించి ఇంకేం చెప్పగలం. గర్వం వద్దు తను ఫిట్నెస్ కాపాడుకుంటూ, నిలకడైన ఆట తీరు కనబరిస్తే.. కచ్చితంగా ప్రపంచకప్ జట్టులో టీమిండియా ఓపెనర్‌గా తన పేరు ఉండటం ఖాయం’’ అని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు. అయితే, తన అరుదైన రికార్డుల కారణంగా సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్న ఇషాన్.. గర్వాన్ని నెత్తికెక్కించుకోకూడదని సలహా ఇచ్చాడు. ‘‘తన మైలురాళ్ల గురించి ఇషాన్ మర్చిపోవాలి. ద్విశతకం తాలుకు ప్రశంసలను కూడా ఎంత త్వరగా మరిచిపోతే అంత మంచిది. నీ కోసం మరిన్ని మైల్‌స్టోన్స్ ఎదురుచూస్తున్నాయి. కాబట్టి.. నీకిచ్చే సలహా ఒకటే ఇషాన్.. నువ్వు అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలంటే గర్వం దరిచేయనీయకూడదు’’ అని మాజీ ఫాస్ట్‌బౌలర్ బ్రెట్ లీ.. ఇషాన్‌కు సూచనలు చేశాడు. కాగా బంగ్లాదేశ్‌లో ప్రదర్శనతో శ్రీలంకతో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లకు ఇషాన్ కిషన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఇషాన్‌తో పాటు శుబ్‌మన్ గిల్ సైతం ఓపెనింగ్ స్థానానికి పోటీలో ఉన్నాడు. చదవండి: Shikhar Dhawan: ధావన్‌పై వేటు.. వాళ్ల నుంచి తీవ్రమైన పోటీ! వరల్డ్‌కప్ ఆశలు ఆవిరి! Rishabh Pant: ఇదే కదా జరగాల్సింది! ఇకపై పంత్ కంటే ముందు వరుసలో వాళ్లిద్దరు! -
బ్రెట్ లీ బౌలింగ్‌లో ట్రేడ్‌మార్క్ షాట్.. ఎన్నాళ్లయిందో
క్రికెట్లో కొన్ని పోటీలు(Rivalries) గమ్మత్తుగా ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. వాటికి కల్ట్ఫ్యాన్స్ కూడా ఉంటారు. రెండు దశాద్దాల కింద చూసుకుంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు బంతులు వేయడానికి ప్రత్యర్థి బౌలర్లు వణికిపోయేవారు. ఎందుకంటే అప్పట్లో సచిన్ ఫామ్ భీకరమైన స్థాయిలో ఉండేది. అలాంటి చూడముచ్చటైన ఆటలో సచిన్ కొన్నిసార్లు గెలిస్తే.. మరికొన్నిసార్లు ప్రత్యర్థి బౌలర్లు పైచేయి సాధించేవారు. ముఖ్యంగా సచిన్-బ్రెట్ లీ, సచిన్-షోయబ్ అక్తర్‌ల మధ్య పోటీని అభిమానులు ఎగబడి చూసేవారు. ఇక ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ బౌలింగ్ సచిన్ కొట్టే స్వ్కేర్‌లెగ్ కవర్‌డ్రైవ్ షాట్‌కు ఎంతో మంది అభిమానులు ఉంటారు. సచిన్ ఈ షాట్‌ను లీ బౌలింగ్‌లో చాలాసార్లు ఆడేవాడు. అలాంటి ట్రేడ్‌మార్క్ షాట్లు చూసి చాలా కాలమైన తరుణంలో రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ పుణ్యమా అని అభిమానులు మరోసారి అలాంటి ట్రేడ్‌మార్క్ షాట్లను చూడగలుగుతున్నారు. మొన్నటికి మొన్న సచిన్ ఫ్రంట్‌ఫుట్ వచ్చి లాంగాన్ మీదుగా సిక్సర్ బాదడం చూసి వింటేజ్ సచిన్‌ను చూపించాడురా అనుకున్నాం. తాజాగా గురువారం ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన సెమీఫైనల్లో సచిన్ బ్రెట్ లీ బౌలింగ్‌లో తొలి బంతినే ఎక్స్ట్రా కవర్స్ మీదుగా ఆణిముత్యంలాంటి బౌండరీ బాదాడు. దీన్ని చూసిన అభిమానులు మా కళ్లు ఎంత పుణ్యం చేసుకున్నాయో.. దశాబ్దంన్నర కింద ఇలాంటి షాట్లు చూశాం.. మళ్లీ ఇప్పుడు అంటూ కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సెమీఫైనల్లో ఆస్ట్రేలియా లెజెండ్స్‌పై టీమిండియా లెజెండ్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నమన్ ఓజా(90 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్(37 నాటౌట్) రాణించి జట్టును గెలిపించారు. Sachin punching it 🆚 Binga 😎🔥 Kuch yaad aya, Paltan? 08' 👀#OneFamily @sachin_rt @BrettLee_58pic.twitter.com/zyORi8Ms6f — Mumbai Indians (@mipaltan) September 29, 2022 చదవండి: బుమ్రా దూరం.. సరైన బౌలర్లు లేరు; టీమిండియాకు కష్టమే! -
కోహ్లిని మించినోడు భూప్రపంచంలో లేడు.. ఇలాంటి వారు తరానికొక్కరు పుడతారు..!
టీమిండియా తాజా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లిని మించినోడు ఈ భూప్రపంచంలో లేడని ఆకాశానికెత్తాడు. కోహ్లి లాంటి ఆటగాడు తరానికొక్కరు పుడతారని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇదే సందర్భంగా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, జాక్ కలిస్‌లను కూడా శ్లాఘించాడు. క్రికెట్లో వీరంతా ఆణిముత్యాలని కొనియాడాడు. చాలా మంది లాగే తాను కూడా కోహ్లికి వీరాభిమానినని తెలిపాడు. ఇదే సందర్భంగా లీ.. కోహ్లి ఫామ్‌పై కూడా స్పందించాడు. ఎంత రన్‌మెషీన్ అన్ని పిలుచుకుంటే మాత్రం ప్రతి మ్యాచ్‌లో కోహ్లి వందకొట్టాలని ఆశించడం అత్యాశ అవుతుందని అన్నాడు. ఇది అతనిపై తీవ్ర ఒత్తిడి పెంచుతుందని పేర్కొన్నాడు. 1020 రోజుల పాటు కోహ్లి సెంచరీ చేయలేకపోవడానికి ఇదే కారణమని తెలిపాడు. 130 కోట్ల మంది భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కోహ్లి నుంచి ప్రతి మ్యాచ్‌లో సెంచరీ ఆశించడం సబబు కాదని చెప్పుకొచ్చాడు. కోహ్లిని ప్రతి మ్యాచ్‌కు ముందు భూతద్దంలో చూడటం మానేసి, అతని పాటికి అతన్ని వదిలేస్తే సత్ఫలితాలు వస్తాయని సూచించాడు. క్రికెట్‌కు కోహ్లి కోహీనూర్ అని, అతనో ఆల్‌టైమ్ గ్రేట్ అని కోహ్లిపై అభిమానాన్ని చాటుకున్నాడు. ఇదే సందర్భంగా లీ.. సచిన్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. సచిన్ ఎంతో సౌమ్యమైన క్రికెటర్ అని, అతని ఆన్ ఫీల్డ్ ప్రవర్తన, అఫ్ ద ఫీల్డ్ ప్రవర్తన ఒకేలా ఉంటాయని, సచిన్‌ని అందరూ అభిమానించేవారని తెలిపాడు. సచిన్‌కు బ్యాటింగ్ చేస్తున్న మాట్లాడితే అస్సలు నచ్చేది కాదని చెప్పాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడేందుకు భారత్‌కు వచ్చిన లీ.. మీడియాతో ఈ విషయాలకు పంచుకున్నాడు. -
'ఉమ్రాన్ మాలిక్‌కు పెద్ద అభిమానిని.. మదిలోకి పాక్ దిగ్గజ బౌలర్'
ఎస్ఆర్హెచ్ స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2022 సీజన్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రతీ బంతిని గంటకు 150 కిమీ వేగంతో సంధించే ఉమ్రాన్ సీజన్లో అత్యంత వేగవంతమైన బంతిని(157.8 కిమీ) సంధించి రికార్డు సృష్టించాడు. ఇక బౌలింగ్‌లో దుమ్మురేపిన ఉమ్రాన్ మాలిక్ 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు కొల్లగొట్టాడు. లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5/25తో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశాడు. కాగా ఈ సీజన్లో తన ప్రదర్శనకు గానూ ఉమ్రాన్ మాలిక్ ''ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్'' అవార్డును కైవసం చేసుకున్నాడు. అతని బౌలింగ్‌కు ఫిదా అయిన మాజీ క్రికెటర్లు త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడని పేర్కొనడమే తరువాయి.. దక్షిణాఫ్రికాతో జరగనున్న టి20 సిరీస్‌కు ఉమ్రాన్ మాలిక్ ఎంపికవ్వడం విశేషం.తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పీడస్టర్ బ్రెట్ లీ ఉమ్రాన్ మాలిక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను ఉమ్రాన్ మాలిక్‌కు పెద్ద అభిమానిని. అతని బౌలింగ్‌లో ఉండే వేగం ప్రత్యర్థి బ్యాటర్లను తగలెట్టేస్తుంది. ఫాస్ట్ బౌలర్లకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉమ్రాన్‌లో స్పష్టంగా ఉన్నాయి. కచ్చితమైన వేగం.. బులెట్ వేగంతో వచ్చే బంతులు.. ఇవన్నీ కలిపి ఉమ్రాన్ గురించి ఆలోచిస్తుంటే నాకు పాక్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ గుర్తుకు వస్తున్నాడు. వకార్ యూనిస్ కూడా ఫాస్ట్ బౌలింగ్‌కు పెట్టింది పేరు. గంటకు 150 కిమీవేగంతో బంతులు సందిస్తూ వికెట్లు తీసేవాడు. అందుకే అంత గొప్ప ఫాస్ట్ బౌలర్ అయ్యాడు. ఉమ్రాన్ కూడా ఏదో ఒకరోజు ఆ స్థాయికి చేరుకుంటాడని ఆశిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Jos Buttler: పరుగులే కాదు.. ప్రైజ్‌మనీ విషయంలోనూ చరిత్ర సృష్టించాడు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు.. కానీ రెండు టైటిల్స్.. ఐపీఎల్లో మోస్ట్ లక్కీ ప్లేయర్..! -
పాక్ మాజీ బౌలర్‌పై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్తర్ బౌలింగ్‌ను చక్కర్ అంటూ ఒక టీవీ ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ.. '' అక్తర్ తన ఎల్బోను కదలిస్తూ బౌలింగ్ చేసేవాడు. ఈ తరహా బౌలింగ్‌ను క్రికెట్ భాషలో చక్కర్ అని సంబోధిస్తారు. అందుకే అక్తర్ బౌలింగ్‌ను ఐసీసీ కొంతకాలం బ్యాన్ చేసింది. ఇక ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ బౌలింగ్ యాంగిల్ కాస్త డౌన్లో వస్తుంది.. అందువల్ల అతని బౌలింగ్ పెద్ద కష్టంగా అనిపించదు. అయితే షోయబ్ బౌలింగ్‌లో మాత్రం బంతి ఎక్కడి నుంచి వస్తుందో తెలిసేది కాదు. అందుకే అక్తర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కాస్త కష్టంగా అనిపించేది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ కూడా నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో ఒకడు. అతని స్వింగ్ బౌలింగ్ ఎక్కువగా ఆఫ్‌స్టంప్ అవతల పడుతూ బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టేవి. ఇక బ్రెట్ లీ బౌలింగ్‌లో ఆడడం పెద్దగా భయం లేనప్పటికి.. అక్తర్‌ను మాత్రం మనం నమ్మలేం. అతను సంధించే బీమర్.. యార్కర్ ఎక్కడ నా కాలుకు తగులుతుందోనని భయపడేవాడిని. కానీ బ్యాటింగ్ మాత్రం ఎప్పుడు కంఫర్ట్‌గానే ఉండేది.'' అంటూ వెల్లడించాడు. ఇక అక్తర్ బౌలింగ్‌ను సెహ్వాగ్ సహా.. మాజీ క్రికెటర్లు సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్‌లు బాగా ఎంజాయ్ చేసేవారు. ముఖ్యంగా సెహ్వాగ్ పాకిస్తాన్‌పై 90 సగటుతో ఒక సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు, ఒక ట్రిపుల్ సెంచరీ అందుకోవడం విశేషం. చదవండి: Andrew Symonds: కన్నీరు తెప్పిస్తున్న ఆండ్రూ సైమండ్స్ సోదరి లేఖ -
Shoaib Akhtar: మాంసం తింటాం, సింహాల్లా వేటాడతాం.. అదే మాకు భారత బౌలర్లకి తేడా..!
Shoaib Akhtar Highlights X Factor Lacked By Indian Pacers: టీమిండియా పేసర్లను ఉద్ధేశించి పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో పాక్ పేసర్ల ఆధిపత్యం గురించి ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్ లీతో మాట్లాడుతూ భారతీయుల ఆహారపు అలవాట్లను కించపరిచేలా వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో భారత పేస్ దళం బాగా పుంజుకున్నప్పటికీ.. కొన్ని విషయాల్లో పాక్ పేసర్లతో పోలిస్తే బాగా వెనకపడి ఉందని అన్నాడు. భారత పేసర్లు తమ ఆహారపు అలవాట్ల కారణంగా బలహీనంగా కనిపిస్తారని, ఇదే వారికి పాక్ పేసర్లకు తేడా అని పేలాడు. పాక్ పేసర్ల ముఖాల్లో కనిపించే కసి, యాటిట్యూడ్ భారత పేస్ బౌలర్ల ముఖాల్లో కనిపించవని, ఈ వ్యత్యాసం క్రికెట్ తొలినాళ్ల నుంచే ఉందని, అందుకు కారణం మా తిండి, వాతావరణం అని తెలిపాడు. పాక్ బౌలర్లు బౌలింగ్ వేసే సమయంలో ఇతర విషయాల గురించి ఆలోచించరని.. వికెట్ తీయడమే వారి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. ఈ యాటిట్యూడే వేగంగా బంతులు వేసేందుకు కావాల్సిన ఎనర్జీని ఇస్తుందని వివరించాడు. దీనికి తోడు మేము ఎక్కువగా మాంసాహారం తింటామని, అందుకే దృడంగా ఉంటామని, ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే సింహాల్లా పరుగెడతామని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం తరం పాక్ పేసర్లలో షాహీన్ ఆఫ్రిదీ, హసన్ ఆలీల్లో ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయని ఈ సందర్భంగా ఉదహరించాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియా పేస్ యూనిట్‌కు మించిన ఫాస్ట్ బౌలింగ్ దళం ఏ జట్టుకు లేదనడం అతిశయోక్తి కాదు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ, టి నటరాజన్ వంటి పేసర్లతో భారత పేస్ విభాగం కలకలలాడుతోంది. ఈ విషయంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్ల పేసర్ల కంటే భారత పేస్ దళం దృడంగా కనిపిస్తుంది. చదవండి: ధోని నా భార్య కాదు.. బీసీసీఐలో నాకు గాడ్ ఫాదర్లు ఎవ్వరూ లేరు..! -
ఫైనల్ మ్యాచ్.. కత్తులు దూసుకున్న క్రికెటర్లు
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 ఆఖరి అంకానికి చేరింది. శనివారం రాత్రి వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇరుజట్లు సూపర్‌స్టార్ ఆటగాళ్లతో నిండిఉండడంతో రెండు ఫెవరెట్‌గానే కనిపిస్తున్నాయి. అయితే మ్యాచ్ మొదలవడానికి ముందు రెండు జట్లలోని ఇద్దరు ఐకానిక్ ప్లేయర్స్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. వారిలో ఒకరు ఆసియా లయన్స్ తరపున ఆడుతున్న షోయబ్ అక్తర్.. రెండో ఆటగాడు వరల్డ్ జెయింట్స్ ప్లేయర్ బ్రెట్ లీ. విషయంలోకి వెళితే.. ఫైనల్ గెలిచిన తర్వాత అందించే ట్రోఫీని వీడియోలో షేర్ చేస్తూ.. అక్తర్‌ను టాగ్ చేస్తూ... నేను రెడీగా ఉన్నా.. బ్లాక్బాస్టర్ పోరుకు నువ్వు రెడీయే నా అక్తర్ అంటూ పేర్కొన్నాడు. దీనికి బదులుగా రావల్పిండి ఎక్స్‌ప్రెస్ వినూత్న రీతిలో స్పందించాడు. పుట్టుకతోనే నేను రెడీగా ఉన్నా అంటూ లీకి దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Only a few hours away from the final #legendsleaguecricket 🏆 I hope your ready @shoaib100mph 🏏👑 pic.twitter.com/IktKuMtfSZ — Brett Lee (@BrettLee_58) January 29, 2022 -
వాళ్లకు విశ్రాంతి ఎందుకు.. నేను ఆ రూల్‌కు వ్యతిరేకిని: బ్రెట్ లీ షాకింగ్ కామెంట్లు
Brett Lee Comments On Pacers: బౌలర్లకు విశ్రాంతినిచ్చే సంప్రదాయానికి తాను వ్యతిరేకమని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ అన్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైతే పర్వాలేదని, కేవలం పని ఒత్తిడిని కారణంగా చూపి రెస్ట్ ఇవ్వడం సరికాదని ఈ స్సీడ్స్టర్ అభిప్రాయపడ్డాడు. పేసర్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకు, కెరీర్‌ను సాఫీగా కొనసాగించే క్రమంలో క్రికెట్ బోర్డులు అనుసరిస్తున్న విధానాలను ఈ సందర్భంగా విమర్శించాడు. కాగా వెస్టిండీస్‌తో స్వదేశంలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో బీసీసీఐ సైతం స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీకి విశ్రాంతినిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లెజెండ్స్ లీగ్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన బ్రెట్ లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘బౌలర్లకు రెస్ట్ ఇచ్చే రూల్స్‌కు నేను వ్యతిరేకిని. బౌలర్లు ప్రతి మ్యాచ్ ఆడితేనే నాకు ఇష్టం. ఒకవేళ వారు గాయం కారణంగా జట్టుకు దూరమైతే ఓకే. కానీ.. విశ్రాంతి పేరిట పేస్ బౌలర్లను పక్కన పెట్టడం మంచిది కాదు. వాళ్లు మరింత కఠినంగా శ్రమిస్తూ... రోజురోజుకు ఆటను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగితే చూడముచ్చటగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా 2-1 తేడాతో ప్రొటిస్ చేతిలో సిరీస్ ఓడిపోయిన నేపథ్యంలో మాట్లాడుతూ... ‘‘ఇలాంటివి జరగడం సహజం. వాళ్లు (భారత జట్టు)బాగానే ఆడుతున్నారు. ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టికరిపించారు. ఇంగ్లండ్‌ను ఓడించారు. ఇండియా జట్టు పటిష్టంగా ఉంది. అయితే, దక్షిణాఫ్రికా తమ స్వదేశంలో ఎంతో అద్భుతంగా ఆడింది. అందుకే సిరీస్ గెలిచింది’’ అంటూ బ్రెట్ లీ టీమిండియాకు బాసటగా నిలిచాడు. ఇదిలా ఉండగా ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని కంగారూలు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. 4-0 తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన బ్రెట్ లీ.. బౌలర్‌గానూ, సారథిగానూ కమిన్స్ అద్భుతంగా రాణించాడని ప్రశంసలు కురిపించాడు. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి IPL 2022: 'ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది.. అతడే నా ఫేవరెట్ కెప్టెన్' -
కొడుకనే కనికరం లేకుండా క్లీన్‌బౌల్డ్
ఆస్ట్రేలియా స్పీడస్టర్ బ్రెట్ లీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి చాలా కాలమే అవుతుంది. అయినప్పటికి తన బౌలింగ్‌లో పదును మాత్రం పోలేదని మరోసారి నిరూపించాడు. తాజాగా 45 ఏళ్ల బ్రెట్ లీ తన కొడుకు ప్రీస్టన్తో కలిసి ఇంటి ఆవరణలోని గార్డెన్లో సరదాగా క్రికెట్ ఆడాడు. ఈ నేపథ్యంలో బ్రెట్ లీ బంతి విసిరాడు. బ్యాటింగ్ చేస్తున్న ప్రీస్టన్కు కనీసం టచ్ చేసే అవకాశం రాలేదు. ఈలోగా బంతి వేగంగా పాదాల మధ్య నుంచి వచ్చి మిడిల్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. చదవండి: అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్ ‘హిట్’... అశూ, అక్షర్ కూడా అద్భుతం! దీనికి సంబంధించిన వీడియోను ఫాక్స్ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసింది. '' వయసు పెరుగుతున్న బ్రెట్ లీ బౌలింగ్‌లో పదును మాత్రం తగ్గలేదు. బంతిని వదిలేశారో ఇక అంతే సంగతులు.. కొడుకనే కనికరం లేకుండా క్లీన్ బౌల్డ్ చేశాడు.'' అంటూ క్యాప్షన్ జత చేసింది.ఇక 13 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా తరపున క్రికెట్ ఆడిన బ్రెట్ లీ అన్ని ఫార్మాట్లు కలిపి 718 వికెట్లు తీశాడు. 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో బ్రెట్ లీ సభ్యుడిగా ఉన్నాడు. Blink and you'll miss it 😳 Brett Lee has shown no mercy to his son 😂 👉 https://t.co/PytmEwGeQa pic.twitter.com/bWcQQ9WAnw — Fox Cricket (@FoxCricket) December 30, 2021 -
ట్రోఫితో పాటు ఆ రెండు రికార్డులు టీమిండియా క్రికెటర్లవే..
Brett Lee Predicts Highest Run Scorer And Wicket Taker Of T20 World Cup 2021: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్-2021పై విశ్లేషకులు, మాజీ క్రికెటర్ల నుంచి రకరకాల అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ సైతం తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న మెగా టోర్నీలో టీమిండియానే విజేతగా నిలువబోతుందని జోస్యం చెప్పాడు. అలాగే టోర్నీలో అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్ల రికార్డు కూడా టీమిండియా క్రికెటర్లే సొంతం చేసుకోనున్నట్లు ముందే తేల్చేశాడు. భారత విధ్వంసకర ఓపెనర్ కేఎల్ రాహుల్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్‌గా నిలుస్తాడని, మహ్మద్ షమీ అత్యధిక వికెట్లు పడగొట్టే బౌలర్‌గా అవతరిస్తాడని అంచనా వేశాడు. గత కొంతకాలంగా వీరిద్దరు రాణిస్తున్న తీరును పరిగణలోకి తీసుకుని ఈ మేరకు అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాడు. వీరిద్దరు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయగలిగితే టీమిండియా కప్‌ను ఎగరేసుకుపోవడం ఖాయమని తెలిపాడు. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్-2021లో ఈ ఇద్దరు ఆటగాళ్లు పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. పంజాబ్‌కు సారధిగా వ్యవహరించిన రాహుల్.. 13 మ్యాచ్‌ల్లో 62.60 సగటుతో 626 పరుగులు చేయగా, షమీ 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే, ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్, ఆసీస్‌లతో జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో సత్తా చాటిన టీమిండియా మాంచి జోరు మీద ఉంది. ఇదే ఊపులో ఈనెల 24న దాయాది పాక్‌ను సైతం మట్టికరిపించాలని కోహ్లి సేన భావిస్తుంది. చదవండి: అజేయ 'విరాట్'.. పాక్‌పై అదిరిపోయే రికార్డు కలిగిన టీమిండియా కెప్టెన్ -
WTC Final: ఐసీసీ ఈవెంట్లు ఇద్దరికి కలిసి రాలేదు
లండన్: జూన్ 18 నుంచి 22 వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌పైనే ఇప్పుడు అందరి కళ్లు నెలకొని ఉన్నాయి. తొలిసారి టెస్టు క్రికెట్ చరిత్రలో చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుండడంతో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో తలపడుతున్న కివీస్, టీమిండియాలలో ఎవరు ఫేవరెట్ అనే దానిపై ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఈ రెండు బలంగా కనిపిస్తున్నా.. క్రిటిక్స్, మాజీ ఆటగాళ్ల దృష్టిలో ఎవరు ఒకరు మాత్రమే ఫేవరెట్‌గా ఉంటారు. అందులో చాలా మంది టీమిండియానే ఫేవరెట్ అని భావిస్తుంటే.. ఆసీస్ మాజీ స్పీడస్టర్ బ్రెట్ లీ మాత్రం కివీస్‌కు ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని అభిప్రాయపడ్డాడు. ఐసీసీకి ఇచ్చిన ఇంటర్య్వూలో బ్రెట్ లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.'' ఇంగ్లండ్ పిచ్‌లు కివీస్‌కు సరిపోతాయి. ఎందుకంటే ఇక్కడి పిచ్‌పై వారు బ్యాటింగ్ చేస్తుంటే అది వారి సొంత గ్రౌండ్లో ఆడినట్టుగా ఉంటుంది. ఈ ఫైనల్లో బౌలింగ్ కీలకంగా మారనుంది. వికెట్ గురించి మాట్లాడేటప్పుడు బౌలింగ్‌కు సహకరిస్తుందా లేదా అనేది కీలకం. స్పిన్.. స్వింగ్ నుంచి ఫాస్ట్ బౌలింగ్ ఇలా ఏ అంశం చూసుకున్నా కివీస్‌కు అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అయితే ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే ఇరు జట్లు నాణ్యమైన బౌలర్లను కలిగి ఉన్నాయి. ఇండియన్ టెస్టు లైనప్ తీసుకుంటే కివీస్‌తో సమానంగా ఉంది. కానీ మ్యాచ్‌లో ఎవరు మెరుస్తారన్నది ఇప్పుడే చెప్పలేం. వాస్తవానికి ఇది కఠినమైన ప్రశ్న. ఇక బ్యాటింగ్ విభాగంలో ఇరు జట్లు సమానంగా ఉన్నా.. స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఏ జట్టు బ్యాట్స్‌మన్ నిలబడతారో చూడాలి.. అయినా ఈ మ్యాచ్‌లో బౌలర్లదే కీలకపాత్ర. ఇక ఇరు జట్ల కెప్టెన్ల విషయానికి వస్తే ముందుగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక మాస్టర్ బ్రెయిన్‌తో పాటు బోరింగ్ లేని కెప్టెన్. బోరింగ్ లేని కెప్టెన్ ఎందుకంటే అతను అవసరమున్నప్పుడు మాత్రమే తన బ్రెయిన్‌కు పదును పెట్టి ఆలోచిస్తాడు..ఓపిక అతనికి ఉన్న మంచి లక్షణం.. ఫలితం అతనికి అనుకూలంగా మారుతుంది. ఇక విరాట్ కోహ్లి అగ్రెసివ్ కెప్టెన్.. తాను తీసుకునే నిర్ణయాలను బలంగా నమ్ముతాడు. అయినా ఎవరి స్ట్రాటజీలు వారికి ఉంటాయి. వీరిద్దరిలో కామన్ పాయింట్ ఏంటంటే.. ఇద్దరికి ఐసీసీ మేజర్ ఈవెంట్స్ ఇప్పటివరకు కలిసిరాలేదు. ఇద్దరు నాయకత్వం వహించిన జట్లు ఐసీసీ ప్రధాన టోర్నీలో చతికిలపడ్డాయి. అయితే తొలిసారి జరుగుతున్న టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఐసీసీ ఎవరో ఒకరిని విజేతగా చూడాలనే పట్టుదలతో ఉంది.. చూద్దాం విజయం ఎవరిని వరిస్తుందో'' అంటూ ముగించాడు. ఇక న్యూజిలాండ్ ఇప్పటికే ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడుతుండగా.. టీమిండియా జట్టు గురువారం లండన్‌లో అడుగుపెట్టింది. చదవండి: WTC: ‘రసవత్తరంగా ఉండాలంటే ప్రత్యేక విండో ఉండాలి’ -
వార్నర్ హ్యాపీగా లేడు.. ఉండడు కూడా
ఢిల్లీ: ఐపీఎల్లో ఎంతో ఘనమైన రికార్డు ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు తుది జట్టులో కూడా చోటివ్వకపోవడం తీవ్రంగా అవమానించినట్లేనని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల సాధించిన ఆటగాళ్ల జాబితాలో టాప్-5లో ఉన్న వార్నర్‌ను తప్పించడం వెనుక కచ్చితంగా బలమైన కారణమే ఉంటుందని బ్రెట్ లీ పేర్కొన్నాడు. అలా కాకపోతే కెప్టెన్సీ పదవి నుంచి తొలగించిన వెంటనే ఆటగాడిగా కూడా తొలగించడం ఏంటని ప్రశ్నించాడు. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన బ్రెట్ లీ.. వార్నర్‌కు వరుసగా రెండు షాక్‌లు ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేశాడు. ‘వార్నర్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించడం నన్ను షాక్‌కు గురిచేసింది. ఈ సీజన్లో అతను అత్యుత్తమ ఫామ్‌లో ఉండకపోవచ్చు. కానీ వార్నర్ జట్టులో ఉన్న భరోసా వేరు. కచ్చితంగా వార్నర్ తుది జట్టులో ఉండాలి. వార్నర్ అత్యుత్తమ ఆటగాడు.ఐపీఎల్లో 5,447 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ విదేశీ ఆటగాళ్ల జాబితాలో వార్నర్ తొలి స్థానంలో ఉన్నాడు. ఇంతటి ఘనమైన రికార్డు ఉన్న వార్నర్‌పై వేటా. మూడుసార్లు(2015, 2017,2019) ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఏకైక ఆటగాడు వార్నర్.ఐపీఎల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు(50) చేసిన రికార్డు కూడా వార్నర్ పేరిటే ఉంది. ఓవరాల్ ఐపీఎల్ అంతా పరుగులు చేస్తూనే ఉన్నాడు. నేను ఒకటే చెబుతున్నా. ఈ నిర్ణయంతో వార్నర్ హ్యాపీగా లేడు.. ఉండడు కూడా. ఒక మంచి ఆటగాడు కాబట్టి జట్టుకు సపోర్ట్ చేయడంలో కూడా ముందే ఉంటాడు’ అని లీ పేర్కొన్నాడు. ఇక్కడ చదవండి: వార్నర్ వద్దా.. ఒక్క ఓవర్ బౌలర్ కావాలా? ‘నేను 30-40 పరుగులు చేశానా అనేది మ్యాటర్ కాదు’ -
బ్రెట్ లీ ఔదార్యం.. 1 బిట్‌కాయిన్ విరాళం
న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న భారత్‌కు తన వంతు సాయం చేయడానికి ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ ముందుకొచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్లో భాగంగా బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్‌కు ప్రెజంటర్గా వ్యవహరిస్తూ భారత్‌లో ఉన్న బ్రెట్ లీ.. మంగళవారం 1 బిట్‌కాయిన్‌ను విరాళంగా అందించనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో భారత్‌పై ఉన్న అభిమానాన్ని తన పోస్ట్ ద్వారా చాటుకున్నాడు. ‘నాకు భారత్ రెండో మాతృదేశంతో సమానం. ఈ దేశంలో ప్రజల ప్రేమను చాలా ఎక్కువగా పొందాను. నాకు భారత్‌తో ఒక బంధం ఉందనే అనుకుంటా. నా ప్రొఫెషనల్ కెరీర్లో కానీ రిటైర్మెంట్ తర్వాత కానీ భారత్ నాకు ఒక ప్రత్యేకమైన ప్లేస్‌గా భావిస్తున్నా. కరోనా మహమ్మారితో తల్లడిల్లిపోతున్న ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి. భారత్‌లో హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ సరఫరా వినియోగానికి నా వంతు సాయంగా 1 బిట్ కాయిన్‌ను విరాళంగా ఇస్తున్నా’ అని తెలిపాడు. ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ భారత్ కరెన్సీలో సుమారు రూ. 40లక్షలుగా ఉంది. సోమవారం కేకేఆర్ పేసర్ ప్యాట్ కమిన్స్ 50 వేల డాలర్లను పీఎం కేర్స్‌ఫండ్‌కు సాయాన్ని ప్రకటించారు. అంతేకాదు మిగతా ఐపీఎల్ సభ్యులు కూడా స్పందించాలని కోరారు. కరోనా విజృంభణతో ఆక్సిజన్ నిల్వల తీవ్ర కొరత నేపథ్యంలో కమిన్స్ సాయం చేయడానికి తొలి అడుగువేశాడు. View this post on Instagram A post shared by Brett Lee (@brettlee_58) -
అతనికి కోహ్లి ఒక గొప్ప ఆస్తి: బ్రెట్ లీ
చెన్నై: గతేడాది ఐపీఎల్ సీజన్‌ను ఒక సిక్స్ లేకుండా ముగించిన మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ వదిలేయగా.. ఈసారి వేలంలో రూ. 14 కోట్లకు పైగా చెల్లించి ఆర్సీబీ కొనుగోలు చేసింది. మ్యాక్స్‌వెల్‌ను ఆర్సీబీ తీసుకోవడానికి కెప్టెన్ కోహ్లినే కారణం. ఆ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాడు మ్యాక్సీ. ఒక హార్డ్ హిట్టింగ్ ఆల్‌రౌండర్ జట్టులో ఉండాలని భావించిన కోహ్లి ముందు నుంచి మ్యాక్స్‌వెల్‌పై కన్నేశాడు. ఈ విషయాన్ని ముందుగానే మ్యాక్సీకి తెలిపిన కోహ్లి.. అనుకున్నట్లే అతన్ని తీసుకున్నాడు. ఐపీఎల్ వేలంలో మ్యాక్స్‌వెల్ కోసం పోటీ జరిగినా ఆర్సీబీ చివర వరకూ వెళ్లి అతన్ని దక్కించుకుంది. అందుకు తగ్గట్టుగానే నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ 41 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ మ్యాక్సీ ఐదు సిక్సర్లు కొట్టడం, ఆ రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ విజయం సాధించడంతో ఆ ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్‌గానే కనిపిస్తోంది. కాగా, మ్యాక్స్‌వెల్‌కు కోహ్లి ఒక గొప్ప ఆస్తి అని అంటున్నాడు ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ. బుధవారం స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన బ్రెట్ లీ.. ‘ మ్యాక్స్‌వెల్ కొత్త కలర్స్‌లో ఆడుతున్నాడు. అది మ్యాక్స్‌వెల్‌కు ఈ సీజన్లో ఉపయోగపడింది. ఇప్పటివరకూ జరిగిన రెండు మ్యాచ్‌లను బట్టి చూస్తే కోహ్లితో కలిసి సానుకూల ధోరణిలో బ్యాటింగ్ చేశాడు. మ్యాక్సీకి కోహ్లి దొరకడం నిజంగా అదృష్టం. అతనికి కోహ్లి గొప్ప ఆస్తి. మ్యాక్స్‌వెల్ తిరిగి తన ఆటపై దృష్టిసారించడానికి కోహ్లినే కారణం. కోహ్లికి మ్యాక్సీతో సాన్నిహిత్యం బాగుంది. దాంతోనే మ్యాక్స్‌వెల్ తన సహజసిద్ధమైన తరహాలో ఒత్తిడి లేకుండా ఆడుతున్నాడు’ అని కొనియాడాడు. ఇక మ్యాక్సీ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కూడా హర్షం వ్యక్తం చేశాడు. ‘ఆర్సీబీకి మ్యాక్స్‌వెల్ చాలా ముఖ్యమైన ఆటగాడు. ఇప్పటివరకూ మ్యాక్సీ ప్రదర్శన బాగుంది. అతనిపై నమ్మకంతో అత్యధిక ధర చెల్లించి ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మ్యాక్స్‌వెల్ ఆట సాగుతోంది’ అని గంభీర్ తెలిపాడు. ఇక్కడ చదవండి: పాండే 14 సార్లు.. ఎస్ఆర్హెచ్ 11 సార్లు మ్యాక్స్‌వెల్ 1,806 రోజుల తర్వాత.. -
పుజారా ఆటపై నాకు అనుమానాలున్నాయ్!
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు చతేశ్వర్ పుజారా. సుమారు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ ఆడుతున్నాడు పుజారా. ఇది పుజారాకు సదావకాశమనే చెప్పాలి. కేవలం టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిన పుజారా.. ఈ సీజన్లో సత్తాచాటి తాను కూడా టీ20 ఫార్మాట్‌కు సరిపోతాననే సంకేతాలిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదే విషయాన్ని పుజారా చాలాసార్లు చెప్పాడు కూడా. తనను టెస్టు ప్లేయర్‌గా మాత్రమే చూస్తున్నారని, టీ20 తరహా దూకుడైన ఆటకు కూడా తాను సరిపోతానని పలుమార్లు విన్నవించుకున్న తర్వాత సీఎస్కే అతన్ని కొనుగోలు చేయడం ఒక మంచి పరిణామం. కాగా, ఈ ఐపీఎల్లో పుజారా ఎలా ఆడబోతాడు అనే దానిపై అటు ప్రేక్షకులు, ఇటు మాజీ క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఇప్పటివరకూ 30 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన పుజారా కేవలం 390 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడ అతని యావరేజ్ 21.0 కంటే తక్కువగా ఉంది. ఇదే అనుమానాలు రేకెత్తిస్తోంది. తాజాగా ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కూడా పుజారా ఆటపై ఆసక్తిని ప్రదర్శిస్తూ అనుమానాలు వ్యక్తం చేశాడు. ‘చూద్దాం.. ఈ ఐపీఎల్లో పుజారా ఎంతవరకు రాణిస్తాడో చూడాలని ఉంది. టీ20 ఫార్మాట్లో పుజారా మెరుగ్గా రాణిస్తాడా అనేది నేను కచ్చితంగా చెప్పలేను. పుజారా ఒక గొప్ప బ్యాట్స్‌మన్.. కానీ పొట్టి ఫార్మాట్లో పుజారా ఆటపై నాకు అనుమానాలున్నాయ్. సాధ్యమైనంత త్వరంగా పరుగులు చేస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చు. నేను బ్రెట్ లీ పెద్ద ఫ్యాన్. ఈ ఫార్మాట్లో పుజారా ఏం చేస్తాడో చూడాలి’ అని బ్రెట్ లీ పేర్కొన్నాడు. శనివారం ముంబై వాంఖడే స్టేడియంలో సీఎస్కేతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఇక్కడ చదవండి: అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం.. నాకు నమ్మకం ఉంది! సీఎస్కేతో ఆసీస్ పేసర్ ఒప్పందం -
‘కోహ్లి కెప్టెన్సీలో ఆడాలంటే భయపడతారు’
సిడ్నీ: విరాట్ కోహ్లి సారథ్యంలో ఆడేందుకు టీమిండియా ఆటగాళ్లు భయపడతారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ లీ పేర్కొన్నాడు. అదే సమయంలో అజింక్య రహానే కెప్టెన్సీలో మాత్రం స్వేచ్ఛగా ఆడతారని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ తాను భారత జట్టు సెలక్టర్ అయితే కోహ్లిని బ్యాటింగ్‌పై మరింతగా దృష్టి సారించమని సలహా ఇస్తానని, రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తానని పేర్కొన్నాడు. కాగా ఆసీస్ టూర్లో భాగంగా తొలి టెస్టు ఘోర పరాజయం తర్వాత రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి పితృత్వ సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సారథ్య బాధ్యతలు చేపట్టిన రహానే తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. (చదవండి: ‘ఎప్పటికీ కోహ్లినే మా టీమ్ కెప్టెన్’) సీనియర్ ఆటగాళ్లు లేకపోయినా యువ క్రికెటర్లతోనే అద్భుతం చేసి చిరస్మరణీయ విజయం సొంతం చేసుకున్నాడు. తద్వారా బోర్డర్- గావస్కర్ ట్రోఫీని టీమిండియా నిలబెట్టుకోగలిగింది. దీంతో రహానే నాయకత్వ లక్షణాలపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో షేన్ లీ తన అన్నయ్య బ్రెట్ లీతో జరిగిన సంభాషణలో ఈ విషయాలను ప్రస్తావించాడు. ‘‘గొప్ప బ్యాట్స్మెన్లలో కోహ్లి పేరు ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక కెప్టెన్‌గా ఉన్నందున టీమిండియా సభ్యులకు అతడంటే విపరీతమైన గౌరవం ఉంటుంది. అయితే అదే సమయంలో అతడికి వారు భయపడినట్లు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కోహ్లి ప్రొఫెషనలిజంకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. కచ్చితమైన ఫలితాలు కావాలంటాడు. రహానే ఈ అంశాలకు విలువనిస్తూనే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడేలా స్వేచ్ఛనిస్తాడు’’ అని పేర్కొన్నాడు. నేను గనుక టీమిండియా సెలక్టర్ అయితే రహానేను సారథిని చేసి, కోహ్లి కేవలం బ్యాటింగ్‌పై ఫోకస్ చేసే అవకాశం ఇస్తాను. కోహ్లి జోష్‌లో ఉంటే జట్టు కూడా అదే స్థాయిలో మెరుగ్గా రాణిస్తుంది. అయితే ఇలాంటి ఒక పరిణామం జరుగుతుందా లేదా అన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది అని షేన్ లీ చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్ తరఫున షేన్ లీ 45 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇక టీమిండియా ప్రస్తుతం విరాట్ కోహ్లి నేతృత్వంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. -
అలాంటి బంతినే ఫోర్ కొడితే.. ఇక నేనేం చేయాలి
అడిలైడ్ : ఆసీస్ మాజీ బౌలర్.. స్పీడస్టర్ బ్రెట్ లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా బ్రెట్ లీ పేరు సంపాదించాడు. గంటకు 160 కిమీ వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్లకు సవాల్ విసిరేవాడు. అతని వేగం దాటికి వికెట్లు విరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బ్రెట్ లీ తన వైవిధ్యమైన బౌలింగ్‌లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కూడా చాలా సార్లు ఔట్ చేశాడు. అయితే సచిన్ ఆడిన ఒక్క షాట్ మాత్రం తన జీవితాంతం గుర్తుండిపోతుందని లీ చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు. తాజాగా మరోసారి ఆ విషయాన్ని పంచుకున్నాడు. 'సచిన్‌ను నేను ఎన్నోసార్లు ఔట్ చేశాను.. అలాగే చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. కానీ సచిన్ నన్ను ఇబ్బంది పెట్టింది మాత్రం 2008 సీబీ సిరీస్. సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో గంటకు 160 కిమీ వేగంతో బంతులు వేశా.. నా బంతులకు టీమిండియా బ్యాట్స్‌మెన్ బెంబెలెత్తారు. అయితే సచిన్‌కు వేసిన ఒక బంతి సుమారు 165 కిమీ వేగం ఉంటుందని అనుకుంటా. దానిని కూల్‌గా ఆడిన సచిన్ ఆఫ్‌డ్రైవ్ దిశగా ఫోర్ బాదేశాడు. సచిన్ షాట్తోవా క్షణంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అలాంటి బంతినే ఫోర్ కొడితే.. ఇక నేనేం చేయాలి. ఇలాంటివి లెజెండ్స్‌కు మాత్రమే సాధ్యం' అని మనసులో అనుకుంటూ తరువాతి బంతికి సిద్ధమయ్యానంటూ' లీ తెలిపాడు. 1999లో అరంగేట్రం చేసిన బ్రెట్ లీ ఆసీస్ తరపున 76 టెస్టుల్లో 310, 221 వన్డేల్లో 380 వికెట్లు, 25 టీ20ల్లో 28 వికెట్లు తీశాడు. -
కోహ్లి- అనుష్క ఆస్ట్రేలియాకు రండి: బ్రెట్ లీ
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రానున్న సంగతి తెలిసిందే. అతడి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జనవరిలో తమ తొలి సంతానానికి జన్మనివ్వనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. కోహ్లి పితృత్వ సెలవుకు బీసీసీఐ కూడా అంగీకారంతో తెలపడంతో డిసెంబరు 21న మ్యాచ్ ముగియగానే ముంబైకి చేరుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లి- అనుష్క శర్మ దంపతులు తమ జీవితంలోని మధురానుభూతులను పదిలం చేసుకునేందుకు తమ దేశానికి రావాలని ఆహ్వానించాడు. (చదవండి: విరుష్క పెళ్లి పాట.. వీడియో రిలీజ్) ‘‘మిస్టర్ కోహ్లి.. మీకు గనుక ఇష్టం ఉన్నట్లయితే.. ఆస్ట్రేలియాలో మీ మొదటి బిడ్డకు జన్మనివ్వవచ్చు. ఎందుకంటే మేం మీ రాకను స్వాగతిస్తాం. మీకు అబ్బాయి పుడితే అద్భుతం! అమ్మాయి పుడితే ఇంకా అద్భుతం!’’ అని బ్రెట్ లీ కాబోయే తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపాడు. కాగా ఆసీస్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసి ఆలౌట్ అయిన కోహ్లి సేన ఆతిథ్య ప్రత్యర్థి జట్టును 191 పరుగులకు కట్టడి చేసింది. (చదవండి: టీమిండియా బౌలర్ల జోరు, ఆసీస్ బేజారు!) -
ధోనిలో ఉన్న గ్రేట్‌నెస్ అదే!
దుబాయ్: జట్టు సభ్యులపై విశ్వాసం ఉంచి ముందుకు నడిపించడం మహేంద్ర సింగ్ ధోనిలోని గొప్పదనమని ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ అన్నాడు. ఒత్తిడిలో కూడా మెరుగ్గా ఆడేందుకు ఇది దోహదపడుతుందని చెప్పాడు. ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న షేన్ వాట్సన్‌ని భుజం తట్టి ప్రోత్సహించడం వల్లనే గత మ్యాచ్‌లో రాణించగలిగాడని బ్రెట్‌లీ మీడియా చాట్‌లో పేర్కొన్నాడు. కాగా, కింగ్స్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్ వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని డుప్లెసిస్‌తో కలిసి షేన్‌వాట్సన్ ఛేదించాడు. ఓపెనర్లు వాట్సన్ (53 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), డుప్లెసిస్ (53 బంతుల్లో 87 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) హీరోచిత ఇన్నింగ్స్‌లతో మరో 14 బంతులు మిగిలిఉండగానే చెన్నై జట్టు 10 వికెట్లతో తేడాతో భారీ విజయం సాధించింది. చెన్నైకి ఇది రెండో విజయం. ఇక తొలి నాలుగు మ్యాచుల్లో 52 పరుగులే చేసిన వాట్సన్‌ను కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో ధోని ఆడిస్తాడా? పక్కన పెడతాడా? అనే సందేహం కలిగింది అభిమానులకు. ఈ దశలో కెప్టెన్ ధోని వాట్సన్వైపు మొగ్గు చూపాడు. (చదవండి: ఆ క్రెడిట్ అంతా వారిదే: డుప్లెసిస్) -
వారెవ్వా కమిన్స్.. తిట్టినోళ్లే పొగుడుతున్నారు
అబుదాబి : పాట్ కమిన్స్.. గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు. రూ. 15 కోట్లు వెచ్చించి మరీ కేకేఆర్ కమిన్స్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో కమిన్స్ ఘోరమైన ప్రదర్శన చేశాడు. 3ఓవర్లోనే 16 ఎకానమీ రేటుతో 49 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. కమిన్స్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. కోట్లు పెట్టి కొనుక్కుంటే ఇలా ఆడతాడా.. ఒక అంతర్జాతీయ బౌలర్ ఇవ్వాల్సిన ప్రదర్శన ఇది కాదు.. కమిన్స్ మమ్మల్ని దారుణంగా మోసం చేశాడంటూ తీవ్రంగా తప్పుబడుతూ విమర్శలు సంధించారు. అయితే కమిన్స్ ఇవేవి పట్టించుకోకుండా తన ప్రదర్శనతోనే సమాధానం ఇవ్వాలనుకున్నాడు. కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ కూడా కమిన్స్‌కు మద్దతు ఇచ్చాడు. (చదవండి : 'ఒక్క డకౌట్‌తో నేనేం చెడ్డవాడిని కాను') కమిన్స్ తానేంతో విలువైన ఆటగాడినో సన్‌రైజర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనే నిరూపించాడు. ఈసారి పూర్తి కోటా ఓవర్లు వేసిన కమిన్స్ మొత్తం 4ఓవర్లలో ఒక వికెట్ ఇచ్చి 19 పరుగులు ఇచ్చాడు. కమిన్స్ తన ప్రతీ డెలివరీని దాదాపు 140కిమీ వేగంతో అద్భుతంగా సందించాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ ఓపెనర్ బెయిర్ స్టోను క్లీన్‌బౌల్డ్ చేసిన తీరు చూస్తే ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ అనే పేరును సార్థకం చేసుకున్నాడు. నిజానికి గత మ్యాచ్‌లో కమిన్స్ ఓపెనింగ్ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం కెప్టెన్ కార్తీక్ కమిన్స్ మీద ఉన్న నమ్మకంతో ఓపెనింగ్ బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన ప్రదర్శనతో అదరగొట్టాడు. కమిన్స్ ప్రదర్శనతో ముంబైతో మ్యాచ్‌లో తిట్టినవారే ఇప్పుడు వారెవ్వా కమిన్స్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. (చదవండి :కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా అయితే ఎలా!) ఈ నేపథ్యంలో కమిన్స్ ప్రదర్శనపై ఆసీస్ మాజీ స్పీడస్టర్ బ్రెట్ లీ పలు విషయాలు వెల్లడించాడు.' కమిన్స్ ఎంత విలువైన ఆటగాడో ఇప్పుడు అర్థమయి ఉంటుంది. 15 కోట్లు పెట్టి కొన్న కేకేఆర్‌కు రానున్న మ్యాచ్‌ల్లో అతను డబుల్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం. లైన్ అండ్ లెంగ్త్‌తో కమిన్స్ వేసిన ప్రతీ డెలివరీ అద్భుతమే అని చెప్పాలి. ముంబైతో మ్యాచ్‌లో పూర్తిగా లయ తప్పిన బౌలింగ్‌తో కనిపించిన అతను సన్‌రైజర్స్ మ్యాచ్‌లో పాత కమిన్స్‌ను చూపెట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా వికెట్ తీయడంలో కమిన్స్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది. దానిని రానున్న మ్యాచ్‌ల్లో చూడబోతున్నాం. అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.(చదవండి : కమిన్స్ విఫలం వెనుక కారణం ఇదే) న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ కూడా కమిన్స్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ' కమిన్స్ నిజంగా ఒక క్లాస్ ప్లేయర్. తనను విమర్శించిన వారికి ప్రదర్శనతోనే సమాధానం ఇచ్చాడు. కోట్లు పెట్టి కొన్న కేకేఆర్‌కు న్యాయం చేశాడు. అతను ఫాంలోకి వచ్చాడంటే అవతలి బ్యాట్స్మెన్లకు ఇక చుక్కలే.. రానున్న మ్యాచ్‌ల్లో కమిన్స్‌తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముంబైతో మ్యాచ్‌లో మూడో బౌలర్‌గా బరిలోకి దిగిన కమిన్స్‌ను ఈ మ్యాచ్‌లో మాత్రం ఓపెనింగ్ బౌలర్‌గా దించి కార్తీక్ మంచి పనిచేశాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో అతను వేసిన ప్రతీ బంతి వికెట్ల మీదుగానే వెళ్లింది. కమిన్స్ బౌలింగ్‌లో బెయిర్ స్టో అవుటైన తీరు చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుందని' తెలిపాడు. కాగా కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్ సెప్టెంబర్ 30(బుధవారం) రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. -
బ్రెట్ లీ ఉన్నా సేవ్ చేయలేకపోయాడు!
ముంబై: ప్రముఖ వ్యాఖ్యాత, ఆసీస్ దిగ్గజ క్రికెటర్ డీన్ జోన్స్ గుండె పోటుకు గురై ఈరోజు(గురువారం) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే డీన్ జోన్స్‌కు గుండె పోటు వచ్చిన సమయంలో ఎవరూ ఆయన వద్ద లేరా అని ఇప్పటివరకూ అభిమానుల్లో ఒక ప్రశ్న మెదులుతూనే ఉంది. కాగా, జోన్స్ వెంట ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ ఉన్నాడట. వీరిద్దరూ కలిసి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత హోటల్ లాబీలో ఉన్నారట. (చదవండి: జోన్స్ ఉదయం బాగానే ఉన్నారు.. అంతలోనే) వీరిద్దరూ బ్రేక్ ఫాస్ట్ చేసి వచ్చిన కాసేపటికి జోన్స్ కు హార్ట్ ఎటాక్ గురయ్యారు. జోన్స్‌ను కాపాడటానికి లీ చేసిన ప్రయత్నం ఫలిచం లేదు. సీపీఆర్ (కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్-శ్వాస పునరుద్ధరణ ప్రక్రియ) చేసినా జోన్స్ ను కాపాడలేకపోయాడు. సీపీఆర్ చేసినా జోన్స్‌ను కాపాడలేకపోయాననే పశ్చాత్తాపం బ్రెట్లీలో కనబడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ల్లో భాగంగా బ్రాడ్‌కాస్టింగ్ వ్యవహారాల్లో నిమగ్నమైన జోన్స్ ముంబైలో ఉన్నారు. జోన్స్‌తో పాటు బ్రాడ్ కాస్టింగ్ కామెంటరీ చేస్తున్నాడు. కాగా, మధ్యాహ్నం గం.11.30 నుంచి గం 12.00 మధ్యలో డీన్ జోన్స్ తీవ్ర గుండెపోటుకు గురి కావడంతో తుదిశ్వాస విడిచారు. ఆసీస్ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలను జోన్స్ ఆడారు. తన క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత కామెంటేటర్‌గా అవతారమెత్తారు. (చదవండి: ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్‌జోన్స్ ఇకలేరు..) -
ఈసారి ఐపీఎల్ టైటిల్ వారిదే: బ్రెట్ లీ
ముంబై: గతేడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించి టైటిల్ ఎగురేసుకుపోయింది. దాంతో ముంబై ఖాతాలో నాల్గోసారి టైటిల్ చేరగా, మరొకసారి టైటిల్ సాధించాలన్న సీఎస్కే ఆశలకు గండిపడింది. కాగా, ఈసారి ఐపీఎల్ టైటిల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎస్కేను కైవసం చేసుకుంటుందని ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ కవరేజ్‌లో భాగంగా బ్రాడ్‌కాస్టర్స్ హోస్ట్‌గా చేయనున్న బ్రెట్ లీ.. ప్రస్తుతం ముంబైకు చేరుకుని ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు బ్రెట్‌లీ సమాధానమిచ్చాడు. ‘ఈసారి ఐపీఎల్ టైటిల్ ఎవరదని భావిస్తున్నారు’ అని అడిగిన ప్రశ్నకు సీఎస్కే అని చెప్పాడు. విజేతను చెప్పడం కష్టమే అయినా తాను మాత్రం సీఎస్కేనే టైటిల్ గెలుస్తుందని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని జోస్యం చెప్పాడు. ఈసారి ఫైనల్-4లో కేకేఆర్ కచ్చితంగా ఉంటుందన్నాడు. గతంలో కేకేఆర్, కింగ్స్ పంజాబ్ జట్ల తరఫున బ్రెట్ లీ ఆడాడు. (చదవండి: రంగంలోకి సౌరవ్ గంగూలీ) కొన్ని రోజుల క్రితం సీఎస్కే జట్టు సభ్యుడు, వైస్ కెప్టెన్ సురేశ్ రైనా అర్థాంతరంగా దుబాయ్ నుంచి స్వదేశానికి వచ్చేశాడు. ఈ సీజన్ ఐపీఎల్ కోసం ఎంతో ఉత్సాహంగా యూఏఈకి చేరిన రైనా.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడం ఒకటైతే, ఇలా సీఎస్కే వీడి రావడం రెండోది. రైనా తొలి నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కల్గించకపోయినా రెండో నిర్ణయంతో అటు సీఎస్కేతో పాటు ఇటు అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్ ఆడితే రూ. 12.5 కోట్లను తన అకౌంట్లో వేసుకునే రైనా.. ఇలా ఉన్నపళంగా ఎందుకు వచ్చేశాడనే దానిపై భిన్నమైన కథనాలు వెలువడ్డాయి. ఏది ఏమైనా ఇక రైనా తిరిగి సీఎస్కేతో చేరడం కష్టమే కావచ్చు. సరైన కారణాలు లేకుండా భారత్‌కు వచ్చేయడమే ఇందుకు కారణం. తాను అవకాశం ఉంటే మళ్లీ జట్టుతో చేరతానని రైనా తెలిపినా, సీఎస్కే యాజమాన్యం అంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రైనా లేకపోతే సీఎస్కే బలహీనపడే అవకాశం కూడా ఉంది. సీఎస్కే బ్యాటింగ్ ఆర్డర్లో రైనా కీలక ఆటగాడు కావడంతో ఆ లోటును ఎవరితో పూడ్చాలనే దానిపై సీఎస్కే కసరత్తులు చేస్తోంది. (చదవండి: టీ20ల్లో మలాన్ నంబర్‌వన్ ) -
కోహ్లి రిలాక్స్‌గా ఆడితేనే..
సిడ్నీ: ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ గెలవలేకపోయిన ఆర్సీబీ.. దాన్ని అధిగమించాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాట్ ఝుళిపించాల్సి ఉందని ఆసీస్ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా తన సహజసిద్ధమైన ఆటను ఆడాలని కోహ్లికి సూచించాడు. కోహ్లికి ఒత్తిడి తగ్గిస్తేనే అది ఆర్సీబీకి ఉపయోగడపడుతుందని పేర్కొన్న బ్రెట్ లీ.. ఫించ్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెబుతారని అనుకుంటున్నానని అన్నాడు. తొలిసారి ఆర్సీబీ తరఫున ఆడబోతున్న ఫించ్.. కోహ్లికి సాయంగా ఉంటాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. కోహ్లి తర్వాత వైస్ కెప్టెన్సీ రోల్ ఫించ్‌దేనని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు. ఆర్సీబీ సక్సెస్ బాటలో పయనించాలంటే కోహ్లికి ఒత్తిడి తగ్గించాల్సిందేనని లీ తెలిపాడు.(‘అందుకే అంబటి రాయుడ్ని తీసుకోలేదు’) ‘కోహ్లి కేవలం క్రికెట్‌ను ఆస్వాదిస్తూనే బ్యాటింగ్ చేయాలి. ఎటువంటి ఒత్తిడి తీసుకోకూడదు. ఒక ప్లేయర్‌గా ఒక కెప్టెన్‌గా సక్సెస్ కావాలంటే ఒత్తిడిని వదిలేయాలి. ప్రస్తుతం కోహ్లి ఎంతో ఎత్తులో ఉన్నాడు. ఒక్కోసారి జట్టులో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆటగాళ్లు విఫమైనప్పుడు ఆ భారాన్ని కెప్టెన్ మోయాల్సి ఉంటుంది. ఇక్కడ కోహ్లి ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆసీస్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ అయిన అరోన్ ఫించ్ అనుభవం కోహ్లికి ఉపయోగపడుతుంది. ఫించ్ వైస్ కెప్టెన్‌గా ఉంటే కోహ్లి ఒత్తిడి తగ్గుతుంది’ అని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన క్రికెట్ కనెక్టడ్ షోలో బ్రెట్ లీ పేర్కొన్నాడు. గతంలో పలు ఫ్రాంచైజీలకు ఐపీఎల్లో ఫించ్ ప్రాతినిథ్యం వహించగా, ఈ సీజన్ ఐపీఎల్‌గాను గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది.(కోహ్లికి ఒత్తిడి తగ్గిస్తా: ఆసీస్ కెప్టెన్) ఇక్కడ చదవండి: ఆర్సీబీతోనే నా ప్రయాణం -
సెలైవా బ్యాన్‌తో సమస్య లేదు: బ్రెట్‌లీ
కోకాబుర్రా బాల్స్ ఎక్కువ స్వింగ్ కావని, సెలైవా నిషేధం వల్ల వాటిపై ప్రభావం ఎక్కువగా ఉండదని ఆస్ట్రేలిన్ మాజీ పేసర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో క్రికెటర్ల ఆరోగ్యం దృష్ట్యా బంతికి సెలైవా రాయడాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిషేధించింది. అయితే సెలైవా రాయకపోతే బాల్ స్వింగ్ అయ్యే విధానంలో మార్పు వస్తుందని, ఇది బౌలర్ ఆట తీరుపై ప్రభావం చూపుతుందని చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం పై బ్రెట్‌లీ మాట్లాడుతూ, "ఇది ఖచ్చితంగా బౌలర్లకు ప్రతికూలత అని నేను అనుకుంటున్నాను. దీని కంటే క్రికెటర్లు మైదానంలోకి వెళ్ళేముందు వారందరిని పరీక్షించడం, అన్ని క్లియర్ అయిన వారిని మాత్రమే ఆటలో పాల్గొనడానికి అనుమతించడం దీనికి మరో మార్గమని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికి సెలైవా బ్యాన్ వల్ల కోకా బుర్రా బాల్స్ స్వింగ్‌లో ఎక్కువగా మార్పు రాదు. దీని వల్ల రివర్స్ స్వింగ్ కూడా పెద్దగా ఉండదు. దాంతో సెలైవా రుద్దినా రుద్దకపోయినా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు’ అని అన్నారు. చదవండి: ఇక మా పని అయిపోయినట్లే: ఇషాంత్ చాలా రోజుల తరువాత ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. ఈ రెండు జట్టులు మూడు టెస్ట్ సిరీస్‌లు ఆడనున్నాయి. వీటిలో మొదట జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ఆండ్రసన్ ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి. అతని బౌలింగ్‌లో ఇంతకు ముందు ఉన్న స్వింగ్ కనిపించడం లేదని అంటున్నారు. దీనిపై బ్రెట్‌లీ మాట్లాడుతూ ఇంగ్లండ్ చాలా రోజుల తరువాత మ్యాచ్ ఆడిందని అందుకే ఇలా జరిగిందని అన్నారు. అంతే కానీ సెలైవా ఎఫెక్ట్ అంతలా ఉండదని అభిప్రాయపడ్డాడు. చదవండి: ఆ విషయంపై స్పష్టత లేదు: భువనేశ్వర్ కుమార్ -
చెమట పట్టకపోతే ఏం చేస్తారు?
ముంబై: కరోనా ప్రమాదం నేపథ్యంలో సలైవా (ఉమ్మి) వాడకుండా ఐసీసీ నిషేధిం చడాన్ని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశ్నించాడు. ఉమ్మికి బదులుగా చెమటను వాడవచ్చంటూ వస్తున్న సూచనలపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్‌లీతో జరిపిన ప్రత్యేక చర్చలో అతను తన అభిప్రాయాలు వెల్లడించాడు. ‘ముఖ్యంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి శీతల వాతావరణాల్లో చెమట పట్టకపోతే ఏం చేస్తారు. నేను 1992లో యార్క్‌షైర్ తరఫున ఆడినప్పుడు మే ఆరంభంలోనే బాగా చలి వేసింది. దాంతో ఒకదానిపై మరొకటి ఐదు పొరల దుస్తులు వేసుకోవాల్సి వచ్చింది. నాకున్న అనుభవాన్ని బట్టి చూస్తే బంతి కొత్తగా ఉన్నప్పుడే ఉమ్మిని వాడతాం. బంతిని రివర్స్ స్వింగ్ చేసేందుకు చెమటను వాడటం కూడా మరో ప్రత్యామ్నాయం. అయితే ఇప్పుడు సలైవా వద్దంటే బౌలర్లు ఒక అవకాశం కోల్పోయినట్లే. అయినా ఉమ్మి వాడటం అనారోగ్యకారణమైతే చెమట మాత్రం అంతకంటే మెరుగైనది ఎలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు’ అని సచిన్ ప్రశ్నించాడు. తాజా పరిస్థితుల్లో బౌలర్లకు కూడా ప్రయోజనం ఉండాలంటే రెండో కొత్త బంతిని 50–55 ఓవర్లకే తీసుకురావాలని సచిన్ సూచించాడు. ‘ఒక్కసారి పిచ్ సాధారణంగా మారిపోతే ఆటలో నాణ్యత పడిపోతుంది. తననెవరూ అవుట్ చేయలేరని బ్యాట్స్‌మన్‌కు అర్థమైపోతుంది. మళ్లీ మ్యాచ్‌లో జీవం రావాలంటే తొందరగా కొత్త బంతితో బౌలర్‌కు అవకాశం ఇవ్వాలి’ అని సచిన్ అభిప్రాయపడ్డాడు. -
ఆరు బంతుల్ని ఒకే ప్లేస్‌లో వేసినా..
మెల్బోర్న్: ప్రపంచ క్రికెట్లో షోయబ్ అక్తర్, బ్రెట్ లీలది ప్రత్యేక స్థానం. తమ శకంలో వీరిద్దరూ ఫాస్టెస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను హడలెత్తించిన సందర్భాలు అనేకం. అప్పట్లో సచిన్-బ్రెట్ లీ మధ్య పోరు, సచిన్-అక్తర్‌ల మధ్య పోటీ అనేది ఎక్కువగా ఉండేది. ఈ ఇద్దరిలో బ్రెట్ లీ కాస్త భిన్నం. బంతిని వేయడానికి రనప్‌ను తక్కువ తీసుకున్నా వేగంలో మాత్రం మార్పు ఉండేది కాదు. 1999లో భారత్‌పై అరంగేట్రం చేసిన బ్రెట్ లీ.. అనతికాలంలోనే ఆసీస్ జట్టులో ప్రధాన బౌలర్‌గా మారిపోయాడు. కచ్చితమైన పరుగుతో అత్యంత వేగంగా బంతుల్ని సంధించడంలో దిట్ట బ్రెట్ లీ. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, రాహుల్ ద్రవిడ్, బ్రియాన్ లారా, జాక్వస్ కల్లిస్, కుమార సంగక్కరా, ఇంజమాముల్ హక్, పీటర్సన్ వంటి దిగ్గజ క్రికెటర్లుకు బౌలింగ్ చేసినా, తన క్రికెట్ కెరీర్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్లు ముగ్గురే ఉన్నారంటున్నాడు బ్రెట్ లీ. వారిలో తొలి స్థానం సచిన్‌కు ఇవ్వగా, రెండో స్థానాన్ని విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాది కాగా, ఇక మూడో స్థానం దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వస్ కల్లిస్‌ది. వీరినే తాను ఎందుకు ఎంపిక చేసుకున్నాననే దానిపై బ్రెట్ లీ వివరణ ఇచ్చాడు.(‘అందులో ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ భేష్’) సచిన్‌లా ఎవరూ బ్యాటింగ్ చేయలేరు ‘సచిన్ తరహాలో ఎవరూ బ్యాటింగ్ చేయడం నేను చూడలేదు. ఎక్స్ట్రా టైమ్ తీసుకుని షాట్లు ఆడుతుంటాడు. క్రీజ్‌లో వచ్చాక నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాడు. క్రీజ్‌లో కుదురుకున్నాడంటే ఈజీగా షాట్లు కొడతాడు. వరల్డ్‌లో సచినే అత్యుత్తమ బ్యాట్స్‌మన్’ అని లీ తెలిపాడు. ఆరు బంతుల్ని ఒకే ప్లేస్‌లో వేసినా.. ఇక లారా గురించి మాట్లాడుతూ.. ‘ లారా ఒక విభిన్నమైన లెఫ్ట్ హ్యాండర్. లారా హిట్టింగ్ బాగుంటుంది. ముఖ్యంగా సిక్స్‌లు కొట్టడంలో లారా దిట్ట. ఒక బౌలర్ ఆరు బంతుల్ని ఒకే ప్లేస్‌లో సంధించినా వేర్వేరు డైరెక్షన్లో సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం అతని సొంతం. అతను క్రికెట్ ఆడే కాలంలో చూపరులను ఇట్టే ఆకట్టుకునే వాడు’ అని తెలిపాడు. కల్లిస్ కంప్లీట్ క్రికెటర్ ‘జాక్వస్ కల్లిస్ కంప్లీట్ క్రికెటర్. బ్యాట్స్‌మన్‌గా ఎంతలా రాణిస్తాడో, బౌలర్‌గా అదే స్థాయిలో రాణించే ఆటగాడు కల్లిస్. అవసరమైతే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా దిగగలడు, ఓపెనింగ్ ఓవర్‌ను కూడా వేయగలడు. ఫీల్డర్‌గా కూడా కల్లిస్‌ది ప్రత్యేక స్థానం. స్లిప్‌లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్న చరిత్ర కల్లిస్‌ది. నేను చూసిన అత్యుత్తమ క్రికెటర్ కల్లిస్. సచిన్ తాను చూసిన బెస్ట్ బ్యాట్స్‌మన్ అయితే కల్లిస్ బెస్ట్ క్రికెటర్’ అని బ్రెట్‌లీ పేర్కొన్నాడు. -
ఎటు నుంచి చూసినా బౌలర్లకే కష్టం
మెల్బోర్న్ : లాక్డౌన్ తర్వాత క్రికెట్ టోర్నీ ఆరంభమైతే బౌలర్లు తిరిగి ఫామ్‌ను అందుకోవడం కొంచెం కష్టమేనంటూ ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ పేర్కొన్నాడు. స్టార్‌స్పోర్ట్స్ నిర్వహించిన ఇంటర్య్వూలో పాల్గొన్న బ్రెట్ లీ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. లాక్డౌన్ తర్వాత లయను అందుకోవడంలో బ్యాట్స్‌మెన్ లేక బౌలర్లో ఎవరు ఎక్కువ ఇబ్బందికి గురవుతారని బ్రెట్ లీని ప్రశ్నించారు. దీనికి లీ స్పందిస్తూ..' కరోనా నేపథ్యంలో దాదాపు రెండు నెలలకు పైగా ఆటకు విరామం దొరికడంతో ప్రతీ ఆటగాడు ఇంటికే పరిమితమయ్యాడు. లాక్డౌన్ సమయంలో క్రికెటర్లు మొదలుకొని అథ్లెట్లు, ఇతర క్రీడలకు సంబంధించిన ఆటగాళ్లు ఇంట్లోనే ఉన్న గార్డెనింగ్ ఏరియాలు, ఇతర వనరులను వినియోగించుకొని తమ ప్రాక్టీస్‌ను మెరుగుపరుచుకుంటున్నారు. అదే క్రికెట్లో మాత్రం లాక్డౌన్ అనేది బ్యాట్స్మన్లు, బౌలర్లకు కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. ఒక బౌలర్ తన పూర్తిస్థాయి ఫామ్‌ను అందుకోవడానికి 6 నుంచి 8 వారాలు కచ్చితంగా పడుతుందని చెప్పొచ్చు. ఒక వన్డే మ్యాచ్ లేక టెస్టు మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ రిథమ్‌ను అందుకునేందుకు రెండు లేక మూడు మ్యాచ్‌లు చాలు.. కానీ బౌలర్‌కు అలా కాదు.. లయను అందుకోవాలంటే కచ్చితంగా 6 నుంచి 8 వారాల సమయం పడుతోంది. అందుకే నా దృష్టిలో ఒకవేళ ఆట ప్రారంభం తర్వాత బౌలర్‌కే కష్టం అని కచ్చితంగా చెప్తానంటూ' పేర్కొన్నాడు.('అందుకే నిన్ను మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు') బ్రెట్ లీ ఆసీస్ తరపున 76 టెస్టుల్లో 310, 221 వన్డేల్లో 380, 25 టెస్టుల్లో 28 వికెట్లు తీశాడు. కాగా సోమవారం విండీస్ ఆటగాళ్లలో కెప్టెన్ జాసన్ హోల్డర్ సహా కీమర్ రోచ్, షేన్ డౌరిచ్, షాయ్ హోప్‌లు కింగ్స్టన్ ఓవల్‌లోని బార్బడోస్ మైదానంలో తమ ప్రాక్టీస్‌ను కొనసాగించారు. అయితే ఇండియాలో కూడా ఆటగాళ్లు ఖాళీ మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో తమ ప్రాక్టీస్ చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది. -
'ఇద్దరూ గొప్పే.. కానీ స్మిత్‌కే నా ఓటు'
సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన దృష్టిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కంటే ఎక్కువ రేటింగ్ ఇస్తానంటూ ఆసీస్ మాజీ ఆటగాడు బ్రెట్ లీ స్పష్టం చేశాడు. జింబాబ్వే పేసర్ పోమ్మీ మబాంగ్వాతో జరిగిన ఇన్‌స్టా లైవ్ చాట్‌లో పాల్గొన్న బ్రెట్ లీ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ' చూడండి.. స్మిత్, కోహ్లిలలో ఎవరు ఉత్తమం అనేది చెప్పడం కొంచెం కష్టమే.. ఎందుకంటే వారిద్దరి ఆటతీరులో లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయి. బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ ఇద్దరిలో ఎవైనా లోపాలు ఉన్నాయోమోనని చూడడానికి ప్రయత్నిస్తా.. కానీ ఈ ఇద్దరు బ్యాటింగ్‌లో నిజాయితీగా ఉంటారు. కోహ్లి టెక్నికల్ అంశంలో ఏ ఇబ్బంది ఉండదు. కెరీర్ మొదట్లో దూకుడైన ఆటతీరును కనబరిచేవాడు.. ఇప్పుడు మాత్రం అది కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే కెప్టెన్‌గా మాత్రం ఒక ఉన్నతస్థానంలో ఉంటాడు.. ఐపీఎల్ టైటిల్‌ను గెలవాలనే ఆకాంక్ష అతనిలో బలంగా ఉందని నేను అనుకుంటున్నా.(సోనూసూద్.. నువ్వు రియల్ హీరో’) ఇక స్మిత్ విషయానికి వస్తే కొన్ని సంవత్సరాల నుంచి అతని ఆటతీరు చూస్తున్నా.. కానీ గత 12 నెలల్లో అతని ఆటతీరులో ఎంతో మార్పు వచ్చింది. ఆటలో కచ్చితత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు గొప్ప ఆటగాళ్లే.. అయినా ఈ సమయంలో మాత్రం నేను కోహ్లిని కాదని స్టీవ్ స్మిత్‌నే ఎన్నుకుంటాను. ఇంకా చెప్పాలంటే డాన్ బ్రాడ్‌మన్ కంటే స్మిత్ మంచి ఆటగాడిగా కనిపిస్తాడని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుందంటూ' బ్రెట్ లీ పేర్కొన్నాడు. (‘రవి భాయ్.. బిర్యానీ పంపించా తీసుకోండి’) -
ఐసీసీ.. ఇది ఎలా సాధ్యం?
కేప్‌టౌన్: ఏ ఒక్కరూ బంతిపై సలైవా(లాలాజలాన్ని)ను రుద్దు కూడదనే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మార్గదర్శకాలపై మళ్లీ ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఈ ప్రతిపాదన తర్వాత పలువురు క్రికెటర్లు దీన్ని తప్పుపట్టగా, దాన్ని పాటించాలనే కచ్చితమైన గైడ్‌లైన్స్ తర్వాత కూడా అదే తరహా నిరసన వ్యక్తమవుతుంది. ఈ నిబంధనను ప్రవేశ పెట్టినంత సులువుగా అమలు చేయడం సాధ్యపడదని ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ స్పష్టం చేశాడు. ఈ విషయంలో రాత్రికే రాత్రే ఇందులో మార్పులు ఆశించడం తగదన్నాడు ఎప్పుట్నుంచో అలవాటుగా వస్తున్న దీన్ని ఆకస్మికంగా నిషేధం విధించడం చెప్పినంత తేలిక కాదనే విషయాన్ని ఐసీసీ తెలుసుకోవాలన్నాడు. మనం బంతిని పట్టుకున్న వెంటనే వేళ్లను నోటితో తడిచేసుకుని రుద్దడం ఎప్పుట్నుంచో వస్తుందని, దీన్ని వదిలేయాలంటే క్రికెటర్లు కత్తిమీద సాము చేసినట్లేనన్నాడు. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు) ఇక డుప్లెసిస్ మాట్లాడుతూ.. ఒక బౌలర్ల విషయంలోనే కాకుండా, ఫీల్డర్లు కూడా దీన్ని అనుసరిస్తూ వస్తున్నారన్నాడు. తాను బంతిని స్లిప్‌లో అందుకున్న వెంటనే నోటితో వేళ్లను తడిచేసుకుని రుద్దుతూ ఉంటానన్నాడు. అది తనకు అలవాటుగా మారిపోయిందన్నాడు. గతంలో రికీ పాంటింగ్ కూడా ఇలానే చేసేవాడనే విషయాన్ని ప్రస్తావించాడు. అది అనుకోకుండా జరిగిపోయే చర్య అని, దీన్ని ఒక్కసారిగా వదిలేయాలంటే ఈజీ కాదన్నాడు. కాగా, కరోనా వైరస్ సంక్షోభంతో భౌతిక దూరం అనే నిబంధనను మనం ఇప్పుడు చూస్తున్నాం. దాంతోపాటు పెద్ద ఎత్తున మాస్క్‌లు ధరించడం కూడా నిబంధనల్లో భాగమైపోయింది. కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి నోటి ద్వారానే ఎక్కువ శాతం సోకే అవకాశం ఉండటంతో ఐసీసీ కీలక మార్పులు తీసుకొచ్చింది. క్రికెట్ గేమ్‌లో భాగమై పోయిన బంతిపై సలైవా రుద్దడాన్ని ఉన్నపళంగా నిలిపివేసింది. దాంతో క్రికెటర్లకు ఇది పెద్ద సవాల్‌గా మారిపోయింది. (నలుగురు టీమిండియా క్రికెటర్లు.. కానీ కోహ్లి లేడు) -
రోహిత్ బ్యాట్ సౌండ్.. నాకు తొలి జ్ఞాపకం!
న్యూఢిల్లీ: తన కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్లలో ఆసీస్ స్పీడ్ స్టార్ బ్రెట్ లీ ఒకడని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ స్పష్టం చేయగా.. రోహిత్‌తో తనకు ఎదురైన తొలి జ్ఞాపకాన్ని బ్రెట్ లీ గుర్తు చేసుకున్నాడు. అదే సమయంలో రోహిత్ లాంటి హార్డ్ హిట్టర్‌కు బౌలింగ్ చేయడానికి ఇష్టపడనని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు. ‘రోహిత్ చాలా దూకుడైన క్రికెటర్. ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకున్నాడంటే ఆపడం కష్టం. ఆరంభం నుంచి ఉతకడం ఆరంభిస్తాడు. రోహిత్ తరహా క్రికెటర్లకు నేను ఎప్పుడూ బౌలింగ్ చేయాలని అనుకోను. నాకు రోహిత్‌తో ఒక మంచి జ్ఞాపకం ఉంది. అది రోహిత్‌తో నా తొలి మెమొరీ అనే చెబుతా. నా బౌలింగ్‌లో రోహిత్ షాట్ ఆడగా బ్యాట్ నుంచి వచ్చిన సౌండ్ అదిరిపోయింది. ఆ సౌండ్ చాలా డిఫరెంట్‌గా ఉంది. అది నాకు ఇప్పటికీ జ్ఞాపకమే’ అని బ్రెట్‌లీ తెలిపాడు. (అతని రీఎంట్రీ ఖాయం.. బెట్ వేస్తా: రాయుడు) అంతకుముందు బ్రెట్ లీ గురించి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను బ్రెట్ లీ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి నిద్రలేని రాత్రులు గడిపేవాడినని పేర్కొన్నాడు. ప్రధానంగా తన అరంగేట్రం ఏడాది(2007) ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు బ్రెట్ లీ వేగం చూసి బెదిరిపోయానని రోహిత్ తెలిపాడు. బ్రెట్ నుంచి 150కి.మీ వేగంతో వచ్చే బంతుల్ని ఎలా ఆడాలి అనే విషయంలో చాలా సందిగ్థతకు లోనయ్యేవాడినని రోహిత్ పేర్కొన్నాడు. అదే సమయంలో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ బౌలింగ్‌ను పేస్ చేయడం కూడా ఆందోళనకు గురి చేసేదన్నాడు. స్టెయిన్ వేసే ఇన్స్వింగర్లు, ఔట్ స్వింగర్లు, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులు ఆడటం చాలా కష్టంగా అనిపించేదన్నాడు. తన ఫేవరెట్ బౌలర్ల విషయానికొస్తే ఆసీస్ పేసర్ హజల్‌వుడ్, దక్షిణాఫ్రికా పేసర్ రబడాలే ముందు వరుసలో ఉంటారన్నాడు. -
రోహిత్‌ను ఇబ్బంది పెట్టింది వీరే..
ముంబై: భారత క్రికెట్ జట్టులో ఓపెనర్‌గా చెరగని ముద్ర వేసిన రోహిత్ శర్మ తన కెరీర్లో అత్యంత ఇబ్బంది పడ్డ క్షణాలను గుర్తు చేసుకున్నాడు. గతంలో పేస్ బౌలింగ్ ఆడటంలో కొద్దిపాటి ఇబ్బందులకు గురైన రోహిత్ శర్మ.. ఆ విభాగంలో ఇద్దరు బౌలర్లు మాత్రం తనకు అత్యంత పరీక్షగా నిలిచారన్నాడు. ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషనల్లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీతో చాట్ చేసిన చేసిన రోహిత్.. ఫేవరెట్ బౌలర్లు ఎవరనే దానికి సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఉన్న బౌలర్లలో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడా, ఆస్ట్రేలియా పేసర్ హజిల్వుడ్లే తన ఫేవరెట్ బౌలర్లన్నాడు. అదే సమయంలో తనను ఎక్కువ ఇబ్బందికి గురి చేసిన బౌలర్లలో డేల్ స్టెయిన్, బ్రెట్ లీలు ముందు వరుసలో ఉన్నారన్నాడు. ఈ ఇద్దరి బౌలింగ్‌లోనే తాను అత్యంత ఇబ్బంది పడినట్లు రోహిత్ చెప్పుకొచ్చాడు. (‘కుంబ్లే కోసం నా జీవితాన్ని ఇస్తా’) ‘నా వన్డే సిరీస్ అరంగేట్రంలో భాగంగా దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం ఐర్లాండ్ వెళ్లాను. అక్కడ స్టెయిన్‌ను ఎదుర్కోలేక చాలా ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత బ్రెట్ లీ బౌలింగ్ కష్టంగా అనిపించేది’ అని రోహిత్ తెలిపాడు. 2007లో ఐర్లాండ్‌లో జరిగిన ట్రై సిరీస్ ద్వారా రోహిత్ అరంగేట్రం చేశాడు. తన కెరీర్ ఆరంభంలో జట్టులో చోటు కోసం తీవ్ర ఇబ్బందులు పడిన రోహిత్.. ఆపై రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. ఓపెనర్‌గా రోహిత్ బ్యాట్ పట్టుకున్న దగ్గర్నుంచీ అతని కెరీర్ గ్రాఫ్ దూసుకుపోయింది. వన్డే ఫార్మాట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా నిలిచిన రోహిత్‌కు ఈ ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 264గా ఉంది. గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ 81.00 సగటుతో 648 పరుగులు సాధించి టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ 224 వన్డేలు, 108 వన్డేలు, 32 టెస్టులు ఆడిన రోహిత్ అన్ని ఫార్మాట్లలో కలిపి 14,029 పరుగులు సాధించాడు. ('రోహిత్ ఎదగడానికి ధోనియే కారణం') -
అలా ముంబైలో కుదరదు బ్రదర్
ముంబై: కరోనా వైరస్ కారణంగా క్రికెట్ ఈవెంట్లకు బ్రేక్ పడటంతో అది క్రికెటర్లకు కాస్త నిరాశగానే ఉంది. ఎప్పుడు స్టేడియంలోకి వెళ్లి బ్యాట్, బంతి పట్టుకుందామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఎదురు చూసేవాళ్లలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఒకడు. అటు బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు ఆటంకం ఏర్పడటంతో పాటు ఫిట్నెస్ను కాపాడుకోవడానికి జిమ్‌లు కూడా ఇంకా ఓపెన్ కాకపోవడంతో రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడు. ప్రస్తుతం ముంబై మహానగరంలో తాను ఉండే అపార్ట్మెంట్లో క్రికెట్ ఆడటానికి పెద్దగా చోటు లేకపోవడమే ఇందుకు కారణం. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీకి స్పష్టం చేశాడు రోహిత్. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన క్రికెట్ కనెక్టడ్ షోలో బ్రెట్ లీతో మాట్లాడిన రోహిత్.. ముంబై ఎంత ఖరీదైన నగరమో వివరించాడు. (వేలానికి రికార్డు చేజింగ్ బ్యాట్..) ‘బ్రదర్ ముంబైలో ప్రతీకి కాస్ట్లీనే. ఇక విలాసవంతమైన ఇళ్లు కొనాలంటే మామూలు విషయం కాదు. ఇండోర్‌తో కూడిన ఇళ్లను తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాంతో ఇంటి పేరటిలో ప్రాక్టీస్ అనేది మాకు ఉండదు. ఈ విషయంలో మేము చాలా దురదృష్టవంతులం. మనం కొనాలనుకున్నా అది చాలా కష్టం. నేను క్రికెట్ ఆడటానికి ఇంటి వద్ద తగినంత స్థలం ఉండాలనే కోరుకున్నా. కానీ అది సాధ్యపడలేదు. నేను ఉండే ఇంటి స్థలం చాలా పరిమితంగానే ఉంటుంది. నీ అపార్ట్మెంట్లో నువ్వు ఉండాల్సిందే. మీలాగా క్రికెట్ ఆడటానికి ఇంటి ఆవరణలో ప్లేస్ అనేది ఉండదు కాకపోతే చిన్న బాల్కనీ ఉండటంతో ఎంతో కొంతో అది లక్కీ అనే చెప్పాలి. కొన్ని రోజువారీ దినచర్యలు(జిమ్ లాంటివి) చేసుకోవడానికి వీలవుతుంది. అంతే తప్ప భారీ షాట్లు ఆడే స్థలం లేదు. బంతిని హిట్ చేయడాన్ని మాత్రం మిస్సవుతున్నాను. ఎప్పుడెప్పుడు బయటకెళ్లి క్రికెట్ బ్యాట్‌తో మళ్లీ ప్రాక్టీస్ షురూ చేస్తానా అని ఆశగా చూస్తున్నా’ అని రోహిత్ తెలిపాడు. (ఆసీస్ క్రికెటర్లు.. ఇవి పాటించాల్సిందే!) -
సైమండ్స్‌కు బ్రెట్‌లీ గుండు గీసిన వేళ..!
దుబాయ్: కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ వేళ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ యాక్టివిటీల్లో బిజీగా ఉంటుంది. పాత, కొత్త జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అభిమానులకు వినోదాన్ని పంచుతూ ముందుకు సాగుతోంది. తాజాగా ఐసీసీ తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఒక పాత ఫోటో మరింత ఎంటర్టైన్మెంట్ను తీసుకొచ్చింది. ఆసీస్ మాజీ క్రికెటర్లు ఆండ్రూ సైమండ్స్-బ్రెట్ లీ ఫొటోను షేర్ చేసింది. ఆండ్రూ సైమండ్స్‌కు బ్రెట్ లీ నున్నగా గుండు గీస్తున్న ఫోటోను పోస్ట్ చేనింది. ‘హెయిర్ అప్రిసియేషన్ డే’ను పురస్కరించుకుని ఈ ఫోటోను ఐసీసీ సోషల్ మీడియా పెట్టింది. క్రికెట్ కెరీర్లో ఎప్పుడూ విన్నూత్నంగా కనబడే సైమండ్స్ రకరకాల హెయిర్ స్టైల్స్‌తో అలరించేవాడు. ఈ క్రమంలోనే సైమండ్స్ తలపై ట్రిమ్మర్‌తో బ్రెట్ లీ గుండు గీసిన ఒకనాటి జ్ఞాపకాన్ని మళ్లీ గుర్తు చేసింది ఐసీసీ. (గేల్.. ఇక నీ కామెంట్స్ చాలు..!) ‘హ్యాపీ హెయిర్ అప్రిసియేషన్ డే.. ఐసోలేషన్‌లో ఉన్న మీకు ఎవరు హెయిర్ స్టైల్ చేస్తున్నారు’ అని క్యాప్షన్ కూడా జత చేసింది. 1998లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన సైమండ్స్.. 198 వన్డేలు ఆడాడు. వైట్ బాల్ క్రికెట్లో అటు బ్యాట్‌తో,ఇటు బంతితో రాణించిన సైమండ్స్ తనదైన ముద్ర వేశాడు. వన్డేల్లో 5,008 పరుగులు, 133 వికెట్లు సాధించాడు సైమండ్స్. ఇక 26 టెస్టు మ్యాచ్‌లు, 14 అంతర్జాతీయ టీ20లను సైమండ్స్ ఆడాడు. మరొకవైపు ఆసీస్ స్పీడ్ స్టార్‌గా పేరు గాంచిన బ్రెట్ లీ తన కెరీర్లో 221 వన్డే మ్యాచ్‌లు ఆడి 380 వికెట్లు సాధించాడు. ఇక 76 టెస్టుల్లో 310 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ తరఫున 25 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బ్రెట్ లీ 28 వికెట్లను తీశాడు. 2012లో ఆసీస్ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు బ్రెట్ లీ.(రాస్ టేలర్‌కు ‘టాప్’ అవార్డు) View this post on Instagram Happy #HairstyleAppreciationDay 💇♀️ Who is styling your hair during isolation? A post shared by ICC (@icc) on Apr 30, 2020 at 12:45am PDT -
ఆ జాబితాలో ఇండియా ఆటగాళ్లు ఒక్కరు లేరు
జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా వెటరన్ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ తాను ఎదుర్కొన్న ఆటగాళ్లు, తనతో కలిసి ఆడిన 11 మంది అత్యుత్తమ ఆటగాళ్లను ప్రకటించాడు. ఈ 11మంది ఆటగాళ్లలో ఇద్దరు విదేశీయులు తప్ప మిగతావారంతా ప్రొటీస్ జట్టుకు ఆడినవారే కావడం గమనార్హం. ఇందులో టీమిండియా నుంచి ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమి స్మిత్, శ్రీలంక మాజీ వికెట్‌కీపర్ కుమార సంగక్కరలు ఓపెనర్లుగా, ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరుపొందిన మాజీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్ నాలుగో స్థానంలో, వరల్డ్ బెస్ట్ ఫీల్డర్‌గా గుర్తుంపుపొందిన జాంటీ రోడ్స్ ఐదో స్థానంలో ఉన్నారు. 6వ స్థానంలో దక్షిణాఫ్రికా ప్రస్తుత వన్డే వికెట్ కీపర్‌గా ఉన్న క్వింటన్ డికాక్‌ను ఎంపిక చేశాడు. బౌలర్ల జాబితాలో ఆసీస్ నుంచి మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ చోటు సంపాధించగా మిగతావారంతా దక్షిణాఫ్రికాకు చెందిన బౌలర్లే ఉన్నారు. వీరిలో దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ అలెన్ డొనాల్డ్ కూడా ఉన్నాడు. స్టెయిన్ అత్యుత్తమ జట్టు : గ్రేమి స్మిత్, కుమార సంగక్కర, డేవ్ హాకిన్, జాక్ కలిస్, జాంటీ రోడ్స్, క్వింటన్ డికాక్, బ్రెట్ బార్గియాచి, పీటర్ లాంబార్డ్, బ్రెట్ లీ, పాల్ హరిస్, అలెన్ డొనాల్డ్ -
సచిన్ రికార్డుల్ని కోహ్లి సవరిస్తాడు: బ్రెట్ లీ
ముంబై: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరి కొన్నేళ్లలో అందుకుంటాడని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ అభిప్రాయపడ్డాడు. సచిన్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును కోహ్లి మరో ఏడెనిమిదేళ్లలో సవరిస్తాడని పేర్కొన్నాడు. తన నైపుణ్యం, ఫిట్నెస్, మానసిక బలంతో కోహ్లి ఏ రికార్డులైనా అందుకుంటాడని బ్రెట్ లీ అన్నాడు. ‘బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నైపుణ్యం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక ఫిట్‌నెస్‌లో అతనికి తిరుగు లేదు. ఇక మానసిక బలంతో కఠిన మ్యాచ్‌ల్లోనూ రాణిస్తున్నాడు. అందుకే మరో ఏడెనిమిదేళ్లలో సచిన్ పేరిట ఉన్న రికార్డులను కోహ్లి బద్దలు కొడతాడు’ అని లీ పేర్కొన్నాడు. వన్డేల్లో సచిన్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా... ప్రస్తుతం విరాట్ 248 మ్యాచ్‌ల్లో 43 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో ‘మాస్టర్’ 51 సెంచరీలు చేయగా... కోహ్లి 86 మ్యాచ్‌ల్లో 27 సెంచరీలు బాదాడు. సచిన్ ఓవరాల్ సెంచరీల రికార్డుకు కోహ్లి ఇంకా 30 సెంచరీల దూరంలో ఉన్నాడు. -
'బ్రెట్ లీ బ్యాటింగ్ అంటే భయపడేవాడు'
బ్రెట్ లీ, షోయబ్ అక్తర్.. ఈ ఇద్దరు బౌలర్లు వారి జనరేషన్లో ఎవరికి వారే సాటి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే ప్రత్యేకత వీరికి మాత్రమే ఉండేది. అయితే ఒక బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం బ్రెట్‌లీ ప్రతీ బౌలర్‌కు భయపడేవాడని అక్తర్ పేర్కొన్నాడు. అందుకు ఉదాహరణగా.. బ్రెట్‌లీ పాల్గొన్న ఇండియన్ టెలివిజన్ షో వీడియో ఒకటి తన ట్విటర్లో షేర్ చేశాడు. బ్రెట్ లీ ఆ షోలో తన అనుభవాలను మొత్తం వివరించాడు. అందులోనూ షోయబ్ అక్తర్ బౌలింగ్‌ను ఏ విధంగా ఎదుర్కొన్నాడనేది చెప్పుకొచ్చాడు. ('నాపై ఒత్తిడి తెచ్చుంటే అక్రమ్‌ను చంపేవాడిని') 'నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ప్రతీ ఒక్క బౌలర్‌కు భయపడేవాడిని.. ముఖ్యంగా స్పిన్నర్లకు కూడా. ఇక షోయబ్ అక్తర్ బౌలింగ్‌కు కూడా భయపడేవాడిని. అతడు బౌలింగ్ చేస్తుంటే నన్ను చంపడానికే బౌలింగ్ వేస్తున్నాడేమోనని అనిపించేది. నా ముద్దు పేరు బింగా.. ఒకసారి నేను బ్యాటింగ్ చేస్తుంటే బింగా.. బింగా.. అంటూ అరుస్తున్న శబ్ధం వినపడింది. తల ఎత్తి చూస్తే 75 మీటరల్ దూరంలో అక్తర్ ఉన్నాడు. అతని తీరు చూస్తే నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నా అన్నట్లుగా కనపడింది. షోయబ్ నా తలను టార్గెట్ చేసి బౌలింగ్ వేస్తాడేమో అనుకున్నా.. కానీ ఆ బాల్ నా టోస్ను తాక్కుంటూ వెళ్లింది. అంతే నేను అది ఔటేమోనని భావించి అంపైర్ వైపు చూశా.. అది కచ్చితంగా ఔటేనని.. కానీ మా ఆస్ట్రేలియన్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడని' బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు. ('స్వీట్హార్ట్.. డిన్నర్ ఎక్కడ చేద్దాం') ఈ ఒక్క వీడియో చాలు.. బ్రెట్ లీ తన మాటల పట్ల ఎంత నిజాయితీగా ఉంటాడో చెప్పడానికి.. 'మా జనరేషన్లో బ్రెట్‌లీ ఒక బ్యాట్స్‌మెన్‌గా ఎంత భయపడ్డాడనేది స్పష్టంగా కనిపిస్తుందంటూ ' అక్తర్ పేర్కొన్నాడు. ఆసీస్ తరపున 76 టెస్టుల్లో 310 వికెట్లు, 221 వన్డేల్లో 380 వికెట్లు తీశాడు. ఇక షోయబ్ అక్తర్ పాక్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు పడగొట్టాడు. Binga being very humble there honestly. @BrettLee_58 himself was quite a terror on the field for the batsmen of that era. #BrettLee #ExpressFast #Australia pic.twitter.com/pzHTg41qMF — Shoaib Akhtar (@shoaib100mph) April 20, 2020 -
షఫాలీని అలా చూడటం కష్టమైంది: బ్రెట్ లీ
మెల్బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు చివరి మెట్టుపై బోల్తా పడింది. లీగ్ దశలో అప్రతిహతవిజయాలతో దూసుకపోయిన హర్మన్ సేన.. ఫైనల్ పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది. లీగ్ దశలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత జట్టు.. టైటిల్ పోరులో అట్టర్ ఫ్లాఫ్ షోతో నిరుత్సాహపరిచింది. ముఖ్యంగా లీగ్ దశలో బ్యాటింగ్ భారాన్ని మోసిన యువ సంచలనం షఫాలీ వర్మ తుది పోరులో చేతులెత్తేసింది. ఈ క్రమంలో తను ఔటైన తర్వాత, ఓటమి తర్వాత షఫాలీ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే సారథి హర్మన్‌ప్రీత్ కౌర్, సహచర క్రికెటర్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ వెక్కివెక్కి ఏడ్వసాగింది. (మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ) ఇది సహచర క్రీడాకారిణులతో పాటు ప్రపంచ క్రికెట్‌ను కూడా కదిలించింది. దీనిపై ఆసీస్ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ.. ఐసీసీకి రాసిన తన కాలమ్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘ షఫాలీ ఏడ్వడం నాకు బాధనిపించింది. మ్యాచ్ ముగిసిపోయాక ఆమె కన్నీట పర్యంతం కావడం నాకు చాలా కష్టంగా అనిపింది. కానీ గర్వించదగ్గ క్రికెటర్. ఆస్ట్రేలియాలో ఆమె ప్రదర్శన అద్భుతంగా సాగింది. తొలి టోర్నమెంట్ ఆడటానికి ఇక్కడకు వచ్చిన షఫాలీ తన టాలెంట్‌తో ఆకట్టుకున్నారు. మానసికంగా ఆమె చాలా ధృఢంగా అనిపించారు. ఇక్కడ నుంచి ఆమె మరింత పరిణితి సాధిస్తుందని అనుకుంటున్నా. ఈ టోర్నమెంట్లో సాధించిన అనుభవంతో ఆమె మరింత రాటుదేలడం ఖాయం. ఆస్ట్రేలియాలో ఆడే తదుపరి టోర్నీల్లో ఆమె చేసే భారీ స్కోర్లు ఎవ్వర్నీ ఆశ్చర్యపరచకపోవచ్చు. సానుకూల ధోరణితో ముందుకు సాగుతుందనే అనుకుంటున్నా. ఇది భారత్ మహిళలకు తీవ్ర నిరాశను మిగిల్చిన రాత్రి. కానీ వారు మరింత ఆశావాహ ధృక్పథంతో రాటుదేలతారు. దీంతో వారు క్రికెట్ ఏమీ ముగిసిపోలేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అనుకోండి’ అని బ్రెట్ లీ రాసుకొచ్చాడు. (ఐసీసీ అత్యుత్తమ వరల్డ్‌కప్ జట్టు ఇదే..) -
‘హర్మన్, మంధాన ఉన్నారు.. కాబట్టి’
సిడ్నీ: మహిళా క్రికెట్లో ఆస్ట్రేలియా- ఇండియా జట్లు అత్యుత్తమమైనవని.. వుమెన్ క్రికెట్‌ను ఉన్నతస్థాయికి తీసుకువెళ్లగల సత్తా ఇరుజట్లకు ఉందని ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. మహిళల టీ20 ప్రపంచకప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 17 రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌కు ఆస్ట్రేలియా వేదిక కానుంది. టైటిల్ వేట కోసం ఇప్పటికే 10 జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ అధికారిక వెబ్సైట్లో ఈ టోర్నమెంట్ గురించి బ్రెట్ లీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆసీస్- భారత వంటి మేటి జట్ల మధ్య సిడ్నీలో జరిగే తొలి మ్యాచ్‌తో మెగా ఈవెంట్ ప్రారంభం కానుందని బ్రెట్ లీ పేర్కొన్నాడు.(భారత్‌ను గెలిపించిన పూనమ్ ) ‘‘ఆస్ట్రేలియాలోని క్రికెట్ మైదానాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి. ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మైదానాల్లో మహిళా క్రికెట్ వరల్డ్‌కప్ జరగడం ఎంతో బాగుంది. ముఖ్యంగా నాకెంతో ఇష్టమైన, టెస్టుల్లో అరంగేట్రం చేసిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ జరగబోతుండటం ఇంకా అద్భుతంగా ఉంది. మహిళా క్రికెటర్లు ఎదుగుతున్న తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మెగా ఈవెంట్ ఎన్నెన్నో మధురానుభూతులకు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. ఇక ఇండియా విషయానికొస్తే హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ వంటి బ్యాట్‌వుమన్లతో జట్టు దృఢంగా ఉంది. కాబట్టి భారత జట్టు ఆటతీరుపై కన్నేసి ఉంచాలి. ఎప్పటికప్పుడు వారిని గమనించాలి. ఊహించిన స్థాయిలో మహిళా క్రికెటర్లు రాణిస్తే.. వారికి ఆకాశమే సరిహద్దు అనే మాట నిజమవుతుంది’’ అని బ్రెట్ లీ రాసుకొచ్చాడు. (చదవండి : ఆల్ ద బెస్ట్ హర్మన్) కాగా, ప్రస్తుతం జరగబోయేది ఏడో మహిళా టి20 ప్రపంచకప్. ఈ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా నాలుగుసార్లు (2010, 2012, 2014, 2018) చాంపియన్‌గా నిలవగా.. ఇంగ్లండ్ (2009), వెస్టిండీస్ (2018) ఒక్కోసారి విజేతగా నిలిచాయి. గత ఆరు టి20 ప్రపంచకప్‌లలో కలిపి ఓవరాల్‌గా భారత్ మొత్తం 26మ్యాచ్‌లు ఆడింది. 13 మ్యాచ్‌ల్లో గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టుకు 10 లక్షల అమెరికన్ డాలర్లు (రూ. 7 కోట్ల 14 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. రన్నరప్ జట్టుకు 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 57 లక్షలు) అందజేస్తారు. -
ఇదొక పనికిమాలిన చర్య: బ్రెట్ లీ
బర్మింగ్‌హామ్: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా టెస్టు జెర్సీలపై ఆటగాళ్ల పేర్లూ, నంబర్లు కొనసాగిస్తున్నారు. మైదానంలో అభిమానులు ఆటగాళ్లను గుర్తించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కొత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి టెస్టు క్రికెట్లో కూడా ఆటగాళ్ల జెర్సీలపై నంబర్లు, పేర్లు కొనసాగించాలని ఐసీసీ గతేడాది నిర్ణయించింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. టెస్టు క్రికెట్లో ఆటగాళ్ల జెర్సీలపై నంబర్లూ, పేర్లు చెత్తగా ఉన్నాయంటూ ఆసీస్ దిగ్గజ ఆటగాడు గిల్‌క్రిస్ట్ ఇప్పటికే విమర్శించగా, ఇప్పుడు అతని సరసన ఆ దేశానికే చెందిన బ్రెట్ లీ చేరిపోయాడు. ఇదొక పనికిమాలిన నిర్ణయమని ధ్వజమెత్తాడు. ‘ ఐసీసీ కొత్తగా చేపట్టిన ఈ విధానాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. టెస్టు క్రికెట్లో ఆటగాళ్ల జెర్సీలపై నంబర్లూ, పేర్లు వికారంగా ఉన్నాయి. ఇది పనికిమాలిన చర్యగా కనబడుతోంది. క్రికెట్లో మార్పులు తీసుకురావడానికి ఐసీసీ చర్యలు చేపట్టడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం మాత్రం కచ్చితంగా సరైనది కాదు’ అని బ్రెట్ లీ పేర్కొన్నాడు. -
వారిద్దరూ తోలు మందం చేసుకోవాలి: బ్రెట్‌లీ
లండన్ : బాల్‌ట్యాంపరింగ్ వివాదంతో నిషేధం ఎదుర్కొని పునరాగమనం చేసిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని, కాస్త తోలు మందం చేసుకోవాలని ఆ దేశ మాజీ క్రికెటర్ బ్రెట్‌లీ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ టోర్నీలో స్లెడ్జింగ్, ప్రేక్షకులు కలిగించే ఇబ్బందులను ఎదుర్కోవడానికి అది ఉపయోగపడుతుందన్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పపడి ఏడాదిపాటు సస్పెన్షన్ గురైన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచకప్ రెండు వార్మప్ మ్యాచుల్లో స్మిత్, వార్నర్ చిక్కులు ఎదుర్కున్నారు. వార్నర్, స్మిత్ చీటర్స్ అంటూ అభిమానులు కామెంట్ చేశారు. ఈ ఇద్దరు ఆటగాళ్లే లక్ష్యంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బ్రెట్‌లీ వారికి మద్దతుగా నిలిచాడు. ‘ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లు నిరూపించుకోవాల్సిందేం లేదు. ఆస్ట్రేలియా తరఫున పునరాగమనం చేసినందుకు వారిద్దరూ సంతోషపడాలి. డెవిడ్ వార్నర్ ఐపీఎల్ అదరగొట్టడం మనమంతా చూశాం. అత్యధిక పరుగులతో ఆరేంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. స్మిత్ తొలి వార్మప్ మ్యాచ్‌లో సెంచరీతో రాణించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోకి వారిద్దరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆసీస్ విజయం సాధించడానికి స్మిత్, వార్నర్‌కు తగిన అవకాశం కల్పించారు. ముఖ్యంగా కెవిన్ పీటర్సన్ వంటి వారి స్లెడ్జింగ్ తట్టుకోవడానికి కాస్త తోలు మందం చేసుకుంటే సరిపోతుంది. ఆస్ట్రేలియా వరుసగా మ్యాచ్‌లు గెలిస్తే ఆరోసారి కూడా టైటిల్ అందుకుంటుంది. ప్రపంచకప్ గెలిచినప్పుడు కలిగే అనుభూతి ప్రపంచంలోనే చాలా గొప్పది. టైటిల్ కొట్టె సత్తా ఆసీస్ ఆటగాళ్లకు ఉంది. నేనెప్పుడు ఆసీస్‌కు వ్యతిరేకం కాదు.’ అని బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు. ఇక రేపు(శనివారం) అఫ్గానిస్తాన్‌తో ఆసీస్ తొలి మ్యాచ్ ఆడనుంది. -
ఐపీఎల్లో వారి బౌలింగ్ భేష్: బ్రెట్ లీ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో భారత యువ పేసర్లు ప్రసిధ్ కృష్ణ, నవ్‌దీప్ సైనీ బౌలింగ్ తననెంతో ఆకట్టుకుందని ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్‌లీ అన్నాడు. ఈ ఇద్దరు యువ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని ప్రశంసించాడు. ‘ఐపీఎల్లో ప్రసిధ్ కృష్ణ 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతున్నాడు. అలాంటి మరో బౌలరే నవ్‌దీప్ సైనీ. ప్రస్తుతం భారత్‌లో మంచి పేసర్లు ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా తరహా పేసర్లు బయటకు రావడం భారత క్రికెట్‌కు సానుకూల పరిణామం. ప్రస్తుతమున్న భారత బౌలర్లు మంచి వేగంతో బంతులు వేస్తుండటం సంతోషకరం’ అని బ్రెట్‌లీ అన్నాడు. మరొకవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నవ్‌దీప్ సైనీ ప్రధాన బౌలర్‌గా ఉన్నాడన్నాడు. షైనీ చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు వేగంగా బంతులు విసురుతున్నాడన్నాడు. అదే అతనికి వరల్డ్‌కప్ భారత స్టాంబ్‌బై ఆటగాళ్లలో చోటు దక్కేలా చేసిందని బ్రెట్ లీ పేర్కొన్నాడు. -
క్రికెటర్ బ్రెట్ లీ ఆర్థిక సాయంతో కొత్త జీవితం
కర్ణాటక, రాయచూరు రూరల్: పుట్టుకతోనే బధిర, మూగ అయిన చిన్నారి పాప జీవితంలో కొత్త వెలుగులు వచ్చాయి. బాలిక తల్లిదండ్రుల కష్టాలు తీరాయి. రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా జవళగేరలో నివాసం ఉంటున్న బాలనగౌడ, కవిత అనే రైతు దంపతులకు సాక్షి అనే మూడేళ్ల కూతురు ఉంది. బాలిక పుట్టుకతోనే మూగ, చెవిటి. పాప అందరిలాగే వినాలని, మాట్లాడాలని కన్నవారు చేసిన ఎన్నో ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాయచూరు ఆస్పత్రులు, మైసూరులోని మానస గంగోత్రి ఆస్పత్రిలో కూడా వైద్యం చేయించినా ఎలాంటి ఫలితం లభించలేదు. మూడేళ్ల పాటు శ్రమించారు. ఏడాది పాటు ఫిజియో థెరపీ చికిత్సలు చేయించారు. రూ. 16 లక్షలతో ఆపరేషన్ సింధనూరు అంగనవాడి కేంద్రం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిన బాల స్వస్థ పథకం ద్వారా చికిత్సకు యత్నించారు. చెవులు మాటలు, చెవులు వినపడాలంటే రూ.16 లక్షలు ఖర్చువుతాయని పేర్కొన్నారు. ఈ పథకం కింద నమోదు చే సుకోగా, చికిత్సకు ఎంపికైంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రికెటర్ బ్రెట్ లీ చి న్నారి శస్త్రచికిత్సకు ఆర్థికసాయం అందజేశారు. దీంతో బెంగళూరులోని ఒక కార్పొ రేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స ద్వారా కాంక్లియర్ ఇంప్లాంట్ తదితర ఆధునిక పరికరా లను బాలిక చెవిలో అమర్చారు. దీంతో బాలిక చక్కగా వినడంతో పాటు మా ట్లాడుతోంది.బ్రెట్‌లీకి బాలికతల్లిదండ్రులు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు. -
టీమిండియాలో వారే కీలకం
సాక్షి, స్పోర్ట్స్: యూఏఈ వేదికగా ఈ నెల 15 నుంచి ఆరంభంకానున్న ఆసియా కప్‌కు అన్ని జట్లు సమయాత్తమవుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ యూఏఈ చేరుకోగా, బంగ్లాదేశ్ ఈ టోర్నీ కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేస్తోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా కూడా సన్నాహక శిబిరాల్లో పాల్గొననుంది. అయితే టీమిండియా సారథి విరాట్ కోహ్లి విశ్రాంతితో టీమిండియా బలహీనపడిందని సీనియర్ క్రికెటర్లు వాదిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా మాజీ స్పీడస్టర్ బ్రెట్ లీ మాత్రం కోహ్లి లేకున్నా టీమిండియా ఆసియా కప్‌లో రాణించగలదని అభిప్రాయపడుతున్నాడు. రోహిత్, ధావన్‌లు కీలకం.. కోహ్లి గైర్హాజర్‌తో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బ్యాటింగ్ విభాగంలో కీలకం కానున్నారని లీ పేర్కొన్నాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ రోహిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తనదైన రోజు ఎలా ఆడతాడో అందరికి తెలుసన్నాడు. నాయకుడిగా రోహిత్ జట్టును ముందుండి నడిపించాలి కాబట్టి ఆసియా కప్‌లో అతడి నుంచి గొప్ప ఇన్నింగ్స్‌లు ఆశించవచ్చన్నాడు. లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్‌లో రోహిత్ కాస్త ఇబ్బంది పడుతున్నాడని అది పెద్ద సమస్యే కాదని వివరించాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుత ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. స్లో అండ్ లో పిచ్‌లలో ధావన్ ఇబ్బందులకు గురవుతున్నాడన్నాడని టెక్నిక్ మార్చుకుంటే సరిపోతుందన్నాడు. యూఏఈ పిచ్‌లు భారత్‌లోని విధంగా గబ్బర్ సింగ్‌కు అనుకూలంగా ఉంటాయన్నాడు. దీంతో ధావన్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు చూడోచ్చని బ్రెట్ లీ అభిప్రాయపడుతున్నాడు. -
‘అతడు టీమిండియా ఆశాకిరణం’
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పేసర్ శివం మావిపై ఆసీస్ దిగ్గజ క్రికెటర్ బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. మావిలోని సాంకేతికను, ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే అతను భవిష్యత్తులో టీమిండియాలో కీలక పాత్ర పోషిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ‘శివం మావి టీమిండియా ఆశాకిరణం కాగలడు. అతని బౌలింగ్ యాక్షన్ అసాధారణ రీతిలో ఉంది. ఒక పేసర్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ మావిలో ఉన్నాయి. క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తూ రాణిస్తున్నాడు. ఎవరైనా సక్సెస్ కావాలంటే ఎంజాయ్ చేస్తూ గేమ్‌ను ఆస్వాదించే లక్షణాలుండాలి. మావిలో ఒక అత్యుత్తమ బౌలర్ నాకు కనిపిస్తున్నాడు. నా దృష్టిలో మావి గొప్ప బౌలర్ అవుతాడు’ అని బ్రెట్ లీ పేర్కొన్నాడు. -
ఈ వేషం వేసిన దిగ్గజ క్రికెటర్ ఎవరో తెలుసా?
-
ఈ ఫేమస్ క్రికెటర్‌ను గుర్తు పట్టారా?
న్యూఢిల్లీ : ఈ ఫొటోలో ఉన్న క్రికెటర్‌ను గుర్తుపట్టారా.? ఎంటీ ఓ ముసలాయన్ను తీసుకొచ్చి ఫేమస్ క్రికెటర్ అంటారు అని చికాకు పడుతున్నారా.! నిజం అతనో దిగ్గజ క్రికెటర్. చిన్న పిల్లలతో క్రికెట్ ఆడేందుకు ఇలా తయారయ్యాడు అంతే.. మరీ అతనెవరనకుంటున్నారు.. ఆస్ట్రేలియా దిగ్గజ బౌరల్ బ్రెట్‌లీ..! నమ్మశక్యంగా లేదా.. నిజం అతను బ్రెట్లీనే.. కొన్నేళ్ల కింద అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ ఆసీస్ ప్లేయర్ అనంతరం కామెంటేటర్‌గా అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రెట్‌లీ స్టార్ స్పోర్ట్స్‌కు అనుబంధంగా ఈ సీజన్ ఐపీఎల్లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఆదివారం ఓ ముసలోడిలా పెద్ద జుట్టుతో వేషం కట్టిన బ్రెట్ లీ చిన్నారులతో సరదాగా క్రికెట్ ఆడాడు. అంతేకాకుండా క్రికెట్ గురించి తనకేం తెలియదన్నట్లు.. వారి నుంచి టిప్స్ తెలుసుకున్నాడు. చివర్లో వేషాన్ని తీసేయడంతో అక్కడున్న చిన్నారులు, అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వారందరికి ఆటోగ్రాఫ్స్ ఇచ్చి సంతోషపరిచాడు... ఈ ఆసీస్ బౌలర్. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ తమ అధికారికి ట్విటర్లో పోస్ట్ చేసింది. -
క్రికెటర్లు రోబోలు కాదు...
మైదానంలో భావోద్వేగాలు ప్రదర్శించడం, దూకుడుగా కనిపించడం ఆటలో భాగమే. మైదానంలో రోబోల్లా కనిపించే ఆటగాళ్లను మేం చూడాలనుకోవడం లేదు. అయితే క్రికెటర్లు తమ పరిధి దాటకుండా ఉండటం కూడా ముఖ్యం. బూతులు మాట్లాడకుండా కూడా దూకుడు ప్రదర్శించవచ్చు. ఇటీవలి జరిగిన కొన్ని సంఘటనలకు (రబడ తరహా) నేను మద్దతివ్వడం లేదు కానీ శిక్షల భయంతో ఆటగాళ్లు కనీసం ఒకరి వైపు మరొకరు కూడా చూసుకోకుండా ఉండే పరిస్థితి రావడం మంచిది కాదు. – బ్రెట్ లీ, ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ -
‘కోహ్లి సేనకు ఆ సత్తా ఉంది..!’
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన కోహ్లి సేనపై ప్రశంసలు కురిపించారు. సచిన్ తన మనసులోని మాటలను ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్ లీకి ఇచ్చిన ఇంటార్య్వూలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక దశాబ్దం(1990) పాటు ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అదే విధంగా టీమిండియా కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని సచిన్ అన్నారు. మాస్టర్ బ్లాస్టర్ అన్న ఈ మాటలతో మన ఆటగాళ్లకు మరింత ప్రొత్సాహాం లభించింది. ‘ అతి చిన్న వయసులో(16) ఇండియా తరపున ఆడే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తానని సచిన్ పేర్కొన్నారు. ‘నాకు క్రికెట్ ఆక్సిజన్‌తో సమానం. అది లేని జీవితాన్ని ఊహించుకోలేను. ఫ్యూచర్లోను క్రికెట్‌ను కొనసాగిస్తాను’ అని క్రికెట్ దిగ్గజం తెలిపారు. అంతేకాక నన్ను ఆదరించిన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని సచిన్ అన్నారు. సఫారీ గడ్డపై టీమిండియా జట్టు మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. జనవరి 5వ తేదీ నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. బ్రెట్ లీ ‘అప్ ఇన్ ది గ్రిల్’ అనే తన యూట్యూబ్ షో కోసం చేసిన ఇంటార్య్వూలో సచిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
'సచిన్ వికెట్ శబ్దం అత్యంత ఇష్టం'
తిరువనంతపురం:భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బౌల్డ్ అయ్యే క్రమంలో వచ్చే ఆ శబ్దం అంటే తనకు అత్యంత ఇష్టమని ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పష్టం చేశాడు. తామిద్దరం కలిసి క్రికెట్ ఆడిన రోజుల్లో సచిన్ బౌల్డ్ అయిన వెంటనే వచ్చిన శబ్దాన్ని ఎక్కువగా ఆస్వాదించేవాడినన్నాడు. 'మైదానంలో అంపైర్ నోటి వెంట నో బాల్ అని వస్తే చిరుగ్గా ఉండేది. అస్సలు నోబాల్ అనడాన్ని ఇష్టపడేవాడిని కాదు. సచిన్ కు బౌలింగ్ చేస్తుండగా.. నేను వేసిన బంతి అతని వికెట్లను తాకితే వచ్చే సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం'అని బ్రెట్ లీ పేర్కొన్నాడు. గత రెండు రోజుల క్రితం వినికిడి లోపం పిల్లల కోసం కేరళ ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బ్రెట్ లీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన బ్రెట్ లీ.. పిల్లల్ని ఉత్సాహపరిచేలా మాట్లాడాడు. 2008లో క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు చెప్పిన బ్రెట్ లీ.. 221 వన్డేల్లో 380 వికెట్లు, 76టెస్టుల్లో 310 వికెట్లు సాధించాడు. -
మా అబ్బాయి అతనికి పెద్ద అభిమాని: బ్రెట్ లీ
న్యూఢిల్లీ:పరుగుల మెషీన్, భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి అభిమానుల జాబితాలో ఇప్పుడు ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్ లీ కుమారుడు కూడా చేరిపోయాడు. ఈ విషయాన్ని తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్) కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన బ్రెట్ లీ స్వయంగా వెల్లడించాడు. తన 10 ఏళ్ల కుమారునికి విరాట్ బ్యాటింగ్ అంటే విపరీతమైన ఇష్టమని పేర్కొన్న బ్రెట్ లీ.. దీన్ని విరాట్ కు ఒకానొక సందర్భంలో తెలియజేసినట్లు పేర్కొన్నాడు. 'నా కొడుకు ఫేవరెట్ బ్యాట్స్‌మన్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లి. ఒకసారి కోహ్లితో కరాచలనం చేసే క్రమంలో నా కుమారుడికి మీ బ్యాటింగ్ ఇష్టమని విషయాన్నితెలియజేశా. అప్పుడు విరాట్ తన టెస్టు టీ షర్ట్ల్లో ఒక దానిని సంతకం చేసి నా కుమారుడికి కానుకగా ఇచ్చాడు. అని బ్రెట్ లీ పేర్కొన్నాడు. క్రికెట్ ను ప్రేమిస్తూ ఆడటం వల్లే విరాట్ వరుసగా రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడన్నాడు. భారత్ క్రికెట్ లో సచిన్ తరువాత అంతటి అభిమానాన్ని చూరగొన్నది కోహ్లినేనని బ్రెట్ లీ తెలిపాడు. సచిన్!, సచిన్! అనే అభిమానుల స్వరం ఇప్పుడు కోహ్లి,కోహ్లిగా మారిపోయిందన్నాడు. -
'భారత క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నా'
లండన్: గత కొంతకాలంగా భారత క్రికెట్ చూడటాన్ని ఎంజాయ్ చేస్తున్నానని అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ. అన్ని రంగాల్లోనూ బలంగా ఉన్న టీమిండియా చాలా మంచి క్రికెట్ ఆడుతుందంటూ కితాబిచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత జట్టుకే మరొకసారి టైటిల్ ను గెలిచే సత్తా ఉందన్నాడు. 'చాలాకాలంగా భారత క్రికెట్ మంచి ఫలితాలు సాధిస్తుంది. ఇప్పుడు ఆ జట్టు చాలా పటిష్టంగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ల్లో సమతుల్యతను కల్గి ఉంది. మంచి క్రికెట్ ఆడుతున్న భారత క్రికెట్ ను చూడటాన్ని ఎంజాయ్ చేస్తున్నా. చాంపియన్స్ ట్రోఫీని గెలిచే అవకాశాలు భారత్ కే ఉన్నాయి. కాకపోతే ఆస్ట్రేలియా టైటిల్ ను సాధించాలని కోరుకుంటున్నా'అని బ్రెట్ లీ తెలిపాడు.గత ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ విజయం సాధించడాన్ని బ్రెట్ లీ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. పాక్ పై భారత్ సాధించిన విజయం నిజంగా అద్భుతమని కొనియాడాడు. అదొక పరిపూర్ణ విజయంగా బ్రెట్ లీ అభివర్ణించాడు. -
'ఇది నా సెకండ్ ఇన్నింగ్స్'
ముంబై: తనకు క్రికెట్‌పై ఉన్న అభిమానం ఇప్పటికీ అలానే ఉందని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పష్టం చేశాడు. చాలాకాలం క్రికెట్ ఆడిన తనకు ఆ గేమ్‌తో ఉన్న బంధం విడదీయరానిదిగా పేర్కొన్నాడు. అయితే క్రికెటర్‌గా విరామం తీసుకున్న తరువాత సినిమాల్లో నటించే అవకాశం దక్కడం తన జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ గా అభివర్ణించాడు. దీనిలో భాగంగా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లిపై బ్రెట్ లీ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం విరాట్ అత్యుత్తమ క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అతని దూకుడు నిజంగా అద్భుతమని కొనియాడాడు. 'అన్ ఇండియన్' పేరుతో తెరకెక్కుతున్న ఇండో- ఆస్ట్రేలియన్ సినిమాలో హీరోగా నటిస్తున్న బ్రెట్ లీ.. మూవీ ప్రమోషన్ కోసం భారత్ లో పర్యటిస్తున్నాడు. 'ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీ. ఇందులో చాలా సన్నివేశాలు నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. కల్చరల్ రిలేషన్షిప్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది' అని బ్రెట్ లీ తెలిపాడు. తన సినిమా ఇన్నింగ్స్ ద్వారా ప్రజలకు అత్యంత వినోదాన్ని కల్గించాలని కోరుకుంటున్నట్లు ఈ మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. -
హౌస్‌ఫుల్ 4లో బ్రెట్ లీ..?
క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తరువాత నటుడిగా స్థిరపడే ప్రయత్నాల్లో ఉన్నాడు ఆస్ట్రేలియన్ బౌలర్ బ్రెట్ లీ. ఇప్పటికే మ్యూజిక్ వీడియోస్‌తో ఆకట్టుకున్న బ్రెట్ లీ, అన్ ఇండియన్ పేరుతో తెరకెక్కుతున్న ఇండో ఆస్ట్రేలియన్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇండియాలో పర్యటిస్తున్న బ్రెట్ లీకి మరో ఇంట్రస్టింగ్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ సక్సెస్ ఫుల్ కామెడీ సీరీస్ హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో భాగంలో బ్రెట్ లీని నటింప చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బ్రెట్ లీని కలిసిన నిర్మాత సాజిద్ నదియావాలా తమ సినిమాలో నటించాల్సిందిగా కోరారు. బ్రెట్ లీ మాత్రం హౌస్‌ఫుల్ 4కు తాను అంగీకరించేది, లేనిది ఇప్పట్లో చెప్పలేనంటూ దాటవేశాడు. అనుపమ్ శర్మ దర్శకత్వంలో బ్రెట్ లీ, తనీష్టా చటర్జీ, సుప్రియా పాటక్, గుల్షన్ గ్రోవర్లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న అన్ ఇండియన్ సినిమా ఆగస్టు 19న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ తరువాతే బ్రెట్ లీ చేయబోయే ఇతర ప్రాజెక్ట్‌ల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు. -
బ్రెట్ లీ ముద్దు సీన్ పై వివాదం
మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రెట్ లీ, బాల్ పక్కన పెట్టి చాలా కాలం అవుతోంది. అయితే తాజాగా ముఖానికి మేకప్ వేసుకొని హీరో వేషాలు వేస్తున్నాడు ఈ స్టార్ బౌలర్. అన్ ఇండియన్ అనే పేరుతో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. బ్రెట్ లీ ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఓ సన్నివేశంలో హీరోయిన్ తనీషా ఛటర్జీకి ముద్దు పెట్టే సీన్ ఉంది. ఈ సీన్ దాదాపు ఒక నిమిషం ఎనిమిది సెకన్లపాటు ఉంటుందట. ఇంత నిడివి కలిగిన ముద్దు సీన్‌కు అంగీకరించమన్న సెన్సార్ బోర్డ్ ఆ సన్నివేశాన్ని 26 సెకన్లకు తగ్గిస్తేనే సర్టిఫికేట్ ఇస్తామంటూ తేల్చేసింది. అదే సమయంలో బ్యాక్ గ్రౌండ్లో వినిపిస్తున్న ఓం శ్రీం అనే ఛాంటింగ్ను కూడా తొలగించాలని సూచించింది. దర్శకుడు అనుపమ్ శర్మ మాత్రం ఇందుకు అంగీకరించటం లేదు. తాజాగా ఉడ్తా పంజాబ్ సినిమా విషయంలో.. సెన్సార్ బోర్డు కేవలం సర్టిఫికేట్ ఇవ్వాలే గాని సెన్సార్ చేయకుడదన్న కోర్టు వ్యాఖ్యలను సెన్సార్ బోర్డ్ పాటించటం లేదని ఆరోపిస్తున్నాడు. ఆగస్టు 19న సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్న చిత్రయూనిట్ ఈ లోగా వివాదానికి ఎలా స్వస్తి పలుకుతుందో చూడాలి. -
ఫాస్ట్ బౌలర్లు.. క్రూర వేటగాళ్ళూ..!?
-
బాలీవుడ్ తెరపై బ్రెట్ లీ
ముంబై: ఫాస్ట్ బౌలింగ్ తో క్రికెటర్లను గడగడలాడించిన ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్ లీ ఓ రొమాంటిక్ కామెడి చిత్రానికి పచ్చ జెండా ఊపారు. 'అన్ ఇండియన్' చిత్రంలో బాలీవుడ్ తార తనీష్టా చటర్జీ సరసన బ్రెట్ లీ నటించనున్నారు. భారత, ఆసీస్ లు ఆస్ట్రేలియా ఇండియా ఫిల్మ్ ఫండ్ (ఏఐఎఫ్ఎఫ్) పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ మాసంలో సిడ్నీలో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని టోని అబాట్ భారత పర్యటన సందర్భంగా గురువారం ఈ ప్రకటన వెలువడింది. దేవేంద్ర గుప్తా, యతీందర్ గుప్తాలు నిర్మిస్తున్న అన్ ఇండియన్ చిత్రానికి అనుపమ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. -
మళ్లీ ఇంటివాడైన బ్రెట్ లీ
మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ బ్రెట్ లీ తన ప్రియురాలు లానా అండర్సన్‌ను వివాహమాడాడు. అతనికిది రెండో వివాహం. సీఫోర్త్లోని తన నివాసంలో సన్నిహితుల మధ్య గత వారం ఈ పెళ్లి జరిగింది. 2008లో మొదటి భార్య ఎలిజబెత్ కెంప్కు లీ విడాకులిచ్చాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. 37 ఏళ్ల లీ గతేడాది నుంచి లానాతో డేటింగ్ చేస్తూ సహజీవనం చేస్తున్నాడు. -
మా కుక్కపిల్ల బోల్ట్‌లా పరుగెడుతుంది!
న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలోని వేగవంతమైన బౌలర్లలో ఒకడిగా బ్రెట్ లీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి ఫాస్ట్ బౌలర్‌ను కూడా ఒక చిన్నజీవి పరుగులు పెట్టిస్తుంది. అదెవరో కాదు...లీ ముద్దుగా పెంచుకుంటున్న కుక్క పిల్ల! ఇంకా చెప్పాలంటే ‘గింగర్’ అనే పేరు గల ఆ కుక్క పిల్ల ప్రపంచ చాంపియన్ ఉసేన్ బోల్ట్‌తో సమానంగా పరుగెత్తుతుందని కూడా బ్రెట్‌లీ చెబుతున్నాడు. శునకాహారం ‘పెడిగ్రీ సీనియర్’ను మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా లీ ఈ వ్యాఖ్య చేశాడు. ‘ఆ పప్పీ అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం. ఆరు నెలల కుక్క పిల్ల మీ ఇల్లంతా పరుగెడుతుంటే ఉంటే సందడే వేరు. ఇది ఉసేన్ బోల్ట్ అంత వేగంగా పరుగెత్తుతోంది. నా వద్ద కుందేళ్లు, గినియా పందులు, అనేక రకాల పక్షులు కూడా చాలా ఉన్నాయి’ అని లీ వెల్లడించాడు.