
వృద్ధుడి వేషాదారణలో దిగ్గజ క్రికెటర్
న్యూఢిల్లీ : ఈ ఫొటోలో ఉన్న క్రికెటర్‌ను గుర్తుపట్టారా.? ఎంటీ ఓ ముసలాయన్ను తీసుకొచ్చి ఫేమస్ క్రికెటర్ అంటారు అని చికాకు పడుతున్నారా.! నిజం అతనో దిగ్గజ క్రికెటర్. చిన్న పిల్లలతో క్రికెట్ ఆడేందుకు ఇలా తయారయ్యాడు అంతే.. మరీ అతనెవరనకుంటున్నారు.. ఆస్ట్రేలియా దిగ్గజ బౌరల్ బ్రెట్‌లీ..! నమ్మశక్యంగా లేదా.. నిజం అతను బ్రెట్‌లీనే.. కొన్నేళ్ల కింద అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ ఆసీస్ ప్లేయర్ అనంతరం కామెంటేటర్‌గా అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రెట్‌లీ స్టార్ స్పోర్ట్స్‌కు అనుబంధంగా ఈ సీజన్ ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
అయితే ఆదివారం ఓ ముసలోడిలా పెద్ద జుట్టుతో వేషం కట్టిన బ్రెట్ లీ చిన్నారులతో సరదాగా క్రికెట్ ఆడాడు. అంతేకాకుండా క్రికెట్ గురించి తనకేం తెలియదన్నట్లు.. వారి నుంచి టిప్స్ తెలుసుకున్నాడు. చివర్లో వేషాన్ని తీసేయడంతో అక్కడున్న చిన్నారులు, అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వారందరికి ఆటోగ్రాఫ్స్ ఇచ్చి సంతోషపరిచాడు... ఈ ఆసీస్ బౌలర్. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ తమ అధికారికి ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment