ఆస్ట్రేలియా బౌలర్‌ హ్యాట్రిక్‌ తీశాడు.. టీమిండియా ప్రపంచకప్‌ గెలుస్తుంది..! Cummins Taken Hat Trick, India Won The World Cup When Aussies Bowler Brett Lee Taken Hat Trick In 2007. Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: ఆస్ట్రేలియా బౌలర్‌ హ్యాట్రిక్‌ తీశాడు.. టీమిండియా ప్రపంచకప్‌ గెలుస్తుంది..!

Published Fri, Jun 21 2024 9:01 AM | Last Updated on Fri, Jun 21 2024 2:10 PM

T20 WC 2024 AUS VS BAN: Cummins Taken Hat Trick, India Won The World Cup When Aussies Bowler Brett Lee Taken Hat Trick In 2007

టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో టీమిండియాకు హ్యాట్రిక్‌ సెంటిమెంట్‌ కలిసొస్తుందని భారత క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌ 2024 సూపర్‌-8 మ్యాచ్‌ల్లో భాగంగా బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ హ్యాట్రిక్‌ వికెట్లు సాధించాడు. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో ఆసీస్‌ తరఫున హ్యాట్రిక్‌ సాధించిన రెండో బౌలర్‌గా కమిన్స్‌ రికార్డుల్లోకెక్కాడు. 

పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభ ఎడిషన్‌లో (2007) బ్రెట్‌ లీ ఆసీస్‌ తరఫున తొలి హ్యాట్రిక్‌ సాధించాడు. ఆ ఎడిషన్‌లో భారత్‌ టైటిల్‌ సాధించింది. ఇప్పుడు రెండో సారి ఆసీస్‌ బౌలర్‌ హ్యాట్రిక్‌ సాధించడంతో సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందని టీమిండియా ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. టీమిండియా ఫ్యాన్స్‌ ఆశలకు మరింత బలం చేకూర్చే విషయం ఏంటంటే.. నాడు బ్రెట్‌ లీ, ఇప్పుడు పాట్‌ కమిన్స్‌ బంగ్లాదేశ్‌పైనే హ్యాట్రిక్‌ వికెట్లు సాధించారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. బంగ్లాతో మ్యాచ్‌లో కమిన్స్‌ ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ ఐదు (మహ్మదుల్లా), ఆరు  బంతులకు (మెహిది హసన్‌).. ఆతర్వాత 20వ ఓవర్‌ తొలి బంతికి (తౌహిద్‌ హ్రిదోయ్‌) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు వేసిన కమిన్స్‌ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. కమిన్స్‌, ఆడమ్‌ జంపా (4-0-24-2), మిచెల్‌ స్టార్క్‌ (4-0-21-1), మ్యాక్స్‌వెల్‌ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. 

బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ షాంటో (41), తౌహిద్‌ హ్రిదోయ్‌ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్‌ హసన్‌ 0, లిటన్‌ దాస్‌ 16, రిషద్‌ హొసేన్‌ 2, షకీబ్‌ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్‌ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్‌ అహ్మద్‌ 13, తంజిమ్‌ హసన్‌ సకీబ్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement