టీ20 వరల్డ్‌కప్ 2024లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ ఈ ఘనత సాధించాడు. సూపర్-8 మ్యాచ్‌ల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కమిన్స్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో ఆస్ట్రేలియన్ బౌలర్‌గా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు. 2007 ఎడిషన్‌లో బ్రెట్ లీ ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించాడు.
HAT-TRICK FOR PAT CUMMINS!!
- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కమిన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదు (మహ్మదుల్లా), ఆరు బంతులకు (మెహిది హసన్).. ఆతర్వాత 20వ ఓవర్ తొలి బంతికి (తౌహిద్ హ్రిదోయ్) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన కమిన్స్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
కమిన్స్‌తో పాటు ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment