టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (జూన్ 21) ఉదయం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వరుణుడు ఆడ్డు తగలడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆసీస్‌ను విజేతగా ప్రకటించారు. వర్షం మొదలయ్యే సమయానికి ఆసీస్ స్కోర్ 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులుగా ఉండింది.
కమిన్స్ హ్యాట్రిక్
ఈ మ్యాచ్‌లో కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇది తొలి హ్యాట్రిక్ కాగా.. టీ20 ప్రసంచకప్ టోర్నీల్లో ఆసీస్‌కు ఇది రెండో హ్యాట్రిక్. ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ 2007 ప్రపంచకప్ ఎడిషన్‌లో నమోదైంది. ఆ ఎడిషన్‌లో బ్రెట్ లీ బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ సాధించాడు.
HAT-TRICK FOR PAT CUMMINS!!
- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్ (4-0-29-3), ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు.
తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.
వార్నర్ మెరుపు అర్ధ శతకం
141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మొదలై మ్యాచ్‌కు అంతరాయం కలిగించి, డక్‌వర్త లూయిస్ పద్దతిన ఫలితాన్ని నిర్దారించేలా చేసింది. వర్షం మొదలయ్యే సమయానికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (6 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్.. ట్రవిస్ హెడ్‌తో (31) కలిసి ఆసీస్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి పవర్ ప్లేలో 59 పరుగులు జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment