hat trick
-
అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత.. డబుల్ హ్యాట్రిక్
అంతర్జాతీయ టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్ నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ సబ్ రీజియనల్ అమెరికా క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా కేమెన్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా పేస్ బౌలర్ హెర్నన్ ఫెన్నెల్ ఈ ఫీట్ సాధించాడు. ఫెన్నెల్.. కేమెన్ ఐలాండ్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసిన ఆరో బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.ఫెన్నెల్‌కు ముందు రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్) vs ఐర్లాండ్, 2019లసిత్ మలింగ (శ్రీలంక) vs న్యూజిలాండ్, 2019కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్) vs నెదర్లాండ్స్, 2021జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) vs ఇంగ్లాండ్, 2022వసీమ్ యాకూబ్ర్ (లెసోతో) vs మాలి, 2024 ఈ ఘనత సాధించారు.కేమెన్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెన్నెల్ డబుల్ హ్యాట్రిక్ సహా మొత్తం ఐదు వికెట్లు (5/14) తీశాడు. ట్రాయ్ టేలర్, అలిస్టర్ ఐఫిల్, రొనాల్డ్ ఈబ్యాంక్స్, అలెస్సాండ్రో మోరిస్ ఫెన్నెల్ డబుల్ హ్యాట్రిక్ బాధితులు.అంతర్జాతీయ టీ20ల్లో ఫెన్నెల్‌కు ఇది రెండో హ్యాట్రిక్ కావడం మరో విశేషం. 36 ఏళ్ల ఫెన్నెల్ 2021లో పనామాతో జరిగిన మ్యాచ్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఫెన్నెల్.. అంతర్జాతీయ టీ20ల్లో రెండు అంతకంటే ఎక్కువ హ్యాట్రిక్‌లు నమోదు చేసిన ఆరో బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు.ఫెన్నెల్‌కు ముందు మాల్టాకు చెందిన వసీం అబ్బాస్,ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్సెర్బియాకు చెందిన మార్క్ పావ్లోవిక్న్యూజిలాండ్కు చెందిన టిమ్ సౌథీశ్రీలంకకు చెందిన లసిత్ మలింగ అంతర్జాతీయ టీ20ల్లో రెండు అంతకంటే ఎక్కువ హ్యాట్రిక్‌లు నమోదు చేశారు. -
హ్యాట్రిక్ తీసిన ఇంగ్లండ్ బౌలర్
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 8) జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ చార్లీ డీన్ హ్యాట్రిక్ వికెట్లు తీసింది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో డీన్ ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్ తరఫున హ్యాట్రిక్ తీసిన మూడో మహిళా క్రికెటర్‌గా డీన్ రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా (పురుషుల క్రికెట్‌తో పాటు) ఈ ఘనత సాధించిన ఏడో ఇంగ్లండ్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డీన్ ఇన్నింగ్స్ 17, 19 ఓవర్లలో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్ చివరి బంతికి మారిజన్ కాప్ వికెట్ తీసిన డీన్.. ఆతర్వాత 19వ ఓవర్ మొదటి రెండు బంతులకు నదినే డి క్లెర్క్, సినాలో జఫ్టా వికెట్లు తీసింది.ఇంగ్లండ్ తరఫున హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్లు..కరోల్ హాడ్జస్ 1993లో డెన్మార్క్ మహిళల జట్టుపైక్లేర్ కాన్నర్ 1999లో భారత మహిళా జట్టుపైజేమ్స్ అండర్సన్ 2003లో పాకిస్తాన్ పురుషుల జట్టుపైస్టీవ్ హార్మిసన్ 2004లో భారత పురుషుల జట్టుపైఆండ్రూ ఫ్లింటాఫ్ 2009లో వెస్టిండీస్ పురుషుల జట్టుపైస్టీవెన్ ఫిన్ 2015లో ఆస్ట్రేలియా పురుషుల జట్టుపైచార్లీ డీన్ 2024లో సౌతాఫ్రికా మహిళల జట్టుపైమ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 31.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటైంది. చార్లీ డీన్ (4/45), సోఫీ ఎక్లెస్టోన్ (3/27), లారెన్ ఫైలర్ (3/32) రెచ్చిపోవడంతో సౌతాఫ్రికా జట్టు అనూహ్యంగా కుప్పకూలింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్లో టైరాన్ (45), లారా వోల్వార్డ్ట్ (35), డెర్క్సన్ (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 24 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టామీ బేమౌంట్ (34), బౌచియర్ (33), డేనియల్ హాడ్జ్ (25 నాటౌట్), నాట్ సీవర్ బ్రంట్ (20) ఇంగ్లండ్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. సౌతాఫ్రికా బౌలర్లలో డెర్క్సన్ 2, డి క్లెర్క్, మారిజన్ కాప్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. నిర్ణయాత్మక మూడో వన్డే డిసెంబర్ 11న జరుగనుంది. -
ఒకే రోజు రెండు హ్యాట్రిక్‌లు
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఒకే రోజు రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. ఇవాళ (నవంబర్ 5) జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్తర్ ప్రదేశ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొలి హ్యాట్రిక్ నమోదు చేయగా.. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా బౌలర్ ఫెలిక్స్ అలెమావో రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు. భువీ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో భువీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో భువీ మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మెయిడిన్ ఉంది. ఈ మ్యాచ్‌లో భువీతో పాటు మిగతా బౌలర్లు కూడా చెలరేగడంతో జార్ఖండ్‌పై యూపీ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.రెండో హ్యాట్రిక్ విషయానికొస్తే.. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా బౌలర్ ఫెలిక్స్ అలెమావో ఇన్నింగ్స్ చివరి మూడు బంతులకు మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ఫెలిక్స్ మొత్తంగా 5 వికెట్లు తీశాడు. ఫెలిక్స్‌తో పాటు మోహిత్ రేడ్కర్ (4/18) కూడా చెలరేగడంతో నాగాలాండ్‌పై గోవా 108 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గోవా.. దర్శన్ మిసాల్ (91), సూయాశ్ ప్రభుదేశాయ్ (69) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన నాగాలాండ్ నిర్ణీత ఓవర్లలో 129 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నాగాలాండ్ ఇన్నింగ్స్‌లో చేతన్ బిస్త్ (63) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఉత్తర్ ప్రదేశ్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. జార్ఖండ్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో భువీ ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్ 17వ ఓవర్లో భువీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో భువీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో భువీ మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మొయిడిన్ ఉంది. HAT-TRICK FOR BHUVNESHWAR KUMAR IN SYED MUSHTAQ ALI 🦁- Great news for RCB in IPL 2025...!!! pic.twitter.com/mDw13DhRM4— Johns. (@CricCrazyJohns) December 5, 2024ఈ మ్యాచ్‌లో భువీతో పాటు నితీశ్ రాణా (4-0-19-2), మొహిసిన్ ఖాన్ (2.5-0-38-2), వినీత్ పన్వార్ (4-0-39-1), విప్రాజ్ నిగమ్ (2-0-18-1), శివమ్ మావి (3-0-28-1) రాణించడంతో జార్ఖండ్‌పై ఉత్తర్ ప్రదేశ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రింకూ సింగ్ 28 బంతుల్లో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలువగా.. ప్రియమ్ గార్గ్ 31, సమీర్ రిజ్వి 24, నితీశ్ రాణా 16, శివమ్ మావి 15 పరుగులు చేశారు. జార్ఖండ్ బౌలర్లలో బాల్ కృష్ణ 3 వికెట్లు తీయగా.. వివేకానంద్ తివారి 2, వికాస్ కుమార్, వికాశ్ సింగ్, అనుకుల్ రాయ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జార్ఖండ్.. 19.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. అనుకుల్ రాయ్ (44 బంతుల్లో 91) జార్ఖండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. విరాట్ సింగ్ (23), రాబిన్ మింజ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ (8) విఫలమయ్యాడు.ఆర్సీబీలో చేరిన భువీఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. భువీపై ఆర్సీబీ 10.75 కోట్లు వెచ్చించింది. మెగా వేలానికి ముందు భువనేశ్వర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకుంది. భువీ 2014 నుంచి సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. భువీకి పవర్ ప్లే మరియు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుంది. భువీ 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ 2016లో టైటిల్ సాధించడంలో భువీ కీలకపాత్ర పోషించాడు. -
శ్రీలంకతో రెండో టీ20.. హ్యాట్రిక్ తీసిన న్యూజిలాండ్ బౌలర్
డంబుల్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ పేసర్ లోకీ ఫెర్గూసన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునేందుకు బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఫెర్గూసన్ తన స్పెల్ మొదటి ఓవర్ చివరి బంతికి ఓ వికెట్ (కుసాల్ పెరీరా).. ఆతర్వాత రెండో ఓవర్ తొలి రెండు బంతులకు రెండు వికెట్లు (కమిందు మెండిస్, అసలంక) తీశాడు. ఫెర్గూసన్.. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన ఐదో బౌలర్‌గా (జేకబ్ ఓరమ్, టిమ్ సౌథీ (2), మైఖేల్ బ్రేస్‌వెల్, మ్యాట్ హెన్రీ).. ఓవరాల్‌గా టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన 64వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.The Lockie Ferguson hat-trick. 🌟pic.twitter.com/dhtmS1tLlp— Mufaddal Vohra (@mufaddal_vohra) November 10, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), నువాన్ తుషార (4-0-22-2), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) ధాటికి 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక..ఫెర్గూసన్ (2-0-7-3), మిచెల్ సాంట్నర్ (3-0-10-1) ధాటికి 34 పరుగులకే (7.2 ఓవర్లలో) నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుసాల్ మెండిస్ 2, కుసాల్ పెరీరా 3, కమిందు మెండిస్ 1, అసలంక డకౌట్ కాగా.. పథుమ్ నిస్సంక (33), భానుక రాజపక్స్ (15) శ్రీలంకను విజయతీరాలు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 11.2 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 63/4గా ఉంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే మరో 52 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో శ్రీలంక తొలి మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
హ్యాట్రిక్ తీసిన బౌలర్‌నే వదిలేసిన ముంబై ఇండియన్స్
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్) ఇవాళ రిటెన్షన్ జాబితాలను విడుదల చేశాయి. దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు నలుగురి నుంచి ఆరుగురిని వేలానికి వదిలేసి మిగతా ప్లేయర్లను అలాగే అట్టిపెట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ సైతం నలుగురిని వేలానికి వదిలేసి, 14 మంది ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. ముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్‌లో ముగ్గురు భారత అన్క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. ఓ విదేశీ స్టార్ ప్లేయర్ ఉంది. వచ్చే సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ఇస్సీ వాంగ్‌ను అనూహ్యంగా వేలానికి వదిలేసింది. 22 ఏళ్ల ఇస్సీ డబ్ల్యూపీఎల్ డెబ్యూ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున హ్యాట్రిక్ తీసింది. మహిళల ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసిన తొలి క్రికెటర్ ఇస్సీనే కావడం విశేషం. 2023 సీజన్లో యూపీ వారియర్జ్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇస్సీ ఈ ఘనత సాధించింది. హ్యాట్రిక్ తీయడంతో పాటు తొలి సీజన్లో ఓ వెలుగు వెలిగిన ఇస్సీ 2024 సీజన్లో మరో స్టార్ విదేశీ పేసర్ (షబ్నిమ్ ఇస్మాయిల్) రావడంతో మరుగున పడిపోయింది. షబ్నిమ్ ఎంట్రీతో ఇస్సీకి అవకాశాలు కరువయ్యాయి. షబ్నిమ్ అద్భుతమైన ప్రదర్శనలతో రాణించడంతో ఈ ఏడాది వేలానికి ముందు ఇస్సీని వదిలేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. తుది జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంఐ మేనేజ్మెంట్ ఇస్సీని వదులుకోక తప్పలేదు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇస్సీతో పాటు స్వదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్లను కూడా వేలానికి వదిలేసింది. ముంబై ఇండియన్స్ ఈసారి కూడా హర్మన్‌ప్రీత్‌ను కెప్టెన్‌గా కొనసాగించింది. ఎంఐ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్‌లో యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, షబ్నిమ్ ఇస్మాయిల్ లాంటి స్వదేశీ, విదేశీ స్టార్లు ఉన్నారు. వేలంలో పాల్గొనేందుకు ముంబై ఇండియన్స్ పర్స్‌లో ఇంకా 2.65 కోట్ల బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో ముంబై ఇండియన్స్ మరో నలుగురు ప్లేయర్స్‌ను కొనుగోలు చేయవచ్చు. డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చన్న విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే, తొలి సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్.. రెండో సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ముంబైని ఇంటికి పంపించిన ఆర్సీబీనే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..హార్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సంజనా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాఖీ, అమన్‌జోత్ కౌర్, అమన్‌దీప్ కౌర్, కీర్తనముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్ వీళ్లే..ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్, ఇస్సీ వాంగ్ -
హ్యాట్రిక్ సాధించిన ఆస్ట్రేలియా బౌలర్
ఆస్ట్రేలియాలో జరిగే షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో హ్యాట్రిక్ నమోదైంది. టస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్ బ్రాడీ కౌచ్ హ్యాట్రిక్ వికెట్లతో విరుచుకుపడ్డాడు. కౌచ్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగడంతో టస్మానియాపై వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టస్మానియా తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. కాలెబ్ జువెల్ (61), మిచెల్ ఓవెన్ (83) అర్ద సెంచరీలతో రాణించారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్లలో జోయెల్ పారిస్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం బరిలోకి దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో కార్ట్‌రైట్ భారీ సెంచరీతో (153) సత్తా చాటగా.. సామ్ ఫాన్నింగ్ (68), గుడ్విన్ (94), ఆస్టన్ అగర్ (74) అర్ద సెంచరీలతో రాణించారు. టస్మానియా బౌలర్లలో కున్హేమన్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.143 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టస్మానియా.. బ్రాడీ కౌచ్ (14-8-15-3), అస్టన్ అగర్ (17.5-11-12-3), జోయెల్ పారిస్ (15-9-18-2), కెమరూన్ గ్యానన్ (16-6-25-2) దెబ్బకు 98 పరుగులకు ఆలౌటైంది. తద్వారా వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. టస్మానియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్రాడ్లీ హోప్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.HAT-TRICK! LBW, bowled, bowled - well done Brody Couch! #SheffieldShield pic.twitter.com/B1CjUWmO6l— cricket.com.au (@cricketcomau) November 4, 2024హ్యాట్రిక్ వికెట్లు తీసిన బ్రాడీ కౌచ్ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రాడీ కౌచ్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన తొలి వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్ బ్రాడీనే. మ్యాచ్ చివరి రోజు (నవంబర్ 4) టీ విరామం తర్వాత బ్రాడీ వరుసగా జేక్ డోరన్, లారెన్స్ నీల్ స్మిత్, కీరన్ ఇలియట్ వికెట్లు పడగొట్టాడు. టస్మానియా స్కోర్ 89 పరుగుల వద్ద నుండగా బ్రాడీ ఈ ఘనత సాధించాడు. -
హరియాణాలో హ్యాట్రిక్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ.. 48 సీట్లతో సొంతంగా మెజారిటీ సాధించింది. గెలుపు తమదేననే ధీమాతో వెళ్లిన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల నష్టాన్ని నివారించలేకపోయింది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్– కాంగ్రెస్ కూటమి విజయాన్ని సొంతం చేసుకుంది. సీపీఎంతో కలిసి కూటమికి 49 స్థానాలు లభించాయి. హరియాణా ప్రజలు తప్పుడు ప్రచారాన్ని తిరస్కరించారు. అభివృద్ధికి గ్యారంటీని గెలిపించారు. భగవద్గీత బోధించిన నేలపై సత్యం, అభివృద్ధి, సుపరిపాలనకు దక్కిన విజయమిది. ఏ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా దీర్ఘకాలం పాటు ప్రజలు మద్దతిస్తూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్‌కు ‘నో ఎంట్రీ’చూపించారు. అధికారాన్ని జన్మహక్కుగా భావించే కాంగ్రెస్‌కు మళ్లీ అవకాశమివ్వడం చాలా అరుదు. వరుసగా మూడోసారి బీజేపీకి మెజారిటీ ఇచ్చిన హరియాణా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. కూటములు కడుతూ భాగస్వాములపై ఆధారపడే కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవి. ఒక్కోసారి ఆ పార్టీలనే మింగేస్తుంటుంది.జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం భారత రాజ్యాంగం, ప్రజాస్వా మ్యం సాధించిన విజయం. మంచి ఫలితాలు సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్‌కు అభినందనలు. బీజేపీ సాధించిన ఫలితాలను చూసి గర్వంగా ఉంది. మా పార్టీపై నమ్మకముంచి, ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు – బీజేపీ కార్యాలయంలో మోదీచండీగఢ్: పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను పటాపంచలు చేస్తూ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారీ హరియాణాలో అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. జాట్లనే నమ్ముకున్న కాంగ్రెస్ చతికిలపడితే ఓబీసీ, దళితులు, బ్రాహ్మణుల ఓట్లను సమీకరించి బీజేపీ జయకేతనం ఎగరేసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో తగ్గిన ఎంపీ సీట్లతో కుదుపులకు లోనైన కమలనాథుల విజయరథ జైత్రయాత్ర.. హరియాణాలో మాత్రం సాఫీగా సాగింది.మంగళవారం ఉదయం కౌంటింగ్ మొదలయ్యాక ఆరంభ రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. తర్వాత ఉదయం 10, 11 గంటల సమయం దాటగానే ఫలితాల సరళిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఆధిక్యత క్రమంగా తగ్గుతూ బీజేపీ పుంజుకుంది. అది అలాగే తుదికంటా కొనసాగి కమలనాథులకు విజయాన్ని కట్టబెట్టింది. మంగళవారం వెల్లడైన హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే బీజేపీకి 39.94 శాతం ఓట్లు పడగా దాదాపు అదే స్థాయిలో కాంగ్రెస్‌కు 39.09 శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కంటే కేవలం 0.85 శాతం ఓట్ల ఆధిక్యతతో బీజేపీ ఏకంగా 11 సీట్లను ఎక్కువ గెల్చుకోవడం గమనార్హం. చాలా చోట్ల అత్యల్ప తేడాతో కాంగ్రెస్ ఓడినట్లు వార్తలొచ్చాయి. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించగా వాటిని నిరాధార ఆరోపణలుగా కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) పార్టీ కేవలం రెండు చోట్ల గెలిచింది. స్వతంత్రులు మూడు స్థానాల్లో నెగ్గారు. దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. సొంతంగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 1.79 శాతం ఓట్లతో గెలుపు బోణీ కొట్టలేక ఉసూరుమంది. మల్లయోధురాలి గెలుపు పట్టు బీజేపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ(లాద్వా), కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా(గర్హీ సాంప్లా–కిలోయీ) విజయం సాధించారు. ఒలింపిక్స్‌లో స్వర్ణం కొద్దిలో చేజార్చుకున్న మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ ఎన్నికల్లో మాత్రం విజయాన్ని తొలి ప్రయత్నంలోనే ఒడిసిపట్టుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఈమె జూలానా నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. హిసార్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్నివాస్ రాణాపై దేశంలోనే అత్యంత ధనిక మహిళ సావిత్రి జిందాల్ స్వతంత్య్ర అభ్యరి్థగా పోటీచేసి గెలిచారు.జేజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, హరియాణా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు, బీజేపీ నేత భవ్య బిష్ణోయ్ ఓటమిని చవిచూశారు. భవ్య ఓడిపోయిన అదమ్‌పూర్ స్థానం గత ఐదు దశాబ్దాలుగా బిష్ణోయ్‌లకు కంచుకోటగా ఉంది. ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా సైతం ఓడిపోయారు. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేసిన బీజేపీ తన కేబినెట్ మంత్రులను మాత్రం గెలిపించుకోలేకపోయింది. అసెంబ్లీ స్పీకర్, బీజేపీ నేత జ్ఞాన్‌చంద్ గుప్తా, ఎనిమిది మంది మంత్రులు ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో 15 శాతం ఓట్లతో 10 స్థానాల్లో గెలిచిన జననాయక్ జనతా పార్టీ ఈసారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 13 మందిమహిళల విజయం 90 స్థానాలున్న అసెంబ్లీలోకి ఈసారి 13 మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు. వినేశ్ ఫొగాట్, సావిత్రి జిందాల్‌సహా 13 మంది గెల్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది మహిళా అభ్యర్థులు గెలిచారు. బీజేపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ఏడుగురు మహిళలు విజయం సాధించారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం: సీఎం సైనీ పార్టీని విజయతీరాలకు చేర్చినందుకు ఓటర్లకు బీజేపీ నేత, ముఖ్యమంత్రి సైనీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ మోదీ నాయకత్వంలో ప్రభుత్వ విధానాలకు ప్రజలు పట్టంకట్టారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం దక్కిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఈ గెలుపు ఘనత పూర్తిగా మోదీజీదే’ అని సీఎం అన్నారు. -
ఆస్ట్రేలియా బౌలర్ హ్యాట్రిక్ తీశాడు.. టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుంది..!
టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో టీమిండియాకు హ్యాట్రిక్ సెంటిమెంట్ కలిసొస్తుందని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8 మ్యాచ్‌ల్లో భాగంగా బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఆసీస్ తరఫున హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు. పొట్టి ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్‌లో (2007) బ్రెట్ లీ ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించాడు. ఆ ఎడిషన్‌లో భారత్ టైటిల్ సాధించింది. ఇప్పుడు రెండో సారి ఆసీస్ బౌలర్ హ్యాట్రిక్ సాధించడంతో సెంటిమెంట్ రిపీట్ అవుతుందని టీమిండియా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. టీమిండియా ఫ్యాన్స్ ఆశలకు మరింత బలం చేకూర్చే విషయం ఏంటంటే.. నాడు బ్రెట్ లీ, ఇప్పుడు పాట్ కమిన్స్ బంగ్లాదేశ్పైనే హ్యాట్రిక్ వికెట్లు సాధించారు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాతో మ్యాచ్‌లో కమిన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదు (మహ్మదుల్లా), ఆరు బంతులకు (మెహిది హసన్).. ఆతర్వాత 20వ ఓవర్ తొలి బంతికి (తౌహిద్ హ్రిదోయ్) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు వేసిన కమిన్స్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్, ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. -
టీ20 వరల్డ్‌కప్ 2024లో తొలి హ్యాట్రిక్ నమోదు
టీ20 వరల్డ్‌కప్ 2024లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ ఈ ఘనత సాధించాడు. సూపర్-8 మ్యాచ్‌ల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కమిన్స్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో ఆస్ట్రేలియన్ బౌలర్‌గా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు. 2007 ఎడిషన్‌లో బ్రెట్ లీ ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించాడు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కమిన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదు (మహ్మదుల్లా), ఆరు బంతులకు (మెహిది హసన్).. ఆతర్వాత 20వ ఓవర్ తొలి బంతికి (తౌహిద్ హ్రిదోయ్) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన కమిన్స్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కమిన్స్‌తో పాటు ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. -
హ్యాట్రిక్‌తో విజృంభించిన ఇంగ్లండ్ బౌలర్
ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ 2024 ఎడిషన్‌లో కెంట్ బౌలర్, ఇంగ్లండ్ లెగ్ స్పిన్ బౌలర్ మాథ్యూ పార్కిన్సన్ అదిరిపోయే హ్యాట్రిక్ సాధించాడు. మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో హ్యాట్రిక్‌తో కలుపుకుని 4 వికెట్లు పడగొట్టాడు. పార్కిన్సన్ ధాటికి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న మిడిల్సెక్స్ 107 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా కెంట్ 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్.. జో డెన్లీ (56), బెల్ డ్రమ్మండ్ (38) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.హాల్మెన్ (3/27), బ్లేక్ కల్లెన్ (3/47), టామ్ హెల్మ్ (2/37) బంతితో రాణించారు.A hat-trick for Matt Parkinson! 🤩 pic.twitter.com/RoIcNZgH9X— Vitality Blast (@VitalityBlast) May 31, 2024అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మిడిల్సెక్స్ పార్కిన్సన్, మార్కస్ (2/28), గ్రాంట్ స్టివార్ట్ (2/22), స్వేన్పోయెల్ (1/11), బార్లెట్ (1/16) ధాటికి 14.1 ఓవర్లలోనే చాపచుట్టేసింది. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్‌లో హాల్మెన్, ఎస్కినాజీ, జాక్ డేవిస్ తలో 23 పరుగులు చేయగా.. మిగతా వారంతా విఫలమయ్యారు. కాగా. టీ20 బ్లాస్ట్ టోర్నీ మే 30వ తేదీ నుంచి మొదలయ్యింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇవాళ మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ తరఫున ఒక టెస్ట్, 5 వన్డేలు, 6 టీ20లు ఆడిన మాట్ పార్కిన్సన్కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో 12 మ్యాచ్‌ల్లో కేవలం 13 వికెట్లు మాత్రమే తీసిన పార్కిన్సన్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 60 మ్యాచ్‌ల్లో 191 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లోనూ పార్కిన్సన్ ఓ మోస్తరు ప్రదర్శనలు చేశాడు. ఈ ఫార్మాట్లో అతను 37 మ్యాచ్‌లు ఆడి 64 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో పాటు దేశీయంగా జరిగే పలు టీ20 టోర్నీల్లో పాల్గొనే పార్కిన్సన్.. ఇప్పటివరకు 104 మ్యాచ్‌లు ఆడి 143 వికెట్లు పడగొట్టాడు. -
కమల దళం కార్యాచరణ జోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కమలదళం ఎన్నికల ప్రణాళిక అమలు ఊపందుకుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను వెనక్కు తోసేలా ఎక్కువ సీట్లు గెలుపొందాలనే లక్ష్యసాధనకు అనుగుణంగా రోజురోజుకు వేగాన్ని పెంచుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నంబర్ వన్ స్థానం తనదేనని చాటాలని ఉవ్విళ్లూరుతోంది. వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉంటూ, మూడోసారి గెలిచి మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతోందనే సానుకూల ప్రచారంతో ఏర్పడిన వాతావరణాన్ని ఇక్కడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందుకనుగుణంగా ఎన్నికల ప్రచారం, ఇతర విషయాల్లో మిగతా పార్టీల కంటే జోరుగా అడుగులు వేస్తోంది. బీజేపీపాలిత రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ సానుకూల ప్రచారాన్ని విస్తృతస్థాయిలో తీసుకెళ్లి అధిక సీట్లు గెలవాలన్న జాతీయ నాయకత్వం వ్యూహాలను ఇక్కడా పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. మరింత కష్టపడితే... రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో 10 సీట్లు గెలిచే అవకాశాలున్నాయన్న అంచనాల్లో ఉన్న బీజేపీ నాయకత్వం ఇంకా కొంచెం కష్టపడితే మరో రెండు స్థానాల్లోనూ విజయం సాధ్యమని గట్టిగా విశ్వసిస్తోంది. మిగతా పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ఖరారు, ముందుగానే తొలివిడత ఎన్నికల ప్రచారాన్ని ముగించడం, పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ప్రధాని మోదీ ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని (ఐదు బహిరంగసభల్లో పాల్గొన్నారు) పూర్తిచేయడం, బూత్‌స్థాయిల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టడంపై అగ్రనేత అమిత్‌షా దిశానిర్దేశం వంటివి రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల్లో గెలుపుపై ధీమా పెంచేందుకు దోహదపడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే, ‘సారా కే సారే సత్రాయ్ హమారే’ (అన్నింటికి అన్ని సీట్లు మావే) అనే నినాదాన్ని విస్తృతంగా జనసామాన్యంలోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టితో... పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు గెలుపొందడం ద్వారా రాష్ట్రంలో తన రాజకీయ ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఈవిధంగా తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందనే సందేశం ప్రజల్లోకి వెళితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం తథ్యమనే సంకేతాలు వెళ్తాయనే ధీమా రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లను సమానంగా టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని నిర్ణయించినట్టు పార్టీ ముఖ్యనేతల సమాచారం. -
మోదీ హయాంలోనే సురక్షితం
మొయినాబాద్ రూరల్: దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ హ్యాట్రిక్ సాధిస్తారని, జూన్ 8 లేదా 9న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మోదీ హయాంలోనే దేశం సురక్షితంగా ఉందన్న ఆయన దేశంలో పదేళ్ల క్రితం నాటి, ప్రస్తుత పరిస్థితులపై ఆలోచన చేయాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో ఉగ్రవాద దాడులు, మతకల్లోలాలు జరిగేవని గుర్తుచేశారు. గతంలో కీలుబొమ్మలాంటి ప్రధాని ఉండేవారని.. మోదీ రాకతో దేశానికి బలమైన లీడర్ లభించారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ పార్లమెంట్ సెగ్మెంట్ కన్వినర్ మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలంటనే మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. పదేళ్ల క్రితం అనేక వస్తువులను మనం దిగుమతి చేసుకునే వారమని, ప్రస్తుతం మనమే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని వివరించారు. కాంగ్రెస్ హయాంలో పదిహేను రోజులకో కుంభకోణం జరిగి రూ.వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని స్పష్టంచేశారు. ఆరి్టకల్ 370 రద్దు చేస్తామని చెప్పిన మోదీ చేసి చూపించారన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆయనతోనే సాధ్యమైందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జిన్నా రాజ్యాంగమే వస్తుందని విమర్శించారు. రుణమాఫీకి రేవంత్ డబ్బులెక్కడి నుంచి తెస్తారో? డిసెంబర్లో రుణమాఫీ చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి అందుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉచితంగా బస్సుల్లో తిప్పితే అన్నీ ఇచ్చినట్లు అనుకోవద్దని ప్రజలకు సూచించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యరి్థ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాశ్, సనివెళ్లి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ్మరెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, ఆయా నియోజకవర్గాల బూత్ లెవల్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. -
హ్యాట్రిక్‌తో చెలరేగిన బంగ్లాదేశ్ బౌలర్.. కెరీర్లో రెండోది
మహిళల క్రికెట్లో ఇవాళ (ఏప్రిల్ 2) బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లు టీ20 మ్యాచ్ ఆడుతున్నాయి. పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో టీ20 ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్ ఫరిహా త్రిస్న హ్యాట్రిక్‌తో చెలరేగింది. త్రిస్నకు టీ20ల్లో ఇది రెండో హ్యాట్రిక్. 2022లో త్రిస్న తన టీ20లో అరంగేట్రంలోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టింది. త్రిస్న దెబ్బకు నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్ ఆఖరి మూడు బంతులకు త్రిస్న.. ఎల్లిస్ పెర్రీ, మోలినెక్స్, బెత్ మూనీలను ఔట్ చేసింది. తన కోటా నాలుగు ఓవర్లు వేసిన త్రిస్న.. 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఇందులో ఓ మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. HAT-TRICK for Fariha Trisna in T20i against Australia women#BCB #Cricket #BANWvAUSW #LiveCrcket #HomeSeries #T20Iseries #womenscricket pic.twitter.com/I00NUVXNg3 — Bangladesh Cricket (@BCBtigers) April 2, 2024 బంగ్లా బౌలర్లలో త్రిస్నతో పాటు నహీద అక్తర్ (4-0-21-2), ఫహీమా ఖాతూన్ (4-0-34-2) కూడా వికెట్లు పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వేర్హమ్ (57), గ్రేస్ హ్యరీస్ (47) మాత్రమే రాణించారు. ఆఖర్లో పెర్రీ (29) వేగంగా పరుగులు చేసే ప్రయత్నం చేయగా.. తహిల మెక్‌గ్రాత్ (19) రెండంకెల స్కోర్ చేయగలిగింది. మిగతా ప్లేయర్స్ అంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమతమయ్యారు. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 9.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. మెగాన్ షట్, ఆష్లే గార్డ్నర్, మోలినెక్స్ తలో వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్‌ను కష్టాల్లోకి నెట్టారు. ముర్షిదా ఖాతూన్ (8), శోభన మోస్తరీ (5), నిగార్ సుల్తాన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. దిలారా అక్తర్ (27), ఫహీమా ఖాతూన్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలంటే 65 బంతుల్లో 115 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యంలో కొనసాగుతుంది. -
ముంబై ‘మూడు’పోయింది
ముంబై ఇన్నింగ్స్... తొలి 21 బంతుల్లో 20 పరుగులు, 4 వికెట్లు... ఇందులో రోహిత్ శర్మ సహా ముగ్గురు తొలి బంతికే డకౌట్... ముంబై ఇన్నింగ్స్ మొదలవడంతోనే ముగిసినట్లు అనిపించింది... బౌల్ట్ కొట్టిన ఈ దెబ్బ తర్వాత కొంత కోలుకున్నా 125 పరుగుల స్కోరు ఏమాత్రం సరిపోలేదు... రాజస్తాన్ రాయల్స్ అలవోకగా మరో 27 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించేసింది... సొంతగడ్డపై కూడా బోణీ చేయలేకపోయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఇంకా గెలుపు ఖాతా తెరవని ఏకైక జట్టుగా నిలిచింది. అభిమానులు...అదే తీరు! హార్దిక్ పాండ్యాకు ముంబై సొంత మైదానం వాంఖెడేలోనూ ఫ్యాన్స్ నుంచి నిరసన ఎదురైంది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో ఆగ్రహంగా ఉన్న అభిమానులు గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే ఈసారి కూడా పాండ్యా పేరు వినిపించినప్పుడల్లా గేలి చేశారు. టాస్కు వచ్చినప్పుడు మాట్లాడకుండా అంతరాయం కలిగించారు. చివరకు వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ‘మర్యాద పాటించండి’ అని చెప్పినా జనం పట్టించుకోలేదు. అనంతరం ముంబై ఫీల్డింగ్ సమయంలో ఒక అభిమాని నేరుగా గ్రౌండ్లో రోహిత్ వద్దకు వెళ్లి కౌగిలించుకోవడం భద్రతా సిబ్బంది వైఫల్యాన్ని చూపించింది. అనూహ్యంగా దూసుకొచి్చన ఫ్యాన్ రోహిత్ కూడా ఒక్కసారిగా భయపడిపోయాడు! ముంబై: ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో పరాజయాల ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమి పాలైంది. సోమవారం జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ముంబైను ఓడించి విజయాల ‘హ్యాట్రిక్’ సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 34; 6 ఫోర్లు), తిలక్ వర్మ (29 బంతుల్లో 32; 2 సిక్స్‌లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ (3/22) పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఆరంభంలోనే దెబ్బ తీయగా... చహల్‌కు కూడా 3 వికెట్లు దక్కాయి. అనంతరం రాజస్తాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లకు 127 పరుగులు చేసి గెలిచింది. రియాన్ పరాగ్ (39 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో గెలిపించాడు. టపటపా... రాజస్తాన్ బౌలింగ్ ధాటికి ముంబై బ్యాటింగ్ ఆరంభంలోనే కకావికలమైంది. బౌల్ట్ ధాటికి రోహిత్ శర్మ (0) తొలి బంతికే అవుట్ కాగా, తర్వాతి బంతికే నమన్ ధీర్ (0) వెనుదిరిగాడు. ఐపీఎల్లో అతి ‘తొందరగా’ రెండో ఓవర్లోనే ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన బ్రెవిస్ (0) కూడా తన తొలి బంతికే పెవిలియన్ చేరాడు. మరోవైపు ఇషాన్ కిషన్ (16) వికెట్ బర్గర్ ఖాతాలో పడింది. స్కోరు 20/4కు చేరిన దశలో తిలక్, పాండ్యా కొద్దిసేపు నిలిచి జట్టును ఆదుకున్నారు. బర్గర్ ఓవర్లో 3 ఫోర్లతో పాండ్యా ధాటిని ప్రదర్శించాడు. అయితే ఐదో వికెట్‌కు 36 బంతుల్లో 56 పరుగులు జోడించిన తర్వాత ముంబైని చహల్ దెబ్బ తీశాడు. తక్కువ వ్యవధిలో అతను పాండ్యా, తిలక్లను అవుట్ చేయడంతో ముంబై పరిస్థితి మరింత దిగజారింది. తిలక్ వెనుదిరిగాక జట్టు కోలుకోలేకపోయింది. అతను అవుటైన తర్వాత 40 బంతుల్లో 30 పరుగులే వచ్చాయి. టిమ్ డేవిడ్ (17) కూడా ప్రభావం చూపలేకపోయాడు. రాణించిన పరాగ్... లక్ష్యం చిన్నదే అయినా రాయల్స్ ఇన్నింగ్స్ కాస్త తడబాటుకు లోనైంది. తొలి ఓవర్లోనే యశస్వి (10) వెనుదిరగ్గా... సంజూ సామ్సన్ (12), బట్లర్ (13) కూడా విఫలమయ్యారు. అయితే పరాగ్ జాగ్రత్తగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. అశి్వన్ (16)తో కలిసి అతను ఐదో వికెట్‌కు 40 పరుగులు జత చేశాడు. విజయానికి 15 పరుగులు కావాల్సిన దశలో పరాగ్ వరుసగా 6, 6, 4 బాది ముగించాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) సామ్సన్ (బి) బర్గర్ 16; రోహిత్ (సి) సామ్సన్ (బి) బౌల్ట్ 0; నమన్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 0; బ్రెవిస్ (సి) బర్గర్ (బి) బౌల్ట్ 0; తిలక్ (సి) అశ్విన్ (బి) చహల్ 32; పాండ్యా (సి) (సబ్) పావెల్ (బి) చహల్ 34; చావ్లా (సి) హెట్‌మైర్ (బి) అవేశ్ 3; డేవిడ్ (సి) బౌల్ట్ (బి) బర్గర్ 17; కొయెట్జీ (సి) హెట్‌మైర్ (బి) చహల్ 4; బుమ్రా (నాటౌట్) 8; ఆకాశ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–14, 4–20, 5–76, 6–83, 7–95, 8–111, 9–114. బౌలింగ్: బౌల్ట్ 4–0–22–3, బర్గర్ 4–0–32–2, అవేశ్ ఖాన్ 4–0–30–1, చహల్ 4–0–11–3, అశ్విన్ 4–0–27–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) డేవిడ్ (బి) మఫాకా 10; బట్లర్ (సి) చావ్లా (బి) ఆకాశ్ 13; సామ్సన్ (బి) ఆకాశ్ 12; పరాగ్ (నాటౌట్) 54; అశ్విన్ (సి) తిలక్ (బి) ఆకాశ్ 16; శుభమ్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (15.3 ఓవర్లలో 4 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–10, 2–42, 3–48, 4–88. బౌలింగ్: మఫాకా 2–0–23–1, బుమ్రా 4–0–26–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–20–3, కొయెట్జీ 2.3–0–36–0, పీయూష్ చావ్లా 3–0–18–0. -
ఈసారి కొడితే హ్యాట్రిక్..!
గౌతమ్ బుద్ధ్ నగర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ నోయిడా అంటే మాత్రం ఇట్టే గుర్తొస్తుంది. ఢిల్లీ సమీపంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఈ లోక్‌సభ నియోజకవర్గంలో హ్యాట్రిక్‌పై బీజేపీ కన్నేసింది. జీబీ నగర్‌లోని నోయిడా, జేవార్, దాద్రీ, బులంద్‌షహర్‌లోని సికింద్రాబాద్, ఖుర్జాలతో కూడిన మొత్తం ఐదు సెగ్మెంట్లలో గౌతమ్ బుద్ధ్ నగర్ నియోజకవర్గంలో 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రానున్న లోక్‌సభ ఎన్నకల్లోనూ అవే ఫలితాలను అంచనా వేస్తోంది. ఇక్కడ గట్టి పోటీ ఇచ్చేందుకు బీఎస్పీ, కాంగ్రెస్, ఎస్పీతో సహా ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇవే బీజేపీ బలాలు తమ ప్రభుత్వం చేపట్టిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, దాద్రీ, బోడకిలో రవాణా సౌకర్యాలు, రైలు, మెట్రో విస్తరణ కారిడార్లు, సహా అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, పారిశ్రామిక కేంద్రాలతో పాటు రెండుసార్లు ఎంపీగా పనిచేసిన డాక్టర్ మహేష్ శర్మపై బీజేపీ విశ్వాసంతో ఉంది. గౌతమ్ బుద్ధ నగర్ రాజకీయ చరిత్రలో డాక్టర్ మహేష్ శర్మ విజయ పరంపర దశాబ్దం క్రితమే మొదలైంది. 2014 ఎన్నికలలో డాక్టర్ శర్మ 5,99,702 ఓట్లు, 50 శాతం ఓట్లతో మొదటిసారి విజయం సాధించారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నరేంద్ర భాటిని 2,80,212 ఓట్ల తేడాతో ఓడించారు. తరువాత, 2019 ఎన్నికలలో 8,30,812 ఓట్లు, 59.64 శాతం ఓట్లతో మరోసారి గెలుపొందారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. నోయిడా పేరుతో ప్రసిద్ధి చెందిన గౌతమ్ బుద్ధ్ నగర్ లోక్‌సభ స్థానానికి రెండో దశలో ఉత్తరప్రదేశ్‌లోని ఇతర నియోజకవర్గాలతో పాటు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల నాటి ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం, గౌతమ్ బుద్ధ నగర్లో 2,302,960 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,268,324 మంది పురుషులు, 1,034,503 మంది మహిళలు కాగా 133 మంది థర్డ్ జెండర్ ఓటర్లు. ఇక నియోజకవర్గంలో 3,297 పోస్టల్ ఓట్లు, 5,482 సర్వీస్ ఓటర్లు ఉన్నారు. -
General Elections 2024: వెయ్యేళ్ల అభివృద్ధికి పునాది
న్యూఢిల్లీ: పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల శంఖారావం చేశారు. ఈసారి కూడా ఘనవిజయం సాధించి ఖాయంగా హ్యాట్రిక్ కొడతామన్నారు. ‘‘సాధారణంగా నేను అంకెల జోలికి వెళ్లను. కానీ ఈసారి మాత్రం దేశం మనోగతాన్ని స్పష్టంగా అంచనా వేయగలను. ఎన్డీఏ కూటమికి ఏకంగా 400 పైచిలుకు స్థానాలొస్తాయి’’ అని జోస్యం చెప్పారు. బీజేపీ ఒంటరిగానే కనీసం 370 స్థానాలు సాధిస్తుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘మళ్లీ అధికారంలోకి వచ్చేస్తున్నాం. వచ్చాక చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం. మూడో టర్మ్‌లో వెయ్యేళ్ల ప్రగతికి పటిష్ట పునాదులు వేస్తాం’’ అని ప్రకటించారు. విపక్షాలన్నీ అప్పుడే కాడి కింద పడేశాయంటూ ఎద్దేవా చేశారు. ‘‘కనీసం ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వాటికి ధైర్యం చాలడం లేదు. తమకు మరిన్ని సీట్లు తగ్గి మరోసారి విపక్ష పాత్ర ఖాయమన్న నిర్ణయానికి వచ్చేశాయి’’ అన్నారు. కాంగ్రెస్ దుకాణం త్వరలో మూతపడుతుందని, దశాబ్దాల పాటు విపక్ష స్థానానికే పరిమితమవుతుందని ప్రధాని జోస్యం చెప్పారు. భారతీయుల సామర్థ్యంపై నెహ్రూకు, ఇందిరాగాం«దీకి ఎన్నడూ నమ్మకమే లేదంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలన కూడా అదే ఆత్మవిశ్వాస రాహిత్య ధోరణిలో సాగిందని విమర్శించారు. పదేళ్ల పాలనలో తాము సాధించిన ఘనతలను సాధించాలంటే కాంగ్రెస్‌కు కనీసం 100 ఏళ్లయినా పట్టి ఉండేదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సోమ వారం లోక్‌సభలో బదులిస్తూ ప్రధాని పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయారు. ‘‘మహా అయితే 100 నుంచి 125 రోజులు! మేం వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం’’ అని స్పష్టం చేశారు. ‘అబ్ కీ బార్ (ఈసారి)’ అంటూ మోదీ పదేపదే నినదించగా, ‘400 పార్ (400 స్థానాలు దాటేస్తాం)’ అంటూ బీజేపీ సభ్యులంతా ప్రతిసారీ ముక్త కంఠంతో గొంతు కలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ మాటే అంటున్నారని రాజ్యసభలో ఆయన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మోదీ చెప్పారు. తమ ప్రభుత్వ ఘనతలను వివరిస్తూ, విపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్‌ను, గాంధీ కుటుంబాన్ని ప్రధాని తూర్పారబట్టారు. వాటిపై విపక్షాల అభ్యంతరాలను, సభ్యుల నినాదాలను పట్టించుకోకుండా దాదాపు 100 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించారు. శతాబ్దాల ఎదురుచూపులు ఫలించి అయోధ్యలో మళ్లీ కొలువుదీరిన రాముడు దేశ ప్రగతి పయనానికి నూతన జవసత్వాలు అందిస్తాడన్నారు. కూటమి సారథిగానూ కాంగ్రెస్ విఫలం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నిర్మాణాత్మక సలహాలిచ్చే అవకాశాన్ని విపక్షాలు చేజార్చుకున్నాయని మోదీ అన్నారు. ‘‘దాంతో వారిపై దేశ ప్రజలకు పూర్తిగా భ్రమలు తొలగాయి. విపక్షాలు తాము సుదీర్ఘకాలం పాటు విపక్షాలుగానే ఉంటామంటూ తీర్మానించుకున్నాయి. వారు మాట్లాడుతున్న ప్రతి మాటా అందుకు అద్దం పడుతోంది. వాటి నిర్ణయాన్ని అభినందిస్తున్నా’’ అంటూ చెణుకులు విసిరారు. ఓటమి భయంతో చాలామంది విపక్ష నేతలు ఇప్పటికే స్థానాలు మారుతున్నారని, రాజ్యసభకు వెళ్లే ప్రయత్నాల్లోనూ పడ్డారని మోదీ ఎద్దేవా చేశారు. ‘‘విపక్షాలన్నీ కిందా మీదా పడి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి విచి్చన్నమైంది. ఇప్పుడా పారీ్టలన్నీ ఎక్ల చలో (ఒంటరిగా పోతాం) అంటున్నాయి’’ అని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయాన్ని ఉద్దేశించి బెంగాలీలో చమత్కరించారు. దేశంలో విపక్షాల ఈ దీన స్థితికి కాంగ్రెసే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. తద్వారా కాంగ్రెస్ ఒక పారీ్టగానే గాక కూటమి సారథిగా కూడా విఫలమైందని చెప్పే ప్రయత్నం చేశారు. ‘‘కుటుంబ పాలనతో కాంగ్రెస్ ముందే పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. నిర్మాణాత్మక విపక్ష పాత్ర పోషించడంలోనూ గత పదేళ్లుగా పదేపదే విఫలమైంది. తద్వారా ప్రజల నమ్మకం చూరగొనే సువర్ణావకాశాన్ని చేజేతులా పోగొట్టుకుంది. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడిక దశాబ్దాల పాటు విపక్షంలోనే ఉండాలని గట్టిగా నిర్ణయించుకుంది! ప్రజలు కూడా ఆ పార్టీని అక్కడే ఉంచడం ద్వారా ఆశీర్వదిస్తారు! అక్కడి నుంచి కాంగ్రెస్ మరిన్ని ఎత్తులకు చేరి త్వరలో లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీల్లో దర్శనమిస్తుంది’’ అంటూ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఒకే ప్రోడక్టును పదేపదే లాంచ్ చేస్తోందని రాహుల్‌ను, ఆయన చేపట్టిన భారత్ జోడో, న్యాయ్ యాత్రలను ఉద్దేశించి మోదీ అన్నారు. ‘‘ఇది ఎన్నికల వేళ. కాస్త కష్టపడి ఏదన్నా కొత్తగా ప్రయతి్నంచాల్సింది. జనాలకు కొత్త సందేశమేదన్నా ఇవ్వాల్సింది. కానీ ఈ విషయంలోనూ కా>ంగ్రెస్ ఘోరంగా విఫలమైంది’’ అంటూ తూర్పారబట్టారు. ఈ దెబ్బతో కాంగ్రెస్ దుకాణం బహుశా అతి త్వరలో మూతబడవచ్చని జోస్యం చెప్పారు. ‘‘దాంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితికి కాంగ్రెస్ దిగజారింది. రద్దు సంస్కృతిని అలవర్చుకుంది. కేవలం నాపై అక్కసుతో దేశం సాధించిన, సాధిస్తున్న ప్రతి ఘనతనూ రద్దు చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది’’ అంటూ మండిపడ్డారు. ‘‘దేశానికి కావాల్సింది ఆరోగ్యకరమైన విపక్షం. కానీ రాహుల్‌కు ఎక్కడ పోటీ వస్తారోనని కాంగ్రెస్‌లోని యువ నేతల గళాలను నాయకత్వమే అణచేస్తోంది. దానిది రాచకుటుంబాన్ని దాటి చూడలేనితనం’’ అంటూ దుయ్యబట్టారు. అవినీతికి విపక్షాల అండ! బీజేపీ సర్కారుపై విపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అవినీతికి, అందుకు పాల్పడుతున్న నేతలకు విపక్షాలే అడుగడుగునా కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. అవినీతి నేతలను కీర్తిస్తూ దేశానికి అవి ఏం సందేశమిస్తున్నాయని ప్రశ్నించారు. పైగా అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నందుకు తనపై, తన ప్రభుత్వంపై నిత్యం దుమ్మెత్తిపోస్తున్నాయని ఆక్షేపించారు. ‘‘నన్నెంత విమర్శించినా అవినీతిపై, అవినీతి నేతలపై కఠిన చర్యలు ఆగబోవు. దోచిందంతా కక్కాల్సిందే. దేశాన్ని దోచుకుంటున్న వారు మూల్యం చెల్లించాల్సిందే. పవిత్ర సభ సాక్షిగా దేశానికి నా వాగ్దానమిది’’ అన్నారు. దర్యాప్తు సంస్థలు విపక్ష నేతలను లక్ష్యం చేసుకుంటున్నాయన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘కాంగ్రెస్ హయాంలో అలాగే జరిగింది. అప్పట్లో దేశంలో ఎటు చూసినా అవినీతి తాండవమాడేది. పార్లమెంటులో చర్చంతా అవినీతి చుట్టే సాగేది. మా పాలనలో మాత్రం దర్యాప్తు రాజ్యాంగ నిర్దేశం మేరకు స్వతంత్రంగా పని చేస్తున్నాయి. వాటి పనితీరుపై తీర్పు చెప్పాల్సింది కోర్టులు మాత్రమే’’ అని చెప్పారు.కాంగ్రెష్ పాలనలో ఈడీ కేవలం రూ.5,000 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేయగా తమ హయాంలో అది ఏకంగా రూ.లక్ష కోట్లు దాటిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఓబీసీలకు అన్యాయం కాంగ్రెస్, ఆ పార్టీ సారథ్యంలోని యూపీఏ సర్కారు ఓబీసీలకు తీరని అన్యాయం చేశాయని, ఓబీసీ నేతలను ఘోరంగా అవమానించాయని మోదీ దుయ్యబట్టారు. ఎన్డీఏ సర్కారులో ఓబీసీల లెక్కలు తీసిన కాంగ్రెస్ నేతలు అతి పెద్ద ఓబీసీనైన తనను మాత్రం మర్చిపోయారన్నారు. వెనకబడ్డ వర్గాలకు చెందిన దివంగత బిహార్ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ఇచ్చి తాము గౌరవించుకున్నామన్నారు. ‘‘1970లో బిహార్‌లో ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరిచి సీఎం పదవి నుంచి దింపేందుకు ప్రయతి్నంచిన చరిత్ర కాంగ్రెస్‌ది. ఆయనను కనీసం విపక్షనేతగా కూడా ఓర్వలేకపోయింది’’ అంటూ మండిపడ్డారు. యూపీఏ హయాంలో తెరపైకి తెచి్చన జాతీయ సలహా మండలిని రాజ్యంగేతర శక్తిగా మోదీ అభివర్ణించారు. అందులో ఓబీసీలు ఎందరున్నారో చెప్పాలన్నారు. దేశ సామర్థ్యంపై నెహ్రూకు నమ్మకం లేదు భారతీయులు దద్దమ్మలు, బద్ధకస్తులని భావించేవారు ఇందిరది కూడా ఫక్తు అదే ధోరణి: మోదీ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై మోదీ తన ప్రసంగంలో సునిశిత విమర్శలు చేశారు. దేశం చిరకాలం పాటు ఎదర్కొన్న ఇక్కట్లకు, కశీ్మరీల సమస్యలకు ఆయన ఘోర తప్పిదాలే మూల కారణమని ఆరోపించారు. ‘‘భారతీయుల శక్తి సామర్థ్యాలపై నెహ్రూకు ఎన్నడూ నమ్మకమే లేదు. వాళ్లు బద్ధకస్తులని, తెలివితక్కువ వాళ్లని భావించేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఇదే విషయాన్ని నెహ్రూ స్పష్టంగా పేర్కొన్నారు. యూరోపియన్లు, జపానీయులు, చైనీయులు, రష్యన్లు, అమెరికన్ల మాదరిగా భారతీయులకు కష్టపడే స్వభావం లేదన్నారు. మనలను న్యూనతపరిచేందుకు వాళ్లను పొగిడారు. నెహ్రూ కుమార్తె, మాజీ ప్రధాని ఇందిరాగాం«దీది కూడా అదే ధోరణి. ఏదన్నా మంచి పని పూర్తయ్యే దశలో బద్దకించడం భారతీయులకు అలవాటని, అడ్డంకి ఎదురవుతూనే ఆశలొదిలేసుకుంటామని, కొన్నిసార్లు మొత్తం దేశమే ఓటమిని ఒప్పుకున్నట్టుగా కనిపిస్తుందని తక్కువ చేసి మాట్లాడారామె. భారతీయుల పట్ల ఆ రాచకుటుంబం భావన ఇదీ! తమను పాలకులుగా భావించుకుంటూ నిత్యం ప్రజలను కించపరిచిన చరిత్ర గాంధీ కుటుంబానిది. నెహ్రూ, ఇందిరల ఈ భావజాలమే కాంగ్రెస్‌కూ పాకింది. గాంధీ కుటుంబం చేతిలో బందీగా మారిన ఆ పార్టీ ప్రజల ఆకాంక్షలను, విజయాలను ఎప్పుడూ గుర్తించలేదు. గుర్తించజాలదు కూడా. భారతీయుల శక్తిసామర్థ్యాలను గుర్తించడంలో ఇందిర ఘోరంగా విఫలమయ్యారు గానీ నేటి కాంగ్రెస్ నేతలను మాత్రం అప్పట్లోనే ఆమె సరిగ్గా అంచనా వేశారనిపిస్తుంది! ఎందుకంటే ఆమె వ్యాఖ్యలు వారికి అతికినట్టుగా సరిపోతాయి’’ అని మోదీ అన్నారు. భారత్, భారతీయుల శక్తి సామర్థ్యాలపై తనకు అపారమైన విశ్వాసముందని చెప్పారు. ప్రధానిగా తన మూడో టర్ములో భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ఇది తన హామీ అని మోదీ చెప్పారు. కాంగ్రెస్ మాత్రం అధికారంలో ఉండగా పెద్దగా ఆలోచించేందుకు కూడా జంకిందని ఎద్దేవా చేశారు. దాని తీరు చూస్తే జాలేస్తోందన్నారు. ‘‘కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు చేసిన తప్పులన్నింటినీ మా తొలి టర్ములో సరిదిద్దుతూ వచ్చాం. రెండంకెలకు చేరిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశాం. రెండో టర్ములో నూతన భారతానికి పటిష్టమైన పునాదులు వేశాం. ఇక మూడో టర్ములో వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా సాగుతాం’’ అంటూ భవిష్యద్దర్శనం చేశారు. జీఎస్టీ, డిజిటైజేషన్, పెండింగ్ పథకాల పూర్తి వంటి పలు ఘనతలు తమ సొంతమన్నారు. తమ కృషి వల్ల భారత్ నేడు అంతర్జాతీయంగా ఇన్నొవేషన్లకు, పరిశోధనలకు, తయారీ రంగానికి కేంద్రంగా రూపుదిద్దుకుందన్నారు. స్వచ్ఛ ఇంధనం, సెమీ కండక్టర్ల వంటి పలు రంగాల్లో స్వావలంబన సాధించాల్సి ఉందని చెప్పారు. -
హ్యాట్రిక్‌పై బీజేపీ గురి...!
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్న బీజేపీ ఆ దిశగా సన్నాహాలను వేగవంతం చేస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తాలూకు ఊపును కొనసాగించేలా పార్టీ నేతలను, శ్రేణులను సమాయత్తం చేస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 50 శాతానికి పైగా ఓట్ల సాధనను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది! ఈ మేరకు రాష్ట్రాలవారీగా ముఖ్య నేతలకు అధినాయకత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. ఇటీవలి బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు నేతలందరికీ ఈ మేరకు స్పష్టం చేయడంతో పాటు ఆ దిశగా బాధ్యతలు కూడా అప్పగించినట్టు సమాచారం. 50 శాతం ఓట్ల లక్ష్యసాధన కోసం 2019తో పోలిస్తే ఈసారి వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయానికి వచి్చనట్టు చెబుతున్నారు. ఇందుకు ఎన్డీఏ మిత్రపక్షాలను ఒప్పించే ప్రయత్నాలకు పార్టీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. 2019తో పోలిస్తే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్య తగ్గడం కూడా తాను ఎక్కువ చోట్ల పోటీ చేసేందుకు వీలు కలి్పస్తుందని బీజేపీ భావిస్తోంది. పంజాబ్‌లో అకాలీదళ్, బిహార్‌లో జేడీ(యూ)తో బీజేపీకి ఇప్పటికే తెగదెంపులవడం తెలిసిందే. తమిళనాడులో అన్నాడీఎంకే, రాజస్థాన్‌లో ఆరెలీ్పలతోనూ అటూ ఇటుగా అదే పరిస్థితి. ఇక మహారాష్ట్రలో శివసేన చీలికలో ఏక్నాథ్ షిండే వర్గానికి బీజేపీ మద్దతుగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది. కనుక షిండే సేనకు వీలైనన్ని తక్కువ లోక్‌సభ సీట్లిచ్చి అత్యధిక స్థానాల్లో తానే పోటీ చేసేలా కన్పిస్తోంది. నెలాఖరు నుంచి జాబితాలు...! జనవరి నెలాఖరు, లేదా ఫిబ్రవరి తొలి వారం నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలు విడుదలయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వంటి దిగ్గజాల పేర్లుంటాయి. తద్వారా ఎన్నికల వాతావరణానికి దేశవ్యాప్తంగా ఊపు తేవాలన్నది లక్ష్యం’’ అని వివరించాయి. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా మోదీ, షా, రాజ్‌నాథ్ పేర్లు తొలి జాబితాలోనే చోటుచేసుకోవడం తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలు నెగ్గేందుకు బీజేపీ పలు చర్యలు చేపడుతోంది... 1. తొలి జాబితాలో వీలైనన్ని ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ముఖ్యంగా 2019లో పార్టీ ఇబ్బందులను ఎదుర్కొన్న, తక్కువ మెజారిటీతో నెగ్గిన స్థానాలపై ఈ జాబితాలో బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. నిజానికి వీటిని ‘సవాలు స్థానాలు’గా ఎప్పుడో గుర్తించింది. గత ఎన్నికల ఫలితాలు రాగానే వాటిపై గట్టిగా దృష్టి పెట్టింది. ఆయా స్థానాల్లో పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు ప్రయతి్నస్తూ వస్తోంది. 2. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో బీజేపీ 436 చోట్ల పోటీ చేసింది. 303 స్థానాలు నెగ్గి 133 చోట్ల ఓటమి చవిచూసింది. వాటితో పాటు బాగా బలహీనంగా మరో 31 స్థానాలపై బీజేపీ ఈసారి బాగా ఫోకస్ చేస్తోంది. వీటిని తొలి జాబితాలో చేర్చనుంది. 3. ఈ 164 ‘టార్గెటెడ్’ స్థానాల్లో గెలుపు బాధ్యతలను అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలకు అప్పగించనుంది. వీటినిప్పటికే రెండు గ్రూపులుగా బీజేపీ విభజించింది. 45 మంది కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు స్థానాల చొప్పున బాధ్యతలను భుజాలకెత్తుకుంటారు. 4. ఢిల్లీ పీఠానికి రాచబాటగా పరిగణించే కీలకమైన ఉత్తరప్రదేశ్‌పై ఈసారి బీజేపీ మరింతగా ఫోకస్ చేస్తోంది. రాష్ట్రంలో 80 లోక్‌సభ సీట్లకు గాను 2019 ఎన్నికల్లో 16 చోట్ల బీజేపీ ఓటమి చవిచూసింది. అనంతరం రాయ్‌బరేలీ, మెయిన్‌పురి స్థానాలను ఉప ఎన్నికల్లో చేజిక్కించుకుంది. మిగతా 14 లోక్‌సభ స్థానాల్లో పార్టీ బాగా బలహీనంగా ఉందన్న అంచనాతో వాటిపై బాగా దృష్టి పెడుతోంది. రాయ్‌బరేలీ, మెయిన్‌పురితో పాటు ఈ 14 స్థానాలకూ అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించే యోచనలో ఉంది. వీటిలో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలుగా చెప్పే పలు స్థానాలున్నాయి. 5. ఇలాగే బిహార్‌లో కూడా క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్నట్టు భావిస్తున్న నవడా, సుపౌల్, కిషన్‌గంజ్, కతీహార్, ముంగేర్, గయ వంటి స్థానాలు కూడా బీజేపీ తొలి జాబితాలోనే ఉంటాయని భావిస్తున్నారు. 6. మధ్యప్రదేశ్‌లో పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ కురువృద్ధుడు కమల్‌నాథ్ కంచుకోటైన ఛింద్వారాతో పాటు ఆ పార్టీకి పట్టున్న పలు స్థానాలపై బీజేపీ గట్టిగా దృష్టి పెట్టింది. ఛింద్వారా బాధ్యతలను కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు అప్పగించారు. 7. కేరళలో కూడా త్రిసూర్, తిరువనంతపురం, పథినంతిట్ట వంటి స్థానాల్లో విజయవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు బీజేపీ అంచనా వేస్తోంది. త్రిసూర్ నుంచి సినీ హీరో సురేశ్ గోపిని బరిలో దించుతుందన్న అంచనాలున్నాయి. 8. మహారాష్ట్రలో ఎన్సీపీ చీఫ్ వరద్ పవార్ కంచుకోటైన బారామతితో పాటు బుల్దానా, ఔరంగాబాద్ వంటి లోక్‌సభ స్థానాల్లో ఈసారి ఎలాగైనా పాగా వేసి తీరాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఇక పంజాబ్‌లో అమృత్సర్, ఆనంద్‌పూర్ సాహిబ్, భటిండా, గురుదాస్‌పూర్ తదితర లోక్‌సభ సీట్లపై కూడా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 9. పంజాబ్, మహారాష్ట్ర, బిహార్లలో స్థానిక పారీ్టలతో బీజేపీ పొత్తు చర్చలు ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నాయి. పరిస్థితులు, అవసరాలను బట్టి ఈ రాష్ట్రాల్లో ఇచి్చపుచ్చుకునే ధోరణితో వెళ్లాలన్న యోచనలో అధినాయకత్వం ఉంది. 10. 70 ఏళ్లు పైబడ్డ నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వొద్దన్న యోచన కూడా బీజేపీ అధినాయకత్వం పరిశీలనలో ఉందని విశ్వసనీయ సమాచారం! మూడుసార్లకు మించి నెగ్గిన వారిని కూడా పక్కన పెట్టనుందని చెబుతున్నారు. వారికి బదులు కొత్త ముఖాలకు చాన్సివ్వాలని మోదీ–షా ద్వయం సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారని బీజేపీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తోంది. ఇది నిజమే అయితే అందరికీ వర్తింపజేస్తారా, మినహాయింపులుంటాయా అన్నది చూడాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చరిత్ర సృష్టించిన సికందర్ రజా.. కోహ్లి రికార్డు సమం
టీ20 వరల్డ్‌కప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా రువాండతో నిన్న (నవంబర్ 27) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు (కెప్టెన్) సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వే తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో అతను బంతితో (2.4-0-3-3) పాటు బ్యాట్‌తోనూ (36 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో జింబాబ్వే 144 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా టీ20ల్లో జింబాబ్వేకు ఇదే అత్యుత్తమ విజయం. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన రజా.. ఈ ఏడాది రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును కూడా సమం చేశాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం ఆరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోగా.. నిన్నటి మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో రజా విరాట్ రికార్డును (6) సమం చేశాడు. ఈ టోర్నీలో ఉగాండ లాంటి చిన్న జట్టు చేతిలో ఓటమిపాలైన జింబాబ్వే తాజా గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి వరల్డ్‌కప్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ టోర్నీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనుండగా.. నమీబియా, ఉగాండ, కెన్యా జట్లు రేసులో ముందున్నాయి. ఈ మూడు జట్ల తర్వాతి స్థానంలో జింబాబ్వే ఉంది. ఈ టోర్నీలో జింబాబ్వే మరో రెండు మ్యాచ్‌లు (నైజీరియా, కెన్యా) ఆడాల్సి ఉంది. కాగా, రువాండతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. సికందర్ రజాతో పాటు మరుమణి (50), ర్యాన్ బర్ల్ (44 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రువాండ.. రిచర్డ్ నగరవ (3/11), సికందర్ రజా (3/3), ర్యాన్ బర్ల్ (2/7) ధాటికి 71 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. -
గజ్వేల్ జేజేల కోసం..
యెన్నెల్లి సురేందర్ : మలివిడత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2021వరకు ఎంతో సాన్నిహిత్యం, అనుబంధం ఉన్న సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. గజ్వేల్ గడ్డ పై మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్ అభివృద్ధి మంత్రంతో హ్యాట్రిక్ ధీమాతో ఉండగా, ఈటల బీసీ నినాదంతో బరిలోకి దిగారు. కేసీఆర్ : అభివృద్ధి ఎజెండా ఈటల : బీసీ మంత్రం నర్సారెడ్డి : లోకల్ ఫ్లేవర్ అభివృద్ధి మంత్రం.. బహుముఖ వ్యూహం ‘సెంటిమెంట్’గా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొని రెండుసార్లు సీఎం పదవి చేపట్టిన కేసీఆర్ గజ్వేల్‌ను రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనాగా మలచడంలో సఫలమయ్యారు. నియోజకవర్గంలోని మర్కూక్ వద్ద కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, కొండపాక మండలంలో మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం, ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ యూనివర్సిటీ, గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌లో రింగురోడ్డు, వంద పడకల జిల్లా ఆస్పత్రి, మరో వంద పడకలతో మాతా శిశురక్షణ ఆస్పత్రి, ఎడ్యుకేషన్ హబ్ వంటి అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరిగాయి. గజ్వేల్ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా జరిగిన అభివృద్ధిని చూపిస్తూ కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు బీఆర్ఎస్ యంత్రాంగం బహుముఖ వ్యుహంతో ముందుకు సాగుతోంది. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తూ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అన్నింటికీ మించి బూత్‌లెవల్ మేనేజ్మెంట్ సక్రమంగా జరిగేలా వంద ఓట్లకు ఒక ఇన్చార్జిని నియమించారు. ప్రజా ఉద్యమాలకు ఊపిరి... గజ్వేల్, తూప్రాన్, మనోహరాబాద్, ములుగు, మర్కూక్, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, కుకునూర్‌పల్లి మండలాలతో కూడుకొని ఉన్న గజ్వేల్ నియోజకవర్గం యాదాద్రి, జనగామ, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సరిహద్దున ఉన్నది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకొని ఉండటం వల్ల ఇక్కడ నగర వాతావరణం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో 179 పంచాయతీలున్నాయి. నిర్వాసితులను ఆకట్టుకునే ప్రయత్నం గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో మల్లన్నసాగర్ నిర్వాసితులను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు ఆరాటపడుతున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తొగుట మండలంలో పల్లెపహాడ్, వేములగాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురైన సంగతి తెలిసిందే. ఆయా గామాల్లో 10వేలకుపైగా ఓట్లు ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్నికల్లో తమకు మద్దతు ప్రకటిస్తే పోరాడుతామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు హామీ ఇస్తున్నారు. ఈటల ముమ్మర ప్రచారం బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బీసీ నినాదం, స్థానిక సమస్యలే ఎజెండాతో ఎన్నికల బరిలో దిగారు. నియోజకవర్గంలో సుమరుగా 1.40లక్షల బీసీ ఓటర్లు ఉండగా..అందులో తన సొంత సామాజికవర్గం ముదిరాజులు 55వేల వరకు ఉంటారు. వీరిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పేరిట 30వేల కుటుంబాలకు చెందిన భూములను లాక్కొని, సరైన నష్ట పరిహారం ఇవ్వకపోవడంతో రోడ్డున పడ్డారని చెబుతూ...వారందరికీ అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తి నేతలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 1992 నుంచి సుమారు పదేళ్లకుపైగా ఈటల ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి ’లోకల్’ కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి నేను లోకల్ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే 24గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రచారం చేస్తున్నారు. ఈటల రాజేందర్ కూడా స్థానిక వ్యక్తి కాదని, ఆయన గెలిచినా ఉపయోగం ఉండదని చెబుతున్నారు. -
రెండు సీట్లు రాని బీజేపీ బీసీని సీఎంను చేస్తుందా?
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో రెండు సీట్లు కూడా గెలవని బీజేపీ.. ఇప్పుడు బీసీలకు సీఎం పదవి అనడం హాస్యాస్పదమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎద్దేవా చేశారు. ఏదైనా చెప్పేముందు దానిలో వాస్తవికత ఉండాలని అన్నారు. సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తామన డం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము ఏ పార్టీకీ బీ టీమ్ కాదని తలసాని స్పష్టం చేశారు. తమది ఏ టీమ్ అని, సింగిల్ గానే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందన్నారు. బీఆర్ఎస్కు తగినన్ని సీట్లు రావనే ప్రశ్నే ఉత్పన్నం కాదని, 78 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని చెప్పారు. కేంద్రంలోనూ కీలక భూమిక పోషిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు! పోటీ చేసేందుకు తగిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి లేరని తలసాని విమర్శించారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన 27 మందికి సీట్లివ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన వారికి వెంటనే సీట్లు ఇస్తోందన్నారు. బల్దియా ఎన్నికల్లో ఎక్కువ మంది బీజేపీ కార్పొరేటర్లు గెలిచినప్పటికీ ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును తెరపైకి తేవడం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆడిన డ్రామా అని విమర్శించారు. తాము అమలు చేస్తు న్న పథకాలను దేశమే కాపీ కొడుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు ఓటువేసే హక్కును ఉపయోగించుకోవాలని, ఓట్లు వేయరనే అపప్రదను చెరిపి వేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడం, చంద్రబాబు అరెస్టు, తదితర పరిణామాల ప్రభావం ఇక్కడ ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యల్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే పరిష్కరిస్తుందంటూ, తమ(ఎమ్మెల్యేల)ఇళ్ల స్థలా లు కూడా ఆగిపోయాయని వ్యాఖ్యానించారు. -
హిస్టరీ మారుతుందా?...హ్యాట్రిక్ కొడుతుందా?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న రెండు టర్మ్‌ల తర్వాత పాలన మార్పు ఒరవడి ఈసారి బ్రేక్ అవుతుందా..? లేక కొనసాగుతుందా..? అనే చర్చకు తావిస్తున్నాయి. 1983లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం, కాంగ్రెస్‌లు రెండుసార్లు వరుస విజయాలు సాధించాయి. కానీ మూడోసారి అధికారం చేపట్టడంలో విఫలమయ్యాయి. అయితే మధ్యలో 1989లో ఒకసారి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ 1994లో మాత్రం రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. కాగా 1983 నుంచి 2014 వరకు కాంగ్రెస్, టీడీపీలకే అధికారం చేజిక్కుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారం చేపట్టిన టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) రెండోసారీ (2018లో) అధికారంలోకి వచ్చింది. తాజాగా 2023 నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గత ఒరవడికి భిన్నంగా వరుసగా మూడో విజయాన్ని బీఆర్ఎస్ నమోదు చేస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మూడు ప్రధాన పార్టీలూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అన్ని ఎన్నికల్లోనూ స్పష్టమైన మెజారిటీ..! గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు స్పష్టమైన తీర్పునే ఇచ్చారు. ఎక్కడా అసందిగ్ధతకు తావివ్వలేదు. అయితే ఈసారి ఓ రాజకీయ పార్టీ ప్రముఖుడు తమ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ హంగ్ ఏర్పడుతుందని, అయినా తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పడం చర్చనీయాంశమయ్యింది. అయితే తర్వాత ఆ పార్టీ తమ నేత అలా మాట్లాడలేదంటూ హంగ్‌ను కొట్టిపారేసింది. తమ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ప్రకటించింది. ఇక మిగతా రెండు ప్రధాన పార్టీలు కూడా హంగ్‌ను కొట్టిపారేయడం గమనార్హం. బీఆర్ఎస్ నేతల్లో ధీమా అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇతర నేతలు పూర్తి దీమాతో ఉన్నారు. గత తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని, బంగారు తెలంగాణ దిశగా సాగుతున్న ఈ తరుణంలో కేసీఆర్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని కేటీఆర్ అంటున్నారు. రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని, దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా మారడం తప్పకుండా సానుకూల ఫలితాన్నిస్తుందని చెబుతున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ కేంద్ర స్థానంగా మారిందని, బెంగళూరును వెనక్కి నెట్టి ఐటీలో ఉద్యోగాల కల్పన జరుగుతోందని వివరిస్తున్నారు. కేసీఆర్ కూడా తరచూ తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగంలోనూ దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ అని.. సాగు, తాగునీటి రంగాలే కాక గ్రామీణ ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరిగిందనడానికి కేంద్రం ఇస్తున్న అవార్డులే నిదర్శనం అని నొక్కి చెబుతున్నారు. ఇవన్నీ ఎన్నికల్లో విజయానికి దోహదపడతాయనేది అధికార పక్షం వాదన. ఢీ అంటే ఢీ అంటున్న మూడు పార్టీలు గడిచిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండేది. కానీ ఈసారి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రధాన పోటీదారుగా ఉండటంతో ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఢంకా బజాయిస్తున్నాయి. సాధారణ ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తి, ఎమ్మెల్యేలపై అసంతృప్తి, అవినీతి ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ మూడోసారి అధికార పీఠాన్ని అధిష్టించే అవకాశమే లేదని, తాము గెలుపొందడం ఖాయమనే భావనలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. విజయ సాధన దిశగా ఎవరికి వారు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. ఆరు గ్యారంటీలపై అపార నమ్మకం.. అదే సమయంలో తెలంగాణ ఇచ్చి న పార్టీగా, ఆరు గ్యారంటీలతో ఈసారి తాము తప్పనిసరిగా విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అవినీతి, కుటుంబ పాలనతో పాటు నిరుద్యోగులను మోసం చేసిందని ప్రధానంగా ఆరోపిస్తోంది. ప్రభుత్వ భూముల విక్రయంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అనుయాయులకే ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నదని విమర్శిస్తోంది. రాష్ట్రాన్ని పాలించే అర్హత బీఆర్ఎస్కు లేదని తేల్చి చెబుతోంది. డబుల్ ఇంజన్ నినాదం రాష్ట్రం, కేంద్రంలో ఒకే పార్టీ అధి కారంలో ఉంటే అభివృద్ధిలో దూసుకుపోయేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ చెబుతోంది. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ప్రచారం చేస్తోంది. రాష్ట్రానికి తొమ్మిదేళ్లలో తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దయెత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తోంది. బీసీ నినాదం ఎత్తుకోవడంతో పాటు బీసీలకు అత్యధికంగా టికెట్లు ఇవ్వడం ద్వారా వారికి చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. ఉచితాల జోలికి వెళ్లకుండా అభివృద్ధి పథకాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టి విజయం సాధించాలనే ఆలోచనలో ఉంది. -
ఈసారి సెంచరీ కొడతాం
ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ ఇప్పటికే సర్వసన్నద్ధమైంది. కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసింది. బీజేపీ కాడి పడేసింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత రికార్డులు తిరగరాసి సెంచరీ కొడుతుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయి. పదేళ్ల ప్రగతి మా పాశుపతాస్త్రం, విశ్వసనీయతే మా విజయ మంత్రం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయని.. బీఆర్ఎస్ ఘన విజ యం సాధిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ఆయన ‘ఎక్స్ (ట్విట్టర్)’లో స్పందించారు. ‘‘ప్రజలు రెండు సార్లు నిండు మనసుతో ఆశీర్వదించారు. డిసెంబర్ మూడున జరిగే ఓట్ల లెక్కింపులో ముచ్చటగా మూడోసారి గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. దక్షత గల నాయకత్వానికే మరోసారి ప్రజలు పట్టం కట్టడం ద్వారా దక్షిణ భారతంలోనే సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. పదేళ్ల ప్రగతి మా పాశుపతాస్త్రం, విశ్వసనీయతే మా విజయ మంత్రం. ప్రజల అండతో బీఆర్ఎస్కు విజయం.. ప్రతీప శక్తులకు పరాభవం తప్పదు. మా టీమ్ కెప్టెన్ కేసీఆర్ కాబట్టి హ్యాట్రిక్ విజయం సాధిస్తాం. మంచి చేసే బీఆర్ఎస్కు ప్రజలు మద్దతు పలికి.. ముంచే పార్టీలపై వేటు వేస్తారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా గులాబీ జెండా ఎగురుతుంది. తెలంగాణలో గాంధీ సిద్ధాంతమే తప్ప గాడ్సే రాద్ధాంతం నడవదు. ఉద్యమ చైతన్యం 2014 అసెంబ్లీ ఎన్నికలను నడిపిస్తే.. సంక్షేమ సంబురం 2018లో బీఆర్ఎస్ను రెండోమారు గెలిపించింది. తెలంగాణ సాధించిన పదేళ్ల ప్రగతి ప్రస్థానమే 2023 ఎన్నికలో మా విజయాన్ని శాసిస్తుంది. ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ ఇప్పటికే సర్వసన్నద్ధమవగా.. కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసింది, బీజేపీ కాడి పడేసింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత రికార్డులు తిరగరాసి సెంచరీ కొడుతుంది. ముమ్మాటికీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తాం..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
హ్యాట్రిక్ అర్థసెంచరీలు.. ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు
వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ అర్థసెంచరీతో మెరిశాడు. 43 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న ఇషాన్ కిషన్ ఓవరాల్‌గా 64 బంతుల్లో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో గిల్‌ను ఒక ఎండ్‌లో నిల్చోబెట్టి వేగంగా ఆడిన ఇషాన్ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే కారియా బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు సాధించాడు. ద్వైపాక్షిక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ అర్థసెంచరీలు బాదిన ఆరో టీమిండియా క్రికెటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. ఇషాన్ కంటే ముందు క్రిష్ణమాచారి శ్రీకాంత్ వర్సెస్ శ్రీలంక(1982), దిలీప్ వెంగ్‌సర్కార్ వర్సెస్ శ్రీలంక(1985), మహ్మద్ అజారుద్దీన్ వర్సెస్ శ్రీలంక(1993), ఎంఎస్ ధోని వర్సెస్ ఆస్ట్రేలియా(2019), శ్రేయాస్ అయ్యర్ వర్సెస్ న్యూజిలాండ్(2020) ఉన్నారు. ఇక టీమిండియా ప్రస్తుతం 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. గిల్ 61, సంజూ శాంసన్ 18 పరుగులతో ఆడుతున్నారు. क्या किशन का यह फ़ॉर्म उन्हें विश्व कप की भारतीय प्लेइंग-XI में शामिल करवा पाएगा?#WIvIND #ishankishan pic.twitter.com/VmrLVqKrR5 — ESPNcricinfo हिंदी (@CricinfoHindi) August 1, 2023 చదవండి: WTC 2023-25: చివరి టెస్టులో విజయం.. ఆసీస్‌తో సమానంగా ఇంగ్లండ్ -
హ్యాట్రిక్ గోల్స్.. భారత మహిళల ఘన విజయం
బార్సిలోనా: స్పానిష్ హాకీ ఫెడరేషన్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న టోర్నీలో భారత మహిళల జట్టుకు తొలి విజయం దక్కింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. భారత్ తరఫున అన్నీ గోల్స్ తానే సాధించిన లాల్రెమ్సియామి ‘హ్యాట్రిక్’ నమోదు చేయడం విశేషం. మ్యాచ్ 13వ, 17వ, 56వ నిమిషాల్లో ఆమె మూడు ఫీల్డ్ గోల్స్ కొట్టింది. మొదటి, రెండో క్వార్టర్లో ఒక్కో గోల్ సాధించిన భారత్ చివరి క్వార్టర్లో మరో గోల్‌తో ముగించింది. ఈ టోరీ్నలో రౌండ్ రాబిన్ లీగ్ దశలో ఇంగ్లండ్, స్పెయిన్లతో తొలి రెండు మ్యాచ్‌లను భారత్ ‘డ్రా’గా ముగించింది. సవితా పూనియా నాయకత్వంలోని మన జట్టు తమ తర్వాతి పోరులో నేడు స్పెయిన్‌తో తలపడుతుంది.