Ishan Kishan Hat-trick-ODI Half Centuries Joins Elite List Vs WI - Sakshi
Sakshi News home page

Ishan Kishan: హ్యాట్రిక్‌ అర్థసెంచరీలు.. ఇషాన్‌ కిషన్‌ అరుదైన రికార్డు

Published Tue, Aug 1 2023 9:04 PM | Last Updated on Tue, Aug 1 2023 9:18 PM

Ishan Kishan Hat-trick-ODI Half Centuries Joins Elite List Vs WI - Sakshi

వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ హ్యాట్రిక్‌ అర్థసెంచరీతో మెరిశాడు. 43 బంతుల్లో అర్థసెంచరీ మార్క్‌ అందుకున్న ఇషాన్‌ కిషన్‌ ఓవరాల్‌గా 64 బంతుల్లో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో గిల్‌ను ఒక ఎండ్‌లో నిల్చోబెట్టి వేగంగా ఆడిన ఇషాన్‌ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే కారియా బౌలింగ్‌లో స్టంప్‌ అవుట్‌గా వెనుదిరిగాడు.

ఈ క్రమంలో ఇషాన్‌ కిషన్‌ అరుదైన రికార్డు సాధించాడు. ద్వైపాక్షిక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్‌ అర్థసెంచరీలు బాదిన ఆరో టీమిండియా క్రికెటర్‌గా ఇషాన్‌ కిషన్‌ నిలిచాడు. ఇషాన్‌ కంటే ముందు క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ వర్సెస్‌ శ్రీలంక(1982), దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ వర్సెస్‌ శ్రీలంక(1985), మహ్మద్‌ అజారుద్దీన్‌ వర్సెస్‌ శ్రీలంక(1993), ఎంఎస్‌ ధోని వర్సెస్‌ ఆస్ట్రేలియా(2019), శ్రేయాస్‌ అయ్యర్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌(2020) ఉన్నారు.

ఇక టీమిండియా ప్రస్తుతం 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. గిల్‌ 61, సంజూ శాంసన్‌ 18 పరుగులతో ఆడుతున్నారు. 

చదవండి: WTC 2023-25: చివరి టెస్టులో విజయం.. ఆసీస్‌తో సమానంగా ఇంగ్లండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement