టీ20 ప్రపంచకప్‌లో మరో హ్యాట్రిక్‌.. లంక స్పిన్నర్‌ ఖాతాలో పలు అరుదైన రికార్డులు | T20 World Cup 2021: Hasaranga Takes Hat Trick Vs South Africa | Sakshi
Sakshi News home page

T20 WC 2021 SA Vs SL: టీ20 ప్రపంచకప్‌లో మరో హ్యాట్రిక్‌.. లంక స్పిన్నర్‌ ఖాతాలో పలు అరుదైన రికార్డులు

Published Sat, Oct 30 2021 7:53 PM | Last Updated on Sat, Oct 30 2021 7:59 PM

T20 World Cup 2021: Hasaranga Takes Hat Trick Vs South Africa - Sakshi

Hasaranga Takes Hat Trick Vs South Africa In 2021 T20 World Cup: టీ20 ప్రపంచకప్‌-2021లో రెండో హ్యాట్రిక్‌ నమోదైంది. అక్టోబర్‌ 30న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్‌ వనిందు హసరంగ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 15వ ఓవర్‌ ఆఖరి బంతికి మార్క్రమ్‌(19)ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన హసరంగ.. 18వ ఓవర్‌ తొలి బంతికి బవుమా(46), రెండో బంతికి ప్రిటోరియస్‌(0) వికెట్లు పడగొట్టి.. కెరీర్‌లో తొలి టీ20 హ్యాట్రిక్‌ సాధించాడు. తద్వారా టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో హ్యాట్రిక్‌ సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

2007లో ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ బ్రెట్‌ లీ పొట్టి ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేయగా.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌ ఆటగాడు కర్టిస్‌ క్యాంపర్‌ నెదర్లాండ్స్‌పై ఈ ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించడం ద్వారా హసరంగ ఖాతాలో మరో అరుదైన రికార్డు కూడా చేరింది. వన్డేల్లో, టీ20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన నాలుగో ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. హసరంగకు ముందు బ్రెట్‌ లీ, తిసార పెరీరా, లిసత్‌ మలింగలు ఈ ఘనత సాధించారు.   

కాగా, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికానే విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో లంక నిర్ధేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాట ఆడింది. తొలుత లంక స్పిన్నర్‌ హసరంగ(3/20) హ్యాట్రిక్‌ సాధించడంతో మ్యాచ్‌ లంక వైపు మొగ్గుచూపగా.. ఆఖర్లో మిల్లర్‌(13 బంతుల్లో 23; 2 సిక్సర్లు) కిల్లర్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. మిల్లర్‌ వరుస సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. అతనికి రబాడ(7 బంతుల్లో 13; ఫోర్‌, సిక్స్‌) సహకరించడంతో మరో బంతి మిగిలుండగానే దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారి కెప్టెన్‌ బవుమా(46 బంతుల్లో 46; ఫోర్‌, సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. లంక బౌలర్లలో హసరంగతో పాటు చమీరా(2/27) రాణించాడు.
చదవండి: షాహిన్‌ అఫ్రిది తరహాలో టీమిండియాపై విరుచుకుపడతా.. కివీస్‌ స్టార్‌ పేసర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement