Wanindu Hasaranga: అదరగొట్టిన హసరంగ.. టీమిండియా బౌలర్లు ఒక్కరూ లేరు! | ICC T20 Rankings: Wanindu Hasaranga Tops No Indian Bowlers In Top 10 | Sakshi
Sakshi News home page

Wanindu Hasaranga: అదరగొట్టిన హసరంగ.. టీమిండియా బౌలర్లు ఒక్కరూ లేరు!

Published Wed, Nov 10 2021 5:08 PM | Last Updated on Wed, Nov 10 2021 5:31 PM

ICC T20 Rankings: Wanindu Hasaranga Tops No Indian Bowlers In Top 10 - Sakshi

ICC T20 Rankings: Wanindu Hasaranga Tops No Indian Bowlers In Top 10: టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో ఆకట్టుకున్న శ్రీలంక యువ సంచలనం వనిందు హసరంగ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. బౌలర్ల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న హసరంగ.. ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్‌-3లో నిలిచాడు. ఒక స్థానం మెరుగుపరచుకుని 173 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక అఫ్గనిస్తాన్‌ కెప్టెన్‌ మహ్మద్‌ నబీ ఆల్‌రౌండర్ల జాబితాలో 265 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు.

మరోవైపు గాయం కారణంగా టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీ మధ్యలోనే జట్టుకు దూరమైన బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌(260) ఒక స్థానం కోల్పోయి రెండో ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. వనిందు హసరంగ(శ్రీలంక- 173), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(ఆస్ట్రేలియా- 165), ఒమన్‌ కెప్టెన్‌ జీషన్‌ మక్సూద్‌(160) పాయింట్లతో మొదటి 5 ర్యాంకుల్లో చోటు దక్కించుకున్నారు.

టీమిండియా బౌలర్లు ఒక్కరూ లేరు
ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్‌ జాబితాలో వనిందు హసరంగా(797) పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌-2021లో మొత్తంగా(క్వాలిఫయర్స్‌, సూపర్‌ 12) 16 వికెట్లు పడగొట్టిన అతడు.. తన ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత తబ్రేజ్‌ షంసీ(దక్షిణాఫ్రికా- 784), ఆదిల్‌ రషీద్‌(ఇంగ్లండ్‌- 727), రషీద్‌ ఖాన్‌(అఫ్గనిస్తాన్‌- 710), ఆడం జంపా(ఆస్ట్రేలియా- 709) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఇక ఆల్‌రౌండర్‌, బౌలర్ల జాబితాలో ఒక్క టీమిండియా ప్లేయర్‌ కూడా టాప్‌-10లో లేకపోవడం గమనార్హం. కాగా పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌తో పరాజయాల నేపథ్యంలో.. తర్వాతి మ్యాచ్‌లలో ఆకట్టుకున్నా కోహ్లి సేన సెమీస్‌ చేరలేక ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే.

చదవండి: Virat Kohli: అగ్రస్థానంలో బాబర్‌ ఆజమ్‌.. 4 స్థానాలు దిగజారిన కోహ్లి.. ఏకంగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement