Wanindu Hasaranga
-
లంక చేతిలో ఘోర పరాజయం.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు అవమానం
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాకు ఘోర అవమానం జరిగింది. శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆసీస్ 0-2 తేడాతో చిత్తుగా ఓడింది. ఇవాళ (ఫిబ్రవరి 14) జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 174 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయాలతో సతమతమవుతున్న ఆసీస్‌ను ఈ పరాజయం మరింత కృంగదీసింది.మ్యాచ్ విషయానికొస్తే.. కొలొంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక (6) వికెట్ కోల్పోయింది. అయితే నిషాన్ మధుష్క (51), కుసాల్ మెండిస్ (101) రెండో వికెట్‌కు 98 పరుగులు జోడించి లంక ఇన్నింగ్స్‌కు జీవం పోశారు. మధుష్క ఔటైన అనంతరం కుసాల్ మెండిస్.. కెప్టెన్ అసలంక (78 నాటౌట్) సహకారంతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. మెండిస్, అసలంక నాలుగో వికెట్‌కు 94 పరుగులు జోడించి తమ జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. ఇన్నింగ్స్ చివర్లో అసలంకతో కలిసి జనిత్ లియనాగే (32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిష్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. తొలుత ఆసీస్‌ను అశిత ఫెర్నాండో (4-0-23-3) ఇబ్బంది పెట్టాడు. ఆతర్వాత దునిత్ వెల్లలగే (7.2-0-35-4), వనిందు హసరంగ (7-2-23-3) ఆసీస్ భరతం పట్టారు. లంక బౌలర్ల ధాటికి ఆసీస్ 100 పరుగులు చేయడం కూడా అసాధ్యమనిపించింది. మొత్తానికి ముక్కీమూలిగి ఆసీస్ 24.2 ఓవర్లలో 107 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (29) టాప్ స్కోరర్ కాగా.. జోస్ ఇంగ్లిస్ (22), ట్రవిస్ హెడ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.కాగా, ఆసీస్ తొలి వన్డేలోనూ ఇదే రీతిలో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ మ్యాచ్‌లో కూడా తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కెప్టెన్ అసలంక సెంచరీ చేయడంతో అతికష్టం మీద 214 పరుగులు చేయగలిగింది. అయితే ఈ ఇంతటి లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఆసీస్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మహీశ్ తీక్షణ (9.5-1-40-4), అశిత ఫెర్నాండో (5-1-23-2), వెల్లలగే (7-0-33-2), హసరంగ (6-0-47-1), అసలంక (2-0-5-1) ఆసీస్‌ను దెబ్బకొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇదిలా ఉంటే, ఆసీస్.. శ్రీలంక నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నేరుగా పాకిస్తాన్‌కు బయల్దేరుతుంది. ఛాంపియన్స్ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. లాహోర్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఆసీస్.. ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో ఆసీస్.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి.2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్‌లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. [ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ] -
చరిత్ర సృష్టించిన హసరంగ.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ
శ్రీలంక స్టార్ స్పినర్ వనిందు హసరంగ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. హసరంగకు ముందు ఈ రికార్డు ఆండ్రూ టై పేరిట ఉండేది. టై 211 మ్యాచ్‌ల్లో 300 వికెట్లు తీయగా.. హసరంగ కేవలం 208 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని తాకాడు. టామ్ కొహ్లెర్ కాడ్మోర్ హసరంగకు 300వ వికెట్.టీ20ల్లో వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్లు..హసరంగ-208 మ్యాచ్ల్లోఆండ్రూ టై-211రషీద్ ఖాన్-213లసిత్ మలింగ-222ముస్తాఫిజుర్ రెహ్మాన్-243ఇమ్రాన్ తాహిర్-247 ప్రస్తుతం హసరంగ ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో హసరంగ డెజర్ట్ వైపర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో వైపర్స్ షార్జా వారియర్స్‌ను ఢీకొంది. ఈ మ్యాచ్‌లో వైపర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (38 బంతుల్లో 55; 9 ఫోర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. కొహ్లెర్ కాడ్మోర్ 42 పరుగులు చేసి ఔటయ్యాడు.వీరిద్దరూ మినహా వారియర్స్ ఇన్నింగ్స్‌లో అంతా విఫలమయ్యారు. వైపర్స్ బౌలర్లలో ఖుజైమా తన్వీర్ 4 వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ పేన్ 2, మొహమ్మద్ ఆమిర్, హసరంగ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వైపర్స్ 14.5 ఓవర్లలోనే (2 వికెట్లు కోల్పోయి) గెలుపు తీరాలకు చేరింది. అలెక్స్ హేల్స్ (42 బంతుల్లో 77; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్ కర్రన్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలు బాది వైపర్స్‌ను గెలిపించారు. వారియర్స్ బౌలర్లలో ఆడమ్ మిల్నేకు రెండు వికెట్లు లభించాయి. ఈ గెలుపుతో వైపర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ సీజన్లో వైపర్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఆరింట విజయాలు సాధించింది. -
న్యూజిలాండ్‌కు భారీ షాక్.. హ్యాట్రిక్ వీరుడు దూరం
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా తొడ కండరాల గాయం కారంణంగా వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దంబుల్లా వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టీ20లో హసరంగా తొడ కండరాలు పట్టేశాయి.గాయంతో బాధపడుతూనే తన బౌలింగ్ కోటాను హసరంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా వికెట్ల మధ్య కుంటుతూ కన్పించాడు. దీంతో అతడికి లంక మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానాన్ని దుషాన్ హేమంతతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది. దుషాన్ హేమంత శ్రీలంక తరపున ఇప్పటివరకు ఐదు వన్డేలు ఆడాడు. ఇటీవల ఎమర్జింగ్ ఆసియాకప్‌లో కూడా హేమంత అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. బుధవారం దంబుల్లా వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.ఫెర్గూసన్‌కు గాయం..మరోవైపు న్యూజిలాండ్‌కు కూడా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దంబుల్లా వేదికగా లంకతో జరిగిన రెండో టీ20లో ఫెర్గూసన్ గాయ పడ్డాడు.ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసి ఫెర్గూసన్ తన జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. కానీ అంతలోనే గాయపడడంతో సిరీస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని ఆడమ్ మిల్నేతో సెలక్టర్లు భర్తీ చేశారు.చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్‌పై వేటు! అతడికి ఛాన్స్? -
సూర్యకుమార్ యాదవ్ రికార్డును సమం చేసిన హసరంగ
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ల ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్‌లతో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం హసరంగ ఖాతాలో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. అలాగే సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్ పేరిట కూడా ఐదు ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. హసరంగ 23 టీ20 సిరీస్‌ల్లో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకుంటే.. స్కై 22 సిరీస్‌ల్లో, బాబర్ ఆజమ్ 35, వార్నర్ 42, షకీబ్ 45 సిరీస్‌ల్లో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నారు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న రికార్డు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 46 సిరీస్‌ల్లో ఏడు సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. కాగా, తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హసరంగ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఇది అతనికి ఐదో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు.ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో నిన్న (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో శ్రీలంక జట్టు 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. హసరంగ (4-1-17-4), మతీశ పతిరణ (4-1-11-3, నువాన్ తుషార (4-0-22-2), తీక్షణ (3.3-0-16-1) దెబ్బకు 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ కాగా.. శ్రీలంక ఈ మాత్రం స్కోర్‌ను కూడా ఛేదించలేక 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా న్యూజిలాండ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపులో న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1 సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసి శ్రీలంక పతనానికి బీజం వేసిన లోకీ ఫెర్గూసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆరు వికెట్లు తీసిన హసరంగకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. -
కివీస్‌తో రెండో టీ20.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడ్డ శ్రీలంక
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఇవాళ (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక శ్రీలంక జట్టు బొక్కబోర్లా పడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), నువాన్ తుషార (4-0-22-2), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) ధాటికి 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక.. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శ్రీలంకను తొలుత లోకీ ఫెర్గూసన్ (2-0-7-3) హ్యాట్రిక్‌తో దెబ్బకొట్టగా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ మూడు వికెట్లు తీసి శ్రీలంక చేతి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడిన పథుమ్ నిస్సంకను (52) ఫిలిప్స్ ఆఖరి ఓవర్ రెండో బంతికి ఔట్ చేశాడు. ఆతర్వాత మూడు, ఐదు బంతులకు పతిరణ (0), తీక్షణ (14) వికెట్లు తీశాడు. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంకతో పాటు భానుక రాజపక్స్(15), తీక్షణ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫిలిప్స్, ఫెర్గూసన్ తలో 3 వికెట్లు.. బ్రేస్‌వెల్ 2, సాంట్నర్, ఫోల్క్స్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లోని తొలి టీ20లో శ్రీలంక విజయం సాధించిన విషయం తెలిసిందే. -
లంక స్పిన్నర్ల మాయాజాలం.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్
డంబుల్లా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక స్పిన్నర్లు రెచ్చిపోయారు. వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) మాయాజాలం ధాటికి న్యూజిలాండ్ 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. తొలి బంతికే వికెట్ తీసిన పేసర్ నువాన్ తుషార రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి బంతికే ఓపెనర్ టిమ్ రాబిన్సన్ తుషార బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్క్ చాప్మన్ 2, గ్లెన్ ఫిలిప్స్ 4, మైఖేల్ బ్రేస్‌వెల్ 0, మిచ్ హే 3, జాకరీ ఫోల్క్స్ 6, ఐష్ సోధి ఒక్క పరుగు చేశారు. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్లు ఏ దశలోనూ న్యూజిలాండ్ బ్యాటర్లను మెరుగైన స్కోర్ దిశగా సాగనీయలేదు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో శ్రీలంక తొలి మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే. -
టీమిండియాతో రెండో వన్డే.. శ్రీలంకకు భారీ షాక్
కొలంబో వేదికగా ఆదివారం టీమిండియాతో రెండో వన్డేలో శ్రీలంక తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు.మోకాలి గాయం కారణంగా హసరంగా మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో హసరంగా మోకాలికి గాయమైంది. అయినప్పటకి మ్యాచ్ మొత్తానికి వనిందు అందుబాటులో ఉన్నాడు. కానీ ఆ తర్వాత స్కానింగ్‌లో అతడి గాయం తీవ్రమైనదిగా తేలడంతో వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ క్రమంలోనే హసరంగా సిరీస్ మధ్యలోనే వైదొలిగాడు. కాగా భారత్‌తో తొలి వన్డే టైగా ముగియడంలో హసరంగా కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ సిరీస్‌కు ఇప్పటికే శ్రీలంక స్టార్ పేసర్లు మతీషా పతిరనా, దిల్షాన్ మధుశంక కూడా దూరమయ్యారు. ఇప్పుడు హసరంగా కూడా తప్పుకోవడం ఆతిథ్య జట్టుకు నిజంగా గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. హసరంగా స్ధానాన్ని జెఫ్రీ వాండర్సేతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది.చదవండి: ‘టై’ని బ్రేక్ చేసేదెవరో? -
అక్కడ రూ. 10 కోట్లు.. ఇక్కడ కోటిన్నర!.. కావ్యా మారన్ వ్యాఖ్యలు వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మెగా వేలానికి సంబంధించి ఫ్రాంఛైజీలు- భారత క్రికెట్ నియంత్రణ మండలి మధ్య చర్చలు వాడివేడిగా సాగినట్లు సమాచారం. ముఖ్యంగా ఆటగాళ్ల రిటెన్షన్ విధానంలో తమకు స్వేచ్ఛ ఇవ్వాలని పలువురు ఫ్రాంఛైజీ యజమానులు కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నిషేధం విధించాలి‘‘వేలంలో ఓ ఆటగాడిని కొనుగోలు చేసిన తర్వాత.. గాయం మినహా ఇతరత్రా కారణాలు చెప్పి సీజన్‌కు దూరమైతే అతడిపై కచ్చితంగా నిషేధం విధించాలి. నిజానికి ఒక్కో ఫ్రాంఛైజీ తమ జట్టు కూర్పు కోసం అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే ఒక ఆటగాడిని కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతుంది.కానీ కొందరు ఆటగాళ్లు ముఖ్యంగా విదేశీ ప్లేయర్లు వివిధ కారణాలు చెప్పి సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదు. తక్కువ మొత్తానికి అమ్ముడు పోవడం వల్లే వాళ్లు ఇలా చేస్తున్నట్లు అనిపిస్తోంది. కానీ.. వాళ్లను కొనుక్కున్న మేము.. అర్ధంతరంగా వారు వెళ్లిపోవడం వల్ల కాంబినేషన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.ఒక్కో జట్టు బలం ఒక్కో విధంగా ఉంటుందిఇక రిటెన్షన్ విషయానికొస్తే.. అట్టిపెట్టుకునే ఆటగాళ్లకు కేటాయించే మొత్తంలో మాకు స్వేచ్ఛ ఇవ్వాలి. అలా అయితే ఆటగాళ్లతో విభేదాలు తలెత్తకుండా ఉంటుంది. ఎందుకంటే.. కొంతమంది తమ కంటే తక్కువ నైపుణ్యాలు కలిగి ఉన్న ఆటగాళ్లకు ఫ్రాంఛైజీ తమ అవసరాల దృష్ట్యా ఎక్కువ మొత్తం చెల్లిస్తుందని భావిస్తూ ఉంటారు. ఇలాంటివి విభేదాలకు దారితీస్తాయి. ఈ వ్యవహారం కాంట్రాక్టు రద్దు చేసుకునేదాకా కూడా వెళ్తుంది.అయినా.. ఒక్కో జట్టు బలం ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని జట్లలో చాకుల్లాంటి విదేశీ ప్లేయర్లు ఉంటే.. మరికొన్ని జట్లలో టీమిండియా సూపర్స్టార్లు ఉంటారు. ఇంకొన్నింటిలో నైపుణ్యాలు గల అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా ఉంటారు.మా జట్టు బలం వారేఉదాహరణకు.. మా విషయమే తీసుకుంటే.. మా జట్టులో విదేశీ ఆటగాళ్ల బెంచ్ పటిష్టంగా ఉంది. కాబట్టి మేము.. నలుగురు విదేశీ ఆటగాళ్లతో పాటు ఇద్దరు క్యాప్డ్ ఇండియన్స్ లేదంటే ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో పాటు ముగ్గురు అన్క్యాప్డ్ ఇండియన్స్.. ఇలాంటి కాంబినేషన్లలో రిటైన్ చేసుకునే విధానం ఉంటే బాగుంటుందని భావిస్తాం. ఈ విషయంలో ఐపీఎల్ పాలక మండలి సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి’’ అని కావ్యా మారన్ అభిప్రాయపడింది. ఈ మేరకు క్రిక్‌బజ్ కథనం ప్రచురించింది.రన్నరప్‌తో సరికాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఎక్కువ శాతం విదేశీ ఆటగాళ్లే కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు వరల్డ్‌క్లాస్ టీ20 స్టార్ హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్ వంటి వాళ్లు జట్టుకు బలం. ఇక గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఏకంగా ఫైనల్ చేరుకుంది.అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన టైటిల్ పోరులో వెనుకబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, ఆద్యంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి లీగ్ చరిత్రలో ఆల్‌టైమ్ హయ్యస్ట్ స్కోరు(287/3) రికార్డును తమ పేరిట లిఖించుకుంది.అక్కడ పది కోట్లు కాగా ఐపీఎల్-2024 వేలంలో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగను రూ. 1.5 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. అయితే, గాయం పేరు చెప్పి అతడు సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కానీ అతడు వేరే కారణాల వల్ల జట్టుకు దూరంగా ఉన్నాడని ఫ్రాంఛైజీ భావించినట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఆర్సీబీకి ఆడిన అతడు రూ. 10 కోట్లు అందుకున్న విషయం తెలిసిందే. -
శ్రీలంక కెప్టెన్సీకి హసరంగ రాజీనామా
కొలంబో: శ్రీలంక టి20 క్రికెట్ జట్టు కెపె్టన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు లెగ్ స్పిన్నర్ హసరంగ ప్రకటించాడు. శ్రీలంక క్రికెట్ మేలు కోరే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు, జట్టులో సభ్యుడిగా కొనసాగుతానని హసరంగ వివరించాడు. హసరంగ రాజీనామా నేపథ్యంలో ఈ నెలాఖరులో స్వదేశంలో భారత జట్టుతో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో శ్రీలంక కొత్త కెపె్టన్ ఆధ్వర్యంలో ఆడుతుంది. గత నెలలో వెస్టిండీస్–అమెరికాలలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో హసరంగ నేతృత్వంలో ఆడిన శ్రీలంక లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. జట్టు పేలవ ప్రదర్శన కారణంగా హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ తన పదవికి రాజీనామా చేయగా, కోచ్ బాటనే కెపె్టన్ అనుసరించాడు. -
టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం.. కెప్టెన్సీకి రాజీనామా
ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక గ్రూప్ దశలో నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ వనిందు హసరంగ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. జట్టులో సాధారణ సభ్యుడిగా కొనసాగుతానని హసరంగ స్పష్టం చేశాడు. హసరంగ రాజీనామా విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ధృవీకరించింది.హసరంగ గతేడాదే శ్రీలంక టీ20 జట్టు పగ్గాలు చేపట్టాడు. అతను లంక జట్టు సారథిగా కేవలం పది మ్యాచ్‌ల్లో మాత్రమే వ్యవహరించాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో హసరంగ సారథ్యంలో శ్రీలంక నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. శ్రీలంక టీ20 జట్టు కొత్త సారథిని ప్రకటించాల్సి ఉంది.ఇదిలా ఉంటే, ఈ నెలాఖరులో భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లకు ఇంకా వేదికలు ఖరారు కాలేదు. జులై 27, 28, 30 తేదీల్లో టీ20లు.. ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం జట్లను ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం భారత్.. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుండగా.. శ్రీలంక ఆటగాళ్లు లంక ప్రీమియర్ లీగ్‌తో బిజీగా ఉన్నారు. -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన హార్దిక్ పాండ్యా.. నెం1 ఆల్‌రౌండర్‌గా
ఐసీసీ టీ20 ర్యాకింగ్స్లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సత్తాచాటాడు. టీ20ల్లో నెం1 ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా అవతరించాడు. రెండు స్థానాలు ఎగబాకి శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగతో అగ్రస్థానాన్ని హార్దిక్ పంచుకున్నాడు.ప్రస్తుతం వీరిద్దరూ 222 రేటింగ్ పాయింట్లతో సమంగా ఉన్నారు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్-2024లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పాండ్యా.. భారత్ రెండో సారి టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లోనూ పాండ్యా సంచలన ప్రదర్శన కనబరిచాడు. ప్రోటీస్ విధ్వంసకర బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌ను ఔట్ చేసి భారత్‌ను విజేతగా నిలిపాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో పాండ్యా 6 ఇన్నింగ్స్‌లలో 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లోనూ 11 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 వరల్డ్‌కప్ సమయంలో ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానంలో ఉన్న అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ఏకంగా ఆరో స్థానానికి పడిపోయాడు. అదే విధంగా ఈ పొట్టి ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిష్ ఒక్క స్ధానం ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ వరుసగా నాలుగు ఐదు స్ధానాల్లో నిలిచారు. -
నేటి నుంచి (జులై 1) లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభం
టీ20 వరల్డ్‌కప్ 2024 ముగిసిన రెండు రోజుల్లోనే మరో క్రికెట్ ఫెస్టివల్ మొదలు కానుంది. నేటి నుంచి (జులై 1) శ్రీలంకలో జరిగే లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో శ్రీలంక ఆటగాళ్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు (బి-లవ్ క్యాండీ, కొలొంబో స్ట్రయికర్స్, డంబుల్లా సిక్సర్స్, గాలే మార్వెల్స్, జాఫ్నా కింగ్స్) పోటీపడనున్నాయి. 21 రోజుల పాటు జరుగనున్న ఈ లీగ్ జులై 21న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ లీగ్‌లో మ్యాచ్‌లు మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.జట్ల వివరాలు..బి-లవ్ క్యాండీ: ఆషేన్ బండార, పవన్ రత్నాయకే, దిముత్ కరుణరత్నే, అఘా సల్మాన్, చతురంగ డిసిల్వ, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగ (కెప్టెన్), రమేశ్ మెండిస్, దినేశ్ చండీమల్, ఆండ్రీ ఫ్లెచర్, మొహమ్మద్ హరీస్, షమ్ము అషన్, దుష్మంత చమీర, మొహమ్మద్ హస్నైన్, కసున్ రజిత, లక్షన్సందకన్, చమత్ గోమెజ్, మొహమ్మద్ అలీ, కవిందు పతిరత్నేకొలొంబో స్ట్రయికర్స్: కవిన్ బండార, ముహమ్మద్ వసీం, గ్లెన్ ఫిలిప్స్, షెవాన్ డేనియల్, నిపున్ ధనుంజయ, షెహాన్ ఫెర్నాండో, తిసార పెరీరా (కెప్టెన్), దునిత్ వెల్లలగే, ఏంజెలో పెరీరా, చమిక కరుణరత్నే, షాదాబ్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సదీర సమరవిక్రమ, బినుర ఫెర్నాండో, అల్లా ఘజన్ఫర్, చమిక గుణశేఖర, మతీశ పతిరణ, గరుక సంకేత్, తస్కిన్ అహ్మద్, ఇసిత విజేసుందరడంబుల్లా స్ట్రయికర్స్: నవిందు ఫెర్నాండో, రీజా హెండ్రిక్స్, తౌహిద్ హ్రిదోయ్, చమిందు విక్రమ సింఘే, దనుష్క గుణతిలక, లహిరు మధుషంక, అషంక మనోజ్, మార్క్ చాప్మన్, ఇబ్రహీం జద్రాన్, సోనల్ దినుష, దుషన్ హేమంత, మొహమ్మద్ నబీ (కెప్టెన్), నిమేశ్ విముక్తి, రనేశ్ సిల్వ, లహీరు ఉడార, కుశాల్ పెరీరా, నువాన్ ప్రదీప్, ప్రవీణ్ జయవిక్రమ, దిల్షన్ మధుషంక, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నువాన్ తుషార, సచిత జయతిలక, అఖిల ధనంజయగాలే మార్వెల్స్: లసిత్ క్రూస్పుల్లే, పసిందు సూరియబండార, సదిష రాజపక్సే, సహాన్ అరచ్చిగే, జనిత్ లియనగే, ధనంజయ లక్షన్, డ్వెయిన్ ప్రిటోరియస్, సీన్ విలియమ్స్, కవిందు నదీషన్, అలెక్స్ హేల్స్, ఇసురు ఉడాన, నిరోషన్ డిక్వెల్లా (కెప్టెన్), భానుక రాజపక్స, టిమ్ సీఫర్ట్, మల్షా తరుపతి, చమిందు విజేసింఘే, లహీరు కుమార, ప్రభాత్ జయసూర్య, ముజీబ్ రెహ్మాన్, జాఫ్రే వాండర్సే, మొహమ్మద్ షిరాజ్, జహూర్ ఖాన్జాఫ్నా కింగ్స్: అవిష్క ఫెర్నాండో, అలెక్స్ రాస్, అహాన్ విక్రమసింఘే, ఫేబియన్ అలెన్, ధణంజయ డిసిల్వ, చరిత్ అసలంక (కెప్టెన్), ఎషాన్ మలింగ, పథుమ్ నిస్సంక, రిలీ రొస్సో, అజ్మతుల్లా ఒమర్జాయ్, విషద్ రండిక, నిషన్ మధుష్క, కుశాల్ మెండిస్, వనుజ సహాన్, లహీరు సమరకూన్, జేసన్ బెహ్రాన్‌డార్ఫ్, అషిత్ ఫెర్నాండో, నిసల తారక, నూర్ అహ్మద్, ప్రమోద్ మధుషన్, తీసన్ వితుషన్, విజయ్‌కాంత్ వియాస్కాంత్, ముర్విన్ అభినాశ్, అరుల్ ప్రగాసమ్ -
వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది?
టీ20 ప్రపంచకప్-2024లో శ్రీలంక ప్రయాణం ముగిసింది. బంగ్లాదేశ్- నెదర్లాండ్స్ మధ్య గురువారం నాటి మ్యాచ్ ఫలితంతో అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టిన వనిందు హసరంగ బృందం ఐసీసీ ఈవెంట్లో మరో ఘోర పరాభవం మూటగట్టుకుంది.టీ20 వరల్డ్‌కప్ తొమ్మిది ఎడిషన్‌లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్‌లతో కలిసి శ్రీలంక గ్రూప్-డిలో ఉంది. గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. మూడింట ఒక్కటి కూడా గెలవలేదు.ఇందులో ఒకటి వర్షార్పణం కావడంతో లంక ఖాతాలో ఒక పాయింట్ మాత్రం జమ అయింది. కానీ నెట్ రన్‌రేటు(-0.777) పరంగానూ వెనుకబడిపోయింది. ఈ క్రమంలో గ్రూప్ దశలో ఇంకో మ్యాచ్ మిగిలి ఉన్నా.. సూపర్-8 అవకాశాలను సజీవం చేసుకోవాలంటే ఇతర జట్ల ఫలితాలపై శ్రీలంక పడింది.అయితే, లంక ఆశలను అడియాసలు చేస్తూ బంగ్లాదేశ్ సూపర్-8కు దాదాపుగా అర్హత సాధించింది. గ్రూప్-డి టాపర్ సౌతాఫ్రికా(మూడు మూడు గెలిచింది)తో కలిసి తదుపరి దశ బెర్తును ఖాయం చేసుకునే పనిలో పడింది. View this post on Instagram A post shared by ICC (@icc)నెదర్లాండ్స్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని 24 పరుగుల తేడాతో బంగ్లా గెలుపొందింది. ఈ క్రమంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నజ్ముల్ షాంటో బృందం సూపర్-8కు చేరువైంది. శ్రీలంకకు ఏమైంది?ఇదిలా ఉంటే.. శ్రీలంక గతే వన్డే వరల్డ్‌కప్-2023లో చెత్త ప్రదర్శనతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఈ ఐసీసీ ఈవెంట్‌కు నేరుగా అర్హత సాధించలేని లంక జట్టు.. క్వాలిఫయర్స్ ఆడింది.జింబాబ్వేలో జరిగిన ఈ టోర్నీలో టాపర్‌గా నిలిచి భారత్‌లో అడుగుపెట్టింది. వరుస పరాజయాలు మూటగట్టుకున్న శ్రీలంక టీమిండియా చేతిలో ఏకంగా 302 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి విమర్శలు మూటగట్టుకుంది. ఆ తర్వాత మిగతా మ్యాచ్‌లలోనూ ఓడి కనీసం చాంపియన్ ట్రోఫీ- 2025కు కూడా అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడిలా టీ20 ప్రపంచకప్ టోర్నీలోనూ చతికిలపడి ఇంటి బాట పట్టింది ఈ మాజీ చాంపియన్. -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన హసరంగ
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి క్రికెట్లో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. హసరంగకు ముందు ఈ రికార్డు దిగ్గజ పేసర్ లసిత్ మలింగ పేరిట ఉండేది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న (జూన్ 7) జరిగిన మ్యాచ్‌లో హసరంగ.. మలింగ రికార్డును అధిగమించాడు.మలింగ 84 అంతర్జాతీయ టీ20ల్లో 107 వికెట్లు పడగొట్టగా.. హసరంగ తన 67వ టీ20 మ్యాచ్‌లోనే ఈ మార్కును దాటాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తౌహిద్ హ్రిదోయ్ వికెట్ పడగొట్టడం ద్వారా హసరంగ (108 వికెట్లు) శ్రీలంక తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. ఈ మ్యాచ్‌లో హసరంగ హ్రిదోయ్ వికెట్‌తో పాటు మరో వికెట్ (లిట్టన్ దాస్) కూడా పడగొట్టాడు.ఈ మ్యాచ్‌లో హసరంగతో పాటు నువాన్ తుషార (4-0-18-4), మతీశ పతిరణ (4-0-27-1), ధనంజయ డిసిల్వ (2-0-11-1) సత్తా చాటినా శ్రీలంక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక అత్యంత పేలవంగా బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (47) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్, ముస్తాఫిజుర్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్ 2, తంజిమ్ హసన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. లంక బౌలర్లు ప్రతిఘటించినప్పటికీ మరో ఓవర్ మిగిలుండగానే (8 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేరింది. లిటన్ దాస్ (36), తౌహిద్ హ్రిదోయ్ (40), మహ్మదుల్లా (16 నాటౌట్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్‌కు 2 వికెట్ల తేడాతో విజయాన్నందించారు.టీ20ల్లో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..హసరంగ-108 వికెట్లుమలింగ- 107కులశేఖర- 66అజంత మెండిస్-66దుష్మంత చమీరా-55 -
T20 WC 2024: దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక.. గెలుపు ఎవరిది?
టీ20 వరల్డ్‌కప్-2024లో మరో కీలక పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం(జూన్ 3) న్యూయర్క్ వేదికగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఈ పొట్టిప్రపంచకప్ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలపై ఓ లుక్కేద్దం.దక్షిణాఫ్రికా దంచికొడుతుందా?దక్షిణాఫ్రికా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఓటమి చవిచూసింది. అయితే ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, కగిసో రబాడ, మార్కో జానెసన్ వంటి స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు.కానీ ఇప్పుడూ వీరంతా జట్టులోకి రావడంతో శ్రీలంకకు గట్టిసవాలు ఎదురుకానుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ప్రోటీస్ జట్టు పటిష్టంగా కన్పిస్తోంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ యూనిట్లో రీజా హెండ్రిక్స్, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, వండర్ డస్సెన్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు.అయితే కెప్టెన్ మార్క్రమ్ పెద్దగా ఫామ్‌లో లేకపోవడం ప్రోటీస్ జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఇక బౌలింగ్‌లో కూడా కగిసో రబాడ, అన్రిచ్ నోర్డే, జానెసన్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లు ఉన్నారు. ఇక శ్రీలంకను కూడా తక్కువగా అంచనా వేయలేం.లంకేయులు పోటీ ఇస్తారా?శ్రీలంకలో మునపటి జోష్ లేనప్పటికి తమదైన రోజున ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపించగలదు. ఈ మెగా టోర్నీలో భాగంగా జరిగిన వార్మాప్ మ్యాచ్‌ల్లో శ్రీలంకకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి వార్మాప్ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో శ్రీలంక ఓటమి చవిచూసింది.అయితే ఆ తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన వార్మాప్ మ్యాచ్‌లో మాత్రం లంక భారీ విజయాన్ని అందుకుంది. అదే ఆత్మవిశ్వాసంతో శ్రీలంక ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగనుంది. శ్రీలంక కూడా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో దృఢంగా కన్పిస్తోంది.బ్యాటింగ్‌లో పాథుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, అసలంక, మాథ్యూస్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. అదే విధంగా కెప్టెన్ వనిందు హసరంగా గాయం నుంచి కోలుకోని తిరిగి జట్టులోకి రావడం లంకకు కలిసొచ్చే ఆంశం. బౌలింగ్‌లో చమీరా, పతిరానా వంటి కీలక ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. చివరగా లంక సమిష్టగా రాణిస్తే ప్రోటీస్‌కు కష్టాల్లు తప్పవు.దక్షిణాఫ్రికాదే పై చేయి..కాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో శ్రీలంకపై దక్షిణాఫ్రికాదే పై చేయి. ఇప్పటివరకు ఇరు జట్లు ముఖాముఖి నాలుగు మ్యాచ్‌ల్లో తలపడగా.. సౌతాఫ్రికా మూడింట, శ్రీలంక కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది.తుది జట్లు(అంచనా)శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కమిందు మెండిస్, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, వనిందు హసరంగా (కెప్టెన్), దసున్ షనక, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర, మతీషా పతిరణ. దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, జోర్న్ ఫోర్టుయిన్, కగిసో రబడ, ఒట్నీల్ బార్ట్‌మన్. -
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (మే 9) ప్రకటించారు. ఈ జట్టుకు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ నాయకత్వం వహించనున్నాడు. చరిత్ అసలంక వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. స్టార్లతో నిండిన ఈ జట్టులో వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌కు కూడా చోటు దక్కింది. ఐపీఎల్ హీరో మతీశ పతిరణ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్, జాఫ్నా కుర్రాడు విజయ్‌కాంత్ వియాస్కాంత్ మరో ముగ్గురితో సహా ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపికయ్యాడు.జూన్ 1 నుంచి వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరిగే వరల్డ్‌కప్‌లో శ్రీలంక ప్రస్తానం జూన్ 3న మొదలవుతుంది. న్యూయార్క్‌లో జరిగే తమ తొలి మ్యాచ్‌లో లంకేయులు సౌతాఫ్రికాను ఢీకొంటారు. ఈ వరల్డ్‌కప్‌లో శ్రీలంక గ్రూప్-డిలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, నేపాల్ జట్లతో పోటీపడుతుంది. ఈ వరల్డ్‌కప్‌కు శ్రీలంక క్వాలిఫయర్ పోటీల ద్వారా అర్హత సాధించింది.కాగా, మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో లంకతో కలుపుకుని ఇప్పటివరకు 16 జట్లు ప్రకటించబడ్డాయి. పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ ఇంకా తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్ ప్రస్తానం జూన్ 5న మొదలవుతుంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌లో టీమిండియా పోరాటం ప్రారంభమవుతుంది. జూన్ 9న టీమిండియా చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో తలపడుతుంది.టీ20 ప్రపంచకప్ 2024 కోసం శ్రీలంక జట్టు.. వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), కుశాల్ మెండిస్, పథుమ్ నిస్సంక, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డి సిల్వా, మహీశ్ తీక్షణ, దునిత్ వెల్లలగే, దుష్మంత చమీరా, నువాన్ తుషార, మతీశ పతిరణ, దిల్షన్ మధుశంకట్రావెలింగ్ రిజర్వ్‌లు: అసిత ఫెర్నాండో, విజయకాంత్ వియస్కాంత్, భానుకా రాజపక్సే, జనిత్ లియనాగే -
ఒకప్పుడు నెట్ బౌలర్.. ఇప్పుడు సన్‌రైజర్స్ జట్టులోకి ఎంట్రీ
ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్, శ్రీలంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగా గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా హసరంగా స్ధానాన్ని ఎస్ఆర్హెచ్ మెన్జ్మెంట్ భర్తీ చేసింది. అతడి స్ధానంలో మరో శ్రీలంక యువ స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్తో సర్‌రైజర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.50 లక్షల కనీస ధరకు ఎస్ఆర్హెచ్ అతడిని సొంతం చేసుకుంది. కాగా ఐపీఎల్-2023 సీజన్లో ఆర్సీబీకి నెట్‌బౌలర్‌గా విజయకాంత్ పనిచేశాడు. ఇక అతడు శ్రీలంక తరపున ఇప్పటివరకు కేవలం ఒకే టీ20 మ్యాచ్ ఆడాడు. కానీ విజయకాంత్‌కు అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేనప్పటికి.. డొమాస్టిక్ క్రికెట్లో మాత్రం మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు తన కెరీర్లో 33 టీ20లు ఆడిన విజయకాంత్ 6.76 ఏకానమీ రేటుతో 42 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ జట్టులో సరైన మణికట్టు స్పిన్నర్లు లేరు. ఈ నేపథ్యంలో విజయకాంత్‌ను సొంతం చేసుకోవడం ఎస్ఆర్హెచ్ కలిసిశ్చే ఆంశం. కాగా ఈ ఏడాది సీజన్లో సన్‌రైజర్స్ ఇప్పటివరకు 4మ్యాచ్‌లు ఆడి రెండింట విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్ధానంలో సన్‌రైజర్స్ కొనసాగుతోంది. -
IPL 2024: అనుకున్నదే అయ్యింది.. సీజన్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం
సన్‌రైజర్స్ స్టార్ స్పిన్నర్, శ్రీలంక టీ20 జట్లు కెప్టెన్ వనిందు హసరంగ విషయంలో అనుకున్నదే అయ్యింది. గాయం (ఎడమ కాలు మడమ) కారణంగా ఈ ఆటగాడు ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరిస్తూ బీసీసీఐకి లేఖ రాసింది. గాయం తాలుకా చికిత్స నిమిత్తం హసరంగ దుబాయ్‌లో ఉన్నాడని లంక బోర్డు పేర్కొంది. చికిత్స అనంతరం హసరంగ స్వదేశంలో రిహాబ్‌లో ఉంటాడని తెలిపింది. డాక్టర్లు హసరంగను కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో హసరంగ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వివరణ ఇచ్చింది. కాగా, కొద్ది రోజుల ముందు వరకు సన్‌రైజర్స్ యాజమాన్యం హసరంగపై ఆశలు పెట్టుకుని ఉండింది. సీజన్ ఆఖరి మ్యాచ్‌లకైనా అందుబాటులోకి వస్తాడని అనుకుంది. లంక బోర్డు తాజా ప్రకటన నేపథ్యంలో సన్‌రైజర్స్ ప్రత్యామ్నాయ ఆటగాడిని వెతికే పనిలో పడింది. గాయం లేదు ఏమీ లేదు అంతా డ్రామా.. హసరంగ ఐపీఎల్ నుంచి తప్పుకోవడం వెనక గాయం కాకుండా వేరే కారణాలు ఉన్నాయని నెట్టింట ప్రచారం జరుగుతుంది. వేలంలో అతనికి సరైన రెమ్యూనరేషన్ దక్కకపోడం వల్లే ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. హసరంగను గత సీజన్లో (2023) ఆర్సీబీ 10.75 కోట్లకు దక్కించుకోగా.. ఈ సీజన్ వేలంలో అతన్ని సన్‌రైజర్స్ కేవలం 1.5 కోట్లకే సొంతం చేసుకుంది. వేలంలో అనుకున్న ధర లభించకపోతే చాలా మంది విదేశీ ఆటగాళ్లు రకరకాల కారణాలు చూపి పోటీ నుంచి తప్పుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇదిలా ఉంటే, హసరంగ ఉన్నా లేకపోయిన ప్రస్తుత సీజన్లో ఆరెంజ్ ఆర్మీ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతుంది. తాజాగా కమిన్స్ సేన సొంత మైదానంలో (ఉప్పల్) ఫైవ్ టైమ్ ఛాంపియన్ సీఎస్కేను మట్టికరిపించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. సన్‌రైజర్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, రెండు పరాజయాలను మూటగట్టుకుంది. సన్‌రైజర్స్ ఏప్రిల్ 9న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఢీకొంటుంది. -
IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్..
ఐపీఎల్-2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, శ్రీలంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. హసరంగ ప్రస్తుతం ఎడమ కాలి మడమ గాయంతో బాధపడుతున్నాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకుని త్వరలోనే సన్‌రైజర్స్ జట్టుతో చేరుతాడని అంతా భావించారు. కానీ హసరంగా పూర్తి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్ 17వ సీజన్ నుంచి వైదొలిగనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ సీఈవో ఆష్లే డి సిల్వా ధ్రువీకరించారు. "పాడియాట్రిస్ట్‌ను కలిసిన హసరంగా వారి సలహా మేరకు మరి కొన్ని రోజుల పాటు పునరావాసంలో ఉండనున్నాడు. దీంతో అతడు ఐపీఎల్లో పాల్గొనడం లేదు. అతడి మడమలో వాపు ఉంది. వనిందు ప్రస్తుతం ఇంజెక్షన్లను తీసుకుంటున్నాడు. వరల్డ్‌కప్‌కు ముందు పూర్తి ఫిట్నెస్ సాధించాలని హసరంగా నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉండాలన్న తన నిర్ణయాన్ని మాకు తెలియజేశాడని" డి సిల్వా సండే టైమ్స్ అనే వార్తా పత్రికతో పేర్కొన్నాడు. ఐపీఎల్-2024 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ హసరంగను రూ. 1.5 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
IPL 2024- SRH: సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ!
ఐపీఎల్-2024 నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ ఇప్పట్లో జట్టుతో చేరే సూచనలు కనిపించడం లేదు. ఈ శ్రీలంక ఆటగాడు మరికొన్నాళ్లపాటు ఆటకు దూరం కానున్నట్లు సమాచారం. గాయం కారణంగా.. అతడు ఎస్ఆర్హెచ్ క్యాంపులో చేరడం మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. కాగా వనిందు హసరంగ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో లంక తరఫున బరిలోకి దిగాడు. బంగ్లాతో వన్డే, టీ20 మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా ఎనిమిది వికెట్లు(6,2) వికెట్లు తీశాడు. అయితే, ఈ సిరీస్ అనంతరం హసరంగ ఎడమకాలి నొప్పి తీవ్రతరం కావడంతో శ్రీలంక క్రికెట్ వైద్య బృందాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడి గాయం తీవ్రతను గుర్తించిన వైద్యులు.. పరిస్థితి చేయిదాటకముందే తగిన చికిత్స తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఫలితంగా హసరంగ విదేశీ నిపుణుల వద్దకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పట్లో అతడు సన్‌రైజర్స్ క్యాంపులో చేరే సూచనలు లేవని పేర్కొంది. హసరంగ కాగా 2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన వనిందు హసరంగ 7.54 ఎకానమీతో 26 వికెట్లు తీశాడు. అయితే, ఐపీఎల్-2024 వేలంలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ. 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. 26 ఏళ్ల హసరంగ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలడు కూడా! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో తమ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓటమి ఎదురైన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. తదుపరి బుధవారం సొంతమైదానం ఉప్పల్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్లు హైదరాబాద్ చేరుకోగా.. విజయం కోసం పట్టుదలగా ఉన్నాయి. కాగా ముంబై ఇండియన్స్ సైతం తమ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. చదవండి: Hyderabad: ఉప్పల్ మ్యాచ్ చూసేందుకు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి -
హసరంగ విషయంలో డ్రామాలాడిన లంక క్రికెట్ బోర్డ్
శ్రీలంక క్రికెట్ బోర్డు తమ స్టార్ ఆటగాడు, టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగను కాపాడుకునే విషయంలో భారీ డ్రామా ఆడినట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్‌తో మూడో వన్డే సందర్భంగా ఫీల్డ్ అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు హసరంగపై రెండు టెస్ట్ మ్యాచ్‌లు లేదా నాలుగు వన్డేలు లేదా నాలుగు టీ20ల సస్పెన్షన్ విధించేలా ఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. మూడు ఫార్మాట్లలో ఏది ముందు ఆడాల్సి వస్తే ఆ ఫార్మాట్‌కే సస్పెన్షన్ వర్తిస్తుంది. అయితే సస్పెన్షన్ విషయాన్ని ముందే పసిగట్టిన లంక క్రికెట్ బోర్డు టెస్ట్ క్రికెట్‌కు ఇదివరకే రిటైర్మెంట్ ప్రకటించిన హసరంగతో హుటాహుటిన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేసింది. అలాగే త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో అతనికి చోటు కల్పించింది. ఈ పరిణామాలన్ని గంటల వ్యవధిలో జరిగి పోయాయి. హసరంగ టెస్ట్ రిటైర్మెంట్ వెనక్కు తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించిన కొద్ది గంటల్లోపే ఐసీసీ హసరంగపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు ప్రకటించింది. హసరంగ టెస్ట్ జట్టులో ఉండటంతో నిబంధనల ప్రకారం సస్పెన్షన్ టెస్ట్ ఫార్మాట్‌కే వర్తిస్తుంది. ఇలా చేయడం వల్ల ఏంటి ప్రయోజనం అనుకుంటున్నారా..? శ్రీలంక క్రికెట్ బోర్డు హుటాహుటిన హసరంగను టెస్ట్ జట్టులో చేర్చకపోయుంటే అతను టీ20 వరల్డ్‌కప్ 2024లో తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చేది. టీ20 జట్టులో లంక జట్టు కెప్టెన్‌గానే కాకుండా కీలక ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్న హసరంగ టోర్నీ ఆరంభంలో జరిగే కీలక మ్యాచ్‌లకు దూరమైతే అది ఆ జట్టు విజయావకాశాలను భారీగా ప్రభావితం చేస్తుంది. ఇలా జరగకుండా ఉండేందుకే లంక క్రికెట్ భారీ డ్రామాకు తెరలేపింది. కాగా, బంగ్లాదేశ్‌తో మూడో వన్డే సందర్భంగా ఐసీసీ కోడ్ ఉల్లంఘించినందుకు గాను హసరంగపై రెండు టెస్ట్ మ్యాచ్‌ల నిషేధం పడింది. నిషేధంతో పాటు హసరంగ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. హసరంగ ఖాతాలో మూడు డీ మెరిట్ పాయింట్లు కూడా చేరాయి. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో శ్రీలంక టీ20 సిరీస్ గెలువగా.. బంగ్లాదేశ్ వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. టెస్ట్ సిరీస్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. -
రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకున్న గంటల వ్యవధిలోనే ఆసక్తికర పరిణామం
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న గంటల వ్యవధిలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌తో మూడో వన్డే సందర్భంగా ఐసీసీ కోడ్ ఉల్లంఘించినందుకు గాను హసరంగపై రెండు టెస్ట్ మ్యాచ్‌ల నిషేధం పడింది. నిషేధంతో పాటు హసరంగ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. హసరంగ ఖాతాలో మూడు డీ మెరిట్ పాయింట్లు కూడా చేరాయి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హసరంగ ఫీల్డ్ అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఓవర్ పూర్తి చేసిన అనంతరం అంపైర్ చేతి నుంచి క్యాప్‌ను బలవంతంగా లాక్కున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ఉల్లంఘన కింద దీన్ని నేరంగా పరిగణిస్తారు. ప్రస్తుత బంగ్లాదేశ్ సిరీస్‌లో హసరంగపై ఐసీసీ నిషేధం పడటం ఇది రెండోసారి. టీ20 సిరీస్ సందర్భంగా కూడా గత సిరీస్‌లో (ఆఫ్ఘనిస్తాన్) చేసిన తప్పిదాల కారణంగా అతను సస్పెండయ్యాడు. 26 ఏళ్ల హసరంగ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. అతను కేవలం నాలుగు టెస్ట్‌ల్లోనే శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్ట్‌ల్లో హసరంగకు మంచి ట్రాక్ రికార్డు లేదు. ఈ ఫార్మాట్లో అతను కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు కోరిక మేరకు హసరంగా తన టెస్టు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో శ్రీలంక టీ20 సిరీస్ గెలువగా.. బంగ్లాదేశ్ వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. టెస్ట్ సిరీస్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. -
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్!?
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ ఆడే తొలి మూడు మూడు మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్ స్పిన్నర్, శ్రీలంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగా దూరం కానున్నాడు. జాతీయ జట్టు విధుల కారణంగా అతడు భారత్‌కు రావడం కాస్త ఆలస్యం కానుంది. బంగ్లాదేశ్‌తో శ్రీలంక రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. తాజాగా ఈ సిరీస్‌కు ప్రకటించిన శ్రీలంక జట్టులో హసరంగాకు సైతం చోటు దక్కింది. తన టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో హసరంగాను సెలక్టర్లు ఎంపిక చేశారు. మార్చి 22 న ప్రారంభమయ్యే ఈ సిరీస్ ఏప్రిల్ 3న ముగియనుంది. ఆ తర్వాత హసరంగా ఎస్ఆర్హెచ్ జట్టుకు అందుబాటులో ఉంటాడు. అయితే వనిందు ముందే తన నిర్ణయాన్ని సన్‌రైజర్స్ మెనెజ్‌మెంట్‌కు తెలియజేసినట్లు సమాచారం. ఈ ఏడాది వేలంలో హసరంగాను రూ.1.50 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఇక మార్చి 22 నుంచి ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభం కానుంది. చెపాక్ వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ఈ క్యాష్‌రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే.. తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. చదవండి: BAN vs SL: రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్.. 3 ఏళ్ల తర్వాత ఎంట్రీ -
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్.. 3 ఏళ్ల తర్వాత ఎంట్రీ
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా తన టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. శ్రీలంక క్రికెట్ సూచన మెరకు హసరంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కాగా వైట్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించేందుకు గతేడాది ఆగస్టులో టెస్టు క్రికెట్‌కు విడ్కోలు హసరంగా విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్న వనిందు.. మళ్లీ రెడ్‌బాల్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ శ్రీలంక జట్టులో హసరంగా చోటు దక్కించుకున్నాడు. సోమవారం బంగ్లా సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు ధనంజయ డిసిల్వా సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో వనిందు హసరంగాతో పాటు యువ క్రికెటర్లు నిషాన్ పీరిస్, చమిక గుణశేఖరలకు చోటు దక్కింది. అదేవిధంగా కుసాన్ రజితా సైతం రీ ఎంట్రీ ఇచ్చాడు. మార్చి 22 నుంచి సెల్హాట్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా 29 ఏళ్ల హసరంగా చివరిసారిగా 2021లో బంగ్లాదేశ్‌తో టెస్ట్ ఆడాడు . శ్రీలంక టెస్టు జట్టు: ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమల్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, లహిరు ఉదరా, వనిందు హసరంగా, ప్రబాత్ జయసూర్య, రమేష్ మెండిస్, నిషాన్ పెసిరి, నిషాన్ పెసిరి ఫెర్నాండో, లహిరు కుమార, చమిక గుణశేఖర -
హసరంగను ఉతికి ఆరేసిన అనామకుడు.. బంగ్లాదేశ్ సంచలనం
శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. శ్రీలంకను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 40.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను చేతిక్కించుకుంది. సెంచరీతో ఆదుకున్న లియనగే.. మిడిలార్డర్ బ్యాటర్ జనిత్ లియనగే అజేయ శతకంతో (102 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో లియనగే మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. అసలంక 37, కుశాల్ మెండిస్ 29, సమరవిక్రమ 14, తీక్షణ 15, హసరంగ 11 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. ముస్తాఫిజుర్, మెహిది హసన్ మీరజ్ తలో 2, సౌమ్య సర్కార్, రిషద్ హొసేన్ చెరో వికెట్ పడగొట్టారు. 236 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. తంజిద్ హసన్ (84) రిషద్ హొసేన్ (48 నాటౌట్), ముష్ఫికర్ రహీం (37 నాటౌట్) రాణించడంతో మరో 58 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హసరంగను ఉతికి ఆరేసిన రిషద్ హొసేన్.. ఈ మ్యాచ్‌లో లంక స్పిన్ మాంత్రికుడు వనిందు హసరంగను బంగ్లాదేశ్ టెయిలెండర్ రిషద్ హొసేన్ ఉతికి ఆరేశాడు. హసరంగ బౌలింగ్‌లో 11 బంతులను ఎదుర్కొన్న రిషద్ 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేశాడు. రిషద్ రెచ్చిపోవడంతో బంగ్లాదేశ్ ఊహించిన దానికంటే త్వరగా మ్యాచ్‌ను ముగించింది. -
హసరంగపై సస్పెన్షన్ వేటు
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగపై సస్పెన్షన్ వేటు పడింది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడో టీ20లో ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్‌ను దూషించినందుకు గాను ఐసీసీ హసరంగపై రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌తో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. ఈ ఘటనతో ఐదు డీ మెరిట్ పాయింట్లను పొందిన హసరంగ.. ఓ టెస్ట్, రెండు టీ20ల్లో (మొదట ఏది వస్తే అది) సస్పెన్షన్‌ను ఎదుర్కొంటాడు. దీంతో మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి రెండు టీ20లకు హసరంగ దూరం కానున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.13ను ఉల్లంఘించినందుకు గాను హసరంగపై చర్యలకు ఆదేశించినట్లు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. హసరంగతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్‌పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. అదే మ్యాచ్‌లో అంపైర్ సూచనలు దిక్కరించినందుకు గుర్బాజ్ మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం జరిమానా విధించింది. కాగా, శ్రీలంకతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండగా (ఆఖరి మూడు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన తరుణంలో ).. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ వఫాదర్ మొమంద్ నడుము కంటే ఎత్తులో బంతి వేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్ నో బాల్‌గా ప్రకటించకపోవడంతో హసరంగ ఫైరయ్యాడు. అంపైర్ నిర్ణయంతో చిర్రెతిపోయిన హసరంగ కోపంగా అతని వైపు దూసుకొచ్చి దూషణను దిగాడు. చిన్న పిల్లల్ని అడిగినా ఆ బంతిని నో బాల్‌గా ప్రకటిస్తారు.. కళ్లు కనిపిస్తున్నాయా లేదా.. నువ్వు అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లకు పనికిరావు.. వెళ్లి వేరే ఏదైనా పని చూసుకో అంటూ అంపైర్‌పై దూషణ పర్వానికి దిగాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. తొలి బౌలర్‌గా
అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగా 100 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్ జరిగిన రెండో టీ20లో 2 వికెట్లు పడగొట్టిన హసరంగా.. 100 వికెట్ల క్లబ్లో చేరాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను హసరంగా తన పేరిటి లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంతవేగంగా 100 వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్‌గా వనిందూ రికార్డులకెక్కాడు. హసరంగా 63 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ(76 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మలింగ ఆల్‌టైమ్ రికార్డును హసరంగా బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో అఫ్గాన్ స్టార్ రషీద్(53) ఖాన్ ఉన్నాడు. కాగా అంతర్జాతీయ టీ20ల్లో మలింగ తర్వాత 100 వికెట్లు తీసిన రెండో బౌలర్ కూడా హసరంగానే కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో 11 స్ధానంలో వనిందూ నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 72 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ను శ్రీలంక చిత్తు చేసింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0 తేడాతో శ్రీలంక కైవసం చేసుకుంది. చదవండి: Ranchi Test: టీమిండియాకు బిగ్ షాక్.. డబుల్ సెంచరీల వీరుడు దూరం!? -
దుమ్ములేపుతున్న శ్రీలంక.. వరుసగా మూడో సిరీస్ విజయం
దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0 తేడాతో శ్రీలంక కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో సమరవిక్రమ(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాథ్యూస్(22 బంతుల్లో 42, 2ఫోర్లు, 4సిక్స్‌లు), హసరంగా(9 బంతుల్లో 22) మెరుపులు మెరిపించారు. అఫ్గాన్ బౌలర్లలో నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఫరూఖీ, నవీన్ తలా వికెట్ పడగొట్టారు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్.. లంక బౌలర్ల దాటికి 17 ఓవర్లలో కేవలం 115 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో మాథ్యూస్, బినార ఫెర్నాండో, హసరంగా,థీక్షణ, పతిరానా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో కరీం జనత్(28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 దంబుల్లా వేదికగా బుధవారం జరగనుంది. కాగా లంక ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
రాణించిన సమరవిక్రమ.. చెలరేగిన హసరంగ, మాథ్యూస్
డంబుల్లా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక జట్టు ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. మిడిలార్డర్ ఆటగాడు సమరవిక్రమ (42 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్దసెంచరీతో రాణించాడు. ఆఖర్లో హసరంగ (9 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (11 బంతుల్లో 25; 5 ఫోర్లు), కుశాల్ మెండిస్‌లకు (14 బంతుల్లో 23; 4 ఫోర్లు) శుభారంభం లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ధనంజయ డిసిల్వ 14, అసలంక 4 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా, మొహమ్మద్ నబీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఫజల్ హాక్ ఫారూకీ, నవీన్ ఉల్ హాక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (1), ఇబ్రహీం జద్రాన్ (10) ఔట్ కాగా.. రహ్మానుల్లా గుర్బాజ్ (9), గుల్బదిన్ నైబ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో చెలరేగిన ఏంజెలో మాథ్యూస్ బౌలింగ్‌లోనూ సత్తా చాటి రెండు వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో శ్రీలంక తొలి మ్యాచ్‌లో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. సిరీస్ సొంతం
పల్లెకెలె వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో 155 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో లంక సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లంక బ్యాటర్లలో అసలంక 97 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కుశాల్ మెండిస్(61), సమరవిక్రమ(52), జనిత్ లియాంగే(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ఓమర్జాయ్ 3 వికెట్లు, నూర్ అహ్మద్, క్వైస్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. అనంతరం 309 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్.. 33.5 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్(54), రెహమత్ షా(63) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగా 4 వికెట్లతో చెలరేగగా.. అసిత్ ఫెర్నాండో, మధుశంక తలా రెండు వికెట్లు పడగొట్టారు. -
SL Vs ZIM, 3rd T20I: హసరంగ మ్యాజిక్.. చిత్తుగా ఓడిన జింబాబ్వే
జింబాబ్వేతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 శ్రీలంక స్పిన్ సెన్సేషన్, ఆ జట్టు కెప్టెన్ వనిందు హసరంగ (4-0-15-4) మ్యాజిక్ చేశాడు. ఫలితంగా శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. హసరంగ, తీక్షణ (3.1-0-14-2), ఏంజెలో మాథ్యూస్ (2-0-15-2), ధనంజయ డిసిల్వ (1-0-1-1), మధుషంక (2-0-22-1) ధాటికి 14.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కమున్హుకామ్వే (12), బ్రియన్ బెన్నెట్ (29), సీన్ విలియమ్స్ (15), కెప్టెన్ సికందర్ రజా (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. 10.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. పథుమ్ నిస్సంక (39 నాటౌట్), కుశాల్ మెండిస్ (33) రాణించగా.. ధనంజయ డిసిల్వ 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. కుశాల్ మెండిస్ వికెట్ సీన్ విలియమ్స్‌కు దక్కింది. ఈ సిరీస్‌లో తొలి టీ20లో శ్రీలంక గెలువగా.. రెండో మ్యాచ్ జింబాబ్వే, ఇప్పుడు మూడో మ్యాచ్ మళ్లీ శ్రీలంకనే గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. -
రాణించిన మాథ్యూస్, హసరంగ.. సికందర్ రజా ఆల్‌రౌండ్ షో వృధా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో (కొలొంబో వేదికగా) జరిగిన తొలి టీ20లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. సికందర్ రజా (62) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సికందర్ రజా మినహా జింబాబ్వే ఇన్నింగ్స్‌లో అందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. కమున్హుకంవే 26, క్రెయిగ్ ఎర్విన్ 10, సీన్ విలియమ్స్ 14, ర్యాన్ బర్ల్ 5 పరుగులు చేసి ఔట్ కాగా.. బ్రియాన్ బెన్నెట్ 10, జోంగ్వే 13 పరుగులతో అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో తీక్షణ (4-0-16-2), హసరంగ (4-0-19-2), చమీరా (4-0-38-1) వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక సైతం తడబడింది. ఆ జట్టు అతి కష్టం మీద చివరి బంతికి విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో ఏంజెలో మాథ్యూస్ (38 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్) వరుసగా రెండు బౌండరీలు బాది లంక విజయాన్ని ఖరారు చేశాడు. ఆతర్వాత చమీరా ఐదు, ఆరు బంతులకు ఆరు పరుగులు (4, 2) సాధించి లంకను విజయతీరాలకు చేర్చాడు. లంక ఇన్నింగ్స్‌లో మాథ్యూస్, షనక (18 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు) రాణించగా.. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా (4-0-13-3) బంతితోనూ సత్తా చాటాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ 2, రిచర్డ్ నగరవ, వెల్లింగ్టన్ మసకద్జ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 ఇదే వేదికపై జనవరి 16న జరుగనుంది. -
హసరంగ 7/19
కొలంబో: గాయం నుంచి కోలుకున్నాక శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ ఘనంగా పునరాగమనం చేశాడు. జింబాబ్వేతో గురువారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో హసరంగ బంతితో మాయ చేశాడు. 5.5 ఓవర్లు వేసిన హసరంగ కేవలం 19 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్లో ఇవి ఐదో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం విశేషం. వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు హసరంగ ధాటికి 22.5 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. వన్డే మ్యాచ్‌లో 7 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 15వ బౌలర్‌గా... చమిందా వాస్ (8/19; జింబాబ్వేపై 2001లో), ముత్తయ్య మురళీధరన్ (7/30; భారత్‌పై 2000లో) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో శ్రీలంక బౌలర్‌గా హసరంగ గుర్తింపు పొందాడు. జింబాబ్వే నిర్దేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. ఈ గెలుపుతో శ్రీలంక సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. తొలి వన్డే వర్షంతో రద్దయింది. -
షనకపై వేటు.. శ్రీలంక కొత్త కెప్టెన్లుగా వాళ్లిద్దరు! లంక బోర్డు ప్రకటన
Zimbabwe Tour of Sri Lanka 2024: Preliminary Squads: పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంక కెప్టెన్‌గా దసున్ షనక ప్రస్థానం ముగిసింది. ఇకపై అతడు జట్టులో కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. జింబాబ్వేతో వన్డే, టీ20 సిరీస్‌లకు ప్రాథమిక జట్టును ప్రకటించిన సందర్భంగా లంక క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది. దసున్ షనక స్థానంలో ఆయా ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమిస్తున్నట్లు తెలిపింది. వన్డే పగ్గాలను కుశాల్ మెండిస్‌కు, టీ20 జట్టు సారథ్య బాధ్యతలను వనిందు హసరంగకు అప్పగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వన్డే వరల్డ్‌కప్‌లో చెత్త ప్రదర్శన కాగా దసున్ షనక కెప్టెన్సీలో పలు అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా యాభై ఓవర్ల ఫార్మాట్లో సారథిగా అతడి గెలుపు శాతం యాభైకి పైగానే ఉంది. అయితే, ఆసియా కప్-2023 తర్వాత సీన్ మారింది. ఈ టోర్నీలో ఆటగాడిగా పూర్తిగా విఫలమైన షనక.. టీమిండియాతో ఫైనల్లో జట్టును ఘోర ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఆ తర్వాత భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో అతడి నాయకత్వంలోని శ్రీలంక పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఈ టోర్నీలో మధ్యలోనే గాయం కారణంగా షనక వైదొలగగా.. కుశాల్ మెండిస్ అతడి స్థానంలో కెప్టెన్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత లంక ఆట మరింత తేలిపోయింది. కనీస పోటీ ఇవ్వలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా దసున్ షనకపై వేటు తప్పదని వార్తలు రాగా.. తాజాగా లంక బోర్డు ప్రకటనతో అవి నిజమని తేలాయి. కాగా సొంతగడ్డపై జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు 21 మంది సభ్యుల జట్టును ప్రకటించిన లంక సెలక్షన్ కమిటీ.. టీ20లకు 22 మందితో కూడిన ప్రాథమిక జట్లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో వన్డేలకు శ్రీలంక ప్రాథమిక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, అవిష్క ఫెర్నాండో, సదీరా సమరవిక్రమ, సహన్ అరచ్చిగె, నువానిదు ఫెర్నాండో, దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, జనిత్ లియానగే, వనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుశంక, దుష్మంత చమీరా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషాన్, అసితా ఫెర్నాండో, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక గుణశేఖర. జింబాబ్వేతో టీ20లకు శ్రీలంక ప్రాథమిక జట్టు: వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, దసున్ షనక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహీశ్ తీక్షణ, కుశాల్ జనిత్ పెరీరా, భనుక రాజపక్స, కమిందు మెండిస్, దునిత్ వెల్లలగే, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక కరుణరత్నె, దుష్మంత మచీర, దిల్షాన్ మదుశంక, బినుర ఫెర్నాండో, నువాన్ తుషార, ప్రమోద్ మదుషాన్, మతీశ పతిరణ. చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్ -
శ్రీలంక నూతన కెప్టెన్‌గా హసరంగ..?
శ్రీలంక టీ20 జట్టు నూతన కెప్టెన్‌గా వనిందు హసరంగ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. లంక క్రికెట్ బోర్డు హసరంగ పేరు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఆ దేశ మీడియా వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. మరోవైపు లంక టెస్ట్ జట్టు కెప్టెన్‌గా దిముత్ కరుణరత్నే కొనసాగుతాడని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. టీ20 కెప్టెన్‌ను ప్రకటించేందుకు లంక బోర్డు సోమవారం మరో సమావేశంకానున్నట్లు తెలుస్తుంది. ఆ రోజు హసరంగ పేరును ప్రకటించడం లాంఛనమేనని సమాచారం. హసరంగ.. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ లంక బోర్డు అతనిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఈ ఏడాది లంక ప్రీమియర్ లీగ్ సందర్భంగా గాయపడి, అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో దుమ్మురేపిన హసరంగ.. గాయం కారణంగా ఆ తర్వాత జరిగిన ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లకు దూరంగా ఉన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో హసరంగను సన్‌రైజర్స్ హైదరాబాద్ 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. అంతకుముందు ఐపీఎల్ సీజన్ వరకు హసరంగ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించగా.. ఇటీవలే ఆ జట్టు ఇతన్ని వేలానికి వదిలిపెట్టింది. శ్రీలంక తమ తదుపరి సిరీస్‌ను వచ్చే ఏడాది 6 నుంచి స్వదేశంలో ఆడనుంది. సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌ల కోసం సోమవారం జట్టును ప్రకటించే అవకాశం ఉంది. కాగా, టీ20ల్లో గతకొంతకాలంగా దసున్ షనక లంక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు ఘోర ప్రదర్శన కనబర్చిన నేపథ్యంలోనే ఆ జట్టులో సమూల ప్రక్షాళన జరుగుతుంది. లంక క్రికెట్లో రాజకీయ పరమైన జోక్యం ఎక్కువ కావడంతో ఐసీసీ ఆ జట్టుపై తాత్కాలిక నిషేధం కూడా విధించింది. -
వరల్డ్‌కప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ
వన్డే ప్రపంచకప్-2023కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు సారథిగా దసున్ షనక ఎంపికయ్యాడు. గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగాకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది. అతడితో పాటు మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరిముగ్గురు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటేనే టోర్నీలో కొనసాగుతారు. అదే విధంగా రిజర్వ్ జాబితాలో దసున్ హేమంత, చమిక కరుణ రత్నేకు ఛాన్స్ లభించింది. ఇక మెగా టోర్నీలో పాల్గోనేందుకు శ్రీలంక జట్టు గురువారం భారత గడ్డపై అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 29న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక ప్రధాన టోర్నీలో శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 7న ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. వరల్డ్‌కప్‌కు శ్రీలంక జట్టు: దసున్ షనక(కెప్టెన్), కుసల్ మెండిస్ (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సంక, కుసల్ జనిత్, దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీశ పతిరన, లహిరు కుమార, మహేశ్ తీక్షన, వశీన్ తీక్షన మధుశంక ప్రయాణ నిల్వలు: దుషన్ హేమంత, చమిక కరుణరత్నే Sri Lanka has announced a 15-member squad for the forthcoming ODI World Cup in India. Wanindu Hasaranga, Maheesh Theekshana, and Dilshan Madushanka are currently under scrutiny. pic.twitter.com/PTxmKKqcq4 — CricTracker (@Cricketracker) September 26, 2023 చదవండి: ABD On Kohli ODI Retirement: 'వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్' -
వరల్డ్‌కప్‌కు ముందు లంకేయులకు భారీ ఎదురుదెబ్బ
వన్డే వరల్డ్‌కప్‌కు ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు వనిందు హసరంగ గాయం కారణంగా వరల్డ్‌కప్ మొత్తానికి దూరమయ్యాడు. వరల్డ్‌కప్‌కు ముందు శ్రీలంక నిర్వహించిన శిక్షణా శిబిరంలో పాల్గొన్న హసరంగ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరికి గురయ్యాడు. ఇదే గాయం కారణంగా హసరంగ ఆసియా కప్ 2023కు దురమయ్యాడు. పాత గాయం నుంచి కోలుకునే సమయంలో మరోసారి అది తిరగబెట్టడంతో లంక స్టార్ స్పిన్నర్ వరల్డ్‌కప్ ఆడే సువర్ణావకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఈ గాయం కారణంగా హసరంగ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. హసరంగ గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు అన్నారు. మరోవైపు హసరంగతో పాటు మరో లంక ఆటగాడు కూడా వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ దుష్మంత్ చమీరా గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇదే గాయం కారణంగా వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌తో పాటు ఆసియాకప్‌కు దూరమైన చమీరా.. ఇప్పుడు మెగా టోర్నీ అవకాశాన్ని కూడా మిస్ చేసుకున్నాడు. కాగా, వరల్డ్‌కప్ కోసం భారత్ సహా 8 జట్లు తమతమ జట్లను ప్రకటించగా.. శ్రీలంక, బంగ్లాదేశ్‌లు మాత్రం ఇంకా ప్రకటించలేదు. జట్ల ప్రకటనకు ఆఖరి తేదీ సెప్టెంబర్ 28 కావడంతో లంక క్రికెట్ బోర్డు వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తుంది. వరల్డ్‌కప్‌లో హసరంగ లేకపోవడం శ్రీలంక విజయావకాశాలను భారీగా దెబ్బతీస్తుంది. హసరంగకు రీప్లేస్‌మెంట్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, వన్డే వరల్డ్‌కప్ 2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది. -
ఆసియా కప్‌కు ముందు శ్రీలంకకు వరుస షాక్‌లు.. తాజాగా మరో స్టార్ ప్లేయర్
ఆసియా కప్-2023కు ముందు శ్రీలంకకు వరుస షాక్‌లు తగుతున్నాయి. ఆ జట్టులోని స్టార్ ఆటగాళ్లంతా గాయాలు, కోవిడ్ కారణంగా ఒక్కొక్కరుగా జట్టుకు దూరమవుతున్నారు. తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. తొడ కండరాల సమస్యతో బాధపడుతున్న హసరంగ పూర్తి కోలుకోకపోవడంతో లంక బోర్డు అతన్ని జట్టు నుంచి తప్పించింది. హసరంగకు ముందు దిల్షన్ మధుష్క, లహీరు కుమార, దుష్కంత చమీరా కూడా గాయాల బారిన పడి ఆసియా కప్‌కు దూరమయ్యారు. పై పేర్కొన్న నలుగురు గాయాల కారణంగా జట్టుకు దూరమైతే, మరో ఆటగాడు కోవిడ్ కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆవిష్క ఫెర్నాండో కోవిడ్‌తో బాధపడుతూ జట్టుకు దూరంగా ఉన్నాడు. పై పేర్కొన్న ఐదుగురిని లంక సెలెక్టర్లు తొలుత ఆసియాకప్ కోసం ఎంపిక చేశారు. అయితే గాయాలు, కోవిడ్ కారణంగా వీరు జట్టుకు దూరం కావడంతో, లంక సెలెక్టర్లు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల జాబితాను ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో లంక తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఆగస్ట్ 31న పల్లెకెలె వేదికగా జరుగనుంది. ఈ టోర్నీ ఆగస్ట్ 30న జరిగే పాకిస్తాన్-నేపాల్ మ్యాచ్‌తో ప్రారంభంకానుంది. సెప్టెంబర్ 2న భారత్-పాక్‌లు పల్లెకెలెలో తలపడనున్నాయి. సెప్టెంబర్ 4న భారత్-నేపాల్, సెప్టెంబర్ 5న శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ఆసియా కప్ ముగుస్తుంది. ఆసియా కప్-2023 కోసం శ్రీలంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), పథుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, సదీర సమరవిక్రమ, తహీశ్ తీక్షణ, దునిత్ వెల్లలగే, మతీశ పతిరణ, కసున్ రజిత, దుషన్ హేమంత, బినుర ఫెర్నాండో, ప్రమోద్ మదుషన్ -
చెల్లి పెళ్లి.. కన్నీరు పెట్టుకున్న స్టార్ క్రికెటర్
శ్రీలంక స్టార్ క్రికెటర్ వనిందు హసరంగ తన చెల్లి పెళ్లిలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అప్పగింతల కార్యక్రమం సందర్భంగా చెల్లిని, బావను కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. చెల్లితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బోరున విలపించాడు. ఇదే సమయంలో అతని చెల్లి, బావ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇది చూసి నెటిజన్లు అన్ని బంధాల కంటే అన్నాచెల్లెల్ల అనుబంధం చాలా గొప్పదని కామెంట్లు చేస్తున్నారు. Wanindu Hasaranga gets emotional during his younger sister getting married.. pic.twitter.com/OuCeQ7wwpy — Nibraz Ramzan (@nibraz88cricket) August 25, 2023 కాగా, ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్‌లో హసరంగ ఆకాశమే హద్దుగా చెలరేగి తన జట్టు బి లవ్ క్యాండీని ఛాంపియన్‌గా నిలిపాడు. టోర్నీ ఆధ్యాంతరం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన హసరంగ.. లీడింగ్ రన్ స్కోరర్‌గా (10 మ్యాచ్‌ల్లో 279 పరుగులు), లీడింగ్ వికెట్ టేకర్‌గా (10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు), అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా (10 మ్యాచ్‌ల్లో 14 సిక్సర్లు) పలు అవార్డులు సొంతం చేసుకుని, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఒంటిచేత్తో తన జట్టును ఫైనల్‌కు చేర్చిన హసరంగ.. గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్ ఆడలేదు. అయినప్పటికీ బి లవ్ క్యాండీ విజేతగా అవతరించింది. ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023కు ముందు లంక జట్టుకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న హసరంగ, దుష్మంత చమీరా గాయాల బారిన పడగా.. స్టార్ ప్లేయర్లు కుశాల్ పెరీరా, ఆవిష్క ఫెర్నాండోలకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈనెల 30న ప్రారంభమయ్యే ఆసియా కప్ శ్రీలంక, పాక్ వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో లంకేయులు ఆగస్ట్ 31న తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనున్నారు. పల్లెకెలెలో ఈ మ్యాచ్ జరుగనుంది. మరోవైపు ఇదే టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరుగనుంది. ఈ మ్యాచ్‌కు కూడా పల్లెకెలె మైదానమే ఆతిథ్యమివ్వనుంది. అనంతరం సెప్టెంబర్ 4 భారత్.. నేపాల్‌తో మ్యాచ్ ఆడనుంది. భారత్, శ్రీలంకలు వేర్వేరు గ్రూప్‌ల్లో ఉండటంతో స్టేజీ-1లో తలపడే అవకాశం రాలేదు.సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ఆసియాకప్ ముగుస్తుంది. అనంతరం అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. -
లంక ప్రీమియర్ లీగ్ 2023 విజేత బి లవ్ క్యాండీ.. ఫైనల్లో డంబుల్లా చిత్తు
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ విజేతగా బి లవ్ క్యాండీ అవతరించింది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో నిన్న (ఆగస్ట్ 20) జరిగిన ఫైనల్లో క్యాండీ టీమ్.. డంబుల్లా ఔరాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి తొలిసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కెప్టెన్ హసరంగ లేకుండానే ఫైనల్ మ్యాచ్ బరిలోకి దిగిన క్యాండీ.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి విజేతగా నిలిచింది. తాత్కాలిక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (21 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు) టెయిలెండర్ల సాయంతో ఎంతో ఓర్పుగా బ్యాటింగ్ చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు మాథ్యూస్ బంతితోనూ (2-0-11-0) పర్వాలేదనిపించాడు. గాయం కారణంగా చాలాకాలంగా బంతి పట్టని మాథ్యూస్ రెగ్యులర్ కెప్టెన్ హసరంగ గైర్హాజరీలో తప్పనిసరి పరిస్థితుల్లో బౌలింగ్ చేసి మెప్పించాడు. ఫలితంగా అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డంబుల్లా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (10 బంతుల్లో 5), విఫలం కాగా, కుశాల్ మెండిస్ (22), సమరవిక్రమ (36), కుశాల్ పెరీరా (31 నాటౌట్), ధనంజయ డిసిల్వ (40) రాణించారు. క్యాండీ బౌలర్లలో చతురంగ డిసిల్వ 2, నువాన్ ప్రదీప్, మహ్మద్ హస్నైన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బి లవ్ క్యాండీ మరో బంతి మిగిలుండగా (19.5 ఓవర్లలో) 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. క్యాండీ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (26), కమిందు మెండిస్ (44), దినేశ్ చండీమల్ (24), ఏంజెలో మాథ్యూస్ (25 నాటౌట్), ఆసిఫ్ అలీ (19) రాణించగా.. చతురంగ డిసిల్వ డకౌటయ్యారు. డంబుల్లా బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. బినుర ఫెర్నాండో 2 వికెట్లు దక్కించుకున్నాడు. సిరీస్ ఆధ్యాంతరం అద్భుతంగా రాణించిన క్యాండీ కెప్టెన్ హసరంగ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. ప్రస్తుత ఎడిషన్‌లో హసరంగ లీడింగ్ రన్ స్కోరర్‌గా (10 మ్యాచ్‌ల్లో 279 పరుగులు), లీడింగ్ వికెట్ టేకర్‌గా (10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు), అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా (10 మ్యాచ్‌ల్లో 14 సిక్సర్లు) పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు. -
హసరంగా ఆల్ రౌండ్ షో.. ఫైనల్లో బీ-లవ్ కాండీ
లంకప్రీమియర్ లీగ్-2023 ఫైనల్లో బీ-లవ్ కాండీ అడుగుపెట్టింది. కొలాంబో వేదికగా గాలే టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2లో 34 పరుగుల తేడాతో విజయం సాధించిన బీ-లవ్ కాండీ.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బీ-లవ్ కాండీ కెప్టెన్ వనిందు హసరంగా ఆల్‌రౌండ్ షో తో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌లో 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన హసరంగా.. అనంతరం బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టి తమ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కాండీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కాండీ బ్యాటర్లలో హసరంగాతో పాటు చండీమాల్(38) పరుగులతో రాణించాడు. గాలే బౌలర్లలో కుమారా, దినుష్క తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షకీబ్, రజితా ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గాలే.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగల్గింది. గాలే బ్యాటర్లలో లిటన్ దాస్(25), దినుష్క(28) మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. కాండీ బౌలర్లలో హసరంగా, హస్నేన్, డి సిల్వా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఆదివారం కొలాంబో వేదికగా జరగనున్న ఫైనల్లో దంబుల్లా ఔరాతో కాండీ అమీతుమీ తెల్చుకోనుంది. చదవండి: Asia Cup: హార్దిక్ పాండ్యాకు బిగ్‌షాక్.. టీమిండియా కొత్త వైస్ కెప్టెన్ అతడే! -
హరీస్ ఉతుకుడు.. హసరంగ 'ఆరే'సుడు
లంక ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా జాఫ్నా కింగ్స్‌తో నిన్న (ఆగస్ట్ 17) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బి లవ్ క్యాండీ ఘన విజయం సాధించింది. క్యాండీ కెప్టెన్ వనిందు హసరంగ తన స్పిన్ మాయాజాలంతో జాఫ్నా కింగ్స్‌ను టోర్నీ నుంచి ఎలిమినేట్ చేశాడు. అంతకుముందు మహ్మద్ హరీస్ బ్యాట్‌తో చెలరేగడంతో క్యాండీ టీమ్ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. Highlights from the best bowling figures in LPL history by Wanindu Hasaranga.#LPL2023 #LiveTheAction pic.twitter.com/wkyK1kIzxG — LPL - Lanka Premier League (@LPLT20) August 17, 2023 హరీస్ ఉతుకుడు.. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ.. ఓపెనర్ మహ్మద్ హరీస్ (49 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ చండీమల్ (24 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. క్యాండీ ఇన్నింగ్స్‌లో హరీస్, చండీమల్ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. జాఫ్నా బౌలర్లలో నువాన్ తుషార 4 వికెట్లతో విజృంభించగా.. మహీష్ తీక్షణ, గుణరత్నే తలో 2 వికెట్లు పడగొట్టారు. Highlights from Mohammad Haris' splendid knock.#LPL2023 #LiveTheAction pic.twitter.com/qzWS5uwzsO — LPL - Lanka Premier League (@LPLT20) August 17, 2023 హసరంగ 'ఆరే'సుడు.. 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జాఫ్నా.. హసరంగ (3.2-0-9-6) మాయాజాలం ధాటికి 17.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా క్యాండీ టీమ్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. రేపు (ఆగస్ట్ 19) జరుగబోయే క్వాలిఫయర్-2లో క్యాండీ టీమ్.. గాలే టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. క్యాండీ చేతిలో ఓటమిపాలైన జాఫ్నా లీగ్ నుంచి నిష్క్రమించింది. కాగా, ఈ మ్యాచ్‌లో హసరంగ నమోదు చేసిన గణాంకాలు (6/9) లంక ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. For King Babar, reaching the top was easy. Staying there seems easier! Be part of the LPL playoffs action. Get your tickets now! Book online via BookMyShow 👉https://t.co/leccAIsdLx#LPL2023 #LiveTheAction pic.twitter.com/wKS7BGZ0VV — LPL - Lanka Premier League (@LPLT20) August 18, 2023 బ్యాట్‌తోనూ చెలరేగిన హసరంగ.. జాఫ్నాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో క్యాండీ కెప్టెన్ హసరంగ బ్యాట్‌తోనూ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న హసరంగ 2 భారీ సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేశాడు. ప్రస్తుత LPL సీజన్లో హసరంగ బంతితో పాటు బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన హసరంగ 17 వికెట్లు పడగొట్టడంతో పాటు 8 ఇన్నింగ్స్‌ల్లో 231 పరుగులు చేసి, సీజన్ నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. It comes as no surprise, one of T20 most wanted, Wanindu is back on top! Be part of the LPL playoffs action. Get your tickets now! Book online via BookMyShow 👉https://t.co/leccAIsdLx#LPL2023 #LiveTheAction pic.twitter.com/wdZiJKvobN — LPL - Lanka Premier League (@LPLT20) August 18, 2023 ఫైనల్లో డంబుల్లా.. నిన్ననే జరిగిన క్వాలిఫయర్-1లో డంబుల్లా ఔరా.. గాలే టైటాన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. లసిత్ క్రూస్పుల్లే (61 బంతుల్లో 80; 7 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ కాగా.. డంబుల్లా 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కుశాల్ పెరీరా (53) అర్ధసెంచరీతో రాణించి, డంబుల్లాను గెలిపించాడు. -
ఇప్పుడు హసరంగా.. మొన్న హేల్స్! ప్రపంచ క్రికెట్లో అసలేం జరుగుతోంది?
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా ఇటీవల టెస్టుక్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. వైట్ బాల్ ఫార్మాట్లపై దృష్టి సారించేందుకు హసరంగా టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. అయితే హసరంగా నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తప్పుబట్టాడు. హసరంగాపై చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. "టెస్టు క్రికెట్ ఆడడం తనకుకు ఇష్టం లేదని హసరంగా బహిరంగంగా చెప్పాడు. అతడికి కేవలం 26 ఏళ్ల మాత్రమే. ఈ వయస్సులో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయమా? అలెక్స్ హేల్స్ ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అంతకుముందు ట్రెంట్ బౌల్ట్ న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఏం జరుగుతోంది? అంటూ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో ప్రశ్నించాడు. ఇక హసరంగా వైట్‌బాల్ కెరీర్ గురించి చోప్రా మాట్లాడుతూ.. అతడు టీ20 క్రికెట్లో అద్బుతమైన అనడంలో ఎటువంటి సందేహం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంకకు అతడు కీలకం. అయితే టెస్టు క్రికెట్లో ఆడకుండా వైట్‌బాల్ క్రికెట్‌పై దృష్టిపెడతనడం సరికాదని చెప్పుకొచ్చాడు. ఇక 2020లో దక్షిణాఫ్రికాపై టెస్టు అరంగేట్రం చేసిన వనిందు.. తన కెరీర్లో కేవలం 4 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 4 టెస్టుల్లో 196 పరుగులతో పాటు 4 వికెట్లు సాధించాడు. చదవండి: CPL 2023: విండీస్ బ్యాటర్ భారీ సిక్సర్.. దెబ్బకు పాక్ బౌలర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్ -
వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై
శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టుక్రికెట్‌కు హసరంగా విడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతడు మంగళవారం శ్రీలంక క్రికెట్‌కు తెలియజేశాడు. పరిమిత ఓవర్లపై దృష్టిసారించేందుకే హసరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అతడిని నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ కూడా అంగీకరించరింది. మేము హసరంగా నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాము. "మా వైట్-బాల్ జట్టులో హసరంగా కీలక ఆటగాడిగా కొనసాగుతాడని భావిస్తున్నామని శ్రీలంక క్రికెట్ సీఈవో ఆష్లే డి సిల్వా పేర్కొన్నాడు. కాగా శ్రీలంక పరిమిత ఓవర్ల జట్టులో ముఖ్యమైన ఆటగాడిగా ఉన్న హసరంగా.. టెస్టులకు మాత్రం గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నాడు. అతడు చివరగా టెస్టుల్లో 2021లో బంగ్లాదేశ్‌పై ఆడాడు. 2020లో దక్షిణాఫ్రికాపై టెస్టు అరంగేట్రం చేసిన వనిందు.. తన కెరీర్లో కేవలం 4 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 4 టెస్టుల్లో 196 పరుగులతో పాటు 4 వికెట్లు సాధించాడు. అదే విధంగా ఇప్సటివరకు శ్రీలంక తరపున 48 వన్డేలు, 58 టీ20ల్లో అతడు ప్రాతినిథ్యం వహించాడు. హసరంగా ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్‌లో బీలవ్‌కాండీ జట్టుకు సారధిగా ఉన్నాడు. చదవండి: ODI WC 2023: టీమిండియాలో నాలుగో స్ధానం ఎవరిది.. యువరాజ్ సింగ్ వారసుడెవరు? -
లంక ప్రీమియర్ లీగ్‌లో మరోసారి పాము కలకలం.. తృటిలో తప్పించుకున్న ఉదాన
లంక ప్రీమియర్ లీగ్-2023లో మరోసారి పాము కలకలం రేపింది. లీగ్‌లో భాగంగా దంబుల్లా ఔరా, గాలే టైటాన్స్ మధ్య జులై 31న జరిగిన మ్యాచ్ సందర్భంగా తొలిసారి స్టేడియంలో ప్రత్యక్షమైన పాము.. నిన్న (ఆగస్ట్ 12) కొలొంబోని ప్రేమదాస స్టేడియంలో జాఫ్నా కింగ్స్, బి లవ్ క్యాండీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా మరోసారి మైదానంలోని చొచ్చుకొచ్చి హల్చల్ చేసింది. Lucky escape for @IAmIsuru17 from the RPS snake #LPL2023 🐍🇱🇰🏏 pic.twitter.com/OnYokQxzvW — Azzam Ameen (@AzzamAmeen) August 13, 2023 మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో (జాఫ్నా ఇన్నింగ్స్ 18వ ఓవర్) ఈ ఘటన చోటు చేసుకుంది. నువాన్ ప్రదీప్ బౌలింగ్ చేసే ముందు ఫీల్డింగ్ సెట్ చేస్తుండగా మైదానంలోకి ప్రవేశించిన పాము ఇసురు ఉదాన పక్క నుంచి వెళ్లింది. ఫీల్డ్ అడ్జస్ట్మెంట్లో భాగంగా అటుఇటు జరుగుతున్న ఉదాన పామును తొక్కబోయాడు. ఉదాన ఆ భారీ పామును చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అనంతరం మైదానంలో నుంచి వెళ్లిపోయిన పాము బౌండరీ లైన్ అవల ఉన్న కెమెరాల వద్దకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. All these snakes showing up in anticipation of a Naagin dance celebration? 🐍 #LPL2023 #LPLOnFanCode pic.twitter.com/quKUACGr9u — FanCode (@FanCode) August 13, 2023 ఇదిలా ఉంటే, బి లవ్ క్యాండీ-జాఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్యాండీ జట్టు 8 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో జాఫ్నా 170 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. క్యాండీ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (51 బంతుల్లో 81; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. ఫకర్ జామన్ (22), ఏంజెలో మాథ్యూస్ (22) ఓ మోస్తరు పరుగులు చేశారు. LPL match was interrupted after snake invaded the field.pic.twitter.com/SUF7iVf2St#LPL | #LPL2023 — Saikat Ghosh (@Ghosh_Analysis) July 31, 2023 జాఫ్నా బౌలర్లలో తషార 3, వెల్లలగే, మధుశంక తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం జాఫ్నాను షోయబ్ మాలిక్ (55), తిసార పెరీరా (36), క్రిస్ లిన్ (27), డేవిడ్ మిల్లర్ (24) గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. క్యాండీ బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్ 3, నువాన్ ప్రదీప్ 2, ఇసురు ఉదాన ఓ వికెట్ పడగొట్టారు. -
వరుసగా రెండో మ్యాచ్‌లో ఇరగదీసిన హసరంగ.. బ్యాట్‌తో విధ్వంసం, బంతితో మ్యాజిక్
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో బి లవ్ క్యాండీ కెప్టెన్ వనిందు హసరంగ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. లీగ్‌లో భాగంగా ఆగస్ట్ 5న జాఫ్నా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (4-0-9-3, 22 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టిన హసరంగ.. ఇవాళ (ఆగస్ట్ 8) గాలే టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో రెచ్చిపోయాడు. Into the halfway mark with the Titans on 58 for 6!#LPL2023 #LiveTheAction pic.twitter.com/I3WiwI0oiP — LPL - Lanka Premier League (@LPLT20) August 8, 2023 తొలుత బ్యాట్‌తో విధ్వంసం (27 బంతుల్లో 64; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సృష్టించిన హసరంగ.. ఆతర్వాత బంతితో (3.4-0-17-4) తనదైన స్టయిల్లో మ్యాజిక్ చేశాడు. హసరంగ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీయడంతో గాలేపై క్యాండీ 89 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. World-class Wanindu welcomes 200 T20 wickets!#LPL2023 #LiveTheAction pic.twitter.com/E920VBNQa8 — LPL - Lanka Premier League (@LPLT20) August 8, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ.. హసరంగ, ఫకర్ జమాన్ (35 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (23 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), చండీమల్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్), మహ్మద్ హరీస్ (14 బంతుల్లో 17; 3 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. గాలే బౌలర్లలో లహిరు సమరకూన్ 2 వికెట్లు పడగొట్టగా.. కసున్ రజిత, నగరవ, షంషి తలో వికెట్ దక్కించుకున్నారు. B-Love Kandy treats their home crowd to the season’s first 200 total!#LPL2023 #LiveTheAction pic.twitter.com/8uc4aEQuws — LPL - Lanka Premier League (@LPLT20) August 8, 2023 అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గాలే.. హసరంగ, నువాన్ ప్రదీప్ (3-0-21-3), ముజీబ్ (4-0-26-2), దుష్మంత చమీర (3-0-17-1) ధాటికి 16.4 ఓవర్లలో 114 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. గాలే ఇన్నింగ్స్‌లో లహిరు సమరకూన్ (36) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లసిత్ క్రూస్పుల్లే (27), అషాన్ ప్రియజన్ (25), షకీబ్ అల్ హసన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
శ్రీలంక స్టార్ ఆటగాడు విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!
లంక ప్రీమియర్ లీగ్-2023లో బి లవ్ క్యాండీ జట్టు రెండో విజయం నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం జాఫ్నా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో బి లవ్ క్యాండీ ఘన విజయం సాధించింది. 119 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన క్యాండీ.. కేవలం 13 ఓవర్లలోనే ఊదిపడేసింది. హసరంగా ఆల్ రౌండ్ షో.. ఈ మ్యాచ్‌లో క్యాండీ కెప్టెన్ వనిందు హసరంగా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టి జాఫ్నా కింగ్స్ పతనాన్ని శాసించిన హసరంగా.. బ్యాటింగ్‌లో కూడా దుమ్ము రేపాడు. కేవలం 21 బంతుల్లోనే హసరంగా తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా వనిందు నిలిచాడు. ఓవరాల్‌గా 22 బంతులు ఎదుర్కొన్న హసరంగా.. 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగుల చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఫఖర్ జమాన్(42) పరుగులతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 117 పరుగులు మాత్రమే చేయగల్గింది. క్యాండీ బౌలర్లలో హసరంగాతో పాటు ప్రదీప్ మూడు వికెట్లు పడగొట్టి జాఫ్నాను దెబ్బతీశాడు. జాఫ్నా బ్యాటర్లలో దునిత్ వెల్లలాగే(38) పరుగలతో ఒంటరి పోరాటం చేశాడు. చదవండి: Asia cup 2023: ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ కీలక నిర్ణయం.. మాజీ కెప్టెన్‌కు! -
క్వాలిఫయర్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న లంక స్పిన్నర్
ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును సొంతం చేసుకున్నాడు. 2023 జూన్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఆసీస్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (జూన్) అవార్డు దక్కించుకుంది. మహిళల యాషెస్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు గానూ గార్డ్నర్ను ఈ అవార్డు వరించింది. పురుషుల విభాగంలో జింబాబ్వే సీన్ విలియమ్స్, ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్ నుంచి హసరంగకు పోటీ ఎదురైనప్పటికీ అంతిమంగా అతన్నే ఈ అవార్డు వరించింది. మహిళల విభాగంలో ఇంగ్లండ్ ట్యామీ బేమౌంట్, వెస్టిండీస్ హేలీ మాథ్యూస్ ఐసీసీ అవార్డు కోసం పోటీపడగా జ్యూరీ గార్డ్నర్వైపు మొగ్గు చూపింది. జూన్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కారణంగా వీరిద్దరు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. కాగా, ప్రతి నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్స్, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులు, ఐసీసీ-క్రికెట్.కామ్‌లో నమోదు చేసుకున్న గ్లోబల్ క్రికెట్ అభిమానులతో కూడిన ప్రత్యేక ప్యానెల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపిక చేస్తారన్న విషయం తెలిసిందే. -
42 మ్యాచ్‌ల వరకు ఒక్కసారి కూడా లేదు.. ఆతర్వాత వరుసగా 3 సార్లు 'ఆ ఘనత'
శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ ఇటీవలికాలంలో బంతితో పేట్రేగిపోతున్నాడు. వికెట్లకు మినిమం గ్యారెంటీగా మారిపోయాడు. మ్యాచ్‌లో కనీసం 2 వికెట్లయినా పడగొడుతూ ప్రత్యర్ధుల పాలిట సింహస్వప్నంలా తయారయ్యాడు. గింగిరాలు తిరిగే బంతులతో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న హసరంగ.. ఇటీవల వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఐదు వికెట్ల ఘనత సాధించి, దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ రికార్డు సమం చేశాడు. ఈ క్రమంలో హసరంగ వన్డే కెరీర్‌కు సంబంధించిన బౌలింగ్ గణంకాలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కెరీర్లో ఇప్పటివరకు 46 వన్డేలు ఆడిన హసరంగ.. తొలి 39 మ్యాచ్‌ల్లో కేవలం 39 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అప్పటివరకు సాధారణ బౌలర్లా ఉన్న హసరంగ ఒక్కసారిగా ప్రపంచ స్థాయి బౌలర్‌గా మారిపోయాడు. తదుపరి ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఏకంగా 26 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 3 ఐదు వికెట్లు ఘనతలు, ఆతర్వాత వరుసగా 2 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు, అంతకుముందు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 2 వికెట్లు పడగొట్టాడు. హసరంగ చెలరేగుతుండటంతో వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో శ్రీలంక వరుసగా విజయాలు సాధిస్తూ.. వరల్డ్‌కప్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో హసరంగ 5 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. గత 7 మ్యాచ్‌ల్లో హసరంగ గణాంకాలు.. నెదర్లాండ్స్‌పై 9-2-42-3 స్కాట్లాండ్పై 4.2-1-7-3 ఐర్లాండ్‌పై 8-1-24-6 ఒమన్‌పై 7.2-2-13-5 యూఏఈపై 10-0-79-5 ఆఫ్ఘనిస్తాన్పై 6-0-42-2 ఆఫ్ఘనిస్తాన్పై 10-0-53-2 -
అజేయ శ్రీలంక.. పూర్వ వైభవం దిశగా అడుగులు
1990 దశకం మధ్యలో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు జెంటిల్మెన్ గేమ్‌పై ఏకఛత్రాధిపత్యం చలాయించి, ఈ మధ్యలో రెండుసార్లు (1996 వన్డే వరల్డ్‌కప్, 2014 టీ20 వరల్డ్‌కప్) జగజ్జేతగా నిలిచిన శ్రీలంక క్రికెట్ జట్టు.. స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరిగా నిష్క్రమించడంతో గత కొద్దికాలంగా అతి సాధారణ జట్టుగా మారిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఆ జట్టు తిరిగి గాడిలో పడుతున్నట్లు కనిపిస్తుంది. టెస్ట్‌లను, టీ20లను పక్కన పెడితే ఆ జట్టు ఇటీవలికాలంలో వన్డేల్లో వరుస విజయాలు సాధిస్తూ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తుంది. నిన్నటి వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023 సూపర్ సిక్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై గెలుపుతో కలిపుకుని ఇటీవలికాలంలో ఆ జట్టు వరుసగా 7 విజయాలు సాధించింది. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్పై రెండో వన్డే మొదలైన ఆ జట్టు గెలుపు ప్రస్థానం.. నిన్నటి నెదర్లాండ్స్ మ్యాచ్ వరకు నిరాటంకంగా సాగింది. ఫలితంగా 2023 వన్డే ప్రపంచకప్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. శ్రీలంక సాధిస్తున్న వరస విజయాల్లో స్పిన్నర్ వనిందు హసరంగ, వెరటన్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా హపరంగ ప్రతి మ్యాచ్‌లో వికెట్లు తీస్తూ ప్రత్యర్దులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. క్వాలిఫయర్స్‌లో ఇప్పటివరకు ఆతను 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ ఫైఫర్లు (5 వికెట్ల ఘనత) ఉన్నాయి. క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్స్ విషయానికొస్తే.. ఈ దశలో శ్రీలంక (6 పాయింట్లు) అని జట్ల కంటే టాప్‌లో ఉంది. జింబాబ్వే కూడా సమానమైన పాయింట్లే కలిగి ఉన్నప్పటికీ.. ఆ జట్టు నెట్ రన్‌రేట్ శ్రీలంకతో పోలిస్తే తక్కువగా ఉంది. ఈ దశలో స్కాట్లాండ్, నెదర్లాండ్స్ 3,4 స్థానాల్లో ఉండగా.. వెస్టిండీస్ 0 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి, 2023 వరల్డ్‌కప్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. -
చరిత్ర సృష్టించిన హసరంగ.. వరుసగా 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ చరిత్ర సృష్టించాడు. ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్ 25) జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అతను.. వరుసగా మూడు వన్డేల్లో 5 అంతకంటే ఎక్కువ వికెట్లు (16 వికెట్లు) పడగొట్టిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ వకార్ యూనిస్ మాత్రమే వన్డేల్లో హ్యాట్రిక్ ఫైఫర్స్ (15 వికెట్లు) సాధించాడు. ఈ టోర్నీలో యూఏఈతో (8-1-24-6) జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టిన హసరంగ.. ఆ తర్వాత ఒమన్‌తో (7.2-2-13-5) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు, తాజాగా ఐర్లాండ్‌పై (10-0-79-5) మరోసారి 5 వికెట్ల ఘనత సాధించాడు. హసరంగ చెలరేగడంతో ఐర్లాండ్‌పై శ్రీలంక 133 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, గ్రూప్-బి నుంచి సూపర్ సిక్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓటమితో ఐర్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా గ్రూప్-బి నుంచి శ్రీలంకతో పాటు స్కాట్లాండ్, ఒమన్‌లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధించాయి. గ్రూప్-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ సూపర్ సిక్స్‌కు చేరుకున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే (103) సెంచరీతో కదంతొక్కగా.. సదీర సమరవీర (82) అర్ధసెంచరీతో రాణించాడు. చరిత్ అసలంక (38), ధనంజయ డిసిల్వ (42 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 4, బ్యారీ మెక్‌కార్తీ 3, గెరత్ డెలానీ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. హసరంగ (5/79) మహీష్ తీక్షణ (2/28), కసున్ రజిత (1/22), లహీరు కుమార (1/33), దసున్ షనక (1/21) ధాటికి 31 ఓవర్లలో 192 పరుగులకు కుప్పకూలింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కర్టిస్ క్యాంపర్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
చెలరేగిన హసరంగా..ICC CWC Qualifiersలో లంక శుభారంభం
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్ పోరును శ్రీలంక ఘనంగా ఆరంభించింది. సోమవారం యూఏఈతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో లంక 175 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. లంక స్పిన్నర్ వనిందు హసరంగా ఆరు వికెట్లతో(6/24) యూఏఈ పతనాన్ని శాసించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్(63 బంతుల్లో 78, 10 ఫోర్లు), సదీరా సమరవిక్మ(64 బంతుల్లో 73), పాతుమ్ నిసాంకా(76 బంతుల్లో 57), దిముత్ కరుణరత్నే(54 బంతుల్లో 52) అర్థసెంచరీలతో రాణించగా.. ఆఖర్లో అసలంక 23 బంతుల్లో 48 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ హసరంగా దాటికి 39 ఓవర్లలో 180 పరుగులకే కుప్పకూలింది. వసీమ్(39), అరవింద్(39), నసీర్(34) పర్వాలేదనిపించారు. చదవండి: ఔటయ్యి కూడా చరిత్రకెక్కిన జో రూట్ -
దినేష్ కార్తీక్‌కు బిగ్ షాక్ ఇవ్వనున్న ఆర్సీబీ.. అతడితో పాటు!
ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. కనీసం ఈ సీజన్లోనైనా ఛాంపియన్స్‌గా నిలుస్తుందని భావించిన అభిమానులకు.. ఆర్సీబీ మరోసారి నిరాశ మిగిల్చింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఏడింటిలో గెలిచి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు తమ జట్టులో ప్రక్షాళనకు ఆర్సీబీ సిద్దమైనట్లు తెలుస్తోంది. . ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న మినీ వేలంలో పక్కా ప్రణాళికలతో రావాలని ఆర్సీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్లో పేలవ ప్రదర్శన కనబరిచిన దినేష్ కార్తీక్‌కు ఆర్సీబీ గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-16వ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన డికే..11.67 సగటుతో కేవలం 140 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ధానంలో మరో యువ వికెట్ కీపర్‌ను తీసుకోవాలని బెంగళూరు భావిస్తున్నట్లు సమాచారం. అతడితో పాటు విదేశీ ఆటగాళ్లు వనిందూ హసరంగా, జోష్ హాజిల్ వుడ్, ఫిన్ అలెన్‌ను కూడా విడిచిపెట్టాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో హసరంగాను రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆ సీజన్లో పర్వాలేదనపించినప్పటికీ.. ఈ ఏడాది మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. మరోవైపు జోష్ హజెల్‌వుడ్‌ను 7.75 కోట్లకు సొంతం చేసుకుంది. అతడు గాయం కారణంగా ఈ ఏడాది సీజన్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతడి ఫిట్నెస్ దృష్ట్యా వచ్చే సీజన్‌కు ముందు సాగనింపాలని ఆర్సీబీ భావిస్తోంది. చదవండి: గత ఆరేడేళ్ల నుంచి చూస్తున్నా.. సెలక్టర్లకు కొంచెం కూడా తెలివి లేదు: భారత మాజీ క్రికెటర్ -
ప్రతీకారం తీర్చుకున్న లంకేయులు.. భారీ విజయం
తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఎదురైన పరాభవానికి శ్రీలంక ఆటగాళ్లు ప్రతీకారం తీర్చుకున్నారు. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్ 4) జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌ను మట్టికరిపించారు. తొలుత బ్యాటింగ్‌లో ఆతర్వాత బౌలింగ్‌లో రెచ్చిపోయిన లంకేయులు.. పర్యాటక జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి గెలుపొందారు. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్నారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే జూన్ 7న ఇదే వేదికగా జరుగనుంది. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (43), కరుణరత్నే (52), కుశాల్ మెండిస్ (78), సమర విక్రమ (44), ధనంజయ డిసిల్వ (29 నాటౌట్), షనక (23), హసరంగ (29 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. తొలి వన్డేలో సత్తా చాటిన అసలంక (6) మినహా లంక ఇన్నింగ్స్‌లో ప్రతి ఒక్కరు బ్యాట్‌ను ఝులిపించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నబీ, ఫరీద్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. ఓ దశలొ (146/2) విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించినప్పటికీ.. స్పిన్నర్ ధనంజయ డిసిల్వ (10-0-39-3) ఆ జట్టును భారీగా దెబ్బకొట్టాడు. సెట్ బ్యాటర్లు ఇబ్రహీం జద్రాన్ (54), హస్మతుల్లా షాహిది (57)లను ఔట్ చేసి ఆఫ్ఘన్ల ఓటమికి బీజం వేశాడు. అనంతరం హసరంగ (9-2-42-3) వారి పతనాన్ని శాశించాడు. వీరితో పాటు చమీరా (2/18), తీక్షణ (1/35), షనక (1/29) తలో చేయి వేయడంతో ఆఫ్ఘన్లు 42.1 ఓవర్లలో 191 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. ఫలితంగా 132 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో జద్రాన్, షాహిది హాఫ్ సెంచరీలతో రాణించగా.. రహ్మత్ షా (36), అజ్మతుల్లా ఒమర్జాయ్ (28) ఓ మోస్తరుగా రాణించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. -
శ్రీలంక క్రికెటర్ హసరంగా పెళ్లి ఫోటోలు
-
పెళ్లి చేసుకున్న హసరంగ.. ఫొటోలు వైరల్! జంట ఎలా ఉందంటే!
Wanindu Hasaranga Marriage Pics Goes Viral: శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. వింధ్య అనే యువతిని పెళ్లాడి వివాహ బంధంలో అడుగుపెట్టాడు. అత్యంత సన్నిహితుల నడుమ గురువారం వనిందు హసరంగ- వింధ్య పెళ్లి జరిగింది. PC: Instagram జంట ఎలా ఉందంటే! తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఈ ఆల్‌రౌండర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. జంట చూడముచ్చటగా ఉందంటూ అభిమానులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా శ్రీలంక క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. PC: Instagram టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు అక్కడికి వెళ్లింది. అయితే, పెళ్లి పనులతో బిజీ అయిపోయిన వనిందు హసరంగ కివీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. పరిమిత ఓవర్ల సిరీస్ ఆరంభమయ్యే నాటికి ఈ కొత్త పెళ్లికొడుకు జట్టుతో కలిసే అవకాశం ఉంది. కాగా మార్చి 9 నుంచి న్యూజిలాండ్- లంక మధ్య టెస్టు సిరీస్ ఆరంభమైంది. ఐపీఎల్లో ఇరు జట్ల మధ్య మార్చి 25- 31 మూడు వన్డేలు, ఏప్రిల్ 2- 8 వరకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో వనిందు హసరంగ రాయల్ చాలెంజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2023 తాజా సీజన్లో ఈ ఆల్‌రౌండర్ ఆర్సీబీకి కీలకంగా మారనున్నాడు. లంక తరఫున ఇక 25 ఏళ్ల ఈ యువ ఆల్‌రౌండర్ లంక తరఫున జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 4 టెస్టులు, 37 వన్డేలు, 55 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 196 పరుగులు చేసి, 4 వికెట్లు.. వన్డేల్లో 710 పరుగులు సాధించి.. 39 వికెట్లు.. టీ20లలో 503 పరుగులు చేసి.. 89 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఐపీఎల్లో 18 మ్యాచ్‌లు ఆడి 39 పరుగులు చేయడంతో పాటు 26 వికెట్లు తీశాడు. చదవండి: IND Vs AUS: విమర్శలు వచ్చాయని 70, 80ల నాటి పిచ్ తయారు చేస్తారా? BGT 2023: తొలి ఓవర్లోనే షమీకి చేదు అనుభవం.. తర్వాత అద్భుత డెలివరీతో! దెబ్బకు.. -
Ind Vs SL: ఆసియా చాంప్‌తో ఆషామాషీ కాదు! ఇషాన్, రుతు.. ఇంకా అర్ష్..
India vs Sri Lanka, 1st T20I- ముంబై: ఈ కొత్త సంవత్సరం భారత యువ క్రికెటర్లకు లక్కీ చాన్స్ ఇస్తోంది. స్టార్లు లేని టీమిండియాలో ఓ పూర్తి స్థాయి సిరీస్ ఆడేందుకు చక్కని అవకాశం కల్పించింది. ముఖ్యంగా టాపార్డర్‌లో సత్తా చాటుకునేందుకు కుర్రాళ్లకు ఇంతకు మించిన సదవకాశం ఉండదేమో! భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో మూడు టి20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ మంగళవారం వాంఖడేలో జరుగుతుంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో నూతన ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇన్నాళ్లు అడపాదడపా ఓపెనింగ్‌లో అవకాశాలు పొందిన ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌లు ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో సత్తా చాటుకోవాలి. ముఖ్యంగా పవర్‌ప్లేలో తమ బ్యాటింగ్ పవర్ చూపించాల్సిందే! ‘సూర్య’ ప్రతాపం కొనసాగేనా గతేడాది ఆసాంతం సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించాడు. ఒక్క ఏడాదిలోనే ఐసీసీ టి20 బ్యాటింగ్ ర్యాంకుల్లో అగ్ర స్థానానికి ఎగబాకాడు. ముఖ్యంగా ప్రతీ సిరీస్‌లోనూ తన మార్కు ఆటతీరుతో రాణించాడు. భారత 360 డిగ్రీ బ్యాటర్‌గా రూపాంతరం చెందాడు. ప్రత్యర్థి పేస్ బౌలర్ల పాలిట సూర్య ప్రతాపం ఎంత చెప్పకున్నా తక్కువే. ఇదే జోరును ఈ ఏడాదీ కొనసాగించాలనే లక్ష్యంతో సూర్య ఉన్నాడు. రోహిత్, కోహ్లి, రాహుల్ లేని టాప్ ఆర్డర్‌కు సూర్యకుమారే ఇప్పుడు పెద్ద దిక్కు. పెరిగిన బాధ్యతలతో జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వుంటుంది. పగ్గాలు అప్పగించిన ప్రతీసారీ నిరూపించుకున్న హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ మెరుపులు కూడా తోడయితే లంకేయులకు కష్టాలు తప్పవు. మిడిలార్డర్లో దీపక్ హుడా, సంజూ శాంసన్‌లే కూడా బ్యాటింగ్‌లో బాధ్యతను పంచుకుంటే తక్కువ దూరంలో బౌండరీ ఉన్న వాంఖెడేలో భారీ స్కోర్లు ఏమంత కష్టం కానేకాదు. అర్ష్‌దీప్‌పై భారం ప్రస్తుత భారత జట్టులో అనుభవజ్ఞులైన పేసర్లు ఎవరు లేరు. ఇంకా చెప్పాలంటే జట్టులో ఇప్పుడున్న ఏకైక సీనియర్ బౌలర్ చహల్ ఒక్కడే! అతను స్పిన్‌తో కట్టడి చేయగలడు. అయితే సీమ్ బౌలింగ్‌ను నడిపించేది మాత్రం అర్ష్‌దీప్ సింగే. గడచిన ఐదారు నెలల్లో అర్ష్‌దీప్ తన పేస్ వాడి ఏంటో చూపెట్టాడు. టీమ్ మేనేజ్మెంట్ కూడా అతని ప్రతిభను గుర్తించి పదేపదే అవకాశాలిస్తోంది. స్పీడ్‌తో ఉమ్రాన్ మాలిక్, పేస్ వైవిధ్యంతో హర్షల్ పటేల్, స్పిన్‌తో వాషింగ్టన్ సుందర్ ప్రత్యర్థి బ్యాటింగ్‌కు ఏ మేరకు కళ్లెం వేయగలరో చూడాలి. ఆసియా చాంప్‌తో ఆషామాషీ కాదు! శ్రీలంక మిగతా ఫార్మాట్లలో ఎలా వున్నప్పటికీ పొట్టి ఫార్మాట్లో గట్టి ప్రత్యర్థే! ఆసియా కప్ టి20 చాంపియన్ శ్రీలంక జట్టులో మెరుపులు మెరిపించే బ్యాటర్స్‌కు కొదవే లేదు. కెప్టెన్ షనక, నిసాంక, కుశాల్ మెండిస్, భానుక రాజపక్స, సమరవిక్రమ అందరు మంచి ఫామ్‌లో ఉన్నారు. పైగా అనుభవజ్ఞులు లేని భారత బౌలింగ్‌పై వీళ్లు విరుచుకుపడితే భారీ స్కోర్లకు కొరత ఉండదు. బౌలింగ్ విషయానికి వస్తే హసరంగ స్పిన్ మ్యాజిక్‌తో పాటు తీక్షణ, మదుశంక, లహిరు కుమారల రూపంలో శ్రీలంక బౌలింగ్ మెరుగ్గానే ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, సూర్యకుమార్, సామ్సన్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, చహల్, హర్షల్, అర్ష్‌దీప్, ఉమ్రాన్ మాలిక్. శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), నిసాంక, కుశాల్ మెండిస్, ధనంజయ, అసలంక, చమిక కరుణరత్నే, భానుక రాజపక్స, హసరంగ, తీక్షణ, మదుశంక, లహిరు కుమార. పిచ్–వాతావరణం వాంఖెడే పిచ్ ప్రత్యేకించి పొట్టి ఫార్మాట్లో మెరుపులకు చక్కని అవకాశం కల్పిస్తుంది. దీంతో భారీ స్కోర్లు ఖాయం. మంచు ప్రభావం వల్ల టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంటుంది. వర్షం ముప్పు లేదు. చదవండి: టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవాకు ఒకేసారి రెండు క్యాన్సర్లు Pele: చివరి చూపు కోసం... A new year 🗓️ A new start 👍🏻 A new Vice-captain - @surya_14kumar - for the Sri Lanka T20I series 😎#TeamIndia had their first practice session here at Wankhede Stadium ahead of the T20I series opener in Mumbai 🏟️#INDvSL | @mastercardindia pic.twitter.com/qqUifdoDsp — BCCI (@BCCI) January 2, 2023 -
Ind Vs SL: టీమిండియాతో టీ20, వన్డే సిరీస్‌లు.. శ్రీలంక జట్టు ప్రకటన
India vs Sri Lanka 2023 T20 And ODI Series- కొలంబో: భారత్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లలో పాల్గొనే శ్రీలంక జట్టును ప్రకటించారు. రెండు ఫార్మాట్లకు కలిపి 20 మంది సభ్యులతో కూడిన జట్టుకు షనక సారథ్యం వహిస్తాడు. కాగా వచ్చే నెలలో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. టీమిండియాతో మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు సిరీస్‌లకు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీలంక బోర్డు సైతం టీమిండియాను ఢీకొట్టే తమ జట్టు వివరాలు బుధవారం వెల్లడించింది. రెండు సిరీస్‌లకు దసున్ షనక కెప్టెన్ కాగా.. వన్డేలకు కుశాల్ మెండిస్, టీ20లకు వనిందు హసరంగ వైస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఇక టీమిండియా- శ్రీలంక మధ్య 3, 5, 7 తేదీల్లో టీ20, 10, 12, 15 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. భారత్‌తో సిరీస్- శ్రీలంక జట్టు వివరాలు: దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, కుశాల్ మెండిస్ (వన్డేలకు వైస్ కెప్టెన్), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ (టీ20 వైస్ కెప్టెన్), ఆషేన్ బండార, మహీశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే (వన్డేలకు మాత్రమే), చమికా కరుణరత్నే, దిల్షాన్ మధుశంక, కసున్ రజిత, నువానీదు ఫెర్నాండో (వన్డేలకు మాత్రమే), దునిత్ వెల్లలగే, ప్రమోద్ మధుషన్, లాహిరు కుమార, నువాన్ తుషార (టీ20లకు మాత్రమే) ►టి20లకు మాత్రమే: భానుక రాజపక్స, తుషార. ►వన్డేలకు మాత్రమే: వండెర్సే, నువానిడు ఫెర్నాండో. చదవండి: T20 WC 2023: టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన.. ఇద్దరు ఏపీ అమ్మాయిలకు చోటు! Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. -
WC 2022: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’.. రేసులో 9 మంది! కోహ్లితో పాటు
ICC Men's T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న ఆరంభమైన టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. మెల్బోర్న్ వేదికగా నవంబరు 13న ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కోసం పోటీలో నిలిచిన తొమ్మిది క్రికెటర్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా వెల్లడించింది. ఈ జాబితాలో ఉన్న తమకు నచ్చిన ఆటగాడికి ఓటు వేసే అవకాశాన్ని అభిమానులకు కల్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటన చేసింది. కాగా ఈ లిస్టులో భారత్ నుంచి ఇద్దరు, పాకిస్తాన్ నుంచి ఇద్దరు, ఇంగ్లండ్ నుంచి ముగ్గురు, జింబాబ్వే నుంచి ఒకరు, శ్రీలంక నుంచి ఒకరు చోటు దక్కించుకున్నారు. ఐసీసీ షార్ట్‌లిస్టులో ఉన్న క్రికెటర్లు వీరే 1. విరాట్ కోహ్లి (భారత్)- 296 పరుగులు- 6 మ్యాచ్‌లలో 2. సూర్యకుమార్ యాదవ్ (భారత్)- 239 పరుగులు- 6 మ్యాచ్‌లలో 3. షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)- 10 వికెట్లు, ఒక అర్ధ శతకం- 6 మ్యాచ్‌లలో 4. షాహిన్ ఆఫ్రిది (పాకిస్తాన్)- 10 వికెట్లు- 6 మ్యాచ్‌లలో 5. సామ్ కరన్ (ఇంగ్లండ్)- 10 వికెట్లు- 5 మ్యాచ్‌లలో 6. జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 199 పరుగులు- 5 మ్యాచ్‌లలో- కెప్టెన్‌గానూ విజయవంతం 7. అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)- 211 పరుగులు- 5 మ్యాచ్‌లలో 8. సికిందర్ రజా(జింబాబ్వే)- 219 పరుగులు-8 మ్యాచ్‌లలో- 10 వికెట్లు 9. వనిందు హసరంగ (శ్రీలంక)- 15 వికెట్లు- 8 మ్యాచ్‌లలో అదరగొట్టిన కోహ్లి, సూర్య.. అయితే ఇక ఈ మెగా టీ20 టోర్నీలో టీమిండియా సెమీస్ దశలోనే ఇంటిబాట పట్టినప్పటికీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మిడిలార్డర్ మేటి బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సూపర్-12 దశ ముగిసే సరికి కోహ్లి 246 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ 225 పరుగులతో టాప్-10 జాబితాలో మూడో స్థానం ఆక్రమించాడు. సూపర్-12 ముగిసే నాటికి ఐసీసీ ప్రకటించిన ఈ బ్యాటర్ల జాబితాలో పాకిస్తాన్, ఇంగ్లండ్ క్రికెటర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. బట్లర్, హేల్స్ ఒక్క మ్యాచ్‌తో ఇదిలా ఉంటే.. బౌలర్ల లిస్ట్‌లో మాత్రం షాదాబ్ ఖాన్ 10 వికెట్లతో ఎనిమిదో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక రెండో సెమీ ఫైనల్లో టీమిండియాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ బ్యాటింగ్ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బట్లర్ 80, హేల్స్ 86 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చారు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి 50 పరుగులు సాధించగా.. సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చదవండి: WC 2022: ఆ ఇద్దరూ విఫలం.. వీళ్లపైనే భారం! అసలైన మ్యాచ్‌లో అంతా తలకిందులు! టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు Sania- Shoaib: సానియా- షోయబ్ విడాకుల రూమర్లు! మోడల్‌తో మాలిక్ ఫొటోలు వైరల్.. మీ భర్త కూడా ఇలాగే.. T20 WC 2022: 'టీమిండియా కోచ్‌గా అతడిని చేయండి.. కెప్టెన్‌గా అతడే సరైనోడు' -
సూర్య అగ్రస్థానం మరింత పదిలం.. దిగజారిన కోహ్లి ర్యాంక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ కోహ్లి టాప్-10లో చోటు కోల్పోయాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో 5 మ్యాచ్‌ల్లో 3 హాఫ్‌సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి గత వారమే చాలా గ్యాప్ తర్వాత టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో 653 రేటింగ్ పాయింట్స్‌తో 10వ స్థానంలో నిలిచిన కోహ్లి.. ఈ మధ్యలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 26 పరుగులకే ఔట్ కావడంతో, ఓ స్థానాన్ని కోల్పోయి 11 ప్లేస్‌కు పడిపోయాడు. ఈ జాబితాలో మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. మహ్మద్ రిజ్వాన్, డెవాన్ కాన్వే, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మలాన్, గ్లెన్ ఫిలిప్స్, రిలీ రొస్సో, ఆరోన్ ఫించ్, పథుమ్ నిస్సంక వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో నిలిచారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో వరుస హాఫ్ సెంచరీలు బాది మళ్లీ టచ్‌లోకి వచ్చిన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ 5 స్థానాలు ఎగబాకి 16వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ అగ్రపీఠానికి ఎగబాకాడు. మెగా టోర్నీలో 15 వికెట్లు పడగొట్టిన హసరంగ.. భారీగా రేటింగ్ పాయింట్లు పెంచుకుని టాప్ ప్లేస్‌కు చేరాడు. భారత బౌలర్లలో అశ్విన్ 5 స్థానాలు ఎగబాకి 13వ ప్లేస్‌కు చేరుకోగా.. వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించిన అర్షదీప్ నాలుగు స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నాడు. -
ఆసీస్ వర్సెస్ శ్రీలంక.. మ్యాక్స్‌వెల్ మెరుస్తాడా? హసరంగా మ్యాజిక్ చేస్తాడా?
టీ20 ప్రపంచకప్-2022లో డిఫిండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరో కీలక పోరుకు సిద్దమైంది. పెర్త్ వేదికగా మంగళవారం(ఆక్టోబర్25) శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడనుంది. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్-12 తొలి మ్యాచ్‌లో ఆసీస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. కాన్వే(92) చేలరేగడంతో 200 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. మ్యాక్స్‌వెల్ మెరుస్తాడా ఇక శ్రీలంకతో జరగనున్న ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు చాలా కీలకం. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా ఇప్పటికే అఖరి స్థానంలో కొనసాగుతుంది. కాబట్టి వరుస మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించకపోతే గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టక తప్పదు. అయితే శ్రీలంకపై మాత్రం ఆసీస్ విజయం సాధించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్, మార్ష్, డేవిడ్ చెలరేగితే శ్రీలంకకు కష్టాలు తప్పవు. అదే విధంగా బౌలింగ్‌లో హాజిల్ వుడ్, కమ్మిన్స్, స్టార్క్ ఈ ముగ్గురు పేసర్లు నిప్పులు చేరిగితే లంక బ్యాటర్లకు ముప్పు తిప్పలు తప్పవు. ఇక ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్‌వెల్ ఫామ్ లేమి ఆస్ట్రేలియాను కాస్త కలవరపెడుతోంది. అయితే న్యూజిలాండ్‌పై మ్యాక్స్‌వెల్ కాస్త పర్వాలేదనపించాడు. మ్యాక్స్‌వెల్ తన మునపటి ఫామ్‌ను తిరిగి పొందితే ఆస్ట్రేలియాకు ఇక తిరుగుండదు. మెండిస్, హాసరంగా మళ్లీ మ్యాజిక్ చేస్తారా రౌండ్-1లో నమీబియా చేతిలో ఆనూహ్యంగా ఓటమి చెందిన శ్రీలంక.. అనంతరం యూఏఈ, నెదర్లాండ్స్‌ను మట్టి కరిపించి సూపర్-12లో అడుగుపెట్టింది. అదే విధంగా సూపర్-12 తొలి మ్యాచ్‌లోనే ఐర్లాండ్‌ను చిత్తు చేసి తమ జోరును కొనసాగించింది. శ్రీలంక బ్యాటింగ్ పరంగా పర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం అంత అనుభవం ఉన్న బౌలర్ ఒక్కరూ కనిపించడం లేదు. ఆ జట్టు స్టార్ పేసర్ చమీరా, యువ బౌలర్ మధుషాన్ గాయం కారణంగా దూరం కావడంతో లంకకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ కుశాల్ మెండిస్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదే విధంగా సూపర్-12 తొలి మ్యాచ్‌కు దూరమైన మరో ఓపెనర్ నిస్సాంక.. ఆసీస్‌తో పోరుకు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక బౌలింగ్‌లో మాత్రం లంక పూర్తి స్థాయిలో హాసరంగా, థీక్షణపైనే అధారపడుతోంది. ఈ మ్యాచ్‌లో హాసరంగా తన స్పిన్ మ్యాజిక్‌ను మరోసారి రిపేట్ చేస్తే ఆస్ట్రేలియా కష్టాలు తప్పవు. హెడ్ టూ హెడ్ రికార్డులు ఇక ఇరు జట్లు ఇప్పటి వరకు 25 టీ20ల్లో ముఖాముఖి తలపడగా.. ఆస్ట్రేలియా 15 మ్యాచ్‌ల్లో, లంక 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. వరల్డ్‌కప్‌లో అయితే ఇరు జట్లు ఇప్పటి వరకు 5 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. ఆస్ట్రేలియా 3 సార్లు, శ్రీలంక 2 సార్లు గెలుపొందాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 World Cup 2022: భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా -
SL Vs NED: ఈ గ్రూపులో మేమే నంబర్ 1గా ఉంటామని తెలుసు.. కానీ..
ICC Mens T20 World Cup 2022 - Sri Lanka vs Netherlands, 9th Match, Group A: టీ20 ప్రపంచకప్-2021లో ఆకట్టుకోలేకపోయిన శ్రీలంక ఈసారి పసికూనలతో క్వాలిఫైయర్స్ ఆడింది. ఇందులో భాగంగా.. ఆసియా కప్-2022 విజేతగా నిలిచి అదే జోష్‌లో టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో అడుగుపెట్టిన లంకకు ఆరంభ మ్యాచ్‌లోనే నమీబియా షాకిచ్చింది. దీంతో సూపర్-12కు అర్హత సాధించాలంటే గ్రూప్-ఏలో మిగిలిన రెండు మ్యాచ్‌లలో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో యూఏఈని ఓడించింది. ఓపెనర్ పాతుమ్ నిసాంక 74 పరుగులతో చెలరేగగా.. బౌలర్లు విశ్వరూపం చూపించడంతో 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో నెట్ రన్‌రేటును మెరుగుపరచుకుంది. గట్టి పోటీ ఎదురైంది! అదే జోరులో గురువారం(అక్టోబరు 20) నెదర్లాండ్స్‌తో డూ ఆర్ డై మ్యాచ్‌లో బరిలోకి దిగిన శ్రీలంకకు.. ప్రత్యర్థి జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఓపెనర్ కుశాల్ మెండిస్(79) రాణించడంతో 162 పరుగుల స్కోరు చేయగలిగిన లంక.. వనిందు హసరంగ 3 వికెట్లతో చెలరేగడంతో ఆఖరికి 16 పరుగుల తేడాతో గెలుపొందింది. మేము నంబర్ 1.. తద్వారా గ్రూప్-ఏ నుంచి సూపర్-12కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్‌తో మ్యాచ్ అనంతరం లంక కెప్టెన్ దసున్ షనక మాట్లాడుతూ.. ‘‘ఈ గ్రూపులో మేము నంబర్ 1గా ఉంటామని తెలుసు. కానీ ఆరంభ మ్యాచ్‌లోనే మాకు చేదు అనుభవం ఎదురైంది. అయితే, మా ఆటగాళ్ల ప్రదర్శన బాగానే ఉంది. ముఖ్యంగా బౌలింగ్ గ్రూపు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ రోజు వికెట్‌ను దృష్టిలో పెట్టుకుని మొదటి 10 ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలనుకున్నాం. మా ప్రణాళికను అమలు చేయగలిగాం’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో కుశాల్ మెండిస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2022: క్వాలిఫైయర్స్ గ్రూప్-ఏ: శ్రీలంక, నమీబియా, నెదర్లాండ్స్, యూఏఈ రౌండ్‌రాబిన్ పద్ధతిలో నిర్వహణ చదవండి: T20 WC 2022- Ind Vs Pak: ‘అలా అయితే అక్టోబరు 23న ఇండియాతో పాక్ మ్యాచ్ ఆడదు’ Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్! ఆసియా కప్ నిర్వహణపై పాక్‌కు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చిన కేంద్ర క్రీడల మంత్రి View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆసియా కప్-2022 ఛాంపియన్ శ్రీలంకకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..?
ఆసియాకప్-2022 మహా సంగ్రామానికి ఆదివారంతో తెరపడింది. ఈ మెగా ఈవెంట్ ఛాంపియన్స్‌గా శ్రీలంక నిలిచింది. అదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా ఇది శ్రీలంకకు 6వ ఆసియాకప్ టైటిల్ కావడం గమనార్హం. ఇక అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగి ఛాంపియన్స్‌గా నిలిచిన శ్రీలంకకు ఫ్రైజ్‌మనీ ఎంత లభించింది?.. ఆసియాకప్ టాప్ రన్ స్కోరర్ ఎవరు? ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. విజేతకు ఎంతంటే? ఆసియాకప్ విజేతగా నిలిచిన శ్రీలంకకు ఫ్రైజ్‌మనీ రూపంలో లక్షా ఏభై వేల డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు) లభించింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను బీసీసీఐ అద్యక్షుడు సౌరవ్ గంగూలీ శ్రీలంక కెప్టెన్ దసన్ శనకకు అందజేశాడు. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్‌కు 75,000 డాలర్లు ( భారత కరెన్సీ ప్రకారం డెబ్బై తొమ్మిది లక్షల అరవై ఆరు వేలు) ఫ్రైజ్‌మనీ దక్కింది. ఆసియాకప్‌లో అత్యధిక పరుగులు వీరులు వీరే మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్)- 6 మ్యాచ్‌ల్లో 281 పరుగులు విరాట్ కోహ్లి(భారత్)- 5 మ్యాచ్‌ల్లో 276 పరుగులు ఇబ్రహీం జద్రాన్(ఆఫ్గాన్)- 5 మ్యాచ్‌ల్లో-196 పరుగులు భానుక రాజపక్స(శ్రీలంక)- 6 మ్యాచ్‌ల్లో 191 పరుగులు పాతుమ్ నిస్సంక(శ్రీలంక) - 6 మ్యాచ్‌ల్లో 173 పరుగులు ఆసియాకప్‌లో అత్యదిక వికెట్లు తీసిన బౌలర్లు భువనేశ్వర్ కుమార్(భారత్)- 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు వానిందు హసరంగా(శ్రీలంక)- 6 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు మహ్మద్ నవాజ్(పాకిస్తాన్)- 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు షాదాబ్ ఖాన్(పాకిస్తాన్)- 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు హారిస్ రౌఫ్(పాకిస్తాన్)- 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇక ఈ మెగా ఈవెంట్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగాకు మ్యాన్ ఆఫ్‌ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. అదే విధంగా కీలకమైన ఫైనల్లో పోరులో 71 పరుగలతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన భానుక రాజపక్సకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: Asia Cup 2022 Final: అలా అయితే రాజపక్స 70 పరుగులకు విలువే ఉండేది కాదు! కానీ..: పాక్ మాజీ కెప్టెన్ -
SL Vs Pak: అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదు! కానీ..
Asia Cup 2022 Winner Sri Lanka- Inzamam Ul Haq Comments: ఆసియా కప్-2022 టీ20 టోర్నీ ఫైనల్లో శ్రీలంకను విజేతగా నిలపడంలో ఆ జట్టు బ్యాటర్ భనుక రాజపక్సదే కీలక పాత్ర. 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాలో ఉన్న వేళ నేనున్నానంటూ ధైర్యం చెప్పాడు. 45 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించి.. చాంపియన్‌గా నిలడంలో తన వంతు సాయం చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు 30 ఏళ్ల రాజపక్స. తీవ్రమైన ఒత్తిడిలోనూ అద్భుతమైన స్ట్రైక్‌రేటుతో భనుక రాజపక్స రాణించి తీరు ప్రశంసనీయం. పాక్‌తో ఫైనల్లో అతడి స్ట్రైక్‌రేటు 157.78. రాజపక్స అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదు! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్.. భనుక రాజపక్స ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఎక్కువ బంతులు తీసుకుని రాజపక్స కనుక ఈ డెబ్బై పరుగులు చేసి ఉంటే.. ఆ ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదని వ్యాఖ్యానించాడు. సరైన సమయంలో అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడని ప్రశంసించాడు. హసరంగ భళా రాజపక్స, హసరంగ! ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఇంజమామ్ మ్యాచ్ ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘‘హసరంగ 31 పరుగులు... రాజపక్స 71 పరుగులు చేశాడు. ఈ రెండు అద్భుతమైన ఇన్నింగ్స్. కఠిన పరిస్థితుల్లో.. ఒత్తిడిని జయించి వారు ఈ స్కోర్లు నమోదు చేశారు. ఒకవేళ ఈ డెబ్బై పరుగులు చేసేందుకు గనుక రాజపక్స ఎక్కువ బంతులు తీసుకుని ఉంటే.. అప్పుడు లంక జట్టు స్కోరు 140 వరకు వచ్చి ఆగిపోయేది. అదే జరిగితే పాకిస్తాన్ సులువుగానే ఆ లక్ష్యాన్ని ఛేదించేది. అప్పుడు రాజపక్స ఇన్నింగ్స్ వృథాగా పోయేది. దానికసలు విలువే ఉండేది కాదు’’ అంటూ టీ20 ఫార్మాట్లో స్ట్రైక్‌రేటుకు ఉన్న ప్రాధాన్యం గురించి చెప్పుకొచ్చాడు. మా వాళ్లు చాలా తప్పులు చేశారు ఇక తమ జట్టు ప్రదర్శనపై స్పందిస్తూ.. ‘‘శ్రీలంక పేసర్లంతా కొత్తవాళ్లు. వాళ్లలో ఒక్కరికి కూడా తగినంత అనుభవం లేదు. అయినా.. తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగారు. మరోవైపు.. పాకిస్తాన్ ఈ టోర్నీలో బాగానే ఆడింది.. కానీ మరీ అంత గొప్పగా ఏమీ ఆడలేదు. చాలా పొరపాట్లు చేశారు. ఒత్తిడిని అధిగమించలేకపోయారు. ఆదిలో శ్రీలంకను 58-5కు కట్టడి చేయగలిగినా ఆ తర్వాత ధారాళంగా పరుగులు ఇచ్చిన విధానమే ఇందుకు నిదర్శనం’’ అని పాక్ ఆట తీరుపై ఇంజమామ్ ఉల్ హక్ విమర్శలు గుప్పించాడు. కాగా దుబాయ్ వేదికగా పాక్‌తో ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక 23 పరుగులతో గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది. మెగా ఈవెంట్లో ఆరోసారి టైటిల్ గెలిచిన జట్టుగా దసున్ షనక బృందం నిలిచింది. చదవండి: SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SL Vs Pak: ఫైనల్లో నసీం షా ఇబ్బంది పెడతాడనుకుంటున్నారా? లంక ఆల్‌రౌండర్ రిప్లై ఇదే!
Asia Cup 2022 Final Sri Lanka Vs Pakistan: మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లోనే అఫ్గనిస్తాన్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమి.. బంగ్లాదేశ్‌పై గెలుపుతో విజయాల బాట పట్టి సూపర్-4లో అఫ్గనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్ జట్లను ఓడించి.. ఫైనల్ వరకు అజేయ జైత్రయాత్ర... ఆసియా కప్- 2022 టీ20 టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక ప్రస్థానం ఇది. దుబాయ్ వేదికగా ఆదివారం(సెప్టెంబరు 11) పాకిస్తాన్‌తో జరిగే ఫైనల్లో టైటిల్ ఫేవరెట్‌గా మారింది దసున్ షనక బృందం. సమిష్టి కృషితో తుదిపోరుకు అర్హత సాధించి.. ఆసియా కప్ ట్రోఫీ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం ఇప్పటికే లంక- పాక్ జట్లు సమాయత్తమవుతున్నాయి. ‘రిహార్సల్ మ్యాచ్’లో పాక్‌ను చిత్తు చేసి! ఇక సూపర్- 4 ఆఖరి మ్యాచ్ కూడా ఈ రెండు జట్ల మధ్యే జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుని పాక్‌ను 121 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగి 17 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కీలక పేసర్ నసీమ్ షా లేకుండానే పాక్ బరిలోకి దిగింది. కాగా షాహిన్ ఆఫ్రిది స్థానంలో జట్టులోకి వచ్చిన 19 ఏళ్ల నసీమ్ పాకిస్తాన్ సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తమకు కీలకమైన మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ బౌలర్లు అత్యద్భుతంగా పోరాడిన వేళ.. నసీమ్ ఆఖర్లో రెండు సిక్సర్లు కొట్టి అటు అఫ్గన్.. ఇటు టీమిండియా ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో అతడిపై అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే, ఫైనల్‌కు ముందు లంకతో జరిగిన మ్యాచ్‌లో అతడికి రెస్ట్ ఇవ్వడం విశేషం. నసీం షా ఉంటాడు కదా! అయితే! ఈ నేపథ్యంలో పాక్‌పై విజయానంతరం మీడియాతో మాట్లాడిన లంక ఆల్‌రౌండర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వనిందు హసరంగకు నసీమ్ గురించి ప్రశ్న ఎదురైంది. నసీమ్ షా మీకు ఫైనల్లో గట్టి సవాల్ విసురుతాడు అని భావిస్తున్నారా అని హసరంగను ఓ పాకిస్తాన్ విలేకరి ప్రశ్నించారు. ఇందుకు కూల్‌గా స్పందించిన హసరంగ.. కాస్త గ్యాప్ ఇచ్చి.. ‘‘అదేదో ఫైనల్లోనే చూసుకుంటాం’’ అని చిరునవ్వులు చిందించాడు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. హసరంగ చర్యపై ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘‘బిల్డప్ చూసి ఏం చెబుతావో అనుకున్నాం... కానీ.. ఒక్క మాటతో పరోక్షంగా నసీం షా గాలి తీసేశావు’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: కోహ్లి, రోహిత్ కాదు.. టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం ఇదే! -
చెలరేగిన శ్రీలంక బౌలర్లు.. 121 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
ఆసియాకప్-2022లో భాగంగా అఖరి సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు శ్రీలంక చుక్కలు చూపించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 121 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లలో హాసరంగా మూడు వికెట్లతో చెలరేగగా.. మహేశ్ తీక్షణ, ప్రమోద్ మదుషన్ చెరో రెండు, దనుంజయ డి సిల్వా, , కరుణరత్నే తలా వికెట్ సాధించారు. ఇక పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజాం (30), మహ్మద్ నవాజ్(25) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: Asia Cup 2022: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. తొలి భారత ఆటగాడిగా! -
హసరంగకు షాకిచ్చిన శ్రీలంక బోర్డు! ఆ లీగ్‌లో ఆడొద్దు! ఎందుకంటే..
The Hundred 2022: ది హండ్రెడ్ లీగ్ సీజన్-2022లో ఆడాలనుకున్న శ్రీలంక స్టార్ క్రికెటర్ వనిందు హసరంగకు చుక్కెదురైంది. ఈ లీగ్‌లో ఆడేందుకు.. శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) అతడికి అనుమతినివ్వలేదు. హసరంగకు నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించింది. దీంతో ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ టోర్నీ నుంచి తప్పుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా కప్-2022, టీ20 ప్రపంచకప్-2022 ఈవెంట్ సమీపిస్తున్న తరుణంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని శ్రీలంక బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆష్లే డి సిల్వ వెల్లడించాడు. కాగా ఐపీఎల్‌కు పోటీ అన్నట్లుగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. హండ్రెడ్ లీగ్(ఇన్నింగ్స్‌కు వంద బాల్స్) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లక్ష పౌండ్లు! మొత్తం 8 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో దేశీ, విదేశీ ఆటగాళ్లు పాల్గొంటారు. ఇందులో భాగంగా వనిందు హసరంగను మాంచెస్టర్ ఒరిజినల్స్ ఫ్రాంచైజీ లక్ష పౌండ్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ సారథిగా వ్యవహరిస్తున్న మాంచెస్టర్ ఒరిజినల్స్ ఆగష్టు 5న నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం ఆరంభించనుంది. ఈ క్రమంలో హసరంగ వంటి కీలక ప్లేయర్ దూరం కావడం ఈ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ లాంటిదే. కాగా శ్రీలంక ప్రీమియర్ లీగ్ నేపథ్యంలో హసరంగ జట్టుకు దూరమవుతాడని మాంచెస్టర్ ముందే ఫిక్సయిపోయినా.. ఆ టోర్నీ వాయిదా పడటంతో ఊపిరి పీల్చుకుంది. ఆడటానికి వీల్లేదు.. కారణమిదే! ఈ నేపథ్యంలో హండ్రెడ్ లీగ్‌లో ఆడాలని వనిందు హసరంగ భావించగా.. శ్రీలంక బోర్డు అడ్డుచెప్పింది. ఈ విషయం గురించి ఎస్ఎల్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆష్లే డి సిల్వ ఈఎస్పీన్క్రిక్ఇన్పోతో మాట్లాడుతూ.. ఇందుకు గల కారణాన్ని వెల్లడించాడు. వరుసగా మెగా ఈవెంట్లు ఉన్న నేపథ్యంలో హసరంగకు నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదని తెలిపాడు. కాగా ఆగష్టు 27 నుంచి ఆసియా కప్, అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీలు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. ది హండ్రెడ్ లీగ్ తాజా సీజన్ ఆగష్టు 3న ఆరంభమైంది. సెప్టెంబరు 3న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే... హసరంగ స్థానాన్ని మాంచెస్టర్ దక్షిణాఫ్రికా యువ సంచలనం ట్రిస్టన్ స్టబ్స్‌తో భర్తీ చేసుకుంది. ఇక స్పిన్ మాస్ట్రో హసరంగ ఐపీఎల్-2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: WC 2022: వరల్డ్ నెం.1 బౌలర్‌గా ఎదుగుతాడు! ప్లీజ్ చేతన్ అతడిని సెలక్ట్ చేయవా! -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన శ్రీలంక
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు 21 మంది సభ్యలతో కూడిన తమ జట్టును శ్రీలంక శుక్రవారం ప్రకటించింది. గాయం కారణంగా జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా శ్రీలంక అండర్-19 జట్టు కెప్టెన్ దునిత్ వెల్లలగే సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేయనున్నాడు. ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శ్రీలంక తలపడనుంది. ఇక పల్లెకెలె వేదికగా జూన్14న ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో అఖరి మ్యాచ్ శనివారం పల్లెకెలె వేదికగా జరగనుంది. శ్రీలంక జట్టు: దసున్ షనక, పాతుమ్ నిస్సాంక, దనుష్క గుణతిలక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దినేష్ చండిమాల్, భానుక రాజపక్స, నిరోషన్ డిక్వెల్లా, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, అసిత, రమేశ్ తుషార మ, అసిత, రమేశ్ తుషార మ జయవిక్రమ, జెఫ్రీ వాండర్సే, లహిరు మధుశంక, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషన్ చదవండి: David Miller Birthday: 'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం -
'కెప్టెన్సీ భారం మంచి బ్యాటర్‌ను చంపేసింది'
ఐపీఎల్ 2022 సీజన్ కొందరు టీమిండియా ఆటగాళ్లకు పూర్వ వైభవం తీసుకొస్తే.. మరికొందరికి మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి క్రికెటర్లు ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న వేళ ఐపీఎల్ వారికి కలిసొచ్చింది. అయితే కోహ్లి, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ సహా మరికొంత మంది ఆటగాళ్లు మాత్రం ఘోర ప్రదర్శన చేశారు. బ్యాటింగ్ స్టార్స్ కోహ్లి, రోహిత్‌ల సంగతి పక్కనబెడితే. వీరి కంటే ఎక్కువగా ఇబ్బంది పడింది మాత్రం మయాంక్ అగర్వాల్ అని చెప్పొచ్చు. PC: IPL Twitter కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లిపోవడంతో పంజాబ్ కింగ్స్ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా మయాంక్ ఎంపికయ్యాడు. దీంతో కెప్టెన్సీ భారం మీద పడడంతో మయాంక్ తనలోని బ్యాట్స్‌మన్‌ను పూర్తిగా మరిచిపోయాడు. 13 మ్యాచ్‌లు ఆడిన మయాంక్ ఒకే ఒక హాఫ్ సెంచరీతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే మయాంక్ గత ఐపీఎల్ సీజన్లో 12 మ్యాచ్‌ల్లో 441 పరుగులతో దుమ్మురేపాడు. ఇక ఈ సీజన్లో కెప్టెన్‌గా జట్టును కూడా అంతంత మాత్రంగానే నడిపించాడు. పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు.. ఏడు ఓటములతో ఈ సీజన్‌ను ఆరో స్థానంతో ముగించింది. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మయాంక్ అగర్వాల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. PC: IPL Twitter ''అసలు మయాంక్ అగర్వాల్‌కు ఏమైంది.. అతన్ని చూడగానే నా మదిలోకి వచ్చిన మొదటి ప్రశ్న. నిజానికి అతను మంచి స్ట్రైకింగ్ ప్లేయర్. అయితే ఐపీఎల్లో కెప్టెన్సీ అతని కొంపముంచింది. కెప్టెన్సీ భారం అతనిలోని మంచి బ్యాటర్‌ను చంపేసింది. ఈ సీజన్లో పంజాబ్‌కు కెప్టెన్‌గా పనిచేసిన మయాంక్ ఓపెనింగ్ నుంచి నాలుగో స్థానం వరకు బ్యాటింగ్ చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. నాయకత్వం తలకు మించిన భారం కావడంతో ప్రతీసారి మయాంక్ మొహంలో చిరాకు స్పష్టంగా కనిపించేది. అతన్ని కెప్టెన్ చేయకుండా ఒక బ్యాటర్‌గా స్వేచ్ఛగా ఆడనిచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.'' అని చెప్పుకొచ్చాడు. PC: IPL Twitter ఇక ఆర్సీబీ బౌలర్ వనిందు హసరంగాను భజ్జీ ప్రశంసల్లో ముంచెత్తాడు.'' హసరంగా ఒక దశలో ఆర్సీబీకి మ్యాచ్ విన్నర్‌గా మారాడు. నిజానికి అతను సర్ప్రైజ్ బౌలర్. తన బౌలింగ్‌తో బ్యాట్స్మెన్లను ముప్పతిప్పలు పెట్టాడు. సక్సెస్ వెనుకు అతను పడ్డ కష్టం కనిపించింది. అతని బౌలింగ్‌ను నేను బాగా ఎంజాయ్ చేశాను.'' అంటూ తెలిపాడు. ఇక హసరంగా పర్పుల్ క్యాప్‌కు ఒక్క వికెట్ దూరంలో ఆగిపోయాడు. ఈ సీజన్లో హసరంగా 16 మ్యాచ్‌లాడి 27 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Krunal- Hardik Pandya: 'నిన్ను మరిచిపోయే స్టేజ్‌కు వచ్చారు.. గోడకు కొట్టిన బంతిలా' -
IPL 2022: ఏంటో! చహల్, హసరంగ కూడా ఆ చెత్త జాబితాలో..!
IPL 2022: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ అంటే క్రికెట్ ప్రేమికులకు ఎక్కడా లేని ఉత్సాహం. అభిమానులు ఫోర్లు, సిక్సర్ల మోత మోగిస్తుంటే స్టేడియం ఈలలతో మారుమోగిపోవాల్సిందే! భారీ హిట్టర్లు, ఫ్యాన్స్‌కు ఇలా పండుగ చేసుకుంటే.. పాపం ఆ బ్యాటర్ ప్రతాపానికి బలైపోయిన బౌలర్ మాత్రం ఉసూరుమంటాడు. ఒక్క పరుగు కూడా ఫలితాన్ని తారుమారు చేయగల సందర్భాల్లో ఇలా జరిగితే ఆ బౌలర్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కొంతమందేమో వికెట్లు పడగొట్టినా పరుగులు ఎక్కువగా సమర్పించుకుని విమర్శల పాలవుతారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న టాప్-5 బౌలర్లు ఎవరో గమనిద్దాం! 1.మహ్మద్ సిరాజ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎంతో ఇష్టపడి మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఒకడు. అయితే, ఈ సీజన్లో అతడు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఐపీఎల్-2022లో 15 మ్యాచ్‌లు ఆడిన అతడు 514 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 31 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఒక ఐపీఎల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు ఇచ్చిన బౌలర్‌గా సిరాజ్ చెత్త రికార్డు తన పేరిట నమోదు చేసుకున్నాడు. 2. వనిందు హసరంగ ఐపీఎల్-2022 సీజన్లో శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. మొత్తంగా 26 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్‌నకు అడుగు దూరంలో నిలిచిపోయాడు. అయితే, ఎక్కువ సిక్స్‌లు ఇచ్చిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఆర్సీబీ తరఫున ఆడిన అతడు 16 మ్యాచ్‌లలో సిక్సర్ల రూపంలో 180 పరుగులు(30 సిక్స్‌లు) సమర్పించుకున్నాడు. మొత్తంగా 430 పరుగులు ఇచ్చాడు. 3. యజువేంద్ర చహల్ ఐపీఎల్-2022లో పర్పుల్ క్యాప్ విన్నింగ్ బౌలర్ యజువేంద్ర చహల్. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన టీమిండియా సీనియర్ స్పిన్నర్.. మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు. ఒక 4 వికెట్, 4 వికెట్హాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు సంపాదించాడు. అంతాబాగానే ఉన్నా ఐపీఎల్-2022లో తాను సమర్పించుకున్న 527 పరుగులలో 27 సిక్సర్ల రూపంలో ఉండటం గమనార్హం. 4. శార్దూల్ ఠాకూర్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 473 పరుగులు ఇచ్చి 15 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23 సిక్సర్లు ఉన్నాయి. మెగా వేలంలో 10.75 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న ఢిల్లీ ఫ్రాంఛైజీ అంచనాలకు అనుగుణంగా ఈ సీమర్ రాణించలేదనే చెప్పాలి. 5. కుల్దీప్ యాదవ్ ఒకానొక దశలో పర్పుల్ క్యాప్ కోసం చహల్‌తో పోటీ పడ్డాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కుల్దీప్ యాదవ్. ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్‌లలో ఈ చైనామన్ స్పిన్నర్ 21 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 419 పరుగులు ఇచ్చాడు. ఇందులో 22 సిక్సర్ల రూపంలో ఇచ్చినవే. ఇక తనదైన శైలితో రాణించిన కుల్దీప్ యాదవ్ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. చాలా కాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జూన్ 9 నుంచి భారత్‌లో టీమిండియాతో టీ20 సిరీస్ ఆడనున్న దక్షిణాఫ్రికాతో పోరుకు అతడు సిద్ధమవుతున్నాడు. చదవండి: Ind Vs SA T20 Series: టీమిండియాను తక్కువగా అంచనా వేయలేం.. కానీ విజయం మాదే: బవుమా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది'
శ్రీలంక సంక్షోభం తారాస్థాయికి చేరి హింసాత్మకంగా మారడంపై ఆ దేశ తాజా, మాజీ క్రికెటర్లు స్పందించారు. దేశం ఇంత దుర్భర స్థితికి చేరుకోవడానికి కారణం ప్రభుత్వమేనంటూ దిగ్గజ క్రికెటర్లు మహేళ జయవర్దనే, కుమార సంగక్కరతో పాటు ప్రముఖ క్రికెటర్లు వనిందు హసరంగా, నిరోషన్ డిక్వెల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. లంక సంక్షోభంపై ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్దనే స్పందింస్తూ.. తమ ప్రాథమిక అవసరాలు, హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న శాంతియుత నిరసనకారులపైకి ప్రభుత్వ మద్దతుతో దుండగులు, గూండాలు దాడి చేయడం చూస్తుంటే అసహ్యమేస్తోందని తెలిపాడు. దీంతోపాటు ఒక వీడియోను ట్వీట్ చేశాడు. అందులో కొంతమంది కలిసి ఓ మహిళపై దాడిచేస్తున్నారు.‘‘పోలీసుల ముందే నిరసన చేస్తున్న మహిళలను ఎలా కొడుతున్నారో చూడండి.. సిగ్గు చేటు’’ అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. కాగా, నిన్న శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై రాజపక్స కుటుంబ సభ్యుల మద్దతుదారులు దాడిచేయడం బాధాకరమని పేర్కొన్నాడు. శ్రీలంక మాజీ కెప్టెన్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ సంగక్కర మాట్లాడుతూ.. ఈ హింస వెనుక ప్రభుత్వం ఉందని.. ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతో జరిగిన హింస అని ఆరోపించాడు లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ కూడా ప్రభుత్వ తీరుపై మండిపడ్డాడు. అమయాక, శాంతియుత నిరసనకారులపై జరిగిన దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించాడు. మన దేశాన్ని ఇలాంటి నాయకత్వం నడిపిస్తోందా? అని ఆవేదన వ్యక్తం చేశాడు. దేశం కోసం ఏకమై అందరి పక్షాన ఉంటానని హామీ ఇచ్చాడు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అమాయక ప్రజలపై దాడులు జరగడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్వెల్లా పేర్కొన్నాడు. శ్రీలంకలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చడం.. ఫలితంగా చెలరేగిన రాజకీయ హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, 200 మందికిపైగా గాయపడ్డారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. చదవండి: ఉపేక్షించొద్దు.. అలాంటి వాళ్లను కాల్చేయండి: శ్రీలంకలో తీవ్ర హెచ్చరికలు Mumbai Indians: ప్లేఆఫ్ అవకాశాలు ఖేల్‌ఖతం.. ఇంతకుమించి ఏం చేస్తారులే! -
IPL 2022: ఐదేసిన హసరంగ.. సీజన్ అత్యుత్తమ గణాంకాలు నమోదు
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఇవాళ (మే 8) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ధేశించిన 193 పరుగల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. హసరంగ 5 వికెట్లతో చెలరేగడంతో 19.2 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌల్ చేసిన హసరంగ.. కేవలం 18 పరుగుల మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి ప్రస్తుత సీజన్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. హసరంగకు ముందు ఈ రికార్డు సన్‌రైజర్స్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ పేరిట ఉంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో రాహుల్ త్రిపాఠి (58), మార్క్రమ్ (21), పూరన్ (19)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా, మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. క్రీజ్‌లో కుదురుకున్న మార్క్రమ్, పూరన్ వికెట్లతో పాటు సుచిత్, శశాంక్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లను ఔట్ చేసిన హసరంగ ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆర్సీబీ బౌలర్లలో హేజిల్‌వుడ్ 2, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. 5 వికెట్లతో సన్‌రైజర్స్ పతనాన్ని శాసించిన హసరంగకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఈ సీజన్లో సన్ రైజర్స్ కు ఇది వరుసగా నాలుగో ఓటమి. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపుగా వదులుకుంది. మరోవైపు ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో ప్లే ఆఫ్స్ దిశగా దూసుకెళ్తుంది. చదవండి: IPL 2022: స్ట్రైక్ రేటు 375.. డీకేతో అట్లుంటది మరి! పట్టరాని సంతోషంలో కోహ్లి! -
దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి!
మన పక్కదేశం శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. కరోనా తదనంతర పరిణామాల అనంతరం లంకకు ఆదాయం తెచ్చిపెట్టే టూరిజం బాగా దెబ్బతింది. దీంతో పెట్రోల్ సహా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. తినడానికి తిండి లేక అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు దేశం విడిచి వలస పోతుంటే.. మరికొందరు పుట్టిన మట్టిని వదిలిరాలేక ఆకలితో అలమటిస్తున్నారు. రోజురోజుకు అక్కడ పరిస్థితి దిగజారుతూనే వస్తుంది. దీనికి ప్రధాన కారణమైన గొటబొయ రాజపక్స ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీలంక మాజీ క్రికెటర్.. మంత్రి అర్జున రణతుంగ శ్రీలంక ఆటగాళ్లకు ఒక విజ్ఞప్తి చేశారు. ''ఆర్థిక సంక్షోభంతో దేశం కొట్టుమిట్టాడుతోంది.. దయచేసి ఐపీఎల్లో ఆడుతున్న లంక క్రికెటర్లు తిరిగి వచ్చి దేశానికి మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నా. దేశం తగలబడిపోతున్నా కొందరు క్రికెటర్లు ఏం పట్టనేట్లే ఉన్నారు. మాకెందుకు ఇదంతా అన్నట్లు ఐపీఎల్లో ఆడుతూ సొంత దేశం గురించి పట్టించుకోవడం మానేశారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రజలకు, ప్రభుత్వానికి సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. కాగా క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికి.. సదరు బోర్డు ఒక మినిస్ట్రీ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇప్పుడు ఆ బోర్డులో ఉన్న ఉద్యోగులు, క్రికెటర్లు తమ జాబ్‌లు కాపాడుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో యంగ్ క్రికెటర్లు ముందుకు వచ్చి తమ మద్దతు అందించాల్సిన అవసరం ఉంది. ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడే ధైర్యంగా మాట్లాడే వ్యక్తులు కావాలి. మీరెందుకు నిరసన వ్యక్తం చేయడం లేదని ప్రజలు అడుగుతున్నారు. దానికి నా దగ్గర కారణం ఉంది. నేను రాజకీయాల్లోకి వచ్చి 19 ఏళ్లయింది. అయితే ఇప్పుడున్నది రాజకీయ సమస్య కాదు.. ఆర్థిక సమస్య. ఇంతకముందు వనిందు హసరంగా, బానుక రాజపక్స ఆర్థిక సంక్షోభానికి మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడేమో వెళ్లి ఐపీఎల్ ఆడుకుంటున్నారు. నేను మీ జాబ్‌ను పూర్తిగా వదిలేయమని చెప్పను.. ఒక వారం పాటు ప్రత్యేక అనుమతి తీసుకొని దేశానికి వచ్చి మీ మద్దతు ఇవ్వండి చాలు'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: దివాళా తీశాం.. విదేశీ రుణాలు తీర్చలేం: లంక ఆర్థిక శాఖ మా పాలన కాదు! తీవ్ర సంక్షోభానికి అసలు కారణం చెప్పిన లంక ప్రధాని -
IPL 2022: ఆ దేశంలో ఐపీఎల్ ప్రసారాలు బంద్
IPL 2022 Broadcast Goes Off In Sri Lanka: తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ద్వీప దేశం శ్రీలంకలో ఐపీఎల్ ప్రసారాలు కూడా బంద్ అయ్యాయి. ప్రసార హక్కుదారులకు చెల్లించేందుకు డబ్బుల్లేక అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే యుప్ టీవీ, ఎస్ఎల్ఆర్సీ, డయలాగ్ టీవీ, పియో టీవీ ఛానల్లు క్యాష్ రిచ్ లీగ్ ప్రసారాలను నిలిపి వేశాయి. దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) నెలకొన్న నేపథ్యంలో అక్కడి ప్రజలు ఐపీఎల్ మ్యాచ్‌లు చూసి ఎంజాయ్ చేసే మూడ్‌లో లేరని, అందుకే ఐపీఎల్ టెలికాస్ట్‌పై అంతగా ఫోకస్ పెట్టలేదని అక్కడి మీడియా వెల్లడించింది. మరోవైపు పేపర్ కాస్ట్ పెరగడంతో పాటు సిబ్బంది జీతాలివ్వలేక పత్రికలు ప్రింటింగ్ చేయడం మానేశాయి. కనీసం డిజిటల్ పేపర్లలో కూడా ఐపీఎల్ వార్తల ప్రస్తావన లేదు. ఐపీఎల్లో ఆడుతున్న లంక క్రికెటర్ల వనిందు హసరంగ (ఆర్సీబీ), భానుక రాజపక్స (పంజాబ్), దుష్మంత చమీర (లక్నో సూపర్ జెయింట్స్), చమిక కరుణరత్నే (కోల్‌కతా నైట్ రైడర్స్)లను పట్టించుకునే నాధుడే లేడు. మరోవైపు దేశంలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న లంక మాజీలు గళం విప్పుతున్నారు. చదవండి: మీతో కాకపోతే చెప్పండి.. నేనొస్తా..! సన్‌రైజర్స్, లక్నో జట్లకు బెంగాల్ మంత్రి ఆఫర్ -
హండ్రెడ్ లీగ్‌లో ఐపీఎల్ స్టార్లు, ఇక్కడేమో కోట్లు కుమ్మరించారు.. అక్కడేమో..!
The Hundred League: ఐపీఎల్‌కు పోటీగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తున్న ది హండ్రెడ్ లీగ్ సీజన్ 2022 వేలం ఏప్రిల్ 5న జరుగనున్నట్లు ఈసీబీ ప్రకటించింది. తొలి సీజన్‌తో పోలిస్తే.. ఈ ఏడాది లీగ్‌లో పాల్గొనేందుకు అంతర్జాతీయ స్టార్లు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. లీగ్‌లో ఆడేందుకు 16 దేశాలకు చెందిన 534 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా.. వీరిలో 284 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. లీగ్‌కు సంబంధించి రిటెన్షన్ ప్రక్రియ కూడా ఇటీవలే ముగిసింది. ఆయా జట్లు 42 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. వీరిలో 25 మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు, 17 మంది ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు ఉన్నారు. కాగా, హండ్రెడ్ లీగ్ 2022 సీజన్లో పాల్గొనేందుకు ఆండ్రీ రసెల్, డేవిడ్ వార్నర్, సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్, క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్, డ్వేన్ బ్రావో, హెట్‌మైర్, మార్క్రమ్, ఓడియన్ స్మిత్, వనిందు హసరంగ, భానుక రాజపక్స, దసున్ శనక, రొమారియో షెపర్డ్ వంటి ఐపీఎల్ స్టార్లు ఎగబడటం ఆసక్తి కలిగిస్తుంది. ఐపీఎల్‌తో పోలిస్తే.. ఈ ఆటగాళ్లకు హండ్రెడ్ లీగ్‌లో దక్కే పారితోషికం చాలా తక్కువ. ఐపీఎల్ 2022లో 10.75 కోట్ల భారీ మొత్తం దక్కించుకున్న విండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ హండ్రెడ్ లీగ్‌లో 1.25 కోట్ల రిజర్వ్ ప్రైస్ విభాగంలో (వేలంలో) పోటీపడుతుండగా, ఐపీఎల్లో 10 కోట్లు అందుకుంటున్న లంక మిస్టరీ స్పిన్నర్ హసరంగ 50 లక్షల రిజర్వ్ ప్రైస్ విభాగంలో, 8.5 కోట్లు అందుకుంటున్న హెట్‌మైర్, 7.75 కోట్లు అందుకుంటున్న రొమారియో షెఫర్డ్ 40 లక్షల రిజర్వ్ ప్రైస్ విభాగంలో పోటీపడుతుండటం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. హండ్రెడ్ లీగ్ 2022 వేలంలో స్లాబ్‌లు, విదేశీ ఆటగాళ్ల వివరాలు.. రూ. 1.25 కోట్ల రిజర్వ్ ప్రైస్: బాబర్ ఆజమ్, మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్, సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్, షంషీ రూ. 99 లక్షల రిజర్వ్ ప్రైస్: షకిబ్ అల్ హసన్, క్వింటన్ డికాక్, జై రిచర్డ్సన్, ఆండ్రీ రసెల్ రూ. 75 లక్షల రిజర్వ్ ప్రైస్: మహ్మద్ అమీర్, డ్వేన్ బ్రావో, నాథన్ కౌల్టర్ నీల్, ఆరోన్ ఫించ్, షాదాబ్ ఖాన్, ఎవిన్ లూయిస్, డేవిడ్ మిల్లర్, హరిస్ రౌఫ్, ఇమ్రాన్ తాహిర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ రూ. 60 లక్షల రిజర్వ్ ప్రైస్: సీన్ అబోట్, ఫిన్ అలెన్, హిట్మైర్, మార్క్రమ్, ఫెహ్లుక్వాయో, గ్లెన్ ఫిలిప్స్, కేన్ రిచర్డ్సన్, మిచెల్ సాంట్నర్, ఓడియన్ స్మిత్, విల్ యంగ్, ఆడమ్ జంపా రూ. 50 లక్షల రిజర్వ్ ప్రైస్: అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, మార్టిన్ గప్తిల్, వనిందు హసరంగ, హెన్రిక్స్, ఉస్మాన్ ఖ్వాజా, లబూషేన్, షోయబ్ మాలిక్, డారిల్ మిచెల్ , కొలిన్ మున్రో, జేమ్స్ పాటిన్సన్, భానుక రాజపక్స, రూథర్‌ఫోర్డ్, మాథ్యూ వేడ్ రూ. 40 లక్షల రిజర్వ్ ప్రైస్: క్రిస్ లిన్, తిసారా పెరీరా, దసున్ శనక, రొమారియో షెపర్డ్, లెండిల్ సిమన్స్, ఇమాద్ వసీం చదవండి: ఐపీఎల్ అభిమానులకు అదిరిపోయే వార్త.. ఏప్రిల్ 6 నుంచి..! -
IPL 2022: ఒక్కసారి మైదానంలోకి దిగితే అంతే.. అందుకే ఇలా: హసరంగ
ఐపీఎల్-2022లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆల్‌రౌండర్ వనిందు హసరంగ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్ వేసిన ఈ శ్రీలంక ప్లేయర్ కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా సునిల్ నరైన్, షెల్డన్ జాక్సన్, టిమ్ సౌథీల వికెట్లు తీశాడు. తద్వారా ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే, బంతితో రాణించినప్పటికీ ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్యాటర్‌గా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇదిలా ఉండగా.. వికెట్లు తీసిన అనంతరం హసరంగ సెలబ్రేట్ చేసుకున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ ప్లేయర్ నెయ్‌మార్‌ను తలపిస్తూ సంబరాలు చేసుకున్న తీరు వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ హసరంగ మాట్లాడుతూ.. 4 వికెట్లతో రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ‘‘కీలక సమయంలో నేను కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాను. ఏదేమైనా సంతోషంగా ఉన్నా. ముఖ్యంగా మంచు ప్రభావం చూపిన ఈ పిచ్‌పై బౌలింగ్ చేయడం కష్టంగా తోచింది’’ అని పేర్కొన్నాడు. ఇక తన ఫేవరెట్ ఫుట్‌బాలర్ నెయ్మార్ అని చెప్పిన హసరంగ.. అందుకే వికెట్ తీసినపుడు అతడి స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నట్లు వెల్లడించాడు. అదే విధంగా.. ఒక్కసారి మైదానంలోకి దిగాక అస్సలు ఒత్తిడికి గురికానని, తన విజయానికి కారణం ఇదేనంటూ వ్యాఖ్యానించాడు. కాగా బుధవారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ కేకేఆర్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ సీజన్లో తమ తొలి గెలుపును నమోదు చేసింది. చదవండి: Harshal Patel: ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా హర్షల్ పటేల్ That's that from Match 6 of #TATAIPL. A nail-biter and @RCBTweets win by 3 wickets. Scorecard - https://t.co/BVieVfFKPu #RCBvKKR #TATAIPL pic.twitter.com/2PzouDTzsN — IndianPremierLeague (@IPL) March 30, 2022 -
Ind Vs Sl: టీమిండియాతో సిరీస్.. శ్రీలంకకు భారీ షాక్
India Vs Sri Lanka T20 Series: టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన అతడు ఇంకా కోలుకోకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. భారత్‌తో సిరీస్ నేపథ్యంలో నిర్వహించిన ఆర్టీ- పీసీఆర్ పరీక్షలో హసరంగకు మరోసారి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. టెస్టు సిరీస్‌కు కూడా హసరంగ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. దీంతో లంకకు భారీ షాక్ తగిలినట్లయింది. కాగా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సమయంలో హసరంగకు కరోనా సోకింది. అతడితో పాటు కుశాల్ మెండిస్, బినుర ఫెర్నాండో కూడా వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో వీరు ముగ్గురు పలు మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఇక ఆస్ట్రేలియా గడ్డ మీద లంకకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. 1-4 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియాతో ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. ఇదిలా ఉంటే... మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ సహా దీపక్ చహర్ గాయాల కారణంగా టీమిండియాకు దూరమయ్యారు. కాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, రెండు టెస్టులు ఆడేందుకు లంక జట్టు భారత్‌లో పర్యటించనుంది. చదవండి: Rohit-Ritika Sajdeh: రోహిత్ నన్ను పట్టించుకో.. ప్లీజ్ ఒకసారి ఫోన్ చేయ్: రితికా శర్మ -
ఐపీఎల్లో అన్‌సోల్డ్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం.. ఆ వెనుకే 7.75 కోట్ల ఆటగాడు!
ICC T20 Rankings: ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. టీ20 ఫార్మాట్ బౌలర్ల విభాగంలో నాలుగు స్థానాలు ఎగబాకాడు. 783 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంసీ (784 పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతడి కంటే ఒకే ఒక్క పాయింట్ వెనుకబడి ఉన్న హాజిల్‌వుడ్ ద్వితీయ స్థానానికి పరిమితమయ్యాడు. కాగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న అతడు ఈ మేరకు టాప్-2లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక లంకతో సిరీస్‌లో హాజిల్‌వుడ్ వరుసగా 4, 3(ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్), ఒక వికెట్ పడగొట్టాడు. ఇప్పటికే 3-0 తేడాతో ఈ సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. కాగా శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ, ఆదిల్ రషీద్(ఇంగ్లండ్), ఆడం జంపా(ఆస్ట్రేలియా), రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), ముజీబ్ ఉర్ రహమాన్(అఫ్గనిస్తాన్), అన్రిచ్ నోర్జే(దక్షిణాఫ్రికా), షాబాద్ ఖాన్(పాకిస్తాన్), టిమ్ సౌథీ(న్యూజిలాండ్) టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 7.75 కోట్లు వెచ్చించి హాజిల్‌వుడ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్న తబ్రేజ్ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. 👑 New number one T20I bowler 🚀 Rohan Mustafa launches into the top-10 ⏫ Josh Hazlewood climbs four spots after an incredible performance against Sri Lanka Some big movements in the latest @MRFWorldwide ICC Men's Player Rankings for T20Is. Details 👉 https://t.co/YrLa53Ls5E pic.twitter.com/otGbDw3B0r — ICC (@ICC) February 16, 2022 -
IPL Auction Day 1: చహర్ 14 కోట్లు... అదరగొట్టిన శార్దుల్, ప్రసిధ్ కృష్ణ, హసరంగ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం మరోసారి అంచనాలను దాటి రికార్డులను కొల్లగొట్టింది. తొలి రోజు ఏకంగా 10 మంది ఆటగాళ్లు కనీసం రూ. 10 కోట్లకంటే ఎక్కువ విలువ పలకగా, పెద్ద సంఖ్యలో ప్లేయర్లు మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటారు. గతంతో పోలిస్తే ఈసారి వేలంలో భారత క్రికెటర్ల హవా కొనసాగింది. టాప్–10లో ఏడుగురు భారత ఆటగాళ్లు ఉండగా... ఆ పది మందిలో ఏడుగురు బౌలర్లే ఉండటం లీగ్‌లో బౌలింగ్ విలువను కూడా చూపించింది. వేలంలో ఎప్పటిలాగే కొన్ని అనూహ్య, అసాధారణ అంకెలు ఆశ్చర్యపరచగా... అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఫ్రాంచైజీలు ఆచితూచి వేసిన అడుగుల ముద్ర కూడా కనిపించింది. 23 ఏళ్ల ఇషాన్ కిషన్ అందరికంటే ఎక్కువగా రూ.15 కోట్ల 25 లక్షలతో శిఖరాన నిలిచాడు. ఐపీఎల్ వేలం చరిత్రలో యువరాజ్ సింగ్ (రూ. 16 కోట్లు; 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్) తర్వాత రెండో ఖరీదైన భారతీయ ప్లేయర్‌గా ఇషాన్ కిషన్ గుర్తింపు పొందాడు. టాప్–10 (కనీసం రూ. 10 కోట్లు) ఇషాన్ కిషన్ - ముంబై ఇండియన్స్ ఎడమచేతి వాటం విధ్వంసక బ్యాటర్, వికెట్ కీపర్. 23 ఏళ్ల వయసు, ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ఈ జార్ఖండ్ ప్లేయర్ సొంతం. గత రెండేళ్లు ముంబైకి విజయాలు అందించడంలో కీలక పాత్ర. అందుకే ప్రతీ జట్టు అతని కోసం పోటీ పడ్డాయి. అంబానీ టీమ్ కూడా అతడిని వదలదల్చుకోలేదు. అందుకే అందరికంటే ఇషాన్‌కు ఎక్కువ విలువ. రూ. 15 కోట్ల 25 లక్షలు దీపక్ చహర్ - చెన్నై సూపర్ కింగ్స్- రూ. 14 కోట్లు పవర్‌ప్లే స్పెషలిస్ట్ బౌలర్. స్వింగ్ అతని బలం. చెన్నైకి ఆడిన గత నాలుగు సీజన్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. గత రెండేళ్లుగా బ్యాటింగ్‌లోనూ బాగా మెరుగయ్యాడు. అందుకే రాజస్తాన్‌కు చెందిన దీపక్ చహర్‌ను చెన్నై మళ్లీ తీసుకుంది. శ్రేయస్ అయ్యర్ -కోల్‌కతా నైట్‌రైడర్స్ - రూ. 12 కోట్ల 25 లక్షలు ప్రతిభావంతుడైన బ్యాటర్. పరిస్థితికి తగినట్లుగా తన ఆటను మార్చుకోగలడు. ముంబై రంజీ జట్టు నుంచి వచ్చిన సహజ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కెప్టెన్ అవసరం ఉన్న కోల్‌కతా అందుకే ఎంచుకుంది. శార్దుల్ ఠాకూర్ - ఢిల్లీ క్యాపిటల్స్ - రూ. 10 కోట్ల 75 లక్షలు ప్రస్తుతం టీమిండియాలో రెగ్యులర్‌గా మారిన బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇటీవలి అతని ప్రదర్శనలు అందరి దృష్టినీ ఆకర్షించేలా చేశాయి. కీలక సమయాల్లో వికెట్లు తీసే బౌలింగ్ నేర్పుతో పాటు చివర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం ఈ ముంబైకర్ సొంతం. హర్షల్ పటేల్ - బెంగళూరు - రూ. 10 కోట్ల 75 లక్షలు 2021 ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. పవర్‌ప్లేలో, డెత్ ఓవర్లలో సమర్థంగా బౌలింగ్ చేయగలడు. అందుకే భారీ మొత్తానికి ఈ హరియాణా బౌలర్‌ను బెంగళూరు మళ్లీ తీసుకుంది. వనిందు హసరంగ- బెంగళూరు -రూ. 10 కోట్ల 75 లక్షలు ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌లలో ఆకట్టుకుంటున్న ఈ శ్రీలంక స్పిన్నర్ టి20 ప్రపంచకప్‌లో, 2021లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. అయినా ఒక భారతీయేతర స్పిన్నర్ ఇంత విలువ పలకడం అనూహ్యం. అయితే లెగ్‌స్పిన్నర్‌గా అతనిది ప్రత్యేక శైలి. ‘గుగ్లీ’ పదునైన ఆయుధం. నికోలస్ పూరన్- సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 10 కోట్ల 75 లక్షలు ఇటీవలి ఫామ్‌ను బట్టి చూస్తే అసాధారణ విలువ. ఈ వెస్టిండీస్ వికెట్ కీపర్‌కు హిట్టర్‌గా పేరు ఉన్నా గతంలో పంజాబ్ జట్టుకు ఉపయోగపడలేదు. హైదరాబాద్ అనూహ్య మొత్తాన్ని వెచ్చించింది. లోకీ ఫెర్గూసన్ - గుజరాత్ టైటాన్స్ - రూ. 10 కోట్లు న్యూజిలాండ్‌కు చెందిన సూపర్ ఫాస్ట్ బౌలర్. కోల్‌కతా తరఫున మూడు సీజన్లలో అక్కడక్కడ రాణించాడు. అతని స్థాయికి, అంతర్జాతీయ గుర్తింపునకు ఇది చాలా పెద్ద మొత్తం. అవేశ్ ఖాన్ - లక్నో సూపర్ జెయింట్స్ - రూ. 10 కోట్లు చాలా రోజులుగా భారత క్రికెట్లో అందరి దృష్టీ ఉంది. 2016 అండర్–19 ప్రపంచకప్‌లో ఆడిన ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ భారత యువ పేస్ బౌలర్లలో చక్కటి ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఏడాది కూడా ఆకట్టుకోవడంతో ఫ్రాంచైజీలు ఇతని కోసం పోటీ పడ్డాయి. ప్రసిధ్ కృష్ణ - రాజస్తాన్ రాయల్స్ - రూ. 10 కోట్లు ఐపీఎల్లో గొప్ప రికార్డు లేకపోయినా (9.26 ఎకానమీ) ఇటీవలి వన్డే ప్రదర్శన ప్రసిధ్ కృష్ణకు భారీ మొత్తం అందించింది. తాజా ఫామ్‌లో ఈ కర్ణాటక బౌలర్ ప్రత్యరి్థని కట్టడి చేయగలడని ఫ్రాంచైజీలు నమ్మాయి. చదవండి: IPL 2022 Auction: వయసు 37.. ధర 7 కోట్లు.. ఆర్సీబీ సొంతం.. మంచి డీల్.. మా గుండె పగిలింది! -
"వేలంలో అతడి కోసం 10 జట్లు పోటీ పడడం ఖాయం"
ఐపీఎల్-2022 మెగా వేలంలో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా కోసం లక్నో, అహ్మదాబాద్‌తో సహా మొత్తం 10 జట్లు పోటీ పడతాయని భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా అభిప్రాయ పడ్డాడు. రానున్న వేలంలో అత్యంత ఖరీదైన టాప్ 5 బౌలర్లలో హసరంగా ఒకడని చోప్రా తెలిపాడు. హసరంగా అద్భుతమైన ఆటగాడు. అతడు బాల్‌తో పాటు బ్యాట్‌తో కూడా రాణించగలడు. ఒక వేళ నేను వేలంలో పాల్గొంటే మొదటిగా అతడినే ఎంచుకుంటాను. అతడు కొత్త బంతితో కూడా బాగా బౌలింగ్ చేయగలడు. గత ఏడాది ఆర్సీబీ అతడిని తక్కువ ధరకి కొనుగోలు చేసింది. కానీ హసరంగాకి అంతగా ఆర్సీబీ అవకాశం ఇవ్వలేదు. ఫ్రాంచైజీలు అతడి కోసం 4 నుంచి 5 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అతడు టీ20 క్రికెట్లో గత కొన్నాళ్లుగా అద్భుతంగా రాణిస్తున్నాడు. వేలంలో మొత్తం 10 జట్లు కూడా అతడి కోసం పోటీ పడతాయి అనడంలో సందేహం లేదు అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. ఇక ఈ మెగా వేలంలో 590 మంది క్రికెటర్లు పాల్గొనబోతున్నారు. చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్‌కి మరీ ఇంత తక్కువా!